Chiyaan Vikram
-
ఆయనతో సినిమా చేయలేదని రెండు నెలలు ఏడ్చా: హీరో
మణిరత్నం సినిమాలో నటించే ఛాన్స్ చేజారడంతో రెండు నెలలు ఏడ్చానంటున్నాడు హీరో చియాన్ విక్రమ్. బొంబాయి సినిమాలో నటించే ఛాన్స్ ఫస్ట్ తనకే వచ్చిందని, కానీ మిస్సయిందని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ మాట్లాడుతూ.. నాకు బొంబాయి సినిమా ఆఫర్ వచ్చింది. ఆడిషన్‌కు కూడా వెళ్లాను. ప్రతి ఒక్కరి కలకాకపోతే అక్కడ ఒక వీడియో కెమెరాకు బదులు స్టిల్ కెమెరా ముందు పెట్టి నటించమన్నాడు. నీ ముందు ఒక అమ్మాయి పరిగెడుతుంది. తనను చూస్తూ ఉండిపోవాలన్నాడు. నాకేం అర్థం కాలేదు. అక్కడ వీడియో కెమెరానే లేనప్పుడు నేనెందుకు నటించాలన్నట్లు ఊరికనే నిలబడ్డాను. దీంతో ఆ మూవీలో నన్ను సెలక్ట్ చేయలేదు. మణిరత్నంతో సినిమా చేయాలన్నది ప్రతి ఒక్క నటుడి కల. ఇంకేం వద్దనుకున్నా..ఆయనతో ఒక్క సినిమా చేసి రిటైర్ అయిపోయినా చాలనుకున్నాను. అంతకంటే ఎక్కువ ఏదీ ఆశించలేదు. ఉదయం మనీషా కొయిరాలా ఫోటోషూట్, సాయంత్రం నాది. కానీ ఇంతలోనే అంతా బెడిసికొట్టింది. రెండునెలలపాటు ఏడుస్తూనే ఉన్నాను. అయ్యో, మణిరత్నం సినిమా చేజారిపోయిందేనని బాధపడుతూనే ఉన్నాను. ప్రతీకారం తీర్చుకున్నాతర్వాత బొంబాయి మూవీ పాన్ ఇండియా రేంజ్లో హిట్టయింది. అయితే తర్వాత మాత్రం ఆయనతో రెండు సినిమాలు తీసి ప్రతీకారం తీర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా విక్రమ్ తర్వాత మణిరత్నం డైరెక్షన్లో రావన్, పొన్నియన్ సెల్వన్ సినిమాలు చేశాడు.చదవండి: పదేళ్లుగా ఆయన్ను ప్రేమిస్తూనే ఉన్నా: సాయి పల్లవి -
‘తంగలాన్’ వసూళ్లను చూసి ఆశ్చర్యపోయా: నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా
‘‘తంగలాన్’ సినిమాకు తెలుగులో మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. మేము అనుకున్నదానికంటే రెట్టింపు వసూళ్లు వస్తుండటంతో ఆశ్చర్యపోతున్నాం. విక్రమ్‌గారి కెరీర్లో ‘తంగలాన్’ చిత్రానివే హయ్యెస్ట్ ఓపెనింగ్స్’’ అని నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా అన్నారు. విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తంగలాన్’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా కేఈ జ్ఞానవేల్ రాజా మీడియాతో మాట్లాడుతూ– ‘‘నేనెప్పుడూ డైరెక్టర్‌నే నమ్ముతాను. పా. రంజిత్గారిపై నమ్మకంతో ‘తంగలాన్’ విషయంలో స్వేచ్ఛ ఇచ్చాం. సినిమాల మేకింగ్ విషయంలో నా నమ్మకం ఏంటంటే ప్రేక్షకుల అభిరుచిని విశ్వసించడమే. హిందీతో పాటు మిగతా అన్ని భాషల్లోనూ ఈ నెల 30న ‘తంగలాన్’ని రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. -
Chiyaan Vikram: తంగలాన్ మూవీ థాంక్స్ మీట్ (ఫొటోలు)
-
చియాన్ విక్రమ్ తంగలన్ పబ్లిక్ టాక్
-
‘తంగలాన్’ వచ్చేది ఈ ఓటీటీలోనే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించాడు. పార్వతి తిరువోతు, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా.. పా. రంజిత్ ఓ కొత్త ప్రపంచాన్ని తెరపై చూపించాడని అందరూ ప్రశంసిస్తున్నారు. (చదవండి: ‘తంగలాన్’ మూవీ రివ్యూ)ఇక విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. తంగలాన్ పాత్రలో ఆయనను తప్పా ఇంకెవరినీ ఊహించుకోలేమని పేర్కొంటున్నారు. విజువల్స్, మ్యూజిక్ బాగున్నాయి కానీ.. కథనమే సాగదీతగా ఉందని అంటున్నారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఓటీటీ వివరాలను వెతికే పనిలో పడ్డారు నెటిజన్స్.రెండు నెలలు ఆగాల్సిందే..తంగలాన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్‌తో పాటు మొత్తం ఐదు భాషల్లో కలిపి రూ. 35 కోట్లకు ఓటీటీ హక్కులు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే సినిమా థియేటర్స్‌లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ లెక్కన అక్టోబర్ రెండో వారంలో తంగలాన్ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సినిమాలను థియేటర్స్‌లో చూస్తేనే బాగుంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. -
‘తంగలాన్’కి అదే పెద్ద సవాలు : జీవీ ప్రకాశ్
‘తంగలాన్’ కోసం 50 రోజుల రీరికార్డింగ్ చేశాను. కొన్నిసార్లు రెండు మూడు రోజుల ముందు ట్యూన్ చేయాల్సి వచ్చేది. టైమ్ తక్కువగా ఉండటం ఒక్కటే ఈ సినిమాకు మ్యూజిక్ చేయడంలో నేను ఎదుర్కొన్న సవాలు. అయినా పర్పెక్ట్ ఔట్ పుట్ తీసుకురాగలిగాం. దర్శకుడు పా.రంజిత్ విజన్‌ను అర్థం చేసుకొని అందుకు తగినట్లుగా మ్యూజిక్ చేశాను’అని అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్. చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ మూవీ ‘తంగలాన్’. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు మ్యూజిక్ అందించిన జీవీ ప్రకాశ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ ‘తంగలాన్’ సినిమా ఆఫర్ నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. "తంగలాన్" ఇండియానా జోన్స్ వంటి భారీ మూవీ. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు ఈ కథకు ఎలాంటి మ్యూజిక్ చేయాలి అనేది అర్థమైంది. ట్రైబల్ నేపథ్యంగా ప్రీ ఇండిపెండెన్స్ టైమ్ లో జరిగే స్టోరీ ఇది. ట్రైబల్స్ ఎలాంటి మ్యూజిక్ క్రియేట్ చేస్తారు అనేది ఆలోచించాను. ఆస్ట్రేలియన్, ఆఫ్రికన్ ట్రైబ్స్ క్రియేట్ చేసే కొన్ని మ్యూజిక్స్ అబ్సర్వ్ చేశాను. ఇలాంటి సినిమాకు మోడరన్ మ్యూజిక్ సెట్ కాదు. ఒరిజినల్ గా , ఆ కథా నేపథ్యానికి తగినట్లు మ్యూజిక్ క్రియేట్ చేశాం. "తంగలాన్"కు మ్యూజిక్ ఇవ్వడంలో నా టీమ్ ఎంతో సపోర్ట్ చేసింది.⇢ దర్శకుడు పా.రంజిత్ గారు ఒక గొప్ప మూవీని మీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఆయన మ్యాజికల్ రియలిజం స్క్రీన్ ప్లేతో సినిమాను రూపొందించారు. మ్యాజికల్ రియలిజంతో గతంలోనూ కొన్ని పీరియాడిక్ మూవీస్ వచ్చినా..ఇందులో మరికొన్ని అదనపు లేయర్స్ ఉంటాయి. పా రంజిత్ గారితో వర్క్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చింది.⇢ విక్రమ్ గారు ఈ సినిమా కోసం మారిపోయిన తీరు ఆశ్చర్యపరిచింది. ఇది నటీనటులకు ఫిజికల్ గా స్ట్రెయిన్ చేసే సినిమా. విక్రమ్ గారు తన గత చిత్రాల్లాగే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. "తంగలాన్"లో ఫీమేల్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. పార్వతీ తిరువోతు, మాళవిక ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు.⇢ ‘తంగలాన్’ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. నేను మీతో పాటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తున్నాను. మీరంతా "తంగలాన్" చూసి థ్రిల్ ఫీలవుతారని మాత్రం చెప్పగలను.⇢ ఏఐ సహా ఎన్నో కొత్త టెక్నాలజీలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే టెక్నాలజీపైనే ఆధారపడటం సరికాదు. ఎంతవరకు మనం టెక్నాలజీ ఉపయోగించుకోవాలి అనే ఐడియా ఉండాలి.⇢ తెలుగులో దుల్కర్ హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్, నితిన్ హీరోగా చేస్తున్న రాబిన్ హుడ్ తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. దిల్ రాజు గారితో, వైజయంతీ బ్యానర్స్ లో మూవీస్ చేయాల్సిఉంది. తమిళంలో ధనుష్ గారి డైరెక్షన్ లో మూవీ, శివకార్తికేయన్ అమరన్ తో పాటు మరికొన్ని బిగ్, ఎగ్జైటింగ్ సినిమాలు చేస్తున్నాను. నటుడుగా, సంగీత దర్శకుడిగా నా ప్రయారిటీస్ క్లియర్ గా పెట్టుకున్నాను. ఏ సినిమాలకు ఎప్పుడు వర్క్ చేయాలనేది ఎవరికీ ఇబ్బంది రాకుండా ప్లాన్ చేసుకుంటున్నా. -
‘తంగలాన్’ కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుంది: విక్రమ్
‘‘నా ‘అపరిచితుడు’ సినిమా దేశంలోనే విజయవాడలో అత్యధిక రోజులు ఆడింది. బ్యూటిఫుల్ అడ్వెంచరస్‌గా రూపొందిన నా తాజా‘తంగలాన్’ మూవీ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుంది. మా చిత్రాన్ని థియేటర్స్‌లోనే చూడండి’’ అన్నారు హీరో విక్రమ్. పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్, పార్వతీ తిరువోతు, మాళవికా మోహనన్ నటించిన చిత్రం ‘తంగలాన్’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది. సోమవారం విజయవాడలో జరిగిన ప్రెస్మీట్లో విక్రమ్ మాట్లాడుతూ– ‘‘తంగలాన్’ మంచి సినిమా. మీరంతా (ప్రేక్షకులు) ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూసి మీ స్పందన తెలియజేస్తారా? అని వేచి చూస్తున్నా’’ అని తెలిపారు. -
విజయవాడలో సందడి చేసిన హీరో విక్రమ్ (ఫొటోలు)
-
ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యే స్టోరీ ‘తంగలాన్’: విక్రమ్
‘‘తంగలాన్’ అనేది ఒక తెగ పేరు. ఈ సినిమాలోని నా లుక్‌ని ఫస్ట్ టైమ్ రిలీజ్ చేసినప్పుడు ‘కేజీఎఫ్’ మూవీలా ఉంటుందా? అన్నారు. అలాగే తెగ నాయకుడి గెటప్ రిలీజ్ చేశాక రా అండ్ రస్టిక్‌గా ఉంటుందన్నారు. కానీ ‘తంగలాన్’ లో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలున్నాయి’’ అని హీరో విక్రమ్ అన్నారు. పారంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా, పార్వతీ తిరువోతు, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తంగలాన్’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో విక్రమ్ మాట్లాడుతూ– ‘‘రంజిత్ నా ఫేవరెట్ డైరెక్టర్. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యే స్టోరీ ‘తంగలాన్’. బంగారం వేట అనేది హైలైట్ అవుతున్నా.. ఈ కథలో స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ఉంది’’ అన్నారు. పాన్ ఇండియా అని మనమే అంటున్నాం. నేను ఎక్కడ నటించినా అది అన్ని భాషల ప్రేక్షకులకు చేరువకావడం సంతోషం’’ అన్నారు. -
తెలుగు ప్రేక్షాకుల ఎనర్జీ వేరే లెవెల్..
-
విక్రమ్ ‘తంగలాన్ ’మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
మేకప్‌కే నాలుగు గంటలు.. శరీరంపై దద్దుర్లు వచ్చాయి: ‘తంగలాన్’ హీరోయిన్
విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) కార్మికుల జీవితాల ఆధారంగా పా.రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమా ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. హీరోహీరోయిన్లతో వరుస ఇంటర్వ్యూలు ఇప్పిస్తూ.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. తాజాగా మాళవికా మోహనన్, పార్వతి తిరువోతు ప్రెస్ మీట్ నిర్వహించారు. (చదవండి: విజయ్ దేవరకొండతో వివాదం.. మరోసారి స్పందించిన అనసూయ)ఈ సందర్భంగా మాళవిక మాట్లాడుతూ.. ‘తంగలాన్’ నా జీవితంలో మర్చిపోలేని సినిమా. ఈ చిత్రంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను మేకప్ వేసుకోవడానికే దాదాపు నాలుగు గంటల సమయం పట్టేది. ఎక్కువగా ఎండలోనే షూటింగ్ చేశాం. దాని కారణంగా నా శరీరంపై దద్దుర్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. రోజూ సెట్స్‌లో డెర్మటాలజిస్ట్, కళ్ల డాక్టర్.. ఇలా మొత్తం ఐదుగురు డాక్టర్లు ఉండేవారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం’అని అన్నారు. పార్వతి తిరువోతు మాట్లాడుతూ.. ‘పా.రంజిత్ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. తంగలాన్ లో నాది గంగమ్మ అనే కీలక పాత్ర. ఈ పాత్ర కోసం ఎంతో శ్రమించా. భాషపరంగా కసరత్తు చేశా’ అని తెలిపారు. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే.. ఏ రంగంలో అడుగుపెట్టేవారని ఓ విలేకరి ప్రశ్నించగా.. టీ షాపు పెట్టేదాన్ని అని సమాధానం ఇచ్చింది పార్వతి. ‘వృత్తి ఏదైనా సరే మరాద్య, గౌరవంతో పని చేయాలనుకున్నాను. నాకు టీ అంటే చాలా ఇష్టం. టీ చక్కగా పెట్టగలను. అందుకే ఒకవేళ నటిని కాకపోయి ఉంటే..కచ్చితంగా ఓ టీ షాపు పెట్టేదాన్ని’అని పార్వతి చెప్పుకొచ్చింది. తనకు విజువల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టమని, ఒకవేళ తాను నటి కాకపోయి ఉంటే ఫొటోగ్రఫీ, లేదా సినిమాటోగ్రఫీ రంగంలోకి వెళ్లేదాన్ని అని పార్వతి బదులిచ్చింది. -
మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్‌తో విక్రమ్..
