Chiyaan Vikram Cobra Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Chiyaan Vikram Cobra Movie: విడుదలకు సిద్ధమైన విక్రమ్‌ ‘కోబ్రా’, రిలీజ్‌ డేట్‌ ఇదే..

Published Sat, Jul 9 2022 8:07 AM | Last Updated on Sat, Jul 9 2022 1:15 PM

Chiyaan Vikram Cobra Movie to Release On August 11th - Sakshi

నటుడు విక్రమ్‌ కోబ్రాగా బుసలు కొట్టడానికి సిద్ధం అవుతున్నారు. పాత్ర కోసం ఎంతకైనా సిద్ధమయ్యే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్‌.. పితామగన్, ఐ, అపరిచితుడు, మహాన్‌ వంటి చిత్రాల్లో తన పాత్ర కోసం ఎంతో శ్రమించారు. తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం ఈయన నైజం. అలా మరోసారి కోబ్రా చిత్రంలో కొత్త గెటప్‌లతో తనదైన నటనతో అబ్బురపరచడానికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి  రెడీ అవుతున్నారు.

చదవండి: Priya Anand: 'నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా' 

అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో 7 స్క్రీన్‌ స్టూడియో పతాకంపై ఎస్‌ఎంఎస్‌ లలిత్‌ కుమార్‌ నిర్మించిన భారీ బడ్జెట్‌ చిత్రం ఇది. కేజీయఫ్‌ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి నాయకిగా నటించిన ఇందులో ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు ఇర్ఫాన్‌ పఠాన్‌ ముఖ్యపాత్రలో నటించారు. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతాన్ని అందించారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్‌ రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ తమిళనాడులో విడుదల చేయనుంది. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న కోబ్రా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement