కర్ణాటక , బొమ్మనహళ్లి : తాను ప్రేమించిన యువతి కోసం ఏడాదిన్నర కాలంగా హుబ్లీ విమానాశ్రయానికి ఫోన్లు చేస్తున్న ప్రేమికుడు ఎవరనే విషయాన్ని అధికారులు గుర్తించారు. వివరాలు..గోవాకు చెందిన రాయ్ డయాన్ అనే వ్యక్తి గోవా విమానాశ్రమలో పనిచేసే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న యువతిని ప్రేమించాడు. ఆ యువతికి హుబ్లీకి బదిలీ కాగా ఆమె ప్రేమ విషయాన్ని మరచిపోయింది. తర్వాత రాయ్ దుబాయ్ వెళ్లారు. అయితే ఆ యువతికి రోజూ ఫోన్లు చేసేవాడు.
దాంతో యువతి తాను వాడుతున్న మొబైల్ నంబర్ మార్చింది. ఆందోళనకు గురైన రాయ్ హుబ్లి ఏటీసీ నంబర్ తెలుసుకొని రోజూ ఫోన్ చేసి యువతికి ఫోన్ ఇవ్వాలని వేధించేవాడు. ఏటీసీ కేంద్రానికి సామాన్యంగా బయట నుంచి ఎలాంటి ఫోన్లు రావు. కేవలం పైలెట్ విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో మాత్రమే ఈ ఫోన్‌కు అనుమతి లభిస్తుంది. అయితే రాయ్ డయాన్ మాత్రం ఏటీసీ ఫోన్ నంబర్ తెలుసుకొని నిత్యం ఫోన్లు చేసేవాడు. విమానాలు ఎగురుతున్న సమయంలో కూడా ఈ నంబర్‌కు ఫోన్ చేసి తన ప్రేయసికి ఇవ్వాలని వేధించే వాడు. దీంతో సిబ్బంది ఇబ్బందులు పడేవారు. ఇలా ఫోన్ చేస్తున్న వ్యక్తి ఎవరనే విషయంపై అధికారులు ఆరా తీయగా రాయ్ డయాన్‌గా తేలిందని డీసీపీ రవీంద్ర తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment