Phone calls
-
అలాంటి కాల్స్‌లో 90% మోసపూరితమే
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ నంబర్లతో వచ్చే ఫోన్‌కాల్స్‌లో 90 శాతం వరకు మోసపూరితమైనవేనని టెలీకమ్యూనికేషన్స్ విభాగం వెల్లడించింది. టెలీకమ్యూనికేషన్స్ విభాగం ఇటీవల అందుబాటులోకి తెచ్చిన సంచార్‌సాథీ మొబైల్‌యాప్‌తో వీటికి అడ్డుకట్ట వేయగలుగుతున్నట్టు అధికారులు తెలిపారు. సైబర్ నేరగాళ్లు విదేశాల్లో ఉంటూ చేస్తున్న ఫోన్‌కాల్స్‌ను ఆధునిక టెక్నాలజీ వాడి భారతీయ నంబర్ల మాదిరిగా కనిపించేలా చేసి కూడా మోసాలకు పాల్పడుతున్నట్టు వారు వివరించారు. వాస్తవానికి మనకు ఫోన్‌కాల్ వచ్చినప్పుడు ఆ నంబర్.. భారతీయ ఫోన్ నంబర్ +91తో మొదలైనట్టుగా కనిపించినా, అవన్నీ అంతర్జాతీయ ఫోన్‌కాల్సే అని అధికారులు పేర్కొన్నారు.ఇలాంటి ఫేక్‌కాల్స్‌పై వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు ఇటీవల టెలీకమ్యూనికేషన్స్ విభాగం సంచార్‌సాథీ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫిర్యాదు మేరకు ఆయా నంబర్లను బ్లాక్ చేస్తున్నారు. ఇందుకు అన్ని టెలికాం సర్విస్ ప్రొవైడర్లతో కలిసి టెలికమ్యూనికేషన్ల విభాగం ఇంటర్నేషనల్ ఇన్కమింగ్ స్పూఫ్డ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టం అనే సాంకేతికతను అభివృద్ధి చేసింది. గతంలో దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 1.35 కోట్ల స్పూఫ్డ్ ఫోన్‌కాల్స్ వచ్చేవని, ఇటీవల స్పూఫ్డ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఆ సంఖ్య బాగా తగ్గినట్టు అధికారులు తెలిపారు.ప్రస్తుతం స్పూఫ్డ్ కాల్స్ రోజుకు సుమారు 4 లక్షలవరకు మాత్రమే వస్తున్నట్టు వెల్లడించారు. ఇలాంటి ఫోన్‌కాల్స్‌ను కట్టడి చేయడం సైబర్‌నేరాల నియంత్రణలో కీలకమని అధికారులు చెపుతున్నారు. కాగా, మొబైల్ వినియోగదారులు సంచార్ సా మొబైల్ యాప్ గూగుల్‌ప్లే స్టోర్, యాపిల్యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను వాడి అనుమానాస్పద నంబర్లను వెంటనే బ్లాక్ చేసే వీలుంటుందని వారు పేర్కొంటున్నారు. -
సమస్యల్ని పంచుకుంటున్నాం..అవగాహన పెంచుకుంటున్నాం..
‘క్షణంలో వెయ్యోవంతు కాలంలో జీవితం పట్ల దృక్పథం మారిస్తే చాలు ఓ జీవితాన్ని నిలబెట్టగలుగుతాం’అంటున్నారు వన్‌లైఫ్ వలంటీర్లు. మానసిక ఒత్తిడి, ఇతరత్రా సమస్యలతో ఆత్మహత్య లాంటి ఆలోచనల నుంచి విముక్తి కల్పించడానికి జాతీయస్థాయిలో 24/7 సేవలు అందిస్తోది వన్‌లైఫ్ సంస్థ. దీని ఆధ్వర్యంలో గత కొంత కాలంగా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన వలంటీర్లు సాక్షితో తమ అనుభవాలు పంచుకున్నారు. –సాక్షి, హైదరాబాద్ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదించిన వారికి సంబంధించిన సమస్యల విషయంలో మేం పూర్తిగా గోప్యత పాటిస్తాం. కాల్స్ కోసం 24/7 అందుబాటులో ఉంటాం అంటున్న వలంటీర్లు చెప్పిన విశేషాలు వారి మాటల్లోనే...ఒత్తిడిని చిత్తు చేస్తూ..ట్రిపుల్ ఐటీ పూర్తి చేశా..చదువుకునే సమయం నుంచీ ఒత్తిడి బాగా ఉండేది. అయితే లోకువగా చూస్తారేమోనని ఎవరికీ చెప్పలేకపోయేవాడ్ని. అదే సమయంలో వన్‌లైఫ్ సంస్థ గురించి తెలిసింది..వీరిని అప్రోచ్ అయ్యి నా ఒత్తిడి పోగొట్టుకోగలిగాను. మరెంతో మందికి పరిష్కారంగా మారాలని వన్లైఫ్లో వలంటీర్‌గా జాయినయ్యా. మూడేళ్ల నుంచి ప్రతీ శనివారం 4గంటల పాటు వలంటీర్‌గా ఇంటి నుంచే చేస్తున్నా. తొలుత చాలా నెగిటివిటీ వస్తుంటుంది జాగ్రత్త అని ఫ్యామిలీ మెంబర్స్ హెచ్చరించారు. అయితే ట్రైనింగ్ తీసుకోవడం వల్ల నాకేమీ సమస్య అనిపించలేదు. స్టూడెంట్స్ పరీక్షల టైమ్‌లో ఎక్కువ కాల్స్ రిసీవ్ చేసుకున్నా. అది నేను అనుభవించి వచ్చాను కాబట్టి బాగా కనెక్ట్ అయ్యాను. లవ్ ప్రాబ్లెమ్స్‌తో కూడా వస్తున్నాయి.. ఇతరుల సమస్యలు వినడం వల్ల మన సమస్యలు చిన్నగా అనిపిస్తూంటాయి. అలా ఈ పని నాకు వ్యక్తిగత జీవితంలో సమస్యల పరిష్కారానికి కూడా చాలా హెల్ప్ అయింది. –సూర్య, మాదాపూర్నాలో ఉన్న ఖాళీని భర్తీ చేసుకుంటూ...రిటైర్మెంట్ తర్వాత కొంత ఎంప్టీనెస్ అనిపించి ఈ సేవలోకి వచ్చాను. నాకు విభిన్న భాషల్లో పట్టు ఉండడం వల్ల దేశవ్యాప్తంగా కాల్స్ వస్తుంటాయి. రిలేషన్ షిప్స్‌కు సంబంధించినవే ఎక్కువగా వస్తున్నాయి. ‘నేను అమ్మాయిని కాను నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు... నాది అబ్బాయి మనస్తత్వం అని చెప్పలేకపోతు న్నా’అంటూ ఓ అమ్మాయి చేసిన కాల్, అలాగే ఓ అమ్మాయి తనను ప్రేమ పేరుతో డబ్బులు ఖర్చుపెట్టించి వదిలేసిందని, నేనెంతో తెలివిగల వాడ్ని అనుకునేవాడ్ని ఎలా ఇలా మోసపోయానో’అంటూ మరో అబ్బాయి కాల్... ఇలాంటివి కొన్ని గుర్తుండిపోయే సమస్యలు వస్తుంటాయి. వారితో మాట్లాడడం ద్వారా వారిలో కొత్త ఆలోచనలు వచ్చేలా చేయడమే ముఖ్యం తప్ప సలహాలు, సూచనలు ఇవ్వడం చేయం. –రుక్మిణి, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్అవగాహన పెంచుతున్న సమస్యలు...హైటెక్ సిటీలో ఐటీ ఉద్యోగినిగా చేస్తున్నా. ఏడాది నుంచి వన్లైఫ్లో వలంటీర్‌గా రాత్రి 9 నుంచి 11 గంటల సమయంలో కాల్స్ అటెండ్ అవుతుంటా. ఇష్టం వచ్చినట్టు లోన్స్ తీసుకున్నాం కట్టలేకపోతున్నాం లాంటి సమస్యల నుంచివిడాకుల తర్వాత లోన్లీనెస్ ఫేస్ చేయలేకపోతున్నాం దాకా ఎన్నో రకాల సమస్యలతో కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం అయిందేమిటంటే...ప్రాబ్లెమ్‌ని ఇతరులతో షేర్ చేసుకుంటే మమ్మల్ని ఎలా జడ్జ్ చేస్తారో అని భయంతో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. ఈ వలంటరీ విధుల వల్ల అనేక రకాల సమస్యలపై యుక్త వయసులోనే అవగాహన కలుగుతోంది.–అనూష, బోయినపల్లిజీవితం మీద ఆశ చిగురించేలా చేయొచ్చు విద్యార్థుల్లో అధిక గ్రేడ్స్‌కు సంబంధించిన ఒత్తిడి అంచనాలు, ఇతరులతో పోల్చడం, ర్యాగింగ్. మిగిలిన వారిలో అనుబంధాలు, అంచనాలు, తీర్చలేని డిమాండ్లు, సందేహాలు పరస్పరం నిందించుకోవడం తగాదాలు, వాదనలు, కోపం, ఆందోళన,.ఆర్థిక సంక్షోభాలు, వంటివి ప్రతికూలతకు దారి తీసిన ఫలితంగానే ఆత్మహత్యకు ఆలోచనలు చేస్తారు. అలాంటివారిలో జీవితం పట్ల ఆసక్తి పెంచే ఆలోచనల్ని ప్రోత్సహించడం, సానుకూలతను అందించడం, జీవితం అప్పుడే అయిపోలేదని నొక్కిచెప్పడం తమ కోసం మేం ఒక స్టాండ్ తీసుకోవడానికి ప్రోత్సహించడం చేస్తాం. ఒక్కో కాల్ అత్యధికంగా 45 నిమిషాల పాటు వింటాం. మా దగ్గర సీనియర్ కౌన్సెలర్లు ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ఉన్నారు. కాలర్స్ మాటల్ని బట్టి ప్రమాదస్థాయిని అర్థం చేసుకొని, వెంటనే జోక్యం చేసుకొని, 3 నుంచి 4 ఫాలో అప్లు, కౌన్సెలింగ్ సెషన్స్ కొనసాగిస్తాం. పదేళ్లుగా మా వన్‌లైఫ్ ద్వారా ఏడాదికి 30 మంది వరకూ ఆత్మహత్య ఆలోచనల నుంచి దారి మళ్లించామని చెప్పగలను. మరింత మందిని వలంటీర్లుగా చేరమని ఆహ్వానిస్తున్నాం. ఈ వలంటీర్ వర్క్ మన ద్వారా మరికొందరికి జీవితం మీద ఆశ చిగురించేలా చేయడంతో పాటు మన జీవితంలోనూ ఎన్నో మంచి మార్పులకు దోహదం చేస్తుందని రచ్చితంగా చెప్పగలను. –రెబెకామరియా, వన్‌లైఫ్ నిర్వాహకులుఆలోచనల నుంచి డైవర్ట్ చేస్తే ఆత్మహత్యలు తగ్గిపోతాయి...వన్లైఫ్లో చేరాక మూమెంటరీ థింకింగ్ గురించి అర్థమైంది. ఫోన్ చేసినప్పుడు వారిని కాసేపు డైవర్ట్ చేస్తే చాలు. చాలా వరకూ ఆత్మహత్య ఆలోచనలు సమసిపోతాయి. కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం వల్లనే చాలా వరకూ భారం తగ్గుతుంది. జీవితం చాలా గొప్పదనే విషయం తెలిసేలా చేస్తా తప్ప సలహాలు, సూచనలు ఇవ్వను. తొలుత ఫ్రీగా మాట్లాడలేరు కానీ కాసేపు గడిచాక చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఎవరికీ చెప్పలేని తీవ్రమైన ర్యాగింగ్ సంఘటనల నుంచి, భార్య వెళ్లిపోయింది పిల్లలు లేరు దాకా ఎన్నో.. నేను 15 ఏళ్ల పాటు ప్రొఫెసర్‌గా పనిచేశాను కాబట్టి నాకు ఈ పని కొంచెం సులభంగా మారింది. చేసేవారిలో 90 శాతం మంది కేవలం బాధలను చెప్పుకోవడం కోసమే చేస్తారు. మాట్లాడుతుండగానే వారి స్కిల్స్ గుర్తించి వాటిని వారికి గుర్తు చేస్తా. –వెంకటరమణి -
కాల్ చేస్తే కట్ చేయొచ్చు
సిడ్నీ: ఆఫీసులో పని ముగించుకొని, ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో యాజమాన్యం నుంచి ఫోన్లు, మెసేజ్‌లు వస్తే ఎలా ఉంటుంది? చాలా చిరాకు కలుగుతుంది కదా! ఆ్రస్టేలియాలో ఇలాంటి చిరాకు ఇకపై ఉండదు. ఎందుకంటే ‘రైట్ టు డిస్కనెక్ట్’ నిబంధన అమల్లోకి వచ్చింది. పని వేళలు ముగించుకొని ఇంటికెళ్లిన ఉద్యోగులకు యాజమాన్యాలు అనవసరంగా ఫోన్ చేస్తే జరిమానా విధిస్తారు. యాజమాన్యాలు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తే ఉద్యోగులు స్పందించాల్సిన అవసరం లేదు. మాట్లాడకపోతే శిక్షిస్తారేమో, ఉద్యోగం పోతోందేమో అనే భయం కూడా అవసరం లేదు. ఆఫీసు అయిపోయాక యాజమాన్యం ఫోన్ చేస్తే ఫెయిర్ వర్క్ కమిషన్(ఎఫ్‌డబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేయొచ్చు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో యాజమాన్యం నుంచి ఫోన్ వస్తే ఉద్యోగులు స్పందించాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా ఫోన్‌కాల్‌ను తిరస్కరించకూడదు. ఎఫ్‌డబ్ల్యూసీ నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యాలకు 94 వేల డాలర్లు, ఉద్యోగులకు 19 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. ఆఫీసులో పని ముగిశాక తమకు ఫోన్ చేయవచ్చా? లేదా? అనేది నిర్ణయించుకొనే అధికారాన్ని ఉద్యోగికి కట్టబెట్టారు. ఆ్రస్టేలియాలో ఆఫీసు టైమ్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగులు పని చేయడం మామూలే. ఒక్కో ఉద్యోగి ప్రతిఏటా సగటున 281 గంటలు అధికంగా ఆఫీసులో పని చేస్తున్నట్లు గత ఏడాది ఒక సర్వేలో వెల్లడయ్యింది. ఈ ఓవర్‌టైమ్ పనికి అదనపు వేతనం ఉండదు. -
150 స్కూళ్లకు బాంబు బెదిరింపు
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాలలను బాంబులతో పేల్చేస్తామంటూ ఆగంతకులు పంపిన హెచ్చరికలు దేశ రాజధాని ఢిల్లీలోని బుధవారం ఉదయం తీవ్ర కలకలానికి కారణమయ్యాయి. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ ప్రాంతాల్లోని 150 పైచిలుకు స్కూళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్స్ పంపారు. స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ మెయిల్స్ అందడంపై ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో తమకు 97 ఫోన్ కాల్స్ వచ్చాయని ఢిల్లీ ఫైర్ సరీ్వస్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. మధ్యాహ్నం తర్వాతా కొన్ని కాల్స్ అందాయన్నారు. తూర్పు ఢిల్లీలోని 24 ప్రైవేట్ స్కూళ్లు, దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని 18 స్కూళ్లు, పశి్చమ ఢిల్లీ ప్రాంతంలోని 21, షాదారాలోని 10 పాఠశాలలకు బెదిరింపులు వచ్చినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ సమాచారం బయటకు పొక్కడంతో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో స్కూళ్ల వద్దకు చేరుకుని, తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లడం, పాఠశాలల నిర్వాహకులు మైక్‌ల ద్వారా తల్లిదండ్రులు సూచనలు ఇవ్వడం కనిపించింది. సోదాల్లో 20 బృందాలు ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసు బృందాలు సీపీ రవీందర్ యాదవ్ నేతృత్వంలోని బెదిరింపులు అందిన స్కూళ్లలో ప్రొటోకాల్ ప్రకారం పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కూడిన 20 బృందాలను రంగంలోకి దించారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కని పించకపోవడంతో అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని హోం శాఖ ప్రకటించింది.డార్క్‌నెట్ నుంచి మెయిళ్లు ఎటువంటి ఆధారాలు చిక్కకుండా డార్క్‌నెట్‌ను ఉపయోగించుకుని దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేసింది. ట్చఠ్చీటజీజీఝఃఝ్చజీ . టu. అనే ఈ మెయిల్ ఐడీ నుంచి వచ్చిన ఈ మెయిళ్లన్నిటిలోనూ..‘మీరు ఎక్కడ కలుసుకున్నా వారిని చంపండి, వారు మిమ్మల్ని తరిమికొట్టిన ప్రదేశాల నుంచి వారినీ తరిమికొట్టండి. స్కూల్లో చాలా పేలుడు పదార్థాలున్నాయి..’అనే విషయమే ఉందని వెల్లడించింది. ఇందులోని సవరిమ్ అనే అరబిక్ పదాన్ని ఉగ్ర సంస్థ ఐఎస్ తరచూ వాడుతుంటుందని ఓ అధికారి తెలిపారు. బెదిరింపుల్లో పవిత్ర ఖురాన్‌ను కూడా ఉటంకించారని చెప్పారు. ఎన్నికల వేళ ప్రజల్లో భయాందోళనలను సృష్టించడానికి ఉగ్ర సంస్థలు పన్నిన కుట్రగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా భావిస్తూ లోతుగా దర్యాప్తు చేపడతామని కేంద్ర హోంశాఖ తెలిపింది. విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. -
నారాయణ ఎన్నికల కు‘తంత్రం’
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘హలో గుడ్ ఈవినింగ్. నేను నారాయణ విద్యాసంస్థల నుంచి ఫోన్ చేస్తున్నాను. మీ అబ్బాయి మా స్కూల్లో చదువుతున్నాడు కదా. మీ కుటుంబం గురించి కొన్ని వివరాలు కావాలి. మీరు నివాసం ఉంటున్నది ఎక్కడ. ఏ డివిజన్లో మీ ఇల్లు ఉంది. మీ ఇంట్లో ఓటర్లు ఎంత మంది? పోలింగ్ బూత్, ఓటరు ఐడీ నంబర్లు చెప్పండి. చివరగా మీ బ్యాంకు అకౌంట్ నంబరు చెప్పండి’ ఇవీ నెల్లూరు నారాయణ విద్యాసంస్థల నుంచి వచ్చే ఫోన్ కాల్లో అడుగుతున్న వివరాలు. ఆ విద్యాసంస్థల్లోని ఉద్యోగులు కొన్ని రోజులుగా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ కేంద్రాలుగా విద్యాసంస్థలు 2019 ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి పోటీచేసి ఓటమి చెందిన పొంగూరు నారాయణ ఈ దఫా కూడా పోటీకి సిద్ధమయ్యారు. స్థానికంగా విద్యాసంస్థల్నే తన రాజకీయ కార్యకలాపాలకు కేంద్రాలుగా మార్చేసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఎన్నికల టీంగా ఏర్పాటు చేసుకుని రాజకీయ వ్యవహారాలు నడిపిస్తున్నారు. గతంలో ఆ ఉద్యోగులు ఓటర్ల వ్యక్తిగత డేటా సేకరణ చేస్తూ పట్టుబడి స్థానికుల చేత తన్నులు తిని పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ వరకు వెళ్లాల్సి వచి్చంది. నెల జీతం కోసం పనిచేసే ఉద్యోగులను స్థానికుల చేతిలో చావుదెబ్బలు తినాల్సిన పరిస్థితికి నారాయణ తీసుకువచ్చారు. దీనిపై గతంలో పెద్ద దుమారమే రేగింది. మరోసారి విద్యార్థుల కుటుంబాల సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు నగరంలో దాదాపు 12 వేల మంది విద్యార్థులు నారాయణ విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు. ఆయా విద్యార్థుల కుటుంబ సభ్యుల ఓట్ల కోసం గాలం వేసేందుకు సమాచారం సేకరించే పనిలో ఉద్యోగులు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో తాను నమ్మిన వాళ్లే ఓటుకు నోటు సక్రమంగా చేర్చలేదన్న అభిప్రాయంతో ఉన్న నారాయణ ఈ దఫా వారిని నమ్మకుండా ఓటర్ల బ్యాంకు ఖాతాను సేకరించి వారి ఖాతాలోకే నోటు చేర్చేలా పథకం రచించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఐదేళ్లగా ముఖం చాటేసి.. నెల్లూరు నగర నియోజకవర్గంలో టీడీపీ జెండా మోసి పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న నేతలను కాదని గత ఎన్నికల్లో నారాయణ టికెట్ ఎగరేసుకుపోవడాన్ని ఆ పార్టీ క్యాడర్ జీరి్ణంచుకోలేకపోయింది. దీంతో అందరూ నారాయణకు వెన్నుపోటు పొడవడంతో ఓటమి చెందారు. ఆ తరువాత నాలుగున్నర ఏళ్ల కాలంగా నియోజకవర్గానికి ముఖం చాటేసిన నారాయణ ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడగడంపై పార్టీ క్యాడర్ గుర్రుగా ఉంది. -
9 నంబర్లు వస్తే.. లిఫ్ట్ చేయొద్దు
హైదరాబాద్: 91తో కలిపి 9 అంకెల నంబర్‌తో మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. ఆ ఫోన్ కాల్స్ సమాధానం ఇస్తున్నారా.. అయితే మీ ఖాతాలు ఖాళీ. కేవలం మహిళలను కలవర పెట్టి, భయం సృష్టించి సైబర్ మోసగాళ్లు లక్షలాది రూపాయలను కొల్లగొడుతున్నారు. నగరంలో నమోదైన 30 ఫిర్యాదులే ఇందుకు నిదర్శనం. నేర ప్రక్రియ ఇలా సాగుతోంది.. ► సైబర్ మోసగాళ్లు తాజాగా voip (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్) ద్వారా 91 తో కలిపి 9 అంకెల నంబర్లతో ఫోన్ చేస్తున్నారు. ఈ ఫోన్ ఎత్తగానే మేం ముంబై సీబీఐ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఆధార్, మీ పేరు ఇదేనా అని అడుగుతారు. మీరు ముంబై నుంచి తైవాన్‌కు ఫెడ్ఎక్స్ కొరియర్ ద్వారా పార్శిల్ పంపిస్తున్నారని అందులో డ్రగ్స్ ఉన్నాయని, ఇంకా అనుమానాస్పద పత్రాలు ఇతర దేశాలకు పంపిస్తున్నారని, మీరు మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారని కొరియర్ ప్రతినిధి చెప్పాడు. మీ మీద ముంబై సీబీఐ కేసు నమోదు చేసిందని.. ఈ సమాచారాన్ని మీ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చామని వారు 20 నిమిషాల్లో మిమ్మల్ని అరెస్టు చేసి మాకు అప్పగిస్తారని వివరిస్తాడు. ఈ మాటలకు భయపడి మా తప్పు లేదు మమ్మల్ని రక్షిచండి అని ప్రాధేయపడగానే లూటీ మొదలు పెడతారు. స్క్రీన్ షేరింగ్ యాప్స్‌తో అకౌంట్ ఖాళీ అవుతుంది. ► మీరు నిర్దోషి అని తెలియాలంటే మీ బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయాలి. మీకు మొత్తం ఎన్ని ఖాతాలు ఉన్నాయి చెప్పండి అని బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తారు. స్క్రీన్ షేరింగ్ యాప్‌లను డౌన్లోడ్ చేయిస్తారు. దీంతో మీ ఫోన్ మొత్తం వారి కంట్రోల్‌కి వెళ్లిపోతుంది. వెంటనే మీ ఖాతా నుంచి మా సీబీఐ ఖాతాకు కొంత డబ్బు పంపమని చెబుతారు. ఈ సమయంలో సైబర్ మోసగాళ్లు స్క్రీన్ షేరింగ్ యాప్స్ ద్వారా మీ బ్యాంకు ఖాతా నంబర్, పాస్వర్డ్, యూజర్ నేమ్, పిన్ నంబర్లను తెలుసుకుంటారు. దాదాపు అలా 3 గంటల పాటు మాటల్లో పెట్టి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తారు. ► ఇలా హైదరాబాద్ నగరంలో ఇలాంటి మోసానికి గురైన వారి సంఖ్య 30 వరకు చేరింది. ఇందులో 23 మంది మహిళలు బాధితులుగా పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు. అత్యధికంగా ఓ మహిళ రూ.40 లక్షలు పోగుట్టుకుంది. మొత్తం సైబర్ నేరగాళ్లు దాదాపు రూ.1.5 కోట్లు కాజేశారని నమోదైన ఫిర్యాదులతో వెల్లడైంది. మోసాలకు చెక్ పెట్టాలంటే.. ► మనకు వచ్చే ఫోన్ కాల్స్ 91 తో కలిపి 10 అంకెలు ఉంటాయని గ్రహించాలి. ‘ముంబై టూ తైవాన్ ఫెడ్ ఎక్స్ కొరియర్’ పేరు చెప్పగానే సైబర్ మోసానికి సంబంధించిన కాల్‌గా అనుమానించాలి. ► సీబీఐ పేరు చెప్పి పోలీసులు వస్తున్నారని మాట్లాడితే సరే పోలీసులు వచ్చిన తర్వాత మాట్లాడుతామని ఫోన్ కట్ చేయాలి. ► స్క్రీన్ షేరింగ్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోమంటే అసలు చేయొద్దు. ► గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్లకు రెస్పాండ్ అవొద్దు. ► గుర్తు తెలియని వ్యక్తులు సుదీర్ఘంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అది సైబర్ మోసగాళ్ల ఫోన్ కాల్‌గా భావించాలి. ► ఈ 9 అంకెల ఫోన్ కాల్స్ voip ద్వారా వస్తుందడంతో వీటి ఐపీ అడ్రస్‌లు విదేశాల్లో ఉంటున్నాయి. కొట్టేసిన నగదు కూడా వర్చువల్ కరెన్సీ రూపంలో విదేశాలకు పంపిస్తున్నారని పోలీసులు గుర్తించారు. నయా మోసం నుంచి అప్రమతంగా ఉండాలని సిటీ పోలీసులు సూచిస్తున్నారు.డార్క్ వెబ్ ద్వారా సైబర్ క్రిమినల్స్ పలు కొరియర్ సంస్థల నుంచి డేటా కొట్టేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
మహిళా పోలీసాఫీసర్‌కు 300 కాల్స్!
క్రైమ్: ఆమె ఒక మహిళా పోలీస్ అధికారి. ‘అయితే ఏంటి..’ అనుకుని వెంటపడ్డాడు. అంతేకాదు పోలీస్ స్టేషన్లో ఉండగానే ఫోన్ కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. ఓ అడుగు ముందుకు వేసి తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. చివరకు.. ఖాకీ పవర్ ధాటికి ఆ ఆకతాయి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. కేరళ కొచ్చికి చెందిన ఓ వ్యక్తి.. వనితా పోలీస్ స్టేషన్లో పని చేసే ఓ అధికారిణిని చాలా కాలం నుంచి వెంబడిస్తున్నాడట. ఈ క్రమంలో ఏకంగా 300 ఫోన్ కాల్స్ చేసి.. ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధించాడు. దీంతో అతనిపై సీరియస్‌గా దృష్టి సారించిన ఆమె.. రూట్ మార్చింది. తేనె పలుకులు పలికి ట్రాప్ చేసి మరీ అరెస్ట్ చేసింది. నిందితుడ్ని మంగళవారం ఎర్నాకులం కోర్టులో ప్రవేశపెట్టారు. అతనిపై మోపబడిన అభియోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించింది. పదే పదే ఫోన్లు చేసి ఆమెతో పాటు స్టేషన్ సిబ్బందిని కూడా వేధించాడతను. తద్వారా వాళ్ల విధులకు విఘాతం కలిగించాడు. ఓ అధికారిణి వెంటపడడం, లైంగికంగా వేధించడం లాంటి నేరాల కింద ఐపీసీ శిక్షా స్మృతులతో పాటు కేరళ పోలీస్ యాక్ట్ ప్రకారం అతనికి శిక్ష విధిస్తున్నట్లు ఎర్నాకులం కోర్టు తీర్పు వెల్లడించింది. ఆ ఆకతాయికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15వేల జరిమానా విధించింది న్యాయస్థానం. ఇదీ చదవండి: బట్టలు చింపేస్తుంటే.. వీడియోలు తీశారు! -
కేంద్రం కొత్త రూల్స్.. మే 1 నుంచి అమల్లోకి రానున్న ఫోన్ కాల్స్ నిబంధనలు!
