అంతర్జాతీయ ఫ్రాడ్ కాల్స్‌పై టెలీకమ్యూనికేషన్స్ విభాగం హెచ్చరిక
ఫేక్ కాల్స్ కట్టడికి అందుబాటులోకి సంచార్ సాథీ యాప్
గతంలో రోజుకు 1.35 కోట్ల ఫేక్ కాల్స్ ఆధునిక టెక్నాలజీతో వాటి సంఖ్యను 4 లక్షలకు తగ్గించిన టెలికం విభాగం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ నంబర్లతో వచ్చే ఫోన్‌కాల్స్‌లో 90 శాతం వరకు మోసపూరితమైనవేనని టెలీకమ్యూనికేషన్స్ విభాగం వెల్లడించింది. టెలీకమ్యూనికేషన్స్ విభాగం ఇటీవల అందుబాటులోకి తెచ్చిన సంచార్‌సాథీ మొబైల్‌యాప్‌తో వీటికి అడ్డుకట్ట వేయగలుగుతున్నట్టు అధికారులు తెలిపారు. సైబర్ నేరగాళ్లు విదేశాల్లో ఉంటూ చేస్తున్న ఫోన్‌కాల్స్‌ను ఆధునిక టెక్నాలజీ వాడి భారతీయ నంబర్ల మాదిరిగా కనిపించేలా చేసి కూడా మోసాలకు పాల్పడుతున్నట్టు వారు వివరించారు. వాస్తవానికి మనకు ఫోన్‌కాల్ వచ్చినప్పుడు ఆ నంబర్.. భారతీయ ఫోన్ నంబర్ +91తో మొదలైనట్టుగా కనిపించినా, అవన్నీ అంతర్జాతీయ ఫోన్‌కాల్సే అని అధికారులు పేర్కొన్నారు.
ఇలాంటి ఫేక్‌కాల్స్‌పై వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు ఇటీవల టెలీకమ్యూనికేషన్స్ విభాగం సంచార్‌సాథీ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫిర్యాదు మేరకు ఆయా నంబర్లను బ్లాక్ చేస్తున్నారు. ఇందుకు అన్ని టెలికాం సర్విస్ ప్రొవైడర్లతో కలిసి టెలికమ్యూనికేషన్ల విభాగం ఇంటర్నేషనల్ ఇన్‌కమింగ్ స్పూఫ్డ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టం అనే సాంకేతికతను అభివృద్ధి చేసింది. గతంలో దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 1.35 కోట్ల స్పూఫ్డ్ ఫోన్‌కాల్స్ వచ్చేవని, ఇటీవల స్పూఫ్డ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఆ సంఖ్య బాగా తగ్గినట్టు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం స్పూఫ్డ్ కాల్స్ రోజుకు సుమారు 4 లక్షలవరకు మాత్రమే వస్తున్నట్టు వెల్లడించారు. ఇలాంటి ఫోన్‌కాల్స్‌ను కట్టడి చేయడం సైబర్‌నేరాల నియంత్రణలో కీలకమని అధికారులు చెపుతున్నారు. కాగా, మొబైల్ వినియోగదారులు సంచార్ సా మొబైల్ యాప్ గూగుల్‌ప్లే స్టోర్, యాపిల్‌యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను వాడి అనుమానాస్పద నంబర్లను వెంటనే బ్లాక్ చేసే వీలుంటుందని వారు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment