ముసలోళ్లకే 'ఆ' తెగులు ఎక్కువట!
సాధారణంగా అమ్మాయిల సెల్ఫోన్లకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడే విషయంలో కుర్రాళ్లే ముందుంటారని అనుకుంటాం కదూ. కానీ.. అలా మాట్లాడే తెగులు ముసలోళ్లకే ఎక్కువగా ఉంటోందట. ఈ విషయం చాలా శాస్త్రీయంగా లెక్కలు తీస్తే తేలింది. 1090 అనే నెంబరు మహిళల హెల్ప్లైన్గా ఉంటోంది. ఉత్తరప్రదేశ్లో మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ఈ నెంబరు ఉపయోగిస్తున్నారు. ముక్కూ ముఖం తెలియని వాళ్లకు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడేవాళ్లలో ఎక్కువ మంది 50 ఏళ్ల వయసులోనే ఉంటున్నారట. ఇంకా మాట్లాడితే.. 60, 70 ఏళ్ల వాళ్లు కూడా ఇలా మాట్లాడుతూ తమలో తామే ఆనందిస్తున్నారని తెలిసింది. మహిళలకు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారంటూ మొత్తం 3.45 లక్షల ఫిర్యాదులు రాగా, వాటిలో 45 శాతం మంది 40 ఏళ్ల పైబడినవాళ్లే. 50 ఏళ్లు దాటినవాళ్లు కూడా 5 శాతం మంది ఉన్నారట.
2012 నవంబర్ నెలలో 1090 హెల్ప్లైన్ ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఇలా పెద్దవయసు వాళ్లు ఫోన్లు చేసి వేధిస్తున్న ఫిర్యాదులు ఎక్కువగా ఉంటున్నాయని లక్నోలో ఈ హెల్ప్లైన్ నిర్వహించే ఓ పోలీసు తెలిపారు. ఇలా వేధించేవాళ్లను తొలుత పిలిపించి కౌన్సెలింగ్ చేస్తారు. అయినా వినిపించుకోకుండా మళ్లీ అలాగే చేస్తే.. అప్పుడు కసు బుక్ చేస్తారు.