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త చెప్పింది. మే నెల ప్రారంభం నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపింది. దీంతో యూజర్లకు భారీ ఊరట లభించినట్లైంది. ట్రాయ్ ప్రకటనతో ఫోన్ వినియోగదారులు ఫేక్, ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్ల బారి నుంచి ఉపశమనం పొందనున్నారు. ఇందుకోసం ట్రాయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయం తీసుకోనుంది. తద్వారా యూజర్లను అస్తమానం చికాకు పెట్టించే కాల్స్, మెసేజ్‌ల బెడద తప్పనుంది. టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు ఇక స్పామ్ కాల్స్ బెడద నుంచి యూజర్లను రక్షించేలా టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎయిర్ టెల్, జియో, వివో వంటి సంస్థలు తప్పనిసరిగా ఏఐ ఫిల్టర్‌ను వినియోగించాలని ఆదేశించింది. దీని ద్వారా, ఫోన్లలోని ప్రమోషనల్ కాల్స్ ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్ల నుంచి బయటపడొచ్చు. ట్రాయ్ ఆదేశాలు.. ఎయిర్టెల్ , జియో అప్రమత్తం ఈ తరుణంలో ట్రాయ్ ఆదేశాలపై జియో, ఎయిర్టెల్ స్పందించాయి. ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే తమ నెట్‌వర్క్‌లలో ఏఐ ఫిల్టర్ ఆప్షన్‌ను ఏనేబుల్ చేస్తామని తెలిపాయి. ఇక,ఈ ఆప్షన్ మే 1 నుంచి వినియోగించుకునే అవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాల్ ఐడీ ఉపయోగం ఏంటంటే? టెక్నాలజీ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ అవగాహనా రాహిత్యం వల్ల స్పామ్ కాల్స్, మెసేజ్‌ల వల్ల అనార్ధాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ట్రాయ్ గత కొంతకాలంగా పనిచేస్తుంది. ముఖ్యంగా సైబర్ నేరస్తులు ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్లతో అమాయకుల బ్యాంక్ అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు. ఈ తరహా సైబర్ మోసాలపై దృష్టి సారించిన ట్రాయ్.. టెలికాం కంపెనీలకు కాల్ ఐడీని అందుబాటులోకి తెచ్చేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ కాల్ ఐడీ ఆప్షన్‌తో మనకు ఫోన్ చేసే వారి పేర్లు, ఫోటోలు మొబైల్ ఫోన్లపై డిస్ప్లే కానున్నాయి. ఇలా చేయడం వల్ల మనకు ఫోన్ చేసేది ఎవరనేది ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడొచ్చని రెగ్యులేటరీ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ససేమీరా అంటున్న టెలికాం కంపెనీలు కానీ, ప్రైవసీ సమస్య కారణంగా ఎయిర్టెల్, జియో వంటి టెలికాం కంపెనీలు ఈ టెక్నాలజీని తీసుకురావడానికి వెనుకాడుతున్నాయి. అయితే దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. వినియోగదారులకు ఇబ్బంది కలిగించే కాల్స్, ఎస్ఎంఎస్లను అరికట్టడానికి ఏఐ ఫిల్టర్ మాత్రమే మే 1 నుండి అమల్లోకి రానుందనేది వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 వైరల్ అవుతున్న లలిత్ మోడీ ఆస్తుల విలువ.. ఎన్ని వేల కోట్లంటే? -
కర్ణాటక బీజేపీ నేతకు మోదీ ఫోన్ కాల్
బెంగళూరు: దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పకు ఫోన్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన.. ఆ మరుసటి రోజే ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ స్వయంగా ఈశ్వరప్పకు ఫోన్ చేయడం గమనార్హం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం టికెట్లు ఆశించి భంగపడ్డ బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న తరుణంలో.. పార్టీ దిద్దుబాటు చర్యకు దిగింది. ఇప్పటికే చాలామంది సీనియర్లకు ప్రత్యామ్నాయ హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న ఈశ్వరప్పకు స్వయంగా ఫోన్ చేశారు మోదీ. ‘‘మీలాంటి గొప్ప నేత.. నాలాంటి ఓ సాధారణ కార్యకర్తకు ఫోన్ చేయడం గొప్పగా భావిస్తున్నా అని ఈశ్వరప్ప, మోదీతో పేర్కొన్నారు. దానికి ప్రతిగా.. ‘మీరు పార్టీ పట్ల వీరవిధేయతను కనబరిచారు. అందుకు నాకు సంతోషంగా ఉంది. అందుకే మీతో మాట్లాడాలనుకున్నా. ఈశ్వరప్పజీ.. థాంక్యూ’ అని ప్రధాని మోదీ ఆ కాల్లో ఆయనకు బదులిచ్చారు. అంతేకాదు.. తాను ఇంతకాలం ప్రాతినిధ్యం వహించిన శివమొగ్గ నియోజకవర్గంలో బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న చెన్నబసప్ప తరపున తాను ప్రచారం సైతం చేస్తానని, కర్ణాటకలో బీజేపీ గెలుపునకు తన శాయశక్తులా కృషిచేస్తానని ఈశ్వరప్ప.. మోదీకి హామీ ఇచ్చారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ఈశ్వరప్ప.. ఆరో దఫా సైతం పోటీ చేయాలని భావించగా, పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. దీంతో అసంతృప్తితో రగిలిపోతూ ఆయన ఎన్నికల రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ బహిరంగ ప్రకటన చేశారు. ఇక శుక్రవారం ప్రధాని మోదీతో ఫోన్‌కాల్ మాట్లాడిన అనంతరం.. ఈశ్వరప్ప మీడియాతో మాట్లాడారు. ఇదీ చదవండి: వివాదాల పుట్ట.. ఈశ్వరప్ప మోదీగారు తనకు ఫోన్ చేస్తారని జీవితంలో అనుకోలేదని, ఆయన చేసిన పని తనకెంతో స్ఫూర్తినిచ్చిందని మీడియాకు ఈశ్వరప్ప బదులిచ్చారు. कुर्सी, सत्ता, दबदबा किसी भी हाल में बना रहना चाहिए… जो फोन पर बात कर रहे है वो BJP के #Eshwarappa है जिन्होंने 40% कमीशन की मांग कर एक कांट्रेक्टर को आत्महत्या के लिए मजबूर किया, बाद में मंत्री से इस्तीफा और टिकिट कटा देश के #PM उन्हें भरोसा देते हुए pic.twitter.com/uml1QCnl9I — Chhaya Thakur (@ChhayaThakurInc) April 21, 2023 బీజేపీ మే 10వ తేదీన జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ఎక్కువగా కొత్త ముఖాలను, యూత్ లీడర్లను దించుతోంది. దీంతో పార్టీ దిగ్గజాల్లో చాలామంది అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే మాజీ సీఎం జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు కూడా. అయితే మొదట ఈశ్వరప్ప సైతం పార్టీతీరుపై అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం నడిచినప్పటికీ, తాను పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తానంటూ గురువారం ఈశ్వరప్ప ఒక ప్రకటన చేశారు కూడా. తాను ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది కూడా పార్టీని బలోపేతం చేయడానికేనని పేర్కొన్నారు. పాతికేళ్లుగా శివమొగ్గ ప్రజలకు సేవలందించా. ఇకపైనా వాళ్లకు అందుబాటులో ఉంటా అని పేర్కొన్నారాయన. ఇదీ చదవండి: ఈశ్వరప్ప కొడుకుకూ దక్కని సీటు -
వాట్సాప్ స్పామ్ కాల్స్‌తో చిర్రెత్తిపోయారా?
ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సాప్‌లో వచ్చే స్పామ్ మెసేజెస్, అనుమానాస్పద కాల్స్ విసిగిస్తుంటాయి. అయితే అలాంటి వాట్సాప్ ఫోన్ కాల్స్ నుంచి యూజర్లకు ఉపశమనం కలిగించేందుకు వాట్సాప్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను మ్యూట్ చేసేందుకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నట్ల సమాచారం. వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం..వాట్సాప్ కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ వినియోగంలోకి వస్తే వాట్సాప్‌కు వచ్చే అనుమానాస్పద కాల్స్‌ను సైలెంట్లో పెట్టుకునే సౌలభ్యం కలిగించనుంది. అప్పటి వరకు ఆ కాల్స్ లిస్ట్ నోటిఫికేషన్ సెంటర్ (ఫోన్ డిస్ప్లే మీద కనిపించడం) లో ఫోన్ నెంబర్లు కనిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తే ఇటీవల కాలంలో యూజర్లను అసహనానికి గురి చేస్తున్న స్పామ్ కాల్స్ నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌కు వచ్చే స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేసుకునే సదుపాయం ఉంది. కానీ వాటిని సైలెంట్‌గా పెట్టుకునే సౌకర్యం లేదు. ఇప్పుడు ఆ ఫీచర్‌పైనే వర్క్ చేస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది. చదవండి👉 నేటి నుంచి ఈ బ్యాంక్ కనిపించదు -
'ఇరాన్లో అడుగుపెడితే చంపేస్తాం'
ఇరాన్‌కు చెందిన చెస్ ప్లేయర్ సారా ఖాదిమ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కొందరు ఆకతాయిలు వెంటనే ఇరాన్‌కు తిరిగి రావాలని డిమాండ్ చేస్తుండగా.. మరికొందరేమో ఇరాన్ అడుగుపెడితే చంపేస్తాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. సారా ఖాదిమ్ తల్లిదండ్రులకు కూడా ఇదే మాదిరి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో కజకిస్తాన్ పోలీసుల సహకారంతో చెస్ ఆటగాళ్లకు భద్రత కల్పించేందుకు టోర్నమెంట్ నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా సారా ఖాదిమ్ ఉంటున్న హోటల్ గది వెలుపల నలుగురు సెక్యూరిటీ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. ఇరాన్‌కు చెందిన స్టార్ చెస్ ప్లేయర్ సారా ఖాదిమ్ ప్రస్తుతం కజికిస్తాన్‌లోని ప్రపంచ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్నది. అయితే, చెస్ టేబుల్‌పై ఆమె తలకు హిజాబ్ ధరించకుండా కూర్చుండి ఆడుతున్న ఫొటోలు మీడియాలో ప్రత్యక్ష్యమయ్యాయి. దాంతో ఆమెకు బెదిరింపు కాల్స్ మొదలయ్యాయి. హిజాబ్ ధరించకుండా చెస్ పోటీల్లో ఎలా పాల్గొంటామని ఆకతాయిలు హెచ్చరిస్తున్నారు. పోటీలను అర్దాంతరంగా ముగించి వెంటనే స్వదేశానికి రావాలని కొందరు హెచ్చరిస్తుండగా.. మరికొందరేమో ఇక్కడికి వస్తే నీ అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. -
రష్యా సైనికుల్లో సన్నగిల్లుతున్న ధైర్యం.. చావడమే గానీ వెనక్కి రాలేం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రోజుకో వ్యూహంతో యుద్ధాన్ని మరింత ముమ్మరం చేస్తామే గానీ వెనక్కి తగ్గేదే లేదని ప్రగల్పాలు పలుకుతున్నారు. పైగా మా దళాలు వివిధ శక్తిమంతమైన క్షిపణులు, బాంబులతో ఉక్రెయిన్‌ని దద్ధరిల్లేలా చేస్తున్నారని కొద్దిరోజుల్లో విజయం సాధిస్తామంటూ గొప్పలు చెబుతున్నారు. కానీ ఉక్రెయిన్‌లో రష్యా దళాల పరిస్థితి అందుకు చాలా విభిన్నంగా ఉందనడానికి సాక్ష్యం వారి ఫోన్ కాల్స్. రష్య బలగాలు తమ ఆవేదనను తమవారితో ఫోన్లో వెళ్లబోసుకుంటున్నారు. తమకు సరైన ఆహారం, నీరు లేదని వధించబడతున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. దాదాపు పది నెలలుగా సాగుతున్న నిరవధిక యుద్ధంలో రష్యా గణనీయమైన నష్టాన్నే చవి చూసింది. అయినప్పటికీ రష్యా పెద్ద ఎత్తున సైనిక సమీకరణలతో సైనికులను రిక్రూట్ చేసుకుని యుద్ధం చేసేందకు సిద్ధమైంది. కానీ సైనికులు పోరాటం చేయలేక సరైన తిండిలేక నిసత్తువతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఒక సైనికుడు తన తల్లితో అమ్మ మాకు ఎవరూ సరైన ఆహారం అందించరని, నీటి కోసం గుమ్మడికాయాల నుంచి తీసిని నీటిని వడకట్టుకుని తాగుతున్నామని ఆవేదనగా చెబుతున్నాడు. అధ్యక్షుడు పుతిన్ గొప్పగా చెబుతున్న క్షిపణుల ఎక్కడ ఉన్నాయని కొందరూ సైనికులు ప్రశ్నిస్తున్నారు. తమ ఎదురుగా ఎత్తైన భవనం ఉందని, దానిని మన సైనికుల కొట్టలేరు ఎందుకంటే దాన్ని కూల్చడం కోసం కాలిబర్ క్రూయిజ్ క్షిపణి కావాలని చెప్పాడు. మరో రష్యా సైనికుడు తల్లి తన కొడుకు తనతో లేడని కన్నీళ్లు పెట్టుకుంది. మరోక పోన్ సంభాషణలో ఒక సైనికుడు తాము వెనక్కి వెళ్లేందుకు అనుమతి లేదని, పోరాడేందుకు సరైన ఆర్మీబలం, ఆయుధ బలం గానీ లేవని వాపోయాడు. ఇంకో రష్యా సైనికుడు తన భార్యతో ముగ్గురు సైనికులతో పారిపోయానని, లొంగిపోవాలని ఆలోచిస్తున్నట్లు చెప్పాడు. మరోక సైనికుడు మమ్మల్ని అందర్నీ చంపేస్తున్నారంటూ భయాందోళనతో చెప్పాడు. ఈ సుదర్ఘీ యుద్ధ రష్యన్ మిలటరీలో ధైర్యాన్నీ బలహీనపరిచింది. వారు కుటుంబాలకు చేసిన కాల్స్‌ని బట్టి వారంతా ఎంత నిస్సహాయ స్థితిలో పోరాడుతున్నారో అవగతమవుతోంది. (చదవండి: చైనాలో నిమ్మకాయలకు అమాంతం పెరిగిన డిమాండ్! కారణం ఏంటంటే..) -
ఇకపై ఆ తలనొప్పి ఉండబోదు.. కాలర్ ఎవరోతెలియాల్సిందే..!
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ (అన్ నోన్ నంబర్) బెడదకు త్వరలోనే ముగింపుపడనుంది. తమ మొబైల్ ఫోన్‌కు ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవడం ఫోన్ వినియోగదారుల హక్కుగా మారనుంది. ట్రూ కాలర్ యాప్‌తో సంబంధం లేకుండానే తమ కాంటాక్ట్ నంబర్ల జాబితాలో లేని నంబరు నుంచి ఫోన్ కాల్ వస్తే అది ఎవరు చేశారో తెలిసిపోనుంది. తద్వారా సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా విధాన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూపొందించిన కొత్త టెలికాం విధానం పార్లమెంటులో ఆమోదం పొందగానే అమల్లోకి రానుంది. - సాక్షి, అమరావతి ఫేక్ ఐడీ కార్డులతో కనెక్షన్లు... సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు... దేశంలో అమాంతంగా పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రధానంగా ఫేక్ ఐడీ కార్డులతో సిమ్ కార్డులు, ఓవర్ ద టాప్(వోటీటీ) కనెక్షన్లు తీసుకుని దర్జాగా మోసాలకు పాల్పడుతున్నారు. దాదాపు 90శాతం సైబర్ నేరాల ముఠాలు ఇలా ఫేక్ కనెక్షన్లతోనే సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నాయి. ఫేక్ ఐడీ కార్డులతో తీసుకున్న ఫోన్ కనెక్షన్లతోనే ఆడియో, వీడియో, వాట్సాప్ కాల్స్, ఇన్‌స్ట్రాగామ్ మెసేజ్‌లు, యూపీఐ మెసేజ్‌లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయని జాతీయ నేర గణాంకాల (ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించింది. వాటిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ఆ మొబైల్ కనెక్షన్లు ఫేక్ ఐడీ కార్డులతో తీసుకున్నవి కావడంతో ఆయా చిరునామాల్లో సంబంధిత వ్యక్తులు ఉండటం లేదు. దీంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థలకు కొత్త విధివిధానాలను రూపొందించింది. ఈ మేరకు పార్లమెంటుకు ఇప్పటికే నూతన విధాన పాలసీ డ్రాఫ్ట్‌ను సమర్పించింది. రానున్న పార్లమెంటు సమావేశాల్లో దీనికి ఆమోదముద్ర పడుతుందని భావిస్తున్నారు. కేవైసీ తప్పనిసరి... టెలికాం కంపెనీలు తమ ఖాతాదారుల పూర్తి వివరాలను పరిశీలించి నిర్ధారించుకోవాలి. అందుకోసం బ్యాంకులు చేస్తున్నట్టుగా ‘నో యువర్ కస్టమర్(కేవైసీ) ప్రక్రియను పాటించాలి. తమ కంపెనీ నుంచి మొబైల్ సిమ్ కార్డ్, వోటీటీ కనెక్షన్ తీసుకున్న ప్రతి ఒక్క ఖాతాదారు సమర్పించిన గుర్తింపు కార్డులను తనిఖీ చేసిన తర్వాతే కనెక్షన్ ఇవ్వాలి. లేదా కనెక్షన్ ఇచ్చిన వారం రోజుల్లోనే ఆ గుర్తింపు కార్డులను పరిశీలించాలి. ఖాతాదారులు సమర్పించిన గుర్తింపు కార్డులు సరైనవి అని నిర్ధారణ అయితే సరే. నిర్ధారణ కాకపోతే వెంటనే ఆ కనెక్షన్లను నిలుపుదల చేయాలి. ఏ సందర్భంలో అయినా సరే పోలీసుల విచారణలో ఫేక్ గుర్తింపు కార్డులతో ఎవరైనా కనెక్షన్ తీసుకున్నారని తెలిస్తే సంబంధిత టెలికాం కంపెనీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఫేక్ ఐడీతో తీసుకుంటే కఠిన చర్యలు... ఇక ఫేక్ గుర్తింపు కార్డుతో ఎవరైనా మొబైల్ కనెక్షన్ గానీ, వోటీటీ కనెక్షన్ గానీ తీసుకున్నారని టెలికాం కంపెనీల ‘కేవైసీ’లో వెల్లడైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తారు. వివిధ కేసుల దర్యాప్తులో భాగంగా ఫేక్ ఐడీ కార్డులతో మొబైల్, వోటీటీ కనెక్షన్ తీసుకున్నారని పోలీసులు గుర్తించినా వారిపై కేసు నమోదు చేస్తారు. అలా ఫేక్ ఐడీ కార్డుతో కనెక్షన్ తీసుకున్నవారికి రూ.50వేల జరిమానా లేదా ఏడాది జైలు లేదా రెండూ విధించేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎవరు కాల్ చేస్తున్నారో తెలిసిపోతుంది... నూతన పాలసీ ప్రకారం తమ కాంటాక్ట్ నంబర్ల జాబితాలో లేని నంబరు నుంచి కాల్ వచ్చినా సరే ఆ ఫోన్ చేసింది ఎవరో ఇకపై తెలిసిపోతుంది. ప్రస్తుతం ట్రూ కాలర్ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఆవిధంగా ఎవరు కాల్ చేస్తున్నారో తెలుస్తుంది. కానీ, దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అయితే, ట్రూ కాలర్ యాప్‌తో నిమిత్తం లేకుండానే తమకు ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవడం ప్రతి మొబైల్ ఫోన్ వినియోగదారుడికి హక్కుగా కేంద్రం నూతన పాలసీ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది. ఇందుకోసం మొబైల్ కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని ఆదేశించనుంది. -
తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. టీఆర్ఎస్లోకి తిరిగి వలసలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌తో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. గతంలో పార్టీని వీడి వెళ్లిన నేతలను.. తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఈ మేరకు చేరికల కోసం స్వయంగా ఆయనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తద్వారా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు బీజేపీని గట్టి దెబ్బ కొట్టాలనే ఆలోచన చేసినట్లు స్పష్టమవుతోంది. తెలంగాణలో ఇప్పటికే పలువురు నేతలు అటు ఇటు పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలుపెట్టింది టీఆర్ఎస్. స్వయంగా ఉద్యమ నేతలకు కేసీఆరే ఆహ్వానం అందించినట్లు అధికారిక సమాచారం. ఇప్పటికే దాసోజు శ్రవణ్ చేరిక ఖరారుకాగా.. స్వామిగౌడ్, జితేందర్‌రెడ్డిలో సైతం టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. వీళ్లతో పాటు నాటి ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలందరికీ తిరిగి పార్టీలోకి ఆహ్వానం అందించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఉద్యమ నేతల్లో కొందరికి స్వయంగా ఫోన్ చేసి కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. అంతేకాదు.. వాళ్లకు పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని మాటిస్తున్నట్లు తెలుస్తోంది. స్వామిగౌడ్ చేరిక దాదాపు ఖాయమైందని టీఆర్ఎస్ శ్రేణులు చెప్తుండగా.. జితేందర్‌రెడ్డితో చర్చల కోసం నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఏనుగు రవీందర్‌రెడ్డితోనూ సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీని వీడిన వాళ్లను తిరిగి ఆహ్వానించడం ద్వారా.. బీజేపీ వలస రాజకీయాలకు చెక్ పెట్టడంతో పాటు ప్రత్యర్థులకు వ్యూహాలను దెబ్బ కొట్టవచ్చని గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్ రచించినట్లు స్పష్టమవుతోంది. -
రాజాసింగ్ లాయర్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ..
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టులో రాజాసింగ్ కేసు వాదించిన లాయర్ కరుణాసాగర్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బెయిల్ ఇప్పించినందుకు చంపేస్తామంటూ ఫోన్లో బెదిరిస్తున్నారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు లాయర్ కరుణాసాగర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘న్యాయవాద వృత్తిని నేను నెరవేర్చాను. పోలీసుల వైఫల్యంతోనే రిమాండ్ రిజెక్ట్ అయింది. నిన్నటి నుంచి గుర్తు తెలియని ఆగంతకులు నాకు కాల్స్ చేసి చంపుతామని బెదిరిస్తున్నారు. దుబాయ్ నుంచి కొందరు కాల్స్‌చేసి బెదిరిస్తున్నారు. బెదిరింపులకు నేను భయపడను. దీనిపై పోలీసులు స్పందించాలి’ అని లాయర్ కరుణాసాగర్ కోరారు. కాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రిమాండ్‌ను రిజెక్ట్ చేసిన నాంపల్లి కోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరపు న్యాయవాదులు కోర్టులు వాదనలు వినిపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయడం చట్టవిరుద్దమని తెలిపారు. రాజాసింగ్ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఎమ్మెల్యే రిమాండ్‌ను కోర్టు రిజెక్ట్ చేసింది. రాజాసింగ్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. చదవండి: (హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర.. ఇది ముమ్మాటికీ నిజం: బండి సంజయ్) -
రాష్ట్రపతి ఎన్నికలు: అధికార పక్షానికి సిన్హా.. విపక్షాలకు ద్రౌపది ఫోన్లు
న్యూఢిల్లీ: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా (84) శుక్రవారం ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు ఫోన్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరారు. బీజేపీ కురువృద్ధ నేత, గురువు అయిన ఎల్కే అద్వానీతో సైతం ఆయన ఫోన్ చేసి చాలాసేపే మాట్లాడినట్లు తెలుస్తోంది. నామినేషన్ వేయకముందే ఆయన ప్రచారం మొదలుపెట్టడం గమనార్హం. ఇక రాష్ట్రపతి అభ్యర్థి కావడంతో.. సిన్హాకు జెడ్ కేటగిరీ భద్రత అందించింది కేంద్రం. సీఆర్పీఎఫ్ సాయుధ కమాండోలను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే.. 27న(సోమవారం) ఆయన నామినేషన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోనియా, పవార్, మమతకు ముర్ము ఫోన్ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము శుక్రవారం కీలక ప్రతిపక్ష నేతలతో ఫోన్లో మాట్లాడారు. నామినేషన్ వేసిన అనంతరం.. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలకు ఫోన్ చేసి, తనకు మద్దతు తెలపాలని కోరారు. త్వరలోనే వ్యక్తిగతంగా వచ్చి కలుస్తానని వారికి ముర్ము చెప్పినట్లు తెలుస్తోంది. ఆయా పార్టీల నేతలు ఆమె విజయాన్ని కాంక్షించారని తెలిపాయి. బీజేపీ చీఫ్ నడ్డా శుక్రవారం కాంగ్రెస్ నేతలు మలికార్జున ఖర్గే, ఆధిర్ రంజన్ చౌధురి, మాజీ పీఎం, జేడీయూ నేత దేవెగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాలకు ఫోన్ చేసి, ముర్ము అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు. చదవండి: అట్టహాసంగా ద్రౌపది ముర్ము నామినేషన్ -
కరోనా కాలర్ ట్యూన్‌కు ఇక సెలవు..!
కరోనా సమయంలో ఎంతో మందికి వినిపించిన కోవిడ్ కాలర్ ట్యూన్ ఇకపై మూగబోనుంది. కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్‌తో పాటుగా మరిన్ని కాలర్ ట్యూన్స్ వినిపించిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపై ఆ కాలర్ ట్యూన్ మళ్లీ వినిపించకపోవచ్చు. కాగా, దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే కొవిడ్ నిబంధనలను ఎత్తివేయాలని కేంద్రం ఇటీవలే రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో మార్చి 31వ తేదీ నుంచి కేవలం మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి మార్గదర్శకాలు మాత్రమే కొనసాగనున్నాయి. అయితే, కరోనా సమయంలో ప్రజలను కోవిడ్ వైరస్‌పై, కోవిడ్ టీకాపై అవగాహన కల్పించేందుకు కేంద్రం.. టెలికాం ఆపరేటర్లతో కలిసి ఫ్రీ కాల్- ఆడియో ప్రకటనలు, కాలర్ ట్యూన్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా, దేశంలో కరోనా తీవ్రత తగ్గడంతో ఫ్రీ కాల్ సందేశాలను నిలిపి వేసే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖకు టెలీకమ్యూనికేషన్ల విభాగం ఆదివారం ఓ లేఖ రాసింది. భారత సెల్యులర్ ఆపరేటర్ల సంఘం, మొబైల్ వినియోగదారుల నుంచి కాలర్ ట్యూన్ నిలిపివేయాలని విజ్ఞప్తులు వచ్చినట్లు ఆ లేఖలో పేర్కొంది. దీంతో కొవిడ్ కాలర్ ట్యూన్లను నిలిపివేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందంటూ వార్త సంస్థ పీటీఐ పేర్కొంది. మరోవైపు.. గత 21 నెలలుగా ఈ కాలర్ ట్యూన్స్ వినియోగదారులకు కోవిడ్‌పై సలహాలు, సూచనలు అందిస్తున్నాయి. అయితే కాలర్ ట్యూన్స్ కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్‌కాల్ మాట్లాడటం ఆలస్యమవుతోందంటూ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల అందుతున్నాయని.. అందుకే దీన్ని నిలిపివేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. Govt considering dropping COVID-19 pre-call announcements from phones after almost two years of raising awareness about disease: Official sources — Press Trust of India (@PTI_News) March 27, 2022 -
ఆ మహిళకు పదేపదే ఫోన్లు.. భర్తకు తెలిసి..
మైసూరు (కర్ణాటక): ఫోన్ కాల్స్ గొడవ యువకుని ప్రాణాలు తీసింది. నగరంలోని యరగనహళ్ళిలో ఉండే ప్రజ్వల్ (19) ఒక హోటల్లో పని చేసేవాడు. ఒక మహిళకు పదేపదే ఫోన్లు చేస్తుండేవాడు. దీంతో ఆమె భర్త, మరికొందరు కలిసి ప్రజ్వల్ ఇంటికెళ్లి గొడవ చేశారు. మళ్లీ హోటల్‌కు వచ్చి ప్రజ్వల్‌ను నిలదీసి అతని లాక్కెళ్లసాగారు. దాంతో భయపడి ప్రజ్వల్ హోటల్ భవనంపైకి పరిగెత్తి కిందికి దూకడంతో మృత్యువాత పడ్డాడు. దేవరాజ్ ఏరియా పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (నాలుగేళ్లుగా సహజీవనం.. ప్రియుడు మందలించడంతో..) -
భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్ రికార్డు చేయడం నేరం: హైకోర్టు
Recording wife’s telephonic call without her consent is a blatant violation of her privacy చండీఘడ్: భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్‌ను భర్త రికార్డు చేయడం గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. జనవరి 20, 2020 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ లిసా గిల ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. పంజాబ్‌లోని భటిండాకు చెందిన ఓ వ్యక్తి భార్య వేదింపులకు గురిచేస్తోందని, విడాకులు ఇప్పించమని కోర్టును ఆశ్రయించాడు. అందుకు సాక్షంగా ఫోన్ సంభాషణలను సమర్పించాడు. దీంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఫిబ్రవరి 20, 2007లో సదరు భార్యభర్తలిరువురికీ వివాహం జరిగింది. 2011 మేలో వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. ఐతే మనస్పర్ధల కారణంగా 2017లో విడాకులు కోరుతూ భర్త పిటిషన్ దాఖలు చేశాడు. క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో జూలై 9, 2019న భార్య భర్తలిరువురి ఫోన్ సంభాషణకు సంబంధించిన సీడీ, సిమ్ కార్డులను సాక్షాలుగా సమర్పించాడు. దీన్ని సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది. తనకు తెలియకుండా తన సంభాషణలను రికార్డు చేయడం గోప్యతను ఉల్లంఘించడమేనని వాదించింది. ఐతే భార్య వేధింపులకు సాక్షాలుగా మాత్రమే వీటిని సమర్పించామని, ఆమె గోప్యతకు భంగం కలిగించాలనే ఉద్దేశ్యంతోకాదని భర్త తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఫోన్ రికార్డులను సాక్షాలుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. అంతేకాకుండా భార్య అనుమతి లేకుండా, ఆమెకు తెలియకుండా ఫోన్ సంభాషణలు రికార్డు చేయడం నేరమని పంజాబ్- హర్యానా హైకోర్టు వెల్లడించింది. ఈ సందర్భంగా ఫోన్ రికార్డింగ్‌లను సాక్ష్యంగా పరిగణించకుండా విడాకుల కేసుపై ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని భటిండా ఫ్యామిలీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. చదవండి: అదిరిపోయే స్కీమ్! ఈ సేవింగ్ స్కీమ్‌లో పొదుపు చేసిన సొమ్ము 124 నెలల్లో రెట్టింపవుతుంది! -
దయచేసి ఫోన్ ఎత్తి మేము సురక్షితంగా ఉన్నాం అని చెప్పండి!
న్యూయర్క్: చాలా మంది ప్రకృతి ప్రేమికులు పర్వతాలు, అడవులు గుండా సుదీర్ఘ ప్రయాణం కాలినడకన(ట్రెక్కింగ్) చేస్తుంటారు. పైగా ఆ ప్రయాణంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఎటువంటి ఆపదల ఎదురవ్వకుండా తగిన జాగ్రత్తలతో పయనమవుతారు. ఏదైనా సమస్య ఎదురైతే రెస్య్కూ సిబ్బంది సాయంతో సురక్షితంగా బయటపడతారు. అయితే ఇలానే ఒక వ్యక్తి అమెరికాలోని కొలరాడోలోని మౌంట్ ఎల్బర్ట్ అనే పర్వతం గుండా సుదీర్ఘ ప్రయాణ నిమిత్తం ఉదయం 8 గంటలకు కాలినడకన పయనమయ్యాడు. (చదవండి: నా భార్య బాధ తట్టుకోలేకపోతున్నా.. నన్ను జైల్లో పడేయండి!) ఈ మేరకు అతను ఎంతసేపటికి రాకపోయేసరికి లేక్ కౌంటీ సెర్చ్ అండ్ రీసెర్చ్ (ఎల్సీఎస్ఏఆరర్) అతను గల్లంతైనట్లు గుర్తించి ఆ వ్యక్తి ఆచూకి నిమిత్తం ఐదుగురి రెస్కూ సిబందిని పంపించింది. ఈ క్రమలో ఆ సిబ్బంది అతని ఫోన్ కాల్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నించటానికీ చూశారు. కానీ అతను గుర్తు తెలియని నంబర్ నుంచి వస్తున్న కాల్స్‌ని రిసీవ్ చేసుకోకవపోవడంతో సిబ్బంది అతన్ని గాలించలేకపోయారు. దీంతో వారు వెనుకకు వచ్చి మరో ప్రాంతం గుండా గాలించడం మొదలు పెట్టారు. ఎట్టకేలకు ఆ వ్యక్తి మరుసటి రోజు ఉదయమే తను బస చేస్తున్న హోటల్‌కి సురక్షితంగా రావడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పైగా రెస్క్యూ టీమ్ తన కోసం వెతుకుతున్నట్లు అతనికి తెలియదు. దీంతో ఎల్సీఎస్ఏఆర్ దయచేసి ప్రయాణ ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయానికి గమ్యానికి తిరిగి చేరుకోలేనప్పుడు మీ ఆచూకి నిమిత్తం రెస్క్యూ బృందం వస్తుందన్న విషయాన్ని గుర్తించుకోండి అని నొక్కి చెప్పింది. ఈ మేరకు దయచేసి పదేపదే తెలియని నంబర్ నుంచి వచ్చిన కాల్స్‌కి సమాధానం ఇవ్వండంటూ ప్రయాణికులకు లేక్ కౌంటీ సెర్చ్ అండ్ రీసెర్చ్ విజ్ఞప్తి చేసింది. (చదవండి: బాబోయ్ ముఖం అంతా టాటులే!) -
మహిళలతో చనువుగా ఫోన్ చేయించి అర్ధనగ్న ఫొటోలు..
కర్నూలు: ‘నీవు నాకు బాగా తెలుసు... అందంగా ఉంటావు.. చాలాసార్లు మాట్లాడాలని ప్రయత్నించా.. కుదర్లేదు. నీకు పరిచయమున్న వ్యక్తి నీ ఫోన్ నంబర్ ఇచ్చాడు. అందుకే ఫోన్ చేస్తున్నా. ఓసారి ఇంటికి రా మాట్లాడుకుందాం’... అంటూ మహిళతో చనువుగా ఫోన్ చేయించి ఇంటికి పిలిపించుకుని అర్ధనగ్న ఫొటోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు నిఘా వేసి పట్టుకుని కటకటాలలోకి పంపారు. కర్నూలు నగరం బంగారుపేటకు చెందిన వంట మాస్టర్ శకుంతల, ఆటో డ్రైవర్ కిశోర్, ఫ్లంబర్ రాజు అలియాస్ నాగరాజు, బీడీ బంకు ద్వారా జీవనం సాగిస్తున్న అంజనమ్మను 4వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఎదుట హాజరు పరిచారు. చదవండి: ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో.. పెళ్లి దుస్తుల్లోనే.. సోమవారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఐదుగురు ముఠాగా ఏర్పడి సులువుగా డబ్బు సంపాదించేందుకు వక్ర మార్గాన్ని ఎంచుకున్నారు. కర్నూలు మండలం రేమట గ్రామానికి చెందిన గిడ్డయ్య నిర్మల్ నగర్లో ఉంటాడు. మరో వ్యక్తి దాసుతో కలిసి బాగా డబ్బు ఉన్న వారి ఫోన్ నంబర్లను సేకరించి శకుంతల, అంజనమ్మల ద్వారా తియ్యనైన మాటలతో ముగ్గులోకి దింపి ఇంటికి రప్పించుకుని అమ్మాయిలతో కలిసి ఉన్నప్పుడు అర్ధనగ్న ఫొటోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. 20 రోజుల క్రితం లేబర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తికి తియ్యనైన మాటలతో ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుని ట్రాప్‌లో పడేసి బెదిరించి అతని వద్ద రూ. 1.20 లక్షలు నగదు తీసుకున్నారు. అలాగే ఈ నెల 9వ తేదీన రాంరహీమ్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తిని కూడా ఇంటికి పిలిపించుకుని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి రూ. 4 లక్షలు విలువ చేసే రెండు ప్రామిసరీ నోట్లు, మరో రూ. 4 లక్షలు విలువ చేసే రెండు చెక్కులను తీసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి పక్కా ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు పంపినట్లు ఎస్పీ వెల్లడించారు. చదవండి: డీజీపీని కలిసిన రమ్య కుటుంబ సభ్యులు -
మహిళలే టార్గెట్: హలో అంటూ వల వేసి..
తాను ఉన్నతాధికారినంటూ ఫోన్ చేస్తాడు.. ప్రమోషన్ ఇస్తానని నమ్మబలుకుతాడు.. ఫొటోలు కావాలని ముగ్గులో దింపడానికి ప్రయత్నిస్తాడు.. నమ్మితే బలైపోవాల్సిందే. సారవకోట, మెళియాపుట్టి మండలాల్లో వెలుగు చూసిన వ్యవహారమిది. ఆ నంబర్‌తో ఫోన్ వస్తే చాలు ఈ రెండు మండలాల్లోని కొందరు ఉద్యోగిణులు హడలిపోతున్నారు. ఉద్యోగాలంటూ, ప్రమోషన్లంటూ మాటలు కలుపుతూ లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో ఏ కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చినా భయపడుతున్నారు. ఫోన్ చేస్తున్న వాడి ఊరు, పేరు తెలియకపోవడంతో అమాయకులు వలలో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సారవకోట, మెళియాపుట్టి చుట్టుపక్కల గ్రామాల్లో ఓ అజ్ఞాత వ్యక్తి కలకలం రేపుతున్నాడు. తన వివరాలు బయటపడకుండా జాగ్రత్త పడుతున్న ఆ మాయగాడు మహిళలకు ఫోన్లు చేస్తూ లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మహిళలనే టార్గెట్‌గా పెట్టుకున్న ఆ వ్యక్తి కింది స్థాయి ఉద్యోగినులకు ఫోన్లు చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడటం, ఉద్యోగాలు, ప్రమోషన్ల ఎర చూపడం చేస్తున్నాడు. ప్రధానంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఇతరత్రా చిన్న పాటి ఉద్యోగినులకు ఈ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మహిళా వలంటీర్లతోనైతే అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. ఎవరీ వ్యక్తి అని ఆరా తీసేందుకు ప్రయత్నిస్తుంటే ఫోన్ చేసిన వాళ్లనూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఉదాహరణలివే.. ►సారవకోట మండలంలోని బొంతు గ్రామానికి చెందిన ఒక మహిళకు 8096762584 నంబర్ నుంచి ఈ నెల 3న ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి మహిళతో మాటామాటా కలిపి అసభ్యకరంగా మాట్లాడాడు. ►దీనిపై ఆమె ఈ నెల 4న సారవకోట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ►ఈ నెల 8న మండలంలోని చీడిపూడి గ్రామానికి చెందిన నలుగురు మహిళా వలంటీర్లకు అదే నంబర్‌తో ఫోన్ వచ్చింది. తాను కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నానని, అనంతపురం జిల్లాలో వ్యవసాయశాఖలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తున్నారని ఆ పోస్టులు మీకు వచ్చేలా చూస్తానని చెప్పి నమ్మబలికాడు. దరఖాస్తు చేయడానికి పూర్తి సైజ్ ఫొటో ఇవ్వాలని కోరడంతో ఆ వలంటీర్లకు అనుమానం వచ్చి ఫోన్ కట్ చేశారు. ►బుడితి సచివాలయ మహిళా పోలీసుకు సైతం ఇలాంటి కాల్ వచ్చింది. ఆమె స్థానిక ఎస్ఐ దృష్టిలో కూడా పెట్టారు. ►మెళియాపుట్టి మండలంలోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి. ►మూడు నెలల కిందట మండలంలోని పలువురు అంగన్వాడీ కార్యకర్తలకు కూడా పీడీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నానని ఫోన్ చేసి మీకు ప్రమోషన్లు ఇప్పిస్తానని, వేరే ►చోటకు బదిలీ చేయిస్తానని నమ్మబలికి వారిని లోబర్చుకునేందుకు ప్రయత్నించారు. ►మరికొంత మందికి ఫోన్ చేసి ‘మీరు గుడ్డు, పాలు లబ్ధిదారులకు ఇవ్వకుండా అమ్ముకుంటున్నారు. మీ పై ఫిర్యాదులు వచ్చాయ’ని చెప్పి వారిని బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నించినట్లు పలువురు అంగన్వాడీ కార్యకర్తలు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన నంబర్లను సేకరించి వారికి ఫోన్లు చేస్తున్నారు. ►గ్రామాల్లో ఉన్న ఒంటరి మహిళల వివరాలను అంగన్వాడీ కార్యకర్తలు, వలంటీర్లు, ఏఎన్ఎంల నుంచి సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాను ఉన్నతాధికారినంటూ నమ్మబలికి బెదిరిస్తున్నాడు. ►అనుమానం వచ్చి ఇంటిలో మగవారితో తిరిగి ఫోన్ చేయిస్తే తిట్ల పురాణం అందుకుంటూ ఫోన్ ఆఫ్ చేసేస్తున్నాడు. ►సారవకోట మండల వలంటీర్ల సంఘం అధ్యక్షుడు శివశంకర్ ఆ వ్యక్తికి ఫోన్ చేయగా.. అసభ్యకర రీతిలో మాట్లాడాడు. ఎవరికీ చెప్పుకోలేక.. కింది స్థాయి మహిళా ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఈ ఫోన్ కాల్ వేధింపులు ఉన్నట్లు సమాచారం. అయితే వారు ఎవరికీ చెప్పుకోలేక చాలా కాలంగా సతమతమవుతున్నారు. మండలంలో దాదాపు ప్రతి రోజూ కొంతమందికి 8096762584 అనే ఫోన్ నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడిది సారవకోట మండలంలో చర్చనీయాంశంగా మారింది. తిరిగి ఫోన్ చేస్తుంటే తిట్ల పురాణం అందుకుంటున్నాడు. ఇప్పటికే ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అతడి వివరాలు ఇప్పటివరకు తెలియలేదు. దీంతో ఆ వ్యక్తి ఆగడాలు ఆపడం లేదు. దర్యాప్తు చేస్తున్నాం బొంతు గ్రామానికి చెందిన ఒంటరి మహిళ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. ఒంటరి మహిళలు, వివిధ ప్రభు త్వ శాఖల్లో పనిచేస్తున్న చిన్న ఉద్యోగులకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్న వ్యక్తి గురించి ఆరా తీస్తున్నాం. ప్రస్తుతం ఏ టవర్ లొకేషన్లో ఉండి కాల్ చేస్తున్నాడో తెలుసుకుంటున్నాం. త్వరలోనే అతడిని పట్టుకుంటాం. – ఎం.ముకుందరావు, ఎస్ఐ, సారవకోట -
వియత్నాం ప్రధానితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: వియత్నాం ప్రధాని ఫామ్ మిన్‌చిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ కాల్లో మాట్లాడారు. కొత్తగా వియత్నాం ప్రధానిగా ఎన్నికైన ఫామ్ మిన్‌చిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరు ప్రధానులు చర్చించారు.భారత పర్యటనకు రావాలని మిన్‌చిన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు.కరోనా సెకండ్ వేవ్‌లో భారత్‌కు సహాకారం అందించిన వియత్నాం ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కష్టకాలంలో ఇరుదేశాలు తమ సహయ,సహకారాలు కొనసాగించాలని ఇరు ప్రధానులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం భారత్,వియత్నాం రెండు యుఎన్ భద్రతా మండలిలో సభ్యులుగా ఉన్నాయనే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. 2022 నాటికి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 50 సంవత్సరాలు పూర్తి అయ్యే సందర్భంలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ వియత్నాం ప్రధానికి సూచించారు. -
షార్... మాకు 90 ఎంఎల్ కావాలి.. డయల్ 100కు మందుబాబుల కాల్స్!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ఈ కష్టకాలంలో కరోనా బాధితులు మందుల కోసం ఆరాటపడుతుంటే.. మద్యంప్రియులేమో మందు కోసం సతాయిస్తున్నారు. లాక్డౌన్ వేళ.. ‘డయల్ 100’కు ఫోన్‌కాల్స్ పోటెత్తుతున్నాయి. ఇందులో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కాల్స్ అధికంగా ఉంటున్నాయి. మరోవైపు మందుబాబుల కాల్స్ కూడా పెద్దసంఖ్యలో ఉంటున్నాయి. ఎక్కడ మందు దొరుకుతుందో చెప్పాలంటూ ‘డయల్ 100’ సిబ్బందిని విసిగిస్తున్నారు. ఈ నెల 12 నుంచి లాక్డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఉదయం 6– 10 గంటల మధ్య రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు తెరిచే ఉంటున్నాయి. అయినా, పనీపాటాలేని కొందరు, తాగిన మద్యం సరిపోక మరికొందరు ‘డయల్ 100’కు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ‘షార్... మాకు 90 ఎంఎల్ కావాలి. మందు ఎక్కడ దొరుకుతుంది? డబుల్ రేటైనా ఫర్లేదు’అని కొందరు, కనీసం బెల్ట్‌షాపుల అడ్రస్లైనా చెప్పాలంటూ మరికొందరు వేధిస్తున్నారు. ఇలాంటి కాల్స్‌తో తమ విలువైన సమయం వృథా అవుతోందని ‘డయల్ 100’ఆపరేటర్లు వాపోతున్నారు. ఇలాంటి ఒక్కో కాల్ వల్ల దాదాపు 45 సెకండ్ల సమయం వృథా అవుతోందని, ఆలోపు ఆపదలో ఉన్నవారికి లైన్ దొరకకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అకారణంగా ఫోన్లు చేస్తే కేసులు పెడతామని సిబ్బంది హెచ్చరించారు. మొత్తం 54 వేల ఫిర్యాదులు ఈ నెల 12 నుంచి 24 వరకు డయల్ 100 సిబ్బందికి మొత్తం 54 వేల ఫోన్ కాల్స్ రాగా... అందులో 6,431 కోవిడ్‌కు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జనం గుమిగూడుతున్నారని 3,121, ఉదయం 10 గంటలు దాటినా షాపులు తెరిచే ఉన్నాయని 1,947, కోవిడ్ అనుమానితులపై 633, మాస్కు ధరించలేదని 308, కరోనా అనుమానిత మరణాలపై 144 కాల్స్ వచ్చాయి. ఆసుపత్రిలో బెడ్లు లేవని, అంబులెన్సులు కావాలని, ఆక్సిజన్ వెంటిలేటర్లు లేవని, చికిత్సకు ఆసుపత్రులవారు అధిక మొత్తం డిమాండ్ చేస్తున్నారని, ప్లాస్మా కావాలని పలు ఫోన్లు వచ్చాయి. -
కొత్త ప్రైవసీ పాలసీకి అంగీకరించకపోతే... పరిమిత సేవలే: వాట్సాప్
న్యూఢిల్లీ: కొత్త ప్రైవసీ నిబంధనలు అంగీకరించేలా వాట్సాప్ ఒత్తిడి పెంచుతోంది. ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని మాతృసంస్థ ‘ఫేస్బుక్’తో పంచుకునేందుకు వీలు కల్పించేలా వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ఉందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలకు అంగీకరించకపోతే ఇప్పటికిప్పుడు ఖాతాను తొలగించకున్నా.. వినియోగదారులు పొందే సేవలు పరిమితం చేస్తామని వాట్సాప్ తాజాగా ప్రకటించింది. కొద్ది వారాల తర్వాత వినియోగదారులు తమ చాట్ లిస్టును చూడలేరని, ఆపై వాట్సాప్‌లో ఫోన్ కాల్స్‌ను, వీడియో కాల్స్‌ను అందుకోలేరని స్పష్టం చేసింది. కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించడానికి మే 15వ తేదీని గడువుగా విధించిన వాట్సాప్... అలా చేయని ఖాతాదారుల తక్షణం వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని, అకౌంట్‌ను తొలగించడం, సేవలకు అంతరాయం కలిగించడం చేయబోమని శుక్రవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇంతలోనే తమ వెబ్సైట్లో అసలు విషయాన్ని బయటపెట్టింది. కొత్త ప్రైవసీ పాలసీలోని నియమనిబంధనలను అంగీకరించాలని వినియోగదారులకు కొద్దివారాల పాటు రిమైండర్లు (గుర్తుచేసే సందేశాలు) పంపుతామని, అప్పటికీ ఒప్పుకోని వారికి నిరంతరం సందేశాలు వెల్లువెత్తుతాయని వాట్సాప్ స్పష్టం చేసింది. అయితే వినియోగదారులకు ఎన్నివారాల గడువు ఇస్తున్నదీ స్పష్టం చేయలేదు. రిమైండర్ల తర్వాత కూడా స్పందించకపోతే వారు అందుకునే సేవలను పరిమితం చేస్తామని తెలిపింది. ఇలా కొద్దివారాల పరిమిత సేవల తర్వాత కూడా కొత్త ప్రైవసీ పాలసీని ఆమోదించని వారికి ఇన్కమింగ్ కాల్స్, నోటిఫికేషన్స్, మెసేజ్‌లు నిలిపివేస్తామని వాట్సాప్ ప్రకటించింది. ఖాతాలను తొలగించబోమని చెబుతూనే... వాట్సాప్‌ను కొంతకాలం వాడని వినియోగదారుల విషయంలో తాము అనుసరించే విధానాన్ని ఎత్తిచూపింది. ఎవరైనా వాట్సాప్‌ను 120 రోజులు వినియోగించకపోతే... సదరు ఖాతాను వాట్సాప్ తొలగిస్తుంది. అంటే... ప్రైవసీ పాలసీని అంగీకరించకపోతే కొద్దివారాల తర్వాత మన ఫోన్లో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి. ఆపై సదరు ఖాతా ఇన్‌యాక్టివ్‌గా మారిపోతుంది. 120 రోజుల తర్వాత దీన్ని తొలగిస్తారన్న మాట. -
అర్ధరాత్రి వరకు ఫోన్ మాట్లాడుతున్న భార్య.. దీంతో..
సాక్షి, పటాన్చెరు(హైదరాబాద్): కలకాలం కష్టసుఖాల్లో తోడూనీడగా ఉంటానని ప్రమాణం చేసి.. అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే కొట్టిచంపాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన సురేశ్ పాశం మైలారం పారిశ్రామికవాడలో ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పదేళ్ల క్రితం సురేశ్‌కు అదే గ్రామానికి చెందిన స్వప్న(31)తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. సురేశ్ సోమవారం రాత్రి ఇంటికొచ్చే సరికి భార్య స్వప్న ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన సురేశ్ ఆమెను తీవ్రంగా కొట్టాడు. గాయాలపాలై ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా సురేశ్ తల్లిదండ్రులు స్వప్న తమ్ముడు లక్ష్మణ్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అతడు వచ్చి స్వప్నను చికిత్స కోసం ఇస్నాపూర్ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యుల సూచన మేరకు పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
ఆరేళ్లలో డయల్ 100కు ఎన్ని కాల్స్ తెలుసా!
సాక్షి, హైదరాబాద్ : అత్యవసర సమయంలో ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది డయల్–100. ఆపదలో ఉన్న వారికి క్షణాల్లో పోలీసులు మేమున్నామని భరోసా కల్పిస్తున్నారు. సహాయం కోసం కాల్ వచ్చిన 90 సెకన్లలోనే బాధితులకు అందుబాటులోకి వచ్చి వారిని ఆదుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి గత నవంబరు చివరి నాటికి డయల్–100కు మొత్తం 55,62,389 అత్యవసర ఫోన్లు వచ్చాయి. వాటిలో భౌతిక దాడులకు సంబంధించి 12,02,923, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 9,96,032, న్యూసెన్స్ 8,58,871, మహిళలపై దాడులు 6,49,109, ఆత్మహత్యలు 2,10,936, ఎన్నికలకు సంబంధించినవి 29,113, ఫోన్లు ఉన్నాయి. ఈ కాల్స్‌పై పోలీసులు సత్వరం స్పందించడమే కాకుండా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ అవసరమైన మార్పులు చేపడుతున్నారు. -
మానసిక ఒత్తిడిలో కరోనా బాధితులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బాధితుల్లో చాలామంది మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. భయం, ఆందోళన, ఒత్తిడి, నిరాశ వం టి లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ విషయం లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీనికి బాధితుల నుంచి పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తున్నాయి. గత ఆరున్నర నెలల్లో 67,780 ఫోన్ కాల్స్ దీనికి సంబంధించినవే ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు కరోనాకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక తయారు చేసింది. కోవిడ్‌తో బాధపడుతున్న రోగులకు మానసిక స్వస్థతను చేకూర్చడానికి టోల్ ఫ్రీ నంబర్ 1800–599–4455ను ఏర్పాటు చేసింది. బాధితులకు అవసరమైన మానసిక ప్రశాంతతను కల్పించడానికి అన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో సైకియాట్రిస్టులను అందుబాటులో ఉంచింది. ఇదిలావుండగా అన్ని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులలో 50 ఉచిత పార్థీవ వాహనాలను ఏర్పాటు చేశారు. మృతదేహాలను తరలించడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులపై 1,409 ఫిర్యాదులు కరోనా నేపథ్యంలో అనేక ప్రైవేట్ ఆస్పత్రులు పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్న సంగతి తెలిసిం దే. అధిక ఫీజులను నియంత్రించేందుకు, బాధితు ల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు ప్రభుత్వం ఒక వాట్సాప్ నంబర్‌ను ఏర్పాటు చేసింది. దీంతో ఆ నంబర్‌కు ఇప్పటివరకు 334 ప్రైవేట్ ఆస్పత్రుల నుండి 1,409 ఫిర్యాదులు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వాటిలో 1,261 పరిష్కరించగా, ఇంకా 148 పురోగతిలో ఉన్నాయి. ఫిర్యాదులు వచ్చిన వాటిలో 276 అధిక ఫీజులకు సంబంధించినవి కాగా, 154 పరిష్కరించినట్లు తెలిపింది. కోవిడ్ భద్రతా ప్రోటోకాల్స్, పారిశుధ్యం, బీమా కవరేజీ, ప్రైవేట్ లేబొరేటరీల్లో అదనపు ఫీజులు వంటి ఫిర్యాదులు కూడా వచ్చాయి. కరోనా పరీక్షల్లో ఐదు శాతం మందికి పాజిటివ్ రాష్ట్రంలో నిర్వహించిన కరోనా టెస్టుల్లో 5 శాతం మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మహారాష్ట్రలో 18 పాజిటివ్ రేటు ఉండగా, కర్ణాటకలో 10%, ఢిల్లీలో 8%, తమిళనాడులో 7% నమోదవుతున్నాయి. ఇక పాజిటివ్ కేసులు నమోదైన వాటిల్లో 0.47 శాతం మంది తెలంగాణలో మరణించినట్లు నివేదిక తెలిపింది. చేసిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో మహారాష్ట్రలో 2.42%, కర్ణాటకలో 1.33%, ఢిల్లీలో 1.22%, తమిళనాడులో 1.01% కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఇక కరోనా టెస్టులను మరింత పెంచేందుకు 300 సంచార కోవిడ్ టెస్టింగ్ లేబొరేటరీలను జిల్లాల్లో ఏర్పాటు చేశారు. అపోలో, బసవతారకం ఆస్పత్రులు కోవిడ్‌కు సంబంధించి ఉచిత చికిత్సలు చేసిన విషయాన్ని ప్రస్తావించింది. అపోలో ఆస్పత్రి అక్టోబర్ వరకు 2,073 మందికి కరోనా చికిత్స చేయగా, అందులో 219 మంది రోగులకు ఉచితంగా చికిత్స చేసినట్లు సర్కారు తెలిపింది. ఇక ప్రభుత్వ సెలవు దినాలు, ఆదివారాలు, పండుగ రోజుల్లో కరోనా నిర్దారణ పరీక్షలు తగ్గుతున్నాయని ఎక్కువ మంది ప్రజలు కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం వెచ్చించడం వల్లే టెస్టులకు రావడంలేదని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వివిధ నెలల్లో మానసిక ఆరోగ్యంపై వచ్చిన ఫోన్ కాల్స్ జూన్ : 2,963 జూలై : 23,716 ఆగస్టు : 14,393 సెప్టెంబర్ : 14,587 అక్టోబర్ : 8,316 నవంబర్ : 3,805 -
తరచూ ఫోన్ చేసి భార్యను వేధిస్తున్నాడని..
సాక్షి, విజయవాడ : విజయవాడలోని పటమట స్టెల్లా కాలేజీ సమీపంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. తన భార్యకు ఫోన్ చేసి తరచుగా వేధిస్తున్న వ్యక్తిని భర్త కత్తితో పొడిచాడు. వివరాలు.. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఒక మహిళకు పిచ్చయ్య అనే వ్యక్తి తరచూ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో ఆ మహిళ తన భర్త సిద్దుల రవిపాల్‌కు విషయాన్ని తెలిపింది. రవిపాల్ తన భార్యతో పిచ్చయ్యకు ఫోన్ చేయించి ఇంటికి పిలిపించాడు. అనంతరం రవిపాల్ కత్తితో పిచ్చయను పలుమార్లు పొడవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పిచ్చయ్యను ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. కాగా దాడికి పాల్పడ్డ రవిపాల్‌పై కేసు నమోదు చేసిన పటమట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. (చదవండి : ప్రేమ వ్యవహారం: ప్రణయ్ దారుణ హత్య) -
ఆ నెంబర్‌కు సుశాంత్ అభిమానుల ఫోన్‌కాల్స్
ఇండోర్: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువనికి కొద్ది రోజులుగా విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి. క్షణం విడిచిపెట్టకుండా ఒకరు విడిచి మరొకరు పోన్లు చేస్తూనే ఉన్నారు. చేసిన ప్రతీ ఒక్కరికీ ఇది రాంగ్ నంబర్ అని చెప్పలేక అతను విసిగిపోయాడు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. ఇంతకీ.. అతనికి వస్తున్న ప్రతీ కాల్ కూడా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసమే కావడం గమనార్హం. బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ జూన్ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణవార్త దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలో సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే పేరు మీద ఎవరో గుర్తు తెలియన వ్యక్తులు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు. (‘గత నెల సుశాంత్ 50 సిమ్‌లు మార్చాడు’) అందులో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ కూలీ నెంబర్‌ను పొందుపరిచారు. ఇది నిజమైన అకౌంట్ అని నమ్మిన ఎంతో మంది సుశాంత్ అభిమానులు నిత్యం అతనికి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అయితే కొందరు రాంగ్ నంబర్ అని తెలియగానే కట్ చేసినప్పటికీ మరికొందరు మాత్రం సుశాంత్ ఆత్మహత్య తమను కుంగదీసిందంటూ అతని దగ్గర గోడు వెల్లబోసుకుంటున్నారు. ఒకటీ, రెండు అయితే సర్ది చెప్పవచ్చు కానీ ఫోన్లు చేసేవారి సంఖ్య వందలు, వేలు దాటేసరికి అతని నెత్తి బొప్పికట్టింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు.. నటి అంకిత లోఖండే పేరు మీద నకిలీ అకౌంట్ క్రియేట్ చేశారని, అందులో సదరు బాధితుడి నంబర్ పొందరుపర్చారని గుర్తించారు. ఈ ఫేక్ అకౌంట్‌ను 40 వేల మంది ఫాలో అవుతున్నట్లు వెల్లడించారు. ఇక ఆ అకౌంట్‌ను నడుపుతున్న వ్యక్తిని పట్టుకునే పనిలో ఉన్నారు. (ఐ వాన్న అన్‌ఫాలో యు) -
పలువురు నేతలకు ప్రధాని ఫోన్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులతో ఫోన్లో మాట్లాడారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తలెత్తిన పరిస్థితులపై వారితో చర్చించారు. ఆదివారం ప్రధాని మోదీ.. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్‌ముఖర్జీ, ప్రతిభా పాటిల్, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవెగౌడలతో కూడా ఫోన్లో సంభాషించారు. ఇంకా.. సమాజ్‌వాదీ పార్టీ అగ్ర నేతలు అఖిలేశ్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్‌తోనూ మాట్లాడారు. పార్లమెంట్లో వివిధ పక్షాల నేతలతో ప్రధాని మోదీ ఈనెల 8వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
నటికి హత్యా బెదిరింపులు
పెరంబూరు: హత్యాబెదిరింపులపై నటి మీరామిథున్ చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వివరాలు చూస్తే 8 తోట్టాగళ్, తానా సేర్నద కూట్టం చిత్రాల్లో నటించిన నటి మీరామిథున్. ఈమె గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో స్థానిక వెప్పేరిలోని పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అంతకుముందు మీడియాతో మీరామిథున్ మాట్లాడుతూ తాను ఎంతో పారాడి మిస్ సౌత్ఇండియన్ కిరీటాన్ని గెలుచుకున్నానని చెప్పింది. అలా అందాల పోటీల్లో పాల్గొని కిరీటం గెలుచుకోవడం సులభమైన విషయం కాదంది. 15 ఏళ్లగా జరుగుతున్న మిస్ సౌత్ఇండియన్ పోటీల్లో తొలిసారిగా కిరీటం గెలుచుకున్న మహిళను తానేనని చెప్పింది. తన మాదిరి తమిళ యువతులు కష్టపడరాదన్న తలంపుతో తానే అందాల పోటీలను నిర్వహించడానికి సిద్ధం అయ్యానని చెప్పింది. మిస్ తమిళ్ దివా పేరుతో సోమవారం ఈ అందాల పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పింది. ఈ పోటీలను నిర్వహించకూడదంటూ ఇతర రాష్ట్రాల నుంచి తనకు పలు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని చెప్పింది. ఈ పోటీల్లో పాల్గొనే మహిళలకు బెదిరింపు పోన్లు వస్తున్నాయని తెలిపింది. ఆరు నెలలుగా తాను వస్తున్న ఇలాంటి ఫోన్లను పక్కన పెడుతూ వచ్చానని, వారం రోజులుగా తనకు హత్యాబెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పింది. దీంతో ఈ రోజు పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వచ్చానని తెలిపింది. తాను నిర్వహించనున్న అందాల పోటీలకు పోలీసులు భద్రత కల్పిస్తారనే నమ్మకం ఉందని నటి మీరామిథున్ పేర్కొంది. మీరామిథున్ బాలీవుడ్ గాయకుడి పేరుతో మోసం పెరంబూరు: మోసపోయేవాళ్లు ఉన్నంత వరకూ మోసగాళ్లు పెరుగుతూనే ఉంటారు. ఏ విషయంలోనైనా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. లేకుంటే ఈ విధంగా మోసపోతుంటారు. కోవై, ఉళుందూర్‌కు చెందిన మహేంద్రవర్మన్ అనే బీఎడ్ పట్టభద్రుడు బాలీవుడ్ ప్రముఖ గాయకుడు అర్మాన్మాలిక్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ను రూపొందించి యువతులను బెదిరించి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించాడు. హింది గాయకుడి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ను ప్రారంభించి తద్వారా యువతులను ఆకర్షించాడు. ఆ తరువాత వారితో స్నేహం చేసి ట్విట్టర్ ద్వారా వారి ఆంతరంగిక ఫొటోలను రాబట్టుకున్నాడు. ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తానని బెదిరించి వారి నుంచి డబ్బు గుంజుతున్నాడు. ఈ విధంగా 15 మంది వద్ద రూ.50 లక్షల వరకు దోచుకున్నాడు. అతని బాధితురాలైన కోవైకు చెందిన ఒక యువతి ధైర్యం చేసి కోవై నేర పరిశోధనా శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ యమున, సబ్ఇన్స్పెక్టర్ అరుణ్ నిందితుడిని పట్టుకునేందుకు పకడ్బందీగా పథకం రూపొందించారు. ఫిర్యాదు చేసిన యువతిని మహేంద్రవర్మన్‌తో మాట్లాడించి డబ్బు ఇస్తానని ఒక చోటుకు రావలసిందిగా చెప్పించారు. బుధవారం అతను ఆ యువతి చెప్పిన ప్రాంతానికి రాగా అక్కడ దాగిఉన్న పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. విచారణలో మహేంద్రవర్మన్ గత ఏదాడిన్నరగా మహిళలను ఇలాంటి బెదిరింపులకు గురి చేస్తూ డబ్బు గుంజుతున్నట్లు తెలిసింది. దీంతో అతనిపై నమోదు చేసి విచారిస్తున్నారు. -
ప్రతిపక్ష నేతల కాల్స్ ట్యాపింగ్
-
ప్రేయసి కోసం హుబ్లీ విమానాశ్రయానికి ఫోన్లు
కర్ణాటక , బొమ్మనహళ్లి : తాను ప్రేమించిన యువతి కోసం ఏడాదిన్నర కాలంగా హుబ్లీ విమానాశ్రయానికి ఫోన్లు చేస్తున్న ప్రేమికుడు ఎవరనే విషయాన్ని అధికారులు గుర్తించారు. వివరాలు..గోవాకు చెందిన రాయ్ డయాన్ అనే వ్యక్తి గోవా విమానాశ్రమలో పనిచేసే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న యువతిని ప్రేమించాడు. ఆ యువతికి హుబ్లీకి బదిలీ కాగా ఆమె ప్రేమ విషయాన్ని మరచిపోయింది. తర్వాత రాయ్ దుబాయ్ వెళ్లారు. అయితే ఆ యువతికి రోజూ ఫోన్లు చేసేవాడు. దాంతో యువతి తాను వాడుతున్న మొబైల్ నంబర్ మార్చింది. ఆందోళనకు గురైన రాయ్ హుబ్లి ఏటీసీ నంబర్ తెలుసుకొని రోజూ ఫోన్ చేసి యువతికి ఫోన్ ఇవ్వాలని వేధించేవాడు. ఏటీసీ కేంద్రానికి సామాన్యంగా బయట నుంచి ఎలాంటి ఫోన్లు రావు. కేవలం పైలెట్ విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో మాత్రమే ఈ ఫోన్‌కు అనుమతి లభిస్తుంది. అయితే రాయ్ డయాన్ మాత్రం ఏటీసీ ఫోన్ నంబర్ తెలుసుకొని నిత్యం ఫోన్లు చేసేవాడు. విమానాలు ఎగురుతున్న సమయంలో కూడా ఈ నంబర్‌కు ఫోన్ చేసి తన ప్రేయసికి ఇవ్వాలని వేధించే వాడు. దీంతో సిబ్బంది ఇబ్బందులు పడేవారు. ఇలా ఫోన్ చేస్తున్న వ్యక్తి ఎవరనే విషయంపై అధికారులు ఆరా తీయగా రాయ్ డయాన్గా తేలిందని డీసీపీ రవీంద్ర తెలిపారు. -
ఫోన్ పాలి‘ట్రిక్స్’!
మీ మాటే మీ ఓటును ఉరి తీయవచ్చు. మీ అభిప్రాయమే మీ హక్కులకు దిక్కు లేకుండా చేసేయొచ్చు. టీడీపీ ఆడుతున్న పొలిటికల్ గేమ్‌లో సామాన్యుడే సమిధగా మారుతున్నాడు. జనాభిప్రాయం తెలుసుకుంటామనే నెపంతో అధికారికంగా వారు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను గుర్తిస్తున్నారు. గుర్తించిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి నిస్సిగ్గుగా తొలగిస్తున్నారు. సాంకేతిక సాయంతో జరుగుతున్న ఈ రాజ్యాంగ పరిహాస ప్రక్రియ ప్రజాస్వామ్యవాదులను విస్మయపరుస్తోంది. జిల్లాలో ఇదే తరహాలో వేలకొద్దీ ఓట్లను తొలగించారు. ఇంకా తొలగిస్తున్నారు.. శ్రీకాకుళం పాతబస్టాండ్: ‘మన గీత పెద్దగా ఉండాలంటే.. పక్క వాడి గీత చిన్నది చేసెయ్యాలి..’ అధికార టీడీపీ అనుసరిస్తున్న కొత్త మంత్రమిది. ఓటు బ్యాంకును పెంచుకునే మార్గాలు వెతక్కుండా.. విపక్షాల ఓటుబ్యాంకును నిర్వీర్యం చేయడానికి అధికార పార్టీ నేతలు క్షుద్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే అభిప్రాయాలు తెలుసుకునే ఫోన్‌కాల్. చంద్రబాబు పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌లో ఏ మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పినా ఇక ఆ వ్యక్తి ఓటుకు కాలం చెల్లినట్టే. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు అనుసరిస్తున్న ఈ పద్ధతులు చూసి ప్రజాస్వామ్యవాదులు ఆశ్చర్యపోతున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని పరిహరిస్తూ నిస్సిగ్గుగా ఓటు హక్కును తొలగించేస్తున్న విధానాలు చూసి సామాన్యులు బిత్తరపోతున్నారు. వ్యతిరేకత తెలుసుకుంటూ.. జనాల్లో అధికార పార్టీపై రోజురోజుకూవ్యతిరేకత పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యతిరేకతను తెలుసుకుంటూ ఓట్లను తొలగించేందుకు టీడీపీ నాయకులు కొత్త విధానాలు తీసుకువచ్చారు. గ్రామాల్లో వారికి అనుకూలంగా ఉన్న వారు, లేని వారిని గుర్తించి, వారికి అనుకూలంగా లేని వారి ఓట్లను తొలగించడానికి ఏకంగా ప్రత్యేక టీమ్‌లు గ్రామాల్లో తిరుగుతున్నాయి. కొత్త ఓట్లు చేర్పించడం, తమకు వ్యతిరేకమైన ఓట్లను తొలగించడం వంటి పనులు వీరు చేస్తున్నారు. అక్కడక్కడా ఒకరికే రెండుమూడు ఓట్లు ఉండడం కూడా వీరి చేతివాటమే. ఫోన్‌కాల్‌తో.. ప్రభుత్వ ప్రతినిధులు మనతో మాట్లాడుతున్నట్లు ఒక ఫోన్‌కాల్ సెల్‌ఫోన్‌కు వస్తుంది. అక్కడ ప్రభుత్వం పనితీరుపై కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఒకటి, రెండు టైప్ చేయాలని సూచిస్తున్నారు. ఇలా ఎవరైనా పనితీరు బాగోలేదని సమాధానం చెబితే కారణాలు, వారి వివరాలు అడిగి వారి ఓటు, కుటుంబ సభ్యుల ఓటును నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. ఒకవేళ మాజీ ప్రజాప్రతినిధులకు ఫోన్ వెళితే వారు ఇక ఓటు గురించి మర్చిపోవాల్సిందే. గత మార్చిలో జరిగిన సమ్మరీలో జిల్లాలో సుమారుగా 33,957 ఓట్లను తొలగించారు. వారికి ఈ సమ్మరీలో ఓటు హక్కును కల్పించాల్సింది. కానీ వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వచ్చే దారి కనిపించడం లేదు. ఇదంతా ఈ ప్రత్యేక టీమ్‌లు చేసిన పనే. ఈ పూర్తి జాబితా 2019 జనవరి 4 వతేదీ వరకు విడుదల చేసే అవకాశం ఉండదు. ఆ తర్వాత కొత్త ఓట్లను అవకాశం ఉండదు. దీంతో ప్రతిపక్షం వారి ఓట్లను తొలగించడం ఈజీ అవుతుందని టీడీపీ వారు ఈ ప్లాన్ వేశారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. బలమైన చోట మరీనూ.. సాధారణంగా ఓటు బ్యాంకు పెంచుకునేందుకు సంక్షేమ కార్యక్రమాలు, రాయితీలు, ప్రత్యేక పథకాలు ప్రవేశపెడతారు. కానీ అవేవీ చేయకుండా తమకు బలం ఉన్న చోట అధికార పార్టీ నేతలు డబుల్ ఓట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా చాలాచోట్ల మరణించిన వారి పేర్లను కూడా ఓటరు జాబితాలో కొనసాగిస్తున్నారు. తమకు అనుకూలమైన చోట్ల సహేతుకమైన కారణాలు చూపకుండానే ప్రతిపక్ష పార్టీ ఓట్లను తొలగిస్తున్నారు. బోగస్ ఓట్లపై దృష్టి జిల్లాలో ఎక్కువగా బోగస్ ఓట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఈ సారి సమ్మరీలో కూడా పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల నమోదుకు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. సుమారుగా 77 వేల కొత్త దరఖాస్తుల్లో డబుల్ ఓట్లు, అధికార పార్టీ చొరవతో అడ్డంగా కుక్కిన ఓట్లు 20వేలకు పైగా ఉంటాయని అంచనా. -
ఒకటి నొక్కితే సరే.. రెండు నొక్కితే ఇక అంతే సంగతులు
విశాఖసిటీ: అక్కయ్యపాలెంలో ఉంటున్న రమేష్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మాట్లాడుతున్నానని, ప్రభుత్వ పనితీరు సంతృప్తిగా ఉందా? అంటూ అడిగారు. సంతృప్తిగా ఉంటే 1, లేకుంటే 2 నొక్కాలని అన్నారు. సదరు వ్యక్తి 2 నొక్కారంతే. ఆ రోజంతా ఎందుకు? ఏమిటి? ఎలా? అంటూ సిబ్బంది విసిగించారు. చేసేది లేక ఆయన ఆ రోజు నుంచి ఇలాంటి ఫోన్ కాల్ ఏదైనా వస్తే చాలు 1 నొక్కేస్తున్నారు. ఎంవీపీ కాలనీలోని శ్రీనివాస్‌కు ఇదే తరహా కాల్ వచ్చింది. పౌర సరఫరాల శాఖ పనితీరు ఎలా ఉందని అడిగారు. అయితే.. తనకు రేషన్ కార్డు లేకపోవడంతో.. ఆ ఆప్షన్ ఫోన్లో లేక.. సంతృప్తిగాలేదంటూ 2 బటన్ ప్రెస్ చేశారు. అంతే.. ఇక ఫోన్ మీద ఫోన్. కార్డు లేదని చెప్పినా.. కాల్స్ వచ్చాయి. చేసేది లేక అంతా బాగుందని చెప్పే?శాడు’. పై రెండు విషయాల్ని గమనిస్తే... ప్రభుత్వం పాలన కంటే ప్రచారానికే ప్రాధాన్యమిస్తోందని అర్థమవుతోంది. ఇప్పటికే చంద్రబాబు సర్కారుకు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ప్రభుత్వం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలతో మాట్లాడి నాడి తెలుసుకునేందుకు ఆర్టీజీఎస్ ద్వారా వస్తున్న ఫోన్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఫోన్ కాల్స్ వచ్చిన తర్వాత సంతృప్తిగా ఉన్నామన్న అభిప్రాయం వెలుబుచ్చితే గానీ వదలడం లేదు. దీనికే జబ్బలు చరుచుకుంటున్న ప్రభుత్వం.. ప్రజలు తమ పాలనపై సంతృప్తిగా ఉన్నారంటూ బీరాలు పలుకుతోంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించినప్పుడే ఆ ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నట్లు. కానీ.. ఇదేమీ కనిపించకుండా.. అభివృద్ధికి బదులు అథోగతి పాలవుతున్నప్పుడు సర్కారుపై ఎవరికైనా సంతృప్తి ఎలా కలుగుతుంది.? కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సాధ్యమైపోతోంది. కారణం.. చంద్రబాబు ప్రభుత్వ తొండి టెక్నాలజీ. టెక్నాలజీని తానే కనిపెట్టానంటూ ప్రతి సభలోనూ చెప్పుకొస్తున్న చంద్రబాబు.. ఆ కుతంత్ర టెక్నాలజీని ప్రజలపై రుద్దుతూ విసిగిస్తున్నారు. ఆయన పాలనపై సంతృప్తిగా ఉన్నామంటూ చెప్పేదాక ఫోన్‌కాల్స్‌తో వెంటపడుతున్నారు. ఫోన్ మీద ఫోన్లు ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు సమస్య కాదు ఇది. జిల్లాలో అనేక మంది ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ఇంతకు ముందు ప్రభుత్వాలు పథకాలు అమలు చేయడం, వాటిని అర్హులకు అందేటట్లు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించడం తెలుసు. ఈసారి ప్రభుత్వం ప్రచారం చేసుకునేందుకు ప్రజలకు రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ద్వారా ఫోన్లు చేసి ప్రజలతో మాట్లాడుతున్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాయిస్‌తో వస్తున్న ఫోన్ సంతృప్తిగా ఉన్నారా? ఉంటే 1 నొక్కాలని, లేదంటే 2 నొక్కాలని అడుగుతున్నారు. ఇలా జిల్లాలో రోజూ ప్రభుత్వ పనితీరుపై, ప్రభుత్వ పథకాలు అమలుపై వేలాది మందికి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అయితే, ఇందులో అనేక మంది 1 నొక్కుతుండడం విశేషం. పొరపాటున రెండు నొక్కితే మాత్రం ఇక అంతే సంగతులు.. 2 నొక్కితే అంతే... సర్కారు తలనొప్పి భరించలేకే అందరూ 1 బటన్ ప్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే దీనివెనుక పెద్ద కథ ఉంది. పొరపాటున 2 నొక్కితే ఆ రోజుంతా పని చేయనవసరం లేదు. ఆర్టీజీఎస్ సిబ్బంది ఫోన్లమీద ఫోన్లు చేసి ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? కారణం ఏమిటి? అంటూ అనేక ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారు. పైగా కొందరిని వారికి సంబంధం లేని అంశాలపై కూడా అభిప్రాయాలు కోరుతున్నారు. రేషన్ కార్డు లేనివారిని, పింఛన్లు అందుకోని వారిని, ఆ పథకాలతో సంబంధం లేని వారికి కూడా కాల్స్ చేసి వాటిపై అభిప్రాయం కోరుతున్నారు. తెలియకపోవడంతో కొందరు ఫోన్ కాల్స్‌ను చేస్తున్నారు. అయినా, మళ్లీమళ్లీ ఫోన్ చేసి విసిగిస్తున్నారు. దీంతో అభిప్రాయం కోరగానే 2 నొక్కితే తర్వాత పదేపదే కాల్స్ వస్తున్నాయి. దీంతో చేసేది లేక 1 నొక్కేస్తున్నారు. 1 నొక్కితే ఏ సమస్య ఉండదని, తర్వాత మరేమీ అడగరని, అందుకే అలా చేస్తున్నామని అనేక మంది బహిరంగంగా చెబుతున్నారు. పైగా 2 నొక్కితే తర్వాత కాల్ చేసి లైనులోకి వచ్చేవారు ఆధార్ కార్డు, ఊరు, పేరు, ఇతర ఇబ్బందికర వివరాలు అడగడంతో 1 బెటర్ అన్న భావనలో ఇష్టం ఉన్నా లేకున్నా చేస్తున్నామని పలువురు అభిప్రాయపడుతుండడం గమనార్హం. జిల్లా అధికార యంత్రాంగానికి ఈ విషయం తెలుసు. అనేక మంది అధికారులు వద్ద ఈ చర్చ నిత్యం జరుగుతూనే ఉంది. అయినా, ఎవరూ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడం లేదు. తీసుకెళ్లినా ప్రభుత్వంతో ఇబ్బంది ఎందుకంటూ మౌనంగా ఉంటున్నారు. సంతృప్తిపై సర్కారు గొప్పలు ప్రజలకు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి లేకపోయినా, ఇష్టం లేకపోయినా, పథకాలు అందకపోయినా ఇబ్బంది పడలేక 1 నొక్కితే ప్రభుత్వం అదే తమ పాలన ఘనత అంటూ ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రితో పాటు అనేక మంది అధికారపార్టీ నేతలు తమ ప్రభుత్వంపై 70 నుంచి 80 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటూ చెబుతుండగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాన్ని గమనిస్తున్న ప్రజలు మాత్రం అచ్చెరువొందుతున్నారు. అదే సంతృప్తి అనుకుంటే ప్రతిపక్షానికి మంచిదంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అర్థం చేసుకోపోయినా ఫర్వాలేదు గానీ, ప్రజలను విసిగించకుండా ఉంటే మంచిదని పలువురు కోరుతున్నారు. కట్ చేసినా కాల్ వస్తోంది షాప్‌లో బిజీగా ఉన్న సమయంలో ఫోన్ కాల్ వస్తోంది. కట్ చేస్తున్నా మళ్లీ మళ్లీ కాల్ వస్తోంది. ఏదో ఇంపార్టెంట్ అని చూస్తే.. ఆర్టీజీఎస్ కాల్. మా ఇంట్లో ఫోన్‌కి పొరపాటున 2 నొక్కాను. అంతే.. ఆ రోజు దాదాపు 8 నుంచి 10 కాల్స్ వరకూ వచ్చాయి. అందుకే.. ముందు జాగ్రత్తగా ఒకటి బటన్ ప్రెస్ చేసేశాను. – వేణుగోపాల్, వ్యాపారి, లలితానగర్ -
ఫోన్ వచ్చిందో ఒకటి నొక్కేయాల్సిందే...!
