cobra
-
10 రోజులుగా ఆటబొమ్మలో నాగుపాము
భువనేశ్వర్: ఆటబొమ్మలో నాగుపాము బుసలు కొడుతూ భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన పూరీ జిల్లా సత్యబాది గ్రామంలో చోటుచేసుకుంది. పెరటి తోటలో వింత శబ్దం రావడంతో వెళ్లిన యజమాని ప్లాస్టిక్ ఆటబొమ్మను పరిశీలించగా నాగు పాము ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే స్నేక్ హెల్ప్ లైనుకు సమాచారం అందించడంతో కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజబండ్రీ అధ్యాపకుడు డాక్టరు ఇంద్రమణి నాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందం శస్త్ర చికిత్స పరికరాలతో చేరుకుని పాముని విడుదల చేశారు. సుమారు 10 రోజులుగా ఆహారం లేక నీరసించిన పాము వైద్య సంరక్షణలో పూర్తిగా కోలుకున్నాక అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని చెప్పారు. -
అమెజాన్‌లో ఆర్డర్.. పార్శిల్ నుంచి బుసలు కొడుతూ బయటకు వచ్చిన పాము
బెంగళూరు : ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. వినియోగదారులకు కావాల్సిన వస్తువుల్ని అందించే విషయంలో ఈకామర్స్ కంపెనీలు ట్రెండ్‌ను మార్చినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు స్మార్ట్‌ఫోన్ బదులు సబ్బుబిళ్ల, ఇటుక బిళ్లలు పంపించడం రివాజు. కానీ ఇప్పుడు పాముల్ని డెలివరీ చేస్తున్నాయని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బెంగళూరులోని సర్జాపూర్‌కు చెందిన భార్యభర్తలు ఐటీ ఉద్యోగులు. కాలక్షేపం కోసం ఇంట్లో వీడియోగేమ్ ఆడుకునే ఎక్స్‌బాక్స్‌ను అమెజాన్ కంపెనీ యాప్‌లో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ రానే వచ్చింది. ఎంతో ఉత్సాహంతో సదరు కంపెనీ నుంచి వచ్చిన పార్శిల్ ఓపెన్ చేసే ప్రయత్నించారు. కానీ దంపతుల్ని షాక్‌కి గురి చేస్తూ పార్శిల్లో నుంచి ఓ పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. ఈ ఊహించని పరిణామంతో కంగుతిన్న టెక్కీలు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ‘రెండు రోజుల క్రితం ఎక్స్‌బాక్స్ కంట్రోలర్‌ను ఆర్డర్పెట్టాం. ఆ ఆర్డర్ వచ్చింది. కానీ దాన్ని ఓపెన్ చేస్తే ఓపాము బయటపడింది. అందుకు డెలివరీ బాయే సాక్ష్యం అని తెలిపారు. అదృష్టవశాత్తూ పాము ప్యాకేజింగ్ టేపుకు ఇరుక్కుపోయింది. ప్రమాదం అయినప్పటికీ తాము చెబుతున్నది నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు అమెజాన్ ప్రతినిధులు మమ్మల్ని 2 గంటల పాటు హోల్డ్‌లో ఉంచారని వాపోయారు. ఆ తర్వాతే స్పందించారని అన్నారు. స్పందించిన అమెజాన్కస్టమర్ వీడియోపై స్పందిస్తూ, కంపెనీ ట్వీట్ చేసింది.మీకు కలిగిన అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం. వివరాల్ని పూర్తిగా పరిశీలించిన తగిన న్యాయం చేస్తాం అని అమెజాన్ ప్రతినిధులు స్పందించారు. -
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
హిందూ సాంప్రదాయంలో పాములను నాగ దేవతగా భావించి పూజలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ప్రతి నెలలలో వచ్చే పంచమి, చవితి తిథులకు పుట్టలో పాలు పోయడం, పూజలు చేయడం వంటివి కూడా చేస్తారు. కానీ కొందరు మూఢ భక్తితో చేసే పనులు చాలా భయానకంగా ఉంటాయి. అది భక్తో లేక మూర్ఖత్వం అనాలో తెలియదు. అలాంటి షాకింగ్ ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. నిజానికి నాగుపాముని విష్ణవు, శివ స్వరూపాలుగా భావిస్తారు. ఎందుకంటే విష్ణువుకి పాన్పుగా ఆదిశేషుడు, శివుని మెడలో వాసుకిగా నాగులు ఉండటంతో వాటికి పురాణల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ముఖ్యమైన పర్వదినాల్లో నాగులను పూజించి వేడుకోవడం జరుగుతుంది. అంత వరకు ఓకే కానీ ఏకంగా విషసర్పాలను నేరుగా తెచ్చి పూజించడం అంటే..వామ్మో అనిపిస్తుంది కదా!. మహా అయితే పుట్టకో లేదా దేవాలయాల్లో నాగుల జంట ఉండే ప్రతిమకు పూజలు చేస్తే చాలు. దీని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ఈ కుటుంబం ఏకంగా మూఢ భక్తితో నల్ల నాగుపాముని తెచ్చి ఓ ప్లేటులో ఉంచి పూజలు చేసేస్తున్నారు. అదేమో ఒక పక్క బుసలు కొడుతూ కాటేసే యత్నం చేస్తున్నా..వీళ్లు మాత్రం భక్తిపారవశ్యంతో పూజలు చేసేస్తున్నారు. మరోవూపు అది కాటేస్తుందేమోనన్న భయంతో ఒక పక్క మనుసులో ఉన్నా సరే పూజల తంతు మాత్రం ఆపడం లేదు. పొరపాటున ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థిత ఏంటీ..?. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వాళ్లు నాగుపాముకి నేరుగా పూజలు చేస్తున్న విధానం చూస్తే..బాబోయ్! అనిపిస్తుంది. View this post on Instagram A post shared by हिंदू धर्म रक्षक (@omkar_sanatanii) (చదవండి: టిష్యూ బ్రెడ్..అచ్చం రుమాలి రోటీ లా..! వీడియో వైరల్) -
పామును పట్టి, డబ్బాలో పెట్టి, నాలుగు రోజులకు తెరవగానే..
పామును చూడగానే చాలామంది భయపడిపోతుంటారు. మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో పామును పట్టుకున్న తరువాత విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. అది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బుందేల్‌ఖండ్‌లోని మక్రోనియా పరిధిలోగల బెటాలియన్ ప్రాంతంలో పాములుపట్టే అఖిల్ బాబా ఇటీవల ఒక నాగు పామును పట్టుకున్నాడు. తరువాత దానిని ఒక పెట్టెలో బంధించాడు. నాలుగు రోజుల తరువాత ఆ పెట్టెను తెరచి చూసి, ఆశ్యర్యంతో నోరెళ్లబెట్టాడు. తన 30 ఏళ్ల అనుభవంలో తొలిసారిగా ఇలాంటి ఘటన జరిగిందని తెలిపాడు. తాను ఒక నాగు పామును పట్టుకుని పెట్టెలో బంధించి ఉంచానని, అయితే నాలుగు రోజుల తరువాత ఆ పెట్టెలో నుంచి ఏవో శబ్ధాలు రావడంతో తెరిచి చూసేసరికి ఆ పాముతో పాటు ఏకంగా 16 పాము గుడ్లు కనిపించాయని తెలిపాడు. వీటిని అటవీశాఖ అధికారులకు అప్పగిస్తానని అఖిల్ బాబా తెలిపారు.నాగుపాము అనేది పాము జాతులలో ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. ఇది భారతదేశంతో సహా అనేక దేశాలలో కనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆడ నాగుపాము ఒకేసారి 10 నుండి 30 గుడ్లు పెడుతుంది. వాటి నుంచి 45 నుండి 70 రోజులలో పాము పిల్లలు బయటకు వస్తాయి. -
మనుమరాలిని విషనాగు నుంచి కాపాడి.. కన్నుమూసిన బామ్మ!
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లోని అందరినీ కంటతడి పెట్టించే ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి షాహ్గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్గుపూర్ కాలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాత్రివేళ ఇంట్లో నిద్రిస్తున్న బామ్మ, మనవరాలి మంచంపైకి ఒక భారీ నాగుపాము చేరింది. ఆ పాము మనుమరాలి వైపు కదులుతున్న విషయాన్ని గమనించిన బామ్మ దానిని చేత్తో పట్టుకుంది. వెంటనే ఆ విషనాగు బామ్మను కాటేసింది. ఈ సమయంలో బామ్మ ఆర్తనాదాలను విన్న కుటుంబ సభ్యులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే బామ్మను సమీపంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. అయితే ఆ బామ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా పామును చేత్తో పట్టుకుని, మనుమరాలిని కాపాడున్న బామ్మ సాహసానికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వీక్షకులు బామ్మ సీతాదేవి(72) తెగువకు సెల్యూట్ చేస్తున్నారు. ఈ ఘటనలో ఆమె మనుమరాలు(24)కు ఎటువంటి హాని జరగలేదు. కాగా పాము కాటుకు బామ్మ మృతిచెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయకుండా ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు. -
పాము పాలు తాగదు మరీ పుట్టలో పోయడం ఎందుకు ?
నాగుల చవితి ఆశ్లేష , ఆరుద్ర , మూల , పూర్వాభాద్ర , పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది , పాకేది. నాగములో *‘న , అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు. జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు. కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఇక చవితికి పుట్టలో పాలు పోయడంలో అంతరార్థం ఏమిటి? ఆ 12 నాగులనే ఎందుకు పూజిస్తారు..? ఇక చవితి అంటే నాల్గవది అనగా ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగులను చవితినాడు దేవాలయాలలో , గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి. ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును , పుట్టను , రాయిని , రప్పను , కొండను , కోనను , నదిని , పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. ని పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది. దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు , రెండు పాములు మెలికలు వేసుకొని రావి , వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు , వైవాహిక , దాంపత్య దోషాలు , గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం , కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయిఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ , పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట !. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా - సంహితల్లో , బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ , ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు , కర్కోటకుడు , వాసుకి , శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల , వితల , సుతల , తలాతల , రసాతల , మహాతల , పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి. కద్రువ నాగ మాత , మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే - ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు , రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది. శ్రావణ మాసంలో ఎందుకు చేస్తాం అంటే.. వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం ‘నాగ పంచమి’ పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి , రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. కార్తీకంలో ఎందుకంటే..? పంటలు ఏపుగా పెరిగే కాలం కావడంతో ‘కార్తీక శుద్ధ చవితి’నాడు మనం ‘నాగుల చవితి’ని పర్వదినంగా ఆచరిస్తున్నాం. పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు !. పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు. ‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని , వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి , సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే , నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం. పంట పొలాలకు శత్రువులు ఎలుకలు , వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే , మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ ! ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా , విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఆధ్యాత్మిక యోగా పరంగా ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుపాము' అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది. పుట్టలో పాలు పోయటంలో అంతరార్థం.. అందువల్ల నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది. నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం* పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము , యోగము , భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం , సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం. ”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం , అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. ఆ 12 నాగులనే ఆరాధిస్తారు.. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి. నాగుల చవితి మంత్రం పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. అనంత వాసుకి శేష పద్మ కంబాల కర్కోటకం ఆశ్వతార ధృతరాష్ట్ర శంఖపాల కలియా తక్షక పింగళ ఈ ప్రపంచంలో పాములు, ఆకాశం , స్వర్గం , సూర్యకిరణాలు , సరస్సులు , బావులు చెరువులు నివసిస్తున్నాయి. ఈ రోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు. పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి . నడుము తొక్కితే నావాడు అనుకో పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో తోక తొక్కితే తోటి వాడు అనుకో నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి. ప్రకృతిని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము. అని అర్ధము. పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము. మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత. బియ్యం , రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట. ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం. పుట్ట నుంmr మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు. ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని. (చదవండి: అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో షాకింగ్ ఘటన..చనిపోయిన ఆ మొసలి స్థానంలో..) -
హఠాత్తుగా నాగుపాము తిరగబడితే... రోమాలు నిక్కబొడిచే వీడియో!
ఎటువంటి కర్మకు అటువంటి ఫలితమే వస్తుందని అంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఒక వీడియో దీనికి రుజువుగా మారింది. వీడియోలోని దృశ్యం ప్రకారం.. కారులో కూర్చున్న ఒక వ్యక్తి వినోదం కోసం రివాల్వర్‌తో నాగుపాముకు గురిపెట్టి కాల్పులు జరుపుతాడు. అయితే గురి తప్పి, ఆ నాగుపాము తృటిలో తప్పించుకుంటుంది. అయితే ఆ మరుసటి క్షణంలో కారులో కూర్చున్న వ్యక్తికి ప్రాణాలు పోయినంత పని అవుతుంది. వీడియో ప్రారంభంలో ఒక కింగ్ కోబ్రా(నాగు పాము) మట్టి రహదారిపై ఉండటాన్ని గమనించవచ్చు. అదే సమయంలో ఒక కారు ఆ కోబ్రా ముందు ఆగి ఉంటుంది. ఇంతలో కారులో ఉన్న వ్యక్తి తన రివాల్వర్ని తీసి, కోబ్రాపై కాల్పులు జరుపుతాడు. ఆ వ్యక్తి పలుమార్లు నాగుపాముపై కాల్పులు జరుపుతాడు. అయితే ప్రతిసారీ గురి తప్పుతుంది. ఆ నాగుపాము కోపంతో తన పడగ విప్పి, ఆ వ్యక్తిపై దాడికి ఉపక్రమిస్తుంది. దీంతో ఆ వ్యక్తి గట్టిగా అరవడం వీడియోలో వినిపిస్తుంది. దీంతో వీడియో ఎండ్ అవుతుంది. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్లో @Instantregretss అనే ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు లెక్కకు మించిన వీక్షణలు దక్కాయి. ఈ వీడియోను ఐదు వేల మందికి పైగా లైక్ చేశారు. ఇది కూడా చదవండి: చిరుత కుటుంబం ఇంత సన్నిహితమా? Don't bring a gun to a cobra fight! 🐍 pic.twitter.com/qGshAWdjHu — Klip Entertainment (@klip_ent) December 16, 2022 -
త్రాచును మించిన జడ.. పడగ కూడా..!
లక్నో: కురులంటే ఆడవారికి ఎంతో ఇష్టం. అవి వారి అందాన్ని మరింత పెంచుతాయి. అందుకే ఎంతో ప్రత్యేకంగా వాటిని కాపాడుకుంటుంటారు. నిండైన జడ కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఒకవైపు.. మరోవైపు కురులకు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రధాన్యత ఉంటుంది. అయితే.. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ ధామ్‌లో ఓ మహిళ కురులు త్రాచుపాము అంతటి పరిమాణంలో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. బృందావన్ ధామ్ ఆధ్యాత్మికంగా హిందువులకు ఎంతో ప్రధాన్యత కలిగిన ప్రదేశం. కృష్ణుని జన్మస్థానంగా పేర్కొంటారు. ఇక్కడ ఓ మహిళ జుట్టు చాలా పెద్ద పరిమాణంలో పెరిగింది. దాదాపుగా త్రాచుపాము లాగే కనిపిస్తోంది. నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉన్న ఆ మహిళ తన జుట్టును ఏ మాత్రం పట్టించుకోకున్నా.. ఇంతటి పరిమాణంలో పెరిగింది. జడలు కట్టి ఉన్న ఈ మహిళ పాదాలకు భక్తులు నమస్కారం చేస్తుంటారు. తమకు తోచినంత సహాయం చేస్తుంటారు. View this post on Instagram A post shared by Meri Yamuna Ji (@meriyamunaji) సోషల్ మీడియోలో ఈ మహిళ తెగ వైరల్ అవుతోంది. ఆమె జుట్టుపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు జుట్టుకు ఎలాంటి పోషణ చేయకున్నా.. ఇంతటి స్థాయిలో పెరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాగుపాము ఆకారంలో జడ ఏర్పడటంతో ప్రణామాలు చేస్తున్నారు. నిజంగా ఇది చాలా వింత కదా..! ఇదీ చదవండి: ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్ -
నిద్రిస్తున్న బాలికను కాటు వేసిన నాగుపాము
దుర్గి/చిలకలూరిపేట టౌన్: పాముకాటులో బాలిక మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని అడిగొప్పల యానాది కాలనీకి చెందిన కొమరగిరి అనిల్ బాబు, పూజ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె మౌనిక స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు చిలకలూరిపేట మండలం పోతవరం గ్రామంలో కూలీ పనులు కోసం వెళ్లారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావటంతో శనివారం బంధువులతో తల్లిదండ్రుల వద్దకు పోతవరం వెళ్లింది. తల్లిదండ్రులతో ఆటపాటలతో సంతోషంగా గడిపి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురైంది. పాప ఏడవడంతో తల్లిదండ్రులు పాము కాటు అని గుర్తించి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు చికిత్స కొనసాగిస్తున్న క్రమంలో బాలిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న సర్పంచి నలబోతు చిన్నబ్బాయి మృతి చెందిన బాలిక కుటుంబానికి మట్టి ఖర్చులు కోసం రూ.5వేల ఆర్ధిక సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులను వైస్ ఎంపీపీ చల్లా శ్రీనివాసరావు, ఎంపీటీసీ షేక్ హుసేన్ పరామర్శించారు. -
టమాటాలకు కాపలాగా ఎవరున్నారో చూశారా.. పెద్ద ప్లానే..
ప్రస్తుతం అత్యంత ఖరీదైన వస్తువుల్లో టమాటా కూడా చేరిపోయింది. కొనుగోలు చేయడానికి ఆలోచిస్తే పరవాలేదు, కొన్నది వండుకోవడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది, మళ్ళీ కొనగలమో లేదో అని. టమాట రేటు ఆకాశానికి చేరిన వార్త తెలుసుకుందో ఏమో వంటింట్లో ఉంచిన టమాటాల వద్ద ప్రత్యక్షమైంది ఒక కోడె నాగు. అక్కడే ఉండి వాటి జోలికి ఎవ్వరూ రాకుండా కాపలా కాసింది. పాములు సాధారణంగా ఇళ్లల్లోకి వచ్చినా మనుషుల కంట పడకుండా ఎక్కడో మూల వెలుతురు పడని చోట నక్కి ఉంటాయి లేదా ఏదైనా కలుగులోకి దూరి దాక్కుంటాయి. కానీ ఒక తాచు పామును టమాటాలు ఆకర్షించాయో లేక వాటి ధర ఆకట్టుకుందో గాని ఇంట్లోకి చొరబడి అవి ఉన్న ప్లేటును చుట్టుకుని కాపలాగా కూర్చుంది. ఎవరైనా వాటి జోలికి వస్తే చాలు కాటేసేందుకు పడగ విప్పి బుసలు కొట్టింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే విశేష స్పందన వచ్చింది. View this post on Instagram A post shared by Mirza Md Arif (@mirzamdarif1) టమాటా ధర రోజురోజుకూ పెరుగుతూ సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. రెండు నెలల క్రితం రూ.20 ఉండే కిలో టమాటా చూస్తుండగానే సెంచరీ పూర్తి చేసుకుని డబుల్ సెంచరీ వైపుగా పరుగులు తీస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే వీటి ధర ఇప్పటికే రూ.200 మార్కు అందుకుని రూ. 250 చేరుకునే క్రమంలో ఉంది. ఇది కూడా చదవండి: పోక్సో చట్టం దుర్వినియోగం.. బాంబే హైకోర్టు కీలక తీర్పు -
కింగ్ కోబ్రాకు కిస్.. నెటిజన్లు ఫైర్.. వీడియో వైరల్..
ఫేమస్ అయిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు పోస్టు చేసి లైక్స్, వ్యూస్ చూసి తమ పలుకుబడి ఎంత ఉందో అంచనా వేసుకుంటారు. రాత్రికి రాత్రే ఫేమస్ కావడానికి ప్రాణాల మీదకు వచ్చే పనులు కూడా చేస్తుంటారు. అయితే.. ఇందులో కొందరు సహజంగా విభిన్నమైన టాలెంట్‌ను ప్రపంచానికి చూపించే వారు కూడా ఉండకపోరు. తాజాగా ఓ వ్యక్తి కింగ్ కోబ్రాకు కిస్ పెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాములంటే ఎంత భయం. చూడగానే వన్నులో వణుకు వస్తుంది. కానీ కొందరు వాటితో కూడా స్నేహం చేసే వారు ఉంటారు. ఈ కోవకే చెందిన వ్యక్తేనేమో నిక్. తను ఓ కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు. చాలా పొడవు ఉన్న ఆ పాము పడగ విప్పిన వేళ.. దానికి వెనకు నుంచి ధైర్యంగా ముద్దు పెట్టాడు. కానీ ఆ కింగ్ కోబ్రా ఆయన్ని ఏమీ అనలేదు. ఈ వీడియోను నిక్ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు భారీగా స్పందించారు. నిక్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు కొంత మంది నెటిజన్లు. పాములపై తమ భయాన్ని వెలిబుచ్చారు మరికొందరు. 'పోతావ్ రేయ్..' అంటూ మరికొంత మంది క్రేజీగా స్పందించారు. ఏదేమైనా పాములకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ వీడియోకు వారం రోజుల్లోనే వేలల్లో వ్యూస్ వచ్చాయి. ఇదీ చదవండి: ఇద్దరు యువతులు పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని.. -
అపస్మారక స్థితిలోకి నాగు.. ఎలా కాపాడాడో చూసేయండి
Snake Viral Video: దప్పికతో ఆ పాము అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కాసేపు అలాగే వదిలేస్తే దాని ప్రాణం పోవడం ఖాయం!. అలాంటి స్థితిలో ఓ వ్యక్తి సాయానికి ముందుకొచ్చాడు. ధైర్యంగా దాని నోటికి నీరు ఒక బాటిల్ సాయంతో అందించాడు. దీంతో అది ఓపిక తెచ్చుకుంది. ఇంటర్నెట్లో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ నాగుపాము చచ్చిన ఎలుకను మింగింది. అయితే ఆ ఎలుకలో ఉన్న ఎలుకల మందు కూడా పాము లోపలికి వెళ్లింది. దీంతో అది అపస్మారక స్థితిలోకి వెళ్లి.. విపరీతమైన దాహార్తితో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆ సమయంలో తన ఇంటి ముందు పాము అలా ఉండడాన్ని నటరాజన్ గమనించాడు. స్థానికంగా ఉండే చెల్లా అనే వ్యక్తికి సమాచారం అందింంచాడు. అయితే అది ఇంకా చనిపోలేని.. డీహైడ్రేషన్‌తో బాధపడతుందని గుర్తించిన చెల్లా దాని నోటికి ఓ బాటిల్‌తో వాటర్ అందించాడు. ఎందుకైనా మంచిదని మరో చేత్తో దాని తోకను పట్టుకున్నాడు. దాహం తీరాక అది శక్తి తెచ్చుకుని వేగంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది. மயக்க நிலையில் இருந்த நாகப்பாம்புக்கு சுற்றுச்சூழல் ஆர்வலர் பாட்டிலில் இருந்து தண்ணீர் கொடுத்த வீடியோ சமூக வலைதளங்களில் வைரலாகி வருகிறது. #Cuddalore #snake #water #cobra #viral #Jayaplus pic.twitter.com/3nZ77k6vOi — Jaya Plus (@jayapluschannel) July 5, 2023 Video Source: Jaya Plus ఈలోపు జనం కంగారుపడడంతో.. ఓ ప్లాస్టిక్ డబ్బాలో దాన్ని బంధించి సమీపంలోని అడవిలో వదిలేశాడు. చెల్లా సాహసోపేతంగా ఆ పామును రకక్షించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. తమిళనాడు కడలూరు జిల్లా తిరుచోపరూర్లో ఈ ఘటన జరిగింది. ఇదీ చూసేయండి: ఇలాంటి కామాంధుల వల్లే దేశానికి చెడ్డపేరు! -
‘కోబ్రా’తో బుడతడి ఆటలు..!
కింగ్ కోబ్రా (రాచ నాగు) అంటేనే అందరికీ హడల్. ఆ పామును చూస్తే పరుగులు తీస్తారు. కానీ ఓ ఐదేళ్ల బుడతడు ఏ మాత్రం భయం లేకుండా దానిని ఆడిస్తున్నాడు. కర్ణాటకలో ఉత్తర కన్నడ జిల్లా శిరసి తాలూకా కేహెచ్‌బీ కాలనీవాసి పాములు పట్టే నిపుణుడు ప్రశాంత్ హులేకర్ కుమారుడు విరాజ్ ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. బాలుడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నాడు. గత రెండేళ్లుగా తండ్రితో కలిపి పాములు పట్టడం నేర్చుకున్నాడు. సోమవారం కేహెచ్‌బీ కాలనీలో కింగ్ కోబ్రా చొరబడిందని తెలిసి తండ్రీకొడుకులు దానిని బంధించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా విరాజ్ స్వేచ్ఛగా సర్పాన్ని ఆడిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తర్వాత దానిని దూరంగా విడిచిపెట్టారు. – బనశంకరి -
కప్పతో పాటు ప్లాస్టిక్ కవర్ మింగిన నాగుపాము..
మైసూరు: ప్లాస్టిక్ కవర్ల వల్ల జంతుజాలం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. నాగుపాము ఒకటి కప్పతో పాటు ప్లాస్టిక్ కవర్‌ను మింగి అవస్థ పడుతుండగా పాముల నిపుణుడు సపర్యలు చేసి కాపాడాడు. ఈ సంఘటన కొడగు జిల్లా కుశాలనగ దగ్గర గొంది బసవనహళ్ళి గ్రామంలో జరిగింది. చెందిన శశి అనే వ్యక్తి ఇంటిలోకి వచ్చిన నాగుపాము ఇంటిలో దాక్కున్న కప్పతో పాటు ప్లాస్టిక్ కవర్‌ను పొరపాటును మింగేసింది. కవర్ గొంతులో అడ్డం పడి పాము విలవిలలాడసాగింది. అది చూసి పాములు నిపుణుడు అయిన గఫూర్‌కు కొందరు సమాచారమిచ్చారు. ఆయన దానికి నీటిని తాగించి కప్పతో పాటు ప్లాస్టిక్ కవర్‌ను బయటకు తీసి పామును దూరంగా విడిచిపెట్టాడు. -
కారు కింద 15 అడుగులు భారీ కింగ్ కోబ్రా..పట్టుకున్న తీరు చూస్తే..
ఓ ఇంటిలోని కారుకింద భారీ కింగ్ కోబ్రా దాగి ఉంది. భయంతో పాములు పట్టుకునే వారికి సమాచరం అందిచడంతో..వారు రంగంలోకి దిగి వెతకగా.. ఏకంగా 15 ఏడుగుల భారీ కింగ్ కోబ్రా బయటపడింది. పాములు పట్టే నిపుణుడిని సైతం ముచ్చమటలు పట్టేలా జరజర పాకి వెళ్లిపోయేందుకు యత్నించింది. పాపం అతను చివరికి ఎంతో చాకచక్యంగా దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. దాని చాలా జాగ్రత్తగా దారి మళ్లించి ముందుగా ఏర్పాటు చేసుకున్న సంచిలోకి వెళ్లేలా చేశాడు. అందుకుసంబంధించిన వీడియోని ఫారెస్ట్ అధికారి సుశాంత్ నంద ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత అతను ఆ పాముని అడవిలో ఒదిలేసినట్లు పేర్కొన్నారు. దయచేసి ఇలాంటి అత్యంత విషపూరిత పాములను అతను మాదిరి పట్టుకునే యత్నం ఎవరూ చేయొద్దని సుశాంత్ హెచ్చరించారు కూడా. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇలా.. ఇళ్లలోకి విషపూరిత పాములు చొరబడుతున్నట్లు తెలిపారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు ఇలాంటి పాములే భారత్‌కి గర్వకారణమని, అతను చాలా స్కిల్‌ఫుల్‌గా పట్టుకున్నాడంటూ సదరు వ్యక్తిపై ప్రశంసల జల్లు కురిపించారు. (చదవండి: భద్రతా సిబ్బంది సమక్షంలోనే గ్యాంగ్‌స్టర్ టిల్లుపై కత్తితో..వీడియో వైరల్) -
గాల్లో విమానం.. పైలట్ సీట్లోకి నాగు పాము.. తర్వాత ఏం జరిగిందంటే!
జోహన్నెస్‌బర్గ్: గాల్లో ఎగురుతున్న ఓ విమానంలోని అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాక్ పిట్లోకి ప్రవేశించిన అత్యంత విషపూరితమైన కేప్ కోబ్రా ఏకంగా పైలట్ సీట్ పక్కన దర్శనమిచ్చింది. పామును గమనించిన పైలట్ భయపడకుండా చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో సోమవారం చోటు చేసుకుంది. విమానంలో పామును చూసిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. సోమవారం నలుగురు ప్రయాణికుతో చిన్న విమానం వార్సెస్టర్ నుంచి నెల్సుప్రీట్‌కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ రుడోల్ఫ్ ఎరాస్మస్కు తన వెనుక భాగంలో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. తల తిప్పి చూడగా.. ఓ నాగుపాము తన సీటు కింద కదులుతూ కనిపించింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అయితే పాముని చూసి బెంబేలెత్తకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. ఈ విషయాన్ని ముందుగా గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందికి తెలియజేశాడు. ఏటీసీ సూచనలతో విమానాన్ని జోహన్నెస్‌బర్గ్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో ప్రాయణికులకు ప్రాణాపాయం తప్పింది. విమానంలోని వారిని దింపేసి తనిఖీలు చేయగా.. పైలట్ సీటు కింద పాము చుట్టుకొని ఉండటాన్ని గుర్తించారు. వాస్తవానికి ప్రయాణానికి ముందు రోజు ఆదివారం మధ్యాహ్నం వార్సెస్టర్ ఎయిర్‌పోర్టు సిబ్బంది విమానం రెక్కల కింద నాగుపామును గుర్తించారు. దాన్ని పట్టుకునేందుకు వారు ప్రయత్నించినా దాని ఆచూకీ లభించకపోవడంతో బయటకు వెళ్లిపోయిందని భావించారు. అనూహ్యంగా మర్నాడు కాక్‌పిట్‌లో ప్రత్యక్షమైంది. మరోవైపు సంయమనం పాటించి, విమానాన్ని జాగ్రత్తగా ల్యాండింగ్ చేసిన పైలెట్‌ను అభినందిస్తూ అతని ధైర్య సాహసాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
చెయ్యికి పాము చుట్టినా.. భక్తిపారవశ్యంతో చిందులు
వైరల్: దేవుడిపై భక్తి, నమ్మకం ఉండాలి. కానీ, అది గుడ్డిగా ఉండకూడదు!. భక్తి పేరుతో మూఢనమ్మకాలను ప్రమోట్ చేయడం, అంధ విశ్వాసంతో ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం తరచూ చూస్తున్నాం కూడా. అయితే.. తాజాగా మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ బార్డర్‌లోని ఓ గ్రామంలో జరిగిన ఆసక్తికర ఘటన ఒకటి ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. చిన్‌ద్వారా జిల్లా జామ్ సవాలీ హనుమాన్ ఆలయం.. ఆ చుట్టుపక్కల 11 జిల్లాల్లో బాగా ఫేమస్. ఎందుకంటే ఆ ఆలయంలో స్వామివారి విగ్రహం పడుకుని ఉన్న పొజిషన్లో ఉంటుంది. సంజీవని పర్వతం మోసుకెళ్లే సమయంలో.. ఆయన అక్కడ సేదతీరాడని నమ్మకం. అంతేకాదు విగ్రహ నాభి నుంచి నీరు ఉబికి వస్తుంటుంది. ఆ నీటిని తీర్థంలా స్వీకరిస్తే.. మానసిక జబ్బులు తగ్గిపోవడంతో పాటు దెయ్యాలు, దుష్టశక్తులు వదిలిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఉదయం, సాయంత్రం మహా హారతి వేళ అలాంటి భక్తులతో ఆలయం కిక్కిరిసిపోతుంటుంది. అయితే.. తాజాగా హోలీ పండుగ సందర్భంగా ఈ ఆలయంలో ఒక ఘటన జరిగింది. హరతి సమయంలో భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ నాగుపాము ఒక భక్తురాలి చేతికి చుట్టుకుంది. అయితే ఆ పరిణామంతో ఆమె బెదరలేదు. పైగా ఆ పాము అలా ఉండగానే పైకి లేచింది. భక్తిపారవశ్యంతో పూనకం వచ్చినట్లు ఊగిపోతూ చిందులేసింది. అది చూసి భయంతో కొందరు దూరం జరిగారు. మరికొందరు స్వామివారి నినాదాలు చేస్తూ ఊగిపోయారు. అదేం విచిత్రమో.. ఆ పాము కూడా ఆమెను ఏం చేయలేదు. కాసేపటికి చెయ్యి నుంచి దిగిపోయి.. తన మానానా తాను బయటకు వెళ్లిపోయింది. ఈ ఆలయంలో ఈ తరహా అద్భుతాలు తరచూ జరుగుతుంటాయని, అంతా స్వామివారి మహిహేనని ఆలయ ప్రధాన అర్చకుడు చెప్తున్నారు. महाराष्ट्र, मध्य प्रदेश के बॉर्डर पर स्थित सौंसर के जामसवली मंदिर में कोबरा प्रजाति का सांप हाथो मे लेकर महाआरती करती महीला, pic.twitter.com/5wNBiHAvPX — Yogendraindiatv (@indiatvyogendra) March 9, 2023 -
నాగుపామును ముద్దాడి మృత్యువు ఒడిలోకి..
పాట్నా: మద్యం మత్తులో ఓ వ్యక్తి చేజేతులారా ప్రాణం తీసుకున్నాడు. అది చాలా విచిత్రంగా ప్రవర్తించి. ఓ నాగుపామును దొరకబుచ్చుకుని మెడలో వేసుకుని వీరంగం సృస్టించాడు. దానిని ముద్దాడి.. ఆటాడి.. పూజించి.. చివరకు కాటేయించుకుని ప్రాణం పొగొట్టుకున్నాడు. నాగుపాముతో ఆటాడి ప్రాణం పొగొట్టుకున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పామును మెడలో వేసుకుని.. దాని ముద్దాడాడు ఆ వ్యక్తి. ఆపై అక్కడే ఉన్న ఓ గుడి ముందుకు చేరి పాము మెడలో ఉండగానే వంగి వంగి దండాలు పెట్టాడు. మళ్లీ రోడ్డు మీదకు చేరి డ్యాన్స్ చేస్తూ పామును ముద్దాడాడు. ఈ క్రమంలో అది అతన్ని కాటు వేసింది. వద్దని చుట్టుపక్కల వాళ్లు ఎంత వారించినా వినకుండా పాముతో ఆటలాడాడతను. ఆపై పామును వదిలేశాడతను. అయితే కాసేపటికే అతను కుప్పకూలిపోగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే పాము విషం ఎక్కి అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన బీహార్ నవాడాలోని నారాయణపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. మృతుడ్ని దిలీప్ యాదవ్‌గా గుర్తించారు. తప్పతాగి అతను గ్రామస్తులు చెప్పినా వినకుండా.. అలా పాముతో ఆటలాడాడని తెలుస్తోంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాక.. ఈ ఘటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని పోలీసులు చెబుతున్నారు. शराब के जानलेवा परिणाम! वीडियो नवादा से है. वीडियो में दिख रहा ये शख्स शराब के नशे में सांप के साथ खेल रहा है. कभी गले में लपेटकर तो कभी हाथों में पकड़कर नचा रहा. नतीजा सांप ने डंसा और शख्स की मौत हो गई. वीडियो-अमन राज. Edited By-@Sinhamegha8 pic.twitter.com/IhD1G3Jo8a — Prakash Kumar (@kumarprakash4u) March 4, 2023 -
సెల్ఫీ తీసుకుంటుండగా కోబ్రా కాటేసింది
కందుకూరు: నాగుపాముతో సెల్ఫీకి ప్రయత్నించిన ఓ యువకుడు ఆ పాము కాటేయడంతో ప్రాణాలొదిలాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్డులో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. బుధవారం వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామానికి చెందిన పోలంరెడ్డి సాయిమణికంఠరెడ్డి (22) కందుకూరులోని జేఏ కాంప్లెక్స్‌లో షాపును అద్దెకు తీసుకుని జ్యూస్ షాపు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పాములు పట్టి ఆడించే వెంకటస్వామి అనే వ్యక్తి ఆ షాపు వద్దకు వచ్చాడు. ఆ పామును చూసి సంబరపడిన మణికంఠరెడ్డి పాముతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో పామును మణికంఠరెడ్డి మెడలో వేసుకోగా.. ఆ పాము జారి కిందపడిపోయింది. దీంతో మణికంఠరెడ్డి పాము తోక పట్టుకునే ప్రయత్నంలో అది ఒక్కసారిగా వెనక్కి తిరిగి కాటేసింది. వెంటనే స్నేహితులు మణికంఠను ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే మణికంఠ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కోరలు లేవని చెప్పడం వల్లే.. పామును ఆడించే వ్యక్తి మద్యం మత్తులో ఉండటంతో మణికంఠరెడ్డి ఫొటోల కోసం అడిగిన వెంటనే పామును ఇచ్చేశాడు. దానికి కోరలు తీసేశానని, అందువల్ల కాటేయదని చెప్పాడు. దీంతో మణికంఠరెడ్డి భయం లేకుండా పామును మెడలో వేసుకుని సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశాడు. అది కాటేసిన తరువాత కూడా కోరలు తీసేశానని, కాటేసినా విషం ఎక్కదని దానిని ఆడించే వ్యక్తి చెప్పాడు. అయినా స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కాటేసిన పాము అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా జాతికి చెందినది కావడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని కందుకూరు సీఐ వెంకట్రావ్, ఎస్సై కిశోర్ పరిశీలించారు. పామును తీసుకొచ్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. -
Viral Video: సబ్బు పెట్టి మరీ పాముకు స్నానం చేయించాడు
-
షాకింగ్ ఘటన: కాటేసిన నాగును కొరికి చంపాడు
ఒక బాలుడు పాము కాటేసిందని కోపంతో కసిగా కొరికి చంపేశాడు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..చత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌లో జష్పూర్ జిల్లాలోని పండర్పాండ్ గ్రామంలో దీపక్ అనే బాలుడు ఇంటి పెరటిలో ఆడుకుంటున్నాడు. ఇంతలో ఒక పాము అతని చేతిని చుట్టుకుని కాటేసింది. దీంతో ఆ బాలుడు నొప్పితో విలవిల లాడాడు. కానీ పాము బాలుడి చేతిని చుట్టుకుని వదలకపోవడంతో దులుపుకని వదిలించుకునేందుకు యత్నించాడు. కానీ ఆ పాము బాలుడి చేతిని వదలలేదు. దీంతో కోపంతో ఆ పాముని కసితీరా రెండుసార్లు గట్టిగా కొరికి చంపేశాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే బాలుడు కుటుంబసభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వెంటనే డాక్టర్లు యాంటీ స్నేక్ విషాన్ని అందించి ఒక రోజు అంతా అబ్జర్వేషన్లో ఉంచారు. తదనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయాడు. ఈ మేరకు పాములకు సంబంధించిన నిపుణుడు ఖైజర్ హుస్సేన్ మాట్లాడుతూ.. దీపక్ త్వరగా కోలుకున్నాడని చెప్పారు. ఇది పొడి కాటు అని అందువల్ల విషపూరితమైన పాము కాటు వేసినప్పటకి విషం విడుదల కాదని చెప్పారు. ఇటువంటి పాము కాట్లు చాలా నొప్పిగా అనిపిస్తాయని, అలాగే కాటు వేసిన చోట సాధారణ కాటు వేసిన లక్షణాలే కనిపిస్తాయని అన్నారు. ఐతే ఇలాంటి సంఘటన మాత్రం ఎప్పుడూ చూడలేదని అన్నారు. అంతేగాదు ఆ ప్రాంతాన్ని గిరిజనుల నాగ్లోక్ గ్రామం అని అంటారు. దీన్ని పాముల నివాసంగా చెబుతారు గ్రామస్తులు. (చదవండి: సెకను వ్యవధిలో జింకను మింగేసిన కొండచిలువ : వీడియో వైరల్) -
ఓటీటీలో విక్రమ్ కోబ్రా మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం 'కోబ్రా'. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్గా నటించింది. అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్31న విడుదలై మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో ఈనెల 28 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా వెల్లడైంది. దీంతో థియేటర్స్‌లో మిస్ అయినవారు ఓటీటీలో హ్యాపీగా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసేయండి. -
విక్రమ్ ‘కోబ్రా’ ఓటీటీ పార్ట్నర్ ఇదే! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కోబ్రా’. కేజీయఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించించింది. మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రల్లో కనిపించారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 31న థియేటర్లో విడుదలైంది. విక్రమ్ విభిన్న పాత్రల్లో అలరించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఎప్పటిలాగే విక్రమ్ నటన మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయినప్పటికీ ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా! ఇదిలా ఉంటే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్‌పై తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కోబ్రా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ తాజా బజ్ ప్రకారం తమిళం, తెలుగులో సెప్టెంబర్ 23 లేదా 30న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. సెవెన్ స్క్రీన్ స్టూడీయో పతాకంపై ఎస్.ఎస్ లలిత్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూర్చారు. చదవండి: పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ -
ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన ‘కోబ్రా’ డైరెక్టర్
చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ చిత్రం కోబ్రా. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 31న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి హిట్‌టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. సినిమా నిడివి ఎక్కువ ఉందని, స్క్రీన్ ప్లే గందరగోళంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అయితే తాజాగా వీటిపై డైరెక్టర్ స్పందిస్తూ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్‌చాట్‌లో నెటిజన్లతో ముచ్చటించాడు డైరెక్టర్ జ్ఞానముత్తు. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్? ఈ సందర్భంగా ఓ నెటిజన్ కథ, కథనం బాగున్నప్పటికీ క్లైమాక్స్ నిరాశ పరిచిందన్నాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘పోలీసుల నుంచి హీరో తప్పించుని విదేశాల్లో స్వేచ్చగా బతుకున్నట్లు క్లైమాక్స్ రాయొచ్చు. కానీ, అలాంటి నేరస్థుడికి ఎలాంటి శిక్ష పడకపోవడం న్యాయం కాదు కదా!’ అని వివరించాడు. కోబ్రా సినిమా నిడివిపై మరో నెటిజన్ ప్రశ్నించగా.. ఈ చిత్రంలోని ప్రతి కీలక విషయాన్ని ప్రేక్షకుడికి చూపించాలనుకున్నామన్నారు. అందుకే నిడివి గురించి ఆలోచించలేదని చెప్పిన జ్ఞానముత్తు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మేరకు సినిమా నిడివిని 20 నిమిషాలు తగ్గించామని చెప్పాడు. చదవండి: వైరల్‌గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్, మండిపడుతున్న నెటిజన్లు! ఇక స్క్రీన్‌ప్లే గందరగోళంగా ఉందని మరో నెటిజన్ అనగా.. ‘మిమ్మల్ని గందరగోళానికి గురి చేసినందుకు క్షమించండి. ప్రతిక్షణం ఉత్కంఠకు గురిచేసే సినిమా చూసేందుకు ఓ ప్రేక్షకుడిగా నేను ఇష్టపడతాను. అందుకే కోబ్రాను తెరకెక్కించాను. సాధ్యమైతే మరోసారి మా సినిమాను చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చాడు. కాగా 7 స్క్రీన్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఇందులో విక్రమ్ సరసన ‘కేజీయఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి సందడి చేసింది. -
Cobra Review: ‘కోబ్రా’మూవీ రివ్యూ
టైటిల్ : కోబ్రా నటీనటులు : చియాన్ విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మీనాక్షి , మృణాళిని తదితరులు నిర్మాణ సంస్థ: సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్ దర్శకత్వం: అజయ్ జ్ఞానముత్తు సంగీతం : ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ:హరీష్ కణ్ణన్ విడుదల తేది: ఆగస్ట్ 31, 2022 ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ఎప్పుడు ముందుంటాడు తమిళస్టార్ చియాన్ విక్రమ్. ఫలితాన్ని పట్టించుకోకుండా వైవిధ్యమైన పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. అయితే విక్రమ్ ప్రయోగానికి ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి కానీ..సాలిడ్ హిట్ మాత్రం దక్కడం లేదు. అందుకే ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో విక్రమ్ పది పాత్రలు పోషించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘కోబ్రా’పై హైప్ క్రియేట్ అయింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(ఆగస్ట్ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాలిడ్ హిట్ కోసం 17 ఏళ్లు ఎదురుచూస్తున్న విక్రమ్‌కు ‘కోబ్రా’తో ఆ కొరత తీరిందా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. స్కాట్లాండ్ ప్రిన్స్ బహిరంగ హత్యకు గురవుతారు. ఈ కేసును విచారిస్తున్న ఇంటర్‌పోల్ ఆఫీసర్ అస్లామ్(ఇర్ఫాన్ ఫఠాన్).. ఒడిశా ముఖ్యమంత్రి, రష్యా మంత్రి కూడా అదే రీతిలో హత్యకు గురయ్యారని గుర్తిస్తాడు. ఈ హత్యలకు కోల్‌కతాలో ఉన్న లెక్కల మాస్టర్ మది(చియాన్ విక్రమ్)కి సంబంధం ఉందని అనుమానిస్తాడు. అలాగే వేరు వేరు దేశాల్లో జరిగిన ఈ హత్యలతో యువ వ్యాపారవేత్త రిషి(రోషన్ మాథ్యూ)కి కూడా సంబంధం ఉంటుంది. మరి వీరిలో ఎవరు ఆ హత్యలు చేశారు? ఈ కేసు విచారణలో అస్లామ్‌కు ఓ లెక్కల స్టూడెంట్ జూడీ(మీనాక్షీ గోవింద్ రాజన్) ఏ రకమైన సహాయం చేసింది? సాధారణ లెక్కల మాస్టర్‌కు ఈ హత్యలకు ఎలాంటి లింక్ ఉంది? కధీర్కు మదికి ఉన్న సంబంధం ఏంటి? పోలీసుల విచారణలో ఏం తేలింది? అనేదే కోబ్రా కథ. ఎలా ఉందంటే.. సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘కోబ్రా’. ఇందులో విక్రమ్ పది రకాల పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఒక్కో పాత్ర కోసం ఐదారు గంటల పాటు మేకప్‌కే సమయం కేటాయించేవాడని మూవీ ప్రమోషన్స్‌లో మేకర్స్ తెలిపారు. అతని కష్టం తెరపై కనిపించింది కానీ..అజయ్ జ్ణానముత్తు కథనే కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. గతంలో డిమాంటీ కాలనీ, అంజలి సీబీఐ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన అజయ్.. విక్రమ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది. విక్రమ్‌కు సెట్ అయ్యే కాన్సెప్ట్నే ఎంచుకున్నాడు కానీ తెరపై చూపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేకపోయాడు. వరుస హత్యలతో కథ చాలా ఇంట్రెస్టింగ్గా ప్రారంభమవుతుంది. మాథ్యమెటిక్స్లో ఉన్న అనుభవంతో ఆ హత్యలను ఎలా చేశారో వివరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అదే సమయంలో కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఆ తర్వాత మాత్ర కథ పూర్తిగా తేలిపోతుంది. సుదీర్ఘంగా సాగే మది, కధీర్ల ప్లాష్‌బ్యాక్ స్టోరీ సినిమాకు పెద్ద మైనస్. సెకండాఫ్ మొత్తం ప్రేక్షకుడి ఊహకందేలా సాగడమే కాకుండా.. నిడివి మరింత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సినిమా చివరి భాగంలో కొన్ని యాక్షన్ సీన్లు మెప్పిస్తాయి. ఎవరెలా చేశారంటే.. గెటప్పుల స్పెషలిస్ట్ విక్రమ్ నటనకు వంక పెట్టలేం. ఏ పాత్రలోనైనా నటించడం కంటే జీవించడం ఆయనకు అలావాటు. మది, కధీర్ పాత్రల్లో విక్రమ్ ఒదిగిపోయాడు. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో 10 రకాల పాత్రల్లో విక్రమ్ కనిపిస్తాడు. అందుకోసం ఈ విలక్షణ నటుడు పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. యాక్షన్స్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. ఇక మదిని ప్రాణంగా ప్రేమించే టీచరమ్మ భావన పాత్రలో శ్రీనిధి శెట్టి జీవించేసింది. జెన్నిఫర్‌గా మృణాళిని మెప్పించింది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పాత్ర ఆమెది. ఇక లెక్కల స్టూడెంట్‌గా జూడీ మీనాక్షీ గోవింద్ రాజన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇంటర్‌పోల్ ఆఫీసర్ అస్లామ్‌గా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పర్వాలేదనిపించాడు. అతనికిది తొలి సినిమా. డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. రోషన్ మాథ్యూ విలనిజం బాగుంది. కానీ అతని క్యారెక్టర్‌కు ఓ గోల్ అనేది లేకుండా ఉంటుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా పనిచెప్పాల్సింది. సినిమాలో అనవసరపు సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్