చియాన్ విక్రమ్ కథానాయకుడిగా ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా'. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 31 విడుదల కానుంది. తాజాగా 'కోబ్రా' చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విక్రమ్, శ్రీ నిధి, మీనాక్షి, మృణాళిని రవి, నిర్మాత ఎన్వీ ప్రసాద్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.
హీరో విక్రమ్ మాట్లాడుతూ.. సినిమా మొదలుపెట్టిన తర్వాత కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. అవన్నీ దాటుకుంటూ సినిమాను ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించాం. రష్యాలో మైనస్ డిగ్రీలలో చిత్రీకరించినప్పుడు సహాయ దర్శకులకు రక్తం కూడా వచ్చింది. చాలా కష్టపడి చేశాం. ఇర్ఫాన్ పఠాన్ మొదటి సినిమా ఇది. ఆయన సెట్స్‌కు వచ్చినపుడు నటన గురించి పెద్దగా తెలీదు. కానీ దర్శకుడు అజయ్ ట్రైన్ చేసి ఒక ప్రొఫెషనల్ నటుడిగా తీర్చిదిద్దారు. ఇంత మంచి సినిమాని తెలుగులో తిరుపతి ప్రసాద్ గారు విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. కోబ్రాని తెలుగు ప్రేక్షకులతో పాటు థియేటర్లో కలసి చూస్తా'' అన్నారు.
అనంతరం మీడియా ప్రతినిధిలు అడిగిన ప్రశ్నలకు కోబ్రా చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చింది .
కోబ్రా అని టైటిల్ పెట్టారు.. ఇంతకీ కథానాయకుడు విలనా ? హీరోనా?
విక్రమ్: కోబ్రా ఎప్పుడు కాటేస్తుందో తెలీదు, అలాగే కోబ్రా తన చర్మాన్ని మార్చుకోగలదు. ఇందులో నా పాత్ర అలానే వుంటుంది. ప్రతి పాత్రలో విభిన్నమైన ఫెర్ఫార్మెన్స్ వుంటుంది. డబ్బింగ్ లో కూడా చాలా వేరియేషన్స్ వున్నాయి. నా కెరీర్‌లో చాలా సవాల్‌గా అనిపించిన సినిమా కోబ్రా.
అపరిచితుడులో గొప్ప సందేశం వుంటుంది. కోబ్రాలో అలాంటి సందేశం ఏమైనా ఇస్తున్నారా?
విక్రమ్: కోబ్రాలో సందేశం వుండదు కానీ లవ్, ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషనల్ డ్రామా వుంటుంది. దానికి ప్రేక్షకులు చాలా గొప్పగా కనెక్ట్ అవుతారు.
ఇంత కష్టమైన పాత్రలు చేయడానికి స్ఫూర్తి ఎక్కడి నుండి వస్తుంది?
విక్రమ్: నాకు నటన అంటే పిచ్చి. ఏదైనా భిన్నంగా చేయడానికే ప్రయత్నిస్తా. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్త అనుభూతిని పంచాలనేదే నా ప్రయత్నం.
విక్రమ్, యశ్‌లలో మీరు గమనించిన గొప్ప క్యాలిటీ?
శ్రీనిధి: ఇద్దరూ నటన పట్ల అంకిత భావంతో వుంటారు. విక్రమ్ ఇన్నేళ్ళుగా పని చేస్తున్నా. సెట్స్ లో చాలా హంబుల్ గా వుంటారు.
విక్రమ్ సెట్స్ లో ఎలా వుంటారు ?
శ్రీనిధి : చాలా సరదాగా వుంటారు. చాలా ప్రాంక్‌లు చేస్తారు.
మృణాళిని: విక్రమ్ గారితో షూటింగ్ అంటే సెట్‌లో చాలా సీరియస్‌గా ఉంటారని అనుకున్నాను. కానీ ఆయన మాత్రం గేమ్స్ ఆడుకుంటూ ప్రాంక్స్ చేస్తూ సరదాగా కనిపించారు. నా భయం అంతా పోయింది.
మీనాక్షి : విక్రమ్ గారు గ్రేట్ యాక్టర్. ఆయన సెట్స్ లో వుంటే గొప్ప ఎనర్జీ వుంటుంది. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయలేం.
చదవండి: తనను నానామాటలు అన్న థియేటర్ యజమానిని నేరుగా కలిసిన రౌడీ హీరో
బాయ్‌కాట్ బాలీవుడ్ వివాదంపై ఫన్నీగా స్పందించిన హీరో విక్రమ్
Comments
Please login to add a commentAdd a comment