చియాన్ విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోబ్రా. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈనెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో చియాన్ విక్రమ్ మాట్లాడుతూ.. 'తెలుగు ఆడియన్స్‌కి నా ఫెర్ఫర్మెన్స్ తో ఒక బంధం ఉంది.చాలా ఎమోషనల్ క్యారెక్టర్ నాది. కొవిడ్ తో షూట్ లేట్ అయ్యింది. ఒక్కొక్క మేనరిజమ్స్ చాలా ఇష్టపడి చేశాను.టెక్నికల్ సైడ్ వెరీ గుడ్ ఫిలిం.శ్రీనిధికి నాకు ఇందులో మంచి రిలేషన్ వుంటుంది.
ఇది ఇంగ్లీష్ సినిమాలాగా ఉంటూ లోపల ఒక ఎమోషనల్ డ్రామాగా వుంటుంది. ట్రైలర్ చూసి ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇది యూనివర్సల్ సినిమా ..అన్ని అంశాలు ఈ సినిమాలో వున్నాయి' అని తెలిపారు. ఇక హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ..విక్రమ్‌తో సినిమా చేసే ఛాన్స్ దక్కడం అదృష్టమని, మూడేళ్ల కష్టమే ఈ సినిమా అని చెప్పింది. థియేటర్స్‌లోనే సినిమాను చూడాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment