మొదటి నెలలో 27,000 మందికి సర్వీసు
ఎయిర్‌పోర్ట్‌లో స్నాక్స్ ధర రూ.వందల్లో ఉంటుందని తెలుసుకదా. అయితే కొత్తగా ప్రారంభించిన కేఫ్‌లో మాత్రం కేవలం రూ.10కే టీ, వాటర్ బాటిల్, రూ.20కే సమోసా, స్వీటు లభిస్తుంది. ‘అదేంటి.. షాపింగ్ మాల్స్‌లోనే వాటర్ బాటిల్ రూ.80 వరకు ఉంది. మరి ఎయిర్‌పోర్ట్‌లో ఇంత తక్కువా..?’ అని ధరలు చూసి ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ‘ఉడాన్ యాత్రి కేఫ్’ను ప్రారంభించింది. విమాన ప్రయాణికులకు చౌకగా స్నాక్స్ అందించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు.
కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా ప్రారంభించిన ఉడాన్ యాత్రి కేఫ్ పుణ్యమా అని సరసమైన స్నాక్స్ ధరలు అందుబాటులోకి వచ్చాయి. 2024 డిసెంబర్ 21న పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ కేఫ్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతిరోజూ సుమారు 900 మంది ప్రయాణీకులు ఈ కేఫ్ సేవలు వినియోగించుకుంటున్నట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. దీని ఆవిష్కరణ సమయంలో మంత్రి మాట్లాడుతూ..విమానాశ్రయంలో ఆహార ధరల పెరుగుదలపై దీర్ఘకాలంగా వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
No more overpriced food at the airport. Now you can have affordable snacks at airports at Udaan Yatri Cafe.
Tea : ₹10
Water : ₹10
Samosa : ₹20
Sweet : ₹20 pic.twitter.com/SGEsKGjEf8— Aaraynsh (@aaraynsh) January 23, 2025
ఇదీ చదవండి: 2,000 ఐడీలను బ్లాక్ చేసిన రైల్వేశాఖ
ధరలిలా..
ఉడాన్ యాత్రి కేఫ్‌లో ప్రయాణికులు రూ.10కే టీ, రూ.10కే వాటర్ బాటిల్, కేవలం రూ.20కే సమోసా, రూ.20కు స్వీట్లు వంటి స్నాక్స్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ధరలు విమానాశ్రయంలోని ఇతర ఆహార దుకాణాలు వసూలు చేసే అధిక రేట్లకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రయాణీకుల నుంచి ఈ కేఫ్‌కు సానుకూల స్పందన వస్తోంది. కేఫ్ ప్రారంభించిన మొదటి నెలలో సుమారు 27,000 మంది ప్రయాణీకులకు సేవలు అందించింది. ఇతర విమానాశ్రయాల్లో ఈ నమూనా కేఫ్‌లను ప్రారంభించాలని ప్రయాణికుల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment