
ముంబై : డబ్బులు ఇవ్వకుంటే లైంగిక దాడి కేసు పెడతానని ఓ ఉన్నతాధికారిని బెదిరించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మహరాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. పూణెకు చెందిన ఓ మహిళ ఓ కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్‌తో సన్నిహితంగా మెలిగింది. కొద్ది రోజుల అనంతరం అతని నుంచి రూ. 7 లక్షలు డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆయనపై తప్పుడు కేసు నమోదు చేస్తానని బెదిరించడం ప్రారంభించింది. లైంగిక దాడి కేసు పెడతానని బెదిరించడంతో బాధితుడు మొదటి విడతగా ఇప్పటికే రూ. 45,000 వేలు అప్పగించారు. మిగతా సొమ్ము చెల్లించాలని నిందితురాలు ఒత్తిడి చేసిన క్రమంలో పోలీసులను ఆశ్రయించారు.
బాధితుడి వివరాల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు మహిళను పట్టుకోడానికి పథకం వేశారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర మొహిలే నేతృత్వంలోని బృందం శనివారం నిందితురాలిని అరెస్టు చేశారు ఆమెపై దోపిడీ కేసు నమోదు చేశారు. ఇక నిందితురాలు వివిధ కంపెనీలకు చెందిన హెచ్‌ఆర్ నిపుణులను సంప్రదిస్తూ వారితో స్నేహపూర్వక సంబంధాలు పెంచుకుంటందని పోలీసులు తెలిపారు. తరువాత లైంగిక దాడి కేసు నమోదు చేస్తానని బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తదుపరి విచారణ కోసం మహిళను జనవరి 29 వరకు పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment