ప్రతీకాత్మక చిత్రం
ముంబై : బాక్సింగ్ శిక్షణ పేరుతో 19 ఏళ్ల అమ్మాయిపై జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం...బీఏ చదువుతున్న సదరు యువతి ఆరు నెలల క్రితం సోదరుడితో కలిసి జిమ్‌లో చేరింది. అక్కడే ట్రైనర్ రాబిస్ ఆంధోని పర్యవేక్షణలో యువతి బాక్సింగ్ నేర్చుకుంటుంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటి దగ్గరికే వచ్చే శిక్షణ ఇవ్వాల్సిందిగా కోరారు.
ఈ నేపథ్యంలో రోజూ మాదిరిగానే ఈనెల 19న యువతి ఫ్లాట్‌కు వెళ్లిన ట్రైనర్ ఆంధోని..ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దాన్ని అవకాశంగా మరల్చుకున్నాడు. బాక్సింగ్ నేర్పుతున్నట్లు నటించి ఆమె శరీర భాగాలను అసభ్యకరంగా తడిమాడు. దీంతో షాక్‌కి గురైన యువతి..ఫ్లాట్ నుంచి వెంటనే బయటకు వచ్చేసింది. లిఫ్ట్ ఎక్కబోతుండగా, మరోసారి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధిత యువతి..కుటుంబ సభ్యులకు వివరించగా, వారు ట్రైనర్ ఆంధోనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
చదవండి : బలిచ్చేందుకు బాలుడిని చిత్రహింసలు పెట్టి..
వివాహేతర సంబంధం; భర్తను వదిలిరానన్నందుకు..
Comments
Please login to add a commentAdd a comment