airport
-
దేశానికి సేవ చేస్తున్నావా.. బిగ్ జోక్ : హీరోయిన్‌పై ట్రోలింగ్
బాలీవుడ్ బ్యూటీ మన్నారా చోప్రా (Mannara Chopra) ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఒక సంఘటన వల్ల సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్‌కు గురైంది. ఆమె హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తూ, జైపూర్‌కు వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో ఎక్కకుండా సిబ్బంది అడ్డుకున్నారని ఆరోపించింది. ఈ విషయంపై ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో వీడియోలు పోస్ట్ చేసి, సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని, తన పేరు పిలవకపోవడంతో విమానం ఎక్కలేకపోయానని చెప్పింది. ఎయిర్పోర్ట్ సిబ్బందిపై కేకలు వేస్తూ, అరుస్తూ మన్నారా చోప్రా రచ్చ రచ్చ చేసింది. అదే సమయంలో పక్కనే ఉన్న మరో ప్రయాణికురాలు ఆమెకు మద్దతు పలుకుతూ..‘ఆమె పెద్ద సెలబ్రిటీ, దేశానికి సేవ చేస్తోంది’.. మీరు ఇలా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించింది. మన్నారా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొంతమంది ఆమెకు మద్దతు తెలిపిస్తే.. మరికొంతమంది విమర్శిస్తున్నారు. ‘ఎయిర్‌లైన్ నిబంధనల ప్రకారం బోర్డింగ్ 30 నిమిషాల ముందు మూసివేస్తారు, ఆమె సకాలంలో రాకపోతే సిబ్బందిని నిందించడం సరికాదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొందరు "ఆమె దేశానికి సేవ చేస్తోందని చెప్పడం హాస్యాస్పదం" అని, "ఇంత పెద్ద సెలబ్రిటీ ఎవరు? ఆమె ఏ సినిమాల్లో నటించింది?" అంటూ ఎగతాళి చేశారు. ‘ఇండిగో తరచూ ఇలాంటి పొరపాట్లు చేస్తుంది’ అని కొంతమంది, చాలా మంది ఆమె ప్రవర్తనను ‘అతిగా ఉంది’ అని ట్రోల్ చేస్తున్నారు.మన్నారా చోప్రా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, పంజాబీ భాషల సినిమాల్లో నటించింది. తెలుగులో "ప్రేమ గీమ జాంత నై" చిత్రంతో పరిచయమైంది. ఆ తర్వాత సునీల్‌తో "జక్కన్న", సాయి ధరమ్ తేజ్‌తో "తిక్క" వంటి సినిమాల్లో నటించింది. అలాగే "రోగ్" మరియు "సీత" చిత్రాల్లో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
హీత్రూలో విమాన సేవలు పునరుద్ధరణ
లండన్: అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు 18 గంటలపాటు మూతబడిన లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు తిరిగి మొదలయ్యాయి. శనివారం ఉదయం నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు హీత్రూ విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, విమానాల రాకపోకలకు కలిగిన అంతరాయం ప్రభావం మరికొన్ని రోజులపాటు కొనసాగుతుందని పేర్కొంది.‘టెర్మినల్స్ వద్ద అదనంగా వందల సంఖ్యలో సిబ్బందిని సిద్ధంగా ఉంచాం. శనివారం అదనంగా మరో పది వేల మంది ప్రయాణికులను పంపించేందుకు విమానాల షెడ్యూల్‌ను తయారు చేశాం’అని హీత్రూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ థామస్ వోల్డ్బై ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ప్రమాద ఘటనకు ఎయిర్‌పోర్టు కారణం కాదనే విషయం గుర్తుంచుకోవాలి. అంతేకాదు, రోజులపాటు మూసివేయలేదు, హీత్రూ కేవలం కొన్ని గంటలు మూతబడిందంతే. బ్యాకప్ వ్యవస్థను కూడా అత్యవసరాల్లో మాత్రమే ఉపయోగపడేలా డిజైన్ చేశారు. అది కూడా మొత్తం విమానాశ్రయాన్ని నడిపేందుకు సరిపోదు. హీత్రూకు ఒక చిన్న నగరానికి సరిపడా విద్యుత్ అవసరమవుతుంది. ఇతర విమానాశ్రయాల్లోనూ గతంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి’అని ఆయన వివరించారు.అయితే, ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందు సంబంధిత ఎయిర్‌లైన్స్ నుంచి వివరాలను చెక్ చేసుకోవాలని ప్రయాణికులను కోరారు. శనివారం హీత్రూ నుంచి రాకపోకలు సాగించాల్సిన తమ 600 విమాన సర్వీసులకు గాను 85 శాతం మేర పునరుద్ధరించినట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ తెలిపింది. అనూహ్యంగా చోటుచేసుకున్న ఘటన తర్వాత తిరిగి పూర్తిస్థాయిలో సేవలను పునరుద్ధరించడం ఎంతో క్లిష్టమైన వ్యవహారమని పేర్కొంది. హీత్రూకు 2 మైళ్ల దూరంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంతో విమానాశ్రయంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది.దీని కారణంగా 1,300కు పైగా విమానాలు రద్దు కాగా ఆ ప్రభావం 2 లక్షల మంది ప్రయాణికులపై పడింది. శుక్రవారం రాత్రికి స్వల్ప సంఖ్యలో విమానాల రాకపోకలను పునరుద్ధరించగలిగారు. అయితే, తమకు కలిగిన తీవ్ర అసౌకర్యంపై హీత్రూ విమానాశ్రయం అధికారులపై ప్రయాణికులు మండిపడుతున్నారు. అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం లేదంటున్న పోలీసులు..సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విద్యుత్ పరికరాలపైనే దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో ఒకటైన హీత్రూ నుంచి గతేడాది 8.39 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఎయిరిండియా సేవలు ప్రారంభంన్యూఢిల్లీ: లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టుకు విమానాల రాకపోకలను ప్రారంభించినట్లు ఎయిరిండియా శనివారం తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఎయిరిండియాతోపాటు వర్జిన్ అట్లాంటిక్, బ్రిటిష్ ఎయిర్వేస్ విమానాలు శనివారం షెడ్యూల్ ప్రకారం నడిచాయి. శుక్రవారం హీత్రూ మూతబడటంతో దేశంలోని వివిధ నగరాల నుంచి పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు కావడం తెల్సిందే. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా నిత్యం ఆరు విమానాలను హీత్రూకు నడుపుతోంది. బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన మొత్తం 8 విమానాలు హీత్రూ ఢిల్లీ, ముంబైల మధ్య రాకపోకలు సాగిస్తుంటాయి. వర్జిన్ అట్లాంటిక్ కూడా ఢిల్లీ, ముంబై, బెంగళూరుల నుంచి హీత్రూకు ఐదు సర్విసులను నడుపుతోంది. -
కరెంటు కోత... హీత్రూకు మూత!
లండన్: అంతర్జాతీయ ప్రయాణాలకు గుండెకాయ వంటి లండన్ హీత్రూ విమానాశ్రయం శుక్రవారం పూర్తిగా మూతబడింది. ఎయిర్‌పోర్టుకు విద్యుత్ సరఫరా చేసే సబ్‌స్టేషన్‌లో మంటలు చెలరేగడమే ఇందుకు కారణం. దాంతో హీత్రూకు కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో విమానాశ్రయాన్ని రోజంతా మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయంతో అంతర్జాతీయంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏకంగా 1,350 విమానాలను రద్దు చేయడం, దారి మళ్లించడం జరిగినట్టు విమాన ట్రాకింగ్ సేవల సంస్థ ఫ్లైట్రాడార్24 వెల్లడించింది.దీనివల్ల 2.9 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు లోనైనట్టు సమాచారం. ‘‘విమానాశ్రయానికి విద్యుత్‌ను పూర్తిగా తిరిగి ఎప్పుడు పునరుద్ధరించేదీ చెప్పలేం. విమానాశ్రయాన్ని తెరిచేదాకా ప్రయాణికులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవైపు రావొద్దు’’అని హీత్రూ సీఈఓ థామస్ వోల్డ్బీ విజ్ఞప్తి చేశారు. శనివారానికల్లా పూర్తిస్థాయిలో సేవలను పునరుద్ధరిస్తామని ఆయన ఆశాభావం వెలిబుచ్చినా చాలా రోజులే పట్టవచ్చంటున్నారు.ప్రయాణికులు తమ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవడం, అందుకు తగ్గట్టు విమానయాన సంస్థలు విమానాలను, సిబ్బందిని సమకూర్చుకునేందుకు కూడా కొన్ని రోజులు పడుతుందని చెబుతున్నారు. హీత్రూ యూరప్‌లోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. ప్రతి 90 సెకన్లకు ఒక విమానం టేకాఫ్/లాండింగ్ జరుగుతుంది! ఇక్కణ్నుంచి రోజుకు 669 విమానాలు టేకాఫ్ అవుతాయి.మండిపడుతున్న ప్రయాణికులు హీత్రూ మూసివేతతో ఉత్తర అమెరికా, ఆసియా దేశాలకు చెందిన సుదూర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామంపై వారంతా తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక్క అగ్నిప్రమాదం కారణంగా యూరప్‌లోనే అత్యంత రద్దీ విమానాశ్రయం మూతబడటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది అసాధారణమైన పరిస్థితని ఏవియేషన్ కన్సల్టెంట్ అనితా మెండిరట్టా తెలిపారు. ‘‘శనివారానికల్లా సమస్యను సరిదిద్దుతాం. కానీ పూర్తి సాధారణ స్థితికి చేరేందుకు నాలుగు రోజులు పట్టొచ్చు’’అని చెప్పారు. హీత్రూ వైపు వెళ్లే అన్ని రైళ్లను కూడా రద్దు చేసినట్లు నేషనల్ రైల్ తెలిపింది. హీత్రూ మూసివేత కారణంగా 4 వేల టన్నుల కార్గో రవాణా కూడా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రికల్లా కొన్ని విమాన సేవలను పునరుద్ధరించినట్టు చెప్పుకొచ్చారు. ‘‘జొహన్నెస్‌బర్గ్, సింగపూర్, రియాద్, కేప్‌టౌన్, సిడ్నీ, బ్యూనస్ఎయిర్స్ వంటి నగరాలకు విమానాలు బయల్దేరాయి. అవన్నీ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికే పరిమితమయ్యాయి’’ అని స్పష్టం చేశారు. కారణమేంటి? పశి్చమ లండన్‌లో హీత్రూ విమానాశ్రయానికి రెండు మైళ్ల దూరంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో గురువారం అర్ధరాత్రి భారీ పేలుడు శబ్దం విన్పించిందని, మంటలు సబ్ స్టేషన్‌ను చుట్టుముట్టాయని స్థానికులు వివరించారు. లండన్ ఫైర్ బ్రిగేడ్ 70 మంది సిబ్బంది 10 ఫైరింజిన్లతో హుటాహుటిన చేరుకుని 7 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చింది. అప్పటికే విమానాశ్రయంలో పవర్ కట్ ఏర్పడింది. ప్రమాదానికి కారణమేమిటనే దానిపై స్పష్టత లేదు. కుట్ర కోణం లేదని ప్రభుత్వం పేర్కొంది.జరిగింది చాలా పెద్ద ప్రమాదం. హీత్రూ విమానాశ్రయానికి ఉన్న అతి పెద్ద బలహీనత విద్యుత్ సరఫరాయే – విమానాశ్రయం సీఈఓ థామస్ వోల్డ్బీ తీవ్ర వైఫల్యమే: ప్రధాని హీత్రూకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడం తీవ్ర వైఫల్యమేనని ప్రధాని కియర్ స్టార్మర్ అంగీకరించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిగి తీరుతుందని ఆయన అధికార ప్రతినిధి టామ్ వెల్స్ ప్రకటించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని తెలిపారు.బిలియన్లలో నష్టం!హీత్రూ ప్రమాదం విమానయాన సంస్థల నడ్డి విరిచేలా కని్పస్తోంది. విమానాల రద్దు, బీమా, పరిహారం చెల్లింపులు తదితరాల రూపంలో అవి బిలియన్ల కొద్దీ డాలర్ల నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. హీత్రూ మూసివేత దెబ్బ ఇప్పటికే వాటి మార్కెట్ విలువపై పడింది. బ్రిటిష్ ఎయిర్వేస్, లుఫ్తాన్సా, ర్యాన్ఎయిర్ వంటి పలు సంస్థల షేర్లు 1 నుంచి 2 శాతం దాకా పతనమయ్యాయి.ఆ సమయంలో గాల్లో 120 విమానాలువిద్యుత్ సరఫరా నిలిచి విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన సమయంలో సుమారు 120 విమానాలు హీత్రూ సమీపంలో గాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొన్నింటిని సమీపంలోని గాట్విక్, మాంచెస్టర్‌కు మళ్లించగా మరికొన్ని సమీప యూరప్ దేశాల్లోని పారిస్, ఆమ్స్టర్డామ్, ఫ్రాంక్ఫర్ట్ తదితర విమానాశ్రయాల్లో లాండయ్యాయి.మరికొన్ని విమానాలు వెనక్కు వెళ్లిపోయాయి. హీత్రూ మూసివేత వల్ల పారిస్‌లో లాండైన తమ ప్రయాణికుల కోసం క్వాంటాస్ ఎయిర్‌లైన్ సింగపూర్, పెర్త్ నుంచి విమానాలను పంపింది. లండన్‌కు వెళ్లాల్సిన వారిని బస్సులు, రైళ్లలో తరలిస్తామని తెలిపింది. ర్యాన్ఎయిర్ కూడా తమ ప్రయాణికుల కోసం డబ్లిన్, స్టాన్స్టెడ్ ఎయిర్‌పోర్టులకు విమానాలు నడుపుతామని తెలిపింది.అత్యంత బిజీ! అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో హీత్రూ ఒకటి. ఇది 1964లో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడినుంచి ఏకంగా 90 దేశాల్లోని 230 గమ్యస్థానాలకు విమానాలు నడుస్తాయి. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌తో పాటు 90 సంస్థలకు చెందిన విమానాలు ఇక్కడినుంచి రాకపోకలు సాగిస్తాయి.జనవరిలో రికార్డు స్థాయిలో 63 లక్షల మంది ప్రయాణికులు హీత్రూ గుండా రాకపోకలు సాగించారు! 2010లో ఐస్‌ల్యాండ్‌లో అగ్నిపర్వతం బద్దలై భారీగా దుమ్ముధూళి మేఘాలు కమ్ముకోవడంతో అట్లాంటిక్ మీదుగా విమానాల రాకపోకలకు నెలలపాటు అంతరాయం ఏర్పడింది. అప్పుడు కూడా హీత్రూలో విమాన సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయినా ఇలాంటి సందర్భాలను ఎదుర్కొనేందుకు బ్రిటన్ సన్నద్ధం కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మూడు సబ్స్టేషన్లున్నా... హీత్రూకు కరెంటు సరఫరా కోసం మూడు సబ్స్టేషన్లతో పాటు ఒక బ్యాకప్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. కానీ వాటిలో ఒక సబ్‌స్టేషన్ ప్రస్తు తం పని చేయడం లేదు. మరికొటి కొద్ది రోజులు గా సమస్యలు ఎదుర్కొంటోంది. హీత్రూ విమానాశ్రయం నడవాలంటే ఏకంగా ఒక మినీ నగర అవసరాలకు సమానమైన కరెంటు అవసరం!ఎయిరిండియా సేవలూ రద్దు..న్యూఢిల్లీ: హీత్రూకు విమాన సేవలను శుక్రవారం నిలిపేసినట్టు ఎయిరిండియా పేర్కొంది. ‘‘ఒక విమానం ముంబైకి తిరిగొచ్చింది. మరొకటి ఫ్రాంక్ఫర్ట్ మళ్లించాం. మిగతావి రద్దయ్యాయి’’ అని ప్రకటించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి శుక్రవారం లండన్ వెళ్లాల్సిన 5 వర్జిన్ అట్లాంటిక్, 8 బ్రిటిష్ ఎయిర్వేస్ విమానాలు కూడా రద్దయ్యాయి. -
భారత్‌కు నిజమైన బహుమతి!: అదానీ ట్వీట్
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూన్‌లో ప్రారంభించనున్నట్లు అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ అదానీ' (Gautam Adani) ప్రకటించారు. దీనిని ఏప్రిల్ 17న ప్రారంభించాలని మొదట అనుకున్నప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఈ కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ (AAHL), సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర (CIDCO) భాగస్వామ్యంతో జరుగుతోంది. 2018 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టుకు పునాదిరాయి వేసారు. దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ. 16,700 కోట్లు అవుతుందని అంచనా.ఇప్పటికే ముంబైలోని ప్రధాన విమానాశ్రయంలో రద్దీని తగ్గించడానికి.. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ విమానాశ్రయాన్ని సందర్శించిన సందర్భంగా.. ఈరోజు నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ స్థలాన్ని సందర్శించాను. ప్రపంచ స్థాయి విమానాశ్రయం రూపుదిద్దుకుంటోంది. ఇది జూన్‌లో ప్రారంభోత్సవానికి సిద్దమవుతుంది. అంతే కాకుండా ఇది భారతదేశానికి నిజమైన బహుమతి!. అని అదానీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ స్కీమ్: వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!రెండు రన్వేలు, నాలుగు టెర్మినల్స్తో రూపొందించబడిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, ఐదు దశల్లో పూర్తయిన తర్వాత ఏటా 90 మిలియన్ల మంది ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. దీని నిర్మాణం పూర్తయిన తరువాత ముంబైలోని ప్రధాన విమానాశ్రయంలో రద్దీ తగ్గుతుంది.A glimpse into India’s aviation future! ✈️Visited the Navi Mumbai International Airport site today—a world-class airport taking shape. Set for inauguration this June, it will redefine connectivity & growth. A true gift to India!Kudos to the Adani Airports team & partners for… pic.twitter.com/2TCWcSnr6c— Gautam Adani (@gautam_adani) March 16, 2025 -
పాక్‌లో మరో హత్య: జమీయత్ ఉలేమా నేత ముఫ్తీ అబ్దుల్ హతం
క్వెట్టా: పాకిస్తాన్లో మరో దారుణం చోటుచేసుకుంది. జమీయత్ ఉలేమా ఈ ఇస్లాం(జేయూఐ)(Jamiat Ulema-e-Islam) సీనియర్ నేత ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన క్వెట్టాలోని ఎయిర్పోర్ట్ రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దుండగులు ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్(Mufti Abdul Baqi Noorzai)పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడిలో ముఫ్తీ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తీవ్రగాయాల కారణంగా ముఫ్తీ మరణించారని తెలిపారు. పాక్ భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించాయి. దాడి చేసిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇటీవలి కాలంలో పాక్‌లో ఉగ్ర దాడులు మరింతగా పెరిగాయి.ఆదివారం క్వెట్టా నుండి టఫ్తాన్ వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్(Army convoy)పై జరిగిన ఉగ్ర దాడిలో ఏడుగురు సైనికులు మరణించగా, 21 మంది గాయపడ్డారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఒక ప్రకటన చేసింది. ఇదేవిధంగా మార్చి 11న క్వెట్టా నుండి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బీఎల్ఏ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. బోలాన్‌లోని మష్ఫాక్ టన్నెల్ వద్ద ఈ ఘటన జరిగింది. తాజాగా జరిగిన దాడి క్వెట్టాలో వరుసగా మూడవది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న అస్థిరత, ఉగ్రవాద కార్యకలాపాలకు తార్కాణంగా ఇది నిలిచింది. ముఫ్తీ అబ్దుల్ బాఖీ నూర్జాయ్ హత్య వెనుక గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: త్వరలో ట్రంప్-పుతిన్ చర్చలు.. కాల్పుల విరమణపై నిర్ణయం? -
అమెరికాలో మరో విమాన ప్రమాదం
-
40 కి.మీ.. 40 నిమిషాలు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి కేవలం 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఎయిర్‌పోర్టు నుంచి స్కిల్స్ యూనివర్సిటీ వరకు నిర్మించనున్న 40 కిలోమీటర్ల మెట్రో కారిడార్ అత్యాధునిక సదుపాయాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన నగరాల్లోని మెట్రో ప్రయాణ అనుభవాలు స్ఫురించే విధంగా ఈ కారిడార్‌లో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. 40 కి.మీ ఫోర్త్ సిటీ మెట్రోలో చాలావరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. హెచ్ఎండీఏ నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డులో కొంతభాగంలో మాత్రం ఎట్‌గ్రేడ్ మెట్రో (భూతలంపైన) నిర్మాణం చేపట్టనున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భవిష్యత్ దార్శనిక దృష్టి మేరకు.. ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్డు మార్గంలో మెట్రో అందుబాటులోకి రానుందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి తెలిపారు.ఓఆర్ఆర్ నిర్మాణంలో భాగంగా భవిష్యత్తులో నిర్మించే మెట్రో అవసరాలకు అనుగుణంగా ఆయన ఓఆర్ఆర్లో 20 మీటర్లు మెట్రో కోసం కేటాయించిన విషయం గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ మార్గంలోనే మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. సర్వే పనుల పరిశీలన మెట్రో రెండో దశలో ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపకల్పనలో భాగంగా ఎన్విఎస్ రెడ్డి.. హెచ్ఎండీఏ, టీజీఐఐసీ అధికారులతో కలిసి ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎయిర్పోర్ట్ నుంచి మీర్ఖాన్పేట్లో నిర్మాణంలో ఉన్న స్కిల్స్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ డీపీఆర్ తయారు చేసేందుకు జరుగుతున్న సర్వే పనులను పరిశీలించారు. కొంగర కలాన్ దాటిన తర్వాత రోడ్డు లేకపోవడంతో కాలినడకనే కొండలు, గుట్టలు దాటుతూ పర్యటన కొనసాగించారు. ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా ఆవిష్కృతం కానున్న ఫోర్త్‌సిటీ మెట్రో సేవలు కూడా అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉంటాయని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. సుమారు 15 వేల ఎకరాల్లో విస్తరించనున్న భవిష్య నగరిని కాలుష్య రహిత నగరంగా రూపొందించాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పమని చెప్పారు. ఫ్యూచర్ సిటీ కారిడార్ ఇలా... » శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం సుమారు 40 కిలోమీటర్లు ఉంటుంది. ఎయిర్పోర్ట్ టెరి్మనల్ నుంచి మొదలై కొత్తగా నిర్మించనున్న మెట్రో రైల్ డిపో పక్క నుంచి ఎయిర్పోర్ట్ సరిహద్దు గోడ వెంబడి ఎలివేటెడ్ మార్గం నిర్మించనున్నారు. » మన్సాన్పల్లి రోడ్డు మార్గంలో 5 కిలోమీటర్లు ముందుకు సాగిన తర్వాత పెద్ద గొల్కోండ ఓఆర్ఆర్ ఎగ్జిట్‌కు చేరుతుంది. బహదూర్‌గూడ, పెద్ద గోల్కొండలలో రెండు మెట్రో స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకర్షణీయంగా నిర్మించనున్నారు. » పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిర్యాల్ ఎగ్జిట్ వరకు సుమారు 14 కిలోమీటర్ల పొడవున ఎలివేటెడ్ మెట్రో కారిడార్‌గా నిర్మించనున్నారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుపై ‘ఎట్ గ్రేడ్ మెట్రో’ » రావిర్యాల్ ఎగ్జిట్ నుండి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్స్ యూనివర్సిటీ వరకు దాదాపు 22 కిలోమీటర్లు కొంగర కలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగుడా, మీర్ఖాన్ పేట్ వరకు హెచ్ఎండీఏ 100 మీటర్లు ( 328 అడుగులు) వెడల్పున గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించనుంది.ఈ రోడ్డు మధ్యలో 22 మీటర్లు (72 అడుగులు) మెట్రోరైల్‌కు కేటాయించారు. ఇక్కడ భూ తలంపై (ఎట్ గ్రేడ్) మెట్రో అభివృద్ధి చేయనున్నారు. » ఈ విశాలమైన రోడ్డు మధ్యలో అదే ఎత్తులో మెట్రో రైల్ ఉంటే దానికి ఇరువైపులా మూడు లేన్ల ప్రధాన రహదారి ఉంటుందని, మెట్రోను, ప్రధాన రహదారిని విభజిస్తూ ఆకర్షణీయమైన చెట్లను, గ్రీనరీని అభివృద్ధి చేస్తామని, ప్రధాన రహదారికి ఇరువైపులా రెండు సర్వీ స్ రోడ్లు ఉంటాయని ఎనీ్వఎస్ రెడ్డి వివరించారు. వైఎస్ భవిష్యత్ దృష్టి ఓఆర్ఆర్ నిర్మాణ సమయంలో మెట్రో రైల్‌కు కొంతభూమిని కేటాయించాలన్న తన ప్రతిపాదన మేరకు అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఓఆర్ఆర్లో అంతర్భాగంగా 20 మీటర్లు మెట్రోకు కేటాయించారని ఎన్వి ఎస్ రెడ్డి చెప్పారు. అయితే ఓఆర్ఆర్, మెట్రో వంటి బృహత్ ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయని, ఆచరణ సాధ్యం కాదంటూ అపహా స్యం చేశారని, కానీ ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌తోపాటు, మెట్రో కూడా కార్యరూపం దాల్చిందన్నారు. సుమారు రూ.22 వేల కోట్లతో మొట్టమొదటి పీపీపీ ప్రాజెక్టుగా 69 కిలోమీటర్ల మెట్రో మొదటి దశను విజయవంతంగా నిర్మించామని, అదేవిధంగా సీఎం రేవంత్‌రెడ్డి దార్శనికత మేరకు హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, మెట్రో రైల్ సంస్థలు సంయుక్తంగా రెండో దశ నిర్మాణం చేపడతాయని చెప్పారు. నార్త్ సిటీలోని మేడ్చల్, శామీర్‌పేట్ కారిడార్లతో పాటు, ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్‌ను మార్చి నెలాఖరుకు పూర్తి చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. -
తలకిందులైన విమానం..15 మందికి గాయాలు
టొరంటో: కెనడాలో మరో విమాన ప్రమాదం జరిగింది. సోమవారం(ఫిబ్రవరి 17) టొరంటోలోని పియర్సన్ ఎయిర్‌పోర్ట్‌లో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం క్రాష్ లాండ్ అయింది. బలమైన గాలుల కారణంగా విమానం ల్యాండింగ్‌లో సమస్యలు తలెత్తి ఏకంగా తలకిందులైంది. ఈ ప్రమాదంలో 15 మంది దాకా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్ అంబులెన్స్‌లో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినపుడు విమానంలో 80 మంది ఉన్నారు. మిన్నియాపోలిస్ నుంచి వచ్చిన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురైందని పియర్సన్ ఎయిర్‌పోర్టు ఎక్స్(ట్విటర్)లో చేసిన ఒక పోస్టులో ధృవీకరించింది. విమానం తిరగబడి ఎయిర్‌పోర్టులో పడి ఉన్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.BREAKING: A Delta Airlines CRJ 900 crashed and settled upside down at Toronto Pearson Airport.Thankfully, ALL passengers survived and are accounted for. That is great news! pic.twitter.com/dXXUNkPTHU— Errol Webber (@ErrolWebber) February 17, 2025 -
టొరంటో విమానాశ్రయంలో అదుపుతప్పిన విమానం
టొరంటో: కెనడాలో సోమవారం ఓ విమానం అదుపుతప్పింది. టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండ్ అవుతుండగా రన్‌వే పైనుంచి జారిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు స్థానిక అధికారులను ఉటంకిస్తూ మీడియా తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ఉన్నట్లు సమాచారం. ఈ విమానం మిన్నెపోలిస్ నుంచి టొరంటోకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం నేపథ్యంలో ఎయిర్‌పోర్టును మూసివేశారు. -
ఎయిర్పోర్ట్ కొత్త రూల్స్.. ఈ వస్తువులకు నో ఎంట్రీ
సురక్షితమైన విమాన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని దుబాయ్ విమానాశ్రయం దాని నియమాలలో కొన్ని మార్పులు చేసింది. సాధారణంగా ప్రయాణికులు క్యాబిన్ బ్యాగ్‌లో మందులు వంటి ముఖ్యమైన వస్తువులను తీసుకెళ్లవచ్చు. కానీ ఇప్పుడు దుబాయ్ వెళ్లే విమానంలో ఇది సాధ్యం కాదు. మీరు అన్ని రకాల మందులను తీసుకెళ్లలేరు. కొత్త నిబంధనల ప్రకారం.. మీరు అనుమతించిన వస్తువులను మాత్రమే తీసుకెళ్లాలి.దుబాయ్ విమాన లగేజీ నిబంధనలలో మార్పులుచాలా సార్లు ప్రయాణికులు తమకు తెలియకుండానే అనుమతి లేని కొన్ని వస్తువులను తమతో విమానంలోకి తీసుకెళ్తుంటారు. వీటిని విమానంలో తీసుకెళ్లడం చట్టపరమైన నేరంగా పరిగణిస్తారు. మీరు దుబాయ్ వెళ్తుంటే విమానంలో చెక్-ఇన్ లగేజీతో పాటు క్యాబిన్ బ్యాగేజీలో ఏమి ప్యాక్ చేయవచ్చు.. ఏమి చేయకూడదు అనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. దుబాయ్‌కి ప్రయాణించేటప్పుడు బ్యాగుల్లో ఎలాంటి వస్తువులను తీసుకువెళ్లవచ్చో ఇక్కడ తెలుసుకోండి.ఈ ఉత్పత్తులను బ్యాగులో తీసుకెళ్లకూడదుకొకైన్, హెరాయిన్, గసగసాలు, మత్తు కలిగించే మందులు.తమలపాకులు, కొన్ని మూలికలు వంటివి కూడా తీసుకెళ్లకూడదు.ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ములు, జూద వస్తువులు, మూడు పొరల ఫిషింగ్ నెట్లు, బహిష్కృత దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను తీసుకెళ్లడం కూడా నేరంగా పరిగణిస్తారు.ముద్రిత వస్తువులు, ఆయిల్ పెయింటింగ్‌లు, ఛాయాచిత్రాలు, పుస్తకాలు, రాతి శిల్పాలను కూడా తీసుకెళ్లకూడదు.నకిలీ కరెన్సీ, ఇంట్లో వండిన ఆహారం, మాంసాహారం కూడా తీసుకెళ్లకూడదు.ప్రయాణికులెవరైనా ఈ నిషేధిత వస్తువులను తీసుకెళ్తున్నట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.ఈ మందులను అస్సలు తీసుకెళ్లలేరుబెటామెథోడోల్ఆల్ఫా-మిథైల్ఫెనానిల్ గంజాయికోడాక్సిమ్ఫెంటానిల్పాపీ స్ట్రా కాన్సన్ట్రేట్మెథడోన్నల్లమందుఆక్సికోడోన్ట్రైమెపెరిడిన్ఫెనోపెరిడిన్కాథినోన్కోడైన్యాంఫెటమైన్వీటిని చెల్లింపుతో తీసుకెళ్లవచ్చుదుబాయ్ ట్రిప్‌కు వెళ్లేటప్పుడు కొన్ని రకాల వస్తువులను చెల్లింపుతో తీసుకెళ్లవచ్చు. ఈ జాబితాలో మొక్కలు, ఎరువులు, మందులు, వైద్య పరికరాలు, పుస్తకాలు, సౌందర్య సాధనాలు, ట్రాన్స్మిషన్, వైర్లెస్ పరికరాలు, ఆల్కహాలిక్ పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఈ-సిగరెట్లు, ఎలక్ట్రానిక్ హుక్కాలు ఉన్నాయి. -
క్షమాపణ చెబితే సరిపోతుందా?.. హీరోయిన్ అనన్య నాగళ్ల ఫైర్
టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా ఉంది. గతేడాది పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్స్, డార్లింగ్ లాంటి చిత్రాలతో ఫ్యాన్స్‌ను మెప్పించింది. వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఓ ఈవెంట్‌కు వెళ్లాల్సిన అనన్య నాగళ్లకు ఎయిర్‌పోర్ట్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. తన బ్యాగేజ్ ఆరు గంటల పాటు ఆలస్యం కావడంతో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. మీరు ఇంత సింపుల్‌గా సారీ చెప్తే సరిపోతుందా అంటూ విమానసంస్థ కస్టమర్ కేర్ వారితో ఫోన్లో మాట్లాడింది. మీరు ఆలస్యం చేయడం వల్ల దాదాపు 2 వేల మంది విద్యార్థులు నాకోసం వేచి ఉండాల్సి వచ్చిందని ఓ వీడియోను షేర్ చేసింది.అనన్య తన ట్వీట్లో రాస్తూ..'నేను ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి మధురైకి ఒక ఈవెంట్ కోసం వెళ్తున్నా. నా రెండు బ్యాగేజీలను చెక్ ఇన్ చేశా. కానీ వాటిలో ఒకటి 6 గంటలు ఆలస్యమైంది. నేను కస్టమర్ కేర్‌ను సంప్రదించినప్పుడు వారు సింపుల్‌గా క్షమించండి అని చెబుతున్నారు. నా బ్యాగ్‌ను తర్వాత అందుబాటులో ఉన్న విమానంలో పంపుతారట. ఇది ఆమోదయోగ్యం కాదు. మీకో రూల్, మాకో రూల్ ఎందుకు ఉన్నాయి. ప్యాసింజర్ ఒక నిమిషం ఆలస్యం అయితే.. అనుమతించలేమని మీరు చెబుతారు. ఇప్పుడేమో 6 గంటల లగేజీ ఆలస్యం జరిగింది. దీని కారణంగా దాదాపు 2000 మంది విద్యార్థులు నా కోసం వేచి ఉండాల్సి వచ్చింది. క్షమించండి అని చెప్పడం కరెక్ట్ కాదంటూ విమానయాన సంస్థ కస్టమర్ కేర్‌కు ఇచ్చిపడేసింది డార్లింగ్ బ్యూటీ'.కాగా.. 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ, తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలతో అభిమానులను మెప్పించింది. I was travelling from Hyderabad to Madhurai today morning for an event . I have checked in two baggages and one of it got delayed for 6 hours. when i contacted the customer care they are simply saying sorry and they will send it in next available flight. @IndiGo6E this is… pic.twitter.com/WtbFgST7ff— Ananya Nagalla (@AnanyaNagalla) February 14, 2025 -
అమెరికాలో రెండు విమానాలు ఢీ..!
-
మరో ఘటన.. అమెరికాలో రెండు విమానాలు ఢీ
ఆరిజోనా: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మరోసారి రెండు విమానాలు ఢీకొన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో ప్రైవేట్ జెట్‌ను మరో విమానం ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. లియర్‌జెట్ 35ఎ విమానం ల్యాండింగ్ తర్వాత రన్‌వే నుండి జారి రాంప్‌పై ఉన్న బిజినెస్ జెట్‌ను ఢీకొట్టింది. ఆరిజోనాలోని స్కాట్‌డేల్ ఎయిర్‌పోర్టులో ఘటన జరిగింది. దీంతో ఎయిర్‌పోర్టులో విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటన మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. కాగా, గత పది రోజుల్లో అమెరికాలో ఇది నాలుగో విమాన ప్రమాదం. పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పైలట్‌తో సహా పది మంది ప్రాణాలు కోల్పోయారు.కాగా, మరో విమానానికి కూడా తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గత వారం.. ఫిలడెల్ఫియా రాష్ట్రంలో విమానం ఇళ్లపై కూలిపోయింది. దీంతో, ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఫిలడెల్ఫియాలోని షాపింగ్‌మాల్ సమీపంలో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఇళ్లపై కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. విమానం కూలిపోయిన వెంటనే భారీ పేలుడు సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. -
అబ్బురపడేలా.. జేబీఎస్ మెట్రో హబ్
సాక్షి, హైదరాబాద్: జేబీఎస్ మెట్రో స్టేషన్ ప్రపంచస్థాయి మెట్రో హబ్‌గా అవతరించనుంది. సింగపూర్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాల్లోని మెట్రో హబ్‌లకు దీటుగా జేబీఎస్ మెట్రో హబ్‌కు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక్కడ బస్ స్టేషన్లు, పార్కింగ్ సదుపాయం, రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, మాల్స్, కార్యాలయాలు వంటి అన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కేవలం మెట్రో రైళ్ల రాకపోకలకే పరిమితం కాకుండా చక్కటి షాపింగ్, డైనింగ్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జేబీఎస్ హబ్‌పై దిశానిర్దేశం చేసినట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో జేబీఎస్ మెట్రో హబ్‌ను అభివృద్ధి చేయనున్నారు. మెట్రో రెండో దశలో భాగంగానే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్, శామీర్‌పేట్ వరకు మెట్రో విస్తరణ చేపట్టనున్నారు. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం హెచ్‌ఏఎంఆర్‌ఎల్ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ఈ రెండు కారిడార్లపైనా సీఎం తాజాగా సమీక్షించారు. అతిపెద్ద ప్రాంగణంగా విస్తరణ.. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో జేబీఎస్ మెట్రో హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం మెట్రోకు జేబీఎస్ వద్ద అందుబాటులో ఉన్న స్థలంతో పాటు రక్షణ శాఖకు చెందిన భూములను కూడా సేకరించనున్నారు. ప్రస్తుతం నగరంలోని మెట్రోస్టేషన్ల పార్కింగ్ సదుపాయాలు అరకొరగా ఉన్నాయి. దీంతో మెట్రోల్లో ప్రయాణం చేయాలని భావించినప్పటికీ.. పార్కింగ్ వసతులు లేకపోవడంతో చాలామంది సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో నిర్మించనున్న మెట్రో స్టేషన్లను పార్కింగ్ సదుపాయాలతో ప్రత్యేకంగా డిజైన్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు జేబీఎస్ మెట్రో హబ్ వద్ద సెల్లార్లో అతిపెద్ద పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయనున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాల కోసం రెండంతస్తుల్లో నిర్మించే అవకాశం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో బస్‌స్టేషన్ ఉంటుంది. ప్రయాణికులు బస్సు దిగి నేరుగా మెట్రో స్టేషన్‌కు వెళ్లవచ్చు. దీంతో సీమ్‌లెస్ జర్నీ సదుపాయం లభించనుంది. వివిధ ప్రాంతాల మధ్య లాస్ట్‌మైల్, ఫస్ట్‌మైల్ కనెక్టివిటీకి కూడా పార్కింగ్, బస్‌స్టేషన్ సదుపాయాలు దోహదం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. లక్షలాది మందికి ప్రయాణ సదుపాయం.. ⇒ ప్రతిపాదిత జేబీఎస్ నుంచి మేడ్చల్ (23కి.మీ.), జేబీఎస్ – శామీర్ పేట్ (22 కి.మీ) కారిడార్లలో లక్షలాది మంది రాకపోకలు సాగించనున్నారు. ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీలో జేబీఎస్ కీలకం కానుంది. ⇒ రెండు రూట్లలో హెచ్ఎండీఏ ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్లపై మెట్రో కారిడార్లు రానున్నాయి. కానీ.. బేగంపేట్ విమానాశ్రయ సరిహద్దు వెంట ప్యారడైజ్ నుంచి బోయినపల్లి మధ్య 600 మీటర్ల వరకు భూగర్భ మార్గం రానుంది. దీంతో డబుల్ ఎలివేటెడ్ సాధ్యం కాదు. దీంతో బోయిన్పల్లి వద్ద ఎలివేటెడ్ మెట్రో రానుంది. ⇒ ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే వారితోపాటు, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఈ కారిడార్లు కీలకం కానున్నాయి. స్కైవాక్ కనెక్టివిటీ... జేబీఎస్ మెట్రో హబ్ విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న ప్యారడైజ్, జేబీఎస్ స్టేషన్లతో పాటు కొత్తగా మేడ్చల్ కారిడార్ కోసం నిర్మించనున్న స్టేషన్ల మధ్య స్కైవాక్ ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రయాణికులు అన్ని వైపులా రాకపోకలు సాగించేందుకు అవకాశం లభిస్తుంది. మేడ్చల్, శామీర్‌పేట్‌ల నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 60 కిలోమీటర్ల ప్రయాణ సదుపాయం లభించనుంది. ఈ హబ్ వల్ల నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులభంగా రాకపోకలు సాగించేందుకు అవకాశం లభించనుంది. అన్ని సదుపాయాలతో కూడిన ‘అర్బన్ యాక్టివిటీ సెంటర్’గా జేబీఎస్ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు చెప్పారు. హైదరాబాద్ సాంస్కృతిక జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని పేర్కొన్నారు. రెస్టారెంట్లు, మలీ్టప్లెక్స్లతో పాటు కో– వర్కింగ్ ప్లేస్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం కొన్ని ఐటీ సంస్థలు మెట్రో స్టేషన్లలో ఇలాంటి సదుపాయాలను వినియోగించుకుంటున్నాయి. కార్యాలయాల నిర్వహణ భారం దృష్ట్యా కో–వర్కింగ్ ప్లేస్‌లకు ప్రాధాన్యం ఏర్పడింది. -
అతిచిన్న ఎయిర్పోర్ట్
విమానాశ్రయం అంటే సాధారణంగా, పొడవైన రన్‌వే, విశాలమైన ప్రదేశంలో చాలా పెద్దగా ఉంటుంది. కాని, కరీబియన్ దీవుల్లో నెదర్లాండ్స్ అధీనంలో ఉన్న సబా దీవిలో ‘జువాంకో ఇ. య్రాస్క్విన్’ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత చిన్న విమానాశ్రయంగా పేరొందింది. దీని రన్‌వే పొడవు కేవలం 400 మీటర్లు మాత్రమే! అంటే దాదాపు ఒక విమానం పొడవు కంటే కాస్త ఎక్కువ.చుట్టూ ఎత్తైన కొండలు, పక్కనే సముద్రంతో చూడటానికి అందంగా కనిపించే ఈ విమానాశ్రయం, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాల్లో ఒకటి. అందుకే, ఇక్కడ పెద్ద విమానాలను అనుమతించరు. కేవలం విమానయాన సంస్థ విండైర్కు చెందిన చిన్న విమానాలను మాత్రమే ఇక్కడ అనుమతిస్తారు. అయితే, 1959లో రెమీ డి హానెస్ ప్రారంభించిన ఈ విమానాశ్రయం, సరైన సదుపాయాలు లేకపోవడంతో చాలాకాలం నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం డచ్ ప్రభుత్వం దీనిని పునరుద్ధరించింది. అంతేకాదు, రోజువారీగా చిన్న విమానాలను నడుపుకునేందుకు కూడా అనుమతించింది. -
విజయ్ సేతుపతిని కాలితో తన్నిన వ్యక్తి.. వీడియో వైరల్!
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఇటీవలే విడుదల పార్ట్-2తో (viduthala Part-2) ప్రేక్షకుల ముందుకొచ్చారు. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన విడుదల పార్ట్- 1 సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమాలో ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.(ఇది చదవండి: ఓటీటీలో విడుదల 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)అయితే తాజాగా విజయ్ సేతుపతికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎయిర్‌పోర్ట్‌లో నడుచుకుంటూ వెళ్తున్న విజయ్‌ని వెనక నుంచి దూసుకొచ్చిన ఓ వ్యక్తి కాలితో తన్నాడు. పక్కనే సీఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకున్నారు. అంతేకాకుండా అక్కడే వారంతా ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ఘటన మూడేళ్ల క్రితం జరగ్గా.. తాజాగా ఓ నెటిజన్ ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అప్పట్లో బెంగళూరులో ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.Ithu eppa nadanthathu..🥹🙄..Enna @VijaySethuOffl sollave illa..🤭..But it was a nice Kick 😉..#BiggBossTamil #BiggBossTamil8 #BiggBoss8Tamil #BiggBossTamilSeason8#BiggBossTamil8Season #VijaySethupathi #VJS pic.twitter.com/XRtsMl31yo— BiggBossTamil8 (@BigBossTamilOTT) January 28, 2025 -
Hyderabad Metro Phase 2: కేంద్రం అనుమతే కీలకం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మెట్రో రెండో దశకు(Hyderabad Metro Phase 2) కేంద్రం అనుమతే కీలకం! కేంద్రం అనుమతి కీలకంగా మారింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వివిధ మార్గాల్లో మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టనున్న రెండో దశ ప్రాజెక్టులో 5 కారిడార్లకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ సంస్థ డీపీఆర్‌ను సైతం రూపొందించింది. రెండు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రం అనుమతి కోసం పంపించారు. ఈ రెండో దశలోనే ఫోర్త్‌సిటీతో పాటు ఉత్తరం వైపు మరో రెండు కారిడార్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు కారిడార్ల డీపీఆర్ కోసం అధికారులు తాజాగా కసరత్తు ప్రారంభించారు. మరోవైపు పాతబస్తీలో భూసేకరణ, నిర్మాణాల కూల్చివేత పనులు చురుగ్గా సాతున్నాయి. ఈ క్రమంలో త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేంద్రం మెట్రో రెండోదశకు పచ్చజెండా ఊపుతుందా? లేక మొండిచేయి చూపుతుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం వాటా 18 శాతం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా ప్రతిపాదించిన రెండో దశలో మొదట 5 కారిడార్లలో మొత్తం 54 స్టేషన్లు, 76.4 కిలోమీటర్ల వరకు విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.24,269 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులను అంటే రూ.7,313 కోట్లు వెచ్చిస్తుంది. రూ.4,230 కోట్లతో కేంద్రం 18 శాతం నిధులను అందజేస్తుంది. మిగతా 48 శాతం నిధులను అంటే రూ.11,693 కోట్లను ప్రాజెక్ట్ రుణాలుగా సేకరించాలనేది ప్రతిపాదన. మరో 4 శాతం (రూ.1033కోట్లు) పీపీపీ పద్ధతిలో సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో(Budget) కేంద్రం తన వాటాగా ఏ మేరకు నిధులను కేటాయిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. దశలవారీగా ప్రాజెక్టు విస్తరణ పనులు కొనసాగనున్న దృష్ట్యా 18 శాతం వాటాలో ఈ బడ్జెట్లో కొద్ది మేరకైనా నిధులు లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల నగరానికి వచి్చన కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్తోనూ సీఎం రేవంత్‌రెడ్డి సంప్రదింపులు జరిపారు. మెట్రోతోపాటు మూసీ ప్రక్షాళన, నగర అభివృద్ధి కోసం నిధులను అందజేయాలని కోరారు. ఈ మేరకు మెట్రోకు కేంద్రం నుంచి సముచితమైన నిధులు లభించవచ్చని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.పూచీకత్తు ఎంతో ముఖ్యం.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే ‘సావరిన్ గ్యారంటీ’ కూడా మెట్రో రెండో దశకు కీలకంగా మారింది. సావరిన్ గ్యారంటీ ఉంటేనే జైకా, మలీ్టలేటర్ డెవలప్మెంట్ బ్యాంకులు రుణాలను అందజేసేందుకు ముందుకొస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే నిధుల కంటే బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి సేకరించే రూ.వేల కోట్ల రుణాలపైనే ఈ ప్రాజెక్టు ఆధారపడి ఉంది. 48 శాతం నిధులను రుణాలుగా సేకరించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇచ్చే పూచీకత్తు ఎంతో ముఖ్యం. ప్రస్తుతం పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లలో రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. ఇందుకోసం భూసేకరణ, నిర్మాణాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం నుంచి అనుమతి వస్తేనే రెండో దశ పనులు ముందుకు సాగుతాయి. -
విమానంలో మంటలు.. 176 మంది ప్రయాణికులు సురక్షితం
సియోల్: దక్షిణ కొరియాలోని గిమ్హే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ బుసాన్ ఎయిర్‌బస్ ఏ321 ప్యాసింజర్ విమానం మంటల్లో చిక్కుకుంది. దీనిని గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమై విమానంలోని 169 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 176 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు.మీడియాకు అందిన వివరాల ప్రకారం విమానం హాంకాంగ్‌కు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, విమానం వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి 10.15 జరిగింది. గాలితో నిండిన స్లయిడ్లను ఉపయోగించి ప్రయాణీకులను ఖాళీ చేయించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. Fire breaks out on an Air Busan A321 bound for Hong Kong at Gimhae International Airport in Busan, South Korea.At around 10:30 p.m. on Tuesday, a fire broke out in the tail section of the aircraft.All 170 passengers and crew evacuated, and there were no casualties,… pic.twitter.com/GqzIkrUx85— Breaking Aviation News & Videos (@aviationbrk) January 28, 2025ఈ విమానం 17 ఏళ్ల క్రితం నాటి ఎయిర్‌బస్ ఏ321 సీఈఓ మోడల్ అని దాని టెయిల్ నంబర్ హెచ్ఎల్ 7763 అని ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ మీడియాకు తెలిపింది. గత నెలలో కూడా ఇటువంటి ప్రమాదం చోటుచేసుకుంది. 2024 డిసెంబర్ 29న మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెజు ఎయిర్ బోయింగ్ 737-800 విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న 181 మందిలో 179 మంది మృతి చెందారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: యూపీ, బీహార్ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్.. 70 కి.మీ. పొడవునా.. -
Nalgonda: నాగార్జునసాగర్‌లో ఎయిర్పోర్ట్!
నాగార్జునసాగర్/సింగరేణి(కొత్తగూడెం): నాగార్జునసాగర్‌లో ∙1,600 ఎకరాలలో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు అధికారులు స్థల పరిశీలన చేశారు. ఎయిర్పోర్ట్ అథారిటీ జాయింట్ జనరల్ మేనేజర్ ఏఎస్ఎన్ మూర్తి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ప్రాజెక్టు సమీపంలో గతంలో ఏర్పాటుచేసిన రన్‌వే సమీపంలోని భూములను పరిశీలించింది. ఏపీలోని మాచర్ల మండలం విజయపురిసౌత్, పసువేముల, చింతలతండ, నాగులవరం భూములను గురువారం పరిశీలించారు. సాగర్ జలాలపై ‘సీ ప్లేన్’ను నడిపే ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో ఇక్కడ మినీ విమానాశ్రయం ఏర్పాటుకు ఆవశ్యకత ఏర్పడింది. మరోవైపు కొత్తగూడెంలో విమానాశ్రయ ప్రతిపాదిత స్థలాన్ని ఉన్నతాధికారులు అబ్దుల్ అజీజ్, మహమ్మద్ సాకిబ్, ప్రశాంత్ గుప్తా, ఆర్.దివాకర్, మనీష్ జోస్వాల్, ప్రవీణ్ ఉన్ని కృష్ణన్ పరిశీలించారు. -
ఎయిర్‌పోర్ట్‌లో రూ.10కే టీ, రూ20కే సమోసా!
ఎయిర్‌పోర్ట్‌లో స్నాక్స్ ధర రూ.వందల్లో ఉంటుందని తెలుసుకదా. అయితే కొత్తగా ప్రారంభించిన కేఫ్‌లో మాత్రం కేవలం రూ.10కే టీ, వాటర్ బాటిల్, రూ.20కే సమోసా, స్వీటు లభిస్తుంది. ‘అదేంటి.. షాపింగ్ మాల్స్‌లోనే వాటర్ బాటిల్ రూ.80 వరకు ఉంది. మరి ఎయిర్‌పోర్ట్‌లో ఇంత తక్కువా..?’ అని ధరలు చూసి ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ‘ఉడాన్ యాత్రి కేఫ్’ను ప్రారంభించింది. విమాన ప్రయాణికులకు చౌకగా స్నాక్స్ అందించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు.కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా ప్రారంభించిన ఉడాన్ యాత్రి కేఫ్ పుణ్యమా అని సరసమైన స్నాక్స్ ధరలు అందుబాటులోకి వచ్చాయి. 2024 డిసెంబర్ 21న పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ కేఫ్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతిరోజూ సుమారు 900 మంది ప్రయాణీకులు ఈ కేఫ్ సేవలు వినియోగించుకుంటున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. దీని ఆవిష్కరణ సమయంలో మంత్రి మాట్లాడుతూ..విమానాశ్రయంలో ఆహార ధరల పెరుగుదలపై దీర్ఘకాలంగా వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.No more overpriced food at the airport. Now you can have affordable snacks at airports at Udaan Yatri Cafe.Tea : ₹10Water : ₹10Samosa : ₹20Sweet : ₹20 pic.twitter.com/SGEsKGjEf8— Aaraynsh (@aaraynsh) January 23, 2025ఇదీ చదవండి: 2,000 ఐడీలను బ్లాక్ చేసిన రైల్వేశాఖధరలిలా..ఉడాన్ యాత్రి కేఫ్‌లో ప్రయాణికులు రూ.10కే టీ, రూ.10కే వాటర్ బాటిల్, కేవలం రూ.20కే సమోసా, రూ.20కు స్వీట్లు వంటి స్నాక్స్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ధరలు విమానాశ్రయంలోని ఇతర ఆహార దుకాణాలు వసూలు చేసే అధిక రేట్లకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రయాణీకుల నుంచి ఈ కేఫ్‌కు సానుకూల స్పందన వస్తోంది. కేఫ్ ప్రారంభించిన మొదటి నెలలో సుమారు 27,000 మంది ప్రయాణీకులకు సేవలు అందించింది. ఇతర విమానాశ్రయాల్లో ఈ నమూనా కేఫ్‌లను ప్రారంభించాలని ప్రయాణికుల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. -
నడవలేని స్థితిలో శ్రీవల్లి
-
కృత్రిమ దీవిలో అతిపెద్ద విమానాశ్రయం!
చైనా ప్రభుత్వం సముద్రంలో అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. కృత్రిమ దీవిలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. లియోనింగ్ ప్రావిన్స్‌లోని డాలియన్ నగరాన్ని ఆనుకుని ఉన్న సముద్రాన్ని పూడ్చి ఏకంగా ఓ సరికొత్త దీవిని నిర్మిస్తోంది. ఇక్కడే మొత్తం 20.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘డాలియన్ జి¯Œ జౌవాన్’ పేరుతో అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి, ఏటా 5 లక్షలకు పైగా విమానాలు, 8 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో పనిచేయనుంది. ఇందులో నాలుగు అతిపెద్ద రన్ వేలు, 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాసెంజర్ టెర్మినల్స్ కూడా ఏర్పాటవుతున్నాయి. వీటి ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతుందని అంచనా. ఈ నిర్మాణం పూర్తయితే, ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా కొనసాగుతున్న హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (12.48 చ.కి.మీ) రెండో స్థానానికి పడిపోతుంది. అయితే, ఈ రెండు విమానాశ్రయాలు కూడా కృత్రిమ దీవుల్లో ఏర్పాటైనవే కావడం విశేషం. ఈ విమానాశ్రయాన్ని 2035 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు చైనా ప్రభుత్వం తెలిపింది. -
ఎయిరిండియా చెక్-ఇన్ సమయంలో మార్పులు
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా తన చెక్-ఇన్ సమయాలను సవరించింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, విమానాశ్రయ విధానాలను క్రమబద్ధీకరించడానికి ఈ మార్పులు చేసినట్లు సంస్థ తెలిపింది. ఢిల్లీతోపాటు లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఈమేరకు మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది.లండన్ హీత్రూ విమానాశ్రయంలో చెక్-ఇన్ సమయాల్లో మార్పులు ఇలా..చెక్-ఇన్ కౌంటర్లు షెడ్యూల్ ప్రకారం విమానాలు బయలు దేరడానికంటే 75 నిమిషాల ముందే మూసివేస్తారు.గతంలో ఇది 60 నిమిషాలుగా ఉండేది.కొత్త నియమం ద్వారా ప్రయాణికుల రద్దీ సమయాల్లో చెక్-ఇన్, సెక్యూరిటీ క్లియరెన్స్‌ల కోసం తగిన సమయం ఉంటుంది.ఢిల్లీ విమానాశ్రయంలో ఇలా..ఢిల్లీ నుంచి బయలుదేరే అన్ని అంతర్జాతీయ విమానాలకు ఈ నియమాలు అమలుల్లో ఉంటాయి.చెక్-ఇన్ కౌంటర్లు షెడ్యూల్ ప్రకారం విమానాలు బయలు దేరడానికంటే 75 నిమిషాల ముందే మూసివేస్తారు.ఇదీ చదవండి: రైల్లో మంటలు! క్షణాల్లో తప్పించుకునేలా..సవరించిన చెక్-ఇన్ సమయానికి అనుగుణంగా ప్రయాణికులు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించింది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించాలనుకునేవారు షెడ్యుల్ సమయం కంటే దాదాపు 3 గంటల ముందుగానే ఉండడం మంచిదని పేర్కొంది. -
కోల్‌కతా విమానాశ్రయానికి వందేళ్లు
కోల్‌కతా: సిటీ ఆఫ్ జాయ్.. భారతదేశపు ఒకనాటి రాజధాని.. బ్రిటిష్ ఇండియా పాలనలో దేశంలోని ఇన్నో కీలక ఘట్టాలకు వేదికగా నిలిచినా మహానగరం కలకత్తా.. ఇప్పుడు ఒకనాడు డమ్ - డమ్ విమానాశ్రయంగా పేరుగాంచి తరువాత 1995 లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చుకున్న కలకత్తా విమానాశ్రయం ఈ ఏడాది వందేళ్ల పండగను జరుపుకోనుంది. వాస్తవానికి కోల్‌కతా 1772 - 1912 మధ్య భారత రాజధానిగా ఉండేది. ఆ తరువాత 1924లో కోల్‌కతాలో విమానాశ్రయం ఏర్పాటైంది. ఈశాన్య రాష్ట్రాలతోబాటు అటువైపునున్న దేశాలన్నిటికీ ముఖద్వారం వంటి కోల్‌కతా నుంచి విమాన కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇప్పుడు దేశంలోని ప్రముఖ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచినా సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాదితో వందేళ్లు పూర్తి చేసుకుంటోంది.వందేళ్ల క్రితం క్రితం .. ఇంకా చెప్పాలంటే అంతకు ముందే... 1900ల కాలంలో చిన్న ఎయిరోడ్రోముగా మొదలైన కలకత్తా ప్రస్థానం.. 1924 నాటికి పూర్తి స్థాయి విమానాశ్రయంగా మారింది. అప్పట్లో నెదర్లాండ్స్ కు చెందిన కెఎల్ఎం ఎయిర్ లైన్స్ (KLM airlines ) ఆమ్స్టర్డామ్ నుంచి ఇండోనేషియాలోని జకార్తాకు నడిపే విమానానికి కోల్ కతాలో స్టాప్ ఇచ్చేది. అలా అందర్జాతీయ విమానసర్వీసులు మొదలైన ఈ విమానాశ్రయం ఆ తరువాత ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగింది.. ఆకాశాన్ని ఎందుకులే లోహ విహంగాలకు ఆశ్రయం ఇస్తూ.. అంతర్జాతీయ స్థాయికి చేరింది.1924లో బ్రిటన్ కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానం ఇక్కడ ల్యాండ్ అయింది.ఆ తరువాత మే 2న ఫ్రెంచ్ పైలట్ మిస్టర్ డోయ్సీ రాక కూడా జరిగింది. అదే సంవత్సరం, డమ్ డమ్ విమానాశ్రయంలో తొలిసారిగా రాత్రిపూట విమానం ల్యాండ్ అవడం, ఓ గొప్ప ముందడుగుకు నాంది అని చెప్పవచ్చు. మొదట్లో టార్చిలైటు వెలుగులో విమానాలను రాత్రిపూట ల్యాండ్ చేసేవాళ్ళు. వాస్తవానికి ఈ విమానాశ్రయం అటు యూరోప్.. ఉత్తర అమెరికాలనుంచి ఇటు ఆసియావైపు వెళ్లే విమానాలకు మార్గమధ్యంలో ఒక టెక్నీకల్ హాల్ట్‌గా గణనీయంగా ఉపయోగపడడం మొదలయ్యాక దాని స్థాయి అమాంతం పెరిగిపోయిడ్ని. ఆ రెండు మార్గాల నడుమ నడిచే విమానాలన్నీ కలకత్తాలో కాసేపు ఆగి.. ఇంధనం నింపుకు వెళ్లడం.. విమానాల సాంకేతికత తనిఖీ వంటి పనులన్నీ ఇక్కడే చేసుకునేవాళ్ళు. దీంతో అనివార్యంగా ఇక్కడ రద్దీ పెరుగుతూ వచ్చింది.ఇదిలా ఉండగానే 1929లో అప్పటి అప్పటి బెంగాల్ గవర్నర్ సర్ స్టాన్లీ జాక్సన్ డమ్ డమ్ ఏరోడ్రోమ్‌లో బెంగాల్ ఫ్లయింగ్ క్లబ్‌ను ప్రారంభించి విమానాశ్రయ హోదాను మరింతగా పెంచారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ అప్పట్లో బ్రిటిష్ వారితో చేసిన యుద్ధానికి సైతం కోల్ కతా విమానాశ్రయం వేదిక ఐంది. 1938లో బోస్ ఇక్కణ్నుంచే బ్రిటిష్ వారిపై సమరశంఖాన్ని పూరించారు. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో, కోల్‌కతా వాణిజ్య విమానాలకు కీలక గమ్యస్థానంగా మారింది. 1940-1960ల మధ్య, విమానాశ్రయం ఏరోఫ్లాట్, ఎయిర్ ఫ్రాన్స్ మరియు పాన్ ఆమ్ వంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ప్రముఖ స్టాప్ ఓవర్ హబ్‌గా మారింది. 1990 తరువాత దశమారింది. 1990ల నాటికి, కోల్‌కతా విమానాశ్రయం ప్రయాణీకు లు,కార్గో కార్యకలాపాలకు ప్రధాన అంతర్జాతీయ, దేశీయ కేంద్రంగా ఎదిగింది1990లలో, విమానాశ్రయం ఆధునీకరణ చేయగా 1995లో నిర్మించిన కొత్త దేశీయ టెర్మినల్ భారత విమానయాన రంగం వృద్ధిని ప్రతిబింబిస్తుంది.అదే ఏడాది దీనిపేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు.2000లలో భారత వైమానిక రంగం గొప్ప పురోగతి సాధించింది. తక్కువ ధరలకే విమాన ప్రయాణం అంటూ సరికొత్త ప్రయివేటు విమాన సంస్థలు రావడంతో దేశంలోని అన్ని విమానాశ్రయాల మాదిరే ఇక్కడా రద్దీ పెరిగింది. తద్వారా విమానాశ్రయం గణనీయమైన అభివృద్ధిని నమోదు చేసింది.2013లో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం, రన్‌వే పొడిగింపు వంటి అభివృద్ధి పనులతో ఈ విమానాశ్రయం ప్రాధాన్యం అమాంతం ఆకాశాన్ని అంటింది. ప్రస్తుతంప్రస్తుతం పాతికదేశాలకు పైగా విమానయాన సంస్థలు వాణిజ్యకార్యకలాపాలను ఇక్కణ్ణుంచి కొనసాగిస్తున్నాయి. వందలాది విమానాలు.. కార్గో సంస్థలకు కోల్ కతా ఇప్పుడు ప్రధాన వాణిజ్యకేంద్రంగా మారింది. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇక్కణ్ణుంచి 1,97,84,417 మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకులు వివిధ దేశాలకు, ప్రాంతాలకు పయనమయ్యారు. దాదాపు రోజూ 430 విమానాలు ఇక్కడికి వచ్చిపోతుంటాయి. ఈశాన్య భారతదేశపు ఆర్థిక, వాణిజ్య, రవాణా రంగాన్ని మరింత ముందుకు నడిపించడంలో కీలకముగా ఉన్న సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది వందో పుట్టినరోజును జరుపుకుంటోంది. సిటీ ఆఫ్ జాయ్ గా పేరొందిన కోల్ కతా తో బాటు ఈశాన్య భారతానికే కాకుండా పలు ఆసియా దేశాలకు ఈ విమానాశ్రయం ఒక ముఖద్వారం.. ఈ వందేళ్ల పండుగకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.:::సిమ్మాదిరప్పన్న -
మెట్రోకు బెల్ట్ కనెక్టివిటీ
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో జంక్షన్ల మధ్య అనుసంధానం కోసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ (హెచ్‌ఏఎంఆర్‌ఎల్) వివిధ రకాల ప్రత్యామ్నాయాలపై కసరత్తు చేస్తోంది. ఆయా మార్గాల్లోంచి బయలుదేరే ప్రయాణికులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు జంక్షన్ల వద్ద ట్రెయిన్ మారాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్టు నుంచి నగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా జంక్షన్ల వద్ద మార్పు తప్పనిసరి. దీంతో లగేజీ తరలింపు సమస్యగా మారనుంది. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు లగేజీ తీసుకెళ్లడం ఎంతో కష్టం. ఈ క్రమంలో లగేజీ తరలింపుతో పాటు ప్రయాణికులు కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా స్టేషన్లు మారేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. లగేజీ తరలింపునకు బెల్ట్.. నగరంలోని అన్ని వైపుల నుంచి ప్రతిరోజూ కనీసం సుమారు లక్ష మందికి పైగా ప్రయాణికులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ఎయిర్‌పోర్టు ప్రయాణికులతో పాటు, వారి కోసం వెళ్లే బంధుమిత్రులు, జీఎమ్మార్ ఉద్యోగులు తదితర వర్గాలకు చెందిన ప్రయాణికులతో ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం 75 వేల మంది ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగిస్తుండగా 2028లో ఎయిర్‌పోర్టు మెట్రో సేవలు ప్రారంభమయ్యే నాటికి లక్ష దాటవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో లక్ష మంది ప్రయాణికులు నిరంతరం రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా మెట్రో జంక్షన్ల మధ్య లగేజీ కోసం పెద్ద ఎత్తున బెల్ట్‌లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. అలాగే ప్రయాణికుల కోసం వాక్‌వేలు ఉంటాయి. ఎల్బీనగర్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌కు స్కైవాక్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. నాగోల్ మెట్రోస్టేషన్ నుంచి నాగోల్ ఎయిర్పోర్ట్ మెట్రోస్టేషన్‌కు మధ్య వాక్‌వే ఉంటుంది. ఎయిర్పోర్ట్ మెట్రో స్పెషల్.. మెట్రో రెండో దశలో ఎయిర్‌పోర్టు మెట్రో ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. మిగతా మార్గాల్లో కంటే ఈ రూట్లో మెట్రో రైళ్ల వేగం కూడా ఎక్కువే ఉండనుంది. ప్రస్తుతం గంటకు 35 కిలోమీటర్ల వేగంతో నడుస్తుండగా, ఎయిర్పోర్ట్ రూట్లో 45 కిలోమీటర్ల వరకు వేగం పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ వద్ద ఏర్పాటు చేసినవిధంగా 1.6 కిలోమీటర్లు భూగర్భ మెట్రో నిర్మించనున్నారు. ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ భూగర్భంలోనే ఉంటుంది. అక్కడి నుంచి ప్రయాణికులు ఎస్కలేటర్లు, లిఫ్టులను వినియోగించి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్‌కు చేరుకుంటారు. మరోవైపు ఫోర్త్ సిటీకి మెట్రో అందుబాటులోకి వచ్చేనాటికి హైదరాబాద్ నుంచి ఎయిర్‌పోర్టు మీదుగా ఫోర్త్‌సిటీకి రాకపోకలు సాగించే మెట్రో ప్రయాణికుల సంఖ్య 7 లక్షలు దాటవచ్చని భావిస్తున్నారు. -
విమానాల్లో వన్యప్రాణులు
సాక్షి, విశాఖపట్నం: మూఢ నమ్మకాలతో కొందరు..! హోదా కోసం మరికొందరు..! కారణమేదైనా అరుదైన వన్యప్రాణులు సంపన్నుల ఇళ్లల్లో తారసపడుతున్నాయి. నిఘా వ్యవస్థ కళ్లుగప్పి విమానాల్లో ఖండాతరాలు దాటి వస్తున్నాయి. ఇవి స్మగ్లర్లకు కాసులు కురిపిస్తున్నాయి. అక్రమ రవాణాపై కస్టమ్స్ నిఘా పెరగడంతో స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త ఎయిర్‌పోర్టులను అన్వేíÙస్తున్నారు. థాయ్‌లాండ్, మలేíÙయా నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వన్యప్రాణుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఒకప్పుడు ఓడలలో వీటిని అక్రమంగా తరలించగా ఇప్పుడు వైమానిక మార్గాలను ఎంపిక చేసుకుంటున్నారు. వన్యప్రాణుల అక్రమ రవాణాకు స్మగ్లర్లు వైమానిక రంగాన్ని వినియోగిస్తున్న టాప్ 10 దేశాల్లో భారత్ ఉండటంపై ఐక్యరాజ్యసమితి (యూఎన్ఈపీ) ఆందోళన వ్యక్తం చేసింది. చెన్నైలో అధికంవివిధ దేశాల నుంచి భారత్‌కు అక్రమంగా వన్య ప్రాణులను తరలిస్తుండగా పట్టుబడిన కేసుల్లో మూడొంతులు చెన్నై ఎయిర్‌పోర్టుల్లో నమోదైనవే కావడం గమనార్హం. ఇక్కడ నిఘా పెరగడంతో తాజాగా బెంగళూరు, హైదరాబాద్‌తో పాటు విశాఖ ఎయిర్‌పోర్టులను ప్రత్యామ్నాయాలుగా స్మగ్లర్లు ఎంచుకుంటున్నారు. చెన్నై, ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులు అక్రమ రవాణాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆదాయం పెరుగుతుందనే మూఢ నమ్మకంతో..తాబేళ్లు, అరుదైన బల్లులను పెంచితే ఆదాయం పెరుగుతుందని కొందరి మూఢనమ్మకం. పాములను పెంచితే కష్టాలు తొలగిపోతాయని మరికొందరి విశ్వాసం. స్మగ్లర్లకు ఇది కాసులు కురిపిస్తోంది. ఇగ్వానాలు, మార్మోసెట్లు, కంగారూలు, విదేశీ తాబేళ్లు, విషపూరిత పాములు, యాలిగేటర్లు, అరుదైన పక్షులను కొనుగోలు చేసేందుకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. వీటిని ఎలా పెంచాలనే విషయాలపై సోషల్ మీడియాలో సమాచారం సేకరిస్తున్నారు. బ్యాంకాక్, దుబాయ్, కౌలాలంపూర్, ఆ్రస్టేలియా, ఆఫ్రికా నుంచి ఎక్కువగా వీటి అక్రమ రవాణా జరుగుతోంది.యూఎన్ ఈపీ ట్రాఫిక్ తాజా నివేదిక ప్రకారం 2011– 2020 మధ్య 70,000 రకాల అరుదైన జీవజాతులు 18 భారతీయ విమానాశ్రయాల ద్వారా అక్రమ రవాణా జరిగాయి. వీటిలో సరీçసృపాలు 46 శాతం ఉండగా 18 శాతం క్షీరదాలున్నాయి. ఇండియన్ స్టార్ టార్టాయిస్, బ్లాక్ పాండ్ తాబేళ్లు, జలగలు, ఇగ్వానాలు వీటిలో ఉన్నాయి. దేశంలోని వివిధ ఎయిర్‌పోర్టుల్లో 2023–24లో అక్రమ రవాణాకు సంబంధించి 18 కేసులను నమోదు చేయగా 230 వన్యప్రాణుల్ని స్వా«దీనం చేసుకున్నారు.పాములు నుంచి బల్లుల దాకా సజీవంగా.. గతంలో ఏనుగు దంతాలు, పాంగోలిన్ పొలుసులు, పులి చర్మాలు, జంతు చర్మాలు, గోళ్లు అక్రమంగా తరలించగా ఇప్పుడు ఏకంగా సజీవంగా ఉన్న వన్య ప్రాణులనే స్మగ్లింగ్ చేయడం విస్తుగొలుపుతోంది. 2019లో చెన్నై విమానాశ్రయంలో స్వా«దీనం చేసుకున్న ఆఫ్రికన్ హార్న్ పిట్ వైపర్లు, ఇటీవల హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన తాచుపాములు, విశాఖ ఎయిర్‌పోర్టులో లభ్యమైన ప్రమాదకరమైన బల్లులు.. ఇలా సజీవంగా తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధపడుతున్నారు. కట్టుదిట్టంగా తనిఖీలు విమానాశ్రయంలో నిరంతరం తనిఖీలు జరుగుతున్నాయి. బ్యాగేజ్ తనిఖీల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. డీఆర్ఐ, కస్టమ్స్ సహా అన్ని విభాగాల ఆధ్వర్యంలో ప్రతి ప్రయాణికుడినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. వన్యప్రాణుల వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతున్నాం. చెక్‌లిస్ట్‌లు, తనిఖీ కేంద్రాల వద్ద ప్రయాణికులకు అవగాహన కలి్పస్తున్నాం. – రాజారెడ్డి, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ -
కార్గో ఎయిర్పోర్ట్ కోసం భూములిచ్చేదిలేదు
కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా మందస మండల పరిధిలో కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రతిపాదనలను స్థానిక గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తమకు జీవనాధారమైన పంట భూములు తీసుకుని కార్గో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే తమ బతుకులు నాశనమవుతాయని వాపోతున్నారు. మందస మండలం రాంపురం గ్రామంలో ఆదివారం 6 పంచాయతీల ప్రజలు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసుకుని ఎయిర్‌పోర్టును ముక్తకంఠంతో వ్యతిరేకించారు.ఉద్దాన ప్రాంత ప్రజల అవసరాలు, మనోభావాలు తెలుసుకోకుండా, స్థానికుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని బలవంతంగా కార్గో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఉద్దాన ప్రాంతానికి ఉద్యమాలు కొత్తకాదన్నారు. జీవనాధారమైన పంట భూముల్ని పరిహారానికి ఆశపడి ఇవ్వబోమని స్పష్టంచేశారు.ఈ సందర్భంగా రాంపురం వేదికగా ఉద్దానం ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్‌గా కొమర వాసును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో వారం రోజుల్లో పంచాయతీల వారీగా కమిటీలు వేసుకుని అనంతరం పోరాట కమిటీని ప్రకటిస్తామని వెల్లడించారు. -
అదానీపై కేసు ఎఫెక్ట్.. రూ.6,216 కోట్ల డీల్ రద్దు?
అదానీ గ్రూప్‌తో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃపరిశీలిస్తామని కెన్యా ప్రకటించింది. కెన్యాలో విమానాశ్రయ అభివృద్ధితోపాటు ఎనర్జీ ప్రాజెక్ట్‌ల విస్తరణ కోసం అదానీ గ్రూప్ గతంలో ఒప్పందం చేసుకుంది. ఇటీవల అదానీ సంస్థలపై చెలరేగుతున్న నేరాభియోగాల వల్ల కెన్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఉదంతం నుంచి కోలుకుని, క్రమంగా పుంజుకున్న అదానీ గ్రూప్‌నకు మళ్లీ షాక్ తగిలింది. భారత్‌లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌లు పొందేందుకు దాదాపు రూ.2,200 కోట్లు (సుమారు 265 మిలియన్ డాలర్లు) లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై మోసం, లంచం, అవినీతి కేసులు నమోదయ్యాయి.ఇదీ చదవండి: సోలార్ ఎనర్జీ తయారీ 20 రెట్లు వృద్ధి: ఐఎస్ఏ నివేదికఈ నేపథ్యంలో కెన్యా అధ్యక్షుడు విలియం రుటో ప్రకటన విడుదల చేశారు. కెన్యాలో విమానాశ్రయాలు, పవర్ ట్రాన్స్మిషన్లైన్ల విస్తరణకు అదానీ గ్రూప్‌తో గతంలో చేసుకున్న ఒప్పందాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు చెప్పారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశాక దీనిపై పునరాలోచిస్తామన్నారు. ఈ డీల్ విలువ 736 మిలియన్ డాలర్లు(రూ.6216 కోట్లు). ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించారు. -
‘మామునూరు’లో మరో ముందడుగు
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రన్‌వే విస్తరణకు కావాల్సిన 205 ఎకరాల భూమిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు స్వాదీనం చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌కు సూచించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దశల వారీగా సమీక్షించి, మామునూరు విమానాశ్రయ స్థల సేకరణలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించడం, రోజుల వ్యవధిలోనే స్థల సేకరణకు అవసరమైన నిధులు మంజూరు చేయించడంతో విమానాశ్రయ పనుల్లో ముందడుగు పడినట్టయ్యింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లతో కూడిన డీపీఆర్ వేగంగా సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి ఆర్అండ్బీ శాఖ లేఖ కూడా రాసింది. వరంగల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రానున్న నేపథ్యంలో విమానాశ్రయానికి సంబంధించి ముందడుగు పడడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నెల రోజుల్లోనే పురోగతి ఇలా.. » ఈ ఏడాది అక్టోబర్ 23న రాజీవ్‌గాంధీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌లో బోర్డు మీటింగ్ నిర్వహించారు. మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల పరిధి ఒప్పందాన్ని జీఎమ్మాఆర్ సంస్థ విరమించుకుంది. » ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి అధ్యక్షతన మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూసేకరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. » మంత్రి కొండా సురేఖతోపాటు ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, ఎంపీ కడియం కావ్య తదితరులు భూనిర్వాసితులతో సమావేశమై వారి డిమాండ్లను కలెక్టర్‌కు విన్నవించాలని కోరారు. » ఆ తర్వాత కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆధ్వర్యాన రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. భూసేకరణకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమరి్పంచడంతో అందుకు కావాల్సిన రూ.205 కోట్ల నిధులను మంజూరు చేసింది. సాధ్యమైనంత తొందరగా భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అందరి దృష్టి పరిహారంపైనే.. ఎయిర్‌పోర్ట్‌కు సేకరించే భూములకు సంబంధించి ఎకరాకు గవర్నమెంట్ వ్యాల్యూ రూ.6లక్షలు ఉంది. భూనిర్వాసితులకు పరిహారం మూడింతలు చెల్లించాలనుకున్నా ఎకరాకు రూ.18 లక్షలు ఇచ్చే అవకాశముంది. రెవెన్యూ అధికారులు రూ.25 లక్షల వరకు చెల్లించే దిశగా ఆలోచన చేస్తున్నారు. రైతుల నుంచి ఒత్తిడి ఎక్కువైతే తమ విచక్షణాధికారాలు ఉపయోగించి ఇంకాస్త పెంచాలని యోచిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఎకరాకు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతుండడంతో రైతుల నుంచి ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని అధికారులు హైరానా పడుతున్నారు. మరోవైపు ఎన్ని వ్యవసాయ బావులు, బోర్లు పోతున్నాయనే వివరాలను సోమవారం నుంచి రెవెన్యూ అధికారులు సేకరించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన తర్వాత ఆయా గ్రామాల్లో సభలు నిర్వహించి పరిహారంపై స్పష్టతనిచ్చే అవకాశముంది. -
రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ల కలకలం
-
విమానాలకు బాంబు బెదిరింపు
శంషాబాద్ రూరల్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ఆదివారం పలు విమానాలకు బెదిరింపు ఫోన్ కాల్ రావటంతో ఓ విమానాన్ని అత్యవసరంగా దించేశారు. గోవా నుండి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానానికి బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో దింపారు.ఇందులో 180 మంది ప్రయాణికులు ఉన్నా రు. మరో గంటకు బెంగళూరు–హైదరాబాద్ ఇండిగో విమానానికి, మళ్లీ గంట తర్వాత హైదరాబాద్–పుణే ఇండిగో విమానానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీటితో పాటు ఎయిర్ఇండియా విమానానికి ఇదే తరహా కాల్ వచి్చనట్లు విమానాశ్రయం వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. -
రూ.13 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
-
3 నిమిషాలు మించి హత్తుకోకండి
వెల్లింగ్టన్: తమను విడిచి విదేశాలకు వెళ్లే వారికి ఎయిర్‌పోర్టుల్లో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు గుంపులుగా వచ్చి వీడ్కోలు చెబుతుండటం మనం చూసే ఉంటాం. ఇలా ఒక్కో ప్రయాణికుడికి వీడ్కోలు చెప్పే వారి సంఖ్య పెరుగుతుండటం, వచీ్చపోయే ద్వారాల వద్ద రద్దీ ఎక్కువవడంతో న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్ ఎయిర్పోర్ట్ నిర్వాహకులు కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. ‘‘మీ ఆప్తులకు హత్తుకుని వీడ్కోలు పలకాలంటే గరిష్టంగా మూడు నిమిషాలే హగ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ సమయం మనసారా వీడ్కోలు పలకాలంటే కారు పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకోండి’అని ఒక పెద్ద బోర్డ్ తగిలించింది. తమ నిర్ణయాన్ని ఎయిర్పోర్ట్ సీఈఓ డేనియర్ బోనో సమర్థించుకున్నారు. ‘‘విరహవేదన కావొచ్చు ఇంకేమైనా కావొచ్చు. ఆప్తులు దూరమవుతుంటే కౌగిలించుకుంటే ఆ బాధ కాస్తయినా తీరుతుంది. అందుకే కౌగిలించుకుంటే కేవలం 20 సెకన్లలోనే ప్రేమ హార్మోన్ ‘ఆక్సిటాసిన్’విడుదలవుతుంది. బాధ తగ్గుతుంది. అంతమాత్రాన దారిలో అడ్డుగా ఉండి అదేపనిగా హత్తుకుంటే ఇతర ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. డ్రాప్ జోన్ల వద్ద అడ్డుగా ఉండటం సబబు కాదు’అని ఆయన వాదించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. తమ వారికి ప్రశాంతంగా కాస్తంత ఎక్కువ సమయం వీడ్కోలు చెప్పడం కూడా ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెడుతుందా? అని కొందరు విమర్శలకు దిగారు. ఎయిర్పోర్ట్ నిర్ణయాన్ని కొందరు సమర్థించారు. ‘‘మిగతా దేశాల్లో కారులో లగేజీ దింపి హత్తుకుని, ఏడ్చి సాగనంపితే ఆ కొద్ది సమయానికే ‘కిస్ అండ్ ఫ్లై’చార్జీల కింద చాలా నగదు వసూలుచేస్తారు. ఈ ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఎంతో మంచిది. తొలి 15 నిమిషాలు పార్కింగ్ ఉచితం’’అని ఒక ప్రయాణికుడు మెచ్చుకున్నాడు. ప్రయాణికుల వెంట వచ్చే వారిని తగ్గించేందుకు చాలా దేశాల ఎయిర్‌పోర్ట్‌లు ఆ కొద్దిసేపు కారు ఆపినందుకు కూడా చార్జీలు వసూలుచేస్తుండం గమనార్హం. బ్రిటన్‌లోని ఎస్సెక్స్ ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఇందుకు 15 నిమిషాలకు దాదాపు రూ.768 వసూలుచేస్తోంది. -
ఎయిర్‌పోర్టు వెలుపల పేలుడు.. ఇద్దరు మృతి
కరాచీ: పాకిస్తాన్లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. కరాచీ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ భారీ పేలుడులో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది గాయపడినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విమానాశ్రయం వెలుపల ట్యాంకర్ పేలింది.విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పాక్ హోం మంత్రి జియా ఉల్ హసన్ స్థానిక టీవీ ఛానల్ జియోకు తెలిపారు. చైనా పౌరులపై దాడి జరిగిందని, వారిలో ఒకరు గాయపడ్డారని అన్నారు. బీజింగ్ చేపట్టిన రహదారి నిర్మాణంలో చైనా కార్మికులు పాల్గొంటున్నారు. ఈ రహదారి దక్షిణ-మధ్య ఆసియాను చైనా రాజధాని బీజింగ్‌తో కలుపుతుంది.డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఈస్ట్ అజ్ఫర్ మహేసర్ మీడియాతో మాట్లాడుతూ తాము పేలుడుకు గల కారణాన్ని తెలుసుకునే పనిలో ఉన్నామన్నారు. గాయపడిన వారిలో పోలీసు అధికారులు కూడా ఉన్నారని తెలిపారు. హోం మంత్రి, ఇన్స్పెక్టర్ జనరల్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎయిర్‌పోర్టు భవనాలు కంపించేంత పెద్ద పేలుడు సంభవించిందని పౌర విమానయాన శాఖలో పనిచేస్తున్న అధికారి రాహత్ హుస్సేన్ తెలిపారు.ఇది కూడా చదవండి: అశ్వియ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్ -
85 ఏళ్ల తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో పేలిన బాంబు.. 87 విమానాల రద్దు
టోక్యో: జపాన్ రెండో ప్రపంచ యుద్ధ బాంబులు తాజాగా కలకలం రేపుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా.. జపాన్‌లో బాంబులను జారవిడించింది. అయితే ఆ బాంబులు జపాన్‌లో ఎక్కడో చోట పేలుతూనే ఉన్నాయి.తాజాగా అక్టోబర్ 2న సౌత్‌వెస్ట్ జపాన్‌లోని మియాజాకి విమానాశ్రయం రన్‌వే పై ఓ బాంబు పేలింది. దీంతో బాంబు పేలిన ప్రదేశంలో ఏడు మీటర్ల వెడల్పు, ఒక మీటరు లోతు భూమి ధ్వంసమైంది. బాంబు విస్పోటనంతో సమాచారం అందుకున్న ఎయిర్ పోర్ట్ అధికారులు రన్‌వేని షట్‌డౌన్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.బాంబు విస్పోటనం అయ్యే సమయంలో రన్‌వేపై సుమారు 87కి పైగా విమానాలు ఉన్నాయి. అయినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. ఎయిర్పోర్ట్ రన్‌వే మీద బాంబు పడిన ప్రదేశాన్ని పునర్నిర్మిస్తామని, ఆ పనులు గురువారం నాటికి పూర్తి చేస్తామని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిమాస హయాషి తెలిపారు.విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయంమియాజాకి విమానాశ్రయంపై బాంబు విస్పోటనంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ నుంచి జపాన్ నగరాలైన టోక్యో,ఒసాకా,ఫుకుయోకాతో పాటు ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిర్వహించే ప్రముఖ ఎయిర్ లైన్ దిగ్గజం జపాన్ ఎయిర్‌లైన్స్ (జేఏఎల్), ఆల్ నిప్పాన్ ఎయిర్‌లైన్స్ (ఏఎన్ఏ)తో పాటు ఇతర విమానాయాన సంస్థలు సర్వీసుల్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం.85ఏళ్ల క్రితం యుద్ధంరెండో ప్రపంచం యుద్ధం జరిగింది 85ఏళ్ల అవుతుంది. అయినప్పటికీ యుద్ధ సమయంలో జపాన్‌పై అమెరికా ప్రయోగించిన బాంబులు నిత్యం ఎక్కడ ఒక చోట పేలుతూనే ఉన్నాయి. కేంద్ర రవాణ శాఖ అధికారిక లెక్కల ప్రకారం.. గతేడాది మియాజాకి విమానాశ్రయంలో 37.5 టన్నుల బరువైన 2,348 బాంబులను జపాన్ డిఫెన్స్ ఫోర్స్ నిర్విర్యం చేసింది. -
భద్రాద్రిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, రాష్ట్రంలో కోకోనట్ బోర్డు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శివరాజ్‌సింగ్ చౌహాన్‌లకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీ పర్యటనలో భాగంగా తుమ్మల కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు అంశాలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రా లు అందజేశారు. అనంతరం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని రామ్మోహన్ నాయుడును కోరినట్లు తెలిపారు. తెలంగాణలో నూతన కోకోనట్ బోర్డ్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరానన్నారు. ఆయిల్‌పామ్ మీద 28% దిగుమతి సుంకం విధించి, దేశీయంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నందుకు తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్‌పామ్‌కు కేంద్రం కనీస మద్దతు ధర కలి్పంచాలని కోరారు. అలాగే ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని కూడా విన్నవించారు. ఇటీవలి వరదల్లో నష్టపోయిన ఖమ్మం జిల్లాకు తగిన మొత్తంలో సహాయం అందజేయాలని కోరారు. నష్టంపై నివేదిక రాగానే సహాయం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచి్చనట్లు తెలిపారు. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను కలిసి, తెలంగాణలో ఎక్కువగా పండే పంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరానన్నారు. అలాగే.. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ ఆహార సదస్సులో పాల్గొని.. తెలంగాణలోని అవకాశాలను వివరించి, ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించడానికి రాష్ట్రానికి రావాలని ఆహా్వనించానన్నారు. సాగు చేసేవారికే రైతుబంధువ్యవసాయం చేసే వారికే రైతుబంధు ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కౌలు రైతు, భూమి యజమాని చర్చించుకొని రైతుబంధు ఎవరు తీసుకోవాలన్నది వారే నిర్ణయించుకోవాలన్నారు. ఏపీలో ఉన్నట్లుగా తెలంగాణలో కౌలు రైతు ఒప్పందాలు లేవని గుర్తుచేశారు. ఐదేళ్లలో కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేయలేదని, ఒకేసారి రూ.18,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. అవసరమైతే ఇంకా నిధులు సమకూరుస్తామని తెలిపారు. ప్రతి పంట, ప్రతి రైతుకు వర్తించేలా రూ.3,000 కోట్లతో బీమా చేయనున్నట్లు తుమ్మల తెలిపారు. -
తిరోగమనంలో విమానయానం
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం తర్వాత వేగంగా కోలుకున్న రాష్ట్ర విమానయాన రంగం తొలిసారిగా నేలచూపులు చూసింది. లాక్డౌన్ తర్వాత ప్రతీ నెలా క్రమంగా పెరుగుతూ వచి్చన ప్రయాణికుల సంఖ్య జూలై నెలలో తగ్గిపోయింది. తాజాగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. గతేడాది జూలై నెలతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ఒక్క విజయవాడ తప్ప రాష్ట్రంలోని మిగిలిన ఐదు విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంఖ్యలో భారీ క్షీణత నమోదయ్యింది. రాయలసీమ ప్రాంతంలో ఆ క్షీణత ఇంకా ఎక్కువగా ఉంది.తిరుపతి విమానాశ్రయంలో 4.4 శాతం తగ్గితే కర్నూలులో 63.5 శాతం, కడప విమానాశ్రయంలో 47.4 శాతం తగ్గింది. గతేడాది జూలై నెలలో కడప విమానాశ్రయం నుంచి 6,944 మంది ప్రయాణిస్తే ఇప్పుడు ఆ సంఖ్య 3,650కు పడిపోయింది. అదే సమయంలో కర్నూలులో ప్రయాణికుల సంఖ్య 3,419 నుంచి 1,247కు పడిపోయింది. తిరుపతి విమానాశ్రయంలో కూడా ప్రయాణికుల సంఖ్య తగ్గడం గమనార్హం. విశాఖపట్నంలో కూడా ప్రయాణికుల సంఖ్య 2,28,897 నుంచి 2,25,261కు తగ్గిపోయింది. కానీ ఒక్క విజయవాడలో 15.5 శాతం పెరిగింది.తగ్గించేస్తున్న సరీ్వసుల సంఖ్యప్రయాణికుల సంఖ్య తగ్గడంతో విమానయాన సంస్థలు తమ సరీ్వసులను తగ్గించేస్తున్నాయి. కర్నూలులో విమాన సరీ్వసులు 108 నుంచి 64కు తగ్గిపోయాయి. కడపలో 200 నుంచి 138కు రాజమండ్రిలో 748 నుంచి 694కు సరీ్వసులు తగ్గాయి. ఒక్క విజయవాడలో మాత్రం విమాన సర్వీసులు 1,272 నుంచి 1,553కు పెరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఆర్థిక కార్యకలాపాలు తగ్గడంతో విమాన ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.ప్రభుత్వం రాజధాని అమరావతి అంటూ ఆ ఒక్క ప్రాంతానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో మిగిలిన ప్రాంతాల్లో కార్యకలాపాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయని, దానికి నిదర్శనమే విశాఖతో సహా మిగిలిన విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి కారణంగా నిపుణులు విశ్లేíÙస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన కె.రామ్మోహన్నాయుడు ఉన్నప్పటికీ విమాన సరీ్వసులు, ప్రయాణికుల సంఖ్య తగ్గుతున్నాయని, ఇదే విధమైన పరిస్థితి కొనసాగితే త్వరలోనే కడప, కర్నూలు విమానాశ్రయాల్లో సేవలు నిలిచిపోయే ప్రమాదముందని ఆ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
డబ్బుతో విమానం ఎక్కుతున్నారా.. ఈ రూల్స్ తెలుసా?
Airport Rules: ప్రస్తుతం విమాన ప్రయాణం సర్వ సాధారణంగా మారిపోయింది. విదేశాలకు, దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే విమానాల్లో వెళ్లడానికే చాలా మంది ఇష్టపడతారు. గమ్యాన్ని తక్కువ సమయంలో చేరుకోవడం, ఫ్లైట్ ఫేర్లు తక్కువగా ఉండటం వంటి కారణాలతో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య ఇటీవల పెరుగుతూ వస్తోంది.అయితే విమానంలో ప్రయాణించడానికి లగేజీకి సంబంధించిన పరిమితులు ఉంటాయని చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ప్రయాణికులు తమ వెంట ఎంత నగదు తీసుకువెళ్లవచ్చు అనే దానిపైనా పరిమితులు ఉన్నాయని మీకు తెలుసా? దేశం వెలుపల, విదేశాలలో నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ, తమ సౌలభ్యం కోసం నగదును తమ వెంట తీసుకెళ్లేందుకు ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు.ఎంత తీసుకెళ్లొచ్చు?నగదును తీసుకెళ్లేందుకు సంబంధించిన నిబంధనలు దేశీయ విమానాలకు, అంతర్జాతీయ విమానాలకు వేరువేరుగా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. దేశీయ విమానాల్లో గరిష్టంగా రూ. 2 లక్షల నగదును తీసుకెళ్లవచ్చు. కానీ మీరు విదేశీ పర్యటనకు వెళుతున్నట్లయితే ఈ నిబంధన వర్తించదు.ఇక మీరు నేపాల్, భూటాన్ మినహా మరే ఇతర దేశానికి వెళుతున్నా 3000 డాలర్ల వరకు విదేశీ కరెన్సీని తీసుకెళ్లవచ్చు. దీని కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లాలనుకుంటే స్టోర్ వ్యాల్యూ, ప్రయాణ తనిఖీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.లగేజీ బరువు ఎంత ఉండాలి?విమానంలో మీ హ్యాండ్‌బ్యాగ్‌లో 7 నుండి 14 కిలోల బరువును తీసుకెళ్లవచ్చు. మీరు చెక్-ఇన్ కౌంటర్ వద్ద ఇచ్చే చెక్-ఇన్ బ్యాగేజీ బరువు 20 నుండి 30 కిలోల వరకు ఉంటుంది. అంతర్జాతీయ విమానాలకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి.ఏవి తీసుకెళ్లకూడదు?విమాన ప్రయాణంలో మీరు కొన్ని వస్తువులను తీసుకెళ్లకూడదు. క్లోరిన్, యాసిడ్, బ్లీచ్ మొదలైన రసాయనాలను అస్సలు తీసుకెళ్లలేరు. ఇక మద్యం విషయానికి వస్తే దేశీయ విమానాల్లో మీ చెక్-ఇన్ బ్యాగ్‌లో ఆల్కహాల్ తీసుకెళ్లవచ్చు. కానీ అది 5 లీటర్లకు మించకూడదు. -
Washington: ఎయిర్‌పోర్టుపై సైబర్ దాడి.. ప్రయాణికుల అవస్థలు
ప్రపంచంలో ఇటీవలి కాలంలో సైబర్ దాడులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో ఇలాంటి ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంపై సైబర్ దాడి జరిగింది. దీంతో ఇంటర్నెట్, ఫోన్, ఈ- మెయిల్ ఇతర కమ్యూనికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ అధికారులు ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయ మేనేజింగ్ డైరెక్టర్ లాన్స్ లిటిల్ మీడియాతో మాట్లాడుతూ తాము ప్రస్తుతం అత్యవసర సేవలను పునరుద్ధరించడానికి, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు 24 గంటలూ పనిచేస్తున్నామని తెలిపారు. ఎయిర్పోర్ట్ అధికారులు, ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ), కస్టమ్స్ అండ్ సెక్యూరిటీతో సహా ఇతర ఫెడరల్ ఏజెన్సీలు ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు కృషి చేస్తున్నాయన్నారు.డెల్టా, అలాస్కా ఎయిర్‌లైన్స్‌తో సహా కొన్ని విమానయాన సంస్థలు సైబర్ఎటాక్ కారణంగా సేవలను నిలిపివేశాయి. కాగా విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు కొన్ని సూచనలు చేశారు. ప్రయాణికులు విమానాశ్రయానికి ముందుగా చేరుకోవాలని, బోర్డింగ్ పాస్‌లు, బ్యాగ్ ట్యాగ్లు' పొందేందుకు విమానయాన సంస్థల మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించాలని కోరారు. -
విమానంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై మహిళ దాడి
ముంబై: విమానంలో ఓ మహిళ.. తోటి ఇద్దరు ప్రయాణికులు, సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడికి తెగపడ్డారు. ఈ ఘటన శనివారం పుణెలోని లోహెగావ్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. ఉదయం 7. 45 గంటలకు పుణె నుంచి ఢిల్లీకి బయలుదేరే.. ఓ ప్రైవేటు విమానంలో బోర్డింగ్ ప్రాసెస్ సమయంలో ఓ మహిళ దాడికి తెడపడ్డారు. మొదట ఆ మహిళ ముందు సీట్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులపై దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విమాన సిబ్బంది, సీఐఎస్ఎఫ్ కానిస్టెబుల్స్ ఆమె వద్దకు వచ్చారు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయి.. సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడి చేసింది. అనంతరం ఆ మహిళను, ఆమె భర్తను విమానం నుంచి దింపేశారు. ఆ మహిళను ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేశారు.సీనియర్ ఇన్స్పెక్టర్ అజయ్ సంకేశ్వరి మాట్లాడుతూ.. విచారణ కోసం సదరు మహిళకు నోటీసు ఇచ్చి విడిచిపెట్టాం. ఎయిర్‌లైన్ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ సిబ్బంది,సహ ప్రయాణీకులు వాంగ్మూలాలను రికార్డు చేశాం’ అని చెప్పారు. వ్యక్తిగత అత్యవసర పరిస్థితి కారణంగా ఆమె తీవ్రమైన బాధలో ఉన్నట్లు గమనించామని, అందుకే ఆమె తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగారని ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తెలిపారు. -
నంద్యాల పర్యటన.. దారిపొడవునా జననేతకు ఘన స్వాగతం (ఫొటోలు)
-
ఇండియా-బంగ్లాదేశ్ విమానాలు రద్దు
బంగ్లాదేశ్‌లో తీవ్ర నిరసనల మధ్య ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లారు. దాంతో స్థానికంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు ఆ దేశానికి నడిపే తమ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు ప్రయాణించే సర్వీసులను నిలిపేస్తున్నట్లు విమానయాన సంస్థలు చెప్పాయి. సోమవారం ముంబై నుంచి ఢాకాకు విమానాన్ని నడిపిన విస్తారా..తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. మంగళవారం పరిస్థితిని పర్యవేక్షించి నిర్ణయానికి వస్తామని పేర్కొంది. ఎయిరిండియా ఢిల్లీ నుంచి ఢాకాకు రోజువారీ రెండు విమానాలను నడుపుతుండగా వాటిని నిలిసేస్తున్నట్లు చెప్పింది.ఇదీ చదవండి: సైబర్ మోసాలు.. రూ.177 కోట్ల నష్టంఇండిగో సంస్థ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నుంచి ఢాకాకు విమానాలను నడుపుతుంది. బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఢాకాకు బయలుదేరే విమానాలను రీషెడ్యూల్డ్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే అందుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ‘మీ ప్రయాణ ప్రణాళికలకు కలిగిన అంతరాయానికి క్షమించాలి. బంగ్లాదేశ్‌లోని ఉద్రిక్తతలు కారణంగా విమానాలు రద్దు చేస్తున్నాం. తదుపరి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. -
మెగాస్టార్‌తో సెల్ఫీ కోసం యత్నం.. ఇలా చేశారేంటి?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార్ ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్ పారిస్ ఒలింపిక్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి పారిస్ చేరుకున్న చిరంజీవి అక్కడి వీధుల్లో సందడి చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.అయితే తాజాగా మెగాస్టార్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. అదే సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న చిరంజీవితో అక్కడే ఉన్న కొందరు సిబ్బంది సెల్పీలు దిగేందుకు యత్నించారు. అందులో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ వ్యక్తి మెగాస్టార్‌తో సెల్ఫీ కోసం ఎగబడ్డాడు. అయితే సెల్ఫీ కోసం వచ్చిన సిబ్బందిని మెగాస్టార్ పక్కకు తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక అభిమాని పట్ల ఇలా వ్యవహరించడం సరైంది కాదని కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. Padma Vibhushan Chiranjeevi at Airport pic.twitter.com/sTvtP2qW3R— Milagro Movies (@MilagroMovies) July 30, 2024 -
నేపాల్ ప్రమాదానికి టేబుల్ టాప్రనేవే కారణం!.. ఏంటిది?
నేపాల్ రాజధాని ఖాట్మండులో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో సిబ్బంది సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయానికి విమానంలో నలుగురు సిబ్బంతో సహా 19 ప్రయాణికులుండగా.. కేవలం పైలట్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే హిమాలయ పర్వతాల మధ్య ప్రకృతి అందాల్లో ఉండే నేపాల్‌లో తరచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఇందుకు అక్కడ ఎక్కువగా టేబుల్-టాప్ రన్వేలు ఉండటమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇవి సవాళ్లతో కూడుకుని ఉంటాయి. తాజాగా ప్రమాదం జరిగిన త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా టేబుల్ టాప్ విమానాశ్రయమే. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర విమానాశ్రయాల్లో ఒకటి.అన్ని వైపులా లోతైన లోయలు ఉండి.. ఎత్తైన కొండపై భాగంలో ఎయిర్‌పోర్టు ఉంటుంది.. ఈ రన్‌వే చుట్టుపక్కల భూభాగం కంటే ఎత్తులో ఉంటాయి. వీటికి దాదాపు అన్ని వైపులా లోయలు ఉంటాయి. కానీ దూరం నుంచి చూస్తే రన్‌వే, పక్కన ఉన్న భూభాగం సమాంతరంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. దీనివల్ల విమానం రన్‌వేపై అదుపుతప్పితే అది లోయలో పడి క్రాష్ అవ్వడం జరుగుతుంది.సాధారణంగా విమానం టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేప్పుడు అది రన్‌వేపై ఏ ప్రదేశం నుంచి ఏ ప్రదేశం మధ్యలో విమానం టైరు నేలను తాకాలో ముందుగానే నిర్ణయించి మార్కింగ్ చేసి ఉంటుంది. అయితే వర్షాలు, ఇతర కారణాలతో రన్‌వే సరిగా కనిపించకపోతే విమానం దానికి మార్కింగ్ చేసిన నేలను దాటి తాకుతుంది. దీన్ని ఓవర్ షూట్ అంటారు. సాధారణ రన్‌వేలపై ఇలా జరిగినప్పుడు విమానం ఆగడానికి తగినంత అదనపు స్థలం ఉటుంది. కానీ టేబుల్‌టాప్ రన్‌వేలపై ఓవర్ షూట్ జరిగితే మాత్రం విమానం నేరుగా లోయ వంటి ప్రదేశంలో పడిపోతుంది.ఇక భారత్‌లోనూ అయిదు విమానాశ్రయాలు టేబుల్-టాప్ రన్‌వేలను కలిగి ఉన్నాయి. సిమ్లా(హిమాచల్ ప్రదేశ్), కాలికట్(కేరళ), మంగళూరు(కర్ణాటక), లెంగ్‌పుయ్ (మిజోరం). పాక్యోంగ్ (సిక్కిం). వీటిలో కేరళ, మంగళూరు విమానాశ్రయాలు గతంలో పెద్ద ప్రమాదాలు సైతం జరిగాయి. మే 22, 2010న, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం దుబాయ్ నుంచి మంగళూరుకు వస్తుండగా ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బందితో సహా 158 మంది ప్రయాణికులు మరణించారు. -
ఎయిర్‌పోర్టులో వృద్ధ మహిళకు చేదు అనుభవం
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వృద్ధురాలికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె వీల్ చైర్ కోసం మూడు గంటలకు పైగా సమయం నిరీక్షిస్తూ పలు ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది.పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆ 84 ఏళ్ల వృద్ధురాలు అలయన్స్ ఎయిర్ విమానంలో జైపూర్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చింది. అక్కడ వీల్ చైర్ కోసం ఆమె మూడు గంటలకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్టున్నట్ల ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. తమ విమానయాన సంస్థ ఆ వృద్ధ మహిళకు, ఆమె కుటుంబ సభ్యులకు ఇప్పటికే క్షమాపణలు చెప్పిందని పేర్కొన్నారు.అలయన్స్ ఎయిర్ కస్టమర్ కేర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మనోహర్ తుఫ్చి మీడియాతో మాట్లాడుతూ ‘పొరపాటు జరిగింది. మేము ఈ సంఘటనను అనేక కోణాల్లో పరిశీలిస్తున్నాం. గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ ఏఐ- సాట్స్‌తో కూడా ఈ ఉదంతంపై చర్చించాం. ఈ ఏజెన్సీ ప్రయాణికులకు వీల్చైర్లను అందిస్తుంది. తాము వృద్ధురాలి కుమారునితో ఫోన్లో మాట్లాడాం. అతనికి క్షమాపణలు చెప్పాం’ అని తెలిపారు. -
వేకేషన్ పూర్తి చేసుకున్న ప్రిన్స్.. డిఫరెంట్ లుక్‌లో మహేశ్ బాబు!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో అభిమానులను అలరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. అయితే ప్రస్తుతం మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి పని చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి ఇప్పటికే కథను సిద్ధం చేశారు. ఈ ఏడాదిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫుల్‌గా చిల్ అవుతున్నారు. కాస్తా ఖాళీ సమయం దొరికితే చాలు ఠక్కున విదేశాల్లో వాలిపోతుంటారు. తాజాగా ప్రిన్స్ తన ఫ్యామిలీతో కలిసి వేకేషన్‌కు వెళ్లారు. ఇటీవలే కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిన మహేశ్ బాబు తాజాగా ఇండియాకు తిరిగొచ్చారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సితార, గౌతమ్, తన భార్యతో కలిసి కనిపించారు. విమానాశ్రయం నుంచి బయటికొస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. #TFNExclusive: Superstar @urstrulyMahesh and his family have arrived in Hyderabad after their vacation!📸#MaheshBabu #SSMB29 #TeluguFilmNagar pic.twitter.com/smdCatOYlb— Telugu FilmNagar (@telugufilmnagar) July 7, 2024 -
రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టు ఘటన, ‘నెహ్రూను నిందించొద్దు ప్లీజ్’: బీజేపీ
న్యూఢిల్లీ: భారీ వర్షాల కారణంగా అటు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్, ఇటు గుజరాత్‌లోని రాజ్ కోట్ మినాశ్రయంలోని టెర్మినల్ రూఫ్ కూలిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. రాజ్ కోట్ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.అయితే వరుస ఘటనలను ఉద్దేశిస్తూ కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఈ ఎయిర్‌పోర్టును గతేడాదే మోదీ ప్రారంభించారని, అప్పుడే కూలిపోయిందని దుయ్యబట్టింది. దీనికి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ ఘటనకు నెహ్రూను నిందించొద్దని, ఎందుకంటే ఆయన విమానాశ్రయాలు కట్టించలేకపోయారని ఎద్దేవా చేసింది.దీనికి బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వీయా ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీకి దీటుగా బదులిచ్చారు. ‘‘భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టులోని క్లాత్ టెంట్ చిరిగిపోయింది. అంతేగానీ.. కట్టడం కూలినట్లు కాదు. ఇక, ఈ ఘటనకు మనం నెహ్రూ (మాజీ ప్రధాని)ను నిందించొద్దు. ఎందుకంటే ఆయన ప్రజలకు అవసరమైన స్థాయిలో విమానాశ్రయాలను నిర్మించలేదు.ఆయన హయాంలో మనమంతా డీఆర్డీవో ధ్రువీకరించిన ఎడ్లబండ్లలో ప్రయాణించాం’’ అని అన్నారు. ఇక, దిల్లీ ఘటన నేపథ్యంలో దేశంలోని అన్ని చిన్నా పెద్ద విమానాశ్రయాల్లో భద్రతాపరమైన తనిఖీలు నిర్వహించాలని పౌరవిమానయాన శాఖ ఇప్పటికే ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. -
భారత ఎయిర్‌పోర్ట్‌ల వ్యూహాలు మారాలి
న్యూఢిల్లీ: భారత విమానాశ్రయాలు తమ ధరల వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని, నాన్ ఏరో నాటికల్ ఆదాయాలను మరింత పెంచుకోవడం ద్వారా లాభదాయకతను వృద్ధి చేసుకోవాలని ఈ రంగానికి చెందిన కన్సల్టెన్సీ సంస్థ కాపా ఇండియా సూచించింది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశీ పౌర విమానయాన మార్కెట్‌గా అవతరించగా, ఏటేటా ఎయిర్ ట్రాఫిక్ (ప్రయాణికుల రద్దీ) పెరుగుతూ వెళుతుండడం తెలిసిందే. దీంతో విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు తమ సేవలను విస్తరిస్తుండడం గమనార్హం. ఈ తరుణంలో కాపా ఇండియా విడుదల చేసిన నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో నడిచే విమానాశ్రయాలు నాన్ ఏరో మర్గాల (విమానయేతర) ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని ఇది సూచించింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహణలోని విమానాశ్రయలతో పోలిస్తే పీపీపీ విధానంలోని విమానాశ్రయాల్లో నాన్ ఏరో ఆదాయం ఎక్కువగా ఉండడాన్ని ప్రస్తావించింది. ‘‘ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్ ఇవన్నీ పీపీపీ విధానంలో నడిచే విమానాశ్రయాలు కాగా, 2019–2020లో నాన్ ఏరో ఆదాయంలో వీటి వాటాయే 71 శాతంగా ఉంది. మొత్తం ప్రయాణికుల ట్రాఫిక్‌లో మాత్రం వీటి వాటా 53 శాతమే’’అని కాపా ఇండియా తెలిపింది. ఇంకా అవకాశాలున్నాయి..విమానాశ్రయాలను ప్రైవేటీకరించిన తర్వాత వాటి నాన్ ఏరో ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికీ.. అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా మరింత పెంచుకునేందుకు అవకాశాలున్నట్టు కాపా ఇండియా అభిప్రాయపడింది. ఇందుకోసం విమానాశ్రయాలు తమ ధరల విధానాన్ని సమీక్షించుకోవాలని పేర్కొంది. ఎయిర్‌పోర్ట్‌ల వనరుల విషయంలో ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా ధరలు ఉన్నాయా? ఎయిర్‌లైన్ వ్యాపార నమూనా, ఫ్రీక్వెన్సీ, ప్యాసింజర్ల ప్రొఫైల్ మధ్య భారీ వైరుధ్యం ఉందా అనేది పరిశీలించాలని సూచించింది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు దేశీ ఎయిర్‌లైన్స్ 6.61 కోట్ల ప్రయాణికులకు సేవలు అందించడం గమనార్హం. క్రితం ఏడాదిలో విమానాల్లో ప్రయాణించిన వారు 6.36 కోట్లుగా ఉన్నారు. -
ఎయిర్పోర్ట్ విస్తరణకు రూ.2,869 కోట్లు
వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది.భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ నియోజకవర్గం అయిన వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం రూ.2,869.65 కోట్లు వెచ్చించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిధులతో కొత్త టెర్మినల్ బిల్డింగ్, ఆప్రాన్(విమానాలను పార్క్ చేయడానికి వీలుగా ఉండే ప్రాంత్రం), రన్‌వే విస్తరణ, ట్యాక్సీ ట్రాక్ నిర్మాణంతోపాటు ఇతర అనుబంధ పనులు చేస్తారని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రతిపాదన ప్రకారంగానే రూ.2,869.65 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఏటా 39 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య 99 లక్షలకు చేరేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం తాజా నిధులు ఎంతో ఉపయోగపడుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పవర్ కట్స్
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ పక్క తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడి జలమండలి ఆఫీసులపై దాడులు జరుగుతున్నాయి. మరోపక్క అక్కడి ఎయిర్‌పోర్టుకు కరెంటు కోతలు తప్పడం లేదు. సోమవారం(జూన్17) ఎయిర్‌పోర్టు టర్మినల్ మూడులో కరెంటు కష్టాలు ఎదురయ్యాయి. కరెంటు కోతల వల్ల ప్రయాణికులు చెకింగ్,బోర్డింగ్ సమయంలో ప్రయాణికులు కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కరెంటు సమస్యను పరిష్కరించామని, కేవలం 10 నిమిషాలే కరెంటు పోయిందని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(డయల్) ఒక ప్రకటనలో తెలిపింది. -
ఒకే రన్‌వేపై రెండు విమానాలకు అనుమతి ఉందా?
ఎయిర్పోర్ట్ రన్‌వేపై దాదాపు నిమిషంలోపు రెండు విమానాలు ప్రయాణించడం సాధ్యమవుతుందా అంటే అవుననే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాతావరణంలో ఎలాంటి విజిబిలిటీ సమస్యలు లేవని నిర్ధారించుకుని షరతులకు లోబడి ఇది సాధ్యపడుతుందని నిబంధనలు చెబుతున్నాయి.ఒకే రన్‌వేపై రెండు విమానాలు ప్రయాణించేలా అనుమతులివ్వాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. ‘ఏటీసీ నియమాల ప్రకారం..వాతావరణంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేవని నిర్ధారించుకోవాలి. విజిబిలిటీ సమస్యలు ఉండకూడదు. ప్రత్యేక షరతులకు లోబడి, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి మూడు నిమిషాలలోపు రెండు విమాన టేకాఫ్‌లు, రెండు ల్యాండింగ్లకు అనుమతించవచ్చు’అని పీటీఐ తెలిపింది.ముంబై ఎయిర్‌పోర్ట్‌లో..జూన్ 8న 6ఈ 6053 అనే ఇండిగో విమానం ఇందోర్ నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సి ఉంది. దాంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ను ల్యాండింగ్ క్లియరెన్స్ కోసం అనుమతించాలని కోరారు. ఏటీసీ సూచనలను అనుసరించి ఇండిగో విమానం ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ఇదిలాఉండగా, ఎయిర్ఇండియాకు చెందిన ఏఐ657 అనే విమానం అదే సమయంలో ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు ఏటీసీ టేకాఫ్‌కోసం అనుమతించారు. దాంతో రెండు విమానాలు నిమిషం తేడాతో రన్‌వేపై ప్రయాణించాయి. ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన క్షణాల్లో ఇండిగో విమానం అదే రన్‌వేపై ల్యాండ్ అయింది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే రెండు విమానాల ప్రయాణికులకు తీవ్ర నష్టం జరిగేదని తోటి ప్యాసింజర్లు తెలిపారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ని విధుల్లో నుంచి తొలగించి విచారణ జరుపుతోంది.ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్‌జాబ్స్..!ఇదిలాఉండగా, విమానాశ్రయాల్లో అధిక జనసాంద్రత ఉన్నపుడు ఏటీసీలపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని కొందరు అధికారులు తెలిపారు. ఏటీసీ, సంబంధిత పైలట్లు ఘటనకు సంబంధించి సరైన నిబంధనలు అనుసరించారా లేదా అనే అంశంపై డీజీసీఏ విచారణ జరుగుతుందని చెప్పారు. అధిక జనసాంద్రత కలిగిన విమానాశ్రయాల్లో ముంబై ఎయిర్పోర్ట్ ఒకటి. అక్కడ విమానాలరాకపోకలు ఎక్కువగా ఉంటాయి. విమానాశ్రయంలోని ఆర్డబ్ల్యూ27 అనే రన్‌వేపై గంటకు 46 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయని తెలిసింది.Serious security concern at @CSMIA_Official Mumbai Airport yesterday putting 100s of life at riskWhile @airindia ✈️ was in the process of take off, another 🛬 from @IndiGo6E was allowed to land on same runway@DGCAIndia takes action against #Mumbai ATC official responsible pic.twitter.com/nsJvHZrWTZ— Nikhil Lakhwani (@nikhil_lakhwani) June 9, 2024 -
కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం(కేఐఏ)లో పికప్ లేన్ల ప్రవేశ రుసుమును రద్దుచేస్తూ బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(బీఐఏఎల్) ప్రకటన విడుదల చేసింది. విమానాశ్రయ పరిధిలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు స్పీడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పింది.అవసరం ఉన్నా, లేకపోయినా కేఐఏ పికప్‌లేన్ పరిధిలోకి పెద్దసంఖ్యలో వాహనాలు వస్తూండడం బీఐఏఎల్ దృష్టికి వెళ్లింది. దాంతోపాటు ఎయిర్పోర్ట్ పరిసరాల్లో భారీగా వాహనాలు చేరుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గమనించింది. వాటిని నివారించాలంటే కొన్ని మార్పులు తీసుకురావాలని భావించింది. బీఐఏఎల్ టెర్మినల్ 1, 2లో అరైవల్ పికప్ లేన్లను చేరడానికి ఎంట్రీ ఫీజును ప్రవేశ పెట్టింది. రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఆధారంగా వాహనాలపై ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పింది. అయితే ఈ నిర్ణయం వెలువడిన కొన్ని గంటల్లోనే ట్యాక్సీడ్రైవర్లు, ఇతర కమ్యునిటీల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో ప్రవేశ రుసుమును రద్దుచేస్తున్నట్లు బీఏఐఎల్ తిరిగి ప్రకటన విడుదల చేసింది.బీఐఏఎల్ ముందుగా చేసిన ప్రకటన ప్రకారం..ప్రైవేట్ వాహనాలు పికప్ లేన్లలోకి ప్రవేశించిన ఏడు నుంచి 14 నిమిషాల సమయానికి రూ.150 రుసుము చెల్లించాలి. వాణిజ్య వాహనదారులు మొదటి ఏడు నిమిషాలకు రూ.150, తర్వాతి ఏడు నిమిషాలకు రూ.300 చెల్లించాలి. బస్సు ప్రయాణికులు ఏడు నిమిషాలకు రూ.600, ట్రావెలర్స్ రూ.300 చెల్లించాలని నిర్ణయించారు. ఒకవేళ టికెట్‌పోతే రూ.600 నిర్ణీత రుసుము చెల్లించాలి. పికప్ ఏరియాలో 15 నిమిషాలకు మించి ఉంటే ఆ వాహనాలను యజమాని ఖర్చుతో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలి.వైట్ రిజిస్ట్రేషన్ ప్లేట్ కలిగి ఉండే వాహనాలను ప్రైవేట్ వాహనాలుగా, ట్రావెల్స్, ఆన్లైన్ బుకింగ్ వెహికిల్స్, పసుపు రిజిస్ట్రేషన్ ప్లేట్‌తోపాటు కొన్ని ఈవీలను వాణిజ్య వాహనాలుగా వర్గీకరించారు. కర్ణాటక రాష్ట్ర ట్రావెల్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణ హోల్లా మాట్లాడుతూ..‘ఎయిర్పోర్ట్ రావాలనుకునే ప్రయాణికులు ఇప్పటికే సాదహళ్లి టోల్గేట్ వద్ద ఛార్జీ చెల్లిస్తున్నారు. మళ్లీ అరైవల్-పికప్ ఏరియాలో రుసుము చెల్లించాలనే నిర్ణయం సరికాదు’ అన్నారు.కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిధిలో ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) స్పీడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలు నిబంధనల కంటే వేగంగా వెళ్లే వారిని గుర్తించి జరిమానాలను విధిస్తాయి. -
ఆకాశవీధిలో 41.8 కోట్లమంది.. ఇక్రా నివేదిక
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అదే సమయంలో విమాన సంస్థల ఆదాయాలు 15-17 శాతం పెరుగుతాయని చెప్పింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధీనంలోని విమానాశ్రయాలతో పాటు దిల్లీ, హైదరాబాద్, కోచి అంతర్జాతీయ విమానాశ్రయాలను నమూనాగా తీసుకుని ఇక్రా ఈ నివేదిక విడుదల చేసింది.ఇక్రా నివేదిక ప్రకారం..కరోనా కంటే ముందు నమోదైన విమాన ప్రయాణాలతో పోలిస్తే 10 శాతం అధికంగా ఫ్లైట్‌జర్నీ చేస్తున్నారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 37.6 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. విమానాల రద్దీ ఏటా 8-11 శాతం పెరుగుతోంది. 2023 క్యాలెండర్ ఏడాదిలో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో భారత్ వాటా 4.2 శాతంగా ఉంది. 2019లోని 3.8 శాతంతో పోలిస్తే అధికం. 2023లో గ్లోబల్‌గా ప్రయాణికుల రద్దీ 96 శాతం పుంజుకుంది. అదే భారత్‌లో మాత్రం 106 శాతం రికవరీ అయింది. దేశీయంగా కొత్త మార్గాలు, విమానాశ్రయాల సంఖ్య పెరగడంతో ఇది సాధ్యపడినట్లు ఇక్రా తెలిపింది.ఇదీ చదవండి: పెరగనున్న వస్తు ఎగుమతులు.. ఎంతంటే..ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ కుమార్ మాట్లాడుతూ..‘విరామం కోసం, వృత్తి వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణాలు అధికంగా చేస్తున్నారు. కొత్త గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభం కావడమూ కలిసొస్తోంది’ అన్నారు. -
విమానంలో ల్యాండింగ్‌గేర్ సమస్య.. గాల్లోనే మూడు గంటలు..
విమానంలో ల్యాండింగ్‌గేర్ సమస్య ఏర్పడి మూడు గంటలు గాల్లోనే ఉన్న ఘటన ఆస్ట్రేలియాలోని న్యూకాజిల్ ఎయిర్పోర్ట్ పరిధిలో చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న ఈ విమానం చివరకు సురక్షితంగా ల్యాండ్ అయింది.వివరాల్లోకి వెళితే..ట్విన్-టర్బోప్రోప్ బీచ్‌క్రాఫ్ట్ సూపర్ కింగ్ ఎయిర్ అనే తేలికపాటి విమానంలో ముగ్గురు వ్యక్తులు ప్రయాణానికి సిద్ధమయ్యారు. సిడ్నీకి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్ట్ మక్వేరీకి బయలుదేరారు. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే(ఉదయం 9:30 సమయం) ల్యాండింగ్ గేర్ సమస్య ఏర్పడినట్లు పైలట్ గుర్తించారు. దాంతో వెంటనే వారు ప్రయాణం ప్రారంభించిన న్యూకాజిల్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి, ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతించారు.విమానంలో ల్యాండింగ్‌గేర్ సమస్య తలెత్తింది కాబట్టి అందులోని ఫ్యుయెల్ అయిపోవాలి. లేదంటే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దాంతో దాదాపు మూడు గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సివచ్చింది. చివరకు ఎయిర్‌క్రాఫ్ట్ సురక్షితంగా ల్యాండ్ అయినట్లు పోలీసులు తెలిపారు. విమానం కిందకు చేరే సమయానికి అత్యవసర సేవల్లో భాగంగా అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌ను ఎయిర్పోర్ట్ సిబ్బంది సిద్ధంగా ఉంచారు. విమానంలో కొన్ని సాంకేతిక సమస్యల వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రాథమికంగా ధ్రువీకరించారు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ పోర్ట్ మాక్వారీకి చెందిన ఈస్టర్న్ ఎయిర్ సర్వీసెస్‌కు చెందింది. ఈ ఘటనకు సంబంధించి కంపెనీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిసింది. -
బెంగళూరులో భారీ వర్షం.. 17 విమానాలు దారి మళ్లింపు
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం కురిసిన వర్షం కారణంగా 17 విమానాలను దారి మళ్లించారు. ప్రయాణికులు తదుపరి సర్వీసులకు సంబంధించిన వివరాలను విమానయాన సంస్థల ద్వారా తెలుసుకోవాలని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి.బెంగళూరులో గురువారం కురిసిన భారీ వర్షానికి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2(టీ2) వద్ద భారీగా నీరు చేరింది. టీ2 లగేజీ తీసుకునే ప్రాంతం సమీపంలో పైకప్పు నుంచి నీరు లీకవ్వడం గుర్తించారు. క్షణాల్లో వర్షం పెరగడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వెంటనే స్పందించి చర్యలు చేపట్టింది.భారీ వర్షాల కారణంగా బెంగళూరుకు రావాల్సిన విమానాలను చెన్నైకి మళ్లించారు. మొత్తం 13 దేశీయ విమానాలు, మూడు అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలు, ఒక అంతర్జాతీయ కార్గో విమానాన్ని దారి మళ్లించారు. బలమైన గాలుల కారణంగా రాత్రి 9:35 నుంచి 10:30 గంటల వరకు విమానాల ల్యాండింగ్ వీలుకాలేదని ఎయిర్పోర్ట్ ప్రతినిధి ఒకరు మీడియాతో తెలిపారు. ప్రయాణికులు తదుపరి సర్వీసులకు సంబంధించి విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.ఇదీ చదవండి: గోల్డ్‌ఫైనాన్స్ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టీ2 టెర్మినల్ నిర్మాణాన్ని రూ.5,000 కోట్లతో 2022లో పూర్తి చేశారు. అందులో జనవరి 15, 2023 నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. టెర్మినల్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే ఇలా లీకేజీలు ఏర్పడడంపట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
దుబాయ్‌లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
దుబాయ్‌లో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దుబాయ్‌లో నిర్మించబోతున్నారు. ఈ మేరకు దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటన చేశారు. దీని కోసం 35 బిలియన్ డాలర్లు (రూ.2.9 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నారు.వివరాల ప్రకారం.. దుబాయ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం నిర్మించచోతున్నారు. ఈ విషయాన్ని దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ ఆదివారం ప్రకటించారు. ఈ విమానాశ్రయం పేరును అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలవనున్నట్లు ఆయన తెలిపారు. ఇది ఈ విమానాశ్రయాం నిర్మించడానికి 35 బిలియన్ డాలర్లు (రూ.2.9 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నారు. ఏడాదికి 260 మిలియన్ల మంది రాకపోకలు కొనసాగించేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.ఒక్క ఏడాదిలో దాదాపు 260 మిలియన్ల మంది ప్రయాణీకులు ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణాలు కొనసాగించవచ్చన్నారు. ఈ విమానాశ్రయంలో ఐదు సమాంతర రన్వేలు, 400 ఎయిర్‌క్రాఫ్ట్ గేట్స్ దీని ప్రత్యేకతలుగా చెప్పారు. కాగా, అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుత దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుంది. రాబోయే సంవత్సరాల్లో దుబాయ్ ఎయిర్‌పోర్టు నుండి అన్ని కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. Today, we approved the designs for the new passenger terminals at Al Maktoum International Airport, and commencing construction of the building at a cost of AED 128 billion as part of Dubai Aviation Corporation's strategy.Al Maktoum International Airport will enjoy the… pic.twitter.com/oG973DGRYX— HH Sheikh Mohammed (@HHShkMohd) April 28, 2024 ఇక, ఈ ఎయిర్‌పోర్టు ఫ్లాగ్షిప్ క్యారియర్ ఎమిరేట్స్, లోబడ్జెట్ విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్‌తో పాటు ప్రపంచాన్ని దుబాయ్‌కి, బయటికి కనెక్ట్ చేసే అన్ని ఎయిర్‌లైన్ భాగస్వాములకు కొత్త డెస్టినేషన్ కానుందని దుబాయ్ ప్రభుత్వ ఎయిర్‌లైన్ ఎమిరేట్స్ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్-మక్తూమ్ వెల్లడించారు. ఈ నిర్మాణం ప్రపంచ వేదికపై ప్రముఖ ఏవియేషన్ హబ్‌గా దుబాయ్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ తెలిపారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
జర్మనీకి చెందిన స్కైట్రాక్స్ ఏటా ఇచ్చే ‘బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ దక్షిణాసియా 2024’ అవార్డు ఈ ఏడాదికిగాను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను వరించింది. బుధవారం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ప్యాసింజర్ టర్మినల్ ఎక్స్పో-2024లో ఈమేరకు ప్రకటన వెలువడినట్లు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(ఆర్జీఐఏ) సీఈవో ప్రదీప్ పణికర్ తెలిపారు. విమానాశ్రయంలో పనిచేసే ఉద్యోగుల పనితీరు, స్నేహ పూర్వకంగా ఉండే విధానం, సమర్థత, సిబ్బంది చురుకుగా వ్యవహరించడం, సమాచార కౌంటర్లు, ఇమ్మిగ్రేషన్, భద్రతా అధికారులు, సెక్యూరిటీ స్టాఫ్, షాప్స్, ఫుడ్ అండ్ బేవరేజస్ అవుట్లెట్లలో స్టాఫ్ పనితీరు మెరుగ్గావుండటం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపికచేస్తారు. ఇదీ చదవండి: యువ ఓటర్లకు అదిరిపోయే ఆఫర్.. భారీ రాయితీ ప్రకటించిన సంస్థ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌కు గతేడాది స్కైట్రాక్స్ ఫోర్స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది. ఈఏడాది ఏకంగా ప్రముఖ అవార్డుకు ఎంపిక చేయడంపట్ల ఎయిర్పోర్ట్ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. గత నెలలో హైదరాబాద్ విమానాశ్రయం న్యూదిల్లీలో యాక్రెక్స్(ACREX) హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ స్థాయి అవార్డును గెలుచుకుంది. -
యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఓవర్ యాక్షన్ చేస్తే అది మన మెడకే చుట్టుకుంటుంది. ఛానల్ ఉంది కదా అనో, చేతిలో కెమెరా ఉంది కదా అనో విచక్షణ మరిచి ప్రవర్తించకూడదు. ఇది తెలియక చాలామంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు ఫేక్‌వార్తలు, సమాచారంతో గప్పాలు కొడుతుంటారు. తాజాగా పబ్లిసిటీ కోసం నిషిద్ధ ప్రాంతంలోకి ఉద్దేశపూర్వకంగా ఎంటరైన ఒక యూట్యూబర్‌కి దిమ్మతిరిగే షాక్ తగిలింది. విషయం ఏమిటంటే.. బెంగళూరులోని యలహంకకు చెందిన వికాస్ గౌడ (23) అడ్డంగా బుక్కయ్యాడు. ఏప్రిల్ 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నైకి వెళ్లే ఎయిరిండియా విమానం టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. భద్రతా తనిఖీల అనంతరం విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. ఇక్కడి దాకా బాగానే వుంది. విమానం ఎక్కకుండా, విమానాశ్రయ ఆవరణలోనే తిరుగుతూ వీడియో కంటెంట్‌ను రికార్డ్ చేశాడు. ఇక్కడితో సరిపెట్టినా బావుండేది. ఎయిర్‌పోర్ట్‌లో రోజంతా బస చేసా.. అయినా తనని ఎవరూ పట్టించుకోలేదంటూ ప్రగల్భాలు పలుకుతూ ఏప్రిల్ 12న ఒక వీడియో తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. విమానాశ్రయంలో మొత్తం తిరిగినా తనను ఎవరూ పట్టుకోలేదంటూ, ఎయిర్పోర్ట్ భద్రత గురించి నెగెటివ్ కామెంట్ చేశాడు. అంతా అయ్యాక డ్యామేజ్ కంట్రోల్లో పడ్డాడు. ఆ ఎయిర్పోర్ట్ వీడియోను తన ఛానెల్ నుండి తీసివేశాడు. కానీ అది కాస్తా చేరాల్సిన వారి దృష్టికి అప్పటికే చేరిపోయింది. కట్ చేస్తే.. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వింగ్ సీఐఎస్ఎఫ్ వికాస్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో అతణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 505, 448 కింద కేసు కూడా నమోదు చేశారు. తన ఫ్లైట్ మిస్సయ్యానని పేర్కొంటూ, సుమారు ఆరు గంటలపాటు విమానాశ్రయంలో తిరిగాడని, కానీ అతను చెప్పినట్టుగా 24 గంటలు కాదని తన విచారణలో తేలిందని భద్రతా అధికారులు వెల్లడించారు. అతని మొబైల్ ఫోన్నుస్వాధీనం చేసుకున్నారు. ఎట్టకేలకు తను చేసింది తప్పేనని అంగీకరించాడు. ప్రచారంకోసం అలా చేశానంటూ లెంపలేసుకున్నాడు. మొత్తం మీద గౌడకు బెయిల్ మంజూరు కావడంతో బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. -
Dubai Floods: భారీ వర్షాల ఎఫెక్ట్.. 28 విమానాల రద్దు
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన దుబాయ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన కుండపోత వర్షాలతో నగరం అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. నివాస స్థలాలు, రోడ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు.. ఇలా ప్రతి చోట వరద బీభత్సం సృష్టించింది. ఆ దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. వరద నీరు భారీగా చేరడంతో రోడ్లపై కార్లు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. కార్లు సగం నీటితో మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వరద చేరి విమానాలరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై మోకాలిలోతు నీరు ఉండటంతో ఇక్కడికి వచ్చే విమానాలనుని దారిమళ్లిస్తున్నారు. వర్షాల కారణంగా దుబాయ్ నుంచి వచ్చేవి, వేళ్లే విమానాలు మిఒత్తం 500కి పైగా రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లీంచారు. అత్యవసరమైతే తప్ప విమానాశ్రయానికి రావద్దని ప్రయాణికులను అధికారులు హెచ్చరించారు కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ వీలైనంత త్వరగా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను పునరుద్ధరించడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్ విమానాశ్రయ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. భారత్-దుబాయ్ మధ్య 28 విమానాలు రద్దయ్యాయి. ఈ మేరకు భార పౌర విమానాయనశాఖ తెలిపింది.వీటిలో భారత్ నుంచి దుబాయ్ వెళ్లేవి 15 కాగా, అక్కడి నుంచి వచ్చే 13 విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని వెల్లడించారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
ప్రపంచంలోని రద్దీ ఎయిర్‌పోర్ట్‌ల్లో భారత విమానాశ్రయం
దిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(దిల్లీ విమానాశ్రయం) 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 ఎయిర్‌పోర్ట్‌ల్లో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో అమెరికాలోని హార్ట్స్‌ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటిస్థానం దక్కించుకుంది. దుబాయ్, డాలస్ విమానాశ్రయాలు తర్వాతిస్థానాల్లో ఉన్నాయని ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) వరల్డ్ తెలిపింది. దిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 2023లో 7.22 కోట్ల మంది ప్రయాణించారు. 2022లో రద్దీ పరంగా ఈ విమానాశ్రయం అంతర్జాతీయంగా 9వ స్థానంలో ఉంది. అయితే 2023లో మాత్రం 10స్థానానికి చేరింది. మొదటిస్థానంలోని హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 2023లో 10.46 కోట్ల మంది ప్రయాణించారు. రెండో స్థానంలో నిలిచిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 8.69 కోట్లు, మూడో స్థానంలో ఉన్న డాలస్ ఫోర్త్ వర్త్ అంతర్జాతీయ విమాన్రాశయం నుంచి 8.17 కోట్ల మంది తమ గమ్యస్థానాలకు ప్రయాణించారు. ప్రపంచంలోనే పది అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఐదు అమెరికాలోనే ఉండడం విశేషం. 2023లో అంతర్జాతీయంగా ప్రయాణించిన మొత్తం ప్రయాణికుల సంఖ్య సుమారు 850 కోట్లుగా ఉందని ఏసీఐ పేర్కొంది. 2022తో పోలిస్తే 27.2% వృద్ధి కనిపిస్తుందని తెలిపింది. ఇదీ చదవండి: ‘తప్పు చేశాం.. మళ్లీ చేస్తాం..10వేల డాలర్లు ఇస్తాం..’ ప్రపంచంలోనే రద్దీ ఎయిర్‌పోర్ట్‌లు వరుసగా.. హార్ట్స్‌ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం డాలస్ ఫోర్త్ వర్త్ అంతర్జాతీయ విమాన్రాశయం లండన్ హీత్రో విమానాశ్రయం టోక్యో హానెడా డెన్వర్ విమానాశ్రయం ఇస్తాంబుల్ విమానాశ్రయం లాస్ ఏంజెలిస్ అంతర్జాతీయ విమానాశ్రయం షికాగో ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం దిల్లీ ఎయిర్పోర్ట్ -
Viral: ఎయిర్‌పోర్టు బ్యాగేజ్ బెల్టుపై యువతి రీల్.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఇప్పటివరకు మెట్రో రైళ్లలో రీల్లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ట్రెండ్ ప్రస్తుతం ఎయిర్‌పోర్టులకు కూడా పాకింది. ఓ యువతి ఎయిర్‌పోర్టులోని బ్యాగేజ్ కన్వేయర్ బెల్టుపై పడుకొని కొద్దిసేపు బెల్టుతో పాటు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువతి ఈ ఫీట్ చేస్తుండగా బ్యాక్‌గ్రౌండ్‌లో హిందీ సినిమా సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్స్(ట్విటర్)లో దేసీ మోజిటో అనే హ్యాండిల్లో పోస్టు చేసినప్పటి నుంచి ఏకంగా 32 లక్షల వ్యూస్ రావడం విశేషం. అయితే ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. రీల్ల వైరస్ ఎయిర్‌పోర్టులను కూడా చేరింది అని ఓ నెటిజన్ పోస్టు చేశాడు. మరికొందరైతే ఏకంగా ఆ యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులో బ్యాగేజ్ బెల్ట్ అంత చెత్త ప్రదేశం ఇంకొకటి ఉండదని, దానిపై ఎలా దొర్లుతారని మరో నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా, ఇటీవలే ఢిల్లీ మెట్రోలో రీల్స్ చేసిన మహిళలపై మెట్రో రైలు యాజమాన్య సంస్థ న్యాయపరమైన చర్యలు కూడా ప్రారంభించింది. The virus has reached the airports too 🤡🤡 pic.twitter.com/RdFReWtWjH — desi mojito 🇮🇳 (@desimojito) March 29, 2024 ఇదీ చదవండి.. ప్రజల గొంతునవుతా.. కంగనా రనౌత్ -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు జాతీయ పురస్కారం
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జాతీయ పురస్కారం దక్కించుకుంది. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల దిల్లీలో నిర్వహించిన కాలుష్య రహిత వాణిజ్య భవన విభాగ పోటీల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు యాక్రెక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారం దక్కింది. దీన్ని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) ప్రతినిధులు అందుకున్నారు. ఇదీ చదవండి: మెరైన్ రోబో తయారుచేసిన ఐఐటీ పరిశోధకులు.. ఉపయోగాలివే.. 2030 నాటికి కర్బన ఉద్గారాల రహిత విమానాశ్రయంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జీహెచ్ఐఏఎల్ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటి వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయిదుసార్లు నేషనల్ ఎనర్జీ లీడర్, తొమ్మిది సార్లు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియెన్సీ యూనిట్, ఆరు సార్లు ఏసీఐ గ్రీన్ ఎయిర్పోర్ట్ పురస్కారాలు వరించాయని తెలిపారు. -
ఎయిర్‌పోర్టు భద్రతా వలయాన్ని దాటి.. టిక్కెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కి..
అమెరికాలోని ఓ మహిళ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కన్నుగప్పి టిక్కెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కింది. ఈ నెల ప్రారంభంలో నాష్విల్లే విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ ప్రతీ సెక్యూరిటీ చెక్‌పాయింట్‌ను దాటుకుని, బోర్డింగ్ పాస్, గుర్తింపు కార్డు లేకుండా లాస్ ఏంజెల్స్‌కు వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఎక్కింది. ‘న్యూయార్క్ పోస్ట్’ అందించిన వివరాల ప్రకారం ఆ మహిళా ప్రయాణికురాలు నాష్విల్లే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ) స్క్రీనింగ్ లైన్‌లోని మానవరహిత ప్రాంతంలో అడ్డంకిని దాటారు. ఇక్కడ ప్రయాణీకులు తమ గుర్తింపును చూపించవలసి ఉంటుంది. దీనిపై విమానాశ్రయ అధికారులు విచారణ ప్రారంభించారు. ఫిబ్రవరి 7న నాష్విల్లే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లో ఆ ప్రయాణికురాలితో పాటు ఆమె క్యారీ ఆన్ బ్యాగేజీని ఫ్లైట్ ఎక్కే ముందు చెక్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఈ ఉదంతంలో తమ పొరపాటును అంగీకరించింది. ఐదు గంటల తరువాత ఆమె టిక్కెట్ లేకుండా ప్రయాణించినట్లు గుర్తించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్- 1393 ఫిబ్రవరి 7న లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న వెంటనే ఆ మహిళా ప్రయాణీకురాలిని ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుని, విచారణ మొదలుపెట్టింది. ఆమెపై ఇంకా కేసు నమోదు కాలేదని, విచారణ కొనసాగుతోందని ఏజెన్సీ తెలిపింది. -
జైపూర్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..
రాజస్థాన్‌లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై, విమానాశ్రయాన్నంతా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభ్యంకాలేదు. రెండు గంటల తనిఖీ అనంతరం విమానాశ్రయ ప్రాంగణంలో అభ్యంతరకర వస్తువేదీ కనిపించకపోవడంతో భద్రతా సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జైపూర్ ఎయిర్పోర్ట్ అధికారిక ఐడీకి ‘డాన్ ఆఫ్ ఇండియా’ అనే ఐడీ నుండి శుక్రవారం ఈ-మెయిల్లో బెదిరింపు వచ్చింది. వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బందితో పాటు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీఎస్) తనిఖీలు చేపట్టింది. ఈ బెదిరింపు మెయిల్ గురించి ఎయిర్పోర్ట్ ఎస్హెచ్ఓ మమతా మీనా మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులకు ఈ సమాచారం అందించామన్నారు. ఈ నేపధ్యంలో బీడీఎస్, సీఐఎస్ఎఫ్, డాగ్ స్క్వాడ్ బృందం విమానాశ్రయంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. సుమారు 2 గంటల పాటు జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో ఎయిర్‌పోర్టులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఇంతకు ముందు డిసెంబర్ 27న జైపూర్ సహా పలు విమానాశ్రయాలపై బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి. అయితే తనిఖీలలో ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. -
జైపూర్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
జైపూర్: రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శుక్రవారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్స్పెక్టర్ ధృవీకరించారు. ఎయిర్‌పోర్టు అధికారిక మెయిల్‌కు బెదిరింపు రావడంతో అప్రమత్తమైనట్లు చెప్పారు. బెదిరింపు మెయిల్ వచ్చిన వెంటనే ఎయిర్‌పోర్టు మొత్తం సీఐఎస్ఎఫ్ బలగాలు బాంబు, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టాయని, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని పోలీసులు తెలిపారు. మెయిల్ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై సైబర్‌సెల్ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. ఇదీ చదవండి.. కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు షాక్ -
ఉత్తరాఖండ్‌కు మూడు ఎయిర్ పోర్టులు, 21 హెలీప్యాడ్లు!
ఉత్తరాఖండ్ ఎయిర్ కనెక్టివిటీ కొత్త రెక్కలను సంతరించుకోబోతోంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తరాఖండ్‌లోని విమానాశ్రయాల సంఖ్యను ఒకటి నుండి మూడుకు, హెలిప్యాడ్ల సంఖ్యను 10 నుండి 21కి పెంచే ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. డెహ్రాడూన్ ఎయిర్‌పోర్టు విస్తరణ, మొదటి దశ కింద హెలిపోర్టుల నిర్వహణ పనులు పూర్తయ్యాయి. రెండో దశలో ఎయిర్‌పోర్టులు, హెలిపోర్టుల పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గల ఏకైక జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుంచి 2024లో రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గతంలో డెహ్రాడూన్ విమానాశ్రయానికి దేశంలోని మూడు నగరాలతో మాత్రమే కనెక్టివిటీ ఉండేది. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ దాదాపు నాలుగున్నర రెట్లు పెరిగింది. ప్రస్తుతం డెహ్రాడూన్ విమానాశ్రయ ఎయిర్ కనెక్టివిటీ దేశంలోని మూడు నగరాల నుండి 13 నగరాలకు చేరింది. 2014 వరకు ఈ విమానాశ్రయం నుండి 40 విమానాలు మాత్రమే నడిచేవి. 2024 చివరి నాటికి ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే విమానాల సంఖ్య 200కి పెరగనుంది. గత పదేళ్లలో డెహ్రాడూన్ విమానాశ్రయ కార్యకలాపాల్లో దాదాపు 130 శాతం పెరుగుదల నమోదైంది. త్వరలో ఉత్తరాఖండ్‌లో నూతన హెలిపోర్ట్లతో పాటు నూతన విమానాశ్రయాలు రానున్నాయి. డెహ్రాడూన్‌తో పాటు ఉత్తరాఖండ్‌లోని పంత్నగర్, పితోర్‌గఢ్‌లలో విమానాశ్రయాల ఏర్పాటుకు విమానయాన మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లో ఏడు హెలిపోర్ట్‌లు ప్రారంభమయ్యాయి. వీటిలో అల్మోరా, చిన్యాలిసౌర్, గౌచర్, సహస్త్రధార, న్యూ తెహ్రీ, శ్రీనగర్, హల్ద్వానీ మొదలైనవి ఉన్నాయి. ధార్చుల, హరిద్వార్, జోషిమా, ముస్సోరీ, నైనిటాల్, రామ్‌నగర్‌లో కొత్త హెలిపోర్ట్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో ఒక విమానాశ్రయం, ఏడు హెలిపోర్టులను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. బాగేశ్వర్, చంపావత్, లాన్స్‌డౌన్, మున్సియరి, త్రియుగినారాయణ్‌లలో ఐదు కొత్త హెలిపోర్ట్‌లను ప్రారంభించే ప్రణాళిక సిద్ధంగా ఉంది. మరికొద్ది రోజుల్లో ఉత్తరాఖండ్‌లో విమానాశ్రయాల సంఖ్య మూడుకు, హెలిపోర్టుల సంఖ్య 21కి చేరనుంది. -
దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. ఫ్యామిలీతో బయలుదేరిన నిర్మాత!
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. దిల్ రాజు తమ్ముడు కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహా వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించారు. ఈనెల 14న జైపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. తాజాగా వివాహా వేడుక కోసం దిల్ రాజు ఫ్యామిలీ బయలుదేరి వెళ్లారు. జైపూర్ వెళ్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డితో ఆతనికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుక ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. టాలీవుడ్లో రౌడీ బాయ్స్ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. #TFNExclusive: Ace Producer #DilRaju & Groom @AshishVOffl along with their family members get papped as they jet off to Jaipur for the grand wedding ceremony!! 📸🤩#Ashish #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/IQllj4yVCU — Telugu FilmNagar (@telugufilmnagar) February 12, 2024 -
వ్యక్తిగత లావాదేవీలతోనే తహసీల్దార్ హత్య
విశాఖ సిటీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖకు చెందిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసు మిస్టరీ వీడింది. వ్యక్తిగత లావాదేవీలు, భూ వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. హత్య చేసి విశాఖ నుంచి విమానంలో చెన్నై పారిపోయిన రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం గంగారావును సోమవారం అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ తెలిపారు. తహసీల్దార్ సనపల రమణయ్యను గత శుక్రవారం రాత్రి హత్య చేసిన మురారి సుబ్రహ్మణ్యం గంగారావు శనివారం ఉదయం వరకు విశాఖలోనే ఉన్నాడు. తరువాత విశాఖ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. మధ్యాహ్నం 3.30 గంటలకు విమాన సమయం అయినప్పటికీ.. ఉదయం 9.30 గంటలకే విమానాశ్రయం లోపలకు వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఇదిలా ఉంటే గంగారావే తహసీల్దార్‌ను హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు అతని మొబైల్ ఆధారంగా చెన్నైకు టికెట్ బుక్ చేసుకున్నట్లు ముందుగానే గుర్తించారు. దాని ప్రకారం మధ్యాహ్నం ఎయిర్‌పోర్ట్‌లో సుబ్రహ్మణ్యం పేరుతో విచారించారు. ఆ పేరుతో ప్రయాణికులు ఎవరూ లేరని ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పడంతో పోలీసులు వెనక్కు వచ్చేశారు. అప్పటికి విమానాశ్రయం సీసీ కెమెరాలను పరిశీలించలేదు. పెద్ద పేరు ఉండడంతో పోలీసులు గానీ, ఎయిర్పోర్ట్ అధికారులు గానీ పూర్తిస్థాయిలో నిందితుడి పేరును గుర్తించలేకపోయారు. దీంతో హంతకుడు విమానం ఎక్కి బెంగళూరు వెళ్లాడు. అయితే అప్పటికే ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఉండడంతో బెంగళూరులో ఎయిర్‌హోస్టెస్ మురారీ సుబ్రహ్మణ్యం గంగారావు పేరును అనౌన్స్ చేయడంతో.. అనుమానించిన అతడు బెంగళూరు విమానాశ్రయంలోనే దిగిపోయాడు. బస్సులో చెన్నైకు.. బెంగళూరు నుంచి గంగారావు బస్సులో చెన్నైకు బయలు దేరాడు. హంతకుడిని పట్టుకునేందుకు చెన్నైకు వెళ్లిన ప్రత్యేక బృందం మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా చెన్నై పోలీసుల సహకారంతో గంగారావును చెంగల్పుట్టు వద్ద అరెస్ట్ చేసింది. అక్కడి నుంచి ట్రాన్సిట్ ద్వారా విశాఖకు తీసుకొచ్చారు. కాగా, హత్య జరగడానికి గల కారణాలపై డీసీపీ– 1 మణికంఠ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని సీపీ రవిశంకర్ తెలిపారు. కన్వెయన్స్ డీడ్స్ విషయంలో జరిగిన వ్యక్తిగత వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు గంగరావు చెప్పినట్లు తెలిపారు. గంగారావు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, అతడిపై హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లోనూ చీటింగ్ కేసులున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వివరించారు. -
ఎయిర్‌పోర్టులో రామస్మరణ
-
స్పెషల్ లుక్‌లో 'తండేల్' హీరో.. వీడియో వైరల్!
గతేడాది కస్టడీ చిత్రంలో ప్రేక్షకులను అలరించిన హీరో అక్కినేని నాగచైతన్య. సురేశ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం శ్రీకాకుళం బ్యాప్డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతోన్న తండేల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి జోడీగా కనిపించనుంది. చందు మొండేటి దర్శకత్వంలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సముద్ర నేపథ్యంలో సాగే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స టీజర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మత్స్యకారుడి పాత్రలో చై కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఫిషర్‌మేన్ బాడీ లాంగ్వేజ్ కోసం మూడు నెలలు కష్టపడ్డానని నాగ చైతన్య వెల్లడించారు. తాజాగా నాగ చైతన్య ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. గడ్డంతో ఉన్న చైతూ ఫుల్ స్టైలిష్ లుక్‌లో వెళ్తూ కెమెరాలకు చిక్కారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండేల్ కథేంటంటే.. గతంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు జాలర్లు పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో వాళ్లని కొన్నేళ్ల పాటు పాక్ ప్రభుత్వం జైల్లో నిర్భంధించి చిత్రహింసలు పెట్టింది. ఆ తర్వాత చాన్నాళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొస్తాడు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌తో 'తండేల్' సినిమా తీస్తున్నారు. జాలారి పాత్రలో చైతూ నటిస్తుండగా.. అతడి భార్యగా సాయిపల్లవి నటిస్తోంది. ఏదేమైనా పాన్ ఇండియా లెవల్లో 'తండేల్' మూవీని తెరకెక్కిస్తున్నారు. కాగా.. తండేల్కు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. #TFNExclusive: Thandel Raju aka Yuvasamrat @chay_akkineni gets papped at Hyderabad airport in a fully rugged look!😎🔥#NagaChaitanya #Thandel #TeluguFilmNagar pic.twitter.com/GSdYBHreq0 — Telugu FilmNagar (@telugufilmnagar) February 2, 2024 -
విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్‌కు నేరుగా విమానాలు
విశాఖపట్నం: విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్ కు ఏప్రిల్ నుంచి ఎయిరేషియా విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9 నుంచి విశాఖ-బ్యాంకాక్ విమాన సర్వీసులు మొదలవుతాయి. ఏప్రిల్ 26 నుంచి విశాఖ-కౌలాలంపూర్ కు విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 9 నుంచి విశాఖ-హైదరాబాద్ మధ్య మరో ఎయిరిండియా సర్వీసు నడవనుంది. మే, జూన్ లో విశాఖ-దుబాయ్ మధ్య మరో ఎయిరిండియా సర్వీసు మొదలవుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్ట్ రన్‌వే నవీకరణ పనులు మార్చి 31 నాటికి పూర్తికానున్నాయి. ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. ఇదీ చదవండి: Union Budget 2024-25: తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులు ఇవే.. -
కర్నూలులో పైలట్ల శిక్షణ కేంద్రం
కర్నూలు విమానాశ్రయంలో పైలట్ల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ఇప్పటికే అయిదారు సంస్థలు ఆసక్తి కనబరిచాయని ఏపీ ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు, ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ వి.ఎన్.భరత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. టెండర్లకు జనవరి 31 వరకు గడువు ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది కార్యరూపం దాలిస్తే ఏటా 40–50 మంది శిక్షణ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. గడువు కంటే ఆరు నెలల ముందే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 2025 మే నాటికి ఇది సిద్ధం అవుతుందని వెల్లడించారు. తొలి దశలో ఏటా 60 లక్షల మంది, తుది దశ పూర్తి అయ్యే నాటికి ఏటా 4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా విమానాశ్రయాన్ని నిరి్మస్తున్నట్టు వివరించారు. భోగాపురం విమానాశ్రయాన్ని పీపీపీ విధానంలో జీఎంఆర్ నిరి్మస్తోంది. 2,200ల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో సుమారు రూ.5,000 కోట్లు వ్యయం అవుతోందని భరత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎయిర్‌పోర్టులను అనుసంధానిస్తూ కొత్త రూట్లలో సర్వీసులను అందించాల్సిందిగా కోరుతూ పలు విమానయాన సంస్థలతో ఇటీవల చర్చలు జరిపామని చెప్పారు. -
ఇలా కాదే వీళ్లు ఉండాల్సింది!
బ్రిటన్ భిన్నమైన దేశం. బ్రిటన్ దేశస్థులు విలక్షణమైనవారు. ఎవరి వ్యక్తిగత జీవితాలలోకీ తొంగిచూడరు. నిత్య జీవిత భౌతిక సంభాషణలలో అంత ర్లయగా ఉన్న హాస్యాన్ని చక్కగా పట్టుకోగలరు. విధి నిర్వహణలలో ఘటనాఘట సమర్థులు. మర్యాద ఇవ్వడంలో మన రామన్నలను మించినవారు. ఎంతటి విపత్తుకైనా ముందస్తుగా సిద్ధమై ఉండేవారు. పరదేశీ అతిథులను గౌరవించి, ఆదరించేవారు. తలవని తలంపుగానైనా తమ దేశానికి అప్రతిష్ఠను తీసుకురాని వారు. అంతటి ఉత్కృష్ట ప్రజల పైన, అంతటి నాగరిక దేశం మీద గత డిసెంబరు 23న హీత్రో విమానాశ్రయంలోని మూడవ నంబరు టెర్మినల్ పూర్తి విరుద్ధమైన నీడల్ని ప్రసరింపజేసింది! ‘ఇలా కాదే వీళ్లు ఉండాల్సింది’ అన్న భావనను ఆనాటి ప్రయాణికులకు కలిగించింది. ఇక్కడి నా వ్యాసాల సరళిని బాగా ఎరిగి వున్న వారికి ఆ వ్యాసాలలో తరచు నేను బ్రిటన్ దేశాన్ని, బ్రిటన్ దేశస్థులను ఆకాశానికి ఎత్తేసినంతగా వెన కేసుకు రావటమన్నది గ్రహింపునకు వచ్చే ఉంటుంది. బ్రిటన్ దేశస్థుల గుండె ధైర్యాన్ని నేను ఇష్టపడతాను. వ్యక్తుల జీవితాలలోని గోప్యతను గౌరవించి, వారి ఆంతరంగిక విషయాలలోకి చొరబడకుండా ఉండే ఆ స్వభావాన్ని ప్రశంసిస్తాను. అంతేకాదు, ప్రపంచంలోనే బ్రిటిషరస్ గొప్ప హాస్యచతురత ఉన్నవారనీ దృఢంగా విశ్వసిస్తాను. ఇది చాలా వరకు ఉద్దేశపూర్వకమైన అతిశయోక్తి, తేలికపాటి వ్యంగ్యోక్తి, పైనుంచి కిందివరకు కూడా నర్మగర్భ విమర్శ. ఇదంతా ఎక్కువగా బ్రిటన్ రాచకుటుంబం పైన! ఈ క్రమంలో వారి అసహజ ప్రవర్తనల్ని అభినందించడం, వారి అసాధారణతల్లోని అవకరాలను కనుకొనల్లోంచి చూసీచూడనట్లుగా వదిలేయడం, వారు మాటిమాటికీ చేస్తుండే తప్పులను మన్నించడం వంటి మనో నైపుణ్యాలను నేను పెంపొందించుకున్నాను. కానీ డిసెంబర్ 23 సాయంత్రం హీత్రో విమానాశ్రయంలోని 3వ టెర్మినల్‌లో ఏదైతే జరిగిందో అది మాత్రం క్షమించలేనిది. నిజానికి క్షమించ తగనిది. మరోమాటకు ఆస్కారం లేకుండా అదొక వాదన లకు తావులేని అసమర్థతకు నిదర్శనం. బ్రిటన్ను సందర్శించే వ్యక్తుల పట్ల నమ్మశక్యం కానంతటి అమర్యాదకరమైన ధోరణి. బహుశా ఎన్నడూ లేనంతగా పూర్తిస్థాయి ఆత్మాశ్రయ ఓటమి. బ్రిటన్ స్వరూపాన్ని గరిష్ఠ స్థాయిలో ఘోరాతిఘోరంగా వీక్షింపజేసిన ఉదాసీనత. రాత్రి ఎనిమిది గంటలకు విమానం దిగిన ప్రయాణికులు విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం కిక్కిరిసిపోయి, మందకొడిగా మెలికలు తిరుగుతూ ముందుగు సాగుతూ ఉన్న పొడవాటి వరుసలో రెండున్నర గంటలసేపు విధిలేక వేచి ఉండవలసి వచ్చింది. పాదం నొప్పితో నేను అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఇంకా ల్యాండ్ అవుతున్న విమానాల నుంచి కొత్త ప్రయాణికులు మా వరుస లోకి వెనుక నుంచి జమ అవుతుండటం గమనించాను. ఇప్పుడు వరుసలో వేచి ఉండే కాలం బహుశా రెండున్నర నుంచి నాలుగు గంటలు అవుతుందా! ఫస్ట్ క్లాస్, అంతకంటే కాస్త మాత్రమే దిగువ శ్రేణిలో ఉండే క్లబ్ క్లాస్ ప్రయాణికులు కూడా మా క్యూలో ఉన్నారు. వారి కోసం వేరుగా ఏర్పాటై ఉండే ‘ఫాస్ట్ ట్రాక్’ను బ్రిటన్ తొలగించి ఉండటమే అందుకు కారణం. విమానాశ్రయ అధికారులకు ఇదేమైనా పట్టి ఉంటుందా? నిజం ఏమిటంటే, వారిలో ఒక్కరు కూడా విచారం వ్యక్తం చేయటం లేదు. క్షమాపణ కోరటం అటుంచండి, అడిగిన దానికి సమాధానం చెప్పిన వారైనా ఎవరు? ఒకవేళ క్యూలో ఉన్న ప్రయాణికులు బాత్రూమ్కి వెళ్లవలసివస్తే వారి పరిస్థితి ఏమిటన్న కనీస ఆలోచనైనా వారికి వచ్చి ఉంటుందా? నాకు గుర్తున్నంత వరకు క్యూలో ఉన్న వారెవరికీ అదృష్టవశాత్తూ ఆ అవసరం రాలేదు. లేదా, అలాంటి అవసరం వచ్చిన ప్పటికీ వారు క్యూలో తమ స్థానం కోల్పోయి, మరిన్ని అంతులేని గంటలపాటు వేచి ఉండవలసి వస్తుందన్న భయంతో ఆ బాధను అలాగే ఉగ్గబట్టి ఉండాలి. అదింకా క్రిస్మస్కు వచ్చిపోయే వారు ఎక్కువలో ఎక్కువగా ఉండే సమయం. ఆ రద్దీని ముందే ఊహించి, అందుకు సిద్ధంగా కదా అధికా రులు ఉండాలి. పైగా హీత్రో విమానాశ్రయానికి గతంలో ఇలాంటివి చాలినన్ని అనుభవాలు ఉన్నాయి. 2019లో ఈ విమానాశ్రయం ద్వారా దాదాపు 8 కోట్ల 10 లక్షల మంది రాకపోకలు సాగించారు. అయినప్పటికీ 23న సగానికి పైగా ఇమిగ్రేషన్ కౌంటర్లు సిబ్బంది లేకుండా కనిపించాయి. చివరికి ఎట్టకేలకు నా వంతు వచ్చినప్పుడు, క్లియరెన్స్ కోసం నా దగ్గరికి వచ్చిన అధికారి దగ్గర కనీసం పెన్ను కూడా లేదు! పెన్ను కోసం అతడు తన సహ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పుడు నేను మరికొన్ని ఆవేదనా భరితమైన నిమిషాలను గడుపుతూ అతడి కోసం వేచి ఉండవలసి వచ్చింది. అదృష్టవశాత్తూ నాల్గవ వ్యక్తి దగ్గర అతడికి – మళ్లీ తిరిగి ఇచ్చే షరతుపై – ఒక పెన్ను లభించింది. అప్పటికి మా బ్యాగులు లగేజ్ బెల్టుల నుంచి జారి వచ్చి, తీరూతెన్నూ లేకుండా కలగాపులగంగా పడి పోయాయి. కొన్ని అసలైన చోటులో, మిగతావి చాలా వరకు విసిరివేసినట్లుగా అక్కడికి దూరంగా చెల్లాచెదురైన వాటిలో! వాటి నుంచి నా రెండు బ్యాగుల్ని కనిపెట్టి తీసుకోడానికి మరొక అరగంట! దాదాపు మూడు వందల మంది ప్రయాణికుల బ్యాగులతో అవి కిందా మీదా అయి కేవలం కలిసిపోవడం మాత్రమే కాదు, వాటిని వెతికి పట్టుకోడానికి అవి ఏమాత్రం పడి ఉండే అవకాశం లేని చోట వాటిని కనిపెట్టాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి ముందురోజు రాత్రి బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ నేను హీత్రోలో ల్యాండ్ అయిన వెంటనే నాకు ఫోన్ చేసి, తను విమానాశ్రయ నిష్క్రమణ మార్గం వైపు ఉన్న డబ్లు్య.హెచ్. స్మిత్ కౌంటర్ దగ్గర నా కోసం వేచి ఉన్నానని చెప్పాడు. కానీ నేను అతడిని చేరడానికి మూడు గంటల సమయం పడుతుందని అనుకుని ఉండడు. నా కోసం ఓపికగా వేచి ఉండటం తప్ప అతడికి వేరే దారి లేదు. లేకుంటే హీత్రో బాడుగకు అతడికి డబ్బు రాదు కదా! ఇది ఆమోదయోగ్యం కాదని బ్రిటిష్ ప్రభుత్వానికి గట్టిగా చెప్పా ల్సిన అవసరం ఉన్నందున నేను ఇదంతా నిజాయితీగా రాస్తున్నాను. ఇంతకుమించి వేరే మార్గం లేదు. ఎవరికి నేనీ అనుభవాన్ని చెప్పినా భయపడిపోయారు. కానీ ఇది నాకు మాత్రమే ప్రత్యేకమైన అనుభవం కాదు. ఇలా వేల మందికి, బహుశా పదుల వేల మందికి జరిగి ఉంటుంది. టెర్మినల్ 3లో ఇది సర్వసాధారణం. అయితే ఈ సర్వ సాధారణత్వాన్ని ఒక మామూలు విషయంగా బ్రిటిష్ అధికారులు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కనుక ఒక వ్యంగ్య వ్యాఖ్యతో, ఒక విధమైన ప్రతీకారం వంటి సూచనతో ఈ వ్యాసాన్ని నేను ముగిస్తాను. టెర్మినల్ 3లో దిగితే భారతదేశ పాస్‌పోర్టు కలిగివున్న తన అత్తమామలకు కూడా ఇదే జరుగుతుందని రిషి సునాక్ గ్రహించగలరా... బహుశా ఆయన వాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తే తప్ప? నా సలహా. ప్రతి భారతీయ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్‌ను ఉపయోగించకుండా బ్రిటిష్ పౌరులందరినీ నిరోధించాలి. అది నిజంగా జరిగితే హీత్రోలో పరిస్థితులు చాలా త్వరగా మెరుగు పడతాయి. నిజం! నా మాట నమ్మండి! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సంక్రాంతి వేకేషన్లో ఐకాన్ స్టార్.. వీడియో వైరల్!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రజలు భోగి సంబురాలతో ఈ ఏడాది వేడుకలను ఘనంగా ప్రారంభించారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫెస్టివల్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. అగ్ర సినీ తారలంతా తమకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లిపోయి పొంగల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఫెస్టివల్ వెకేషన్‌కు వెళ్లిపోయారు. రామ్ చరణ్-ఉపాసన, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెళ్తూ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-స్నేహారెడ్డి సైతం బెంగళూరుకు వెళ్లిపోయారు. కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకల కోసమే బయలుదేరారు. ఎయిర్‌పోర్ట్‌లో బన్నీ దంపతులు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్-1 సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న పుష్ప-2లో నటిస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో రూపొందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరి కాంబోలో పుష్ప బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నటనకు అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు. కాగా.. పుష్ప-2 చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. #TFNExclusive: Icon stAAr @alluarjun along with his wife #AlluSnehaReddy were seen 📸 at HYD airport in stylish & chic looks as they're off to Bangalore for Sankranthi celebrations with family! 😍🔥#AlluArjun #Pushpa2TheRule #TeluguFilmNagar pic.twitter.com/zbj3NHc55j — Telugu FilmNagar (@telugufilmnagar) January 14, 2024 -
కిలాడీ లేడీ గోల్డ్ స్మగ్లింగ్..
-
జెట్ వేగంతో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు పనులు
-
అయోధ్య ఎయిర్‌పోర్టుకు భారీ భద్రత
జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ సందర్భంగా అయోధ్య విమానాశ్రయంలో 150 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కమాండోలను మోహరించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అయోధ్య విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. ఈ విమానాశ్రయానికి సీఐఎస్ఎఫ్ రక్షణ కల్పించడంపై గతంలో చర్చలు జరిగాయి. కేంద్ర భద్రత , ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమీక్షలో ఈ విమానాశ్రయానికి సీఐఎస్ఎఫ్ ప్రొఫెషనల్ సెక్యూరిటీని సిఫార్సు చేశారు. అయోధ్య విమానాశ్రయ సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతామని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల చెప్పారు. మొదటి దశలో 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి గంటకు రెండు నుంచి మూడు విమానాలను నిర్వహించగల సామర్థ్యం దీనికి ఉంటుంది. 2,200 మీటర్ల పొడవున రన్‌వే నిర్మించేందుకు పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ విమానాశ్రయంలో బోయింగ్ 737, ఎయిర్ బస్ 319, 320 విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అవకాశం ఉంది. విమానాశ్రయం రెండో దశ అభివృద్ధికి త్వరలో కేబినెట్ నుంచి ఆమోదం తీసుకుంటామని సింధియా తెలిపారు. రెండో దశలో రన్‌వే పొడవును 2,200 మీటర్ల నుంచి 3,700 మీటర్లకు పెంచనున్నారు. దీని వల్ల రన్‌వే పొడవు దాదాపు నాలుగు కిలోమీటర్లకు పెరగనుంది. -
మంటల్లో విమానం!
టోక్యో: తీవ్ర భూకంపం ధాటికి పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం చోటుచేసుకోవడంతో పెనువిషాదంలో మునిగిపోయిన జపాన్‌లో మరో దుర్ఘటన జరిగింది. భూకంప బాధితుల కోసం సహాయక సామగ్రిని చేరవేయాల్సిన విమానం ప్రమాదంలో చిక్కుకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. విమానాశ్రయం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న విమానం మరో విమానాన్ని ఢీకొట్టింది. మొదటి విమానంలో ఉన్న 379 మంది క్షేమంగా ప్రాణాలతో బయటపడడంతో ఊరటనిచ్చింది. ఏమాత్రం ఆలస్యం జరిగినా ఊహించని ఉత్పాతమే జరిగేదని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. రాజధాని టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్టు జపాన్‌లో అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటి. నూతన సంవత్సరం సెలవుల సందర్భంగా ప్రయాణికుల రాకపోకలతో మంగళవారం మరింత రద్దీగా మారింది. హొక్కైడోలోని షిన్ చిటోస్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం జేఏఎల్–516(ఎయిర్‌బస్ ఏ–350) హనెడా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఇందులో 12 మంది సిబ్బంది సహా మొత్తం 379 మంది ఉన్నారు. రన్‌వేపై దిగుతూ కుదుపులకు లోనైంది. రన్‌వేపై ల్యాండ్ అవుతూ, ఒక పక్కగా నిలిపి ఉన్న జపాన్ తీర రక్షక దళానికి చెందిన విమానం ఎంఏ–722ను అనూహ్యంగా ఢీకొట్టి కొద్దిదూరం దూసుకెళ్లి ఆగిపోయింది. క్షణాల వ్యవధిలోనే జేఏఎల్ విమానం రెక్క భాగంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే తలుపులు తెరిచి ప్రయాణికులకు బయటకు పంపించారు. మంటలు వేగంగా దూసుకొస్తున్నా లెక్కచేయకుండా ప్రయాణికులంతా బయటకు వచ్చారు. తర్వాత విమానం మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా పొగతో నిండిపోయింది. అగి్నమాపక సిబ్బంది మంటలను అర్పివేశారు. విమానం నుంచి ప్రయాణికులను భద్రంగా బయటకు పంపించిన అందులోని సిబ్బందిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహారించాలన్న దానిపై వారికి శిక్షణ ఇచి్చనట్లు అధికారులు చెప్పారు. ‘సాయం’ అందించకుండానే... ప్రమాదం జరిగిన వెంటనే తీర రక్షక దళం విమానం పైలట్ అక్కడి నుంచి పరారయ్యాడని జపాన్ కోస్ట్‌గార్డు అధికారులు చెప్పారు. ఈ విమానంలో ఉన్న ఆరుగురు కోస్ట్‌గార్డు సిబ్బందిలో ఐదుగురు మరణించారని స్థానిక మీడియా వెల్లడించింది. కోస్ట్‌గార్డు విమానం సహాయక సామగ్రితో జపాన్ పశి్చమ తీరంలోని నిగాటాకు బయలుదేరాల్సి ఉంది. కానీ అక్కడి భూకంప బాధితులకు సామగ్రిని అందించకుండానే ప్రమాదం జరగడం, ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఆవేదన కలిగిస్తోంది. ఊపిరాడక నరకంలా అనిపించింది జేఏఎల్–516 విమానంలో తనకు ఎదురైన భయానక అనుభవాన్ని 17 ఏళ్ల స్వీడి ఆంటోన్ డీబె మీడియాతో పంచుకున్నాడు. తొలుత ఏం జరిగిందో అర్థం కాలేదని, విమానం లోపలంతా దట్టమైన పొగ కమ్ముకుందని, ఊపిరాడక నరకంలా అనిపించిందని చెప్పాడు. సీట్లలో నుంచి కిందపడిపోయామని, ఎవరో ఎమర్జెన్సీ డోర్లు తెరవడంతో ప్రాణాలతో బయటపడ్డామని తెలిపాడు. -
హైదరాబాద్ ఎయిర్పోర్ట్.. టైమ్ అంటే టైమే..!
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల టైమింగ్ బావుందని నివేదిక వెల్లడైంది. నిర్వహణ, పనితీరు, సమయపాలన (ఆన్‌టైమ్ పర్ఫార్మెన్స్-ఓటీపీ)లో అంతర్జాతీయంగా హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 2023లో ఆన్‌టైమ్ పర్ఫార్మెన్స్ను సమీక్షించిన విమానయాన అనలిటిక్స్ సంస్థ సిరియమ్ రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. టాప్-10 విమానాశ్రయాల్లో మన దేశంలోని కోల్‌కతా విమానాశ్రయం కూడా స్థానం దక్కించుకుంది. టాప్ 1లో అమెరికాకు చెందిన మిన్నేపొలిస్-సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది ఓటీపీ అధికంగా 84.44% ఉంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 84.42% ఓటీపీతో రెండో స్థానం సాధించింది. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 84.08% ఓటీపీతో మూడో స్థానంలో నిలిచింది. పెద్ద విమానాశ్రయాల్లోనూ ఈ రెండు స్థానం సాధించాయి. మధ్య స్థాయి విమానాశ్రయాల విభాగంలో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం 83.91 శాతం ఓటీపీతో అంతర్జాతీయంగా తొమ్మితో స్థానం దక్కించుకుంది. ఇదీ చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో మన బ్యాగ్ మనమే చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే.. సంస్థల వారీగా.. అంతర్జాతీయంగా దేశంలోని పెద్ద విమానయాన సంస్థ ఇండిగో 82.12% ఓటీపీతో ఎనిమిదో ర్యాంకు సాధించింది. ఆసియా పసిఫిక్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన సఫైర్ 92.36% ఓటీపీతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా పసిఫిక్ విభాగంలో జపాన్‌కు చెందిన ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ 82.75% ఓటీపీతో అగ్ర స్థానం దక్కించుకుంది. జపాన్ ఎయిర్‌లైన్స్ (82.58% ఓటీపీ), థాయ్ ఎయిరేషియా (82.52% ఓటీపీ) రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. విమానం నిర్దేషించిన సమయానికి 15 నిమిషాలు ముందే వస్తే ఆన్‌టైమ్ షెడ్యూల్ అని సిరియమ్ నివేదిక తెలిపింది. -
టోక్యో ఎయిర్ పోర్ట్ లో రెండు విమానాలు ఢీ
-
ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. అయిదుగురి మృతి
జపాన్ ఎయిర్‌పోర్టులో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని టోక్యోలోని ఓ ఎయిర్‌పోర్టు రన్‌వేపైని విమానంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అయిదుగురు మృత్యువాతపడ్డారు. వివరాలు.. హోకియాడో నుంచి వస్తున్న జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన JAL 516 విమానం ప్రమాదానికి గురైంది. హనెడా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా మంటలు వ్యాపించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీంతో విమానంలోని 379 ప్రయాణికులు, 12 మంది సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించారు. JAL plane on fire at Tokyo Airport pic.twitter.com/EL9s7kVJbi — アトリン ✊🏾 (@phoojux) January 2, 2024 అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో విమానం రన్‌వేపై దిగుతుండగానే దాని చక్రాల నుంచి మంటలు వెలువడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అనంతరం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని.. దాదాపు 70 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. JAL plane on fire at Tokyo Airport pic.twitter.com/EL9s7kVJbi— アトリン ✊🏾 (@phoojux) January 2, 2024 ప్రమాదానికి గల స్పష్టమైన కారణం తెలియరాలేదు కానీ.. విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా అక్కడే ఉన్న కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఢీ కొనడం వల్లే ఈ ఘటన జరిగినట్లు విమానాశ్రయ అధికారులు జాతీయ మీడియా ఎన్‌హెచ్‌కేకు తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే కోస్ట్‌గార్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో మొత్తం ఆరుగురు సిబ్బంది ఉండగా.. వారిలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు మాత్రమే సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ఘటన అనంతరం హనెడా విమానాశ్రాయాన్ని పూర్తిగా మూసివేసినట్లు చెప్పారు. -
కొత్త టెర్మినల్ ని ప్రారంభించిన మోదీ
-
కట్టకుండానే కట్టేసినట్టు కలరింగ్
-
ఎయిర్‌పోర్ట్‌లో మన బ్యాగ్ మనమే చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాదాపు అన్ని సంస్థలు సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనువుగా తమనుతాము నిత్యం అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాయి. నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టడంలో ఎల్లప్పుడూ ముందుండే హైదరాబాద్‌లోని జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ముందడుగు వేసింది. తనిఖీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా సెల్ఫ్ చెక్ కియోస్క్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు టర్మినల్లోకి ప్రవేశించడానికి ముందే తనిఖీలు చేయడం, బ్యాగేజీ చెక్ ఇన్, బోర్డింగ్ పాస్‌ల జారీ వరకు అన్ని సదుపాయాలను ఒకేచోట అందిస్తున్నట్టు జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ ఈడీ ఎస్జీకే కిశోర్ అన్నారు. విమానాశ్రయంలో ఆధునిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయకుండా సెల్ఫ్ చెక్ కియాస్క్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. దీంతో టర్మినల్ వద్ద రద్దీ తగ్గడంతోపాటు ప్రయాణికులు మరింత సులభంగా రాకపోకలు సాగించవచ్చని తెలిపారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. కొత్తగా ఏర్పాటు చేసిన కియాస్క్‌ల వద్ద ప్రయాణికులు వారి బ్యాగ్‌లను వారే చెక్ చేసుకోవచ్చు. అక్కడే బోర్డింగ్ పాస్, బ్యాగ్ ట్యాగ్‌లను తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సేవలు విమానం ప్రారంభమయ్యే గంట ముందు వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. -
అయోధ్య విమానాశ్రయం విశేషాలివే
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఎయిర్‌పోర్టు అనేక విశేషాలను కలిగివుంది. అయోధ్య నగర చరిత్ర, విశిష్టత, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేలా ఈ విమానాశ్రయ రూపుదిద్దుకుంది. విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని శ్రీరామ మందిరాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. ప్రధాన ద్వారంపై ఆలయ తోరణాల డిజైన్ రూపొందించారు. శ్రీరాముని జీవితాన్ని కళ్లకు కట్టే కళాఖండాలు, చిత్రాలు, కుడ్యచిత్రాలతో విమానాశ్రయం శోభాయమానంగా కనిపిస్తోంది. విమానాశ్రయం సమీపంలో బస్సు పార్కింగ్‌తోపాటు దివ్యాంగులకు అనుకూలమైన వసతి సౌకర్యాలు కల్పించారు. ఎల్ఈడీ లైటింగ్, వాననీటి నిర్వహణ, సౌర విద్యుత్ ప్లాంట్, మురుగు శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రాంగణం చుట్టూ పరుచుకున్న పచ్చదనం నిర్వహణకు వాడిన నీటిని రీ సైకిల్ చేసి ఉపయోగించనున్నారు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం కేవలం 20 నెలల్లో పూర్తయిందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్ కుమార్ చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టు గతంలో కేవలం 178 ఎకరాల్లో ఉండేది. దీనిని ఇప్పుడు రూ.350 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దారు. యూపీ ప్రభుత్వం 821 ఎకరాల భూమిని విమానాశ్రయం కోసం కేటాయించింది. ప్రతి ఏటా 10 వేల మంది ప్రయాణికుల రాకపోకలు సాగించేందుకు వీలుగా విమానాశ్రయాన్ని అత్యంత విశాలంగా నిర్మించారు. టెర్మినల్ భవనాన్ని 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. 2.2 కిలోమీటర్ల పొడవైన రన్‌వేను ఏర్పాటు చేశారు. దీంతో ఎయిర్‌బస్–321 రకం విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సులభతరం కానుంది. ఇక్కడ రెండు లింక్ ‘టాక్సీ వే’లు ఉండటంతో ఒకేసారి ఎనిమిది విమానాలను పార్క్ చేసుకునేందుకు అవకాశం ఉంది. త్వరలో విమానాశ్రయ రెండో దశ విస్తరణ పనులు మొదలుకానున్నాయి. టెర్మినల్‌ను 50 వేల చదరపు మీటర్లకు విస్తరించనున్నారు. ఏటా ఏకంగా 60 లక్షల మంది రాకపోకలకు వీలుగా విస్తరణ ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధంచేశారు. రన్‌వేను 3.7 కిలోమీటర్లకు విస్తరించి, అదనంగా 18 విమానాల పార్కింగ్‌కు చోటు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది కూడా చదవండి: భారత్‌లో ఐదు కొత్త సంవత్సరాలు... ఏడాది పొడవునా సంబరాలే! -
Ayodhya Airport Photos: ఆధ్యాత్మిక నగరిలో అధునాతన విమానాశ్రయం.. ఆధునిక హంగులతో రైల్వేస్టేషన్ (ఫొటోలు)
-
బెంగళూరులో టెన్షన్.. టెన్షన్
-
ఇలాంటి టెక్నాలజీ తెలంగాణలో ఫస్ట్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్‌కు సంబంధించిన ఒక వీడియో షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేస్డ్ స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీలు ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్ధం కొత్త టెక్నాలజీ ప్రారంభించిన తొలి రాష్ట్రంగా తెలంగాణా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ట్రాలీలు టెర్మినల్ చుట్టూ ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడమే కాకుండా.. విమానాశ్రయ ప్రవేశ మార్గాలు, బయలుదేరే సమయం, గేట్లకు రూట్, ఆఫర్స్ వంటి ఉపయోగకరమైన సమాచారాన్ని తెలియజేస్తూ చాలా సహాయపడతాయి. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లో 3 వేల బ్యాగేజీ ట్రాలీలు ఉన్నట్లు సమాచారం. ప్రపంచంలో స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీ సదుపాయాన్ని తొలిసారిగా మ్యూనిక్ ఎయిర్‌పోర్టులో తీసుకొచ్చారు. ఆ తర్వాత రెండో ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కావడం విశేషం. వినియోగదారు ఈ ట్రాలీని నో జోన్ ఏరియాలోకి తీసుకెళ్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఫ్లైట్ లేట్ అయితే కూడా ముందస్తుగా నోటిఫికేషన్ రూపంలో డిస్ప్లే చేస్తుంది. ఇదీ చదవండి: బెడ్ అమ్మబోయి రూ.68 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. ఎలా అంటే? ఈ ట్రాలీపై ఉన్న డ్యాష్ బోర్డులో మన బోర్డింగ్ పాస్ వివరాలను ఎంటర్ చేస్తే.. ఫ్లైట్ టైమింగ్స్‌తో పాటు గేట్ నంబర్ వివరాలు కూడా స్క్రీన్ మీద కనిపిస్తాయి. గేట్ వద్దకు చేరుకొనే మార్గాన్ని కూడా అదే చూపుతుంది. బోర్డింగ్‌కు టైమ్ ఉంటే షాపింగ్ చేసుకునేందుకు వీలుగా అన్ని వివరాలు డ్యాష్ బోర్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో షాపులు, దాని వివరాలు, ఆఫర్లు తదితర వివరాలు తెలుసుకోవచ్చు. వాటితో పాటు వాష్ రూంలు, రెస్టారెంట్లు, ఫుడ్ వివరాల గురించి వివరాలు కనిపిస్తాయి. ఆనంద్ మహీంద్రా ట్వీట్.. స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీలకు సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ.. ఈ టెక్నాలజీ చాలా బాగుందని, విదేశాల్లో కూడా ఇలాంటి టెక్నాలజీ చూడలేదని ఇది 'ప్రెట్టీ కూల్' అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు దీనిపైన తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. That IS pretty cool. I’ve never encountered such trolleys in overseas airports…but I may be wrong. Are we truly amongst the very first to introduce these? 👏🏽👏🏽👏🏽 pic.twitter.com/IEbZVI4BbM — anand mahindra (@anandmahindra) December 15, 2023 -
ఈ రూట్ల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన మెట్రో అలైన్మెంట్లపై అధికారులు దృష్టి సారించారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం – శంషాబాద్ ఎయిర్‌పోర్టును నిలిపివేస్తూ కొత్తగా ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట, ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మీదుగా ఎయిర్‌పోర్టు వరకు రెండు రూట్లను పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కొత్త మార్గాలపై కసరత్తుకు సన్నద్ధమైంది. ఈ రెండు రూట్లలో మెట్రో నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మెట్రో రైల్ అధికారులు త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. అవసరమైన భూసేకరణ, అలైన్మెంట్ మార్గం, అంచనా వ్యయం తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. తక్కువ భూసేకరణతో.. ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్పల్లి, పి–7 రోడ్ రూట్లో, ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా, బార్కాస్, పహాడీషరీఫ్ రూట్లో మెట్రో నిర్మాణాన్ని పరిశీలించాలని సీఎం చెప్పారు. ఎల్బీనగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 20 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 12 కి.మీ ఉంటుందని అంచనా. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం– శంషాబాద్ రూట్ 31 కి.మీ ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన రూట్లలో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణానికి రాయదుర్గం రూట్ కంటే తక్కువ ఖర్చవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దూరం తక్కువగా ఉండడంతో పాటు పెద్దగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు మార్గంలోనే మెట్రో నిర్మాణం చేపట్టవచ్చు. అలాగే ఎయిర్‌పోర్టు రూట్‌ను పొడిగించి ఫార్మాసిటీ స్థానంలో ప్రతిపాదించిన మెగా టౌన్షిప్ వరకు భవిష్యత్‌లో పెద్దగా భూసేకరణ జరపాల్సిన అవసరం లేకుండా మెట్రో నిర్మాణం చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. నిర్మాణంపై ముందుకు సాగేదెలా..? రాయదుర్గం– శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గాన్ని గత ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్ మెట్రోగా నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న మెట్రో రైల్ రూట్లను ఎల్అండ్టీ సంస్థ పీపీపీ మోడల్లో నిర్మించగా ఎయిర్‌పోర్టు మెట్రోను సుమారు రూ.6,250 కోట్లతో సొంతంగా చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుత ప్రభుత్వం పాత అలైన్‌మెంట్‌ను నిలిపివేసి కొత్త అలైన్మెంట్లను ప్రతిపాదించిన నేపథ్యంలో సొంతంగా నిర్మిస్తుందా? లేక ఏదైనా నిర్మాణ సంస్థకు పీపీపీ తరహాలోనే అప్పగిస్తుందా? అనే అంశం స్పష్టం కావాల్సి ఉంది. 31 కి.మీ రాయదుర్గం– శంషాబాద్ రూట్‌ను రూ.5,888 కోట్లతో నిర్మించేందుకు ఎల్అండ్టీ, ఎన్సీసీ సంస్థలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అంతకంటే తక్కువ నిధులతోనే ఎల్బీనగర్– ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో నిర్మించాల్సిన బాధ్యత ఎల్‌అండ్‌టీపై ఉంది. ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు కేవలం 12 కి.మీ కొత్తగా నిర్మించాల్సి ఉంటుంది. ఎల్బీనగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు విస్తరించినా రాయదుర్గం రూట్ కంటే తక్కువ ఖర్చే అవుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన రూట్లలోనే ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణం చేపడితే నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు వెంటనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓల్డ్‌సిటీ మెట్రో నిర్మాణం కూడా వెంటనే చేపట్టాలి. ఈ రెండు రూట్లు పూర్తయితే గానీ ఎయిర్‌పోర్టు వరకు విస్తరణ సాధ్యం కాదు. ప్రతిపాదించిన ప్రాజెక్టులను సకాలంలో చేపట్టినా ప్రయాణికులకు అందుబాటులోకి రావడానికి కనీసం ఐదేళ్లు పట్టవచ్చని అంచనా. రియల్ ఎస్టేట్ డీలా పడే ప్రమాదం.. రాయదుర్గం– శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రూట్‌ను నిలిపివేయడం పట్ల ఐటీ, రియల్ ఎస్టేట్ వర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 500 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఐటీ నిపుణులు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రతిరోజూ ఎయిర్‌పోర్టు నుంచి ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగిస్తారు. ఈ రూట్లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో అందుబాటులోకి రానుండడంతోనే ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ భూముల ధరలు పెరిగాయి. కోకాపేట్, బుద్వేల్ తదితర ప్రాంతాల్లో అనూహ్యమైన రియల్ భూమ్ కనిపించింది. తాజాగా ఈ రూట్‌ను నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రియల్ ఎస్టేట్ డీలా పడుతుందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. -
అయోధ్య చేరుకోనున్న మొదటి ఫ్లైట్ ఇదే.. ఎప్పుడో తెలుసా?
అయోధ్య రామమందిరం ప్రారంభ ఏర్పాట్లతో పాటు ఎయిర్‌పోర్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 22న శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నట్లు ఇప్పటికే తెలిసింది. అంతకంటే ముందు అయోధ్య విమానాశ్రయంలో డిసెంబర్ 30న మొదటి విమానాన్ని నడపనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీ నుంచి అయోధ్య విమానాశ్రయానికి డిసెంబర్ 30న తొలి విమానాన్ని నడపనున్నట్లు ఇండిగో ప్రకటించింది. అయోధ్యలోని మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నెలాఖరులోగా సిద్ధమవుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల వెల్లడించారు. ఢిల్లీ - అయోధ్య మధ్య 2024 జనవరి 10 నుంచి ఇండిగో విమానాలు ఢిల్లీ నుంచి అయోధ్యకు ప్రతి రోజు తిరిగే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి ఉదయం 11:55 గంటలకు బయలుదేరి 1:15 గంటలకు అయోధ్యకు చేరుతుంది. ఆ తరువాత 1:45 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:00 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. ప్రతి రోజూ ఇదే షెడ్యూల్లో విమానాలు నడుస్తాయి. ఇదే చదవండి: అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా? ఢిల్లీ - అహ్మదాబాద్ మధ్య అహ్మదాబాద్ నుంచి మంగళవారం, గురువారం, శనివారం మాత్రమే విమానాలు అయోధ్యకు చేరుకుంటాయి. ఈ రోజుల్లో ఉదయం 9:10 గంటలకు బయలుదేరి 11:00 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. ఆ తరువాత 11:30 గంటలకు అయోధ్య నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 1:40 గంటలకు అహ్మదాబాద్ చేరుకునే అవకాశం ఉంది. Launching flights to #Ayodhya from #Ahmedabad and #Delhi starting 30th December 2023. Fares starting at ₹2,999. Book now https://t.co/kQiEKSPfat. #goIndiGo #NewDestination #IndiaByIndiGo pic.twitter.com/L4p1iMHm1R — IndiGo (@IndiGo6E) December 14, 2023 -
కొత్త మెట్రోరూట్‌తో డిస్టెన్స్ తక్కువ, వయబులిటీ ఎక్కువ?
ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి 'రేవంత్ రెడ్డి' కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించిన మెట్రోరైల్ విస్తరణ అలైన్‌మెంట్‌ను నిలిపివేయాలని ఆదేశించారు. దానికి బదులు ఎంజీబీఎస్, ఎల్బీనగర్ మార్గాల్లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైల్ పొడిగింపుపై ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న మెట్రో అలైన్మెంట్ ఔటర్ రింగ్ రోడ్డుగుండా వెలుతుందని, దీని ద్వారా ఇప్పటికే ఔటర్‌రింగ్ రోడ్డు, జీవో 111 ప్రాంతాల్లో ఎంతో అభివృద్ధి జరిగింది. ఇప్పుడు అభివృద్ధికి నోచుకోలేని రూట్స్ ద్వారా ఎయిర్ పోర్ట్ మెట్రో అలైన్మెంట్ ఉండేలా డిజైన్‌ను మార్చాలని సీఎం సూచించారు. కొత్త ప్రణాళికల ద్వారా హైదరాబాద్ నగరం నలువైపులా అభివృద్ధి సమానంగా జరుగుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ జనాభా ఎక్కువగా సిటీ మధ్యలో, తూర్పు ప్రాంతంలో, పాతబస్తీలో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేందుకు మెట్రో అలైన్మెంట్ మార్చేలా ప్రణాళికలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి హైదారాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్‌కు సూచించారు. దీన్ని బట్టి ఎంజీబీఎస్, ఓల్డ్‌సిటీ, ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు మార్గాన్ని ఎంచుకోవడం లేదా.. ఇప్పటికే ఎల్బీనగర్ రూట్లలో మెట్రో ఉంది కాబట్టి, చాంద్రాయణగుట్ట రూట్ ద్వారా ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణం చేపట్టేలా చూడాలని HMRL ఎమ్‌డిని కోరారు. దీని ద్వారా ఎక్కువ మంది ప్రజలు మెట్రోను వినియోగించుకునే అవకాశంతో పాటు అటు మెట్రోరైల్‌కు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా మైండ్ స్సేస్ రూట్ ద్వారా మెట్రో నిర్మిస్తే దాదాపుగా 31 కిలోమీటర్ల మేర దూరం ఉంటుంది. అదే ఎల్బినగర్ రూట్ ద్వారా నిర్మిస్తే ఈ డిస్టెన్స్ మరో 5 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది. ఈ రూట్లో పెద్దగా మలుపులు ఉండే అవకాశం లేదు. ఈ మార్గాల్లో మెట్రో నిర్మించడం వల్ల వ్యయం కూడా తగ్గుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రోను శ్రీశైలం రోడ్డు నుంచి తుక్కుగూడ వరకు పొడిగించే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. మొదటి ఫేజ్‌లో నిర్మించకుండా మిగిలిపోయిన పాతబస్తీలోని 5.5 కిలోమీటర్ల మెట్రో రైల్‌ను ఎల్అండ్టీ ఇప్పటివరకు నిర్మించకపోవడంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రూట్ పూర్తైతే పాతబస్తీ అభివృద్ధి జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఎక్స్‌ప్రెస్ ఎయిర్పోర్ట్ మెట్రోకు సంబంధించి 6 వేల 250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని తొలత నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 27.5 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ కాగా.. విమానాశ్రయం సమీపంలో 2.5 కిలోమీటర్లు భూగర్భంలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. మిగతా కిలోమీటర్ మేర రోడ్డుకు సమాంతరంగా ఉంటుంది. మొత్తంగా 8 నుంచి 9 స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. విమానాశ్రయంలో రెండు మెట్రో స్టేషన్లు నిర్మించాలనుకున్నారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత జరిగిన సమీక్షలో కీలక మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక వేల రూట్ మార్చాల్సి వస్తే ఎయిర్‌పోర్టు మెట్రో ప్రస్తుత అలైన్మెంట్ నిలిపివేయాల్సి వస్తే జీఎంఆర్‌తో కుదుర్చకున్న ఒప్పందంపై కూడా నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో పాటు ప్రస్తుతం నగర జనాభా 2 కోట్లకు చేరువలో ఉంది, భవిష్యత్తులో ఈ సంఖ్య 3 కోట్లకు చేరే అవకాశం ఉంది. జనాభా పెరుగుదలను, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఔటర్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లను, తూర్పు నుంచి పడమర వరకు.. మూసీ మార్గంలో నాగోల్ నుంచి గండిపేట్ దాకా ఎంజీబీఎస్‌ను కలుపుతూ రోడ్, మెట్రో కనెక్టివిటీ ఉండేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయనుంది. -
నీట మునిగిన ఎయిర్ పోర్ట్..
-
విమానాశ్రయానికి బెదిరింపు... రూ.8.3 కోట్లకు డిమాండ్!
ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను పేల్చివేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈమెయిల్ పంపిన వ్యక్తి 48 గంటల్లో బిట్‌కాయిన్ రూపంలో 1 మిలియన్ డాలర్లు(రూ.8.3 కోట్లు) డిమాండ్ చేసినట్లు సమాచారం. quaidacasrol@gmail.com ద్వారా బెదిరింపు ఈమెయిల్ పంపినందుకు గుర్తు తెలియని వ్యక్తిపై సహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఫీడ్‌బ్యాక్ ఇన్‌బాక్స్‌కు మెయిల్ వచ్చినట్లు తెలిసింది. ‘బిట్‌కాయిన్‌లో 1 మిలియన్ డాలర్లు(రూ.8.3 కోట్లు) బదిలీ చేయకపోతే 48 గంటల్లో టెర్మినల్ 2ను పేల్చేస్తాం. 24 గంటల తర్వాత మరొక హెచ్చరిక ఉంటుంది’ అని మెయిల్ వచ్చింది. ఇదీ చదవండి: 2 బిలియన్లు ఇన్వెస్ట్ చేస్తాం, కానీ.. : టెస్లా దాంతో ఆ వ్యక్తిపై ఐపీసీ సెక్షన్లు 385(బలవంతపు వసూళ్లు), 505(1)(బి) (ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రకటనలు చేయడం) కింద కేసు నమోదు చేశారు. బెదిరింపు మెయిల్ నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రతను పెంచారు. ప్రాథమిక విచారణలో ఈమెయిల్ పంపిన ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐసీ) చిరునామాను పోలీసులు ట్రాక్ చేశారు. పోలీస్ సైబర్ విభాగం మెయిల్ లొకేషన్‌ను గుర్తించినట్లు సమచారం. -
ఇంఫాల్ గగనతలంలో కలకలం.. రంగంలోకి రఫెల్
ఇంఫాల్: ఇంఫాల్ ఎయిర్‌పోర్టుపై గుర్తు తెలియని వస్తువు(యూఎఫ్ఓ)ను గాలించేందుకు భారత వాయుసేన రఫెల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. హసిమారా నుంచి రెండు రఫెల్ విమానాలను ప్రయోగించింది. కానీ రఫెల్ విమానాలు ఆ అనుమానిత వస్తువును గుర్తించలేకపోయాయి. ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో తిరిగొచ్చాయని అధికారులు తెలిపారు. గగనతలంలో గుర్తుతెలియని వస్తువులు ఆదివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం సృష్టించాయి. రెండు గుర్తు తెలియని వస్తువులు మధ్యాహ్నం 2.30 నుంచి నాలుగింటి దాకా రన్‌వే పరిసరాల్లో ఎగురుతూ కనిపించినట్టు అధికారులు తెలిపారు. దాంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయాన్ని మూసేశారు. అయితే.. ఈ ఘటన జరిగిన వెంటనే ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజంను యాక్టివేట్ చేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈస్టర్న్ కమాండ్ తెలిపింది. ఈ పరిణామాల తర్వాత ఆ వస్తువు కనిపించకుండా పోయిందని తెలిపారు. గుర్తు తెలియని వస్తువులను పసిగట్టడానికి వాయు సేన హషిమార నుంచి రఫెల్ యుద్ధ విమానాన్ని పంపించింది. అత్యాధునిక సెన్సార్లు కలిగిన ఈ విమానం అత్యంత ఎత్తులో గాలించినప్పటికీ ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో వెనక్కి వచ్చింది. కాసేపటికీ మరో రఫెల్‌ను అధికారులు పంపించారు. అప్పుడు కూడా ఎలాంటి వస్తువు కనిపించకలేదని అధికారులు తెలిపారు. యూఎఫ్‌వో కారణంగా మూడు గంటల పాటు విమానరాకపోకలకు అంతరాయం కలిగింది. ఇదీ చదవండి: Uttarakhand Tunnel Collapse: ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు -
Video: ఐదేళ్ల తర్వాత ప్రియుడిని కలిసిన యువతి.. ఎయిర్‌పోర్టులో సర్ప్రైజ్
ప్రేమ ఒక అద్భుతమైన భావోద్వేగం, ప్రేమించడం మాటల్లో చెప్పలేని ఒక ప్రత్యేక అనుభూతి. ప్రేమను మాటల్లోనే కాదు.. మన భావాలు, పనుల ద్వారా గొప్పగా చెప్పవచ్చు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్లో ప్రేమ భిన్నంగా ఉంటుంది. ప్రేమించిన వారు దూరంగా ఉన్న వారి మనసులు మాత్రం దగ్గరగా ఉంటాయి. పక్కన లేకపోయినా, రోజూ కలవకపోయినా ఆప్రేమ అలాగే ఉంటుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే అయిదు సంవత్సరాల తరువాత కలవబోతున్న తన ప్రియుడికి ఓ యూవతి వినూత్నంగా స్వాగతం చెప్పాలనుకుంది. ఎంతో కాలంగా దూరంగా ఉన్న ప్రియుడి కోసం ఆలోచించి వినూత్నంగా వెల్కమ్ చెప్పింది. ఎయిర్‌పోర్టులో అతడి ముందు ఎంతో అందంగా డ్యాన్స్ చేసి తన ప్రేమను వ్యక్త పరిచింది. ఈ దృశ్య కావ్యానికి ఈ కెనడాలోని ఎయిర్‌పోర్టు వేదికగా మారింది. ఓ యువకుడు లగేజ్‌తో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవగానే కొంతమంది అతనికి గులాబి పువ్వులు ఇచ్చి స్వాగతం పలుకుతారు. కానీ అతడు మాత్రం తన ప్రేయసి ఎక్కడుందంటూ వెతుకుతూ ఉంటాడు. ఇంతలోనే యువతి ఎదురుపడి ఎవరూ ఊహించని విధంగా ప్రియుడికి వెల్కమ్ చెప్పింది. బాలీవుడ్ మూవీ షేర్షాలోని ‘రతన్ లంబియాన్’ పాటకు ఎంతో డ్యాన్స్ చేసింది. ప్రేమికుడిని దగ్గరగా చూస్తూ అయిదు సంవత్సరాలు తన కోసం వేచి ఉన్న నిరీక్షణను సాంగ్, డ్యాన్స్ రూపంలో అతడికి తెలియజేసింది. క్యూట్ స్టెప్పులతో ఆహా అనిపించింది. ప్రియురాలి సర్ప్రైజ్కు ఉబ్బితబ్బైన వ్యక్తి.. ఆమె మరో పాటకు డ్యాన్స్ చేయాల్సి ఉండగానే దగ్గరకొచ్చి గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఈ వీడియోను నిక్కి షా అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 3 మిలియన్లకు పైగా వ్యూస్వచ్చాయి. ఒకటిన్నర లక్ష మంది లైక్ చేశారు. View this post on Instagram A post shared by Niki | Toronto Content Creator (@_nikishah) -
Interesting World Facts: ఆశ్చర్యం కలిగించే ప్రపంచ నిజాలు
-
పారిస్ ఎయిర్ పోర్టులో నమాజ్.. సమర్థించుకున్న ప్రభుత్వం!
ఇజ్రాయెల్- హమాస్ మధ్య నెల రోజులుగా యుద్ధం నడుస్తోంది. ఈ యుద్ధం కారణంగా ఫ్రాన్స్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పారిస్‌లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయం డిపార్చర్ హాల్లో 30 మంది ముస్లింలు నమాజ్ చేశారు. విమానాశ్రయంలోని టెర్మినల్ 2లో ఈ ప్రార్థనలు జరిగాయి. ఈ ఉదంతంపై ఫ్రాన్స్ మాజీ మంత్రి నోయెల్ లెనోయ్ స్పందిస్తూ ఎయిర్ పోర్టులో నమాజ్ చేయడం విచారకరమని అన్నారు. ప్రార్థనల కోసం తగిన ప్రార్థనా స్థలాలు ఉన్నాయని, అక్కడ వీటిని నిర్వహించుకోవాలని అన్నారు. ఎయిర్ పోర్టులో ఇలాంటి చర్యలను అరికట్టాలని, నిఘా మరింతగా పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. విమానాశ్రయం ప్రార్థనా స్థలంగా మారినప్పుడు సీఈఓ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా ‘విమానాశ్రయంలో ప్రత్యేక ప్రార్థన స్థలం అందుబాటులో ఉందని, ఎయిర్‌పోర్టులో నిబంధనలను అమలు చేసేందుకు విమానాశ్రయ అధికారులు కట్టుబడి ఉన్నారని ఫ్రెంచ్ రవాణా మంత్రి క్లెమెంట్ బ్యూన్ ట్విట్టర్లో తెలిపారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధ నేపధ్యంలో ముస్లింలకు మద్దతుగా పారిస్ ఎయిర్‌పోర్టులో నమాజ్ చేశారని భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: మనిషి దీర్ఘాయుష్షు ఎంత? -
హాంబర్గ్ విమానాశ్రయంలో కాల్పుల కలకలం..
జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలోకి చొరబడిన ఓ ఆగంతకుడు కాల్పుల కలకలం సృష్టించాడు. శనివారం రాత్రి విమానాశ్రయంలోకి కారుతో సహా దూసుకువచ్చిన ఆగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో విమానాశ్రయంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటన దరిమిలా హాంబర్గ్ విమానాశ్రయంలో ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. ‘కస్టడీ వివాదం’ ఈ ఘటనకు కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి సుమారు 8 గంటలకు ఒక అగంతకుడు కారులో భద్రతా ప్రాంతం గుండా ఎయిర్‌స్ట్రిప్‌కి ఆనుకొని ఉన్న రహదారి పైకి కారుతో సహా దూసుకువచ్చాడు. అనంతరం తుపాకీతో రెండుసార్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. కాగా ప్రస్తుతానికి విమానాల టేకాఫ్‌లు, ల్యాండింగ్లను నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 27 విమానాలు దెబ్బతిన్నాయని సమాచారం. కాల్పులు జరిపిన ఆ వ్యక్తి కారులో నుండి రెండు మండుతున్న బాటిళ్లను బయటకు విసిరినట్లు పోలీసులు తెలిపారు.దీంతో మంటలు చెలరేగాయన్నారు. ఇది కూడా చదవండి: నేపాల్‌లో మళ్లీ భూప్రకంపనలు.. తీవ్రత ఎంతంటే.. -
ఆ టైంలోనే అతిపెద్ద అండర్‌గ్రౌండ్ ఎయిర్‌పోర్టు..కానీ ఇప్పుడది..
అమెరికా–సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ప్రబలంగా ఉన్న రోజుల్లో ఉభయ శిబిరాలకు పరస్పర ‘అణు’మానాలు ఉండేవి. అందువల్ల ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండేవారు. తమ తమ భూభాగాల్లోని రహస్య ప్రదేశాల్లో అణుబాంబులు మీదపడ్డా చెక్కుచెదరని బంకర్లు నిర్మించుకున్నారు. అప్పట్లో సోవియట్ రష్యా అణుబాంబులను తట్టుకునే భూగర్భ విమానస్థావరాన్ని నిర్మించుకుంది. క్రొయేషియా సరిహద్దుల్లో ప్లజెసెవికా కొండ నడిబొడ్డున నిర్మించిన ఈ జెల్జావా భూగర్భ విమానస్థావరం ప్రపంచంలోని భూగర్భ విమానస్థావరాల్లోనే అతిపెద్దది. అయితే, మూడు దశాబ్దాలుగా ఇది నిరుపయోగంగా పడి ఉంది. సెర్బో–క్రొయేషియన్ యుద్ధం 1992లో మొదలైనప్పటి నుంచి దీని వినియోగం నిలిచిపోయింది. ఇది కేవలం భూగర్భ విమానస్థావరం మాత్రమే కాదు, ఇందులో అనేక సౌకర్యాలు ఉన్నాయి. సోవియట్ పాలకులు 1960లోనే దీనిని 600 కోట్ల డాలర్ల (సుమారు రూ.50 వేల కోట్లు) ఖర్చుతో నిర్మించుకున్నారు. ఏకంగా 20 కిలోటన్నుల అణువిస్ఫోటాన్ని తట్టుకునేంత శక్తిమంతంగా దీనిని రూపొందించారు. ఇందులో విద్యుదుత్పాదన కేంద్రం, మంచినీటి వడబోత కేంద్రం, గాలి వెలుతురు సోకేందుకు అనువైన నడవలు, వెయ్యిమంది సైనికాధికారులు, సైనిక సిబ్బంది కోసం డార్మిటరీలు, యంత్రాల సాయంతో తెరుచుకునే వంద టన్నుల కాంక్రీటు ద్వారాలు ఉన్నాయి. సైనికులకు అవసరమైన ఆహార పదార్థాలు, ఆయుధాలు నిల్వచేసుకునేందుకు కట్టుదిట్టమైన గిడ్డంగులు ఉన్నాయి. క్రొయేషియా ప్రభుత్వం దీనిని మ్యూజియంగా మార్చింది. ఏటా దాదాపు 1.50 లక్షల మంది పర్యాటకులు ఈ మ్యూజియంను సందర్శిస్తుంటారు. (చదవండి: అద్భుతమైన డెవిల్స్ బ్రిడ్జ్! ఆ నిర్మాణం ఓ అంతుచిక్కని మిస్టరీ!) -
హైదరాబాద్‌కు చేరుకున్న మెగా కోడలు.. ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం!
మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ ఏడాది జూన్‌లో ఎంగేజ్మెంట్ వీరిద్దరూ ఇటలీ వేదికగా జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌తో వివాహాబంధంలో అడుగుపెట్టారు. వీరి పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్, నితిన్ దంపతులు పాల్గొన్నారు. దాదాపు మూడు రోజుల పాటు టుస్కానీలో ఈ వేడుకలు జరిగాయి. ఈ గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలను నెట్టింట తెగ వైరలయ్యాయి. (ఇది చదవండి: రాహుల్ సిప్లిగంజే ఆ పర్సనల్ ఫోటోలు లీక్ చేశాడు: రతిక సోదరి) అయితే తాజాగా ఈ జంట హైదరాబాద్‌కు చేరుకున్నారు. పెళ్లి వేడుకల అనంతరం తొలిసారిగా మెగా కోడలి హోదాలో లావణ్య త్రిపాఠి నగరంలో అడుగుపెట్టారు. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన నూతన దంపతులకు ఘనస్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వీరితో పాటే మెగాస్టార్ ఫ్యామిలీ, రామ్ చరణ్- ఉపాసన కూడా హైదరాబాద్ వచ్చేశారు. కాగా.. సినీ ప్రముఖుల కోసం ఈనెల 5న గ్రాండ్ రిసెప్షన్ వేడుక జరగనుంది. మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. View this post on Instagram A post shared by Telugu FilmNagar (@telugufilmnagar) #TFNExclusive: Love birds @IAmVarunTej & @Itslavanya get papped at HYD airport as they jet off to Italy for their wedding ceremony, along with #NiharikaKonidela & #PanjaVaisshnavTej!!😍❤️#VarunTej #LavanyaTripathi #VarunLav #TeluguFilmNagar pic.twitter.com/2Cmy18sCtB — Telugu FilmNagar (@telugufilmnagar) October 27, 2023 #TFNExclusive: Visuals of the lovely couple @IAmVarunTej & @Itslavanya arriving at Hyderabad airport!!😍#VarunTej #LavanyaTripathi #VarunLav #TeluguFilmNagar pic.twitter.com/BJtp0E1JDQ — Telugu FilmNagar (@telugufilmnagar) November 4, 2023 -
విశాఖకు కొత్త విమాన సర్వీసులు
స్పైస్ జెట్ నడపనున్న విమానాల సంఖ్య : 5 ఎప్పటి నుంచి : జనవరి ఎక్కడెక్కడకు...: హైదరాబాద్, కోల్‌కతా,జార్సిగుడలకు డైలీ చెన్నై, బెంగళూరుకు వారంలో మూడు,నాలుగు రోజులు ఇండిగో నడపనున్న విమానాలు : 2 ఎప్పటి నుంచి : నవంబరు 15 నుంచి కోల్‌కతాకు, 16 నుంచి బెంగళూరుకు.. ఎక్కడెక్కడకు...: కోల్‌కతా, బెంగళూరులకు డైలీ సర్వీసులు సాక్షి, విశాఖపట్నం: విశాఖకు కొత్త విమాన సర్వీసులు రానున్నాయి. ఒకవైపు ప్రయాణికుల రద్దీ అధికమవుతుండడం, మరోవైపు పరిపాలనా రాజధాని కానుండడంతో విమానయాన సంస్థలు విశాఖ వైపు ఆసక్తి చూపుతున్నాయి. విశాఖపట్నానికి స్పైస్ జెట్ ఐదు, ఇండిగో సంస్థ రెండు విమాన సర్వీసులు నడపడానికి అనుమతులు తెచ్చుకున్నాయి. ఈ విమానాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలతో పాటు ఒడిశాలోని జార్సిగుడ ఎయిర్‌పోర్టుకు కూడా నడపడానికి సంబంధిత సంస్థలు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. వీటిలో స్పైస్ జెట్ హైదరాబాద్, కోల్‌కతా, జార్సిగుడలకు డైలీ, చెన్నై, బెంగళూరులకు వారంలో మూడు, నాలుగు రోజులు చొప్పున నడపనుంది. అలాగే ఇండిగో సంస్థ కోల్‌కతా, బెంగళూరులకు రోజూ తమ విమానాలను నడపాలని నిర్ణయించింది. స్పైస్ జెట్ సంస్థ జనవరి నుంచి విశాఖకు తమ సర్వీసులను నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇండిగో సంస్థ నవంబర్ 15 నుంచి కోల్‌కతాకు, 16 నుంచి బెంగళూరుకు నడపనుంది. కోల్‌కతా సర్వీసు సాయంత్రం 6.55 గంటలకు, బెంగళూరు సర్వీసు ఉదయం 10.30 గంటలకు బయలుదేరనుంది. కాగా ఈ ఎయిర్‌పోర్టుకు ప్రయాణికుల రద్దీ కోవిడ్‌కు ముందు పరిస్థితికి చేరుకుంటోంది. కోవిడ్‌కు ముందు ఏటా 2.85 మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగించే వారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్యకు దానికి చేరువలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరుకు అది 3 మిలియన్లకు చేరుతుందని ఎయిర్‌పోర్టు అధికారులు అంచనా వేస్తున్నారు. తొలిసారిగా జార్సిగుడకు.. ఇప్పటివరకు విశాఖపట్నం నుంచి ఒడిశాలోని జార్సిగుడకు విమాన సర్వీసులు లేవు. తొలిసారిగా స్పైస్ జెట్ సంస్థ పారిశ్రామిక ప్రాంతమైన జార్సిగుడకు విమాన సర్వీసును నడపాలన్న నిర్ణయం తీసుకుంది. విశాఖ–జార్సిగుడల మధ్య ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉందన్న అంచనాతో స్పైస్ జెట్ తమ విమానాన్ని నడపడానికి ముందుకొచ్చింది. శ్రీలంక–విశాఖల సర్వీసు పునరుద్ధరణ మరోవైపు శ్రీలంక–విశాఖల మధ్య నిలిచిపోయిన విమాన సర్వీసుమళ్లీ పునరుద్ధరణ కానుంది. 2017లో కొలంబో–విశాఖ మధ్య శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ తమ విమాన సర్వీసును ప్రారంభించింది. అయితే కోవిడ్ సమయంలో ఈ సర్వీసు రద్దు అయింది. త్వరలోనే ఆ విమాన సరీ్వసును పునరుద్ధరించనున్నట్టు ఎయిర్‌పోర్టు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విశాఖ నుంచి సింగపూర్‌కు ఒకే ఒక్క అంతర్జాతీయ విమాన సర్వీసు నడుస్తోంది. గతంలో బ్యాంకాక్, దుబాయ్‌లకు కూడా ఇక్కడ నుంచి నడిచేవి. త్వరలో కొలంబో సర్వీసును కూడా పునరుద్ధరిస్తే ఈ ఎయిర్‌పోర్టు నుంచి రెండు అంతర్జాతీయ సర్వీసులు నడిచినట్టవుతుంది. -
రావణుని వైభోగం ఎంత? అవశేషాలు ఎక్కడున్నాయి?
దసరా రోజున రావణ దహనం చేస్తారు. ఇది మనలోని చెడును కాల్చివేయాలనే సందేశాన్ని అందిస్తుంది. అయితే ఇప్పుడు మనం రావణ దహనం గురించి కాకుండా రావణుని వైభోగం గురించి తెలుసుకోబోతున్నాం. రావణుడు ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపాడో? అతని రాజభవనం ఎంత విలాసవంతమైనదో ఈ కథనంలో తెలుసుకుందాం. నేడు శ్రీలంకలో కనిపించే ‘సిగిరియా’ ఒకప్పుడు రావణుడి లంక అని చెబుతారు. రావణునికి ఇక్కడ ఒక పెద్ద రాతిపై ఒక రాజభవనం ఉందని, అక్కడ అతను సురక్షితంగా నివసించాడని స్థానికులు చెబుతారు. ఇక్కడికి సమీపంలో ఒక ప్రత్యేక విమానాశ్రయం ఉందని, అక్కడ నుండే రావణుని పుష్పక విమానం ఎగురేదని చెబుతారు. ఆనాటి కాలానికి అనుగుణంగా రావణుడి రాజభవనం పలు ఆధునిక సౌకర్యాలతో ఉండేది. రావణుని రాజభవనానికి లిఫ్ట్ సౌకర్యం ఉందని, నీటి నిర్వహణకు ఆధునిక వ్యవస్థ కూడా ఉండేదని చెబుతారు. మీడియా కథనాల ప్రకారం శ్రీలంకలోని సిగిరియా రాతిపై పురాతన ప్యాలెస్ అవశేషాలు కనిపించాయి. ఇక్కడి రాగైలా అడవుల్లో రావణుని మృతదేహాన్ని దాదాపు 8 వేల అడుగుల ఎత్తులో ఉంచినట్లు శ్రీలంక మీడియా పేర్కొంది. దానిని మమ్మీ రూపంలో ఉంచారని చెబుతారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. శ్రీలంకలో రావణుని ప్యాలెస్ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇది కూడా చదవండి: ఇందిర ‘మూడవ కుమారుడు’ ఎవరు? -
Karimnagar: విమానం ఎగిరేనా? ఏళ్లుగా పరిష్కారం నోచుకొని సమస్యలు ఇవే..
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. 31,12,283 లక్షల మంది ఓటర్లు ఈసారి ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఓటర్ల సంఖ్య రాష్ట్రం మొత్తం ఓటర్లలో 10వ శాతం కావడం గమనార్హం. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో కరీంనగర్.. అప్పటి హైదరాబాద్ రాష్ట్రం నుంచే తన ఘనత చాటుకుంటోంది. రాజకీయంగా ప్రభావం చేయగలిగిన ఈ జిల్లాలో కొన్ని సమస్యలు ఏళ్లుగా పరిష్కారం నోచుకోకుండా మిగిలిపోయాయి. గోదా‘వర్రీ’ పెద్దపల్లి జిల్లాలో ప్రవహించే గోదావరి నదీజలాలు కాలుష్యపు కోరల్లో చిక్కుకున్నాయి. రామగుండం కార్పొరేషన్ డ్రైనేజీ నీరు, రసాయనాలను నేరుగా నీటిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీల నిర్మాణంతో ఏడాది పొడువునా నీరు నిల్వ ఉంటుంది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో రోజుకు సుమారు 70మిలియన్ లీటర్ల నీటిని ప్రజలు వినియోగిస్తున్నారు. అందులోంచి రోజుకు 40మిలియన్ లీటర్ల మురుగు గోదావరిలో కలుస్తుంది. ఆదాయపన్ను, మారుపేర్లు, ప్రైవేటీకరణ భూతం రామగుండం సింగరేణిలో రెండున్నర దశాబ్దాల కాలంగా మారుపేర్ల మార్పిడికి చట్టబద్ధత కోసం కోసం కార్మికులుఎదురుచూస్తున్నారు. గతంలో ఈ సమస్య పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చినా ఇంకా అమలుకు నోచుకోలేదు. మరోవైపు తమకు ఆదాయపు పన్ను మినహాయించాలని డిమాండ్ కోరుతున్నారు. అలాగే కోల్ బ్లాకులను ప్రైవేటు పరం చేయవద్దని కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. విమానం ఎగిరేనా..? 1980లో కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ అధినేత బీకే బిర్లా వచ్చేందుకు 294 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం నిర్మా ణం చేపట్టారు. 21 సీట్ల సామర్థ్యం ఉన్న చిన్న విమానాలు రాకపోకలు సాగించేవి. 2009లో దీన్ని రామగుండం ఎయిర్‌పోర్టు పేరిట అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు నడిచినా అవి అటకెక్కాయి. 2016లో ఉడాన్ పథకంలో భాగంగా 2020లో ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ఇండియా రాష్ట్ర ప్రభుత్వంతో పలు భౌగోళిక సర్వేలు నిర్వహించినా అడుగు ముందుకు పడలేదు. నాలుగోసారి నిర్వాసితులు.. కరీంనగర్ జిల్లాలో అదనపు టీఎంసీ కాలువ పనుల్లో భాగంగా రామడుగు, గంగాధర మండలాల్లో పలువురు నిర్వాసితులు నాలుగోసారి భూమిని కోల్పోతున్నారు. ఎవరైనా ఒకసారి కోల్పోవడం సాధారణం, రెండుసార్లు కోల్పోవడమే అరుదు. కానీ, ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి పనుల వల్ల ఈ మండలాల్లో కొన్ని గ్రామాలవారు నాలుగు తరాలుగా నిర్వాసితులుగా మారిపోయారు. ఈఎస్ఐ ఆస్పత్రి కావాలి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్షలాది మంది బీడీ కారి్మకులు ఉన్నారు. మున్సిపల్, పలు పరిశ్రమల్లో పనిచేసేవారికి ప్రతి నెలా వేతనం నుంచి ఈఎస్ఐ కట్ అవుతుంది. కానీ, ఈఎస్ఐ ఆస్పత్రి ఉమ్మడి జిల్లాలో రామగుండంలో ఉంది. అసలు రామగుండంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఉందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. అత్యవసరాల్లో శస్త్రచికిత్స సమయంలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలవుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒక ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని లక్షలాది మంది కార్మికులు కోరుతున్నారు. తెలంగాణలో కొన్ని రాజకీయ కుటుంబాల ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుంది. వాటిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గురించి ముందుగా తెలుసుకోవాలి. అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ 1962 నుంచి 2004 వరకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు నిర్వహిస్తే, 1994లో అసద్ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికీ కొనసాగగుతున్నారు. 1999 నుంచి అసద్ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తున్నారు. ఆ రకంగా అరవై ఒక్క సంవత్సరాలుగా ఒవైసీ కుటుంబం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటం విశేషం. ఆ కుటుంబం పదిమార్లు లోక్‌సభకు సలావుద్దీన్ 1962 నుంచి అయిదుసార్లు శాసనసభకు, ఆరుసార్లు ఎంపీగా హైదరాబాద్ నుంచి గెలుపొందారు. అసద్ రెండుసార్లు చార్మినార్ నుంచి అసెంబ్లీకి, తదుపరి 2004 నుంచి నాలుగుసార్లు హైదరాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక అక్బరుద్దీన్ ఒవైసీ చంద్రాయణగుట్ట నుంచి 1999 నుంచి వరుసగా అయిదు సార్లు గెలిచారు. 1999 లో తండ్రి లోక్‌సభకు, ఇద్దరు కుమారులు అసెంబ్లీకి ఎన్నికవడం ఒక ప్రత్యేకత. సలావుద్దీన్, అసద్ కలిసి ఇంతవరకు పదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారన్నమాట. తండ్రి, ఇద్దరు కుమారులు కలిసి పన్నేండుసార్లు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. చదవండి: -
డిసెంబర్లోనే అయోధ్య ఎయిర్పోర్ట్ సేవలు!
న్యూడిల్లి: అయోధ్యలోని భవ్య రామ మందిరం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే అంతకంటే ముందే అయోధ్యలో ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే విమానశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అంతా సజావుగా సాగితే ఈ ఏడాది డిసెంబరులోనే ఇక్కడి నుండి రాకపోకలు మొదలయ్యే అవకాశముందని చెబుతోంది సివిల్ ఏవియేషన్ శాఖ. బ్లూప్రింట్ విడుదల.. అయోధ్య రామ మందిరం ప్రారంభానికి ముందు.. డిసెంబరులోనే ఇక్కడి ఎయిర్‌పోర్టు సేవల అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మర్యాద పురుషోత్తమ శ్రీరామ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా పిలవబడే.. ఈ పోర్టు విస్తీర్ణంలో కూడా ఇప్పుడున్న ఎయిర్‌పోర్టుకి ఐదు రేట్లు పెద్దదిగా ఉండబోతోందని విమానయాన శాఖ అధికారులు విడుదల చేసిన బ్లూప్రింట్‌లో స్పష్టమవుతోంది. హైదరాబాద్‌కు సేవలు? ఇప్పటికే మొదటి దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయని మొదటిగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు హైదరాబాద్ నగరాలకు విమాన సేవలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశాయి అయోధ్య ఎయిర్‌పోర్టు వర్గాలు. ఇదిలా ఉండగా ప్రస్తుతమున్న ఎయిర్‌పోర్టులో టెర్మినల్ బిల్డింగ్ విస్తీర్ణం 6520 చ.మీటర్లు కాగా బిజీ సమయాల్లో కనీసం 500 మంది ప్యాసింజర్ల వరకు సౌకర్యవంతంగా ఉండేలా దీనిని నిర్మించారు.ఇక 2200 మీటర్ల పొడవైన రన్‌వే కలిగిన ఈ విమానాశ్రయంలో ఒకేసారి నాలుగు విమానాలను నిలిపే సామర్ధ్యముంది. రెండో దశ నిర్మాణంలో.. బ్లూప్రింట్ ఆధారంగా చూస్తే రెండో దశలో నిర్మించబోయే ఎయిర్‌పోర్టులో భారీ ప్రమాణాలతో కూడిన మరిన్ని సౌకర్యాలు కొలువు తీరబోతున్నట్లు తెలుస్తోంది. 30,000 చ.మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబోయే నూతన టెర్మినల్ భవనం బిజీ సమయాల్లో కనీసం 3200 మంది ప్రయాణికులకు సౌకర్యం కల్పించనున్నారు. ఇక దీనికి 2200 నుండి 3125 మీటర్ల వరకు రన్ వేను ఎక్స్టెండ్ చేయనున్నారు. రెండో దశలో నిర్మించబోయే టెర్మినల్ వద్ద కనీసం ఎనిమిది ఏ-321 విమానాలను పార్క్ చేయవచ్చని బ్లూప్రింట్‌లో స్పష్టమవుతోంది. ప్రారంభోత్సవం ఎప్పుడంటే.. రామమందిరం నిర్మాణం పూర్తికాక ముందే ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మందిరం నిర్మాణం పూర్తయ్యేసరికి భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశముండటంతో రెండో టెర్మినల్ నిర్మాణం ఆవశ్యమని అందుకే దీని నిర్మాణం త్వరితగతిన పూర్తిచేశామని ఈ విమానాశ్రయం భక్తులకు గేట్వేగా వ్యవహరించనుంది తెలిపింది కేంద్ర విమానయాన శాఖ. శరవేగంగా నిర్మాణ పనులను పూర్తి చేసుకుంటున్న ఈ రామ మందిరం ప్రారంభోత్సవం వచ్చే ఏడాది జనవరి 22-24 మధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. #Ayodhya Airport New Terminal construction progress. PC-Ayodhya Story pic.twitter.com/1z4HTrJn0E — Chandrashekhar Dhage (@cbdhage) September 11, 2023 ఇది కూడా చదవండి: గణేష్ మండపంలో బుర్ఖాతో డ్యాన్సులు.. అరెస్టు -
ఎయిర్‌పోర్టు సిబ్బంది చేతివాటం.. సీసీటీవీ కెమెరాలో రికార్డు
ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ ప్రయాణికులు అక్రమంగా బంగారం, డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డ ఘటనలు తరుచూ రావడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఎయిర్‌పోర్టు సిబ్బంది చేతివాటం చూపించారు. అది కూడా ప్రయాణికుడికి సంబంధించిన బ్యాగ్ నుంచి డబ్బులు, వస్తువులు కొట్టేశారు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జరిగింది. అయితే జూన్ 29న జరిగిన ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆలస్యంగా వెలుగులోకి చ్చింది. అసలేం జరిగిందంటే.. మియామి ఎయిర్‌పోర్టులోని చెక్ పాయింట్ వద్ద ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది ప్రయాణికుల సామాన్లను భద్రపరుస్తున్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీ స్కానర్ మెషిన్‌పై ఉంచిన బ్యాగ్‌లో నుంచి 600 డాలర్లను కాజేశారు. ప్రయాణికుల లగేజీని తనిఖీ చేస్తున్నట్లు నటిస్తూ.. ఎవరికి కనపడకుండా మెల్లగా ఆ డబ్బులను బ్యాగ్ నుంచి కాజేసి తన జేబులో వేసుకున్నారు. డబ్బులతోపాటు ఇతర వస్తులను సైతం దొంగిలించాడు. TSA Agents caught on surveillance video stealing hundreds of dollars in cash from passengers’ bags at Miami airport. pic.twitter.com/LhFW9yNRNV — Mike Sington (@MikeSington) September 13, 2023 ఈ దృశ్యాలన్నీ ఎయిర్‌పోర్టులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రయాణికుల వస్తువులు కనిపించకపోవడంతో.. అక్కడున్న సెక్యురిటీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిందితులను టీఎస్ఏ సిబ్బంది 20 ఏళ్ల జోస్యు గొంజాలెజ్, 33 ఏళ్ల లాబారియస్ విలియమ్స్‌గా గుర్తించారు. వారిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులు కలిసి అనేక దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటి వరకు రోజు దాదాపు వెయ్యి డాలర్లు దొంగిలించినట్లు అంగీకరించారు. అలాగే విచారణ పూర్తయ్యే వరకు ముగ్గురిని స్క్రీనింగ్ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. కాగా ఇలాంటి చర్యలను తాము ఉపేక్షించమని, చోరీకి పాల్పడిన వారిని ఆధారాలతో సహా పోలీసులకు అప్పగించామని టీఎస్ఏ ఓ ప్రకటనలో తెలిపింది. -
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ
దొండపర్తి(విశాఖ దక్షిణ): దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం అన్నారు. అందుకే నీతి ఆయోగ్ పైలట్ నగరాల జాబితాలో ముంబై, సూరత్, వారణాసితో పాటు విశాఖకు స్థానం కల్పించినట్లు చెప్పారు. మంగళవారం విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పరిశ్రమల శాఖ అధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడి సహజవనరులతో పాటు రైల్వే, పోర్టు కనెక్టవిటీలు, విమానాశ్రయం విశాఖపట్నం అభివృద్ధికి మరింత దోహదపడుతాయన్నారు. విజన్ ఫర్ ఆంధ్రప్రదేశ్, నగర అభివృద్ధి కోసం ఆర్థిక ప్రణాళికలు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ విశాఖ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. నగర ప్రణాళిక, పర్యాటకం, విద్య, ప్రజారోగ్యం, ఈ–గవర్నెన్స్ తదితర అంశాలపై సాధించిన ప్రగతిని తెలియజేశారు.బీఆర్టీఎస్ నెట్వర్క్, నగరవ్యాప్తంగా మంచినీటి సరఫరా వ్యవస్థ వివరాలను వివరించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా బీచ్ రోడ్డులో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే పరిశ్రమలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల పరిస్థితులను తెలియజేశారు. విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ ఎం.అంగముత్తు మాట్లాడుతూ.. ఒడిశా, తెలంగాణ, కర్ణాటకకు సంబంధించిన పలు ఎగుమతులు, దిగుమతులు కూడా విశాఖ కేంద్రంగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులు పార్థసారధి, పరిశ్రమల శాఖ జీఎం సి.హెచ్.గణపతి, టూరిజం ఆర్డీ శ్రీనివాసరావు, సీపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్ మేటి
సాక్షి, హైదరాబాద్: ఏ నగరమైనా వృద్ధిలోకి రావాలంటే అక్కడి మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, ఈ విషయంలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నా రు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా శనివారం ఏర్పాటు చేసిన 2 రోజుల ‘టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్పో’ మూడవ ఎడిషన్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పల్లెలు సమగ్ర, సమీకృత, సమ తుల్య వృద్ధిలో కొనసాగుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లోని మౌలిక సదుపాయాలు ఇక్కడి రియల్ రంగాన్ని ఉన్నతస్థాయిలో నిలుపుతూ, పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. అయితే విశ్వనగరంగా నిరూపించుకోవడానికి ఈ వృద్ధి సరిపోదని తెలిపారు. 31 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో పూర్తి చేయబోతున్నామని, రానున్న పదేళ్లలో ఓఆర్ఆర్ చుట్టూ దాదాపు 415 కిలో మీటర్ల మెట్రో కోసం ప్రణాళికలు చేపడుతు న్నామని వెల్లడించారు. ముంబై తరువాత అతిపెద్ద 2వ స్కై స్క్రీపర్ నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని, 57 అంతస్తులతో స్కై స్క్రీపర్స్ నిర్మించడానికి ఈ మధ్యనే హెచ్ఎండీఏ 12 అనుమతులను అందించిందని మంత్రి తెలిపారు. విశ్వనగరంగా మారాలంటే నగరం నలుమూలల్లో అభివృద్ధి జరగాలి. దీనికి రియల్ రంగం సహకరించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 40 నుంచి 45 శాతం హైదరాబాద్ నగరం నుంచే ఉత్పత్తి ఉంటుంది. అందుకే నగరాల వృద్ధిపై దృష్టి సారించాలని మంత్రి ప్రత్యేకంగా కోరారు. టీఎస్, ఏపీ రెస్పాన్స్ హెడ్ కమల్ క్రిష్ణన్ మాట్లాడుతూ, టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పోకు విభిన్న వర్గాల నుంచి అనూహ్య స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. -
నేడు విశాఖకు గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షి, విశాఖపట్నం : గవర్నర్ అబ్దుల్ నజీర్ ఐదు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖకు చేరుకోనున్నారు. విశాఖతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా పోర్టు గెస్ట్‌హౌస్‌కి వచ్చి రాత్రి బస చేయనున్నారు. శనివారం ఉదయం నోవాటెల్‌లో జరగనున్న సమాచార కమిషనర్ల జాతీయ సమాఖ్య సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం ఏయూ స్నాతకోత్సవంలో చాన్సలర్ హోదాలో పాల్గొననున్నారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా అరకులోని రైల్వే గెస్ట్ హౌస్‌కు చేరుకోనున్నారు. 11వ తేదీ సాయంత్రం విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరాన్ని సందర్శిస్తారు. 12న రుషికొండలోని సాయిప్రియా రిసార్ట్‌లో జరిగే జైళ్ల శాఖ జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు. మంగళవారం గన్నవరం చేరుకుంటారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. -
విశాఖలో విమాన ప్రయాణికుల జోరు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పరిపాలన రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంతో పాటు కడపకు విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలు అంటే.. ఏప్రిల్ నుంచి జూలై వరకు విమాన ప్రయాణికుల గణాంకాలను గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. విశాఖకు విమాన ప్రయాణికుల సంఖ్యలో 33.93 శాతం వృద్ధి నమోదైనట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. 2022–23 ఏప్రిల్–జూలై మధ్య కాలంలో విశాఖపట్నం నుంచి 7,74,925 మంది ప్రయాణిస్తే ఈ ఏడాది అదే సమయానికి 10,37,656 మంది ప్రయాణించారు. కడప విమానాశ్రయం 36.1 శాతం వృద్ధి నమోదు చేసింది. 2022–23 ఏప్రిల్–జూలై మధ్య 20,289 మంది ప్రయాణించగా.. ఆ సంఖ్య ఈ ఏడాది 27,612కు పెరిగింది. ఇక విజయవాడ ఎయిర్‌పోర్టు 19.3 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రయాణికుల సంఖ్య 3.09 లక్షల నుంచి 3.68 లక్షలకు పెరిగింది. రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు కూడా గణనీయంగా ప్రయాణికులు పెరిగారు. కాగా, ఈ సమయంలో దేశవ్యాప్తంగా ప్రయాణీకుల సంఖ్యలో 22.6 శాతం వృద్ధి నమోదైంది. తిరుపతి, కర్నూలు ఎయిర్‌పోర్టుల్లో మాత్రం ప్రయాణికుల సంఖ్యలో స్వల్ప క్షీణత నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం ఆరు ఎయిర్‌పోర్టుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో 18,84,926 మంది ప్రయాణించారు. దేశం మొత్తం మీద చూస్తే ఆ నాలుగు నెలల కాలంలో విమాన ప్రయాణికుల సంఖ్య 10.04 కోట్ల నుంచి 12.30 కోట్లకు చేరుకుంది. పెరిగిన విదేశీ ప్రయాణికులు రాష్ట్రంలో మూడు విమానాశ్రయాలకు అంతర్జాతీయ హోదా ఉన్నప్పటికీ ప్రస్తుతం విశాఖ, విజయవాడ విమానాశ్రయాల నుంచి మాత్రమే విదేశీ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. త్వరలో తిరుపతి నుంచి గల్ఫ్ దేశాలకు సర్వీసులు ప్రారంభించే విధంగా ప్రభుత్వం కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల కాలంలో అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో గణనీయమైన వృద్ధి నమోదయ్యింది. విశాఖ నుంచి విదేశీ ప్రయాణికుల సంఖ్య 20.9 శాతం వృద్ధితో 20,097 నుంచి 24,143కు చేరితే, విజయవాడలో 14.4 శాతం వృద్ధితో 14,978 నుంచి 17,135కు చేరుకుంది. -
విమానాశ్రయాల్లో చేనేత అమ్మకాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత వస్త్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రధాన కాంప్లెక్స్‌లలో ఆప్కో స్టాల్స్ ఏర్పాటు చేసింది. తాజాగా విమానాశ్రయాల్లోనూ ప్రత్యేకంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో విజయవాడ (గన్నవరం), తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయంతోపాటు మెహిదీపట్నం ( హైదరాబాద్), మృగనాయని(భోపాల్), కర్నూలు జిల్లా లేపాక్షి, మంగళగిరిలోనూ ఆప్కో నూతన షోరూంలను ప్రారంభించారు. ప్రైవేటు వస్త్ర వ్యాపార సంస్థలకు దీటుగా అధునాతన వసతులతో ఆప్కో షోరూంలను ప్రారంభించడం విశేషం. చేనేతను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఒకవైపు దేశవ్యాప్తంగా ఆప్కో స్టాల్స్, షోరూంలను పెంచడంతోపాటు మరోవైపు స్థానికంగా డిస్కౌంట్ సేల్, చేనేత సంఘాల ఎగ్జిబిషన్లు, ఫ్యాషన్ షోలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆకట్టుకునే డిజైన్లతోను, వినూత్నమైన, నాణ్యమైన చేనేత వస్త్రాల తయారీని ప్రోత్సహిస్తున్నారు. ఉద్యోగులు, ప్రజలు వారానికి ఒక్కరోజైనా చేనేత వ్రస్తాలు ధరించేలా పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. చేనేత రంగానికి ఊతమిచ్చేలా సీఎం జగన్ చర్యలు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్, ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చేనేత రంగానికి ఊతమిచ్చేలా సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. ‘నేతన్న నేస్తం’ తదితర కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. చేనేత వస్త్రాల విక్రయాలను ప్రోత్సహించి ఆ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన సుమారు 1.75లక్షల కుటుంబాలకు అండగా నిలిచేలా ఆప్కో ద్వారా పలు చర్యలు చేపట్టినట్టు వివరించారు. రాష్ట్రంలోని చేనేత సొసైటీల వద్ద ఉన్న వ్రస్తాల నిల్వలను క్లియర్ చేసి సొసైటీలను ఆదుకునేలా విక్రయాలు పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆప్కో షోరూంల ద్వారా ఈ ఏడాది రూ.50కోట్ల విక్రయాలు జరపాలని నిర్ణయించినట్లు ఎంఎం నాయక్ తెలిపారు. -
వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు సపోర్ట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో పౌర విమానాశ్రయంగా రూపొందనున్న వరంగల్ విమానాశ్రయాన్ని రీజినల్ కనెక్టివిటీ స్కీం (ఆర్సీఎస్)లో చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతానికి డొమెస్టిక్ (దేశీయ విమానాలు నడిచే విమానాశ్రయం) విమానాశ్రయంగా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో.. విమానాశ్రయం సిద్ధమయ్యాక ఆర్థిక అడ్డంకులను అధిగమించేందుకు ముందస్తు ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. ఇందుకోసం దీన్ని ‘ఉడాన్’పథకంలో అంతర్భాగంగా ఉన్న రీజినల్ కనెక్టివిటీ పథకంలోకి తీసుకురావాలని రాష్ట్రప్రభుత్వం తాజాగా పౌర విమానయాన శాఖకు ప్రతిపాదించింది. ఈ పథకంలో చేర్చే విమానాశ్రయాలకు మూడేళ్లపాటు కేంద్రప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండ్ అందించనుంది. ఈమేరకు ఈ స్కీంలో వరంగల్ విమానాశ్రయాన్ని చేర్చాలంటూ తాజాగా పౌరవిమానయాన శాఖకు ప్రతిపాదించింది. ప్రతిపాదన తర్వాత ఇప్పుడు మరో లేఖ కూడా రాసింది. ఏర్పాట్లు ఎందుకంటే.. ప్రస్తుత అవసరాల ఆధారంగా ఏర్పాటవుతున్న చాలా విమానాశ్రయాలు, ఆ తర్వాత రకరకాల కారణాలతో కునారిల్లుతున్నాయి. ప్రయాణికుల రద్దీ అంతంతమాత్రంగా ఉండటంతో విమానయాన సంస్థ (ఆపరేటర్లు)లు ఆసక్తి కోల్పోతున్నాయి. వెంటనే సర్వీసులను ఉపసంహరించుకుంటున్నాయి. ఫలితంగా విమానాశ్రయాలనే మూసేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక సమీపంలోనే మరో విమానాశ్రయం ఉంటే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. ప్రతిపాదిత వరంగల్ విమానాశ్రయం శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. దీంతో వరంగల్ విమానాశ్రయానికి డిమాండ్ ఎక్కువగా ఉండదన్న అభిప్రాయం గతంలో వ్యక్తమైంది. ఆ కారణంగానే ఈ విమానాశ్రయ నిర్మాణంలో ఇంతకాలం జాప్యం జరుగుతూ వచ్చింది. కానీ ఇటీవల, భారీ టెక్స్టైల్ పార్కు, వేగంగా విస్తరిస్తున్న ఐటీ పార్కు, ఇతర సంస్థల రాకతో వరంగల్ పారిశ్రామికంగా, ఐటీ పరంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం విమానాశ్రయం ఏర్పాటుకు ముందుకొచ్చి, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అడిగిన మేరకు భూమిని సేకరించి ఇచ్చేందుకు సిద్ధమైంది. భూమి బదలాయింపు జరిగిన ఏడాదిన్నరలోనే విమానాశ్రయాన్ని సిద్ధం చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ కూడా సానుకూలత వ్యక్తం చేసింది. ఇటీవలే వరంగల్ మామూనూరులోని పాత ఎయిర్ స్ట్రిప్ అదీనంలో 750 ఎకరాల భూమి పోను, అదనంగా కావలసిన 253 ఎకరాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన కావడం తెలిసిందే. గత నెలాఖరులో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు తీర్మానించగా, ఇప్పుడు సంబంధిత అధికారులు భూసేకరణ కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, వరంగల్ విమానాశ్రయం నుంచి విమానాలను నడిపేందుకు ఆయా సంస్థల ఆసక్తి ఏంటనేది ఇప్పుడు తెరపైకి వచ్చింది. దేశీయంగా విమానాలు నడుపుతున్న సంస్థలన్నీ ముందుకొస్తే దీనికి మంచి డిమాండ్ ఏర్పడుతుంది. వాటిల్లో ఆ ఆసక్తి రావాలంటే ప్రభుత్వాల నుంచి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఫండింగ్‌కు వీలు కల్పిస్తూ ఉడాన్ పథకంలో భాగంగా కేంద్రప్రభుత్వం రీజినల్ కనెక్టివిటీ స్కీంను ప్రారంభించడం తెలిసిందే. ప్రయాణికులు విమానాలు ఎక్కే విషయంలో.. ఆశించిన డిమాండ్– ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను ఆపరేటర్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఆశించిన డిమాండ్ కనక లేకుంటే.. ఎంత నష్టం జరుగుతుందో లెక్కలేస్తారు. దాన్ని నష్టంగా భావిస్తారు. డిమాండ్ అంచనా– వాస్తవ డిమాండ్.. ఈ రెంటి మధ్య ఉన్న గ్యాప్‌ను భర్తీ చేసేదే వయబిలిటీ గ్యాప్‌ఫండ్. దాన్ని ఆపరేటర్లకు అందిస్తే వారు నష్టాలతో సంబంధం లేకుండా విమానాలను కొనసాగిస్తారు. ఎవరెంత భరిస్తారు.. రీజినల్ కనెక్టివిటీ స్కీంలో భాగంగా అందించే వయబిలిటీ గ్యాప్ ఫండ్‌ను కేంద్రప్రభుత్వం 80 శాతం భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం భరించాల్సి ఉంటుంది. దీన్ని ఆపరేషన్ మొదలైన మూడేళ్లపాటు కొనసాగిస్తారు. దీనికిందకు వరంగల్ విమానాశ్రయాన్ని తీసుకురావాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదిస్తూ లేఖ రాసింది. త్వరలో ఉన్నతస్థాయిలో సంప్రదింపులు కూడా జరగనున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 72 విమానాశ్రయాలకు ఈ నిధి సమకూరుతున్నట్టు సమాచారం. -
అమెరికా నుంచి తెలుగు విద్యార్థులు వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదువుకోవడం కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి ఇమి గ్రేషన్/భద్రతా అధికారులు ఎయిర్‌పోర్టు నుంచే తిప్పిపంపేశారు. ఎందుకు పంపేస్తున్నారనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. బలవంతంగా విమానం ఎక్కించి వెనక్కి పంపారు. ఇలా అట్లాంటా, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో ప్రాంతాల నుంచి 21 మందిని తిప్పిపంపినట్టు తెలిసింది. దాదాపు వారం రోజుల నుంచి ఇలా ఒకరిద్దరిని పంపేస్తున్నా.. ఇప్పుడు ఒక్కరోజే 20 మందికిపైగా విద్యార్థులను వెనక్కి పంపడంతో విషయం బయటికి వచ్చిందని అమెరికాలోని తెలుగు సంఘాలు చెప్తున్నాయి. అయితే పత్రాలు, వివరాలన్నీ పరిశీలించాకే అమెరికా వీసా ఇస్తారని, అలాంటప్పుడు ఈ సమస్య ఎందుకొచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సదరు విద్యార్థుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా బయటికి రాలేదు.పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నా..: అమెరికాలో ఆగస్టులో విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే భారత విద్యార్థులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అక్కడి వీసా నిబంధనలకు అనుగుణంగా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటారు. ముందే టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు రాస్తారు. వాటి మార్కుల ఆధారంగానే అక్కడి యూనివర్సిటీలలో సీట్లు వస్తాయి. తర్వాత అమెరికాలో చదువుకున్నన్ని రోజులు జీవించడానికి అవసరమయ్యే మేర సొమ్మును బ్యాంకు బ్యాలెన్స్‌గా చూపిస్తారు. ఇందుకోసం విద్యార్థులు కన్సల్టెన్సీల సహకారం తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా అనుభవం సర్టిఫికెట్లు కూడా సమర్పిస్తున్నారు. ఈ వ్యవహారంలోనే మన విద్యార్థులు ఇబ్బందుల్లో పడుతున్నారని అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు చెప్తున్నాయి. డాక్యుమెంట్లపై అనుమానాలు.. సోషల్ మీడియా ఖాతాలు అమెరికాలో ‘సాక్షి’ ప్రతినిధికి అందిన సమాచారం ప్రకారం.. పలువురు తెలుగు విద్యార్థులు బ్యాంక్ ఖాతాలో సొమ్మును చూపిన అంశంపై అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఖాతాలో ఒకేసారి భారీగా డబ్బులు పడటం, లావాదేవీలు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించి, తిప్పి పంపారు. అమెరికాలో ఆటా సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమెరికాలో ఎన్నారై వ్యవహారాల సలహాదారు డాక్టర్ వాసుదేవరెడ్డి అందించిన వివరాల ప్రకారం.. అమెరికాకు వచ్చే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా పరిశీలిస్తోంది. వీసాకు అనుమతించిన మరుక్షణమే నిఘా పెడుతోంది. అందులో అమెరికా నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు, సమాచారం, వ్యాఖ్యలు ఉంటే వాటి ఆధారంగా ఎయిర్‌పోర్టులోనే ఆపేస్తున్నారు. ఉదాహరణకు భారత విద్యార్థి అమెరికా వస్తూ.. ఇక్కడి స్నేహితులతో అమెరికాలో చదువుకునే రోజుల్లో ఉండే పార్ట్‌టైం ఉద్యోగాల గురించి వాకబు చేశాడు. ఇది నిబంధనలకు విరుద్ధంగా పరిగణించి వెనక్కి పంపేశారు. నాటా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా మన విద్యార్థులను తిప్పి పంపడానికి కారణాలను కేవలం భారత కాన్సులేట్‌కు మాత్రమే చెబుతుంది. దీనితో ఆ వివరాలు తెలుసుకునేందుకు అమెరికాలో తెలుగు అసోసియేషన్లు ప్రయత్నిస్తున్నాయి. -
ఎయిర్‌పోర్టు మెట్రోకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టు పనులు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. నిర్ణీత గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేలా హెచ్ఏఎంఎల్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించింది. మరోవైపు రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మార్గంలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టును ఎల్అండ్టీ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రాజెక్టు నిర్మాణానికి 13 అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పోటీ పడగా చివరకు ఎల్అండ్టీతో పాటు ఎన్సీసీ సంస్థలో బరిలో పోటీకి నిలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థలు రూ.5,688 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చాయి. దీంతో నిర్మాణ రంగంలో ఉన్న అపారమైన అనుభవం, మెట్రోరైల్ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన అర్హతలు, ప్రామాణికత, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, యంత్రాలు, నిర్మాణ పద్ధతులు, వివిధ రంగాల్లో ఇప్పటి వరకు పూర్తి చేసిన నిర్మాణాలు, ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణంలో అనుభవాలు తదితర అంశాలను ప్రాతిపదికగా చేసుకొని అంతిమంగా ఎల్అండ్టీ సంస్థ ఎంపిక చేసినట్లు సమాచారం. పూర్వానుభవంతో.. నగరంలో 72 కి.మీ మెట్రో రైల్ మార్గాన్ని నిర్మించిన అనుభవం కూడా ఉంది. దీంతో ప్రతిష్టాత్మకమైన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టును త్వరలోనే ఆ సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు సుమారు 31 కి.మీ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ కోసం ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) పద్ధతిలో నిర్మించనున్నారు. వచ్చే సెప్టెంబరులో పనులు ప్రారంభించి 36 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. పూర్తి బాధ్యత నిర్మాణ సంస్థదే... ► ఇప్పటికే ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ పూర్తయింది. పెగ్‌మార్కింగ్ కూడా చేశారు. భూసార పరీక్షలు సైతంపూర్తయ్యాయి. త్వరలో నిర్మాణ సంస్థకు పనులను అప్పగించనున్నారు. సెప్టెంబరులోనే పనులు చేపట్టనున్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కి.మీ మార్గంలో 29.3 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ కాగా, మరో 1.7 కి.మీ మార్గంలో భూగర్భ లైన్లు నిర్మించనున్నారు. ► మొదటి దశ మెట్రోలో డిజైన్,బిల్డ్,ఫైనాన్స్,ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ విధానాన్ని పాటించారు.ఈ మేరకు హెచ్ఎంఆర్ఎల్తో పాటు, ఎల్అండ్టీ సంస్థలు కూడా భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. ఎయిర్‌పోర్టు మెట్రో పూర్తిగా ప్రభుత్వ నిధులతో చేపట్టనున్న ప్రాజెక్టు. అందుకే దీన్ని ఇంంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ పద్ధతిలో నిర్మించనున్నారు. ఈ నిర్మాణంలో భాగంగా ప్రాజెక్టును చేపట్టిన సంస్థే ఎలివేటెడ్ వయాడక్ట్‌తో పాటు ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్ పనులు చేపట్టాల్సి ఉంటుంది. ట్రాక్స్, రోలింగ్ స్టాక్, విద్యుత్, టెలీ కమ్యూనికేషన్స్, ఆటోమేటిక్ ఫేర్ సిస్టమ్ తదితర సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఔటర్ అంచుల్లో మణిహారం... ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణంతో నగరంలో పడమటి వైపు నుంచి దక్షిణాది అభివృద్ధి మరింత పరుగులు పెట్టే అవకాశం ఉంది. నిర్మాణరంగం ఉరకలు వేయనుంది. ఔటర్ మార్గంలో 31 కి.మీ వరకు ఇదో అద్భుతమైన మణిహారంలా భాసిల్లనుంది. ఎయిర్‌పోర్టు మెట్రో అందుబాటులోకి వస్తే కేవలం ఎయిర్పోర్ట్ ప్రయాణికులకే కాకుండా నార్సింగి, కోకాపేట్, మణికొండ, బుద్వేల్ తదితర ప్రాంతాల నుంచి శంషాబాద్ వరకు సాధారణ ప్రజలకు కూడా రవాణా సేవలు లభిస్తాయి. -
దుబాయ్ టు సిటీ.. గోల్డ్ స్మగ్లింగ్
సాక్షి, హైదరాబాద్:ఆదివారం రూ.1.25 కోట్ల విలువైన 2 కేజీలు.. శనివారం రూ.4.86 కోట్ల విలువైన 8 కిలోలు.. గురువారం రూ.33.53 లక్షల విలువైన 553 గ్రాములు..మంగళవారం రూ.93.26 లక్షల విలువైన 1.52 కేజీలు.. ఈ నెల 6న రూ.1.18 కోట్ల విలువైన 1.92 కేజీలు.. 4న రూ.28 లక్షల విలువైన 461 గ్రాములు.. 2న రూ.82.42 లక్షల విలువైన 1.34 కిలోలు.. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న బంగారం లెక్కలు ఇవి. నగరానికి పెద్దయెత్తున బంగారం అక్రమ రవాణా అవుతుండటం కస్టమ్స్ అధికారులనే కలవరపరుస్తోంది. ఈ నెల 1 నుంచి ఆదివారం వరకు మొత్తం రూ.9.66 కోట్ల విలువైన 15.79 కేజీల బంగారం పట్టుబడగా..ఇందులో 95 శాతానికి పైగా దుబాయ్ నుంచి తెచ్చిందే కావడం గమనార్హం. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో అక్రమ రవాణా గణనీయంగా పెరుగుతోంది. కిలోకు రూ.5 లక్షల లాభం విదేశాల నుంచి పసిడిని కొనుగోలు చేసిన వారు అధికారికంగా ఇక్కడకు తీసుకురావాలంటే పరోక్ష పన్ను విధానంతో లాభసాటి కావట్లేదు. గతంలో 10 గ్రాముల బంగారానికి దిగుమతి సుంకం రూ.350 మాత్రమే ఉండేది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడికి ఉన్న ప్రతి 15 రోజుల సరాసరి ధరను పరిగణనలోకి తీసుకుని ఆ మొత్తంపై 10 శాతం చెల్లించేలా కేంద్రం నిబంధనలు సవరించింది. ఈ కారణంగానే బంగారం స్మగ్లింగ్ పెరుగుతుండగా..దొంగ రవాణా విజయవంతమైతే అన్ని ఖర్చులూ పోనూ స్మగ్లర్లకు కిలోకు కనిష్టంగా రూ.5 లక్షల లాభం ఉంటున్నట్లు తెలుస్తోంది. టికెట్లు కొనిచ్చి.. విదేశాలకు పంపి.. బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు భారీగా అక్రమ రవాణాకు పాల్పడటం ద్వారా పెద్దయెత్తున లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో వ్యవస్థీకృత ముఠాలతో పాటు హైదరాబాద్‌కు చెందిన బడా బాబులు రంగంలోకి దిగినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. ప్రముఖ జ్యువెలరీ సంస్థల యజమానులు, రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వాహకులతో పాటు పాత నేరగాళ్లు సైతం క్యారియర్లను ఏర్పాటు చేసుకుని ఈ దందా ప్రారంభించారు. మధ్యవర్తుల ద్వారా కేరళకు చెందిన వారితో పాటు పాతబస్తీకి యువకులు, యువతులు, మహిళలకు కమీషన్ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. వీరికి టికెట్లు కొనిచ్చి విదేశాలకు పంపడం ద్వారా తిరిగి వచ్చేటప్పుడు అక్కడి తమ ముఠా సభ్యుల సహకారంతో బంగారం ఇచ్చి పంపిస్తున్నారు. వీరినే సాంకేతిక పరిభాషలో క్యారియర్లుగా పిలుస్తున్నారు. స్మగ్లర్లకు స్వర్గధామంగా దుబాయ్ దుబాయ్‌లో ఆదాయపుపన్ను అనేది లేకపోవడంతో మనీలాండరింగ్ అన్నదే ఉత్పన్నం కాదు. దీంతో ఇక్కడినుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని అక్కడకు పంపి, దాన్ని బంగారంగా మార్చి ఇక్కడకు తీసుకువస్తున్నారు. దుబాయ్‌లో ఓ వ్యక్తి ఎంత భారీ మొత్తంలో అయినా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. దాన్ని విమానంలోకి తీసుకువచ్చేటప్పుడు కూడా కేవలం చోరీసొత్తు కాదని ఆధారాలు చూపిస్తే చాలు. దీన్ని ఆసరాగా చేసుకునే స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. జోరుగా రెక్టమ్ కన్సీల్మెంట్.. చాలామంది స్మగ్లర్లు ఈ బంగారాన్ని బ్యాగుల అడుగు భాగంలో ఉండే తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, కార్టన్ బాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పౌడర్ డబ్బాలతో పాటు మైబైల్ చార్జర్స్ లోనూ దాచి తీసుకువచ్చేవారు. ఆ తర్వాత బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపంలోకి బంగారాన్ని మార్చి పైన తాపడం పూసి తేవడం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో రెక్టమ్ కన్సీల్మెంట్ కూడా జోరుగా జరుగుతోంది. సుదీర్ఘకాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు సూత్రధారులు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. గరిష్టంగా కేజీ వరకు బంగారాన్ని అక్కడ దాచిపెట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్ పేపర్ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. క్లెయిమ్ చెయ్యకుంటే వేలం కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను గుర్తించడానికి 95 శాతం ప్రొఫైలింగ్ పదర్ధతినే అనుసరిస్తారు. ప్రయాణికుడి ప్రవర్తన, నడవడికతో పాటు పాస్‌పోర్ట్‌లో ఉన్న వివిధ దేశాల ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపులు, విదేశంలో ఉన్న సమయం తదితరాలను పరిగణలోకి తీసుకుంటారు. బయటి రాష్ట్రాల పాస్‌పోర్టులు కలిగిన వారు ఇక్కడ లాండ్ అయినా అనుమానిస్తారు. బంగారం స్మగ్లింగ్ వెనుక భారీ కుట్ర లేకపోతే దాన్ని తిరిగి అప్పగించడానికే ప్రాధాన్యం ఇస్తారు. స్మగ్లర్ బంగారం తనదే అని క్లైమ్ చేసుకుంటే దాని విలువపై 50 నుంచి 60 శాతం కస్టమ్స్ డ్యూటీ వసూలు చేసి ఇచ్చేస్తారు. ఒకవేళ క్లెయిమ్ చేయకపోతే ఆ బంగారాన్ని చెన్నై, ముంబైల్లో కస్టమ్స్ కార్యాలయాలకు తరలించి అక్కడ వేలం వేయడం ద్వారా విక్రయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు. రియాద్ నుంచి వయా మస్కట్ శంషాబాద్ (హైదరాబాద్): రియాద్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని ఎయిర్‌పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి రియాద్ నుంచి వయా మస్కట్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న షేక్‌ఖాజా, షేక్‌జాని అనే ఇద్దరు ప్రయాణికులు కస్టమ్స్ తనిఖీలు పూర్తి చేసుకుని లాంజ్‌లోని సిటీసైడ్ ఏరియాలోకి వచ్చారు. వారి కదలికలను అనుమానించిన సీఐఎస్ఎఫ్ అధికారులు మరోసారి లగేజీని ఈకో–5 యంత్రంలో తనిఖీ చేశారు. దీంతో డ్రైఫ్రూట్స్ ప్యాకెట్లో ఉంచిన కిలో బరువు కలిగిన బంగారు గొలుసులు బయటపడ్డాయి. దీంతో నిందితులను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. -
కిలాడీ లేడీ.. ఆమె ట్రాప్‌లో పడితే అంతే సంగతులు!
ఫేక్ ఐడెంటిటీల సాయంతో ఆన్లైన్లో పలువురు మహిళలను మోసం చేస్తున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. మహిళలే స్వయంగా ఇటువంటి మోసాలకు దిగడం విశేషం. వారు ఫేక్ ఐడెంటిటీల సాయంతో కొంతమంది మహిళలకు ఫోన్ చేసి.. మీకు ఖరీదైన బహుమతులు వచ్చాయని, వాటిని తీసుకునేందుకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని చెబుతూ, వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ మధ్య దేశ రాజధాని ఢిల్లీలో ఇదేకోవకు చెందిన ఒక ఉదంతంలో పోలీసులు 36 ఏళ్ల నైజీరియన్‌ను అరెస్టు చేశారు. అరెస్టయిన మహిళ పలువురు మహిళలకు ఫోన్ చేసి, మీకు వచ్చిన ఖరీదైన బహుమతులు అందుకోవాలంటే వెంటనే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని చెబుతూ మోసానికి పాల్పడ్డారు. ఈ కేసులో అరెస్టయిన మహిళను పోలీసులు నైజీరియాకు చెందిన ఒఫోరిగా గుర్తించారు. ఆమె వలలో పడి 20 మంది బాధితులు మోసపోయినట్ల పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎనిమిది బ్యాంకు ఖాతాల ద్వారా ఈ మోసం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. తనను తాను తాను డాక్టర్‌గా పరిచయం చేసుకున్న ఒక మహిళ ఆన్లైన్లో తనతో స్నేహం చేసిందని పేర్కొంటూ, ఆ తరువాత జరిగిన సంఘటనల గురించి ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపధ్యంలోనే ఈ తరహా కేసు వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డాక్టర్‌గా పరిచయం చేసుకున్న ఆ మహిళతో కొద్దికాలంలోనే మంచి స్నేహం ఏర్పడిందని, అప్పటి నుంచి ఆమె బహుమతులు పంపేదని తెలిపారు. అయితే కొన్ని రోజుల తర్వాత తనకు కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకున్న ఒక మహిళ నుండి కాల్ వచ్చిందని తెలిపారు. తన పేరు మీద విమానాశ్రయానికి కొన్ని బహుమతులు వచ్చాయని, వాటిని విడుదల చేయాలంటే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని ఫోన్ చేసిన వ్యక్తి తనకు తెలిపారని పేర్కొన్నారు. దీంతో తాను రూ. 25 వేలు చెల్లించినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాను చెల్లించినదానికన్నా ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలని డిమాండ్ చేయడంతో తనకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూశారు. మోసానికి పాల్పడిన ఆ మహిళ సోషల్ మీడియా ఖాతాల కోసం ఉపయోగించిన ఐడిలు నైజీరియాకు చెందినవని తేలింది. బాధితురాలి కాల్ రికార్డింగ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా నైజీరియన్ మహిళ ఓఫోరి ఈ మోసానికి కీలక సూత్రధారి అని తేలింది. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: తల్లీకొడుకుల ప్రాణం తీసిన మొబైల్ చార్జర్ -
సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రయాణికులను వదిలేసి ఇండిగో విమానం టేకాఫ్
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో విమానయాన సంస్థల నిర్లక్ష్యం ప్రయాణికులకు సంకటం కలిగిస్తోంది. 6 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండా ఇండిగో విమానం వెళ్లిపోయింది. బెంగళూరు నుంచి మంగళూరుకు వెళ్లే ఇండిగో 6ఈ 6162 విమానంలో ప్రయాణించడానికి 6 మంది టికెట్లు బుక్ చేసుకుని విమానాశ్రయంలో వేచి ఉన్నారు. కానీ విమానం 12 నిమిషాలు ముందుగా టేకాఫ్ తీసుకుంది. దీంతో 6 మంది ఆ సంస్థ సిబ్బందిని నిలదీయడంతో వారిని మరో విమానంలో మంగళూరుకు పంపించారు. -
విశాఖ విమానాశ్రయం రన్‌వే రీ సర్వీసింగ్.. 4 నెలల పాటు ఆంక్షలు
సాక్షి, విశాఖపట్నం: రక్షణశాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం అంతార్జాతీయ విమానాశ్రయంలో పదేళ్లకోసారి నవీకరణ పనులు జరగనున్నాయి. రన్‌వే పునరుద్ధరణ కోసం పనులు జరుగుతున్న నేపథ్యంలో రాత్రి సమయంలో విమానాలు నాలుగు నెలలకు పైగా నిలిపివేయనున్నారు. దాదాపు నాలుగు నెలలపాటు (నవంబర్ 15 నుంచి మార్చి నెలాఖరు వరకు) రీ-సర్వీసింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు మూసివేయాలని నేవీ ప్రతిపాదించింది. దీంతో విశాఖ - సింగపూర్ విమానంతో పాటు , 12 సర్వీసులు నిలిచిపోతాయి. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు విమాన సేవలతో పాటు కోల్‌కతా, పుణె విమాన సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. మరో వైపు విశాఖ ఆర్ధిక వ్యవస్థ, వివిధ వ్యాపారాలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో విమానాశ్రయాన్ని రాత్రి 10.30 నుంచి ఉదయం 6.30 వరకు పరిమితం చేస్తే కొంతవరకు ఉపశమనం ఉండచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా వైజాగ్ ఎయిర్‌పోర్టు భారత నావికాదళం అధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. నేవీకి సంబంధించిన యుద్ధ విమానాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఐఎన్ఎస్ డేగా రన్‌వే నుంచే కార్యకలాపాలు సాగిస్తాయి. పౌర విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కూడా ఈ రన్ వే మీదుగానే జరుగుతాయి. నావికాదళం ప్రతి పదేళ్లకు ఓసారి తమ రన్‌వేలకు రీ-సర్ఫేసింగ్ పనులను చేపడుతుంది. చదవండి: వైజాగ్ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్ -
వార్నీ.. ఈ ఐడియాలు ఎలా వస్తాయో, చీరను ఇలా కూడా వాడచ్చా!
హైదరాబాద్: బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే కొందరు బంగారం దుకాణాలు పెడుతుంటే, ఇంకొందరు బంగారంలో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే మరికొందరు మాత్రం ఇవేవి వద్దంటూ.. బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ మార్గాన్ని ఎంచుకుని అక్రమంగా గోల్డ్ తరలిస్తూ ఇప్పటివరకు చాలా మంది ఎయిర్‌పోర్ట్‌లోనే పట్టుబడుతున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది ఈ దారిలోప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనికి ఉన్న గిరాకీ అలాంటిది మరీ. తాజాగా విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తన లగేజీలో బంగారాన్ని దాచి దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి గోల్డ్‌ని అత్యంత తెలివిగా లిక్విడ్‌గా మార్చి చీరపై స్ప్రే చేసుకొని తీసుకొచ్చాడు. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిని తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారు చీర ధర 28.01లక్షల రూపాయలు చేస్తుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దీనిపై విచారణ జరపుతున్నారు. 28 lakhs worth of gold was seized by customs at @RGIAHyd from a Dubai passenger. He concealed the gold by spraying it over clothes and packed it amidst the luggage. #gold #goldsmuggling #RGIA@hydcus @cbic_india @XpressHyderabad@NewIndianXpress pic.twitter.com/d9llirhQb3 — Priya Rathnam (@Rathnam_jurno) August 4, 2023 -
హైదరాబాద్‌లో సెకండ్ ఎయిర్‌పోర్టు?
-
చెన్నై తిరుచ్చి విమానాశ్రయంలో కొండచిలువల కలకలం
చెన్నై: మలేషియా ఎయిర్ లైన్స్ విమానంలో తిరుచ్చి విమానశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడి సూట్‌కేసులో ప్రమాదకరమైన కొండచిలువలు, పాములు, బల్లులు ఉండటాన్ని చూసి విస్తుపోయారు తిరుచ్చి కస్టమ్స్ సిబ్బంది. వాటిని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేశారు కస్టమ్స్ అధికారులు. సినిమాల ప్రభావమో ఏమోగానీ స్మగ్లింగ్ పేరిట ఏది పెడితే అది విమానాల్లో రవాణా చేసే స్థాయికి ఎదిగిపోయారు స్మగ్లర్లు. తాజాగా మొహమ్మద్ మొయిద్దీన్ అనే ఓ ప్రయాణికుడు కౌలాలంపూర్ నుండి వస్తూ తనతోపాటు సూట్‌కేసులో కొండచిలువ పిల్లలు, బంగారు బల్లుల్ని వెంట తీసుకొచ్చాడు. ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు ఆతడి సూట్‌కేసును తనిఖీ చేయగా అందులో 47 కొండచిలువ పిల్లలు, 2 బంగారు బల్లులను కనుగొన్నారు. అవి ప్రాణాలతో ఉండటాన్ని చూసి కంగారుపడ్డ కస్టమ్స్ అధికారులు వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించి అతడిని మాత్రం విచారణ నిమిత్తం కస్టడీకి తరలించారు. విమానంలో సజీవంగా ఉన్న కొండచిలువలను, బల్లులను ఎలా తీసుకువచ్చి ఉంటాడన్నదే కస్టమ్స్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతను మలేషియాలో సెక్యూరిటీ వాళ్ళ కళ్ళుగప్పి ఎలా రాగలిగాడు, అక్కడి ఎయిర్‌పోర్టు సిబ్బంది సరిగ్గా తనిఖీలు నిర్వహించలేదా ఏంటన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అతనెవరు? అసలెందుకు చెన్నై వచ్చాడు? ఈ స్మగ్లింగ్ ముఠాలో ఇంకా ఎవరెవరున్నారన్న వివరాలపై ఆరా తీస్తున్నారు కస్టమ్స్ అధికారులు. #TamilNadu- Customs officials caught a Malaysian passenger with 47 exotic pythons and two lizards at #Trichy airport on Sunday. pic.twitter.com/kVggJIP08C — Suresh (@isureshofficial) July 30, 2023 ఇది కూడా చదవండి: ఒకే వేదికపై ప్రధాని మోదీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్? -
పెరూ పుంజు.. వచ్చెనండి.. కాసులు తెచ్చెనండీ!
కోనసీమలో ఒక కొబ్బరి చెట్టునో, ఒక గేదెనో.. ఒక ఎకరం భూమినో నమ్ముకుని ఆదాయం పొందుతూ ఏదోలా బతికేద్దామని అనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ తాను అలా అనుకోలేదంటున్నారు పెన్మెత్స రామ సత్యనారాయణరాజు అలియాస్ ఈస్ట్ గోదావరి రామరాజు. నేడు భూములు, పశువులు, కొబ్బరి చెట్ల వల్ల ఆదాయం అంతగా లభించక కొంతమంది ఉన్నత చదువులతో ఉన్నత రంగాలకు వెళ్లిపోతున్నారు. కానీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం బట్టేలంక గ్రామానికి చెందిన ఈ యువకుడు కేవలం ఒక కోడిపుంజును నమ్ముకున్నాడు, తద్వారా దండిగా ఆదాయం సంపాదిస్తున్నాడు. – మలికిపురం ఈస్ట్ గోదావరి రామరాజు (32) బీటెక్ పూర్తి చేశారు. తండ్రి వేంకటేశ్వరరాజు రెండేళ్ల క్రితం కరోనాతో మృతి చెందడంతో అప్పటి నుంచి కుటుంబం కోసం ఉద్యోగం ఆలోచన విరమించుకుని రామరాజు బట్టేలంకలోనే ఉంటున్నారు. ఈయనకు ఇదే మండలం ఇరుసుమండ గ్రామంలో 15 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అదీ ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి పంచుకోగా వచ్చింది. దీని ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. దీంతో కోనసీమలో పలువురు చేస్తోన్న మాదిరిగానే రామరాజు దేశవాళీ కోడిపుంజులు పెంచుతూ సంక్రాంతి సమయంలో అమ్ముతు ఉంటారు. ఇందులోనూ అంతంత మాత్రంగానే ఆదాయం వస్తుండటంతో ఆయన సరికొత్త ఆలోచన చేశారు. పుంజుకూ వీసా..! అమెరికాలో పరిచయమున్న వారి ద్వారా రామరాజు ‘పెరూ’ జాతి కోడిపుంజును అక్కడి ధర రూ.1.40 లక్షలకు 2020 జూన్‌లో కొనుగోలు చేశారు. పెరూ నుంచి దిగుమతి చేసుకున్న కోడి పుంజులకు ప్రత్యేకంగా వీసా ఖర్చులతో పాటు విమానంలో ప్రయాణానికి అదనంగా టికెట్‌ను కొనుగోలు చేసి ఆ కోడిపుంజును అమెరికా నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా తయారైన కారులో ఇరుసుమండలోని రామరాజు కొబ్బరి తోటలోకి పుంజు చేరింది. ఈ పుంజును అన్నీ కలుపుకొని ఇక్కడకు తీసుకురావడానికి రామరాజుకు రూ.2.85 లక్షలు ఖర్చయ్యింది. అప్పటి నుంచీ ఈ పెరూ జాతి కోడిపుంజును రాజభోగాలతో రామరాజు మేపుతున్నారు. మేలు రకాలయిన దేశవాళీ పెట్టల క్రాసింగ్ ద్వారా దీని సంతానం విపరీతంగా పెరిగింది. ఈ జాతి పుంజులు పందాల్లో విశేష ప్రతిభ చూపడంతో దీని బ్రీడ్‌కు డిమాండ్ పెరిగింది. రామరాజు కోడిపుంజులను పెంచడం లేదు. వీటి పిల్లలను 3 నెలల వయసు వచ్చే వరకు మాత్రమే పెంచి అనంతరం ఒక్కో పిల్లను రూ.10,000కు పైగా విక్రయిస్తున్నారు. ఇలా ఈ రెండేళ్లలో ఇప్పటివరకు రూ.41.60 లక్షల ఆదాయం వచ్చినట్లు రామరాజు చెప్పారు. దీనిలో నెలకు రూ.25 వేల చొప్పున ఖర్చవుతుందని, రూ.35.60 లక్షలు మిగిలిందని వెల్లడించారు. దండిగా ఆదాయం ప్రస్తుతం కొబ్బరి ఆదాయం తోటల నిర్వహణకే సరిపోతోంది. దీంతో ఇలా ప్రయోగం చేసి ఈ కోడిపుంజును దింపాను. రెండేళ్లలో రూ.41.60 లక్షల షేర్ వచ్చింది. నిర్వహణ ఖర్చు నెలకు రూ.25 వేలకు పైగా ఉంటుంది. ఏడాదికి రూ.10 లక్షలు పైగా మిగులుతుంది. – పెన్మెత్స రామ సత్యనారాయణ రాజు, బట్టేలంక -
వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఓకే?
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. మామునూరులో ఉన్న పురాతన ఎయిర్ స్ట్రిప్ స్థానంలో దీనిని నిర్మించనున్నారు. రాష్ట్రంలో ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని నాలుగేళ్ల క్రితమే ప్రతిపాదించినా, పౌర విమానయాన శాఖ–రాష్ట్రప్రభుత్వం మధ్య సమన్వయం కుదరలేదు. దీంతో జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ కారణంగానే వీటి ఏర్పాటు సందిగ్ధంలో పడింది.రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముందుకొచ్చి దశలవారీగా ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. తొలుత వరంగల్‌లో విమానాశ్రయాన్ని సిద్ధం చేసే కసరత్తులో భాగంగా, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ కోరిన మేరకు భూమిని సేకరించి అప్పగించనుంది. సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి పచ్చజెండా ఊపే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు సమావేశ ఎజెండాలో కూడా దీనిని చేర్చారు. 250 ఎకరాల భూసేకరణ మామునూరులో నిజాంకాలంలో నిర్మించిన ఎయిర్‌స్ట్రిప్ ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఇది వాడుకలో లేదు. అక్కడ చిన్నòÙడ్డు తప్ప ఎలాంటి భవనం లేదు. ఒక పెద్ద రన్‌వే, మరో చిన్న రన్‌వే ఉంది. గోతులు పడి అది కూడా వినియోగించడానికి వీలు లేదు. ప్రస్తుతం ఆ ఎయిర్‌స్ట్రిప్‌కు సంబంధించిన 696 ఎకరాల భూమి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అ«దీనంలో ఉంది. అదనంగా 253 ఎకరాలు కావాలని అథారిటీ రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. ఇప్పుడు అంతమేర భూసేకరణ జరగాల్సి ఉంది. సమీపంలోనే పశసంవర్థక శాఖ కు చెందిన స్థలం అందుబాటులో ఉంది. కొంత సమీప గ్రామం నుంచి సేకరించాల్సి ఉంది. గ్రామస్తులకు ఎయిర్‌పోర్టుకు మరోవైపు ప్రత్యామ్నాయ భూములు ఇచ్చే పద్ధతిలో సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్‌కు ఈమేర కు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఏడాదిన్నరలో సిద్ధం చేసేలా.. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని రూ.350 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఎయిర్‌స్ట్రిప్‌లో 1400 మీటర్ల పొడవైన రన్‌వే ఉంది. దాని పక్కనే గ్లైడర్స్ దిగేందుకు అప్పట్లో మరో చిన్న రన్‌వే నిర్మించారు. ఇప్పుడు 2300 మీటర్ల పొడవుతో ఒకటే రన్‌వే కొత్త విమానాశ్రయం కోసం సిద్ధం చేస్తారు. రన్‌వే విస్తరణ, టెర్మి నల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సర్విసెస్‌కు ఈ అదనపు భూమి అవసరమవుతోంది. ఎయిర్‌పోర్టు సిబ్బంది క్వార్టర్లను మరో చోట నిర్మించాలని నిర్ణయించారు. భూమిని సేకరించి అథారిటీకి అప్పగించిన ఏడాదిన్నరలోగా విమానాశ్రయాన్ని సిద్ధం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రస్తు తం దేశీయ విమానాశ్రయం (డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు)గానే ఏర్పాటు చేయనున్నారు. 500 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఇది రూపొందనుంది. భవిష్యత్ అవసరాల ఆధారంగా విస్తరిస్తారు. దశలవారీగా ఇతర చోట్ల కూడా.. వరంగల్ మామునూరుతోపాటు ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. వీటిని దశలవారీగా చేపట్టాలని ఇప్పుడు నిర్ణయించారు. హైదరాబాద్ తర్వాత అంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం వరంగల్ కావటం, అక్కడ టెక్స్‌టైల్‌పార్కు, ఐటీ పార్కులు అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో అక్కడ తొలుత విమానాశ్రయాన్ని సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
భారీ మాల్‌కు చిక్కులు... మూసివేయాలని ఆదేశాలు...
సాక్షి, చైన్నె: చైన్నె మీనంబాక్కం విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ రూపుదిద్దుకున్న భారీ మాల్ నిర్వహణకు చిక్కులు తప్పడం లేదు. ఈ మాల్, సినిమా కాంప్లెక్స్ కారణంగా విమానాశ్రయం వద్ద కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఏయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) గుర్తించింది. దీంతో ఆ మాల్‌ను మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం తాజాగా వెలుగు చూసింది. వివరాలు.. చైన్నె మీనంబాక్కం విమానాశ్రయం నుంచి స్వదేశంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అన్ని ప్రధాన నగరాలకు , దేశాల రాజధానులకు విమానాల సేవలు అందుతున్న విషయం తెలిసిందే. రూ. 2400 కోట్లతో ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిద్దే పనులు జరుగుతున్నాయి. తొలి దశ పనులు ఏప్రిల్‌లో ముగించగా, ప్రస్తుతం రెండో దశ పనులు మొదలెట్టి ఉన్నారు. అలాగే, విమానాశ్రయం పరిసరాల్లో పార్కింగ్ కోసం భారీ భవనం ఏర్పాటు చేశారు. ఇక్కడ 2400 కార్లు తదితర వాహనాలు పార్కింగ్ చేసే విధంగా ఇక్కడ నిర్మాణాలు జరిగాయి. రూ. 250 కోట్లతో ఆరు అంతస్తులతో ఈ నిర్మాణం చేపట్టారు. భద్రతా పరమైన కారణాలతో.. విమానాశ్రయం స్వదేశీ, విదేశీ టెర్మినల్స్‌కు మధ్య భాగంలో ఆరు అంతస్తులతో భారీ మాల్‌కు రూపకల్పన చేశారు. ఇక్కడ ప్రయాణికులకు వినోదాన్ని పంచే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు, ఫుట్కోట్లు, పలు బ్రాండ్లకు సంబంధించిన దుకాణాలు ఇక్కడ కొలువు దీర్చారు. అంతే కాకుండా ప్రముఖ సంస్థ నేతృత్వంలో సినిమా థియేటర్లు ఏర్పాటు చేశారు. వర్తక, వినోద కేంద్రంగా ఉన్న ఇక్కడకు నిత్య జనం తాకిడి పెరగడం విమానాశ్రయానికి కొత్త చిక్కులను సృష్టించి ఉంది. ఇక్కడకు వచ్చే వారి వాహనాలతో ఆ కాంప్లెక్స్నిండి పోవడంతో పాటు విమానాశ్రయ పరిసరాలను ఆక్రమిస్తున్నట్టు తేలింది. అలాగే విమానాశ్రయానికి ఏదేని భద్రతా పరంగా సమస్య తలెత్త వచ్చనే అనుమానాలను చైన్నె ఏయిర్ పోర్టు వర్గాలు ఢిల్లీలోని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఇదే మాల్ నుంచి ఓ మహిళ కిందకు దూకి ఆత్మహత్య సైతం చేసుకోవడం వంటి పరిణామాలను, ఇక్కడకు నిత్యం తరలివస్తున్న ప్రేక్షకుల సంఖ్యతో భద్రతా సమస్యలే కాకుండా, పార్కింగ్‌కు మరింత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని గుర్తించారు. దీంతో భారీ మాల్, థియేటర్లను మూసి వేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే పూర్తిస్థాయి కారణాలను తెలియ జేయకుండా ఏకపక్షంగా మూసి వేయాల్సిందేనంటూ ఆదే శాలు జారీ చేయడంపై సంబంధింత మల్టిఫ్లెక్స్ సంస్థ న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు తెలిసింది. -
పాకిస్థాన్‌కు పంపండి.. ప్రియుని కోసం బాలిక బిగ్ స్కెచ్..! ఆ తర్వాత..
జైపూర్: పాకిస్థాన్‌కి పంపించండి అంటూ వచ్చిన ఓ మైనర్ బాలిక జైపూర్ ఎయిర్‌పోర్టులో అధికారులను షాక్‌కు గురిచేసింది. పాక్‌లో ఉన్న తమ ప్రియున్ని కలవడానికి వెళ్తున్నట్లు బాలిక చెప్పుకొచ్చింది. ఎలాంటి పాస్‌పోర్టు, వీసాగానీ లేకుండానే ఎయిర్‌పోర్టుకు వచ్చిన బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల క్రితమే వచ్చా.. ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన బాలిక పాకిస్థాన్‌కు టిక్కెట్టు అడిగింది. అనుమానంతో విచారించగా.. మూడేళ్ల క్రితమే ఇస్లామాబాద్ నుంచి భారత్‌కు వచ్చినట్లు కట్టుకథను చెప్పింది. తన ఆంటీతో పాటే వచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం వారితో సఖ్యతలేదని తెలిపిన బాలిక.. మళ్లీ పాకిస్థాన్‌కు వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పింది. కానీ దర్యాప్తులో తేలిన విషయాలు చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. ఎయిర్‌పోర్టులో మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నాం. తన ప్రియున్ని కలవడానికి లాహోర్‌కు వెళ్లాలని చెప్పింది. ఎయిర్‌పోర్టులోని టిక్కెట్ కౌంటర్ వద్దకు వచ్చి పాకిస్థాన్‌కు టిక్కెట్టు ఇవ్వమని అడిగినప్పుడు అందరం షాక్‌గు గురయ్యాం. బాలిక మొదట జోక్ చేస్తోందని టికెట్ మాస్టర్, సెక్యూరిటీ అధికారులు అనుకున్నారు. కానీ అది నిజమని తెలిసి ఆశ్చర్యపోయాం.' అని అధికారులు తెలిపారు. ప్లాన్ ఇచ్చింది ఆయనే.. పాకిస్థాన్‌లో ఉన్న బాలుడు కొన్ని విషయాలు తెలిపినట్లు బాలిక దర్యాప్తులో అధికారులకు చెప్పింది. పాకిస్థాన్‌కు రావడానికి పాటించాల్సిన నియమాలను ఆ బాలుడు చెప్పినట్లు తెలిపింది. అధికారులతో మాట్లడేప్పుడు కొన్ని విషయాలు మైండ్‌లో పెట్టుకోవాలని ఆ బాలుడే తెలిపినట్లు వెల్లడించింది. అందుకు భాగంగానే ఆ కట్టుకథను అధికారులకు చెప్పినట్లు పేర్కొంది. కానీ దర్యాప్తులో బాలిక స్థానికంగా రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలోని రత్నపుర గ్రామానికి చెందినదని అధికారులు గుర్తించారు. చివరికి తల్లిదండ్రులను పిలిచి వారి ముందే మళ్లీ ప్రశ్నించగా.. అందరూ గుర్తించాలని ఇలా చేశానని బాలిక చెప్పుకొచ్చింది. దీంతో తల్లిదండ్రులతో పాటే బాలికను ఇంటికి పంపించారు. ఇదీ చదవండి: కేరళ గవర్నర్ కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన కారు.. -
వేకేషన్‌కు మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఎయిర్‌పోర్ట్‌లో సందడి!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. అయితే మొదట ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హేగ్డేను ఎంపిక చేయగా.. ఆ తర్వాత ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. పూజా స్థానంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీలను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే హీరో.. కాస్త విరామం దొరికితే చాలు విదేశాల్లో వాలిపోతుంటారు. (ఇది చదవండి: జ్యువెల్లరీ యాడ్‌లో సితార.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) అయితే ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్‌కు కాస్త విరామం లభించడంతో వేకేషన్ ప్లాన్ చేశాడు ప్రిన్స్ మహేశ్ బాబు. తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు పయనమయ్యారు. మహేశ్ బాబు సతీమణి, పిల్లలు సితార, గౌతమ్ హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఎయిర్‌పోర్ట్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. జూలై 20న సితార బర్త్‌డేను జరుపుకున్న సంగతి తెలిసిందే. సితార పుట్టినరోజు వేడుకను మహేష్ బాబు ఫౌండేషన్‌లోని యువతులతో కలిసి ఇంట్లోనే చాలా సింపుల్‌గా జరుపుకున్నారు. కాగా.. ఇటీవలే సితార మొదటి జ్యూవెల్లరీ యాడ్ న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ యాడ్ కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. సితారకు యాడ్ కోసం ఏకంగా రూ.కోటి ఇచ్చినట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: బేబీ బంప్ వీడియో షేర్ చేసిన నటి..సోషల్ మీడియాలో వైరల్!) Superstar #MaheshBabu with family off to vacation #GunturKaaram @urstrulyMahesh pic.twitter.com/srs35m2Hoh — 𝙎𝙎𝙈𝘽 𝙁𝙍𝙀𝘼𝙆𝙎 𝙁𝘾 (@ssmb_freaks) July 22, 2023 -
రెడ్‌హ్యాండెడ్‌గా.. విమానాశ్రయంలో డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్
లండన్: యూకేలోని ఓ విమానాశ్రయంలో అమెరికాకు చెందిన సూపర్ మోడల్ జిగి హడిద్ని అధికారులు డ్రగ్స్‌తో పట్టుకున్నారు. గిగి అమెరికా నుంచి ప్రైవేట్ విమానంలో యూకేలోని కైమన్ ద్వీపానికి వెళ్లింది. ఈ క్రమంలో ఓవెన్ రాబర్ట్స్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా ఆమె బ్యాగులను చెక్ చేయగా.. అందులో గంజాయి, వాటిని తాగేందుకు ఉపయోగించే వస్తువులు కూడా అందులో లభించాయి. ఇక రెడ్‌హ్యాండెడ్‌గా గిగి దొరికిపోయింది. ఆ సమయంలో గిగి తన స్నేహితురాలు లేహ్ నికోల్ మెక్‌కార్తీతో కలిసి ఉన్నారు. దీంతో పోలీసులు వారివురిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టులో వారు నేరాన్ని అంగీకరించడంతో న్యాయమూర్తి రూ.1000 డాలర్లు జరిమానా విధించారు. అనంతరం వారికి బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, గంజాను వ్యక్తిగతంగా వినియోగించడానికే తీసుకొచ్చినప్పటికీ.. దానిని దిగుమతి చేయడం, గంజా తాగడానికి ఉపయోగించే పాత్రలను తీసుకురావడం వంటి ఆరోపణలపై అమెరికన్ సూపర్ మోడల్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. చదవండి China Common Man Becomes Rich: భార్యాపిల్లల గుర్తుగా చేసిన పనికి.. రూ. 90 కోట్లు అదృష్టం వరించింది! -
ఆకాశయానం అందని ద్రాక్షేనా?
భద్రాద్రి: రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్డుల నిర్మాణంపై గతేడాది ఆగస్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరిగాయి. ఇందులో వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్, నిజామాబాద్ (జక్రాన్‌పల్లి) ఎయిర్‌పోర్టుల ప్రస్తావనే వచ్చింది తప్పితే కొత్తగూడెం ఊసే లేదు. అప్పటి వరకు తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల ప్రస్తావన ఎప్పుడొచ్చినా కొత్తగూడెం పేరు తప్పకుండా ఉండేది. మరోవైపు విమాన ప్రయాణ, రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు సైతం ఆకాశయానం అవకాశం కల్పించేందుకు కేంద్రం ఉడాన్ (ఉడే దేశ్‌కి ఆమ్ నాగరిక్) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక్కడ కూడా కొత్తగూడెం పేరు లేకపోవడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కొత్తగా ఎనిమిది విమానాశ్రయాలు నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎంపీగా గెలిచిన రేణుకాచౌదరి కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆమె చూపిన చొరవతో కొత్త ఎయిర్‌పోర్టుల ప్రతిపాదనల్లో కొత్తగూడెం పేరు కూడా చేరింది. అయితే గత 15 ఏళ్లుగా ఎయిర్‌పోర్టు అంశం విక్రమ్ బేతాళ్ కథలా మారిపోయింది. కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పరిశీలిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తాయి. ఆ తర్వాత విడతల వారీగా నిపుణుల బృందాలు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తాయి. వారి సూచనలకు అనుగుణంగా, జిల్లా యంత్రాంగం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం సర్వేలు చేపడతాయి. పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతాయి. అంతే ఇక ఆ తర్వాత ఉలుకూపలుకూ ఉండదు. మూడుసార్లు ప్రభుత్వాలు మారినా ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది. విమానాశ్రయం ముచ్చట సాగిందిలా.. ► కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 2008లో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. నాటి నుంచి 2014 వరకు కాగితాల్లో ప్రతిపాదనలే తప్ప క్షేత్ర స్థాయిలో అంగుళం పని కూడా జరగలేదు. ► తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు అప్పటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఎయిర్‌పోర్టు పనుల్లో దూకుడు పెంచారు. ► ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన భూముల కోసం 2015 జనవరి నుంచి 2017 మార్చి వరకు అన్వేషణ సాగింది. ► పాల్వంచ మండలం పునుకుడుచెలక దగ్గర 1600 ఎకరాల స్థలాన్ని ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువైనదిగా గుర్తించారు. ► ఈ స్థలాన్ని తమకు అప్పగిస్తే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని 2017 మార్చిలో కేంద్ర విమానయాన శాఖ తెలిపింది. ► పునుకుడుచెలక దగ్గరున్న స్థల సేకరణకు పర్యావరణ, అటవీశాఖ, వన్యప్రాణి సంరక్షణ, సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డొచ్చాయి. దీంతో ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి. ► 2019లో పాల్వంచ మండలంలో సర్వే నంబర్ 441లో ఉన్న 700 ఎకరాల స్థలాన్ని పరిశీలనలోకి తీసుకున్నారు. శ్రీనివాసకాలనీ నుంచి బంగారుజాల వరకు ఉన్న భూములను ఎంపిక చేసి 2020లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిశీలనకు పంపారు. ► విమానాలు ల్యాండ్, టేకాఫ్ అయ్యేందుకు బంగారుజాల దగ్గరున్న స్థలం అనువైనదా, కాదే అనే అంశాలను ఏఏఐ బృందం 2021లో పరిశీలించింది. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన శాఖాపరమైన అనుమతుల కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ అప్పటి నుంచి ఎయిర్‌పోర్టు పనులు ముందుకు సాగలేదు. దృష్టిపెట్టండి.. పారిశ్రామికంగా, ఆధ్యాత్మికంగా భద్రాద్రి జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే దేశ నలుమూల నుంచి పర్యాటకులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఆకాశయాన సౌకర్యం లేక సింగరేణి, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, హెవీ వాటర్ ప్లాంట్, పేపర్‌బోర్డు తదితర పరిశ్రమల్లో పనిచేసే ఉన్నతాధికారులు, నిపుణులు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చే ఎయిర్‌పోర్టు నిర్మాణంపై అవసరమైన దృష్టిపెట్టడం లేదనే అపవాదు ను జిల్లా ప్రజాప్రతినిధులు మూటగట్టుకున్నారు. ఇప్పటికై నా ఎయిర్‌పోర్టు నిర్మాణంలో కదలిక వచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా కృషి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఆకాశయానం జిల్లా ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. పదిహేనేళ్లుగా ఇదుగో అదుగో అంటూ ప్రకనటలు చేయడం, ఆపై సర్వేలు అంటూ హడావుడి చేయడం మినహా ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో అడుగు ముందుకు పడటం లేదు. -
వామ్మో.. ఈ మ్యాగీ కంటే బిర్యానీ బెటర్.. ధర చూసి షాకైన యూట్యూబర్!
న్యూఢిల్లీ: ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది.. ప్రజలు భోజనాల నుంచి ఫాస్ట్‌గా రెడీ అయ్యే ఫాస్ట్పుడ్స్పై మొగ్గు చూపుతున్నారు. అందుకే హోటల్స్ అనే కాకుండా పుట్‌పాత్‌లపై కూడా ఫాస్ట్ పుడ్ సెంటర్లకి గిరాకీ పెరుగుతోంది. ఈ కేటగిరి ఆహారంలో బయట పుడ్‌కి ప్రత్యామ్నాయంగా మ్యాగీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కేవలం రెండు నిమిషాల్లోనే నోరూరించే వంటకం సిద్ధం కావడంతోపాటు దీని ధర కూడా తక్కువే. ఇంకేముంది చిన్నారుల నుంచి పెద్దల వరకు మ్యాగీని ఎగబడి తింటున్నారు. అయితే అదే మ్యాగీ ఎయిర్‌పోర్టులో కొంటే ఆ బిల్ చూసి ఓ యూట్యూబర్‌కి కళ్లు బైర్లు కమ్మాయి. వెంటనే ఆ బిల్‌ని ఫోటో తీసి నెట్టింట పెట్టి.. ఈ షాకింగ్ విషయాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఓ యూట్యూబర్ ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా ఆకలేసింది. సరే ప్రయాణం కాబట్టి తీరిగ్గా తినే టైం లేదని మ్యాగీ ఆర్డర్ చేశాడు. అనుకున్నట్లుగా మ్యాగీ రావడం మనోడు కడుపునిండా తినేశాడు. అయితే చివరిలో వెయిటర్ తెచ్చిన బిల్ చూసి ఆ యూట్యూబర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ మ్యాగీ మసాలా నూడుల్స్ ధర రూ. 184గా చూపించి దానికి జీఎస్టీ రూ. 9.20 జోడించడంతో రూ. 193.20 బిల్లు అయింది. చేసేదేమిలేక ఆ వ్యక్తి బిల్లు చెల్లించి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ బిల్ చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘వామ్మో.. మరీ ఇంత ధరకు అముతున్నారా.. ఈ ధరకు బిర్యానీ వస్తుందని కొందరు కామెంట్ చేయగా... ఎయిర్‌పోర్టులో ధరలు అలానే ఉంటాయంటూ మరొకరు కామెంట్ చేశారు. చదవండి: వీడియో: బొమ్మ కాదురా నాయనా.. పామును చేతిలో పట్టుకుని.. -
‘ఈ ‘డర్టీ పాస్‌పోర్ట్’ పాస్ చేయాలంటే రూ. 82 వేలు కట్టాల్సిందే’.. యువతికి వేధింపులు!
ఎవరైనా సరే తమకు సంబంధించిన ముఖ్యమైన ధృవీకరణ పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోకపోతే సమస్యల్లో పడతారు. ఇటువంటి నేపధ్యంలోనే అస్ట్రేలియాకు చెందిన ఒక మహిళ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఎయిర్‌పోర్టు కౌంటర్లో.. బాలీ విమానాశ్రయం అధికారులు ఒక ఆస్ట్రేలియా యువతి దగ్గరున్నది ‘డర్టీ పాస్‌పోర్ట్’ అని ఆరోపిస్తూ, రూ. 1000 డాలర్లు వసూలు చేశారు. అధికారులు ఆమె దగ్గరున్న ‘డర్టీ పాస్ట్‌పోర్ట్’ను స్వీకరించలేమని పేర్కొన్నారు. న్యూయార్క్ పోస్ట్ రిపోర్టును అనుసరించి 28 ఏళ్ల యువతి తన తల్లితోపాటు సెలవుల్లో ఎంజాయ్ చేసేందుకు ఇండోనేషియా వెళుతోంది. బాటిక్ ఎయిర్‌పోర్టు కౌంటర్లో ఆమెకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె దగ్గరున్న పాస్‌పోర్ట్ పాతబడిపోవడంతో ఆమె కొత్తగా ఒక ఫారం నింపాల్సి వచ్చింది. 7 సంవత్సరాల క్రితంనాటిది కావడంతో.. ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెచేత ఒక ప్రత్యేకమైన నీలిరంగు ఫారం మీద సంతకం చేయించారు. దానిని తనతో ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ పత్రానికి సంబంధించిన ప్రక్రియతోపాటు ఇమిగ్రేషన్ పూర్తయిన తరువాత వారికి విమానం ఎక్కేందుకు అనుమతి లభించింది. ఆ యువతి తెలిపిన వివరాల ప్రకారం ఆ పాస్‌పోర్ట్ 7 సంవత్సరాల క్రితంనాటిది. దీంతో అది కాస్త మురికిగా తయారయ్యింది. ‘నన్ను ఎగతాళి చేశారు’ ఆమె తన అనుభవాన్ని వివరిస్తూ ‘మాకు నిజమైన ఇబ్బంది బాలీ ఎయిర్‌పోర్టులో ఎదురయ్యింది. బాలీ ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్‌కు ముందు అధికారులు నన్ను గంటపాటు ప్రశ్నించారు. వారు నన్ను చూసి నవ్వారు. చట్టాన్ని అతిక్రమించానని ఆరోపించారు. నా పాస్‌పోర్ట్ డ్యామేజ్ అయ్యిందంటూ ఎగతాళి చేశారు. 1000 డాలర్లు కడితే నా సమస్య పరిష్కారం అవుతుందని, లేనిపక్షంలో పాస్‌పోర్ట్ తిరగి ఇవ్వబోమని తెలిపారు. పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వబోమంటూ.. ఇటీవలే నేను ఉద్యోగాన్ని కోల్పోవడం వలన అంత మెత్తం చెల్లించలేనన్నాను. వెంటనే అధికారులు మా అమ్మతో మాట్లాడి, తన డర్టీ పాస్‌పోర్ట్ చెల్లుబాటుకు అనుమతినివ్వాలంటే 1000 డాలర్లు చెల్లించాలని మరోమారు తెలిపారు. అయితే ఆమె కూడా ఇందుకు సమ్మతించలేదు. దీంతో అధికారులు తన పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వబోమని హెచ్చరించారు. మరోమార్గం లేక అధికారులకు వారు అడిగినంత మొత్తం చెల్లించామని, అప్పుడు తమ ప్రయాణానికి ఏర్పడిన ఆటంకం తొలగిపోయిందని’ ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
రోజూ గాలి కబుర్లేనా రామోజీ!? ఎన్ని ఎయిర్పోర్టులున్నాయో తెలియదా?
ఒక్కో తప్పుడు కథనంతో ఒక్కరినైనా నమ్మిద్దామని కంకణం కట్టుకున్న ఈనాడు రామోజీరావు రోజుకోరీతిన గాలి వార్తలు అచ్చేస్తున్నారు. రాష్ట్రంలో సరిగ్గా ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయనే విషయాన్ని నిర్ధారించుకోకుండానే తాజాగా విషం కక్కుతూ ఓ కథనాన్ని వండివార్చారు. అవునులే.. బయటకు వస్తే దొరికిపోతాననుకునే మీకు ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయనేది కరెక్ట్‌గా ఎలా తెలుస్తుంది? మీ ఆత్మీయుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కుర్చీలో లేరన్న నిజం జీర్ణించుకోలేక గాలి రాతలతో చెలరేగిపోవడమే దిన చర్యగా మారిందన్నది నిజం కాదా రామోజీ? సాక్షి, అమరావతి : రామోజీరావు ఎంత దిగజారి పోయా రనేది చెప్పడానికి శుక్రవారం ఈనాడులో ‘జిల్లాకో విమా నాశ్రయం ఏమైంది సారు!?’ శీర్షికన అచ్చేసిన కథనమే నిద ర్శనం. రాష్ట్రంలో ఐదుచోట్ల మాత్రమే విమానాశ్ర యాలు ఉన్నాయని, వాటిని కూడా నడపలేని స్థితిలో ప్రభుత్వం ఉందంటూ అబద్ధాలు చెప్పారు. వాస్తవంగా రాష్ట్రంలో విశాఖ పట్నం, రాజమండ్రి, గన్నవరం, తిరుపతి, కడప, కర్నూలు.. మొత్తం ఆరు విమానాశ్రయాల్లో సర్వీసులు నడుపుతుంటే ఐదు చోట్ల నుంచి మాత్రమే విమానాలు తిరుగుతు న్నాయని రాయడం వెనుక ఉన్న మీ దుర్బుద్ధి తెలుస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో విమాన ప్రయాణికుల వృద్ధిలో రాష్ట్రం దేశంలోనే గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. 2021–22లో ఏపీలోని ఎయిర్‌పోర్టుల నుంచి 31,78,946 మంది విమానాల్లో ప్రయాణిస్తే 2022–23లో ఆ సంఖ్య 55 శాతం పెరిగి 49,27,856కు చేరింది. విమానాల సర్వీసు సంఖ్యలో కూడా 45.20 శాతం వృద్ధి నమోదైంది. 2021–22లో రాష్ట్రం నుంచి 41,179 విమాన సర్వీసులు నడపగా.. 2022–23లో ఆ సంఖ్య 59,793కి చేరింది. 2022–23లో ఏపీ మొత్తం మీద 49,27,856 మంది రాక పోకలు సాగిస్తే.. అందులో ఒక్క విశాఖ ఎయి ర్పోర్టు నుంచే 25,00,654 మంది ప్రయాణించారు. ఆ తర్వాత విజయవాడ నుంచి 9.66 లక్షల మంది, తిరుపతి నుంచి 9.19 లక్షలు, రాజమండ్రి నుంచి 4.32 లక్షలు, కడప నుంచి 70,126, కొత్తగా ప్రారంభించిన కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి 38,622 మంది ప్రయాణించారు. విమాన సర్వీసుల వృద్ధి పరంగా విజయవాడ ముందుంది. విజయవాడ నుంచి 2021–22లో 9,258 విమాన సర్వీసులు నడపగా.. 2022–23లో 57 శాతం వృద్ధితో 14, 593 సర్వీసులు తిరిగాయి. విశాఖ నుంచి 2021–22లో 14, 878 విమాన సర్వీసులు నడపగా.. 2022–23లో 40 శాతం వృద్ధితో 20,961 సర్వీసులు తిరిగాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) విడుదల చేసిన గణాంకాలే. గతంలో ఎదురు డబ్బులిచ్చి.. గత చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ నుంచి సింగ పూర్‌కు ఎదురు డబ్బులిచ్చి మరీ విమాన సర్వీసులు నడిపించింది. కోస్తా ప్రాంతాల నుంచి అత్యధిక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుండటంతో ప్రస్తుత ప్రభుత్వం ఎయిర్ ఇండియాతో మాట్లాడి ఎటువంటి ఎదురు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా అంతర్జాతీయ సర్వీసులను ప్రవేశపెట్టింది. ఎయిర్ ఇండియా ప్రారంభంలో కువైట్‌కు సర్వీసులు ప్రారంభించగా, డిమాండ్ బాగుండటంతో షార్జాకు సర్వీసులు ప్రారంభించింది. రాయలసీమ ప్రజల కోసం తిరుమల నుంచి కువైట్‌కు సర్వీసు ప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. విజయవాడ నుంచి కొత్తగా షిర్డీకి సర్వీసులు ప్రారంభమైతే సర్వీసులు తగ్గిపోయాయి అని ఎలా రాస్తావు? కొత్త విమానాశ్రయాల ఏర్పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా కొత్త ఎయిర్‌పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. గత ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా ఎన్నికల ముందు హడావిడిగా ప్రారంభించిన కర్నూలు విమానాశ్రయాన్ని సుమారు రూ.155 కోట్ల వ్యయంతో అందుబాటులోకి తీసుకొచ్చింది. భోగాపురం విమానాశ్రయా నికి అన్ని అనుమతులు తీసుకొచ్చిన తర్వాత ఇటీవల పను లు ప్రారంభించిన విషయం తెలిసిందే. 2025 నాటికి ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులు, దానికి అనుబంధంగా ఉండే పరిశ్రమలకు అనుకూలంగా ఉండటానికి రామాయపట్నం తెట్టు వద్ద మరో విమానాశ్రయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి సంబంధించి భూ సేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఇక్కడ పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో పుట్టపర్తి శ్రీ సత్యసాయి ట్రస్ట్‌కు సంబంధించిన ప్రైవేటు విమానాశ్రయాన్ని పౌర సేవలకు వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ట్రస్ట్ సభ్యులతో మాట్లాడుతోంది. త్వరలో ఇక్కడి నుంచి కూడా సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విజయవాడ విమానాశ్రయంలో 36,705 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నూతన టెర్మినల్, రన్‌వేను 8,000 అడుగుల నుంచి 11,000 అడుగులకు విస్తరించడమే కాకుండా, కొత్తగా ఆరు విమాన పార్కింగ్ బే లను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆరు ఎయిర్‌పోర్టులకు అదనంగా మరో మూడు ఎయిర్‌పోర్టుల రాకతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
Hyderabad: ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ బిడ్స్ ఫైనల్
హైదరాబాద్: నగరంలో ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ బిడ్స్ ఫైనల్ అయ్యాయి. ఎయిర్పోర్ట్ మెట్రో రైలు ఏర్పాటుకు వచ్చిన బిడ్స్‌లో రెండు కంపెనీలు షార్ట్ లిస్ట్ చేశారు. బిడ్స్ షార్ట్ లిస్ట్ అయిన కంపెనీల్లో L& T కన్స్ట్రక్షన్స్ , NCCలు ఉన్నాయి. పనితీరు, అనుభవం ఆధారంగా త్వరలో ఒక కంపెనీని ఫైనల్ చేస్తామని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, రూ. 5,688 కోట్లతో 31 కి.మీ మేర ఎయిర్పోర్ట్ మెట్రో రైలు ఏర్పాటు చేయడానికి టీఎస్ సర్కార్ నడుంబిగించింది. దీనిలో భాగంగా మెట్రో రైలు ఏర్పాటు కోసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఏర్పాటు చేశారు. విమానాశ్రయ మెట్రో కారిడార్‌కు సమీపంలో అనేక వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పెద్దఎత్తున జరుగుతోంది. దాంతో పాటుశివార్లలో మధ్యతరగతి వారికోసం తక్కువ ఖర్చుతో నివాసప్రాంతాలను అభివృద్ధి చేసి అన్ని తరగతులవారు ఎయిర్పోర్ట్ మెట్రో ద్వారా గమ్యస్థానాలకు చేరుకొనేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే నాలుగు అదనపు స్టేషన్ల నిర్మాణానికీ ప్రణాళికలు సిద్ధం చేసే అవకాశం ఉంది. -
తప్పిన ప్రమాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై దొర్లిన విమానం!
బెంగళూరు: బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఓ విమానం సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా వెనక్కి మళ్లింది. అంతేకాకుండా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా.. రన్‌వేపై అదుపుతప్పి ప్రమాదకరంగా దిగింది. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. వివరాల్లోకి వెళితే.. హాల్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతున్న ప్రీమియర్ 1ఏ విమానం వీటీ-కేబీఎన్‌లో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విమానం టేకాఫ్ అయిన తర్వాత నోస్ ల్యాండింగ్ గేర్‌ను వెనక్కి తీసుకోలేనందున ఎయిర్‌టర్న్‌బ్యాక్‌లో చిక్కుకుంది. దీంతో విమానాన్ని తక్షణమే వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో రన్‌వేపై నీరు నిలిచింది. ఆ నీటిలోనే విమానం ముందుకుసాగింది. అయితే విమానపు నోస్ ల్యాండింగ్ గేర్ సరిగా లేకపోవడంతో ఒక్కసారిగా ముందుకు దొర్లింది. అయితే అదృష్టవశాత్తు చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నారు. ప్రయాణికులెవరూ లేరని డీజీసీఏ తెలిపింది. Bengaluru | A Fly By wire Premier 1A aircraft VT-KBN operating flight on sector 'HAL Airport Bangalore to BIAL' was involved in Airturnback as the nose landing gear couldn't be retracted after take off. The aircraft safely landed with the nose gear in Up position. There were two… pic.twitter.com/53zmaaKKEn — ANI (@ANI) July 11, 2023 చదవండి: ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే.. -
మోదీ తెలంగాణ పర్యటన వేళ కేసీఆర్ స్టాండ్ ఏంటి ?
-
ఎస్కలేటర్ లో చిక్కుకున్న మహిళ కాలు.. ఏం చేశారంటే..?
బ్యాంకాక్: నడిచే ఎస్కలేటర్ లో పొరపాటున కాలు పడి ఇరుక్కోవడంతో 57 ఏళ్ల మహిళ మోకాలి పైభాగం వరకు కాలును తొలగించిన సంఘటన థాయ్ లాండ్‌లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. దీంతో పర్యాటక కేంద్రమైన బ్యాంకాక్ ఎయిర్ పోర్టులో సౌకర్యాలపై అనుమానాలు కమ్ముకుని, ఇకపై బ్యాంకాక్ పర్యటన అంటే పర్యాటకులు ఆలోచించే పరిస్థితి నెలకొంది. డాన్ ముయాంగ్ ఎయిర్ పోర్టు డైరెక్టర్ కారంత్ తనకుల్జీరపత్ తెలిపిన వివరాల ప్రకారం నఖోన్ సి తమ్మారత్ వెళ్తోన్న ఒక మహిళ నడిచే ఎస్కలేటర్ మీద వెళ్తుండగా ఉన్నట్టుండి ఆమె కాలు ఎస్కలేటర్ లోపల ఇరుక్కుపోయింది. చాలాసేపు నొప్పితో విలవిల్లాడిపోయిన ఆ మహిళకు విముక్తి కలిగించడానికి విశ్వప్రయత్నాలు చేశామని అన్నారు. ఇరుక్కున్న కాలిని విడిపించేందుకు చాలాసేపు శ్రమించినా ప్రయోజనం లేకపోయింది. చివరి ప్రయత్నంలో ఆమె కాలును మోకాలి పైభాగం వరకు తొలగించి అనంతరం దగ్గర్లోని బుమ్రుంగ్రాండ్ అంతర్జాతీయ హాస్పిటల్ కు తరలించామని తెలిపారు కారంత్. ప్రమాదానికి గల కారణం ఏమిటన్న కోణంలో దర్యాప్తు జరుగుతోందని మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మా వలన ఆ మహిళకు జరిగిన నష్టానికి నా సానుభూతి తెలియజేస్తున్నానని.. జరిగిన తప్పిదానికి మేము పూర్తి బాధ్యత వహిస్తామని, ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు తోపాటు ఆమెకు ఎలాంటి పరిహారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు కారంత్. బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ.. మా అమ్మ పైకి ధైర్యంగానే ఉన్నప్పటికీ కాలు తీసేయడంతో ఆమె గుండె బద్దలైందని ఒకే కాలితో జీవితాంతం ఎలాగన్న ఆలోచన తనను లోలోపలే తొలిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది కూడా చదవండి: నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు -
ఎయిర్‌పోర్టు మెట్రోకు క్రేజ్!
హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ నిర్మాణానికి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. బిడ్డింగ్ గడువు సమీపిస్తుండడంతో పలు నిర్మాణసంస్థల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ సంస్థ టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. రూ.6 వేల కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, మరో ఐదు రోజులే మిగి లి ఉన్నందున మరిన్ని సంస్థలు బిడ్లను దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్లలో మెట్రో అందుబాటులోకి వచ్చిన తరువాత హైదరాబాద్ ముఖచిత్రం మారింది. వ్యాపార, వాణిజ్యరంగాలు, రియల్ఎస్టేట్ పరుగులు పెట్టాయి. నగరంలో మెట్రో రైలును నిర్మాణ సంస్థలు లాభదాయకమైన ప్రాజెక్టుగా భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐటీ, రియల్ రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిన రాయదుర్గం–శంషాబాద్ అంతర్జాతీయ విమా నాశ్రయ కారిడార్‌ను దక్కించుకొనేందుకు గ్లోబల్ స్థాయిలో పోటీ పెరిగింది. ఇప్పటికే ఎల్అండ్టీ, ఆల్స్టామ్, సీమెన్స్, టాటా ప్రాజెక్ట్స్, ఐఆర్సీఓఎన్, ఆర్వీఎన్ఎల్, బీఈఎంఎల్, పీఏఎన్డీఆర్ఓఎల్ రహీ టెక్నాలజీస్ తది తర జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన కంపెనీలు పోటీలో ఉండగా, గడువు ముగిసేనాటికి మరిన్ని సంస్థలు పోటీలో నిలిచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. రెండేళ్లలో పూర్తి... మరోవైపు ఈ మార్గాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ 2026 నాటికి పూర్తి చేసేవిధంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ కార్యాచరణ చేపట్టింది. తాము విధించిన నిబంధనలు, షరతులకు అనుగుణంగానే నిర్మాణ సంస్థలు తమ బిడ్లను దాఖలు చేయాలని గతంలోనే అధికారులు స్పష్టం చేశారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 31 కిలోమీటర్ల దూరంలో అందుబాటులోకి రానున్న ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ కోసం ఇప్పటి వరకు సర్వే, పెగ్‌మార్కింగ్, అలైన్మెంట్ తదితర పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో 29.3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కాగా, 1.7 కిలోమీటర్ల వరకు భూగర్భమార్గంలో ట్రాక్ నిర్మాణం చేపట్టవలసి ఉంటుంది. ఎయిర్‌పోర్టు టర్మినల్ సమీపంలో ఒక భూగర్భ మెట్రో స్టేషన్‌తో పాటు మొత్తం 9 మెట్రో స్టేషన్లు రానున్నాయి. ఈ ప్రాజెక్టు వ్యయంలో హెచ్ఎండీఏ, జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు 10 శాతం చొప్పున భరిస్తుండగా, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. మొదట 11 రైళ్లతో ప్రారంభం.. రాయదుర్గం –ఎయిర్‌పోర్టు మార్గంలో మొదట 11 రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. ప్రతిమెట్రోకు 3 కోచ్‌లు ఉంటాయి. మొత్తం 33 కోచ్‌లతో సర్వీసులను అందుబాటులోకి తెస్తారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా కోచ్‌ల సంఖ్యను పెంచనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌మెట్రో 6 కోచ్‌లు, చైన్నె ఎయిర్పోర్ట్ మెట్రో 4 కోచ్‌లతో నడుస్తోంది. మొదట్లో రద్దీ సమయంలో ప్రతి 8 నిమిషాలకు ఒకటి, రద్దీ లేని సమయాల్లో ప్రతి 10 నిమిషాలకు ఒక ట్రైన్ చొప్పున నడుపుతారు. తరువాత రద్దీ వేళల్లో ప్రతి 3 నిమిషాలకు ఒకటి, రద్దీ లేని సమ యాల్లో ప్రతి 5 నిమిషాలకు ఒకటి చొప్పున నడిపే విధంగా ప్రణాళికలను రూపొందించినట్లు తెలిసింది. నగరం పడమటి వైపు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా కేవలం ఎయిర్‌పోర్టు ప్రయాణికులే కాకుండా అన్ని వర్గాల ప్రయాణికులు కూడా ఎయిర్పోర్ట్ మెట్రో సేవలను వినియోగించుకొనే అవకాశం ఉంది. దీంతో రైళ్లు, సర్వీసుల సంఖ్య భారీగా పెరగవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాథమికంగా 9 స్టేషన్లను ఖరారు చేసినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో మరిన్ని స్టేషన్లకు కూడా డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. -
అభిమాని చేసిన పనికి భావోద్వేగానికి గురైన తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. బాలీవుడ్ నటుడు విజయ వర్మతో ప్రేమ వ్యవహారం నిజమేనని తను ఎప్పుడైతే ఒప్పుకుందో ఒక్కసారిగా అందరి దృష్టి తమన్నాపై పడింది. విజయ్ వర్మ విషయంలో తన నిర్ణయాన్ని కొందరు తప్పుబడుతున్నా మరికొందరు తనకు సపోర్టుగా నిలుస్తాన్నారు. దీంతో తమన్నాకు ఎక్కడికెళ్లిన అభిమానుల తాకిడి ఎక్కువైంది. తాజాగా ముంబై విమానాశ్రయంలో ఒక అభిమానితో తమన్నా చాలా క్లోజ్‌గా ఇంటరాక్ట్ అయ్యింది. (ఇదీ చదవండి: మొబైల్‌తో ఇబ్బంది పడుతున్నాను.. ఆషూ రెడ్డి వీడియో విడుదల) దీంతో ఆ అభిమాని భావోద్వేగానికి గురయ్యారు. తమన్నాను కలిసిన తర్వాత ఆ వ్యక్తి ఆమె పాదాలను తాకారు. అనంతరం ఒక బొకేతో పాటు లేఖను కూడా మిల్కీ బ్యూటీకి ఇచ్చారు. అపై తన చేతిపై పచ్చబొట్టు కూడా చూపించడంతో తమన్నా ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. టాటూలో 'లవ్ యు ది తమన్నా' అనే పదంతో పాటు తమ్ము ఫోటోను అభిమానంతో వేపించుకున్నారు. అనంతరం ఆ అభిమానిని తమన్నా కౌగిలించుకుని చాలాసార్లు 'ధన్యవాదాలు' అని చెప్తూనే కారులోకి వెళ్లింది. (ఇదీ చదవండి: ఆకాంక్ష పూరి నడుమును కెమెరాల ముందే పట్టుకున్న నటుడు) అభిమానుల స్పందన అయ్యో ఈ వీడియో చూస్తుంటే ఏడుపొస్తుంది. అభిమానుల పట్ల తమన్నా చూపించే ప్రేమ ఎలా ఉంటుందో.. ఈ వీడియో చూస్తే చాలంటూ ఒక ఫ్యాన్ కామెంట్ చేశాడు. తను బంగారం లాంటి వ్యక్తి 13 ఏళ్లుగా తెలుసు.. అభిమానులను చాలా గౌరవంగా భావింస్తుంది అంటూ తమన్నాను పలు అభినందనీయమైన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
క్యాట్ థెరపీ: లవ్యూ అంటూ ముచ్చటపడుతున్న నెటిజన్లు
ఎన్నిసార్లు రైల్లో ప్రయాణం చేసినా,రిజర్వేషన్ ఉన్నాకూడా ట్రాఫిక్ మహా సముద్రాన్ని ఈది స్టేషన్‌కు చేరి, ట్రైన్ ఎక్కి మన సీట్లో మనం కూర్చునేదాకా మహా గొప్ప టెన్షన్.. అలాగే ఎంత అనుభవం ఉన్నా.. ఎన్నిసార్లు గాల్లో విహరించినా ఎక్కిన ఫ్లైట్ దిగేదాకా విమాన ప్రయాణం అంటే అదో అలజడి. ఎలాంటి వారికైనా కొద్దో.. గొప్పో..ఈ ఒత్తిడి తప్పదు కదా. బహుశా అందుకేనేమో శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం అధికారులు వినూత్నంగా ఆలోచించారు. USA టుడే ప్రకారం బ్లాక్ అండ్ వైట్ రెస్క్యూ క్యాట్ ఇటీవలే విమానాశ్రయంలోని వాగ్ బ్రిగేడ్‌లో చేరింది. విమాన ప్రయాణీకుల ఒత్తిడిని, ఆందోళనను తగ్గించేందుకు ఈ అందమైన పిల్లి సిద్ధంగా ఉంటుంది. ఈ తరహా థెరపీని అందిస్తున్న మొదటి పిల్లి డ్యూక్ ఎల్లింగ్టన్ మోరిస్. 14 ఏళ్ల థెరపీ క్యాట్ శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో సరికొత్త ఉద్యోగి. మా డ్యూక్ అసలు ఎవర్నీ నిరాశపర్చదు. ఒక్క క్షణం డ్యూక్‌ని పలకరిస్తే ప్రయాణ టెన్షన్ మొత్తం ఎగిరిపోతుందని, ఎలాంటి భయం, బెరుకూ లేకుండా ప్రయాణం పూర్తిచేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రయాణీకులతో ఎలా మెలాగాలో, వారిలో ఒత్తిడిని పొగొట్టి, నవ్వులు ఎలా పూయించాలో కూడా ఈ పిల్లికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారట. యానిమల్ థెరపిస్ట్‌గా సర్టిఫికేట్ కూడా పొందిందట. ఎయిర్‌పోర్ట్‌లో ఊపుకుంటూ తిరుగుతూ, పలకరిస్తూ, నవ్వులు పూయిస్తున్న డ్యూక్‌ని చూసిన ప్రయాణికులు, అందులోనూ క్యాట్ లవర్స్ తెగ మురిసిపోతున్నారట. దీంతో డ్యూక్‌ని కలవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నామంటూ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో యానిమల్ కేర్ అండ్ కంట్రోల్ 2010లో ఆకిలితో ఉన్న ఈ పిల్లిని గుర్తించడంతో ఒక కుటుంబం దీన్ని దత్తత తీసుకుంది శాన్ ఫ్రాన్సిస్కో సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ ద్వారా డ్యూక్ థెరపీ యానిమల్ శిక్షణ పొందింది. కాగా శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం ఈ కార్యక్రమాన్ని 2013లో ప్రారంభించింది. సర్టిఫైడ్ థెరపీ జంతువులను టెర్మినల్స్‌లో ఉంచుతుంది. తద్వారా ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా మార్చడమే లక్ష్యమని విమానాశ్రయ అధికారుల మాట. -
ఇది వేధించడం గాక ఇంకేంటి?.. ఆమెను అడ్డుకోవడంపై మమత ఫైర్
బొగ్గు కేసులో విచారణలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు చెందని అభిషేక్ బెనర్జీ భార్య రుజీరాను అధికారులు కోల్‌కతా విమానాశ్రయంలో అడ్డుకోవడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుపట్టారు. ఆమె తన ప్రయాణ ప్రణాళికలు గురించి ఈడికి తెలియజేసినప్పటకీ అడుకున్నారని సీరియస్ అయ్యారు. ఇది వేధించడం గాక ఇంకేమిటి అని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరం అని అన్నారు. అభిషేక్ బెనర్జీ అత్తగారికి అనారోగ్యంగా ఉంది. అందువల్ల అతడి భార్య తన తల్లిని కలిసేందుకు వెళ్లింది. ఆమె కోల్‌కతాను విడిచి వెళ్లాలంటే ముందుగానే ఈడీకి తెలియజేయాలని సుపప్రీం కోర్టు పేర్కొంది. ఆ ప్రకారమే ఆమె ఈడీకి సమాచారం అందించినప్పటికి అలా ఎలా చేసింది ఈడీ అని ప్రశ్నించారు. ఆమెనున విమానాశ్రయంలో అడ్డుకోవడం పిలిపించడం ఇవన్నీ వేధింపులు గాక మరొకటి కాదని అన్నారు మమతా. ఇదిలా ఉండగా, అభిషేక్ బెనర్జీ ఈ విషయమై మాట్లాడుతూ..తన భార్య ప్రయాణం ప్రణాళిక గురించి ముందుగానే ఈడీకి తెలియజేశామని అన్నారు. దుర్మార్గపు ఉద్దేశాలు ఉంటే వారికి తెలియజేయాల్సిన అవసరం ఉండదు కదా అని అనఆనరు. తాను చేస్తున్న తృణమూలే నబో జోవర్ ప్రచారానికి వచ్చిన ప్రతిస్పందనతో బీజేపీ ఉలిక్కిపడుతోందన్నారు. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ దానిని అడ్డుకోవాలని చూస్తుంది. మమ్మల్ని వేధించడానికి మార్గాలు వెతుకుతోందని ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ..నా భార్యను, నా పిల్లలను లేదా నన్ను ఈడీ అరెస్టు చేసినా తాను తల వంచేదే లేదని తేల్చి చెప్పారు. ప్రధాని కుర్చిపై ఉన్న గౌరవంతో ఆయనకు ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నానని అన్నారు. నావయసు ఆయన రాజకీయ అనుభవం అంత కాకపోవచ్చు..కానీ మీరు నాతో రాజకీయంగా ప్రజాకోర్టులో పోరాడలేకపోతున్నారని విమర్శించారు అభిషేక్ బెనర్జీ. అభిషేక్ ఆరోపణలపై బీజేపీ స్పందిస్తూ..ఈడీ స్వతంత్ర సంస్థ అని, బీజేపీకి ఈడీ లేదా సీబీఐతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని, ఏవైన ఫిర్యాదులు ఉంటే ఎప్పుడైన వారు కోర్టుని ఆశ్రయించవచ్చు అని బీజేపీ నాయకుడు రాహుల్ సిన్హా అన్నారు. (చదవండి: ఆ దుర్ఘటన తర్వాత టికెట్లు రద్దయ్యాయి!..వివరణ ఇచ్చిన రైల్వేస్) -
‘బాంబు.. బాంబు’ విమానంలో యువకుని కేకలు.. తరువాత జరిగిందిదే!
కోల్‌కతా నుంచి దోహా వెళుతున్న కతర్ ఎయిర్వేస్లో ఆ సమయంలో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. విమానంలో ఉన్న ఒక యువకుడు ‘బాంబు.. బాంబు’ అంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. దీంతో క్రూ మెంబర్స్ ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్కు తెలియజేశారు. వెంటనే విమానంలో తనిఖీ చేపట్టారు. అయితే ఆ యవకుని తండ్రి అధికారులతో మాట్లాడుతూ తన కుమారుని మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిపారు. వివరాల్లోకి వెళితే కతర్ ఎయిర్వేస్కు చెందిన క్యూఆర్541, విమానం కోల్‌కతా నుంచి దోహాకు బయలుదేరడంలో ఆలస్యం జరిగింది. ఒక యువకుడు విమానంలో బాంబు ఉందంటూ పెద్దగా కేకలుపెట్టాడు. విమానంలోని క్రూ మెంబర్స్ వెంటనే ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్కు చేరవేశారు. వెంటనే భద్రతా దళాలు పరుగుపరుగున వచ్చి, విమానంలోని ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. వారు ఆ యువకుడిని ప్రశ్నించగా... ఎవరో తనతో విమానంలో బాంబు ఉందని చెప్పారని అన్నాడు. కాగా సీఐఎస్ఎఫ్ బృందం ఎయిర్‌క్రాఫ్ట్‌ను స్నిఫర్ డాగ్స్ సాయంతో తనిఖీ చేయించారు. ఇంతలో ఆ యువకుని తండ్రి అధికారులతో మాట్లాడుతూ తన కుమారుని మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతూ, అందుకు సంబంధించిన ధృవపత్రాలను కూడా చూపించాడు. ఈ ఘటన కారణంగా విమానం బయలుదేరడంలో ఆలస్యం జరిగింది. బాంబు లేదని నిర్థారించాక ప్రయాణికులను తిరిగి విమానంలోకి అనుమతించారు. కాగా దీనికిముందు గత ఫిబ్రవరిలో హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న విమానంలో బాంబు ఉందంటూ సూచన అందించింది. దీంతో ఆ విమానాన్ని లక్నోలోని చౌదరి చరణ్‌సింగ్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. తరువాత విమానంలో తనిఖీలు జరిపారు. అయితే విమానంలో ఎటువంటి బాంబు లభ్యంకాలేదు. ఈ ఘటనలో బాంబు ఉందంటూ వదంతులు వ్యాపింపజేసిన హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: ఆమె 18 ఏళ్ల తరువాత తన ఎల్కేజీ ఫ్రెండ్‌ను కనిపెట్టిందిలా.. -
విశాఖ ఎయిర్ పోర్ట్ లో వెలగపూడికి చంద్రబాబు క్లాస్
-
దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న చిత్రం దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి గతవారం దుబాయ్ వెళ్లారు. ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ ఫ్యామిలీతో కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. (ఇది చదవండి: పెళ్లిపీటలెక్కనున్న జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్!) అయితే ఫ్యామిలీతో దుబాయ్ వేకేషన్ వెళ్లిన తారక్ శనివారం హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో తన కుమారులతో కలిసి కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తోన్న ఎన్టీఆర్ తదుపరి షెడ్యూల్ కోసం గోవా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచాపరం. ఒక పాటతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తారని తెలుస్తోంది. (ఇది చదవండి: మరోసారి జంటగా లవ్ బర్డ్స్.. డేటింగ్‌పై మొదలైన చర్చ!) -
నటుడికి చేదు అనుభవం.. ఎయిర్‌పోర్ట్‌లో భార్యతో అసభ్యంగా!
ప్రముఖ బెంగాలీ నటుడు మైనాక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయంలో అతని భార్యను రిసీవ్ చేసుకోవడానికి వెళ్లగా అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది గొడవ పెట్టుకున్నారు. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. అయితే గొడవకు సంబంధించి ఫేస్బుక్ లైవ్‌లో మొత్తం ఎపిసోడ్‌ను వివరించాడు బెనర్జీ. (ఇది చదవండి: దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..) ఆ తర్వాత బెనర్జీ మాట్లాడుతూ..' నా భార్య చెన్నై నుంచి విమానాశ్రయానికి వచ్చింది. ఆమె కోసం కారు తీసుకుని గేట్ వద్దకు వెళ్లా. అయితే నా వాహనాన్ని అక్కడి నుంచి తొలగించాలని పోలీసు నాకు చెప్పాడు. అక్కడే చాలా వాహనాలు ఉన్నాయని.. అయితే పోలీసులు వారిలో ఎవరికీ చెప్పలేదు. అంతే కాకుండా నా భార్యతో అసభ్యంగా ప్రవర్తించారు. అందుకే నేను కారు నుంచి దిగాల్సి వచ్చింది.' అని అన్నారు. (ఇది చదవండి: లగ్జరీ కారు కొనుగోలు చేసిన స్టార్ హీరో.. ఎన్ని కోట్లంటే?) అసలేం జరిగిందంటే.. తన భార్య ఐశ్వర్యను రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్పోర్ట్ గేటు ముందు మైనాక్ బెనర్జీ కారు ఆపాడు. అతని భార్య లగేజీ ఎక్కువగా ఉండడంతో కొంత సమయం పట్టింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న పోలీసు భద్రతా సిబ్బంది కారు త్వరగా తీయాలని చెప్పారు. అదే ఇరువురి మధ్య గొడవకు దారి తీసింది. -
పబ్లిక్‌లో ఇలాంటి పనులా?.. నటిపై నెటిజన్స్ ట్రోల్స్
బాలీవుడ్ నటి హీనా ఖాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా తళుక్కున మెరిసింది. శ్రీనగర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో పాల్గొన్న ముద్దుగుమ్మ ముంబయి విమానాశ్రయంలో హల్చల్ చేసింది. సమావేశాల అనంతరం ముంబయి చేరుకున్న భామకు బాయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్ ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికాడు. అదే సమయంలో ఈ జంట లిప్లాకక్తో ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. అయితే ఇలా బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం ఏంటని నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. (ఇది చదవండి: 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న 'పోకిరి' విలన్) అంత త్వరగా ముద్దుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరొకరు రాస్తూ పబ్లిక్ ముందు ఇలా చేసినందుకు సిగ్గుపడండి అంటూ రాసుకొచ్చారు. వార్తల్లో నిలిచేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారా అంటూ మరో నెటిజన్ మండిపడ్డారు. పబ్లిక్ ఇలాంటి పనులు చేయడాన్ని ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. కాగా.. హీనా ఖాన్, రాకీ జైస్వాల్ చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉన్నారు. వీరిద్దరి రిలేషన్‌పై బిగ్ బాస్ హౌస్‌లో కూడా ఆమె మాట్లాడింది. గతంలో ఈ జంట బ్రేకప్ చేసుకుందని వార్తలొచ్చాయి. ఈ వార్తలను హీనా ఖాన్ ఖండించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!) హీనా ఖాన్ బాలీవుడ్ బుల్లితెర నటిగా ఫేమ్ తెచ్చుకుంది. యే రిష్తా క్యా కెహ్లతా హైలో అక్షరా, కసౌతి జిందగీ కే 2లో కొమొలికా పాత్రలో ఆమెకు గుర్తింపు దక్కింది. ఖత్రోన్ కీ కిలాడీ, బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోస్‌లో రన్నరప్‌గా నిలిచింది. #HinaKhan spotted at Mumbai Airport Rocky came to pick her 🧿💕❤️ @eyehinakhan @JJROCKXX #HiRo #HinaKhan #rRockyJaiswal #NachBaliye #NachBaliye10 #CoupleGoals #Couple #Love #Mumbai #Airport #MumbaiAirport #AirportFashion #Bollywood #BollywoodActress pic.twitter.com/hgECADd84t — hina_khanfc (@Mohamme37896951) May 24, 2023 -
గుండెపోటుతో విమానంలో ప్రయాణికుడు మృతి
సాక్షి, గన్నవరం: షార్జా నుంచి విజయవాడ వస్తున్న విమానంలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. విమానాశ్రయ వర్గాల సమాచారం మేరకు... ఏలూరు జిల్లా నిడదవోలుకు చెందిన చెక్కా నూకరాజు(85) కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో బంధువుల వివాహ కార్యక్రమం నిమిత్తం సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి షార్జా నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)కు బయలు దేరారు. విమానం మరో అరగంటలో ఎయిర్‌పోర్టుకు చేరనుందనగా నూకరాజుకు ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. విమానంలోని సిబ్బంది ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. పైలెట్ల సమాచారం మేరకు విమానం ల్యాండ్ అయిన వెంటనే నూకరాజును ఆస్పత్రికి తరలించేందుకు అధికారులు అంబులెన్స్‌ను సిద్ధం చేశారు. విమానాశ్రయంలో నూకరాజును పరీక్షించిన అంబులెన్స్ సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం నిడదవోలుకు తీసుకువెళ్లారు. ఈ విమానంలో మృతుడి కుమారుడు, భార్యతో పాటు మరో ఏడుగురు బంధువులు ఉన్నారు. (చదవండి: YSRCP: చారిత్రక విజయానికి నాలుగేళ్లు.. ) -
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఎయిర్‌పోర్టులు, ఇవే (ఫోటోలు)
-
ఆ ఎయిర్ లైన్స్, ఎయిర్‌పోర్ట్‌లకి భారీ షాక్! ప్రయాణికుడి పట్ల అలా వ్యవహరించడంతో..
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కి, ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి వినియోగదారుల కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఓ ప్రయాణికుడి సంరక్షణ విషయంలో అలా వ్యవహరించినందుకు చురకలంటిస్తూ భారీగా నష్ట పరిహారం చెల్లించమని ఆదేశించింది కోర్టు. ఈ ఘటన బెంగుళూరు కెంపెగోద్వా అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అసలేం జరిగందంటే.. నవంబ్ 2021లో చంద్ర శెట్టి అనే ప్రయాణికుడు అతడి కుటుంబం మంగళూరులోని తమ స్వగ్రామానికి వెళ్లడం కోసం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానకి చేరుకున్నాడు. సరిగ్గా అప్పుడే అనూహ్యంగా శెట్టి నేలపై కుప్పకూలిపోయారు. అదే సమయంలో అతని పక్కనే ఉన్న భార్య సుమతి, కూతురు దీక్షిత విమానాశ్రయ సిబ్బందిని, ఎయిర్‌పోర్టు అధికారులను సాయం చేయమని కోరారు. అయితే వారంతా బాధితుడికి సహాయం చేయడంలో విఫలమయ్యారు. కనీసం అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు కనీసం వీల్‌చైర్ కూడా అందుబాటులో లేదు. దీంతో కుటుంబం సభ్యులు అతడిని రక్షించుకోవడం కోసం ఎంతో తర్జనాభర్జనా పడి సుమారు 45 నిమిషాలకు ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మార్గమధ్యలో చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో బాధితుడు కుటుంబ సభ్యులు కెంపెగోద్వా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పోలీస్టేషన్ని ఆశ్రయించి కేసు నమోదు చేశారు. ఐతే కేసులో పెద్దగా పురోగతి లేకపోవడంతో సదరు కుటుంబం బెంగళూరు అర్బన్ జిల్లాలో ఉన్న వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించింది. అయితే విమానాశ్రయ అధికారులు వినియోగదారుల కోర్టు ఎదుట ఆరోపణలను తిరస్కరించగా, ఇండిగో మాత్రం పదేపదే నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించ లేదు. చివరికి బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సదరు బాధిత ప్రయాణికుడని టెర్మినల్‌లోని క్లినిక్‌కి తీసుకెళ్లామని, ఈ తర్వాత బగ్గీలో ఆస్టర్ ఆస్పత్రికి తరలించినట్లు డాక్యుమెంట్లను కోర్టుకి సమర్పించింది. దీంతో వినయోగాదారుల కోర్టు కుటుంబ సభ్యుల ఆరోపణలను సమర్థిస్తూ..విమానాశ్రయ సిబ్బంది, ఎయిర్‌లైన్స్ సదరు ప్రయాణికుడి సంరక్షణ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించినట్లు గుర్తించామని స్పష్టం చేసింది. ప్రయాణికులకు కావాల్సిన చోట సురక్షితమైన వాతావరణాన్ని అందిచాల్సిన బాధ్యత ఎయర్పోర్టు, ఎయిర్లైన్స్లదేనని పేర్కొంది. అందువల్ల బాధితుడి కుటుంబానికి నష్టపరిహారంగా బెంగుళూరు ఎయిర్‌పోర్టు, ఇండిగో ఎయిర్‌లైన్స్ సంయుక్తంగా దాదాపు రూ.12 లక్షలు చెల్లించాలిని, అలాగే కోర్టు ఖర్చుల కింద రూ. 10 వేలు చెల్లించాలని వినియోగాదారుల కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశం వచ్చిన 45 రోజుల్లోపు చెల్లించాలని పేర్కొంది. (చదవండి: త్వరలో కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం! 9 ఏళ్ల పాలనకు గుర్తుగా..) -
ఎయిర్‌పోర్ట్‌లో అడుక్కుంటున్న యువకుడు.. చివరికి ఏం జరిగిందంటే!
బెంగళూరు: సాధారణంగా మనం రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో భిక్షాటన చేసేవాళ్లను చూస్తుంటాం. కానీ ఓ యువకుడు ఏకంగా ఎయిర్ పోర్టులోని ప్రయాణికుల వద్ద భిక్షాటన చేస్తు కనిపించాడు. ఇది గమనించిన విమానాశ్రయ సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విఘ్నేశ్ అనే 27 ఏళ్ల యువకుడు ఎయిర్ పోర్టులో ప్రవేశించేందుకు చెన్నై వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. విమానాశ్రయంలోకి వెళ్లి అక్కడ ఉన్న ప్రయాణికుల వద్ద.. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తక్షణ వైద్యం అందించాలని తప్పుడు కథనాన్ని సృష్టించాడు. ఈ విధంగా చెబుతూ ప్యాసింజర్ల నుంచి రూ. 7వేలు, పదివేలు కావాలంటూ అభ్యర్థించడం మొదలుపెట్టాడు. అతని ప్రవర్తన చూసిన కొందరు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అతడ్ని అరెస్ట్ చేసి 420 సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆ యువకుడిని నుంచి 26 క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకోగా.. అందులో 24 క్రెడిట్ కార్డులు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదంతా ఓ ముఠా పని అయ్యిండచ్చని.. విఘ్నేశ్ కూడా ఆ గ్యాంగ్‌లో ఒక్కడే అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో ఈ తరహా కార్యకలాపాలు జరగడం చాలా అరుదు. రెండేళ్ల క్రితం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి ఘటనే జరగగా.. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో ఇటువంటి ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
అభిమానిని తోసేసిన షారూక్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్స్
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇటీవలే పఠాన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణే కూడా నటించారు. గతేడాది విడుదలైన పఠాన్ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. అయితే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో జవాన్‌లో నటిస్తున్నారు. (ఇది చదవండి: నాలుగు రోజుల్లో 500కు పైగా సిగరెట్లు తాగాను: అల్లరి నరేశ్) తాజాగా ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాల కంటికి చిక్కారు షారూక్. దీంతో అభిమానులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని సెల్ఫీ కోసం యత్నించారు. దీంతో షారూక్ సహనం కోల్పోయాడు. ఒక్కసారిగా అగ్రహం వ్యక్తం చేస్తూ అభిమాని చేతిని దూరంగా నెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు షారూక్ తీరుపై మండి పడుతున్నారు. ఓ నెటిజన్ రాస్తూ..' సెల్ఫీలు తీసుకోవాల్సింది ఇలాంటి వారితో కాదు. దేశం కోసం పోరాడుతున్న ఆర్మీ, మనదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్న వారితో దిగండి అంటూ సలహాలిచ్చారు. మరొక నెటిజన్ రాస్తూ..' మీ పర్మిషన్ లేకుండా మీతో సెల్ఫీ తీసుకుంటే ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం షారుక్ ఖాన్ నటిస్తోన్న జవాన్ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో పోషిస్తున్నారు. మరోవైపు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న డుంకీలో కూడా కనిపించనున్నారు. (ఇది చదవండి: రెండు నెలల క్రితమే నరేశ్-పవిత్ర పెళ్లి చేసుకున్నారా? అరె ఏంట్రా ఇది!) -
భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం
-
చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పాము కలకలం..ఏకంగా 22 పాములు..
చైన్నై ఎయిర్ పోర్ట్‌లో ఒకటి రెండుకాదు ఏకంగా 22 పామలు తీవ్ర కలకలం రేపాయి. దీంతో చెన్నై ఎయిర్పోర్ట్ వార్తల్లో నిలించింది. ఓ మహిళా ప్రయాణికురాలి లగేజ్ బ్యాగ్‌ని తనిఖీలో భాగంగా సోదా చేస్తుండగా.. ఓ పారద్శక ప్లాస్టిక్ కంటైనర్‌లో సర్పాలు ఉండటాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ పాములను రాడ్‌తో తీస్తుండగా.. మరికొన్ని పాములు పెట్టెల్లోంచి బయట నేలపైకి వచ్చేయడం జరిగింది. ఆ లగేజ్ బ్యాగ్‌లో ఊసరవెల్లిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సదరు మహిళ ఏప్రిల్ 28న కౌలాంలంపూర్ నుంచి ఏకే13 విమానంలో చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి వచ్చింది. అక్కడ కస్టమ్స్ అధికారులు ఆమెను అడ్డుకుని తనిఖీలు నిర్వహించగా ఈ విషయం వెలుగు చూసింది. కస్టమ్స్ అధికారులు ఆమెపై వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ట్వీట్ చేశారు. Woman who smuggles snakes 🐍 A woman was held at Chennai Airport with 22 snakes She arrived from Kuala Lumpur by Flight No. AK13 On examination of her checked-in baggage, 22 Snakes of various species and a Chameleon were found & seized pic.twitter.com/TI39llr72O — Atulkrishan (@iAtulKrishan) April 29, 2023 (చదవండి: సైన్యాధికారిణిగా గల్వాన్ అమరుని అర్ధాంగి)