సాక్షి, హైదరాబాద్ : అత్యవసర సమయంలో ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది డయల్–100. ఆపదలో ఉన్న వారికి క్షణాల్లో పోలీసులు మేమున్నామని భరోసా కల్పిస్తున్నారు. సహాయం కోసం కాల్ వచ్చిన 90 సెకన్లలోనే బాధితులకు అందుబాటులోకి వచ్చి వారిని ఆదుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి గత నవంబరు చివరి నాటికి డయల్–100కు మొత్తం 55,62,389 అత్యవసర ఫోన్లు వచ్చాయి. వాటిలో భౌతిక దాడులకు సంబంధించి 12,02,923, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 9,96,032, న్యూసెన్స్ 8,58,871, మహిళలపై దాడులు 6,49,109, ఆత్మహత్యలు 2,10,936, ఎన్నికలకు సంబంధించినవి 29,113, ఫోన్లు ఉన్నాయి. ఈ కాల్స్‌పై పోలీసులు సత్వరం స్పందించడమే కాకుండా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ అవసరమైన మార్పులు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment