Snake Viral Video: దప్పికతో ఆ పాము అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కాసేపు అలాగే వదిలేస్తే దాని ప్రాణం పోవడం ఖాయం!. అలాంటి స్థితిలో ఓ వ్యక్తి సాయానికి ముందుకొచ్చాడు. ధైర్యంగా దాని నోటికి నీరు ఒక బాటిల్ సాయంతో అందించాడు. దీంతో అది ఓపిక తెచ్చుకుంది. ఇంటర్నెట్‌లో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఓ నాగుపాము చచ్చిన ఎలుకను మింగింది. అయితే ఆ ఎలుకలో ఉన్న ఎలుకల మందు కూడా పాము లోపలికి వెళ్లింది. దీంతో అది అపస్మారక స్థితిలోకి వెళ్లి.. విపరీతమైన దాహార్తితో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆ సమయంలో తన ఇంటి ముందు పాము అలా ఉండడాన్ని నటరాజన్ గమనించాడు. స్థానికంగా ఉండే చెల్లా అనే వ్యక్తికి సమాచారం అందింంచాడు.
అయితే అది ఇంకా చనిపోలేని.. డీహైడ్రేషన్‌తో బాధపడతుందని గుర్తించిన చెల్లా దాని నోటికి ఓ బాటిల్‌తో వాటర్ అందించాడు. ఎందుకైనా మంచిదని మరో చేత్తో దాని తోకను పట్టుకున్నాడు. దాహం తీరాక అది శక్తి తెచ్చుకుని వేగంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది.
மயக்க நிலையில் இருந்த நாகப்பாம்புக்கு சுற்றுச்சூழல் ஆர்வலர் பாட்டிலில் இருந்து தண்ணீர் கொடுத்த வீடியோ சமூக வலைதளங்களில் வைரலாகி வருகிறது. #Cuddalore #snake #water #cobra #viral #Jayaplus pic.twitter.com/3nZ77k6vOi
— Jaya Plus (@jayapluschannel) July 5, 2023
Video Source: Jaya Plus
ఈలోపు జనం కంగారుపడడంతో.. ఓ ప్లాస్టిక్ డబ్బాలో దాన్ని బంధించి సమీపంలోని అడవిలో వదిలేశాడు. చెల్లా సాహసోపేతంగా ఆ పామును రకక్షించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. తమిళనాడు కడలూరు జిల్లా తిరుచోపరూర్‌లో ఈ ఘటన జరిగింది.
ఇదీ చూసేయండి: ఇలాంటి కామాంధుల వల్లే దేశానికి చెడ్డపేరు!
Comments
Please login to add a commentAdd a comment