water bottle
-
ఈ నీళ్లు.. చాలా ఖరీదు గురూ!
నీరు.. మానవాళికి తప్పనిసరిగా అవసరమైన వనరు. ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా లభ్యమయ్యే నీటిని ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. ఒక లీటరు వాటర్ బాటిల్ ఖరీదు సాధారణంగా రూ.20 ఉంటుంది. కంపెనీ, ఇతరత్రా అంశాలను బట్టి రూ.2వేల బాటిల్ కూడా ఉంది. కానీ జపాన్‌కు చెందిన ఫిల్లికో అనే కంపెనీ ఇంతకుమించిన ధరకు మంచినీళ్లను అమ్ముతోంది. ఆ కంపెనీ వాటర్ బాటిళ్ల ధర రూ.84వేల నుంచి మొదలై ఏకంగా రూ.8 లక్షల వరకు ఉంది. ధర చూస్తే గుండె గుభేల్మనడం ఎంత నిజమో.. ఆ బాటిల్ చూసిన తర్వాత వావ్ అని అనకుండా ఉండలేకపోవడం కూడా అంతే నిజం. ఆ బాటిల్ అందం అలాంటిది మరి. ఇంతకీ ఆ బాటిల్ నీళ్లకు అంత రేటెందుకు? అవేమైనా పైనుంచి దిగొచ్చాయా అనే కదా మీ సందేహం? ఔను.. జపాన్‌లో అత్యంత స్వచ్ఛమైన ప్రదేశంగా భావించే కోబ్‌లోని రౌకా నేషనల్ పార్క్‌లో ఉన్న నునోబికి ఫాల్స్ నుంచి రాతిశిలల ద్వారా సహజసిద్ధంగా శుద్ధి అయి కిందకు వచ్చిన నీళ్లవి. నునోబికి ప్రాంతం అటు పరిశ్రమలకు, ఇటు వ్యవసాయానికి చాలా దూరంగా ఉండటం వల్ల అక్కడ ఎలాంటి కాలుష్యం ఉండదు. అందువల్ల అక్కడ నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. పైగా రాతిశిలల్లో నుంచి ఫిల్టర్ కావడం వల్ల మరింత స్వచ్ఛత కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ నీటిలోని సహజసిద్ధమైన ఖనిజ లవణాలు, స్వచ్ఛత పోకుండా కనీస ప్రాసెసింగ్ పద్ధతులను ఉపయోగించి ప్యాక్ చేస్తారు. ఎంత కష్టపడి నాణ్యమైన నీటిని తీసుకొచ్చి జాగ్రత్తగా ప్యాక్ చేసినా.. రంగు, రుచి, వాసన లేని నీటికి మరీ ఇంత రేటేంటి బాస్ అంటారా? ఇదే డౌట్ ఫిల్లికో కంపెనీ యజమాని క్రిస్టియన్ డయోర్కీ వచి్చంది. మనిషికి నిత్యావసరమైన నీటిని లగ్జరీ వస్తువుగా అధిక ధరకు అమ్మడం ఎలా అని ఆలోచించారు.దేవతా రెక్కలు.. కిరీటాలు..» ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేయడం ద్వారా మార్కెటింగ్ చేయడం సులభం అని డియోర్ భావించారు. దానికి తగినట్టుగా తమ బాటిల్ డిజైన్‌ను వినూత్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. శాటిన్ గాజుతో కంటికి ఇంపుగా కనిపించేలా బాటిల్ డిజైన్ చేయించారు. తాము విక్రయించే ధరకు అది చాలదనే భావనతో దానికి అదనపు సొబగులద్దారు. బాటిల్ మూతలను రాజు, రాణి కిరీటాలను పోలి ఉండేలా రూపొందించారు.దేవతలకు రెక్కలు ఉన్నట్టుగా బాటిల్‌కు రెండు రెక్కలు కూడా జోడించారు. అవసరమైన చోట వెండి పూత పూయించారు. లగ్జరీ బ్రాండ్ స్ఫటికాలను ఉత్పత్తి చేసే స్వరోవ్స్కీ స్ఫటికాలను బాటిల్‌పై అమర్చారు. వెరసి.. చూసిన తర్వాత చూపు తిప్పుకోలేనంత అందమైన కళాఖండంగా తీర్చిదిద్దారు. దీనికి ఫిల్లికో జ్యవెలర్ వాటర్ అని పేరు పెట్టి.. ఇది సార్ మా బ్రాండ్ అంటూ తొలుత తమ వీఐపీ కస్టమర్లకు పరిచయం చేశారు. వారి నుంచి అద్భుత స్పందన వచ్చిoది. అనంతరం ఫిల్లికో కంపెనీ 2008లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించడంతో ఈ బ్రాండ్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. అంతే అక్కడ నుంచి వెనుతిరిగి చూడలేదు. 2005లో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. అయితే, బాటిళ్ల డిజైన్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటిని చేతితోనే తయారుచేస్తారు. అందువల్ల నెలకు 5వేల బాటిళ్లను మించి ఉత్పత్తి చేయరు. ఇది కూడా ఈ బ్రాండ్ డిమాండ్ కొనసాగడానికి మరో కారణం. ప్రస్తుతం ఫిల్లికో జ్యువెలరీ వాటర్ రెండో తరం నడుస్తోంది. ఈ బాటిల్ ప్రారంభ ధర వెయ్యి డాలర్లు. (దాదాపు రూ.84 వేలు). ఒక్కోసారి లిమిటెడ్ ఎడిషన్ పేరుతో మరింత వినూత్నమైన బాటిళ్లను ఉత్పత్తి చేసి విక్రయిస్తుంటారు. వాటి ధర ఏకంగా రూ.8.40 లక్షల వరకు కూడా ఉంటుంది. వాస్తవానికి ఆ బాటిల్లో ఉన్న నీళ్లను కాదు.. ఆ నీళ్లున్న బాటిల్‌ను ఇంత ధర పెట్టి కొనాలన్న మాట. అయితే, దాహం వేసిన ప్రతిసారీ ఈ నీటిని తాగితే కష్టమే కదా? కేవలం తమ స్టేటస్ సింబల్ చాటుకోవాల్సిన సందర్భాల్లో ఓ రెండు గుటకలు వేయక తప్పదు మరి. అసలే బ్రాండ్ వాటర్.. పైగా లిమిటెడ్ ఎడిషన్స్. ఆ మాత్రం ముందు జాగ్రత్త తప్పనిసరి.. కాదంటారా? – సాక్షి సెంట్రల్ డెస్క్ -
10 రూపాయిల వాటర్ బాటిల్ ఖరీదు వంద రూపాయలా?
ఢిల్లీ: రూ.10 వాటర్ బాటిల్ రూ.100కి అమ్మడం ఏంటి? అని ప్రశ్నిస్తూ ఓ ఐటీ ఉద్యోగి ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఐటీ ఉద్యోగి పల్లబ్దే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో రూ.10 వాటర్ బాటిల్‌ను రూ.100కి అమ్ముతున్నట్లు గుర్తించాడు. ఇదే విషయాన్ని ప్రముఖ ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటాను అడిగారు.How is @zomato allowed to sell Rs. 10 water bottles for Rs. 100 at concert venues where no one is allowed to bring their own bottles?@VijayGopal_ pic.twitter.com/clQWDcIb7m— Pallab De (@indyan) December 17, 2024 ‘తాము పాల్గొన్న ఈవెంట్లో వాటర్ బాటిల్స్ నిషేదం.ఈవెంట్ నిర్వహించే వాళ్లే వాటర్ బాటిళ్లనూ అమ్ముతున్నారు. దాహం వేస్తుంది కదా అని రూ.10 వాటర్ బాటిళ్లను రెండింటిని కొనుగోలు చేశా. రూ.20 ఇచ్చా. కానీ సదరు వాటర్ బాటిల్ అమ్మే వ్యక్తి నా నుంచి రూ.200 వసూలు చేశారు.‘ఎవరూ తమ సొంత వాటర్ బాటిళ్లను తీసుకురావడానికి అనుమతించని ఈవెంట్లో రూ.10 వాటర్ బాటిల్‌ను రూ.100కి విక్రయించడానికి జొమాటోకి అనుమతి ఎలా వచ్చింది? అని అడుగుతూ రెండు వాటర్ బాటిళ్ల ఫొటోల్ని ట్వీట్లో జత చేశాడు.పల్లబ్ ట్వీట్‌పై జొమాటో స్పందించింది. తాము, ఆ వాటర్ బాటిల్స్‌ను అమ్మలేదని, టికెటింగ్ పార్ట్నర్గా ఉన్నట్లు తెలిపింది. అయినప్పటికీ కస్టమర్‌కు కలిగిన అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. -
రోగాలను తాగేస్తున్నామా?.. లీటర్ నీటిలో లక్షల్లో మైక్రో ప్లాస్టిక్ కణాలు
సాక్షి, సెంట్రల్ డెస్్క: హోటల్‌కు వెళ్లి టిఫిన్ చేస్తే వాటర్ బాటిల్.. ఫంక్షన్లలో భోజనం చేస్తే వాటర్ బాటిల్.. ప్రయాణాల్లో దాహం వేస్తే వాటర్ బాటిల్.. ఇలా ఇబ్బడిముబ్బడిగా వాడేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి పది లక్షలకుపైగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాలు జరుగుతున్నట్లు తేలింది. ఈ విషయం బ్రిటిష్ మెడికల్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. తాగునీరు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లయినా తాగాలని డాక్టర్లు చెప్తుంటారు. దీంతో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ నీళ్లు తాగుతున్నారా, లేదా అని చూసుకుంటారు కానీ.. దేనిలో తాగుతున్నామనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ విస్మరిస్తున్నారు. సమృద్ధిగా నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటామనే భావనతో రోజువారీ జీవితంలో ఎడాపెడా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు కొనేసి ఉపయోగిస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి పది లక్షలకు పైగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను వినియోగిస్తుండగా.. ఈ ధోరణి భవిష్యత్తులో విపరీతంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పర్యావరణం, వాతావరణం పరంగా ప్రపంచం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని అధ్యయనం వెల్లడించింది. ఎందుకిలా? ప్రపంచవ్యాప్తంగా కుళాయి నీటి నాణ్యత మీద ప్రజలకు నమ్మకం లేకపోవడమే వాటర్ బాటిళ్ల వినియోగం పెరగడానికి ముఖ్య కారణమని అధ్యయనంలో తేలింది. అలాగే ఇవి ఎక్కడపడితే అక్కడ సులభంగా అందుబాటులో ఉండటం, వాటి ధర కూడా తక్కువగా ఉండటం, ఎక్కడికైనా తీసుకెళ్లడానికి అనువుగా ఉండటం మరో కారణమని నివేదిక తెలిపింది. లీటర్ నీటిలో 3 లక్షల మైక్రో ప్లాస్టిక్ కణాలు.. ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి.. అందులోని నీటిలోకి మైక్రో ప్లాస్టిక్లు, బీపీఏ(బిస్ఫెనాల్–ఏ) తదితర హానికర రసాయనాలు విడుదలవుతుంటాయి. ఒక లీటర్ వాటర్ బాటిల్లో లక్ష నుంచి మూడు లక్షల వరకు మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు తేలిందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇందులో 90 శాతం నానో ప్లాస్టిక్ కణాలే. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. పునరుత్పత్తి హార్మోన్లు, థైరాయిడ్ హార్మోన్లు, రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని నివేదిక తెలిపింది. రక్తపోటు, గుండె, మధుమేహం, ఊబకాయంతో పాటు మానవ అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని హెచ్చరించింది. పర్యావరణంపై ప్రభావం.. పర్యావరణం మీద అత్యంత ప్రభావం చూపిస్తున్న వాటిలో ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా ఒకటి. సముద్ర కాలుష్య కారకాల్లో మొదటి స్థానంలో ప్లాస్టిక్ సంచులు ఉండగా.. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లది రెండో స్థానం. ప్రపంచవ్యాప్తంగా కేవలం 30 శాతం ప్లాస్టిక్ బాటిళ్లు మాత్రమే రీసైక్లింగ్ అవుతున్నాయని తెలిపింది. మిగిలిన 70 శాతం నేలలో, నీటిలో చేరి పర్యావరణానికి, అనంత జీవరాశికి అనర్థం కలుగజేస్తున్నాయని వెల్లడించింది. అలాగే ప్రతి లీటర్ ప్లాస్టిక్ బాటిల్ కోసం 1.39 లీటర్ల నీటిని ఉపయోగిస్తూ.. నీటిని కూడా వృథా చేస్తున్నారని తెలిపింది. అంతేకాకుండా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు ఏటా 600 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తున్నాయని పేర్కొంది. తద్వారా వాతావరణ మార్పులకు దోహద పడుతున్నాయని వెల్లడించింది.ఏం చేయాలి..? ‘ప్రభుత్వాలు ప్రజలందరికీ సురక్షిత తాగునీటిని విస్త్రతంగా అందుబాటులోకి తీసుకురావాలి. దాని మీద ఉన్న అపోహలు తొలగించాలి. ప్లాస్టిక్ బాటిళ్లు వినియోగించకుండా అవగాహన కలి్పంచాలి. వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలను తెలియజేయాలి. అలాగే ప్లాస్టిక్ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా మట్టి, రాగి, స్టెయిన్ లెస్ స్టీల్ నీటి సీసాలను ఉపయోగించేలా ప్రజలను ప్రోత్సహించాలి’ అని నిపుణులు సూచిస్తున్నారు. -
వాటర్ బాటిల్ ధర తగ్గనుందా..?
ఆల్కహాల్‌లేని పానీయాలపై జీఎస్టీని సరళీకరించాలని ఇండియన్ బేవరేజ్ అసోసియేషన్ సూచించింది. డ్రింక్స్‌లో ఉండే చక్కెర పరిమాణం ఆధారంగా జీఎస్టీ రేటు విధించాలని తెలిపింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అన్ని విధాలా ప్రోత్సహిస్తే ఆల్కహాల్‌లేని పానీయాల మార్కెట్ దేశీయంగా 2030 వరకు రూ.1.5 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది.కార్బొనేటెడ్ పానీయాలపై పన్ను విధానాల మీద ఐసీఆర్ఐఈఆర్ నివేదిక విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇండియన్ బేవరేజ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జె.పి.మీనా మాట్లాడుతూ..‘ప్రస్తుతం ఈ విభాగ పరిమాణం రూ.60,000 కోట్లుగా ఉంది. భారత ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఆల్కహాలేతర పానీయాలు(సీసాల్లోని నీరు, సాఫ్ట్ డ్రింక్స్) కీలకం. భవిష్యత్తులో భారత్ ఈ విభాగంలో అంతర్జాతీయ తయారీ కేంద్రంగా అవతరించనుంది. ప్రస్తుతం 20 లీటర్లు లేదా అంతకుమించి నీళ్ల సీసాలకు 12 శాతం జీఎస్టీ, 20 లీటర్ల లోపైతే 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అలా కాకుండా ఒకే రేటు వర్తించేలా చూడాలి. నీళ్ల సీసాలన్నింటికీ 5 శాతం జీఎస్టీ విధించాలి’ అని సూచించారు.ఇదీ చదవండి: పెట్రోల్‌పై రూ.15, డీజిల్‌పై రూ.12 లాభం..!దేశీయంగా, అంతర్జాతీయంగా నీళ్ల సీసాల సరఫరాను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని మీనా తెలిపారు. ఈ విభాగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ఈ ప్రతిపాదన తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఆల్కహాలేతర పానీయాల్లో చక్కెర స్థాయులు ఎక్కువ ఉంటే అధిక జీఎస్టీ, తక్కువ ఉంటే తక్కువ జీఎస్టీ విధించాలన్నారు. దేశంలో వస్తు సేవల పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సమయంలో ఆల్కహాలేతర పానీయాలను హానికారక ఉత్పత్తుల కేటగిరీలో చేర్చారని చెప్పారు. దీనిపై ప్రభుత్వ వర్గాలు పునరాలోచించాలన్నారు. సాఫ్ట్డ్రింక్స్పై చక్కెర పరిమాణం ఆధారంగా జీఎస్టీ రేటు నిర్ణయించాలని సూచించారు. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్!..ఒక లీటర్‌కే..!
మన ప్రాథమిక అవసరాల్లో నీరు కూడా ఒకటి. నీరు లేకుండా భూమిపై మనుగడ సాగించడం అనేది అసాధ్యం. పెరుగుదలకు, నిర్వహణకు ఎంతో అవసరం నీరు. మానవ శరీరం దాదాపు 60% నీటితోనే ముడిపడి ఉంటుంది. మానవ శరీర పనితీరుకు అత్యంత అవసరం ఇది. ముఖ్యంగా జీర్ణక్రియ, శోషణ,పోషకాల రవాణాను సులభతరం చేయడంలో నీను ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. సెల్యులార్ ఫంక్షన్‌కు మద్దతు ఇస్తుంది. వంట చేసే దగ్గర నుంచి క్లీన్ చేయడానికి, చెట్లకు, జంతుజాలం ఉనికికి నీరు అవసరం. అలాంటి నీరుని అత్యంత ధరల్లో కూడా విక్రయిస్తారనే విషయం గురించి విన్నారా?. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ ఒకటి ఉంది. ఒక లీటర నీటికే ఎంత వెచ్చించాలో వింటే కంగుతింటారు. ఎందుకంతా అంటే..ఈ నీటిని చాలా ప్రత్యేకంగా తయారు చేయడం, దాని స్వచ్ఛత, ఫ్యాకేజింగ్ విధానం తదితరాల కారణంగా అంత లగ్జరీయస్ ఉంటుంది ఈ వాటర్ బాటిల్ ధర. వీటిని ప్రసిద్ధి బ్రాండ్ విడుదల చేస్తుంది. దీనిని ఫిల్లికో జ్యువెలరీ వాటర్ అని పిలుస్తారు. ఈ బాటిల్స్‌ని స్వరోవ్స్కీ స్పటికాలతో అలంకరిస్తారు. చక్కటి ఆభరణాల ముక్కలతో డిజైన్ చేస్తారు. అందువల్ల దీని ధర అంత రేంజ్లో ఉంటుంది. జపాన్‌లో కోబ్‌లోని సహజమైన నీటి బుగ్గ నుంచి తీసుకున్న నీరు ఇది. నాణ్యతకు ప్రసిద్ధి చెందింది. దీనికి తగ్గట్టుగా బాటిల్ డిజైన్ కూడా లగ్జరియస్‌గా ఉంటుంది. ప్రతి బాటిల్‌ని బంగారంతో డిజైన్ చేస్తారు. ఈ డిజైన్ని జపాన్ హస్తకళను హైలెట్ చేసేలా రూపొందిస్తారు. కొన్నిబ్రాండ్లు బంగారం, ప్లాటినం, అంతకంటే విలువైన రాళ్లతో డిజైన్ చేస్తారు. ఆ బాటిల్‌కి ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకురావడమే గాకుండా అంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేస్తున్నందుకు తగ్గట్టుగా ఆ బాటిల్ లుక్ ఉంటుంది. ఇంతకీ ఈ బాటిల్ లీటర్ నీటి ధర ఏకంగా రూ. 1,16,000/-(చదవండి: చీరకట్టులో హులా హూపింగ్..అథ్లెటిక్ సామర్థ్యాలతో..!) -
నీతా అంబానీ తాగే వాటర్ అంత ఖరీదా? మరి రూ.49 లక్షల బాటిల్ సంగతేంటి?
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అత్యంత స్టైలిష్ ఫ్యాషన్ ఐకాన్లలో ఒకరు. అందానికితోడు, వ్యాపార దక్షతకూడా ఆమె సొంతం. వివిధ దాతృత్వ , సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా ఉంటారు. అయితే నీతా బ్యూటీ సీక్రెట్ ఏంటి అనేది ఎపుడూ హాట్ టాపికే. ఇటీవల బ్యూటీ విత్ పర్పస్ హ్యుమానిటేరియన్ అవార్డు'కూడా దక్కించుకున్నారు. తాజాగా నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటిని తాగుతారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.. అదేంటి అవి నీళ్లా? లేక బంగారమా? ఇదేంటీ విడ్డూరం అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే.నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటిని వాడతారని చాలా చోట్ల ప్రచారంలో ఉంది. ఎంతయినా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ ముఖేష్ భార్య కదా. తనకు తక్కువేంటీ? అనుకునే వాళ్లున్నారు. తన సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేసిన నీళ్లను వాడతారని చెబుతారు. ఒక ప్రచారంలో ఆమె తాగే 750 మిల్లీలీటర్ల వాటర్ బాటిల్ ధర 27 వేల రూపాయలకు పైమాటే అని కూడా ప్రచారం చేఉశారు. ప్రపంచంలోనే ఖరీదైన నీళ్లు ఇవేనని, ఈ నీటిని తాగితే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు బరువు నియంత్రణలోఉండి, చర్మం నిగారింపును సంతరించుకుంటుందని ఒత్తిడి దూరం అవుతుందని ప్రచారం చేశారు. ఈ నీరు ఎక్కడ పడితే అక్కడ దొరకదని, వసంతకాలంలో ఫిజి, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశంలో ఏర్పడే గ్లాసియర్ల నుంచి సేకరిస్తారని, దాంతోపాటు ఖనిజ లవణాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయని, అందుకే ఈ వాటర్‌కు అంత క్రేజ్ ఉందని ప్రచారం చేశారు. దీనిపై ఓ సందర్భంలో నీతా అంబానీనే తెలిసిన వాళ్లు ఒకరు అడిగారు. మీ సౌందర్య రహస్యానికి, మీ ఉత్సాహానికి మీరు తాగే నీళ్లే కారణమా అని అడిగారు. ఆ ప్రశ్నవిని ఆశ్చర్యపోయిన నీతా అంబానీ.. ఖరీదైన నీళ్లంటూ జరుగుతున్న ప్రచారమంతా వట్టిదేనని తేల్చేశారట. రూ. 49 లక్షల వాటర్ బాటిల్ కథకాగా 2015లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆమె ఓ వాటర్ బాటిల్‌లోతో కనిపించారు. ఈ బాటిల్ ధర సుమారు రూ.49 లక్షలు అంటూ మార్ఫింగ్ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. అసలు కథ ఏంటంటే ప్రముఖ మెక్సికన్ డిజైనర్, ఫెర్నాండో అల్టామిరానో ఈ బాటిల్‌ను నిజంగానే బంగారంతో చేశారు. దాని పేరే అక్వాడి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అయితే ఖరీదైన నీళ్లలాగే.. ఖరీదైన బాటిల్ గురించి కూడా నీతా ఏదో ఒక స్పష్టత ఇస్తారేమో. -
కరెంట్‌తో పనిలేకుండానే వాటర్‌ని కూల్ చేసుకునే సింపుల్ టెక్నిక్!
ఖరీదైన సౌకర్యాలు సమకూర్చుకునేంత సంవద పేదల దగ్గర లేకపోవచ్చు. అయితే ప్రత్యామ్నాయ ఐడియాలకు మాత్రం కొదవ లేదు అని చెప్పే వీడియో ఇది. ఒక మూరుమూల గ్రామంలో ఒక పేదింటి మహిళ ‘ఫ్రిడ్జ్ అవసరం లేకుండా వాటర్‌ను సింపుల్‌గా ఇలా కూల్ చేసుకోవచ్చు’ అంటూ ఒక వాటర్బాటిల్లో నీళ్లుపోసి దానికి తడి వస్త్రం చుట్టి చెట్టుకొమ్మలకు వేలాడదీసింది.పావు గంటలో ఆ నీళ్లు చల్లబడ్డాయి. ‘తడి వస్త్రం బాటిల్ లోపల ఉన్న వేడిని బయటికి లాగుతుంది. మా ఊళ్లో అందరం ఇలాగే చేస్తాం’ అంటుంది ఆ యువతి. నిజానికి గతంలోకి వెదుక్కుంటూ వెళితే, ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇలాంటి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఆర్గానిక్ ట్రిక్స్ ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఐడియాలన్నీ పర్యావరణానికి హాని కలిగించనివే. పాపులర్ కంటెంట్ క్రియేటర్ దివ్య సిన్హా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. View this post on Instagram A post shared by Divya Sinha (@divyasinha266)(చదవండి: కేన్స్‌లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!) -
వాటర్ బాటిల్లోని నీరు ఎన్నాళ్లకు పాడవుతుంది?
నదిలో పారేనీరు నిత్యం శుభ్రంగా ఉంటుందని అంటారు. అయితే క్లోజ్డ్ బాటిల్లోని నీటికి గడువు తేదీ ఉంటుందా? అయితే ఆ నీరు ఎప్పుడు చెడిపోతుంది? దాని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎప్పుడో ఒకప్పుడు వాటిర్ బాటిల్‌పై గడువు తేదీని చూసేవుంటాం. ఒక నివేదిక ప్రకారం వాటిర్ బాటిల్లోని నీటిని దాని ప్యాకింగ్ తేదీ నుంచి రెండేళ్లపాటు వినియోగించవ్చు. బాటిల్లోని ప్లాస్టిక్ నెమ్మదిగా నీటిలో కరగడం ప్రారంభిస్తుందని, అందుకే రెండేళ్ల తర్వాత ఆ నీరు తాగడానికి పనికిరాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవానికి వాటర్ బాటిల్ గడువు తేదీ దానిలోని నీటికి సంబంధించినది కాదు. బాటిల్ గడువు తేదీ అని దాని అర్థం. వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ రీసెర్చ్ నివేదిక ప్రకారం పంపు నీటిని ఆరు నెలల పాటు నిల్వ చేయవచ్చు. ఆ నీటిని ఉపయోగించవచ్చు. అయితే కార్బోనేటేడ్ పంపు నీరు రుచి క్రమంగా మారుతుంది. ఎందుకంటే దానిలో నుంచి గ్యాస్ నెమ్మదిగా బయటకు వస్తుంది. గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ నీటిలో కలిసిన తర్వాత, అది కొద్దిగా ఆమ్లంగా మారుతుంది. అయితే కంటైనర్లను ఆరు నెలల పాటు చల్లని, పొడి, చీకటి ప్రదేశంలో ఉంచినట్లయితే ఆ నీటి రుచి ఎప్పటికీ మారదు. కంటైనర్లలో నీటిని నింపేటప్పుడు పైపులను నేరుగా ఉపయోగించకూడదని నిపుణులు చెబుతుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా ఫిల్టర్‌ను వాడాలని సూచిస్తుంటారు. ఆ నీటికి గాలి తగలకుండా ఉండేందుకు ఒక మూతను ఉంచాలి. నీటిని నిల్వ చేయడానికి మరొక మార్గం కూడా ఉంది. నీటిని సుమారు 15 నిమిషాలు మరిగించి, ఆ తరువాత చల్లబరిచి నిల్వ చేయవచ్చు. -
నాదెండ్ల మనోహర్‌పై నీళ్ల బాటిల్‌తో దాడి
తెనాలి(గుంటూరు జిల్లా): పొత్తు పెట్టుకున్నప్పటికీ తెనాలిలో టీడీపీ–జనసేన నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న తీవ్ర విభేదాలు గురువారం బట్టబయలయ్యాయి. జనసేన సీనియర్ నేత, తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌పై టీడీపీ వర్గీయులు నీళ్ల బాటిల్‌తో దాడి చేశారు. ఈ బాటిల్ ఆయన తలకు తగిలింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం తెనాలిలో జనచైతన్య పాదయాత్ర ప్రారంభించారు. బోసు రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వీనస్ టాకీస్ దగ్గరకు చేరుకుంది. అక్కడ టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) వచ్చి కలిశారు. ఆ వెంటనే రాజాకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోటీగా జనసేన కార్యకర్తలు నాదెండ్ల మనోహర్ జిందాబాద్.. అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాటలో టీడీపీ మహిళా కార్యకర్త ఒకరు ఇరుక్కుపోయారు. ఈ సమయంలో∙ఎవరో నీళ్ల బాటిల్‌ను నాదెండ్ల మనోహర్‌పైకి బలంగా విసిరారు. ఆయన తప్పుకోవాలని ప్రయత్నించినప్పటికీ తలకు తగిలింది. ఈ ఘటనతో అందరూ కంగుతిన్నారు. ఆలపాటి రాజా వర్గమే అక్కసుతో ఈ దాడికి పాల్పడిందని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆలపాటి రాజా టీడీపీ నుంచి తెనాలి టికెట్ ఆశించారని, ఆయనకు కాకుండా పొత్తుల్లో భాగంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు ఇవ్వడంవల్లే ఈ దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలతో పాదయాత్రకు వచ్చిన అనేక మంది యాత్ర పూర్తికాకుండానే వెళ్లిపోయారు. -
ఒక లీటర్ బాటిల్లో ఎన్ని నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయో తెలుసా!
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మంచిది కాదన్న విషయం తెలిసిందే. ఆ నీటిలోకి ప్లాస్టిక్ కణాలు ఉంటాయని అవి మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయిని విన్నాం. అంతవరకు తెలుసు కానీ ఎంత స్థాయిలో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయన్నది పూర్తిగా తెలియదు. ఈ తాజా అధ్యయనాల్లో రెండు లక్షలకు పైగా ప్లాస్టిక్ కణాలు, నానో ప్లాస్టిక్స్ ఉండొచ్చిన వెల్లడయ్యింది. అవి నేరుగా రక్తంలో ప్రవేశించి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో పీర్ రివ్యూడ్ స్టడీ పేరుతో ఈ పరిశోధన ప్రచురితమయ్యింది. ఈ నానో ప్లాస్టిక్ కణాలు మనిషి వెంట్రుకలో డెబై వంతు వెడల్పుతో ఉన్నాయని అన్నారు. మునపటి అధ్యయనాల్లో అంచనావేసిన దానికంటే వందరెట్లు ఉండొచ్చని చెబుతున్నారు. ఎందుకంటే? గత అధ్యయనాల్లో మైక్రోప్లాస్టిక్‌లు సుమారు ఐదు వేలు ఉన్నట్లు అంచనా వేశారు. అంతేగాదు మైక్రోప్లాస్టిక్‌ల కంటే రేణువుల్లా ఉండే ఈ నానో ప్లాస్టక్లు మరింత ప్రమాదకరమైనవి. ఇవి నేరుగా మాన రక్తప్రవాహంలో ప్రవేశించి అవయవాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పరిశోధకులు. అంతేగాదు ఇవి పుట్టబోయే బిడ్డలోకి మాయ ద్వారా చేరే అవకాశం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ నానోప్లాస్టిక్ని గుర్తించే సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందలేదన్నారు. ఆ పరిస్థితిని అధిగమించడానికి కొత్త మైక్రోస్కోపీ టెక్నీక్‌ను కనుగొన్నారు. అందుకోసం యూఎస్‌లోని మూడు ప్రసిద్ధ బ్రాండ్ల నుంచి సుమారు 25 లీటర్ వాటార్ బాటిళ్లను కొనుగోలు చేశారు. ప్రతి లీటర్లలో సుమారు ఒక లక్ష నుంచి మూడు లక్షల దాక ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. వాటిలో దాదాపు 90% వరకు నానోప్లాస్టిక్‌లు. ఈ పరిశోధన నానోప్లాస్టిక్‌లను విశ్లేషించడంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడుతుందని కొలంబియా పరిశోధకుడు నైక్సిన్ కియాన్ అన్నారు. వీటిలో ఏడు సాధారణ ప్లాస్టిక్ రకాలను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా పాలిథిన్ టెరెఫ్లాలేట్(పెట్), పాలిమైడ్ వంటి వాటిపై దృష్టిసారించారు. ఎందుకంటే వీటిని సీసాలు తయారు చేయడంలోనూ, బాటిల్‌ని శుద్ధి చేయడంలోనూ ఉపయోగిస్తారు. అయితే వీటికి సంబంధించిన నానోప్లాస్టిక్ బాటిల్ నీటిలో చాలమటుకు గుర్తించబడవని అన్నారు. గత పరిశోధనలు పరిశీలిస్తే.. 2022 అధ్యయనంలో నీటి పంపుల కంటే వాటర్ బాటిల్లోనే మైక్రోప్లాస్టిక్ సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక 2021లో జరిపిన అధ్యయనంలో మూతను తెరిచి మూయడం వల్ల కూడా చిన్ని బిట్ల మాదిరిగా ప్లాస్టిక్ కణాలు నీటిలో చేరతాయని చెప్పారు. ఈ తాజా అధ్యయనం మాత్రం వాటర్ బాటితో ఆగకుండా పంపు నీటిలో ఉన్న మైక్రో ప్లాస్టిక్‌లను కూడా కనుగొనడమే తమ లక్ష్యం అని పరిశోధకులువివరించారు. అందుకోసం అంటార్కిటికా పంపు నీటిలోని మంచు నుమునాలను సేకరించినట్లు తెలిపారు. ఈ నానోప్లాస్టిక్ చూడటానికి అత్యంత చిన్న రేణువులు, కానీ వీటి వల్ల మానవాళికి వాటిల్లే ముప్పు అంతా ఇంత కాదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. (చదవండి: 'స్పేస్ మీల్': వ్యోమగాముల కోసం ప్రత్యేక భోజనం! తయారు చేసిన శాస్త్రవేత్తలు) -
ప్లాస్టిక్ మంచిదికాదని స్టీల్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా?
ఇటీవల కాలంలో ప్లాస్టిక్ బాటిల్స్ మంచిదికాదని స్టీల్ లేదా రాగి వాటర్ బాటిల్స్ వాడుతున్నారు. ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాటర్ ఉంటే ఒక రకమైన వాసన రావడమే గాక ఆరోగ్యానికి పర్యావరణానికి మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో విరివిగా మార్కెట్లోకి వస్తున్న స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ వాడుతున్నారు చాలామంది. ఇలాంటి పునర్వినియోగ వాటర్ బాటిల్స్‌ని ఉపయోగించేటప్పుడ తగు జాగ్రత్తుల తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడటం ఖాయం. అందుకు నెట్టింట వైరల్ అవుతున్న.. యూఎస్ఏకి చెందిన మహిళ ఉదంతమే ఉదహారణ. ఆమె ఈ పునర్వినియోగ వాటర్ బాటిల్స్‌తో ఎలా అనారోగ్యం పాలైందో టిక్‌టాక్‌లో వివరించింది. మీరు కూడా ఆమెలానే చేస్తున్నట్లయితే అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకన్నట్లే అవుతుంది. అందువల్ల ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో సదరు మహిళ.. ఇలాంటి పునర్వినయోగ స్టెయిన్ లెస్ బాటిల్స్‌నే తాను వాడుతున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే తనకు ఒక రోజు ఉన్నట్లు జలుబు చేసిందిని, తర్వాత ట్యాబ్లెట్లు వేసుకున్నాక తగ్గింది మళ్లీ రెండు రోజులకే జలుబు, దగ్గు రెండు విపరీతంగా వచ్చాయి. దీంతో డాక్టర్లను సంప్రదించి యాంటీబయోటిక్ మందులు వాడింది. త్వరితగతినే కోలుకుంది కూడా. అయితే మళ్లీ వారం రోజులకే మళ్లీ సైనస్ వంటి లక్షణాలతో జలబు రావడం జరిగింది. తనకు జలుబు చేయడం అన్నదే చాలా అరుదు అలాంటిది ఇలా తరచుగా ఒక నెలలోనే రెండు మూడు సార్లు జలుబున బారిన పడుతున్నానేంటీ ఏమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నాయా అని భయపడింది. దీంతో సమస్య ఎక్కడ ఉందా అని చెక్చేసుకుంది. వ్యక్తిగత పరిశుభ్రత దగ్గర నుంచి తీసుకునే ఆహార పదార్థల వరకు ఎక్కడ తలెత్తుంది ఈ సమస్య, దేనివల్ల తనకు ఇలా అయ్యిందని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించగా..తాగే వాటర్ సురక్షితంగా ఉందా లేదా అన్న ఆలోచన తట్టింది. వెంటనే బాటిల్స్ అన్ని చెక్‌చేయగా ఆమె తాగే వాటర్ బాటిల్ అడుగున నాచులా ఆకుపచ్చిన బూజు(శిలింధ్రం) ఉండటం చూసి అవాక్కయ్యింది. అన్ని శుభ్రంగా ఉంచే నేను బాటిల్స్ మాత్ర అస్సలు క్లీన్ చేయడం లేదని తెలిసింది. బహుశా దీని వల్ల ఇన్నిసార్లు జలుబు బారిన పడ్డానని అర్థమయ్యే తక్షణమే వాటిని క్లీన్ చేసినట్లు వివరించింది. ఈ విషయాన్నే వైద్యులకు తెలపగా, వారు కూడా ఇలాంటి ఆకుపచ్చ నాచు కారణంగా ఫుడ్ పాయిజినింగ్, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి పలు రకాల ఇన్పెక్షన్లు వస్తాయని చెప్పారు. తాగే నీరు, తీసుకునే ఆహారం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని సూచించారని పేర్కొంది. ఈ స్టీల్ బాటిల్స్ పర్యావరణానికి హితమైనప్పటికీ వాడేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోండి లేదంటే తనలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవల్సి వస్తుందని చెబుతోంది సదరు మహిళ. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. ఏ బాటిల్ అయినా దానిలో వాటర్ అలానే ఉండిపోతే కచ్చితంగా కింద బాటిట్ అడుగుభాగన జిగురులాంటి సిలికాన్ మాదిరి పదార్థం ఏర్పడుతుంది. కొద్దిరోజులక ఆకుపచ్చని బూజులాంటి శిలిధ్రం ఫామ్ అయ్యిపోతుంది. మనం అందులో ఉన్న నీటిని అలాగే తాగితే ముందుగా గొంతునొప్పి, జలుబు వంటి అనారోగ్యాల బారిన పడతాం. తరుచుగా జలుబుతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. బాటిల్స్‌ని కనీసం మూడు లేదా ఐదు రోజుల కొకసారి వేడినీటితో క్లీన్ చేసుకోవాలి లోపల జిగురు వంటి సిలాకాన్లాంటి పదార్థం రాకుండా మార్కెట్లో దొరికే బ్రెష్‌తో క్లన్ చేసుకోవాలి. తాగే బాటిల్ బాగుందో లేదో కూడా చెక్‌చేసుకుని తాగండి ఏ బాటిల్లోనైన నీరు నిశ్చలంగా మూడు నుంచి నాలుగు రోజులు ఉండిపోతే ఒక విధమైన వాసన వస్తుంది. ఇలాంటి వాటర్ అత్యంత ప్రమాదకరం. సాధ్యమైనంత వరకు బాటిల్లో ఎక్కువకాలం నిల్వ ఉండే వాటర్‌ని తాగొద్దు, వాటిని ఎప్పిటికప్పుడూ లేదా కనీసం మూడు నుంచి నాలుగురోజుల కొకసారి క్లీన్ చేసుకుని తాగేందుకు యత్నించండి. (చదవండి: బరువు తగ్గడంలో పనీర్ హెల్ప్ అవుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..?) -
ప్రపంచంలోనే అత్యంత ఖరీధైన వాటర్ బాటిల్ ఇదే..టేస్ట్ అదిరిపోతుంది!
ఒక వాటర్ బాటిల్ ధర ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. అదే హోటల్స్‌లో అయితే వంద రూపాయల వరకు ఉంటుంది. కానీ ఈ వాటర్ బాటిల్ ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే దీని ధర అక్షరాలా రూ. 45 లక్షలు. అవును మీరు విన్నది నిజమే. ఆ వాటర్ బాటిల్ మాత్రమే కాదు, అందులోని నీళ్లు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. మరి ఆ స్పెషల్ ఏంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మంచి నీళ్ల గురించి ఎప్పుడైనా విన్నారా?లీటర్ కూడా ఉండని ఈ బాటిల్ ధర దాదాపు 45 లక్షల రూపాలుంటుందట!మనం రోజూ తాగే మంచి నీళ్ల బాటిల్ ధరలు కూడా.. ఊహించని స్థాయిలో ఉంటాయని మనలో చాలా మందికి తెలియదు.అక్వా డి క్రిస్టలో ట్రిబ్యుటొ ఎ మోడిగ్లియాని అనే వాటర్ బాటిల్ గురించే ఈ చర్చంతా. దీనిలో కేవల 750 మిల్లీ లీటర్ల నీళ్లు మాత్రమే ఉంటాయి. అంత చిన్న వాటర్ బాటిల్ ధర అక్షరాలా 45 లక్షల రూపాయలు. ఇప్పుడు ప్రపంచంలోని అతి ఖరీదైన మంచినీళ్లు ఇవేమరి. లీటర్ కూడా లేని ఈ నీళ్లకు ఎందుకింత డిమాండ్? అంటే..ఈ నీళ్లను ఫ్రాన్స్, ఫిజీలలోని సహజ నీటిబుగ్గల నుంచి సేకరిస్తారట. భూగర్భ జలాలు ఉబికి భూమిపైన ప్రవహించే సహజ నీటి బుగ్గల నుంచి ఈ నీటిని సేకరిస్తారు. ఇది వింతేమీ కాదే!! ఈ రోజుకీ మార్కెట్లో అనేక మినరల్ వాటర్ బాటిల్లు ఈ విధమైన సహజ నీటి బుగ్గల నుంచి సేకరించిన నీళ్లను అమ్ముతున్నారు. మన దేశంలో కూడా ఈ విధమైన నీళ్ల బాటిల్లను రూ. 50 నుంచి 150 వరకు అమ్ముతున్నారు. అయినప్పటికీ ఈ వాటర్ బాటిల్ ఎందుకంత ధర పలుకుతుంది? ఇదేనా మీ అనుమానం.. అనేకానేక కారణాల్లో ఈ వాటర్ బాటిల్ డిజైన్ కూడా ఒక కారణమే. ఎందుకంటే.. ►ఈ బాటిల్ లోపలి భాగాన్ని 24 క్యారెట్ల బంగారంతో తయారుచేయడం. ►ఈ బాటిల్ ఆకారాన్ని ప్రపంచంలోనే ప్రసిద్ధ బాటిల్ డిజైనర్ అయిన ఫెర్నాండో అల్టామిరానో డిజైన్ చేశాడు. ప్రపంచంలోనే అతి ఖరీదైన హెన్రీ 4 హెరిటేజ్ డ్యుడోగ్నన్ కోగ్న్యాక్ అనే వైన్ బాటిల్ కూడా ఇతనే డిజైన్ చేశాడు. ►ఈ బాటిల్లోని నీళ్లు కూడా ప్రత్యేక రుచి కలిగి ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో లభించే సగటు తాగునీటి కంటే ఎక్కువ శక్తిని అందిస్తుందట. అంతఖరీదు పెట్టి కొని తాగే వారు ఎవరుంటారని అనుకుంటే పప్పులో కాలేసినట్లే! సెలబ్రెటీలు, ప్రముఖ వ్యక్తులు మనలా సాధారణ నీళ్లను తాగరు. వాళ్లు తాగే నీళ్లు ఇవే మరి.. ! -
విద్యార్థిని వాటర్ బాటిల్లో మూత్రం పోసిన విద్యార్థులు
జైపూర్: తోటి విద్యార్థిని పట్ల కొందరు విద్యార్థులు అమానుషంగా ప్రవర్తించారు. ఆమె మంచినీళ్ల బాటిల్లో మూత్రం పోశారు. ఈ ఘటన రాజస్తాన్‌లోని భిల్వారా జిల్లా లుహారియా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానిక స్కూలులో చదువుకుంటోంది. శుక్రవారం కొందరు విద్యార్థులు ఆమె మంచి నీళ్ల బాటిల్లో మూత్రం కలిపారు. ఇది తెలియని బాలిక ఆ నీళ్లు తాగింది. దుర్వాసన రాగా ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసింది. తన పుస్తకాల బ్యాగులో ప్రేమ లేఖ కూడా ఉన్నట్లు తెలిపింది. స్పందించకపోవడంతో కుటుంబసభ్యులకు తెలిపింది. వారు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. తహశీల్దారు, పోలీసులకు కూడా వారు తెలిపారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో అనుమానితుల ఇళ్లపై రాళ్ల దాడికి దిగారు. -
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, రూ.20కే కడుపు నిండా భోజనం!
ట్రైన్ జర్నీ చేసే చాలామంది కొన్ని సందర్భాల్లో ఫుడ్ కోసం ఇబ్బందిపడే ఉంటారు. అధిక ధరలు లేదా నాణ్యత లేకపోవడం వంటివి నిజ జీవితంలో ఎదురై ఉండే అవకాశం ఉంది. అయితే ఇలాంటి వాటికి 'ఐఆర్సీటీసీ' (IRCTC) చరమగీతం పాడటానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ప్రయాణికుల కోసం రైల్వే ఓ కొత్త విధానం తీసుకువచ్చింది. సరసమైన ధరతోనే ప్రయాణికులకు మంచి భోజనం అందించాలనే సదుద్దేశ్యంతో రైల్వే బోర్డు ఇప్పటికే డివిజనల్ యూనిట్లకు 'రైల్వేస్ జనతా ఖానా' ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సర్వీస్ కేవలం 'నార్త్ వెస్ట్రన్ రైల్వే జైపూర్ జంక్షన్'లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సదుపాయం రానున్న రోజుల్లో మరింత విస్తరించడానికి ప్రణాళికలు చేపడుతున్నారు. (ఇదీ చదవండి: బీచ్‌లో చిల్ అవుతున్న మస్క్, జుకర్‌బర్గ్.. ఏంటి, కలిసిపోయారా?) రైల్వేస్ జనతా ఖానా.. ఐఆర్సీటీసీ ఈ ఫుడ్ రెండు కేటగిరీలలో అందించనుంది. 7 పూరీలు (175 గ్రామ్స్), పొటాటో వెజిటేబుల్స్ (150 గ్రామ్స్), ఊరగాయ (12 గ్రామ్స్) వంటివి కేవలం రూ. 20 మాత్రమే. అయితే రూ. 50 కాంబో ప్యాక్‌లో 350 గ్రామ్స్ రాజ్మా లేదా రైస్, పాప్ బాజీ, మసాలా దోశ, కిచిడి మొదలైనవి ఉంటాయి. ఇక 200 మీలీ వాటర్ బాటిల్ ఖరీదు కేవలం రూ. 3 మాత్రమే. ఈ కొత్త విధానం సమర్థవంతంగా సాగితే ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. -
రెస్టారెంట్లో ఖరీదైన వాటర్ బాటిల్ అంటగట్టారని.. ‘పైసా వసూల్’ పనిచేసి..
ఖరీదైన రెస్టారెంట్లలో బిల్లులు ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. అటువంటి సందర్భాల్లో కాస్త నిట్టూరుస్తూనే బిల్లు చెల్లిస్తుంటాం. తాజాగా ఫిట్నెస్, న్యూట్రిషన్ కోచ్ రితికా బోరా రెస్టారెంట్లో తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. ఆమె రెస్టారెంట్లో వాటర్ బాటిల్‌కు ఆర్డర్ చేయగా, దానికి ఆమె భారీగా బిల్లు చెల్లించాల్సి వచ్చింది. తన అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసిన ఆమె క్యాప్షన్‌లో ‘మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఈ ఫ్యాన్సీ రెస్టారెంట్‌కు స్నేహితురాలితో పాటు వెళ్లాను. అక్కడ వాటర్ బాటిల్‌కు రూ.350 చెల్లించాల్సి వచ్చిందంటే ఎవరూ నమ్మరు. అందుకే ఆ బాటిల్‌ను నాతో పాటు ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దీనిని తిరిగి వినియోగించవచ్చని భావించాను. ఈ విధంగా నేను మాత్రమే చేస్తున్నానా? మీరు కూడా చేస్తారా?’ అని అమె ప్రశ్నించింది. Met up with a friend at this fancy restaurant for lunch, and you won't believe they charged 350 rps for a bottle of water! So, I decided to bring the bottle home with me so that I can reuse it. Is it only me or u have done this too? pic.twitter.com/AecGPLuoV8 — Ritika Borah (@coach_ritika) July 10, 2023 ఎక్కడైనా వాటర్ బాటిల్ రూ. 20కి లభ్యమవుతుంది. అయితే ఈ రెస్టారెంట్లో ఏకంగా వాటర్‌బాటిల్‌కు రూ. 350 చెల్లించాల్సి వచ్చిందని ఆమె వాపోయింది. రితికా బోరా పోస్టును చూసిన పలువరు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు తమకు రెస్టారెంట్లలో ఎదురైన అనుభవాలను తెలియజేయగా, మరికొందు ‘పైసా వసూల్’ పని చేశారంటూ మెచ్చుకుంటున్నారు. ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు! -
అపస్మారక స్థితిలోకి నాగు.. ఎలా కాపాడాడో చూసేయండి
Snake Viral Video: దప్పికతో ఆ పాము అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కాసేపు అలాగే వదిలేస్తే దాని ప్రాణం పోవడం ఖాయం!. అలాంటి స్థితిలో ఓ వ్యక్తి సాయానికి ముందుకొచ్చాడు. ధైర్యంగా దాని నోటికి నీరు ఒక బాటిల్ సాయంతో అందించాడు. దీంతో అది ఓపిక తెచ్చుకుంది. ఇంటర్నెట్లో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ నాగుపాము చచ్చిన ఎలుకను మింగింది. అయితే ఆ ఎలుకలో ఉన్న ఎలుకల మందు కూడా పాము లోపలికి వెళ్లింది. దీంతో అది అపస్మారక స్థితిలోకి వెళ్లి.. విపరీతమైన దాహార్తితో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆ సమయంలో తన ఇంటి ముందు పాము అలా ఉండడాన్ని నటరాజన్ గమనించాడు. స్థానికంగా ఉండే చెల్లా అనే వ్యక్తికి సమాచారం అందింంచాడు. అయితే అది ఇంకా చనిపోలేని.. డీహైడ్రేషన్‌తో బాధపడతుందని గుర్తించిన చెల్లా దాని నోటికి ఓ బాటిల్‌తో వాటర్ అందించాడు. ఎందుకైనా మంచిదని మరో చేత్తో దాని తోకను పట్టుకున్నాడు. దాహం తీరాక అది శక్తి తెచ్చుకుని వేగంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది. மயக்க நிலையில் இருந்த நாகப்பாம்புக்கு சுற்றுச்சூழல் ஆர்வலர் பாட்டிலில் இருந்து தண்ணீர் கொடுத்த வீடியோ சமூக வலைதளங்களில் வைரலாகி வருகிறது. #Cuddalore #snake #water #cobra #viral #Jayaplus pic.twitter.com/3nZ77k6vOi — Jaya Plus (@jayapluschannel) July 5, 2023 Video Source: Jaya Plus ఈలోపు జనం కంగారుపడడంతో.. ఓ ప్లాస్టిక్ డబ్బాలో దాన్ని బంధించి సమీపంలోని అడవిలో వదిలేశాడు. చెల్లా సాహసోపేతంగా ఆ పామును రకక్షించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. తమిళనాడు కడలూరు జిల్లా తిరుచోపరూర్లో ఈ ఘటన జరిగింది. ఇదీ చూసేయండి: ఇలాంటి కామాంధుల వల్లే దేశానికి చెడ్డపేరు! -
ఉడుత సాయం కాదు... ఉడుతకే సాయం!
‘ఉడుత సాయం’ అంటారు కానీ ఇక్కడ ఒక ఉడత మాత్రం సాయం కోసం మనిషి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చింది. తనకు దాహం వేస్తోందని ఆ వ్యక్తికి సైగలు చేస్తూ చూపించింది. సదరు దయగల వ్యక్తి ఉడుతకు వాటర్ బాటిల్‌తో నీళ్లు తాగించాడు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఎవరో ‘రెడ్డిట్’లో రీ–షేర్ చేశారు. పాతదా, కొత్తదా అనే విషయం పక్కన పెడితే ఈ వీడియో ఎంతోమందిని భావోద్వేగానికి గురిచేసింది. -
మైక్రోప్లాస్టిక్స్ కలిసిన నీటిని తాగితే కోలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్.. ఇంకా..
Summer Health Tips: అసలే ఎండాకాలం.. దాహం వేస్తుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడంటే కావలసినప్పుడల్లా నీళ్లు తాగుతుంటాం. మరి బయటికి వెళ్లేటప్పుడు? అందులో ఆలోచించేదేముంది... ఒక వాటర్ బాటిల్ తీసుకెళతాం.. అంతేకదా అని సింపుల్‌గా చెప్పేస్తాం. అయితే ఆ బాటిల్ దేనితో తయారు చేసింది... అంటే నూటికి తొంభై పాళ్లు ‘ప్లాస్టిక్ బాటిల్’ అనే సమాధానం వస్తుంది. దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం వల్ల ఎంత ఉపయోగమో, ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగడం అంత ప్రమాదం. అది ఎండాకాలం అయితే కనక ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంతకీ ఏమిటా నష్టాలు అంటారా? అదే చూద్దాం.. ప్లాస్టిక్ వాడకం ఎందుకంటే! ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ముప్పు అని పదే పదే చెబుతున్నా కూడా ప్లాస్టిక్ ఇంకా వాడకంలోనే ఉండటానికి కారణం ఏమిటంటే, దానిని క్యారీ చేయడం చాలా సులువు. నిర్వహించడం ఇంకా సులువు. ఒకవేళ ఎక్కడైనా పెట్టి మరచిపోయినా పెద్ద ఖరీదు ఉండదు కాబట్టి దిగులు పడనక్కరలేదు. అందువల్ల పర్యావరణ ప్రేమికులు ఎంతగా నెత్తీ నోరు బాదుకుంటున్నా, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించే విషయంలో వెనకబడవలసి వస్తోంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయినా, భారీ ప్లాస్టిక్ కంటైనర్లు అయినా వాటి నుంచి నీరు తాగడం ప్రమాదకరం. ముఖ్యంగా ఎండలో ఎక్కువగా ఉంచిన ప్లాస్టిక్ బాటిల్స్‌లోని నీటిని అసలు తాగకూడదు. పరిశోధన ప్రకారం.. ►ప్లాస్టిక్ బాటిల్స్ మీద ఎండ పడితే.. అవి మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ నీటిని తాగితే.. శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడే.. ఎండోక్రైన్ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. ఇలాంటి నీటిని ఎక్కువగా తీసుకుంటే.. ఆరోగ్యం దెబ్బతింటుంది. కాలేయాన్ని కూడా పాడు చేస్తుంది. ►ఎండలో ఉండే.. ప్లాస్టిక్ బాటిల్ నుంచి డయాక్సిన్ లాంటి టాక్సిన్ నీటిలోకి విడుదల అవుతుంది. ఈ డయాక్సిన్ నీటిని తాగితే.. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగితే.. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. మగవారిలో శుక్ర కణాల సంఖ్య కూడా తగ్గవచ్చు. ►బాటిల్ వాటర్‌లో మైక్రో ప్లాస్టిక్స్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ►మైక్రోప్లాస్టిక్స్ కలిసిన నీటిని తాగితే పొత్తి కడుపునకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యం, పీసీఓఎస్, ఒవేరియన్ సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు రావొచ్చు. ►ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. బయటకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లకు ఎండ తగిలితే.. అస్సలే తాగొద్దు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లను కొంతమంది అలానే ఉపయోగిస్తారు. ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారు. ఇది ఇంకా అపాయకరమైనది. ఇలా అస్సలు చేయొద్దు ఎప్పుడూ. ఏం చేయాలి మరి? ►ప్లాస్టిక్ బాటిల్స్ అంతగా వాడుకలోకి రాని రోజుల్లో పెద్దవాళ్లు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు స్టీలు లేదా ఇత్తడి మరచెంబులు తీసుకు వెళ్లేవారు. ఇప్పుడు కూడా అదే మంచిది. అందుకు తగ్గట్టు ఇప్పుడు మార్కెట్లో రకరకాల సైజుల్లో, ఆకారాలలో రాగి, స్టీలు, ఇత్తడి బాటిల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి కాస్తంత ఖరీదు ఎక్కువైనా, ప్లాస్టిక్ వాడకం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలతో పోల్చుకుంటే ఫరవాలేదనిపిస్తుంది. ►ప్లాంట్ బేస్డ్ బాటిల్స్, గాజుసీసాలు, అల్యూమినియం వాటర్ క్యాన్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మనం వాడకం మొదలు పెడితే ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయి. చదవండి: ఆవకాయ.. పచ్చడి తయారీ ఇలా! నూనెను మరిగించకుండా పచ్చిగా వేసినా ఆహారంలో మునగాకు, మునక్కాయలు వారంలో రెండుసార్లైనా తీసుకోవాలి! ఇంకా.. -
కనిపించని ‘జీవా’
సాక్షి, హైదరాబాద్: బ్రాండెడ్ మంచినీటి సీసాల వినియోగంతో సాలీనా రూ.కోట్లలో అవుతున్న వ్యయాన్ని నియంత్రించడంతోపాటు అదనపు ఆదాయాన్ని పొందే ఉద్దేశంతో ఎంతో ఘనంగా ప్రారంభించిన ఆర్టీసీ సొంత నీటి బ్రాండ్ ఎక్కడా కానరావడం లేదు. జీవా బ్రాండ్‌ను ఆర్టీసీ నెలన్నర క్రితం ఎంతో అట్టహాసంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంజీబీఎస్‌లో కార్పొరేట్ పద్ధతిలో ఆ బ్రాండ్‌ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు ఆరు నెలలు శ్రమించి రెండు సంస్థలతో ఒప్పందం చేసుకుని ఈ నీటిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ కృషి చేసింది. కానీ ఇప్పటివరకు ఇటు బస్టాండ్లలో కాని, ఆర్టీసీ బస్సుల్లో కానీ ఎక్కడా అది కనిపించటం లేదు. ఇప్పటికీ ప్రైవేటు బ్రాండెడ్ నీటినే వినియోగిస్తున్నారు. భారీగా వ్యయం చేయటంతోపాటు ప్రసార మాధ్యమాల ద్వారా ముమ్మరంగా ప్రచారం జరిగి ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొన్న తర్వాత ఆ బ్రాండ్ కనిపించకపోవటం విశేషం. ♦ కేవలం బస్టాండ్లలోని దుకాణాల్లోనే కాకుండా క్రమంగా, మార్కెట్లోని ఇతర దుకాణాల్లో కూడా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని నిర్ణయించారు. కానీ మార్కెట్లోని దుకాణాల్లో కాదు కదా కనీసం ఆర్టీసీ బస్సుల్లో కూడా అవి కనిపించడం లేదు. ఇక ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో అధికారులకు కూడా అవి అందుబాటులో లేకుండా పోయాయి. బస్సులు, ఆర్టీసీ కార్యాలయాల్లో ప్రైవేట్ బ్రాండ్ నీళ్లే.. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా 500 మి.లీ. వాటర్ బాటిళ్లను అందిస్తారు. ఆర్టీసీ సొంతంగా జీవా పేరుతో నీటిని మార్కెట్లోకి తీసుకురావటంతో, ఇక బస్సుల్లో అవే నీళ్లు పంపిణీ జరుగుతాయని ప్రచారం చేసింది. కానీ తాజాగా బస్సుల్లో పంపిణీకి ఓ బడా బ్రాండెడ్ నీటి సీసాలు పెద్ద ఎత్తున డిపోలకు చేరాయి. ఇంతకాలం స్థానికంగా తయారయ్యే ఓ బ్రాండ్ సీసాలు పంపిణీ జరుగుతుండగా, తాజాగా ఓ అంతర్జాతీయ కంపెనీకి చెందిన బ్రాండ్ సీసాలు డిపోలకు చేరాయి. ప్రైవేటు బ్రాండెడ్ కంపెనీ నుంచి నీటి సీసాల కొనుగోలుకు సాలీనా రూ.5 కోట్ల వరకు ఖర్చవుతున్నట్టు సమాచారం. డిమాండ్ ఉన్నా కానరావడం లేదు.. ♦ ప్రకాశం, కాంతి అన్న అర్ధంలో వినియోగించే జీవా (జెడ్‌ఐవీఏ) అన్న హిబ్రూ భాష నుంచి పుట్టిన పేరును ఖరారు చేసిన ఆర్టీసీ ఆ నీటి సీసాల డిజైన్‌లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇప్పటి వరకు ఏ కంపెనీ వినియోగించని రీతిలో డైమర్ కటింగ్స్ డిజైన్ ఉన్న సీసా ఆకృతిని ఎంపిక చేసింది. చూడగానే ఆకట్టుకునేలా ఉన్నందున, ఆర్టీసీ బ్రాండ్ తోడు కావటంతో సాధారణ ప్రజలు కూడా దాని మన్నికపై నమ్మకంతో కొనే అవకాశం ఏర్పడుతుందని దీంతో ఈ నీటి విక్రయాల ద్వారా సాలీనా రూ.20 కోట్ల ఆదాయం పొందే వీలుందని ఆర్టీసీ అంచనా వేసింది. ప్రస్తుతం వేసని ప్రారంభం కావటంతో వాటర్ బాటిళ్ల విక్రయం ఊపందుకుంది. ఆర్టీసీ ప్రయాణికులు బస్టాండ్లలో నీటి సీసాలు కొని బస్కెక్కుతున్నారు. ఇలా మంచి డిమాండ్ ఉన్న సమయంలో కూడా ఆర్టీసీ నీళ్లు కనిపించడం లేదు. తయారీ కంపెనీల నిర్వాకంతోనే.. ఎంతో గొప్పగా జీవా బ్రాండ్‌ను ప్రారంభించినప్పటికీ, ఆ నీటిని, సీసాలను రూపొందించేందుకు ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల నిర్వాకం వల్లనే సమస్యలు తలెత్తాయని సమాచారం. సీసాల ఆకృతి గొప్పగా ఉన్నప్పటికీ, వాటి నాణ్యత అత్యంత తీసికట్టుగా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ బ్రాండ్‌పై చెడ్డపేరు వస్తుందనే వాటి మార్కెటింగ్‌ను ఆపేసినట్టు తెలిసింది. నాణ్యమైన సీసాలు, నీళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాతనే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. -
అభిమాని లేఖకు మంత్రి హరీశ్ రావు ఫిదా..
సాక్షి, సిద్దిపేట: హరీశ్‌రావు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్య బాధ్యతలు చూసే కీలక మంత్రిగా ఉన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషిచేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. ప్లాస్టిక్ వాడకంతో భయంకరమైన కేన్సర్ బారినపడే ఆవకాశాలు ఉన్నాయని వారిని జాగృతం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మరో మార్గం లేక మంత్రి కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ దప్పిక తీర్చుకొనే అత్యవసర పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని గుర్తించిన ఓ వీరాభిమాని అమాత్యుడు హరీశ్‌రావు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలంటూ శుక్రవారం దుబ్బాక పర్యటనలో మంత్రికి లేఖ అందించారు. మీ ఆరోగ్యమే మాకు మహాభాగ్యం..మీరు తప్పని పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడుతున్నారని, ఈ నీరు తాగడం వల్ల భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదన్నారు. ఇటీవల అంతర్జాతీయ ప్రముఖ రేడియాలజిస్టు డాక్టర్ విమల్ సోమేశ్వర్ ఇంటర్వ్యూలో చెప్పారని లేఖలో వివరించారు. దయచేసి ఇకపై కాపర్ వాటర్ బాటిల్ వినియోగించాలని మంత్రికి దుబ్బాక పరిధి మల్లాయపల్లికి చెందిన ఎంబీఏ విద్యార్థి కీసరి ప్రవీణ్ లేఖ అందించాడు. ప్రవీణ్ రాసినలేఖను చదివి తన ఆరోగ్యం పట్ల ఎంతో తపనతో రాశాడంటూ ఫిదా అయ్యాడు. ప్రవీణ్ కు మంత్రి ప్రత్యేకంగా ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియాలో లేఖ హల్చల్ అవుతోంది. చదవండి: చివరిశ్వాస వరకూ ‘అమ్మవారి’తోనే.. -
రెస్టారెంట్ సిబ్బంది నిర్వాకం...వాటర్ బాటిళ్లలో యాసిడ్ అందించి...
పుట్లిన రోజు, పెళ్లి వేడుక లేక మనం ఆనందంగా ఉన్నప్పుడూ సరదాగా రెస్టారెంట్‌కి వెళ్లి స్నేహితులకు ట్రీట్ ఇచ్చి సెలబ్రెట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడూ ఈ విచిత్రమైన సంఘటన గురించి వింటే రెస్టారెంట్‌కి వెళ్లాలంటేనే జంకుతారు. ఇక్కడొక కుటుంబం పుట్టిన రోజు వేడుకను జరుపుకునేందుకు రెస్టారెంట్‌కి వెళ్లి ఘోరమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ ఘటన పాకిస్తాన్‌లోని ఒక రెస్టారెంట్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....పాకిస్తాన్‌లోని ప్రముఖ ఇక్బాల్ పార్క్‌లోని పోయిట్ రెస్టారెంట్లో ఒక కుటుంబం పుట్టిన రోజుల వేడుకలు జరుపుకుంది. ఐతే ఆ రెస్టారెంట్ సిబ్బంది నిర్లక్షపూరిత ధోరణితో సదరు కస్టమర్లకు భోజనంలో వాటర్ బాటిళ్లలో యాసిడ్‌ని సర్వ్ చేశారు. దీంతో ఆ బాటిల్‌ని ఉపయోగించి ఇద్దరి చిన్నారుల్లో ఒకరు చేతులు కడుక్కోగా, మరోకరు తాగారు. అంతే కొద్దిసేపటికి ఒకరు మంట మంట అని ఏడవడం, మరోకరు వాంతులు చేసుకుని అశ్వస్థకు గురవ్వడం జరిగిందని చిన్నారులు కుటుంబసభ్యలు చెబుతున్నారు. ఈ మేరకు బాధితుల కుటుంబం సభ్యుడు మహ్మద్ ఆదిల్ మాట్లాడుతూ తన మేనకోడలు రెండేళ్ల వాజిహ, మేనల్లుడు అహ్మద్, రెస్టారెంట్ సిబ్బంది అందించిన వాటర్ బాటిల్లోని యాసిడ్ కారణంగా తీవ్ర అశ్వస్థకు గురయ్యారని చెప్పారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఐతే మేనకోడలు వాజిహ పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పారు. భాదితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరుకు పోలీసులు సదరు రెస్టారెంట్ మేజర్ మహ్మద్ జావెద్ తోపాటు ఐదుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అలాగే దర్యాప్తు పూర్తయ్యే వరకు రెస్టరెంట్‌ని మూసేశారు. ఈ మేరకు పోలీస్ అధికారి తాహిర్ వాకస్ మాట్లాడుతూ..ఇది చాలా విచిత్రమైన సంఘటన అని, తాము ఈ కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. (చదవండి: యూఎస్‌లో ఎనిమిదేళ్ల చిన్నారితో సహ భారత సంతతి కుటుంబం కిడ్నాప్) -
అరవింద్ కేజ్రీవాల్‌పైకి నీళ్ల సీసా విసిరిన వ్యక్తి
రాజ్‌కోట్: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై గుర్తుతెలియని వ్యక్తి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ విసిరాడు. అది ఆయనకు తగలకుండా, తలపై నుంచి వెళ్లి ముందుపడింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. నగరంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా గర్బా వేడుకలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. నడుస్తూ అభివాదం చేస్తుండగా, ఇంతలో వెనుక నుంచి ప్లాస్టిక్ నీళ్ల సీసా దూసుకొచ్చింది. అది కేజ్రీవాల్ తల పైభాగం నుంచి ముందుకు వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆప్ మీడియా కో–ఆర్డినేటర్ తెలిపారు. Water bottle thrown at #ArvindKejriwal in Rajkot, Gujarat. Delhi CM had come to attend Garba program. pic.twitter.com/AqX5VN6aMV — Hemir Desai (@hemirdesai) October 2, 2022 చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ -
ప్లాస్టిక్ నీళ్ల సీసాలతో '450 ఏళ్లు' ఇబ్బందే.. ఇక టూత్‌బ్రష్ అయితే ఏకంగా 500 ఏళ్లు!
సాక్షి, అమరావతి: అందరం సాధారణంగా మంచినీళ్ల సీసాను ఉపయోగిస్తుంటాం. కానీ ఒకసారి వాడి బయట పారేసే ఆ ప్లాస్టిక్ నీళ్ల సీసా నామరూపాలు లేకుండా మట్టిలో కలిసి పోవడానికి ఏకంగా 450 సంవత్సరాల సమయం పడుతుందట. అలానే.. మనం వాడిపారేసిన టూత్‌బ్రష్ మట్టిలో కలవాలంటే 500 సంవత్సరాలు కావాలంట. పెళ్లిళ్లు, ఇతర పార్టీల సమయంలో ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులు భూమిలో కలిసిపోవడానికి 450 ఏళ్లు పడుతుంది. చివరకు అందరి చేతుల్లో కనిపించే ప్లాస్టిక్ కవర్ మట్టిలో కలవాలంటే 20 ఏళ్లదాక సమయం పడుతుంది. పర్యావరణానికి విపరీతమైన హానికలిగించే ఒకసారి ఉపయోగించిన తర్వాత పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై ఈ ఏడాది జూలై 1 నుంచి నిషేధం విధించిన కేంద్రం.. ప్రజలందరూ నిత్యం ఉపయోగించే రకరకాల ప్లాస్టిక్ వస్తువుల ద్వారా కలిగే అనర్ధాల గురించి విస్తృత ప్రచారం మొదలుపెట్టింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ పరిధిలో పనిచేసే గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుధ్య (డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్) విభాగం ఈ మేరకు కరపత్రాలను ముద్రించి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వశాఖల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించే కార్యక్రమాలను మొదలుపెట్టింది. పొంచి ఉన్న ప్రమాదాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వల్ల పర్యావరణానికి విపరీతమైన హాని ఏర్పడుతుందని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒకసారి వాడి పారేసిన నీళ్ల సీసాలు ఒక్కొక్కటిగా చివరికి భూమి పొరల్లోకి చేరతాయి. ఇలా.. లక్షలు, కోట్ల ప్లాస్టిక్ సీసాలు 450 ఏళ్ల పాటు భూమి పొరల్లో ఉండి వర్షం నీరు కిందకు ఇంకకుండా అడ్డుపడడం వంటి కారణాలతో భూమిలోకి ఇంకే నీటిశాతం తగ్గిపోయి క్రమంగా భూగర్భ జలమట్టాలు బాగా తగ్గిపోతాయి. ఇప్పటికే ఇంట్లో వేసుకునే బోరు 300–400 అడుగులు మేర తవ్వాల్సి రావడం.. కొన్నిచోట్ల 500 అడుగుల మేర తవ్వినా నీరు పడకపోవడం సర్వసాధారణంగా కనిపించే అంశాలే. -
అక్కడ ఇరుక్కుపోయిన వాటర్ బాటిల్.. భార్యకు భయపడి చెప్పని భర్త.. చివరకు..
టెహ్రాన్: ఇరాన్లో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తికి సీటీ స్కాన్ తీసీ అవాక్కయ్యారు వైద్యులు. అతని మలద్వారంలో 19 సెంటీమీటర్ల వాటర్ బాటిల్‌ను గుర్తించి కంగుతిన్నారు. సీటీ స్కాన్ చేసే వరకు ఏం జరిగిందో సదరు వ్యక్తి చెప్పకపోడం చూసి ఆశ్చర్యపోయారు. ఆస్పత్రిలో చేరిన ఈ వ్యక్తి వయస్సు 50 ఏళ్లు. కొద్ది రోజులుగా మలబద్దకం, ఆకలి లేకపోవడం, తిమ్మిరి వంటి లక్షణాలు చూసి ఆందోళనతో ఆయన భార్య హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. అయితే ఏం జరిగిందో అతను మాత్రం వైద్యులకు కూడా చెప్పలేదు. పరీక్ష నిర్వహించిన అనంతరం వైద్యులకు అసలు విషయం తెలిసింది. మలద్వారంలో వాటర్ బాటిల్ ఇరుక్కున్న విషయం తన భార్యకు చెబితే రియాక్షన్ ఎలా ఉంటుందోనని భయపడే భర్త ఈ విషయాన్ని దాచినట్లు వైద్యులు చెప్పారు. చివరకు మలద్వారం నుంచి వాటర్ బాటిల్‌ను బయటకు తీశారు. మూడు రోజుల అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పారు. అతని పెద్దపేగుకు, ఇతర అవయవాలకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. అయితే బాధితుడు స్వయంగా తానే వాటర్ బాటిల్‌ను మలద్వారంలోకి ఇన్సర్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పొరపాటున ఇరుక్కు పోయి ఉంటుందని, లైంగిక సంతృప్తి కోసమే అతను ఇలా చేసి ఉంటాడని వైద్యులు పేర్కొన్నారు. చికిత్స అనంతరం అతడ్ని మానసిక వైద్యుడి దగ్గరకు పంపారు. చదవండి: (ట్రంప్ సోషల్ మీడియా డీల్ లీక్!) -
వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా?.. అయితే డేంజర్లో పడ్డట్టే!
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): మనం రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో వివిధ వస్తువులను వినియోగిస్తుంటాం. వాటిని ఎంత కాలం ఉపయోగించాలనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. దీంతో ఎక్కువ కాలం వినియోగిస్తూనే ఉంటాం. కాలపరిమితి ముగిసిన వాటిని వాడితే ప్రమాదం పొంచి ఉంది. వీటితో పాటు వాడుకలో లేని వస్తువులను ఇంట్లోనే కుప్పలుగా వదిలేస్తుంటారు. వాటిల్లోనూ క్రిములు, బ్యాక్టీరియా వృద్ధి చెంది.. మనకు అనారోగ్య సమస్యలు తెచ్చి పెడతాయి. అలాంటి వాటిని సరైన సమయంలో మార్చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేవగానే పళ్లను శుభ్రం చేసుకునే బ్రష్ నుంచి రాత్రి పడుకునేందుకు వినియోగించే తలదిండు వరకు ఎలా ఉపయోగించాలి.. ఎప్పుడు మార్చాలి అనే విషయాలు తెలుసుకుందాం. చదవండి: నిజంగా ఏలియన్ల గుట్టు సముద్రాల్లో ఉందా? రెండింటి మధ్య లింకేంటి? మంచినీటి సీసా ఇంట్లో వినియోగించే మంచి నీళ్ల సీసాలు, వాటర్ క్యాన్ల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తరచూ వాటిని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే అడుగు భాగంలో నాచు పట్టే వీలుంటుంది. మంచినీటి సీసాలను మాత్రం మూడు, నాలుగు నెలలకోసారి మార్చాలి. వీటితో పాటు మార్కెట్లో అప్పటికప్పుడు తాగేందుకు కొనుగోలు చేసే నీటి సీసాలను తిరిగి ఇంట్లో వాడడం హానికరం. పొపుల పెట్టె వంటింట్లో పప్పు దినుసులు వేసే డబ్బాలను తరచూ శుభ్రం చేసుకోవాలి. ఓ సారి వేసిన సరకు అయిపోగానే..డబ్బాలను మళ్లీ శుభ్రం చేసుకుని కొత్త సరకు వేసుకోవాలి. అంతేగాని నీటితో శుభ్రం చేయకుండా అలా ఏడాది పొడవునా సరకులు వేస్తూ ఉండకూడదు. అలా వేస్తే అందులో ఉండే కొన్ని బ్యాక్టీరియాలు సరకుల్లో చేరే వీలుంటుంది. వీలైతే ఏడాదికోసారి డబ్బాలను మార్చి కొత్తవి ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇంట్లో పెంచుకునే మొక్కలు ఇంట్లోని కుండీల్లో పెంచుకునే మొక్కల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుండీల్లో చెత్త వేయకూడదు. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. లేకపోతే దోమలు వృద్ధి చెందే వీలుంటుంది. సాక్స్‌లు, దువ్వెన కాళ్లకు ధరించే సాక్స్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కాలపరిమితి ముగిసిన వెంటనే పాతవాటిని మార్చి..కొత్తవి ఉపయోగించాలి. ఇంట్లో పాడైన చెప్పులు, బూట్లను బయట పారేయాలి. లేకపోతే క్రిములు వృద్ధి చెందే వీలుంటుంది. నిత్యం తల దువ్వేందుకు వినియోగించే దువ్వెన విషయంలోనూ శుభ్రత పాటించాలి. పాడైన, పళ్లు సరిగా లేని దువ్వెనను వినియోగించకూడదు. టూత్‌బ్రష్ ప్రతి ఒక్కరూ ఉదయాన్నే వినియోగించే టూత్ బ్రష్‌ను తప్పనిసరిగా ప్రతి మూడు నుంచి నాలుగు నెలల్లోపు మార్చాలి. బ్రష్ పాడవకపోయినా.. దానిని ఎక్కువ కాలం వినియోగిస్తే..పళ్లకు ఇబ్బంది కలగొచ్చు. చిన్న పిల్లల బ్రష్‌ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బ్రష్‌పై ఉండే కుచ్చు పాడైన వెంటనే కాలంతో సంబంధం లేకుండా మార్చేయాలి. పాడైన బ్రష్‌లతో కొందరు ఇంట్లోని వస్తువులను శుభ్రం చేస్తుంటారు. అలాంటి వాటిల్లోనూ క్రిములు చేరే వీలుంటుంది. అందుకే వినియోగంలో లేని వాటిని బయట పాడేయాలి. తలదిండులు చాలా మంది ఇంట్లో మంచాలపై ఉండే దుప్పట్లు, దిండుకవర్లను మాత్రమే సకాలంలో శుభ్రం చేస్తూ.. అప్పుడప్పుడు కొత్తవి మార్చుతుంటారు. కానీ దిండ్లను మార్చరు. నిత్యం వినియోగించే దిండ్లపై సూక్ష్మక్రిములు వేగంగా వృద్ధి చెందుతాయి. అవి మన తలలోకి చేరడంతో దురద, ఇతర సమస్యలు వస్తాయి. అందుకే కొంతకాలం వాడిన తర్వాత వాటిని మార్చుకోవాలి. లోదుస్తులు మనం ధరించే లోదుస్తులను క్రమం తప్పకుండా ఉతికి ఆరేసిన తర్వాతే ధరించాలి. వీలైతే వేడి నీటితో శుభ్రం చేసుకోవడం ఉత్తమం. అలా చేయని పక్షంలో కనీసం ఇస్త్రీ అయినా చేసి ధరించాలి. అప్పుడే వాటిల్లో ఉండే క్రిములు చనిపోతాయి. లోదుస్తుల్లో క్రిములు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. వాటితో మనకు తామర, గజ్జి వంటి చర్మ వ్యాధులు సోకే వీలుంటుంది. పాడవకపోయినా.. లోదుస్తులను కూడా ఏడాదికోసారి మార్చేయడం మంచిది.