గంట్యాడ మండలానికి చెందిన బి.శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మాట్లాడుతున్నానని, ప్రభుత్వ పనితీరు సంతృప్తిగా ఉందా? అంటూ అడిగారు. సంతృప్తిగా ఉంటే 1, లేకుంటే 2 నొక్కాలని అన్నారు. సదరు వ్యక్తి 2 నొక్కారంతే పొద్దంతా ఎందుకు? ఏమిటి? ఎలా? అంటూ సిబ్బంది విసిగించారు. చేసేది లేక ఆయన అక్కడ నుంచి ఫోన్ వస్తే చాలు 1 నొక్కేస్తున్నారు. ‘ విజయనగరం పట్టణంలో ఉన్న సింహాచలం అనే వ్యక్తికి అదేవిధంగా కాల్ వచ్చింది. పౌరసరఫరాలశాఖ పనితీరు ఎలా ఉందని అడిగారు. సంతృప్తిగా లేదన్నందుకు పదేపదే ఫోన్లు వచ్చాయి. చేసేది లేక అంతా బాగుందని చెప్పేశాడు’. విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వం పాలనకంటే ప్రచారానికే ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలో ప్రజలతో మాట్లాడి నాడి తెలుసుకునేందుకు ఆర్టీజీఎస్ ద్వారా వస్తున్న ఫోన్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఫోన్ వచ్చిన తర్వాత సంతృప్తిగా ఉన్నామన్న అభిప్రాయం వెలుబుచ్చితే గానీ వదలడం లేదు. దీంతో ఇదెందుకు వచ్చిన సంతృప్తి అంటూ ప్రజలు నిట్టూర్చుతున్నారు. అందరిదీ అదే పరిస్థితి.. ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు సమస్య కాదు ఇది. జిల్లాలో అనేక మంది ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు ప్రభుత్వాలు పథకాలు అమలు చేయడం, వాటిని అర్హులకు అందేటట్లు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించడం తెలుసు. ఈసారి ప్రభుత్వం ప్రచారం చేసుకునేందుకు ప్రజలకు రియల్‌టైం గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ద్వారా ఫోన్లు చేసి ప్రజలతో మాట్లాడుతున్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాయిస్‌తో వస్తున్న ఫోన్ సంతృప్తిగా ఉన్నారా? ఉంటే 1 నొక్కాలని, లేదంటే 2 నొక్కాలని అడుగుతున్నారు. ఇలా జిల్లాలో రోజూ ప్రభుత్వ పనితీరుపై, ప్రభుత్వ పథకాలు అమలుపై వేలాది మందికి ఫోన్లు వస్తున్నాయి. అయితే, ఇందులో అనేక మంది 1 నొక్కుతుండడం విశేషం. 2 నొక్కితే ఇబ్బందే.. దీనివెనుక పెద్ద కథ ఉంది. పొరపాటున 2 నొక్కితే ఆ రోజుంతా పని చేయనవసరం లేదు. అక్కడ సిబ్బంది ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? కారణం ఏమిటి? అంటూ అనేక ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారు. పైగా కొందరిని వారికి సంబంధం లేని అంశాలపై కూడా అభిప్రాయాలు కోరుతున్నారు. రేషన్‌కార్డు లేనివారిని, పెన్షన్ అందుకోని వారిని, ఆ పథకాలతో సంబంధం లేని వారికి కూడా ఫోన్ చేసి వాటిపై అభిప్రాయం కోరుతున్నారు. తెలియకపోవడంతో కొందరు ఫోన్ కట్ చేస్తున్నారు. అయినా, మళ్లీమళ్లీ ఫోన్ చేసి విసిగిస్తున్నారు. దీంతో అభిప్రాయం కోరగానే 2 నొక్కితే తర్వాత పదేపదే ఫోన్లు వస్తున్నాయి. దీంతో చేసేది లేక 1 నొక్కేస్తున్నారు. 1 నొక్కితే ఏ సమస్య ఉండదని, తర్వాత మరేమీ అడగరని, అందుకే అలా చేస్తున్నామని అనేక మంది బహిరంగంగా చెబుతున్నారు. పైగా 2 నొక్కితే తర్వాత ఫోన్ లైనులోకి వచ్చేవారు ఆధార్ కార్డు, ఊరు, పేరు, ఇతర ఇబ్బందికర వివరాలు అడగడంతో 1 బెటర్ అన్న భావనలో ఇష్టం ఉన్నా లేకున్నా చేస్తున్నామని పలువురు అభిప్రాయపడుతుండడం గమనార్హం. జిల్లా అధికార యంత్రాంగానికి ఈ విషయం తెలుసు. అనేక మంది అధికారులు వద్ద ఈ చర్చ నిత్యం జరుగుతూనే ఉంది. అయినా, ఎవరూ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడం లేదు. తీసుకెళ్లినా ప్రభుత్వంతో ఇబ్బంది దేనికని మౌనంగా ఉంటున్నారు. సంతృప్తిగా ఉన్నారంటూ ప్రభుత్వం ప్రచారం ప్రజలకు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి లేకపోయినా, ఇష్టం లేకపోయినా, పథకాలు అందకపోయినా ఇబ్బంది పడలేక 1 నొక్కితే ప్రభుత్వం అదే తమ పాలన ఘనత అంటూ ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రితో పాటు అనేక మంది అధికారపార్టీ నేతలు తమ ప్రభుత్వంపై 70, 80 శాతం సంతృప్తిగా ఉన్నారంటూ చెబుతుండగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాన్ని గమనిస్తున్న ప్రజలు మాత్రం నవ్వుకుంటున్నారు. అదే సంతృప్తి అనుకుంటే ప్రతిపక్షానికి మంచిదంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అర్ధం చేసుకోపోయినా ఫర్వాలేదు గానీ, ప్రజలను విసిగించకుండా ఉంటే మంచిదని పలువురు కోరుతున్నారు. -
ప్రాణం తీసిన ఫోన్ కాల్
చిత్తూరు, పెద్దమండ్యం: పరారీలో ఉన్న జంట చేసిన ఫోన్‌కాల్ ఓ తాత్కాలిక ఉద్యోగి ప్రాణం తీసింది. ప్రియుడితో వెళ్లిన మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ పేరుతో తాత్కాలిక ఉద్యోగిని స్టేషన్‌కు పిలిపించారు. దీన్ని అవమానంగా బావించిన అతను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు అనంతపురం జిల్లా 3 వపట్టణ ఎస్ఐ కారణమని సూసైడ్ నోట్ రాశాడు. పోలీసులు, మృతుడు రాసిన సూసైడ్ నోట్లోని వివరాల ప్రకారం.. పెద్దమండ్యం మండలంలోని శివపురం కస్పాకు చెందిన లక్కం రెడ్డిమల్రెడ్డి కొడుకు లక్కం నాగిరెడ్డి అనంతపురం జిల్లా ఎన్పీకుంట బీసీ హాస్టల్లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన గతంలో గాండ్లపెంట, నల్లచెరువు, గుత్తిమండలం ఇసురాళ్లపల్లె, నల్లమాడ మండలాల్లోనూ పనిచేశాడు. 12 ఏళ్ల క్రితం ఇసురాళ్లపల్లె బీసీ హాస్టల్లో పనిచేస్తున్న సమయంలో అక్కడ చదువుకున్న విద్యార్థులకు తన ఫోన్ నెంబరు ఇచ్చాడు. ఇటీవల అదే ప్రాంతానికి చెందిన వివాహిత తన ప్రియుడితో కలిసి పారిపోయింది. మహిళ భర్త అనంతపురం 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న వారి సెల్ వివరాలను సేకరించారు. వారు బీసీ హాస్టల్ అటెండర్ లక్కం నాగిరెడ్డి సెల్‌కు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నాగిరెడ్డిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. నాగిరెడ్డి సోమవారం సాయంత్రం స్వగ్రామమైన శివపురం వచ్చాడు. తన తప్పు లేకపోయినా పోలీసులు విచారించడాన్ని అవమానంగా భావించాడు. తీవ్ర మనస్తాపం చెంది గ్రామ సమీపంలో చింతచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహితులైన జంట పరారీలో తనకు సంబంధం లేకపోయినా అనంతపురం 3వ పట్టణ ఎస్ఐ వేధించాడని పేర్కొంటూ సూసైడ్ నోట్ రాశాడు. సంఘటనా స్థలాన్ని పెద్దమండ్యం ఎస్ఐ శంకరమల్లయ్య పరిశీలించారు. మృతుడు రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నాగిరెడ్డి అనంతపురం జిల్లా వెనుకబడిన తరగతుల హాస్టల్ దినసరి వేతన ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. మృతునికి భార్య శివకుమారి, కుమారులు భార్గవకుమార్‌రెడ్డి (23), రెడ్డిశేఖరరెడ్డి (20) ఉన్నారు. భార్య శివకుమారి శివపురం అంగన్వాడీ కేంద్రం కార్యకర్తగా పనిచేస్తోంది. -
మోదీ అంటే లవ్వే లేదా?
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ దేశాల అధినేతలతో కారాలు మిరియాలు నూరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన వైఖరి మార్చుకోవటం చర్చనీయాంశంగా మారుతోంది. మొన్నీమధ్యే కిమ్ జంగ్ ఉన్‌తో.. ఆ తర్వాత ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరుపుతుండటం చూస్తున్నాం. ఈ క్రమంలో వివిధ దేశాల అధినేతల మధ్య సత్సంబంధాలు, వాళ్ల ఫోన్‌కాల్స్ సంభాషణల గురించి ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. రూటర్స్ డేటా ప్రకారం... జనవరి 2017లో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జూలై 6 2018 దాకా మొత్తం 40 మంది దేశాధినేతలకు ఫోన్ కాల్స్ చేశారు. వాటి సంఖ్య సుమారు 200 పైమాటే. అదే సమయంలో పుతిన్.. 50 మంది అధినేతలకు 190 దాకా కాల్స్ చేశారు. ట్రంప్ కాల్స్‌లో ఎక్కువగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రోన్(25)కు గరిష్ఠంగా ఉండగా.. బ్రిటన్ ప్రధాని థెరిసా మే తర్వాతి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత జపాన్ ప్రధాని షింజో అబే, సౌత్ కొరియా అధ్యక్షుడు మూన్, సౌదీ రాజు సల్మాన్‌లు ఉన్నారు. మరోవైపు పుతిన్ ఫోన్ కాల్స్‌లో టర్కీ అధ్యక్షుడిగా రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్(27 కాల్స్), నజర్బయెవ్(కజకిస్థాన్), మాక్రోన్(ఫ్రాన్స్), మెర్కల్(జర్మనీ), నెతన్యాహు(ఇజ్రాయెల్) తదితరులు ఉన్నారు. మోదీ సంగతేంటి... ట్రంప్-పుతిన్.. ఇద్దరితోనూ కలుపుగోలుగా ఉండే భారత ప్రధాని నరేంద్ర మోదీ. పలు పర్యటనల్లో ఈ విషయం రుజువు చేసే విధంగా వాళ్లిద్దరూ మోదీతో మెదిలారు కూడా. అలాంటిది ఇద్దరి లిస్ట్‌లో కూడా మోదీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావటం గమనార్హం. పరస్పర సంబంధాల విషయంలో కాకపోయినా.. కనీసం కలుపుగోలుగా కూడా ఎక్కువగా వీళ్ల మధ్య ఎక్కువగా సంభాషణ లేకపోవటం గమనార్హం అంటూ ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. దీంతో అగ్రరాజ్యాల అధినేతల ప్రయారిటీ లిస్ట్‌లో మన ప్రధానిపై లేరంటూ సెటైర్ల పర్వం కురుస్తోంది. A #hilarious #trailer to a new #blockbuster #movie coming soon. #emmanuelle #starring @realdonaldtrump and his new found #buddy @emmanuelmacron - likely to dominate the #screens 😂😂😂 its 3 clips. A post shared by Lalit Modi (@lalitkmodi) on Jul 16, 2018 at 10:00pm PDT కొసమెరుపు.. ట్రంప్-పుతిన్‌లు అత్యధిక కాల్స్ చేసిన మాక్రోన్, ఎర్డోగన్లను ఉద్దేశిస్తూ.. సోషల్ మీడియాలో కొందరు ‘లవ్’ పోస్టులను పెడుతూ వైరల్ చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో మళ్లీ ‘+92’ కాల్స్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో ‘+92’ ఫోన్ కాల్స్ బెడద మళ్లీ మొదలైంది. నాలుగేళ్ల క్రితం వరకు రెచ్చిపోయిన ఈ సైబర్ నేరగాళ్లు ఆపై సద్దుమణిగారు. తాజాగా గోల్కొండ ప్రాంతానికి చెందిన మహిళకు రూ. 2.25 లక్షల టోకరా వేశారు. బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో మంగళవారం కేసు నమోదైంది. పాకిస్థాన్ కేంద్రంగా సాగుతున్నట్లు అనుమానిస్తున్న ఈ హైటెక్ వ్యవహారంలో అక్కడి వారు దుబాయ్‌తో పాటు భారత్‌లోనూ ముఠా సభ్యులను ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మొదటి అంచెలో భారత్ నుంచి వెళ్లి లేదా భారత్‌లో బంధువులు కలిగిన దుబాయ్‌లో ఉంటున్న వారు ఉంటున్నారు. వీరి ద్వారా ఇక్కడ ఉన్న వారి బంధువులను సంప్రదించి లోకల్ ముఠాలను ఏర్పాటు చేస్తున్నారు. దుబాయ్‌లో ఉన్న వారు ప్రాథమికంగా భారత్‌కు చెందిన మధ్య తరగతి, దిగువ మధ్య తరగతుల వారి ఫోన్ నెంబర్లు సేకరించాల్సి ఉంటుంది. ఈ వివరాలను పాకిస్థాన్‌లో ఉన్న వారికి అందించడంతో పాటు భారత్‌లో ఉన్న మాడ్యుల్స్ ద్వారా బోగస్ వివరాలతో వీలైనన్ని బ్యాంకు ఖాతాలు తెరిపించి ఏటీఎం కార్డులు తీసుకునేలా చేస్తోంది. ఆ ఖాతాల నెంబర్లను పాకిస్థాన్‌కు పంపాల్సి ఉంటుంది. దుబాయ్‌లో ఉంటున్న వారి నుంచి సేకరించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా పాకిస్థాన్‌లోని ముఠా అసలు వ్యవహారం ప్రారంభిస్తుంది. అక్కడి సిమ్‌కార్డులను వినిÄయోగించి భారత్‌లో ఉన్న వారిలో రోజుకు 100 నుంచి 150 మందిని సంప్రదిస్తుంది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ కోడ్ 0092 కావడంతో ఈ కాల్స్ అన్నీ ‘+92’ నెంబర్ డిస్ప్లే అవుతూ వస్తాయి. వీరు హిందీ, ఉర్దూలో మాట్లాడే వారిని టార్గెట్‌గా చేసుకుంటున్నారు. కౌన్ బనేగా కరోడ్‌పతీ (కేబీసీ) నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెబుతూ మీ నెంబర్‌కు లాటరీ తగిలిందంటూ ఎర వేస్తారు. ఇదే తరహాలో గోల్కొండ ప్రాంతానికి చెందిన సిద్ధిఖ్ బేగంను సంప్రదించిన నేరగాళ్లు కేబీసీలో రూ. 35 లక్షల లాటరీ వచ్చిందని చెప్పారు. ఆ డబ్బు తీసుకోవడానికి సంప్రదించాల్సిందిగా కోరుతూ ఓ నెంబర్ ఇచ్చాడు. ఈ మహిళ సదరు నెంబర్‌కు ఫోన్ చేయగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిగా చెప్పుకున్న విజయ్‌కుమార్ అనే వ్యక్తి వివిధ రకాలైన పన్నులు, క్లియరెన్స్‌ల పేరుతో రూ.2.25 లక్షలు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు ‘+92’ నెంబర్లకు తిరిగి ఫోన్ చేయగా అవి పని చేయట్లేదని తెలుసుకున్నారు. దీంతో సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు ప్రారంభించారు. -
మిన్నకుంటే మళ్లీ రెచ్చిపోయాడు
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): బాధిత యువతులు/మహిళల మౌనమే నేరగాళ్లకు వరంగా మారుతోంది. వీరి భయాన్ని ఆసరాగా చేసుకున్న కామాంధులు పదేపదే రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఉదంతమే రాజేంద్రనగర్ పరిధిలో చోటు చేసుకుంది. ఎట్టకేలకు బాధితురాలు ధైర్యం చేసి షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో నిందితుడు కటకటాల్లోకి చేరాడు. గత నెలలో సైబరాబాద్ షీ–టీమ్స్‌కు 109 ఫిర్యాదులు రాగా... 29 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 19 మంది నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. రాజేంద్రనగర్‌కు చెందిన ఓ మహిళ బీటెక్ చదువుతున్న రోజుల్లో డిప్లమో చదివే విద్యార్థితో పరిచయం ఏర్పడింది. రెండు నెలల తర్వాత అతను ఆమె వద్ద ప్రేమ ప్రతిపాదన తేగా ఆమె తిరస్కరించింది. దీంతో ఫోన్ కాల్స్ ద్వారా వేధించడంతో పాటు అసభ్యపదజాలంతో దూషించడం మొదలెట్టాడు. ఓ దశలో ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఇంత జరిగినా సదరు యువతి ఎవరికీ చెప్పుకోకుండా మౌనంగా ఉండిపోయింది. దీనిని ఆసరాగా చేసుకున్న అతను గత జనవరి 24న చేవెళ్ల బస్టాప్ వద్ద ఉన్న ఆమె సెల్‌ఫోన్ లాక్కోవడంతో పాటు బలవంతంగా తన వాహనంపై ఎక్కించుకుని గోపన్‌పల్లి పరిసరాల్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి దాడి చేయడంతో స్ఫృహ కోల్పోయింది. అదే అవకాశంగా భావించిన అతను ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే ఆమెతో పాటు కుటుంబాన్నీ హతమారుస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు తన కుటుంబం పరువు పోతుందనే ఉద్దేశంతో తనలో తానే కుమిలిపోయింది. ఆమె మౌనాన్ని మరోసారి తనకు అనువుగా మార్చుకోవాలని భావించిన అతను మళ్లీ ఆమెకు ఫోన్లు చేయడం, సందేశాలు పంపడం చేస్తూ తనతో రావాల్సిందిగా బెదిరిస్తున్నాడు. ఈ చర్యలతో విసిగిపోయిన బాధితురాలు సైబరాబాద్ షీ–టీమ్స్‌ను సంప్రదించడంతో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే ప్రేమ పేరుతో వేధింపులకు దిగిన, వాట్సాప్ కాల్స్ ద్వారా వేధించిన, ప్రేమ పేరుతో శారీరకంగా దగ్గరకావడంతో పాటు రూ.1.05 లక్షలు తీసుకుని మోసం చేసిన నిందితులపై కేసులు నమోదు చేశారు. గత నెలలో మొత్తం 109 ఫిర్యాదులు రాగా, 29 క్రిమినల్ కేసులు, మరో 20 పెట్టీ కేసులు నమోదు చేశారు. మిగిలిన వాటిలో నిందితులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బహిరంగం ప్రదేశాల్లో 9 వర్క్‌షాపులు నిర్వహించి 4108 మందికి అవగాహన కల్పించారు. బాధితులు 9490617444కు వాట్సాప్ చేసి, 100కు కాల్ చేసి తమకు సంప్రదించాలని సైబరాబాద్ షీ–టీమ్స్ అధికారులు కోరారు. -
దేశంలో పెరుగుతున్న డిటెక్టివ్‌ల బిజినెస్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఎవరి ఫోన్ డేటాను సేకరించవద్దని, అసలు ఫోన్ డేటానే కోరవద్దని, అలా చేసినట్లయితే సంఘంలో సభ్యత్వం రద్దవుతుందని ‘అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ డిటెక్టివ్స్ అండ్ ఇన్వెస్టిగేటర్స్–ఇండియా’ ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న తమ సభ్యులను హెచ్చరించింది. కాల్‌డేటా రికార్డులను అక్రమంగా సేకరించి వాటిని విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ముంబైలో ఇటీవల ప్రైవేట్ డిటెక్టివ్‌లను వరుసగా పోలీసులు అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో అసోసియేషన్ ఈ హెచ్చరిక జారీ చేసింది. దేశంలో తొలి మహిళా ప్రైవేటు డిటెక్టివ్ రజనీ పండిత్‌ను, కంగనా రనౌత్, నవాజుద్దీన్ సిద్ధికీ లాంటి బాలీవుడ్ తారలను క్లైంటులుగా కలిగిన లాయర్ రిజ్వాన్ సిద్ధికీని ఇవే ఆరోపణలపై పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. భారత దేశంలో ప్రైవేటు డిటెక్టివ్ వ్యవస్థ రోజు రోజుకు పుంజుకుంటోంది. ఏడాదికి 30 శాతం చొప్పున పెరుగుతోంది. 2020 నాటికి ఈ వ్యవస్థ 1700 కోట్ల రూపాయలకు చేరుకుంటుందన్నది ఓ అంచనా. దేశంలో పోలీసు వ్యవస్థతోపాటు పలు దర్యాప్తు సంస్థలు ఉన్నప్పటికీ ప్రైవేటు డిటెక్టివ్‌ల అవసరం ఎందుకు పెరుగుతోంది? ఈ డిటెక్టివ్లు టార్గెట్ వ్యక్తులను అనుసరించి వారు ఎక్కడెక్కడికి వెళుతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, వారి ఫోన్ కాల్స్ సమాచారాన్ని సేకరించడం నేరమా? వ్యక్తుల ఫోన్ కాల్స్ సమాచారాన్ని వారి అనుమతి లేకుండా సేకరించడం మాత్రం చట్ట ప్రకారం నేరమే. క్రిమినల్ కేసుల్లో, అది డీఎస్పీ స్థాయి పోలీసు అధికారి ఆదేశంతో పోలీసులు ఫోన్ కాల్స్ డేటాను సేకరించవచ్చు. ప్రైవేటు డిటెక్టివ్లకు ఆ అనుమతిలేదు. అయినా వారు తమ పలుకుబడిని ఉపయోగించి లేదా టెలికమ్ కంపెనీల ఉద్యోగులను ప్రలోభపెట్టి కాల్ డేటాను సేకరిస్తుంటారు. ఎవరు, ఎవరితో మాట్లాడారు? ఎక్కడి నుంచి మాట్లాడారు? ఎంత సేపు మాట్లాడారు? ఎక్కడి నుంచి మాట్లాడారు? అన్న సమాచారం టెలికమ్ సంస్థల వద్ద రికార్డయి ఉంటుంది. సాధారణంగా పోలీసులు టేకప్ చేయని కేసులను ఈ ప్రైవేట్ డిటెక్టివ్లు టేకప్ చేస్తారు. భార్య లేదా భర్త ఎవరెవరితో తిరుగుతున్నారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, ఎవరెవరితో మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో, వారి మధ్య అక్రమ సంబంధం ఉందా, లేదా? అన్న విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువ మంది ప్రైవేటు డిటెక్టివ్‌లను ఆశ్రయిస్తారు. పెళ్లి చేసుకోబోయే యువకుడు లేదా యువతి నడతను తెలుసుకునేందుకు కూడా వీరు ఉపయోగపడుతున్నారు. కాలేజీ కెళుతున్న తమ పిల్లలు ఏ సమయానికి, ఏం చేస్తున్నారో, వారి స్నేహితులు ఎలాంటి వారు? వారికి చెడు అలవాట్లు ఏమైనా అబ్బాయా? అన్న అంశాలను తెలుసుకోవడానికి ఈ మధ్య తల్లిదండ్రులు తమ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని ముంబైలోని మరాఠా డిటెక్టివ్ ఏజెన్సీ అధిపతి జిగ్నేష్ ఛెడ తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములు ఏమైనా మోసం చేస్తున్నారా? ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారు? అన్న విషయాలతోపాటు వివిధ రకాల ప్రాజెక్టుల్లో ఎవరి ఎంత బిడ్డింగ్ వేస్తున్నారో కూపీ లాగడం కోసం కూడా డిటెక్టివ్‌ల సేవలను ఉపయోగించుకుంటున్నారని ఆయన తెలిపారు. వ్యక్తులను ఫాలో అవడం, వారి ఫొటోలను తీయడం, వారి కాల్ డేటాను సేకరించడం చట్ట విరుద్ధం కాదా ? అని ప్రశ్నించగా, పోలీసులు టేకప్ చేయని కేసులే తమ వద్దకు వస్తాయని, ఆ కేసులను పరిష్కరించడంలో తాము ఈ పద్ధతులను అనుసరించక తప్పదని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఢిల్లీ డిటెక్టివ్ ఒకరు చెప్పారు. క్లైంట్ భార్య లేదా భర్తకు అక్రమ సంబంధం ఉందని రుజువు చేయాలంటే ఫొటోలు, వారి కాల్‌డేటా అవసరం అవుతుందని ఆయన అన్నారు. కొందరు కాబోయే భార్య లేదా భర్త మెడికల్ హిస్టరీని తెలుసుకునేందుకు కూడా వీరి సేవలను వాడుకుంటున్నారు. దేశంలో ప్రైవేటు డిటెక్టివ్‌ల ఏజెన్సీలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం 2007లో ముసాయిదా బిల్లును తీసుకొచ్చింది. అయితే దాన్ని ఇంతవరకు ఆమోదించకుండా పక్కన పడేసింది. పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టుగా భారత్‌లో బలమైన ‘ప్రైవసీ’ చట్టాలు లేవుగానీ, ఉంటే డిటెక్టివ్‌ల ఏజెన్సీల మనుగడ ఉండేది కాదు. తమ ప్రొఫెషన్‌ను క్రమబద్ధీకరించేందుకు ఓ చట్టం ఉండాలని హైదరాబాద్‌లోని ‘థర్డ్ ఐ ఇన్వెస్టిగేషన్’ సీఈవో పీ. దామోదర్ అభిప్రాయపడ్డారు. -
హలో..
నాకో సమస్య ఉంది... మీరే తీర్చాలిఅపరిచిత మహిళ నుంచి ఫోన్ కాల్గంటల తరబడి మాటల ప్రవాహంకొన్నాళ్లు వరుసగా ఫోన్లలో సంభాషణఆపై భర్తను అంటూ మరో వ్యక్తి ఫోన్నా భార్యను ట్రాప్ చేశావంటూ ఆరోపణపంచాయితీకి రావాలని బెదిరింపునష్టపరిహారం పేరుతో డబ్బుల డిమాండ్బయటకు చెప్పుకోలేకపోతున్న బాధితులు సాక్షి ప్రతినిధి, వరంగల్: నగరంలో నయా మోసాలు జరుగుతున్నాయి. మొబైల్ ఫోన్లను ఆసరాగా చేసుకుని మొదట మాటలు కలుపుతూ.. ఆ తర్వాత బెదిరింపులకు దిగుతూ అందినకాడికి దోచుకునే ముఠా నగరంలో వరుసగా మోసాలకు పాల్పడుతోంది. ఈ ముఠా వేసే ట్రాప్‌లో చిక్కుకున్న పురుషులు.. జరిగిన మోసాన్ని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ట్రాప్‌లో నుంచి బయట పడేందుకు లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం గమనార్హం. మోసం తీరు ఇలా.. తెలియని నంబరు నుంచి మొబైల్ ఫోన్‌కి కాల్ వస్తుంది. అవతలి వైపు ఓ మహిళ అమాయకంగా, ఆందోళనతో ‘హాలో సార్ నమసే’ అంటూ మాటలు కలుపుతోంది. తను సమస్యల్లో ఉన్నానని చెబుతోంది. ‘ఇబ్బందికర పరిస్థితుల్లో నుంచి బయటపడేందుకు తోచిన పది నంబర్లతో ఫోన్ చేస్తే మీకు కలిసిందది’ అంటూ పరిచయం చేసుకుంటోంది. తన సమస్యను చెప్పుకుంటున్నట్లుగా గంటల తరబడి సంభాషణ కొనసాగిస్తోంది. ఆ తర్వాత పదేపదే ఆమె కాల్ చేస్తూ తన సమస్యల నుంచి ఎలా బయటపడాలో చెప్పాలంటూ మాటల వల విసురుతోంది. ఈ మాటల తీరుకు ఆకర్షితులై ... ఈ సంభాషణల పరంపర కొన్నాళ్ల పాటు ఫోన్లో కొనసాగుతోంది. ఈ వ్యవహారం కొనసాగుతుండగానే .. హఠాత్తుగా ఓ పురుషుడి నుంచి ఫోన్ వస్తోంది. ‘హలో ఎలా ఉన్నారు సార్ అంటూ వ్యంగమైన ప్రశ్నతో సంభాషణ మొదలవుతోంది. మీరెవరు అని అడిగితే...‘ రోజు మీరు గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతున్న మహిళను అంటూ కోపంగా మాట్లాడుతాడు. ‘నీ వల్ల నా కుటుంబం నాశనమైంది’ అంటూ శాపనార్థాలు.. ఆ తర్వాత బెదిరింపులు మొదలవుతున్నాయి. పంచాయితీకి రా.. ‘నా భార్యతో రోజు ఫోన్లో మాట్లాడుతున్నావ్. నా భార్యను ట్రాప్ చేశావ్ . ఇద్దరు కలిసి బయట తిరుగుతున్నారు. ఈ విషయం నలుగురిలో మాట్లాడి పంచాయితీ పెడితే తప్ప పరిష్కారం ఉండదు. కాబట్టి ఎప్పుడు పంచాయతీ పెడదాం’ అంటూ ఒత్తిడి తీసుకొస్తున్నాడు. స్పందించకుంటే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులం అంటూ మరికొందరు రంగంలోకి దిగుతున్నారు. మహిళతో ఫోన్లో మాట్లాడిన కాల్‌లిస్ట్, సంభాషణ రికార్డులతో పోలీస్ స్టేషన్లో కేసు పెడతానంటూ ఒత్తిడిని తీవ్రం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కేసా.. లేక పంచాయితీలో మాట్లాడుకుందామా అంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బయటకు పొక్కితే పరువు పోతుందనే భయాన్ని అపరిచిత మహిళతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తికి కలిగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ముఠా సభ్యులే పోలీసు అధికారుల్లా ఫోన్లో మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ ఒత్తిడిలో ఆ వ్యక్తి ఉండగానే కేసు వద్దు.. పంచాయితీ వద్దు.. నష్టపరిహారం చెల్లించుకుని సమస్యను పరిష్కరించుకో.. అనే డిమాండ్ ముందుకు తీసుకొస్తున్నారు. బాధిత వ్యక్తి హోదా, కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి ఓ రేటు దగ్గర పంచాయతీ డీల్ కుదురుతోంది. దీంతో ఎవరికీ చెప్పుకోలేక వారు అడిగినంత ముట్టచెప్పి ఊరుకుంటున్నారు. కాజీపేట స్టేషన్ పరిధిలో ఐదుగురు.. ఇటీవల కాజీపేటలో ఓ వ్యక్తిని ఇలా బెదిరించారు. విషయం ఇంట్లో తెలిసి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులే కేసు పెట్టారు. దీంతో పంచాయితీ అంటూ బెదిరించిన వ్యక్తులు ముఖం చాటేశారు. ఒక్క కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఐదుగురు వ్యక్తులు మోసపోయినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు ఖరీదైన ప్లాటు రాసి ఇవ్వగా, మరో ఇద్దరు వరుసగా రూ. 6 లక్షలు, రూ. 3 లక్షలు చెల్లించినట్లు సమాచారం. మిగిలిన వారి నుంచి సుమారు రూ. 5 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఇద్దరు ఫిర్యాదు చేశారు.. అపరిచిత మహిళ ఫోన్ బాధితులు ఇప్పటివరకు ఇద్దరు ఫిర్యాదు చేశారు. పరువుకు భయపడి ఎవరూ కేసు పెట్టడం లేదు. అపరిచిత మహిళలు ఫోన్ చేసి మాట్లాడితే జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రలోభాలకు లోనైతే మోసపోతారు. కొత్త రకం ట్రాప్ కేసులు పెరుగుతున్నాయి. ఇలా మోసం చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే పోలీసులను ఆశ్రయించండి. – అజయ్, కాజీపేట ఇన్స్పెక్టర్ -
దారుణం : కూతురి కోసం కాల్స్ వస్తుండటంతో..
సాక్షి, విజయవాడ : ఫోన్ కాల్స్ వ్యవహారం ఓ విద్యార్థిని ప్రాణాలు పోవడానికి కారణమయింది. కూతురి కోసం ఎడతెరిపిలేకుండా కాల్స్ వస్తుండటంతో సహనం కోల్పోయిన తండ్రి ఉన్మాదిలా మారి.. కన్నబిడ్డనే పొట్టనపెట్టుకున్నాడు. విజయవాడలో సంచలనం రేపిన ఈ ఘటనలో నిందితుడిని సింగ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏం జరిగింది? : స్థానిక ఉడా కాలనీలో ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తోన్నాడు రమణ. అతనికి పదోతరగతి చదివే కూతురు(కృష్ణవేణి) ఉంది. ఇటీవలికాలంలో కృష్ణవేణి కోసమంటూ రమణ మొబైల్‌కి కాల్స్ ఎక్కువగా వచ్చాయి. ఇదే విషయమై నాలుగురోజుల కిందట ఇంట్లో గొడవజరిగింది. ఆ కాల్స్‌కు, తనకు ఎలాంటి సంబంధం లేదని కూతురు తెగేసి చెప్పింది. అయినాసరే వినిపించుకోకుండా ఉన్మాదిలా మారిన రమణ.. కూతురిని విచక్షణారహితంగా కొట్టాడు. కణత భాగంలో బలంగా దెబ్బతగలడంతో కృష్ణవేణి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అనారోగ్యంతో చనిపోయిందటూ అంత్యక్రియలు.. : కాగా, తండ్రి కొట్టడం వల్లే కృష్ణవేణి చనిపోయిన విషయాన్ని దాచిపెట్టిన కుటుంబీకులు.. అనారోగ్యం వల్లే ప్రాణాలు కోల్పోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. ఆమేరకు అంత్యక్రియలు జరిపించేందుకు సిద్ధమయ్యారు. చుట్టుపక్కలవారు అందించిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకిదిగారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిర్వహించగా.. కణతపై దెబ్బవల్లే కృష్ణవేణి ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. దీంతో కేసు నమోదుచేసుకుని నిందితుడు రమణను అదుపులోకి తీసుకున్నారు. -
తండ్రీకొడుకుల సట్టా దందా
సాక్షి, సిటీబ్యూరో: సింగిల్ నెంబర్ లాటరీని పోలిన జూదం సట్టాను సికింద్రాబాద్ కేంద్రంగా వ్యవస్థీకృతంగా నిర్వహిస్తున్న తండ్రీకొడుకుల్ని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరితో పాటు పది మంది దళారుల్ని కూడా పట్టుకున్నారు. వారినుంచి నగదు, సట్టా సంబంధిత మెటీరియల్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. నగరంలోని కాప్రా సర్కిల్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జమాల్ అలియాస్ ఆర్కే నగర వ్యాప్తంగా సట్టా దందా నిర్వహిస్తున్నాడు. మార్కెట్లోని శివాజీ నగర్‌కు చెందిన తండ్రీకొడుకులు ఎం.కృష్ణమూర్తి, ఎం.శ్రీనివాస్ ఇతడి ఆధీనంలో పని చేస్తూ సికింద్రాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో సట్టా నిర్వహిస్తున్నారు. వీరిద్దనూ సికింద్రాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన చిరుద్యోగులు, కార్మికుల్ని దళారులుగా ఏర్పాటు చేసుకున్నారు. సట్టాలో పందెం కాసేవాళ్ళ నుంచి ఫోన్ ద్వారా వ్యవహారాలు నడిపిస్తున్న తండ్రీకొడుకులు వారికి సట్టా స్లిప్స్ అందించడం, నగదు వసూలు చేసుకురావడం తదితర వ్యవహారాలను దళారులకు అప్పగిస్తున్నారు. ఈ పని చేసినందుకు వీరికి రోజులకు రూ.200 నుంచి రూ.400 వరకు కమీషన్‌గా చెల్లిస్తున్నరు. ఈ గ్యాంగ్ సట్టాలో పెట్టుబడి పెడితే తక్షణం సొమ్ము రెట్టింపు అవుతుందంటూ అనేక మంది ఎర వేస్తూ ఈ దందాలోకి దింపుతున్నారు. సట్టా నెంబర్ తగిలిన వారికీ ఆ విషయం చెప్పకుండా దాచి పెడుతూ వారి సొమ్మునూ స్వాహా చేసి మోసం చేస్తున్నారు. ఈ గ్యాంగ్ వలలో పడి సర్వం కోల్పోతున్న వారిలో దినసరి కూలీలు, చిరు వ్యాపారులు, కార్మికులు, ఆటోడ్రైవర్లు తదితరులే ఎక్కువగా ఉంటున్నారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని బృందం బుధవారం వరుసదాడులు చేసింది. కృష్ణమూర్తి, శ్రీనివాస్‌లతో పాటు దళారులు, పంటర్స్ అయిన దీపక్ జైన్, ఎం.రాజు, ఎం.అంజయ్య, వి.మోజెస్, వీపీ లోకనాథ్, ఎస్.సంతోష్‌కుమార్, జి.సోమయ్యల్ని అరెస్టు చేసింది. వీరి నుంచి సట్టా మెటరియ్తో పాటు రూ.14 వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం మార్కెట్ పోలీసులకు అప్పగించింది. -
అధికార పార్టీ నేతల్లో అప్పుడే సర్వే గుబులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల్లో అప్పుడే సర్వే గుబులు మొదలయ్యింది. కర్నూలు ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరికిస్తే బాగుంటుందో తెలపాలని ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా ఓటర్ల నుంచి తెలుసుకుంటుండడం చర్చనీయాంశమైంది. గురు, శుక్రవారాల్లో కర్నూలు నగరంలోని ఓటర్లకు హైదరాబాద్‌లోని 9140–38119985 నంబరు నుంచి ఫోన్లు వచ్చాయి. టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ టీజీ భరత్‌కు ఇవ్వాలనుకుంటే ఒకటి నొక్కండి... ఎస్వీ మోహన్ రెడ్డికి అయితే రెండు నొక్కండంటూ ఫోన్లు రావడం గమనార్హం. రిలయన్స్‌కు చెందిన ఈ ల్యాండ్‌లైన్ నంబరు అడ్రెస్ మాత్రం ‘ట్రూ కాలర్’లో అపోలో క్లినిక్‌కు చెందినదిగా చూపిస్తుండడం గమనార్హం. మొత్తమ్మీద సమయం, సందర్భం లేకుండా ఈ సర్వే చేపట్టడం చర్చనీయాంశమైంది. సీటు నాదంటే..నాదే! కర్నూలు ఎమ్మెల్యే సీటు విషయంలో అధికార పార్టీలో అప్పుడే గొడవ మొదలయ్యింది. సీటు నాదంటే నాదే అంటూ అటు ఎస్వీ మోహన్ రెడ్డి, ఇటు టీజీ భరత్ చెప్పుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకే వస్తుందని ఎస్వీ మోహన్‌రెడ్డి.. తాను లోకల్ కావున అవకాశం దక్కుతుందని భరత్ అంటున్నారు. అంతేకాకుండా సర్వేలో ఎవరు గెలుస్తారని తేలితే వారికే టికెట్ దక్కుతుందని భరత్ ముక్తాయించారు. మరోవైపు ఎస్వీ మోహన్‌రెడ్డి తాను మాత్రం టీడీపీ నుంచే పోటీ చేస్తానని, భరత్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తనకు తెలియదని పేర్కొనడంతో చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. ఇదే నేపథ్యంలో తాజాగా సర్వే జరగడంతో మరోసారి సీటు విషయం చర్చనీయాంశమయ్యింది. ఇదిలావుండగా.. సర్వేలో టీజీ భరత్‌కు అయితే ఒకటి నొక్కండి... ఎస్వీ మోహన్ రెడ్డికి అయితే రెండో నంబరు నొక్కండని పేర్కొనడంపై ఎస్వీ వర్గీయులు మండిపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆప్షన్‌కు రెండో నంబరు ఇవ్వడం ఏంటని వాపోతున్నారు. సర్వే చేస్తోంది ఎవరు? ఇప్పటికిప్పుడే అసెంబ్లీ ఎన్నికలు లేవు. ఏడాదికిపైగా సమయం ఉంది. అయినప్పటికీ ఇప్పుడే సర్వే నిర్వహించడంపై అధికార పార్టీలోనే అనేకానేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకూ అపోలో క్లినిక్‌కు చెందిన ఈ నంబరు నుంచి సర్వే చేయడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సర్వే ద్వారానే ఎవరు పోటీ చేస్తారనే అంశాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందన్న టీజీ భరత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సర్వే జరగడం మరింత చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే కర్నూలు నియోజకవర్గంలోని పార్టీ పదవులన్నీ ఎస్వీ మోహన్‌రెడ్డి వర్గానికే దక్కాయి. ఈ పరిస్థితుల్లో ఈ సర్వే జరగడం కూడా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదిఏమైనా సర్వే నేపథ్యంలో ఎవరి బలమేమిటో తెలిసిపోనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఆటోడ్రైవర్‌కు మహిళా అభిమానుల బెడద
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల విడుదలైన హీరో రవితేజ ’రాజా ది గ్రేట్’ సినిమాలో చెప్పిన ఓ ఫోన్ నెంబర్ విశాఖకు చెందిన లంకలపల్లి గోపి అనే వ్యక్తిని ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. విసుగెత్తిన అతడు చివరకు తన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసుకున్నాడు కూడా. తాజాగా బంగ్లాదేశ్‌లోనూ అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితు... అయన బంగ్లాదేశ్ స్టార్ హీరో ఏమీ కాదు. మామూలు ఆటో డ్రైవర్. అతడికి రోజూ వందల మంది మహిళా అభిమానులు ఫోన్ చేస్తున్నారు. అది భరించలేక అతడు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అతడేమీ స్టార్ హీరో కాకపోయినా అన్ని ఫోన్లు రావడానికి కారణం మాత్రం బంగ్లాదేశ్ టాప్ హీరో షాకిబ్ ఖాన్. దాంతో తన జీవితాన్ని దుర్భరం చేసిన షాకిబ్ ఖాన్‌పై 50వేల పౌండ్లకు దావా వేయాలని నిర్ణయించుకున్నాడు ఆటోడ్రైవర్ ఇలాజుల్ మియా. హీరో ఖాన్‌కు, ఇలాజుల్ మియాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా ఇదంతా ఎందుకు జరిగిందంటే.... షాకిబ్ ఖాన్ నటించిన ‘రాజనీతి’ సినిమా ఇటీవల విడుదలయింది. ఈ సినిమాలో హీరోయిన్‌కు షాకిబ్ ఖాన్ ఓ ఫోన్ నెంబర్ తనదంటూ ఇస్తాడు. అది నిజంగా హీరో ఫోన్ నెంబర్ అని హీరో మహిళా అభిమానులు భావించారు. యాదృశ్చికంగా ఆ ఫోన్ నెంబర్ మన ఆటోరిక్షా డ్రైవర్ ఇలాజుల్ మియాది. వందలాది మంది మహిళా ఫ్యాన్... ఆ ఫోన్ నెంబర్ హీరోది అనుకొని ఇలాజుల్ ఫోన్‌కు ఫోన్లు చేస్తూ వస్తున్నారు. అస్తమానం ఫోన్లు రావడంతో అతడికి.. ఇతర మహిళలతో అక్రమ సంబంధం ఉందని ఇలాజుల్ భార్య అనుమానించింది. అంతేకాకుండా ఇంటి నుంచి వెళ్లిపోతానంటూ బెదిరిస్తూ వచ్చింది. ఆమెకే ఫోన్ ఇచ్చి చివరకు ఆ ఫోన్లు హీరోకు వస్తున్న ఫోన్లుగా తెలిసేలా చేసేడు. ప్రస్తుతానికి కొత్తగా పెళ్లయిన వారి మధ్య గొడవ సద్దు మణగింది. ఆయితే ఫోన్లు మాత్రం ఆగడం లేదని ఇలాజుల్ మియా వాపోతున్నాడు. ఓ మహిళా అభిమాని అయితే తానుంటున్న చోటును కనుక్కొని 300 మైళ్ల దూరం నుంచి హీరో కోసం వచ్చిందని అతడు చెప్పుకొచ్చాడు. ఓ దశలో తాను ఫోన్ నెంబర్ మార్చుకుందామని అనుకున్నానని, అయితే తనను ఫోన్‌పై పిలిచే కస్టమర్లకు ఇబ్బంది అవుతుందని మార్చుకోలేదన్నాడు. 50వేల పౌండ్లకు కోర్టుకెళ్లి లాయర్ ద్వారా దావా కూడా వేశానని చెప్పాడు. అయితే దాన్ని విచారించేందుకు జడ్జీ స్వీకరించలేదని, ఫోన్ నెంబర్ వల్ల తనకు నిజంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయో, లేదో తెలుసుకునేందుకు దర్యాప్తుకు ఆదేశించారని చెప్పాడు. దర్యాప్తు అనంతరం తన దావాపై విచారణ జరిగే అవకాశం ఉందని అతడు తెలిపాడు. -
బ్యాంకు అధికారుల పేరుతో ఏటీఎం నంబర్ల కోసం ఆరా
తప్పుడు కాల్స్‌తో మోసాలకు యత్నం అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు సిరిసిల్ల: ‘హలో.. నేను ఎస్బీఐ బ్యాంకు మేనేజర్‌ను మాట్లాడుతున్నాను. మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయింది. దాన్ని పునరుద్ధరించమంటారా?’ అంటూ మంగళవారం ఉదయం 8677995663 నంబర్ నుంచి సిరిసిల్ల శివనగర్‌కు చెందిన రాజుకు ఫోన్ వచ్చింది. మాట్లాడుతున్న వ్యక్తి హిందీలో మాట్లాడడంతో రాజు సైతం హిందీలోనే సమాధానం చెప్పారు. మా ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని మీకు ఎవరు చెప్పారు? అని ఎదురు ప్రశ్నించారు. ఆరు నెలలకోసారి ఏటీఎం కార్డు బ్లాక్ అవుతుంది. మీ ఏటీఎం కార్డుపై ఉన్న నంబర్లు చెబితే మళ్లీ పునరుద్ధరిస్తామని ఫోన్ చేసిన వ్యక్తి అడిగారు.. అనుమానం వచ్చిన రాజు అసలు మీరు ఎవరు.. నా ఏటీఎం నంబరు మీకు ఎందుకు చెప్పాలి? మీరు బ్యాంకు మేనేజరే అని మాకేంటి నమ్మకం అంటూ గట్టిగా ప్రశ్నించడంతో అవతలి వ్యక్తి ఫోన్ కట్ చేశారు. సిరిసిల్లలో పలువురికి ఇదే నంబరును నుంచి మంగళవారం వచ్చిన ఫోన్ కాల్ వచ్చింది. బాధితుల ఫిర్యాదులో పోలీసులు ఈ నంబరు బీహార్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయినట్లు నిర్ధారించారు. అయితే ఎవరూ నంబర్ చెప్పకపోవడంతో మోసపోలేదు. బ్యాంకు మేనేజర్‌నంటూ, అధికారులమంటూ తప్పుడు ఫోన్ కాల్స్ వస్తున్నందున బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని టౌన్ సీఐ అజయ్‌కుమార్ తెలిపారు. ఎవరికీ ఏటీఎం నంబర్లు, రహస్య నంబరు చెప్పొద్దని సూచించారు. -
ఆ మిస్టీరియస్ ఫోన్ కాల్స్ వారి పనేనా!
లేహ్: ఇండియా, చైనా సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు ఇటీవలి కాలంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ రాష్ట్రం లేహ్ ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలకు ఈ మిస్టీరియస్ ఫోన్ కాల్స్ రావడం గమనార్హం. వాస్తవాదీన రేఖ ప్రాంతంలోని డుర్బక్ గ్రామ సర్పంచ్‌కు ఇటీవల వచ్చిన ఓ ఫోన్ కాల్‌ను విచారించిన అధికారులు.. అది వెబ్ ఆధారిత కాల్‌గా నిర్థారించారు. ఫోన్ చేసిన వ్యక్తి తనకు తాను డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నట్లు పరిచయం చేసుకొని, ఆర్మీకి సంబంధించిన వివరాలను అడిగాడు. అయితే ఆ సమయంలో ఆర్మీ క్యాంపులోనే ఉన్న సర్పంచ్ ఈ విషయాన్ని సమీపంలోని ఆర్మీ అధికారికి వివరించాడు. దీనిపై విచారణ జరపగా ఆ నంబర్‌కు సంబంధించిన వివరాలేవీ లభించలేదు. దీంతో అది పాకిస్తాన్ లేదా చైనా దేశాలకు చెందిన గూఢచారుల పనిగా అధికారులు భావిస్తున్నారు. బార్డర్ గ్రామాల్లోని కొందరు అమాయక ప్రజలు ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్న సందర్భంలో ఆర్మీకి సంబంధించిన వివరాలను వెల్లడించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ చేసిన వ్యక్తులు ఎక్కువగా ఆ ప్రాంతంలో ఆర్మీ మోహరింపుకు సంబంధించిన వివరాలతో పాటు, అక్కడ గల రవాణా సౌకర్యాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ మిస్టీరియస్ ఫోన్ కాల్స్‌పై ఇప్పుడు అధికారులు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. అలాగే సమీప గ్రామాల్లోని ప్రజలకు ఈ వ్యవహారం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. -
దావూద్ నుంచి భారత నేతకు ఫోన్లు!
ముంబై: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి రోజుకో ఆసక్తికర వార్త బయటకి వస్తోంది. ఇప్పటికే గ్యాంగ్రెయిన్ వ్యాధితో దావూద్ ప్రాణం మీదకు తెచ్చుకున్నాడంటూ వార్తలు షికారు చేస్తుండగా తాజాగా మరో ముఖ్య విషయం వెలుగుచూసింది. పాకిస్థాన్ లోని కరాచీలో దావూద్ ఉంటున్న ఇంటి నుంచి భారత్‌కు తరచుగా ఫోన్ కాల్స్ వస్తున్నాయనేది ఆ వార్తల సారాంశం. అందులో మరాఠాకు చెందిన ఓ కీలక నేతకు కూడా దావూద్ ఇంటి నుంచి కాల్స్ వెళ్లాయని తెలుస్తోంది. వడోదరాకు చెందిన మనీష్ భాంగలే అనే ఎథికల్ హ్యాకర్ ఈ సమాచారాన్ని బయటికి తీసి ఇండియాటుడేకు అందజేశారు. కరాచీలోని దావూద్ ఇంట్లో 4 ల్యాండ్‌లైన్ ఫోన్లు ఉన్నాయి. ఐతే అవేవీ దావూద్ పేరిట లేవు. ఆయన భార్య మహేజబీన్ షేక్ పేరు మీదనే ఫోన్ కనెక్షన్లు తీసుకున్నారు. ఇక భాంగలే తన పార్టనర్ జయేశ్ షాతో కలసి పాకిస్థాన్ టెలికాం కార్పొరేషన్ లిమిటెడ్ సైట్‌ను హ్యాక్ చేసి దావూద్ ఫోన్ కాల్స్‌ను పరిశీలించారు. 2015 సెప్టెంబర్ 5 నుంచి 2016 ఏప్రిల్ 5వ తేదీ మధ్య 7 నెలల కాల్‌డేటాను రాబట్టారు. ఇక 4 నెంబర్లలో ఒక నెంబర్ నుంచి తరచుగా డయల్ చేసిన 10 అంతర్జాతీయ నెంబర్లను ఇండియాటుడే విశ్లేషించింది. అందులో 5 నెంబర్లు భారత్‌కు, 4 దుబాయ్‌కి చెందినవి. ఒకటి బ్రిటన్‌లోని ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకుకు చెందిందని తేలింది. భారత్ నెంబర్లలో ఒకటి ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన మహారాష్ట్ర నాయకుడిది కావడం ప్రకంపనలు రేపుతోంది. -
ప్రజలను అప్రమత్తం చేయండి
♦ మోసపూరిత ఆఫర్ల విషయమై ♦ బ్యాంక్‌లకు ఆర్బీఐ సూచన ముంబై: ఈ మెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా వచ్చే మోసపూరిత ఆఫర్ల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) బ్యాంకులకు సూచించింది. ఆర్థికాంశాల పట్ల తగిన అవగాహన లేకపోవడం, జాగరూకత లేకపోవడం వల్ల అమాయకులైన ప్రజలు ఇలాంటి మోసపూరిత ఆఫర్లకు బలై నష్టపోతున్నారని ఆర్బీఐ పేర్కొంది. ఇలాంటి స్కీమ్‌లు/ఆఫర్ల పట్ల ప్రజలే కాకుండా బ్యాంక్‌లు కూడా నష్టపోతున్నాయని వివరించింది. లాటరీ తగిలిందనో లేక ప్రైజ్‌లు వచ్చాయనో ఫోన్‌కాల్స్, ఈమెయిల్స్ వస్తాయని, కొంత మొత్తం డబ్బులు డిపాజిట్ చేస్తే ఈ లాటరీ/ప్రైజ్‌లు మీకు వస్తాయని మోసగాళ్లు ప్రలోభపెడతారని పేర్కొంది. వాళ్లు చెప్పినట్లుగా డబ్బులు డిపాజిట్ చేస్తే ఆ తర్వాత ఎలాంటి స్పందన ఉండదని వివరించింది. బ్యాంకులు తమ ఖాతాదారుల అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈ తరహా మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేలా పోస్టర్లు, పాంప్లెట్లు, నోటీసులు, ఇంకా ఇతర మార్గాల ద్వారా బ్రాంచ్‌లు, ఏటీఎంల్లో విస్తృతమైన ప్రచారం చేయాలని ఆర్బీఐ సూచించింది. మోసపూరిత ఆఫర్ల పట్ల ప్రజలు ఆకర్షితులు కాకుండా చూడడంలో బ్యాంక్ సిబ్బంది తగిన తోడ్పాటునందించాలని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రూ. లక్షకు మించిన మోసపూరిత కేసులు 861 నమోదయ్యాయని, వీటి విలువ రూ.4,920 కోట్లని వివరించింది. ఇక 2014-15 ఆర్థిక సంవత్సరంలో 1,651 కేసులు నమోదయ్యాయని, వీటి విలువ రూ.11,083 కోట్లని పేర్కొంది. -
‘డబ్బా’లతో దోచేస్తారు..!
* ‘ఏటీఎం కేంద్రం’గా కొత్త తరహా మోసం * డబ్బు వచ్చే చోట ‘డబ్బా’లు పెడుతున్న వైనం * జోరుగా ఫోన్‌కాల్స్ ద్వారా మోసాలు * అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ కాప్స్ సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ వినియోగదారుడు అబిడ్స్ ప్రాంతంలోని ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. నగదు డ్రా చేసుకునేందుకు మిషన్‌లో కార్డు పెట్టడంతో పాటు మిగిలిన తతంగం పూర్తి చేశాడు. అయితే ఎంత సేపు వేచి చూసినా... డబ్బుతో పాటు స్లిప్ కూడా రాలేదు. సాంకేతిక సమస్యగా భావించి వెనుదిరిగాడు. ఇది కేవలం సాంకేతిక సమస్య మాత్రమే కాకపోవచ్చు... ఏటీఎం కేంద్రాలను అడ్డాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్ల కొత్త ఎత్తు కూడా కావచ్చునని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. ఉత్తరాదిలో జోరుగా సాగుతున్న ఈ తరహా మోసాలు నగరంలోనూ చోటు చేసుకునే అవకాశం ఉందని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కేవలం ప్రత్యేకంగా తయారు చేసిన డబ్బా, ట్రాన్స్పరెంట్ టేప్‌లను ఆధారంగా చేసుకునే నేరగాళ్లు తమ ‘పని’ ఎలా పూర్తి చేసుకుంటున్నారన్న దానిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సీసీలు( కెమెరాలు, సెక్యూరిటీ) లేని కేంద్రాలే లక్ష్యం చేతిలో ఇమిడిపోయే స్కిమ్మర్లు, కెమెరాలను ఏర్పాటు చేసి ‘ఏటీఎం ఫ్రాడ్స్’ చేయాలంటే నేరగాడికీ సాంకేతిక పరిజ్ఞానం అవసరం. పైగా ఇందుకు పెట్టుబడి కూడా ఎక్కువగానే పెట్టాల్సి ఉంటుంది. ‘డబ్బా ఫ్రాడ్’కు పాల్పడే వారికి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడి అవసరం లేకుండానే పని పూర్తవుతోంది. ప్రధానంగా సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు లేని, జనసమర్థ ప్రాంతాలు, ప్రధాన రహదారులకు దూరంగా ఉన్న ఏటీఎంలనే వీరు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ‘డబ్బా’ తయారీలోనే ప్రత్యేకం... ఏటీఎం మిషన్ నుంచి నగదు బయటకు వచ్చే ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు వీరు ప్రత్యేకమైన డబ్బాను రూపొందిస్తున్నారు. ఇది ఓ వైపు మిషన్‌కు ఉన్న మాదిరిగానే క్యాష్ స్లాట్‌ను తలపించేలా ఉంటూ, మరో వైపు ఖాళీగా ఉంటుంది. దీన్ని మిషన్ నుంచి నగదు బయటకు వచ్చే ప్రాంతంలో చాకచక్యంగా అతికించేయడంతో వినియోగదారుడికి ఏటీఎం మిషన్‌లో భాగంగానే కనిపిస్తుంది. ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు నివసించే ప్రాం తాల్లోని ఏటీఎంలను లక్ష్యంగా ఎంచుకున్న నేరగాళ్లు ప్రతి నెలా మొదటి వారంలోనే ఏటీఎం మిషన్లకు డబ్బాలను అమరుస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. స్లిప్ రాకుండా టేప్... క్యాష్ స్లాట్ దగ్గర డబ్బాను ఏర్పాటు చేసుకున్న నేరగాళ్లు... బ్యాలెన్స్ స్లిప్ సైతం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వినియోగదారులకు డబ్బు రాకుండా, స్లిప్ వస్తే వారు అనుమానించి, తక్షణం బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. లేదా ఏటీఎం మిషన్‌ను పరిశీలిస్తాడు. వీటిని ఆస్కారం లేకుండా చేసేందుకు నేరగాళ్లు స్లిప్ సైతం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకుగాను స్లిప్ బయటకు వచ్చే భాగంలో ట్రాన్స్పరెంట్ టేప్‌ను అతికించేస్తున్నారు. డబ్బు ‘డబ్బా’లోనే ఈ ‘ఏర్పాట్లు’ చేసిన ఏటీఎం కేంద్రంలోకి వెళ్లిన వినియోగదారులు కార్డు పెట్టడం నుంచి నగదు ఎంత కావాలో ఎంటర్ చేయడం వరకు అన్నీ పక్కాగా చేసినా... డబ్బు బయటకు రాదు. మిషన్ నుంచి డ్రా అయ్యే సొమ్ము నేరగాళ్లు ఏర్పాటు చేసిన డబ్బాలో పడిపోతుంది. టేప్ ఉన్న కారణంగా స్లిప్ సైతం బయటకు రాదు. దీంతో మిషన్ పని చేయట్లేదని భావించే వినియోగదారులు మరో ఏటీఎంకు వెళ్లిపోతాడు. కాస్త దూరంలో ఉంటూ దీన్ని కనిపెట్టే నేరగాళ్లు వెంటనే వచ్చి డబ్బాలో పడిన నగదు తీసుకుంటారు. ఎస్సెమ్మెస్ వచ్చినా.. వినియోగదారులు ఏటీఎం మిషన్లను వినియోగించినప్పుడు నగదు బయటకు రాకపోయినా... డ్రా అయినట్లు సంక్షిప్త సందేశం (ఎస్సెమ్మెస్) వచ్చేస్తోంది. దీనిపై సదరు బ్యాంక్ కాల్ సెంటర్‌ను సంప్రదిస్తే 24 గంటల్లో నగదు తిరిగి ఖాతాలోకి వెళ్లిపోతుందని చెప్తున్నారు. సాంకేతిక సమస్యలతో పాటు అనేక సందర్భాల్లో అలానే జరుగుతోంది కూడా. అయితే ‘డబ్బా ఏటీఎం’ను వినియోగించినప్పుడూ వినియోగదారులకు వచ్చే ఎస్సెమ్మెస్‌లు ఈ తరహాకు చెందినవిగానే భావించి నష్టపోతున్నారు. జోరుగా కాల్స్ మోసాలు ఫోన్‌కాల్స్ ద్వారా వ్యక్తిగత సమాచారం తెలుసుకుని టోకరా వేస్తున్న నేరగాళ్లకూ కొదవ లేకుండా పోతోంది. నగర సైబర్ క్రైమ్ పోలీసులకు రోజుకు కనీసం మూడు ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు వినియోగదారులకు ఫోన్లు చేసి బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటున్నారు. డెబిట్ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చెయ్యాలంటూ సీవీవీ కోడ్, ఓటీపీలనూ తీసుకుంటున్నారు. ఆపై ఆన్లైన్ షాపింగ్స్, క్లోన్డ్ కార్డులతో డబ్బు డ్రా చేసేస్తున్నారు. అప్రమత్తతే పరిష్కారం ‘ఏటీఎం కేంద్రాల్లో డబ్బాల ద్వారా చేసే నేరాలు, ఫోన్ కాల్స్ ద్వారా జరిగే ఫ్రాడ్స్ బారిన పడకుండా ఉండాలంటే అప్రమత్తతే పరిష్కారం. సెక్యూరిటీ గార్డు, సీసీ కెమెరాలు ఉన్న ఏటీఎం కేంద్రాలనే ఎంచుకోవడం ఉత్తమం. ఆధార్ లింకేజ్ లేదా అప్‌గ్రేడ్ కోసం ఏ బ్యాంకు ఫోన్లు చేయదని గుర్తుంచుకోవాలి. పేపర్లో ప్రకటన ఇవ్వడం, వ్యక్తిగతంగా బ్యాంకునకు రమ్మని కోరతాయి తప్ప ఫోన్ ద్వారా రహస్య వివరాలు అడగవు’ - విజయ్ ప్రకాష్ తివారీ, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్, సీసీఎస్ -
హడలెత్తిస్తున్న ఫోన్ కాల్
తాడిపత్రి టౌన్: అగంతకుడు: ‘హలో.. నేను బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నా. మీ ఏటీఎం కార్డు బ్లాక్ చేస్తున్నాం’ ఖాతాదారుడు: అయ్యో సార్.. ఎందుకు బ్లాక్ చేస్తున్నారు? అగంతకుడు: అయితే మీ కార్డు సీక్రెట్ నంబర్ సహా, కార్డు నంబర్ కూడా చెప్పండి. ఖాతాదారుడు: కార్డు నంబర్, సీక్రెట్ నంబర్ చెప్పారు. ఆ తరువాత ఏం జరిగింది: ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయి. అరె.. డబ్బులే డ్రా చేయలేదు. ఎలా మాయమయ్యాయ్ అంటూ ఖాతాదారుల ఆందోళన. ఇలా ప్రతి రోజూ ఎవరికో ఒకరి సెల్‌ఫోన్‌కు 7354943632 నంబర్ నుంచి కాల్ రావడం, వారు భయపడి తమ వివరాలు తెలపగానే డబ్బులు మాయం కావడం వరుసగా జరుగుతున్నాయి. తాడిపత్రిలో ఆర్టీసీ కార్మికులు చాలా మంది ఇలా వేలాది రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ విషయం కార్మికులందరికీ తెలసిపోవడంతో బాధితులందరూ ఆదివారం డిపో వద్ద ఒక్కటై తమకు జరిగిన అన్యాయాన్ని ఏకరువుపెట్టుకున్నారు. తాడిపత్రి ఆర్టీసీ డిపో పరిధిలో 547 మంది డ్రైవర్లు, కండక్టర్లు, మోకానిక్లు ఉన్నారు. వారం రోజులుగా 7354943632 నంబర్ నుంచి పలువురు కార్మికులకు వరుసగా కాల్స్ వచ్చాయి. తాను ఎస్బీహెచ్ బ్యాంకు మేనేజర్‌నంటూ అగంతకుడు హిందీలో ఖాతాదారులను భయపెట్టి వారి వివరాలు రాబట్టుకోవడం, ఆ తరువాత వారి ఖాతాలో డబ్బు డ్రా చేసినట్లు ఫోన్‌కు మెసేజ్ రావడంతో కంగుతిన్నారు. ఇలా గ్యారేజీ మెకానిక్ గౌస్మోహిద్దిన్ ఖాతాలో రూ.13 వేలు డ్రా కాగా, పెయింటర్ రమేశ్ ఖాతాలో రూ.800, మరో మెకానిక్ రుద్రముని ఖాతాలో రూ.6 వేలు, డైవర్ లక్షుమయ్య ఖాతా నుంచి రూ.7 వేలు, కండక్టర్ ఎస్పీ రావు ఖాతా నుంచి రూ.35 వేలు మాయమయ్యాయి. ఇంకా ఏడీసీ హమీద్ ఖాతాలో రూ.3 వేలు డ్రా అయ్యాయి. ఫోన్ నంబర్ గురించి ఆరా తీస్తే బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి వచ్చినట్లు వెల్లడైందని గుర్తించారు. తమకు జరిగిన అన్యాయం గురించి కార్మికులు డీఎం నరేంద్రరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సూచన మేరకు బాధితులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. దీనిపై పట్టణ సీఐ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
గంటల తరబడి మహిళలతో ...
-
రోజుకు 90 మిస్డ్ కాల్స్!
మహిళా రిపోర్టర్లకు వేధింపులు అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్లు ఉత్తరప్రదేశ్‌లో కొరవడిన భద్రత న్యూఢిల్లీ/ లక్నో: మహిళా రిపోర్టర్లకు భద్రత కల్పించాల్సిన అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని బందా జిల్లాలో పూర్తిగా మహిళలే నడిపించే పత్రిక 'ఖబర్ లహరియా' లో పనిచేస్తున్న ఐదుగురు రిపోర్టర్లను ఓ ఆగంతకుడు ఫోన్లో వేధించడం మొదలుపెట్టాడు. అది కూడా అలా ఇలా కాదు.. రోజుకు దాదాపు 70 నుంచి 90 వరకు మిస్డ్ కాల్స్. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా రాత్రి 2 గంటల సమయంలో కూడా ఫోన్లు చేసేవాడు. అది కూడా వేర్వేరు నెంబర్ల నుంచి! నిషు అనే ఆ వ్యక్తి వేధింపులు భరించలేని స్థాయికి చేరుకోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ వేధింపులపై తాము మొదట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా, వాళ్లు చాలా చిన్న విషయంగా తీసుకున్నారని, తర్వాత వాళ్లకు దీని తీవ్రత అర్థమైందని 'ఖబర్ లహరియా' ఎడిటర్ కవిత చెప్పారు. నిషు తమ టీంలోని ఐదుగురు మహిళలను టార్గెట్‌గా చేసుకుని వేధిస్తున్నాడని కవిత చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి వేధింపులు మొదలయ్యాయని వాపోయారు. గత మూడు నెలలుగా అతని వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయని, తమను భయపెట్టేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యోగంలో భాగంగా ఎంతోమందిని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుందని, పని ఒత్తిడితో రాత్రి పొద్దుపోయాక ఇంటికి వెళ్తే.. అలాంటి సమయాల్లో ఇలాంటి కాల్స్ తమకెంతో ఇబ్బంది కలిగించేవని ఆమె చెప్పారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో కూడా అతడు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించేవాడని కవిత వెల్లడించారు. -
ముసలోళ్లకే 'ఆ' తెగులు ఎక్కువట!
సాధారణంగా అమ్మాయిల సెల్ఫోన్లకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడే విషయంలో కుర్రాళ్లే ముందుంటారని అనుకుంటాం కదూ. కానీ.. అలా మాట్లాడే తెగులు ముసలోళ్లకే ఎక్కువగా ఉంటోందట. ఈ విషయం చాలా శాస్త్రీయంగా లెక్కలు తీస్తే తేలింది. 1090 అనే నెంబరు మహిళల హెల్ప్‌లైన్‌గా ఉంటోంది. ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ఈ నెంబరు ఉపయోగిస్తున్నారు. ముక్కూ ముఖం తెలియని వాళ్లకు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడేవాళ్లలో ఎక్కువ మంది 50 ఏళ్ల వయసులోనే ఉంటున్నారట. ఇంకా మాట్లాడితే.. 60, 70 ఏళ్ల వాళ్లు కూడా ఇలా మాట్లాడుతూ తమలో తామే ఆనందిస్తున్నారని తెలిసింది. మహిళలకు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారంటూ మొత్తం 3.45 లక్షల ఫిర్యాదులు రాగా, వాటిలో 45 శాతం మంది 40 ఏళ్ల పైబడినవాళ్లే. 50 ఏళ్లు దాటినవాళ్లు కూడా 5 శాతం మంది ఉన్నారట. 2012 నవంబర్ నెలలో 1090 హెల్ప్‌లైన్ ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఇలా పెద్దవయసు వాళ్లు ఫోన్లు చేసి వేధిస్తున్న ఫిర్యాదులు ఎక్కువగా ఉంటున్నాయని లక్నోలో ఈ హెల్ప్‌లైన్ నిర్వహించే ఓ పోలీసు తెలిపారు. ఇలా వేధించేవాళ్లను తొలుత పిలిపించి కౌన్సెలింగ్ చేస్తారు. అయినా వినిపించుకోకుండా మళ్లీ అలాగే చేస్తే.. అప్పుడు కసు బుక్ చేస్తారు. -
నీటి పారుదల శాఖ హెల్ప్‌లైన్‌కు ఫోన్ల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణపై ప్రజల నుంచి నేరుగా సూచనలు, సలహాలు స్వీకరించేందుకు రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘హెల్ప్‌లైన్’కు అపూర్వ స్పందన లభిస్తోంది. ‘హెల్ప్‌లైన్’ నంబర్ 040-23472233కి శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రం నలుమూలల నుంచి 200లకు పైగా ఫోన్లు వచ్చాయి. వీటిలో ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో కబ్జాలకు గురైన చెరువుల గూర్చే ఫిర్యాదులు చేసినట్లుగా నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఇక తమ గ్రామాల్లోనూ చెరువు పనులను ఆరంభించాలని 50 శాతంమంది, మరమ్మతుల అవసరాన్ని మరికొంతమంది దృష్టికి తెచ్చినట్లుగా చెబుతున్నారు. ఫోన్లు చేసిన వారితో పాటు, వారు దృష్టికి తెచ్చిన అంశాలన్నింటినీ నోట్ చేసుకుంటున్న అధికారులు వాటిని అంశాల వారీగా వడపోత చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నంబర్‌కు ఫోన్ల తాకిడి ఎక్కువగా ఉన్న దృష్ట్యా మరిన్ని లైన్లు ఏర్పాటు చేయాలని సైతం నిర్ణయించామని, ఇప్పటికే హెల్ప్‌లైన్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఈఈ, డీఈ, జేఈల సంఖ్యను మరింత పెంచుతామని అధికారులు వెల్లడించారు. -
తొమ్మండుగురు తోడేళ్లు
బెస్ట్ కేస్ ఖమ్మంలో ఎస్పిగా ఉన్నప్పుడు పరిష్కరించిన కేసు నేను ఎప్పటికీ మరచిపోలేను. ఏడాదిపాటు కంటిమీద కునుకు లేకుండా చేధించిన కేసు. మహిళలపై దాడి కేసుల గురించి విన్నప్పుడల్లా నాకు ఖమ్మంలో జరిగిన సంఘటనే కళ్లముందుంటుంది. 2009లో జరిగిన సంఘటన ఇది. ఒకరోజు పొద్దునే ఫోన్‌కాల్స్ రావడం మొదలయ్యాయి. ఖమ్మం కొత్తగూడెం సిటికేబుల్‌లో బ్లూఫిల్మ్‌లు టెలికాస్ట్ చేస్తున్నారని ఫిర్యాదు. టీవీ పెట్టి చూస్తే రక్తం ఉడికిపోయే సంఘటన. అందరూ అనుకుంటున్నట్టు అవి బ్లూఫిల్మ్ దృశ్యాలు కావు. ఒకమ్మాయిని తొమ్మిదిమంది రేప్ చేస్తున్నప్పుడు తీసిన ఫొటోలను వీడియోకింద తయారుచేశారు. బ్యాగ్రౌండ్లో సినిమాపాటలు పెట్టి వీడియో ప్లే చేస్తున్నారు. వెంటనే కేబుల్ ఆపరేటర్లను అరెస్ట్ చేశాం. కొందరు మార్ఫింగ్ వీడియో అన్నారు, ఇంకొందరు ఈ ప్రాంతానికి చెందిన చిత్రాలు కావన్నారు. కానీ నాకు, కొత్తగూడెం డిఎస్పికి ఆ రేప్ లోకల్‌దే అనిపించింది. రేప్‌కు గురైన అమ్మాయి ఫొటో ఆధారంగా ఏ ప్రాంతానికి చెందిందో ఎంక్వైరీ చేయిస్తే అక్కడే ఒక గ్రామానికి చెందిన అమ్మాయని తెలిసింది. తెలిసిన వ్యక్తి పనే... మహిళాపోలీసులు మారువేషాల్లో అమ్మాయి దగ్గరికి వెళ్లి కౌన్సెలింగ్ చేసి, తల్లిదండ్రులను ఒప్పించి కేసు పరిష్కారానికి సహకరించమని చెప్పారు. కొద్దిగా టైం తీసుకున్నా ఒప్పుకున్నారు. మీడియావాళ్లు కూడా ఈ కేసు విషయంలో చాలా సహకరించారు. వారికి అమ్మాయి వివరాలు, కేసు వివరాలు తెలిసినా పత్రికల్లో, టీవీల్లో వార్తలు వేయకుండా సాయపడ్డారు. అమ్మాయి పేరు, వివరాలు బయటపెట్టకుండా ఆమెతో కేసు ఫైల్ చేయించాం. విషయం ఏంటంటే, అప్పటికి ఆ అమ్మాయిపై రేప్ జరిగి రెండేళ్లవుతోంది. పదో తరగతి చదువుకుంటున్న ఆ అమ్మాయి ఒకరోజు సాయంత్రం తెలిసిన వ్యక్తితో కలిసి ఆటోలో బంధువుల ఇంటికి బయలుదేరింది. కొంత దూరం వెళ్లాక ఆటో గ్రామం శివార్లకు వెళుతుంటే ఆమె ప్రతిఘటించింది. తెలిసిన వ్యక్తి ఆమెను అరవకుండా నోరునొక్కి, చాకు చూపించి బెదిరించాడు. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లాక అక్కడ అతని స్నేహితులు మరో ఎనిమిదిమంది ఉన్నారు. ఆటో డ్రైవర్ని కాపలా పెట్టి తొమ్మిదిమంది అత్యాచారం చేశారు. ఈ సంఘటనను ఫొటోలు తీశారు. బాధితురాలు ఇంట్లోవాళ్లకి విషయం చెప్పింది. ఆడపిల్ల జీవితం. నలుగురికి తెలిస్తే పరువు పోతుందని నోరునొక్కుకుని ఊరుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనే మీడియావార్తలు వింటూనే ఉంటాం. కానీ చాలామంది పోలీసులు తమ ఇంటి ఆడపిల్లకు అన్యాయం జరిగినట్టు భావించి పనిచేస్తారు. 24 గంటల్లో... అత్యాచారం జరిగిన ఏడాది తర్వాత ఆ కిరాతకులు దాన్ని సీడీగా తయారుచేసి ఆ అమ్మాయికి పంపారు. మళ్లీ వాళ్లు చెప్పినచోటుకు రాకపోతే కేబుల్టీవీలో ప్రసారం చేస్తామని బెదిరించడం మొదలుపెట్టారు. బాధితురాలు రానని చెప్పింది. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి తెలిసినవాడే అయినా ఏం చెయ్యలేని దుస్థితి! ఎన్నిసార్లు బెదిరించినా అమ్మాయి లొంగకపోయేసరికి వాళ్లు కేబుల్‌టీవీ ఆపరేటర్లకు డబ్బిచ్చి దీన్ని ప్రసారం చేయించారు. తన రెండేళ్ల నరకం గురించి బాధితురాలు మాకు చెప్పుకొస్తుంటే డిపార్టుమెంట్లో ప్రతిఒక్కరు ఆవేశంతో ఊగిపోయారు. ఆ కిరాతుకుల్ని వీలైనంత త్వరగా పట్టుకోవాలన్న పట్టుదలతో ఎవరికివారు టీమ్‌ల మాదిరిగా విడిపోయి పనిచేశారు. కొత్తగూడెం డిఎస్పి, ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు అందరూ ఇదేపనిలో పడ్డారు. 24గంటల్లో తొమ్మిదిమందిని అరెస్టు చేశారు. వారిలో పద్దెనిమిదేళ్ల కుర్రాడి నుంచి యాభైఅయిదేళ్ల పెద్దమనిషి వరకూ ఉండడం సిగ్గుచేటనిపించింది. ఆ పనిచేసింది కుర్రాళ్లయితే యువత చెడు మార్గంలో పోతుందని చెప్పుకుంటాం. కానీ యాభై ఏళ్ల వయసున్న వ్యక్తులున్నారంటే ఎలాంటి సమాజంలో ఉన్నామోనని అందరం తలదించుకున్నాం. అన్ని కేసులు... అత్యాచారం చేసిన వారిని అరెస్టు చేయడంతో మాపని పూర్తవ్వలేదు. వారిచ్చిన ఫొటోలను వీడియోలా తయారుచేసిన నలుగురు కుర్రాళ్లను ఐటియాక్ట్ కింద అరెస్టు చేశాం. ఆటోడ్రైవర్ని అదుపులోకి తీసుకున్నాం. అందరిపై కేసులు పెట్టాం. గ్యాంగ్ రేప్, కిడ్నాపింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్... అన్నీ ఫైల్ చేశాం. కొత్తగూడెం పోలీస్‌స్టేషన్‌కి కోర్టు కిలోమీటరు దూరం ఉంటుంది. మామూలుగా నిందితుల్ని కోర్టుకి జీపులోనే తీసుకెళతాం. కానీ ఈ కేసులో నేను వీరిని రోడ్డుపై అందరికీ వీళ్ల గురించి తెలిసేలా నడిపించుకుని తీసుకురమ్మన్నాను. సాక్ష్యాలన్నీ పక్కాగా ఉండాలి కదా! రెండేళ్ల తర్వాత కూడా బాధితురాలికి చేసిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు వచ్చింది. అలాగే అత్యాచారానికి సంబంధించి తయారుచేసిన సీడీలో ఉన్న ఫొటోలు మార్ఫింగ్‌వి కావన్న రిపోర్టు కూడా వచ్చింది. కేసు సీరియస్‌నెస్‌ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టిగేషన్ డిఎస్పి రేంజ్ ఆఫీసర్‌కి అప్పజెప్పారు. యావజ్జీవం... ఈ బాలిక కేసుని జిల్లా జడ్జి జగన్నాథ్ రెడ్డిగారి దగ్గర్నుంచి అందరూ సీరియస్‌గా తీసుకున్నారు. కలెక్టర్ ఉషారాణి కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండు రోజులకోసారి ఎంతవరకు వచ్చిందంటూ ఎంక్వయిరీలుండేవి. మా డిపార్టుమెంట్ సంగతంటారా... అందరినీ కటకటాల వెనక్కి నెట్టేవరకూ ఎవరూ నిద్రపోయేట్టు లేరు. కేసుని ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకి తరలించారు. ఏడాది తిరక్కుండా తీర్పు వచ్చింది. తొమ్మిదిమందికి జీవితఖైదు పడింది. ఆటో డ్రైవర్‌కి పది సంవత్సరాల జైలు శిక్ష. సీడీలు చేసిన నలుగురు కుర్రాళ్లకి ఐదేళ్లజైలు శిక్ష, యాభైవేల రూపాయల జరిమానా విధించారు. అక్కడితో అయిపోలేదు... మా దృష్టికి వచ్చిన కేసుని సాక్ష్యాలతో సహా కోర్టులో ఫైల్ చేశాక నేరస్తుడికి శిక్ష పడడంతో మామూలుగా మా పని పూర్తయిపోతుంది. కానీ ఈ కేసు విషయంలో అలా అనుకోలేదు. బాధితురాలి సంక్షేమం కోసం మేం చేయాల్సిన పనులన్నీ పూర్తిచేయాలనుకున్నాను. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అప్పటికి 2003- 28 జీవో ప్రకారం గ్యాంగ్‌రేప్ బాధితురాలికి ప్రభుత్వం లక్ష రూపాయల నష్టపరిహారం ఇస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినపుడు 25 వేలు, చార్జ్‌షీటు దాఖలు చేసినపుడు 25 వేలు, కేసు ట్రయిలర్ అయ్యాక మిగతా 50 వేల రూపాయలు ఇస్తారు. ఈ బాధితురాలికి కూడా ఆ నగదు అందేలా చేశాం. అలాగే హైదరాబాద్‌లో దుర్గాబాయి దేశ్‌ముఖ్ పాలిటెక్నిక్ కళాశాలలో మహిళా బాధితులకు 70 శాతం రిజర్వేషన్ ఉంటుంది. జిల్లా కలెక్టర్‌గారి సాయంతో ఆ బాధితురాలికి సీటు ఇప్పించాం. ఓ స్వచ్చంద సంస్థ సాయంతో అవసరమైన కౌన్సెలింగ్‌లు చేయించాం. మొదటిసారి ఆ అమ్మాయిని చూసినపుడు బాధనిపించింది. డిప్లమా పూర్తిచేసిందని తెలిశాక సంతోషం కలిగింది. కనీస బాధ్యత... రేప్ కేసులు వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్‌కి ఈ కేసు ఫైలు ఉపయోగపడుతుందని కేసు తీర్పు కాపీని అన్ని జిల్లాల ఎస్పీలకు పంపించారు. కేసు పరిష్కారం తర్వాత నాకు, కొత్తగూడెం డిఎస్పికి, ఇన్స్పెక్టర్కి పై అధికారుల నుంచి ప్రశంసా పత్రాలు వచ్చాయి. ఇక్కడ మరోసారి నేను మెచ్చుకోవాల్సినవారు ఖమ్మం మీడియా ప్రతినిధులు. ఒక్క వార్త కూడా రాకుండా, బాధితురాలి వివరాలు నలుగురికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. మహిళలపై దాడులకు సంబంధించిన కేసుల పరిష్కారంలో పోలీసులకు మీడియా నుంచి, పబ్లిక్ నుంచి అవసరమైన సహకారం అందకపోతే మా కష్టం మొత్తం వృథా అయిపోతుందని ఈ సందర్భంగా మరొకసారి గుర్తుచేస్తున్నాను. రిపోర్టింగ్: భువనేశ్వరి ఫొటో: రాజేశ్ -
ఆప్‌కు పెరిగిన క్రేజ్
న్యూఢిల్లీ: అనూజ్ బన్సాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి. దాతలు అందించే చెక్కులు, విరాళాలకు సంబంధించి ఫోన్ కాల్స్ మాట్లాడుతుండేవాడు. కానీ, మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ఆప్ అభిమానులు చేస్తున్న ఫోన్ కాల్స్‌తో బిజీబిజీగా గడుపుతున్నాడు. కాల్ చేసిన ప్రతి ఒక్కరూ ‘మా రాష్ట్రంలో ఆప్ శాఖ ఎప్పుడు ప్రారంభిస్తున్నారు?’ అని అడుగుతుండటంతో జవాబు చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ‘ప్రతి ఒక్కరూ తమ రాష్ట్రం, నగరంలో ఆప్ శాఖను చూడాలనుకుంటున్నారు. అందకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికీ నేను కచ్చితమైన సమాధానమిస్తున్నాను. మమ్మల్ని మీరు ఆహ్వానిస్తే వస్తామని చెబుతున్నాను’ అని బన్సాల్ చెప్పారు. కాగా, యువ రాజకీయ పార్టీ అయిన ఆప్‌ను ఏర్పాటు చేసి ఇప్పటికి 27 నెలలే గడిచింది. ఇప్పటికిప్పుడు ఢిల్లీకి బయట దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించే ప్రణాళికలు ఆప్‌కు లేవు. లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానల్లో పోటీచేసి ఘోరంగా విఫలమైన విషయాన్ని ఆప్ నాయకులు ఇంకా మర్చిపోలేదు. కానీ, దేశ రాజకీయాల్లో కేంద్ర బిందువు అవడానికి ఇది పెద్ద విషయం కాదు. కాంగ్రెస్‌ను స్థానాన్ని ఆక్రమించడం ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఆ విస్తరణ పంజాబ్‌తోనే ప్రారంభించవచ్చు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం కోసం కొన్ని నెలలుగా తీవ్రంగా శ్రమించిన పార్టీ వాలంటీర్లు ఇప్పటికే తమ పట్టణాలు, నగరాల్లో పార్టీ శాఖలు ఏర్పాటు చేశారు. ‘మా సిద్ధాంతాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్లినట్లయితే, మార్పునకు మార్గదర్శకులుగా నిలుస్తాం. ఢిల్లీలో ఇంటింటికీ ప్రచారంలో పాల్గొన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గురించి ప్రజలు అడిగే ప్రశ్నలు కొన్ని చాలా బాధ పెట్టాయి. ముఖ్యంగా కేజ్రీవాల్ రాజీనామాపై అనేక మంది ప్రశ్నించారు. కొంతమంది తీవ్రంగా అవహేళన కూడా చేశారు. కానీ, కొంత కాలానికి అందరి నోళ్లు మూతపడ్డాయి. తిరిగి ప్రజలు మళ్లీ కేజ్రీవాల్‌ను గౌరవించడం మొదలు పెట్టారు. ఇతర పార్టీల వారు డబ్బు చెల్లించి కొంతమందిని ప్రచారంలో వెంటతిప్పుకున్నారు. కానీ, ఆప్ కోసం కొన్ని వేల మంది స్వచ్ఛందంగా ముందుకు రావడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. మహారాష్ట్ర, కర్ణాటక, హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఇలా అనేక రాష్రాల నుంచి తరలివచ్చి రోజులు, వారాల తరబడి ప్రచారంలో పాల్గొన్నారు. వారి రవాణా ఖర్చులను కూడా పూర్తిగా వారే భరించారు. ఆప్ కేవలం వారికి వసతి, ఆహార సౌకర్యాలు మాత్రమే కల్పించింది’ అని బెంగుళూరుకు చెందిన ఆదర్శ్‌కుమార్ (23) అన్నాడు. ఆప్ విజయం కోసం ఇతను గత కొన్ని నెలలుగా ఇక్కడే ఉండి ఎన్నికల ప్రచార బృందానికి ఇన్చార్జిగా వ్యవహరించాడు. మొత్తం 20,000 మంది వాలంటీర్లు 70 నియోజకవర్గాల్లో రేయింబవళ్లు పార్టీ కోసం కష్టపడ్డారు. ఒకవేళ ఇతర ప్రాంతాల్లోనూ విస్తరించాలని అధినాయకత్వం నిర్ణయిస్తే అనుసరించడానికి వీరంతా సైనికుల వలే సిద్ధంగా ఉన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన మనీష్(23) ఇప్పటికీ ఢిల్లీలోనే ఉన్నాడు. అతను ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ ప్రమాణస్వీకారాన్ని వీక్షించాలనుకుంటున్నాడు. కొంతమంది పెయిడ్ హాలీడే పెట్టి వచ్చి ప్రచారంలో పాల్గొన్న యువకులు తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ‘చాలా మంది వాలంటీర్లు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. కొంత మంది మాత్రమే ఉన్నత తరగతికి చెందిన వాళ్లు ఉన్నారు. కానీ, మా అందరి మధ్య బాంధవ్యం బలపడింది. మేమందరం ‘ఆప్’ని చూసి గర్వపడుతున్నాం’ అని మనీష్ తెలిపాడు. -
కంట్రోల్ రూంకు ఫేక్కాల్స్తో తలనొప్పి
సాక్షి, ముంబై: నగర పోలీసు కంట్రోల్ రూం కు వస్తున్న వందలాది అనవసరమైన ఫోన్ కాల్స్ వల్ల పోలీసులకు తలనొప్పిగా మారింది. పోలీసు శాఖతో సంబంధంలేని కాల్స్‌కు సమాధానం ఇవ్వలేక కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు బేజారవుతున్నారు. అత్యవసర సమయంలో లేదా దొంగతనాలు, దాడులు, సీనియర్ సిటిజన్లకు ఇబ్బందులకు గురిచేయడం, బాలికలు, మహిళలపై అత్యాచారాలు, వేధింపులు తదితర విషయాలపై పోలీసుల సాయం కోసం నగర పౌరులు సంప్రదించేందుకు పోలీసు శాఖ 100, 103 నంబర్లు ప్రవేశపెట్టింది. వీటిని 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. పోలీసు కంట్రోల్ రూంకు ప్రతీరోజు వస్తున్న దాదాపు 11వేల ఫోన్ కాల్స్‌లో కేవలం 10 శాతం మాత్రమే స్పందించే విధంగా, చర్యలు తీసుకునేలాగా ఉంటున్నాయి. మిగతావన్నీ అనవసరమైనవేనని పోలీసులు వెల్లడించారు. కంట్రోల్ రూం విధులు నిర్వహించే మహిళా పోలీసులతో అసభ్యకరంగా మాట్లాడడం, ట్యాక్సీ, ఆటోలు, రైళ్లు, బస్సుల రాకపోకల గురించి విచారించడం, ఏ సినిమా ఏ థియేటర్లో ఆడుతుంది...? సేవా సంస్థలు, పోలీసు స్టేషన్ల ఫోన్ నెంబర్లు కావాలని డిమాండ్ చేయడం ఇలా అనేక అనవసరమైన ఫోన్లు వస్తున్నాయని వారు తెలిపారు. రెండు హెల్ప్ లైన్లు ముంబైకర్ల భద్రత కోసం, నేరాలను అరికట్టడం, ప్రజల్లో నెలకొన్న భయాన్ని తొలగించడానికి ఏర్పాటుచేసినవనీ, వాటిని మార్గంలో వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని పోలీసు కమిషనర్ (దర్యాప్తు శాఖ) ధనంజయ్ కులకర్ణి తెలిపారు. -
మంత్రిగారికి సెల్‌ఫోన్ చిక్కులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చేసిన ప్రకటన..వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చిక్కులు తెచ్చిపెట్టింది. రుణమాఫీ జాబితాపై ఏవైనా సమస్యలుంటే మంత్రి పుల్లారావుకు ఫోన్ చేయాలంటూ రఘువీరా ఆయన ఫోన్ నెంబర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా రైతుల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్‌కు మంత్రి ఇబ్బంది పడుతున్నారట. రైతులు తమ సమస్యలు గురించి మంత్రికి ఏకరువు పెడుతున్నారు. రైతుల ఫోన్ కాల్స్‌కు సమాధానం చెప్పలేక మంత్రి అవస్థలు పడుతున్నారు. ఒక్క ఫోన్ కాల్‌కు సమాధానం చెప్పేలోపే 10 మిస్డ్ కాల్స్ వస్తున్నాయంటూ మంత్రి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. -
‘పుట్టగుంట’కు మావోయిస్టుల బెదిరింపు ఫోన్‌కాల్స్
హనుమాన్‌జంక్షన్ : హనుమాన్జంక్షన్కు చెందిన పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్‌కుమార్‌కు మావోయిస్టు పార్టీ నేతల పేరుతో బెదిరింపు ఫోన్‌కాల్స్ రావటం స్థానికంగా కలకలం సృష్టించింది. గత నాలుగు రోజులుగా వరుస ఫోన్‌కాల్స్ రావటంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టు పార్టీ ఆగ్రనేత ముపాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేసి పార్టీకి ప్లీనరీ నిర్వహణకు నిధులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు నాలుగైదు సార్లు ఫోన్‌కాల్స్ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో కూడా కాల్ వచ్చింది. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనపై జంక్షన్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సతీష్ ఇల్లు, కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆయనకు వచ్చిన ఫోన్ నంబరుపై నిఘా పెట్టారు. నిజంగా మావోయిస్టులు చేస్తున్నారా? లేక వారి పేరుతో డబ్బు వసూలు కోసం ఇతరులెవరైనా యత్నిస్తున్నారా ? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే ఆ ఫోన్ నంబరుకు సంబంధించిన కాల్‌డేటాను పోలీసులు సేకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి ఆ వ్యక్తి ఫోన్ చేస్తున్నట్లుగా గుర్తించారు. వాస్తవానికి ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని శ్రీకాకుళం జిల్లా నుండి మాట్లాడుతున్నట్లు సదరు వ్యక్తి తొలుత పుట్టగుంటకు ఫోన్లో చెప్పాడు. కాల్‌డేటాను పరిశీలిస్తే వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి ఫోన్ చేసినట్లు వెల్లడైంది. ఏఎస్సై నేతృత్వంలో ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన బృందం వరంగల్ చేరుకుని అక్కడి పోలీసుల సహకారంతో విచారణ చేస్తోంది. నకిలీ ఆధారాలతో బ్యాంకు ఖాతా.. పుట్టగుంట సతీష్‌కుమార్‌కు మావోయిస్టు నేత గణపతి పేరుతో ఫోన్ చేసిన వ్యక్తి ఇచ్చిన బ్యాంకు ఖాతా వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. కరీంనగర్ సమీపంలోని ఐ.సి.ఐ.సి.ఐ బ్రాంచ్‌లో ఈ ఖాతా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖాతాకు సంబంధించి బ్యాంకు అధికారులకు ఇచ్చిన ఆడ్రస్సు, ఇతర ఆధారాలు సరైనవి కాకపోవటంతో పాటు నగదును కూడా పూర్తిగా ఏటీఎం ద్వారానే డ్రా చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఆ ఖాతాలోకి ఎప్పుడెప్పుడు, ఎవరి ఖాతాల లోంచి ఎంత మొత్తంలో నగదు జమ అయింది.. అనే సమాచారాన్ని బ్యాంకు అధికారుల నుంచి పోలీసులు సేకరిస్తున్నారు. ఆగ్రనేతే ఫోన్ చేస్తాడా? సాక్షాత్తూ మావోయిస్టు పార్టీ ఆగ్రనేత ముపాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పేరుతో బెదిరింపు ఫోన్‌కాల్స్ రావటంపై పోలీసుల్లో సైతం విస్మయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి రికార్డు చేసిన బెదిరింపు ఫోన్‌కాల్స్‌లోని వ్యక్తి మాటతీరును బట్టి అతడికి సుమారు 35 ఏళ్ల వయస్సు ఉండవచ్చని తెలిసింది. కానీ గణపతికి 60 ఏళ్లు పైబడి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. -
‘డయల్ యువర్ కలెక్టర్’కు 17 ఫోన్‌కాల్స్
విశాఖ రూరల్: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 17 ఫోన్‌కాల్స్ వచ్చాయి. కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, జేసీ ప్రవీణ్‌కుమార్, ఏజేసీ వై.నరసింహారావు ఫోన్‌కాల్స్‌కు సమాధానమిచ్చారు. చింతపల్లి మండ లం తాజంగి గ్రామంలో వ్యవసాయశాఖకు చెందిన భూమి అన్యాక్రాంతమైందని, కొంతమంది వ్యక్తులు అక్రమంగా అనుభవిస్తున్నారని చింతపల్లి నుంచి ఒక ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేయాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ జేడీని ఆదేశించారు. అనంతగిరిలో హరిత రిసార్ట్స్‌లో బార్ పెడుతున్నట్లు తెలిసిందని, ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఒకరు ఫోన్లో చెప్పగా పర్యాటక శాఖకు ఈ విషయం తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డుమా పీడీ శ్రీరాములునాయుడు, డీఈఓ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతకు బెదిరింపు కాల్స్
ప్రాణ హాని ఉందని ఎస్పీ, డీజీపీ, హోంమంత్రికి రమేష్‌రెడ్డి ఫిర్యాదు తాడిపత్రి : వైఎస్సార్సీపీ యువజన నాయకుడు, తాడిపత్రి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ రమేష్‌రెడ్డికి ఇటీవల గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తుండడంతో ఆయన పోలీసులను ఆశ్రయించినట్లు విశ్వసనీయ సమాచారం. గత సార్వత్రిక, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఆయన చురుకుగా పాల్గొన్నారు. ఇటీవల పార్టీలో క్రియశీలకంగా పని చేస్తున్నారు. దీంతో అధికార పార్టీ నేతల దృష్టి రమేష్‌రెడ్డిపై పడ్డంతో ఆయనను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. గత 20 రోజుల క్రితం కూడా ఆయన ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు దాక్కోని ఉండటాన్ని గుర్తించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీరు వచ్చే లోపే దుండగులు పారిపోయారని స్థానికులు పోలీసులకు తెలిపారు. అత్యంత సమస్యాత్మక మైన తాడిపత్రి ప్రాంతంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలను బెదిరించడం, దౌర్జన్యాలకు పాల్పడటం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే రమేష్‌రెడ్డికి చెందిన కళాశాల, ఆస్తుల విషయంలో అధికార పార్టీ నేతలు స్వయంగా కరపత్రాలను పంచి దుష్ర్పచారం చేశారు. అలాగే వారం క్రితం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, దీంతో తనకు ప్రాణహాని ఉందని రమేష్‌రెడ్డి జిల్లా ఎస్పీ, డీజీపీ, హోంశాఖ మంత్రిని కలిసి వివరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆయనకు వచ్చిన ఫోన్ కాల్స్ లిస్టు ఆధారంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
అడవిలో జల్లెడ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పశ్చిమ’ ఏజెన్సీలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్దిరోజులుగా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో మావోల సంచారం, కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కుమారుడి కిడ్నాప్, పలువురు వ్యాపారులు, ప్రముఖులకు డబ్బు కోసం బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం వంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ చేపట్టినట్టు తెలుస్తోంది. శని వారం అటవీ ప్రాంతంలో సాయుధ పోలీసులు ప్రవేశించి మొత్తంగా జల్లెడ పడుతున్నట్టు సమాచారం. ఏలూరు నుంచి అడవిలోకి వెళ్లిన స్పెషల్ పార్టీ పోలీస్ బృందంలో 14మంది సభ్యులున్నట్టు తెలుస్తోంది. అయితే, కూంబింగ్‌పై అధికారికంగా సమాచారం ఇచ్చేందుకు పోలీసు అధికారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అసలు ఆ ప్రాంతంలో సంచరిస్తోంది మావోయిస్టులా.. వారి పేరుచెప్పుకుని నకిలీ దళాలు దందా చేస్తున్నాయా అనే అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. ‘పశ్చిమ’ ఏజెన్సీలో తెలంగాణలోని మావో ప్రభావిత ఖమ్మం జిల్లా మండలాలు కలిసిన నేపథ్యంలో మావోయిస్టుల వ్యవహారంపై సీరియస్‌గానే దృష్టి కేంద్రీకరించామని ఆ అధికారి వెల్లడించారు. -
సిబ్బంది లేక ఇబ్బంది
సాక్షి, నెల్లూరు: రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. మరోవైపు వడగాలులు సైతం ప్రతాపం చూపుతున్నాయి. ప్రమాదవశాత్తు, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ .. ఇలా కారణాలేవైనప్పటికీ జిల్లాలో అగ్నిప్రమాదాలు అధికమౌతున్నాయి. గత ఏడాది ఇదే నెలలో 120 నుంచి 140 వరకు అగ్నిప్రమాదాలకు సంబంధించి అధికారులకు ఫోన్‌కాల్స్ రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 200 కాల్స్ నమోదు అయ్యాయంటే ప్రమాదాల సంఖ్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకే రోజు 25 ఘటనలకు సంబంధించిన ఫోన్ కాల్స్ వచ్చిన సందర్భం కూడా ఉంది. అయితే పరిస్థితికి తగినట్టుగా జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం జిల్లాలో 13 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 45 ఫైర్‌మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపినా అవి ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగిన సమయంలో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతోంది. కొన్ని అగ్నిమాపక కేంద్రాల్లో బోర్లు ఏర్పాటు చేసినా వాటిలో నీటి లభ్యత తక్కువగా ఉంది. దీంతో ప్రమాదాలు జరిగిన సమయంలో నీటి సేకరణ కోసం సిబ్బంది పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. మరిన్ని అగ్నిమాపక కేంద్రాలు అవసరం జిల్లాలో ప్రస్తుతం మర్రిపాడు, ఉదయగిరి, ఆత్మకూరు, వింజమూరు, కావలి, నెల్లూరు, గూడూరు, కోట, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, రాపూరు, పొదలకూరులో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ప్రమాదాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వీటిలోని అగ్నిమాపక వాహనాలు సకాలంలో వెళ్లి సేవలందించలే కపోతున్నాయి. చాలా చోట్ల ప్రమాదాలు జరిగిన సమయంలో ఫైరింజన్లు వెళ్లేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. మరోవైపు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి జోరుగా సాగుతోంది. పలు పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పలుచోట్ల అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం వెంకటాచలం, కొడవలూరు మండలం నార్త్‌రాజుపాళెం, నెల్లూరులోని టీబీ ఆస్పత్రి ప్రాంగణంలో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అత్యాధునిక పరికరాల కొరత అగ్నిప్రమాదాలు సంభవించినపుడు మంటలను ఆర్పేందుకు, ప్రాణనష్టాన్ని నివారించేందుకు అవసరమయ్యే ఆధునిక యంత్ర పరికరాలు(రెస్క్యూ ఎక్విప్మెంట్) ప్రస్తుతం జిల్లాలో తగినన్ని లేవు. మరోవైపు అపార్టుమెంట్లు, భారీ షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో ప్రమాదాలు జరిగినా స్కైలిఫ్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఏమీ చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో రూ.3 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలు అవసరమని జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కనీసం 25 మీటర్ల ఎత్తులో మంటలను ఆర్పేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చాలని కోరారు. ఇరుకు వీధుల్లో ప్రమాదాలు సంభవించినా త్వరితగతిన వెళ్లేందుకు క్విక్ రెస్పాన్స్ వాహనం మరో వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది. సకాలంలో స్పందిస్తున్నాం అగ్నిమాపక శాఖ సిబ్బంది కేవలం మంటలను ఆర్పడానికే పరిమితం కావడం లేదు. ఎవరు ఎలాంటి ఆపదలో చిక్కుకున్నా మాకు సమాచారం అందిస్తే స్పందిస్తున్నాం. ఇటీవల వెంకటాచలం సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ వాహనంలోనే ఇరుక్కుపోయాడు. మా వద్ద ఉన్న ప్రత్యేకమైన పరికరాల సహాయంతో అతన్ని బయటకు తీసి ప్రాణాలు కాపాడగలిగాం. జి.శ్రీనివాస్, డీఎఫ్ఓ -
నీటిలోనూ ఫోన్ సేఫ్
ట్రావెల్ గేర్ దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ఎండ తాపానికి ఈత కొలనులలో గంటలు గంటలు ఈదుతూ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అలాగే అనుకోకుండా వర్షంలో తడవాల్సిన పరిస్థితులు ఎదరవ్వచ్చు. అలాంటి సమయాలలో ముఖ్యమైన ఫోన్ కాల్స్ వస్తే రిసీవ్ చేసుకోవడం సాధ్యపడదు. వేలకు వేల రూపాయలు పోసి కొన్న స్మార్ట్ ఫోన్లు నీళ్లు తగిలితే పాడైపోతాయి. ఇప్పటికే వాటర్‌ప్రూఫ్ ఫోన్లు వచ్చినప్పటికీ, ఇవి అందరికీ అందుబాటులోకి రాలేదు. అయితే, నీళ్లలో పడితే ఫోన్ పాడవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీటిలో ఈదుతూ ఫోన్ మాట్లాడాలని కోరుకునేవారికి సౌలభ్యంగా ఈ సెల్‌ఫోన్ వాటర్‌ప్రూఫ్ పౌచ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వాటర్‌ప్రూఫ్ పౌచ్ ఉన్నప్పటికీ నీటిలో ఈదుతూ ఫొటోలూ తీసుకోవచ్చు. వాటర్‌ప్రూఫ్ ఫోన్ పౌచ్ ధర రూ.700 పైనే. షాపింగ్ మాల్స్‌లో లభిస్తున్నాయి. ఆన్లైన్ షాపింగ్ ద్వారా తెప్పించుకోవచ్చు. -
అపరిచిత ఫోన్ కాల్స్‌తో పోలీసుల అప్రమత్తం
* అపరిచిత ఫోన్ కాల్స్‌తో పోలీసుల అప్రమత్తం * పలు ప్రాంతాల్లో తనిఖీలు బెంగళూరు- గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలులో పేలుళ్ల షాక్ నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే నగరవాసులు శుక్రవారం మరోసారి బెంబేలెత్తిపోయారు. నగరం, శివార్లలోని పలు ప్రాంతాల్లో అమర్చిన బాంబులు పేలనున్నట్లు పోలీస్ కంట్రోల్ రూమ్‌లకు వచ్చిన ఫోన్ కాల్స్ పోలీసులను పరుగులు పెట్టించాయి. బాంబులేవీ దొరక్కపోవడంతో ప్రజలు, పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: పాఠశాలలు, కాలేజీలు, షాపింగ్‌మాళ్లు, రైల్వే స్టేషన్లలో బాంబులు పెట్టామని, అవి మరికొద్ది సేపట్లో పేలనున్నాయని వివిధ పోలీస్ స్టేషన్ కంట్రోలు రూములకు గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వరుసగా అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆవడి పరిధిలోని పలు రైల్వే స్టేషన్లలో బాంబులు పెట్టినట్లు గురువారం రాత్రి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఆవడి, అన్నానగర్, తిరుములైవాయిల్ తదితర లోకల్ రైల్వే స్టేషన్లను శుక్రవారం తెల్లవారుజాము వరకు తనిఖీలు చేశారు. ఎగ్మూరు మరో సమాచారంతో అక్కడా తనిఖీలు చేశారు. ‘‘రాయపేటలోని ఎక్స్‌ప్రెస్ అవెన్యూలో భారీ బాంబును అమర్చాం అది మరికొద్దిసేపట్లో పేలుతుంది, చాతనైతే ఆపుకోండి.’’ అంటూ సవాల్ విసురుతూ శుక్రవారం ఉదయం పోలీసులకు మరో ఫోన్ కాల్ వచ్చింది. బాంబ్ స్క్వాడ్, పోలీసు జాగిలాలతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఎక్స్‌ప్రెస్ అవెన్యూలో పెట్టిన బాంబులు వెతికేందుకు పోలీసులు వచ్చారని తెలుసుకున్న వినియోగదారులు, షాపుల యజమానులు వెలుపలకు పరుగులు పెట్టారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే అవెన్యూ ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారింది. సుమారు మూడు గంటల పాటూ అణువణువునా గాలించిన పోలీసులు ఏమీ లేదని నిర్ధారించుకున్నారు. ఈలోగా టీనగర్‌లోని ఎస్ఎస్ఎస్ జైన్ మహిళా కళాశాలలో బాంబులు అమర్చినట్లు మరో ఫోన్ కాల్ వచ్చింది. పోలీసు బృందాలు అక్కడ కూడా తనిఖీలు చేసి ఒట్టి బెదిరింపేనని ఊపిరి పీల్చుకున్నారు. తిరువికనగర్‌లోని ఒక పబ్లిక్ బూత్ నుంరి ఈ ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు చేశారా లేక ఆకతాయి చేష్టలా అని పోలీసులు ఆరాతీస్తున్నారు. మరో సమాచారంతో అక్కడా తనిఖీలు చేశారు. ‘‘రాయపేటలో ని ఎక్స్‌ప్రెస్ అవెన్యూలో భారీ బాంబును అమర్చాం అది మరికొద్దిసేపట్లో పేలుతుంది, చాతనైతే ఆపుకోండి.’’ అంటూ సవాల్ విసురుతూ శుక్రవారం ఉదయం పోలీసులకు మరో ఫోన్ కాల్ వచ్చింది. బాంబ్ స్క్వాడ్, పోలీసు జాగిలాలతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఎక్స్‌ప్రెస్ అవెన్యూలో పెట్టిన బాంబులు వెతికేందుకు పోలీసులు వచ్చారని తెలుసుకున్న వినియోగదారులు, షాపుల యజమానులు వెలుపలకు పరుగులు పెట్టారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే అవెన్యూ ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారింది. సుమారు మూడు గంటల పాటూ అణువణువునా గాలించిన పోలీసులు ఏమీ లేదని నిర్ధారించుకున్నారు. ఈలోగా టీనగర్‌లోని ఎస్ఎస్ఎస్ జైన్ మహిళా కళాశాలలో బాంబులు అమర్చినట్లు మరో ఫోన్ కాల్ వచ్చింది. పోలీసు బృందాలు అక్కడ కూడా తనిఖీలు చేసి ఒట్టి బెదిరింపేనని ఊపిరి పీల్చుకున్నారు. తిరువికనగర్‌లోని ఒక పబ్లిక్ బూత్ నుంరి ఈ ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు చేశారా లేక ఆకతాయి చేష్టలా అని పోలీసులు ఆరాతీస్తున్నారు. -
6 నెలల్లో 15 వేల కాల్స్.. మహిళ అరెస్ట్
పోలీసులకు ఫోన్ కాల్స్ చేసినందుకు జపాన్‌లో ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఈ మాత్రానికే జైల్లో పెడతారా అని ఆశ్చర్యపోవచ్చు. అయితే ఫోన్ చేయడమంటే అలా ఇలా కాదు.. ఆరు నెలల వ్యవధిలోనే పోలీసులకు 15 వేల ఫోన్ కాల్స్‌కు చేసిందట. ఇక ఓ రోజయితే ఏకంగా 927 సార్లు ఎమర్జన్సీ కాల్స్ చేసిందట. తమ విధులకు పదేపదే ఆటంకం కలిగిస్తుండటంతో విసుగెత్తిపోయిన పోలీసులు ఆ మహిళను ఆరెస్ట్ చేశారు. జపాన్‌లోని సాకాయ్ సిటీలో ఈ సంఘటన జరిగింది. 44 మహిళ గత మే నుంచి ఫోన్ తతంగం మొదలు పెట్టింది. మధ్యలో పోలీసులు ఆమెను కలసి తమ విధులకు ఆటంకం కలిగించొద్దని హెచ్చరించారు. అందులోనూ ఒకసారో రెండుసార్లో కాదు 60 సార్లు ఆమె ఇంటికి వెళ్లి నచ్చజెప్పారు. అయినా ఆమె ధోరణి మార్చుకోకపోవడంతో అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఆమె ఫోన్ చేసేందుకు తగిన కారణమంటూ లేదని పోలీసులు తెలిపారు. ఆమెకు మానసిక సమస్య లేకపోవచ్చని తెలిపారు. మూడేళ్ల జైలు శిక్ష లేదా భారీ మొత్తంలో జరిమానా పడే అవకాశముందని తెలిపారు.