మంజుమ్మల్ బాయ్స్.. ఈ మధ్యకాలంలో మారుమోగిపోతున్న మలయాళ చిత్రం. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేరళలోనే కాకుండా తమిళనాడులోనూ అనూహ్య విజయాన్ని సాధించింది. తెలుగులోనూ డబ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతటి సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాకు చిదంబరం దర్శకుడిగా వ్యవహరించాడు. డైరెక్టర్‌గా ఇది ఈయనకు రెండో సినిమా! చిదంబరానికి ప్రశంసలు కోలీవుడ్‌లో కమల్ హాసన్, రజనీకాంత్, విక్రమ్, ధనుష్‌ల నుంచి పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలను పొందారీయన. ఈయన దర్శకత్వంలో చిత్రాలు చేయడానికి పలువురు హీరోలు ఆసక్తి చూపుతున్నారు. హీరో ధనుష్ కూడా చిదంబరం దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అయినట్లు ప్రచారం జరిగింది. అయితే కాల్షీట్స్ సమస్య కారణంగా ఆయన నటించలేకపోయినట్లు సమాచారం. విక్రమ్‌తో మూవీ తాజాగా చియాన్ విక్రమ్ దర్శకుడు చిదంబరం డైరెక్షన్లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు దర్శకుడు విక్రమ్‌ను కలిసి చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం తంగలాన్ చిత్రాన్ని పూర్తి చేసిన విక్రమ్ తన 62వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత దర్శకుడు చిదంబరం దర్శకత్వంలో విక్రమ్ నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: అర్థరాత్రి నడి రోడ్డుపై ఐస్‌క్రీమ్ తింటూ చిల్ అవుతున్న నయన్.. వీడియో వైరల్ -
కోలీవుడ్‌లో కొత్త కాంబో.. కలిసి నటించబోతున్న ఇద్దరు నటధీరులు!
కోలీవుడ్‌లో ఓ కొత్త కాంబోకు శ్రీకారం జరిగింది. ఇందులో ఇద్దరు నటధీరులు కలిసి నటించబోతున్నారు. అందులో ఒకరు విక్రమ్. ప్రత్యేకంగా చెప్సాల్సిన అవసరం ఉండదు. పాత్రలకు ప్రాణం పోయడానికి ఎంతవరకై నా వెళ్లే అతి కొద్దిమంది నటుల్లో విక్రమ్ ఒకరు. నిరంతర శ్రమజీవి. స్వశక్తితో ఎదిగిన నటుడు. తంగలాన్ చిత్రంతో ఈయన తన విశ్వ రూపాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రం త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కాబోతుంది. దీంతో విక్రమ్ తాజాగా తన 62వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ఎస్‌యూ అరుణ్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఇంతకుముందు పన్నైయారుమ్ పద్మినియుమ్, సేతుపతి, సింధు బాద్, సిత్త వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని హెచ్ఆర్ పిక్చర్స్ నిర్మాత శిబూ తమీన్స్ వారసురాలు రిషి శిబూ నిర్మించనున్నారు. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ నిర్మాత శుక్రవారం వెల్లడించారు. ఇందులో మరో నట రాక్షసుడు ఎస్జే సూర్య ముఖ్యపాత్రను పోషించనున్నారన్నదే ఆ అప్డేట్. ఇటీవల ఈయన విశాల్‌తో కలిసి నటించిన మార్క్ ఆంటోని, రాఘవ లారెన్స్‌తో కలిసి నటించిన జిగర్తండ–2 వంటి చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో విక్రమ్‌తో కలిసి ఈయన నటించబోతున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. త్వరలో సెట్స్‌పైకి రావడానికి సిద్ధమవుతున్న ఈ క్రేజీ కాంబో చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. -
వేసవికి వాయిదా పడిన 'తంగలాన్'.. ఈసారైనా పక్కానా
-
'కోబ్రా' కాంబో మరోసారి.. ఆ హీరో-దర్శకుడు మరో ప్రాజెక్ట్!
విభిన్న సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో విక్రమ్ కచ్చితంగా ఉంటాడు. హిట్టా ఫ్లాప్ అనేది పక్కనబెడితే ప్రయోగాలు చేయడం మాత్రం ఆపడు. అలా గతేడాది 'కోబ్రా' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. కానీ హిట్ అనిపించుకోలకపోయింది. అయితేనేం ఈ చిత్రం దర్శకుడితో మరోసారి కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. మొత్తంగా 33 రిలీజ్!) గతంలో 'డిమాంటీ కాలనీ', 'ఇమైకా నోడిగల్' లాంటి సినిమాలు తీసిన అజయ్ జ్ఞానముత్తు.. 'కోబ్రా' తీశారు. కాగా విక్రమ్ తన 63వ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్టుకే అజయ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. అయితే కోబ్రా చిత్రం చేదు అనుభవాన్ని మరచి పోలేని విక్రమ్ అభిమానులు మళ్లీ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలోనా? అంటూ పెదవి విరుస్తున్నారు. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో హిట్ సినిమా) -
ఆకట్టుకుంటున్న విక్రమ్- రీతూవర్మ 'కరిచే కళ్లే’ సాంగ్
చియాన్ విక్రమ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ధృవ నక్షత్రం’. రితూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్, ఒరువూరిలియోరు ఫిల్మ్ బ్యానర్స్ పై నిర్మిస్తూ.. రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా తెరపైకి రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ "ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధకాండం" ఈ నెల 24న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. "ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధ కాండం’ నుంచి 'కరిచే కళ్లే..' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. హ్యారిస్ జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ రాయగా..శ్రీలేఖ పార్థసారధి పాడారు. 'కరిచే కళ్లే చూసి కుదేలయ్యానయ్యా...గరుకు ఒళ్లే నన్ను లాగెనురా బాయ్యా...వయసిక ఆగనంది అట్టా ఇట్టాగుంది..యెంటనే తాంబూలాలు మార్చేసుకోమంది...' అంటూ హీరోయిన్ లవ్ ఫీలింగ్స్ చెబుతూ సాగుతుందీ పాట. బ్యూటిఫుల్ మెలొడీగా హ్యారీస్ జయరాజ్ కంపోజ్ చేసిన ఈ పాట అమ్మాయిల లవ్ ఆంథెమ్ కానుంది. -
Thangalaan Teaser Launch: విక్రమ్ ‘తంగలాన్’ మూవీ టీజర్ లాంచ్ (ఫోటోలు)
-
విక్రమ్, జైలర్ సినిమాలను మించిపోయేలా పాన్ ఇండియా రేంజ్లో..
లోకనాయకుడు కమల్ హాసన్, ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం కాంబో అంటే మామూలుగా ఉండదు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో వచ్చిన నాయకన్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. కాగా చాలా గ్యాప్ తరువాత మరోసారి ఈ కాంబోలో సినిమా తెరకెక్కనున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు కూడా! కమల్ హాసన్ 234వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ, మణిరత్నం మద్రాస్ టాకీస్ కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. జైలర్‌ను మించిపోయేలా.. త్వరలో సెట్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్న ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చిత్రం కమల్ హాసన్ నటించిన విక్రమ్, రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రాల తరహాలో.. అంతకు మించిన స్థాయిలో రూపొందించడానికి మణిరత్నం సిద్ధం అయినట్లు తెలిసింది. ఇందులో ప్రముఖ హీరోలు నటించనున్నట్లు టాక్. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించనున్నట్లు సమాచారం. కమల్ సినిమాలో ఆ స్టార్ హీరోలు మరో ముఖ్య పాత్రలో హీరో శింబును నటింపజేయాలని ప్రయత్నించినా, కొన్ని కారణాల వల్ల ఆయన సెట్ కాకపోవడంతో తనను పక్కన పెట్టేశారు. ఆ పాత్రలో హీరో సూర్యను ఎంపిక చేసే ప్రయత్నాలు జరిగాయనీ, అయితే ఆయన నటించే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు హీరో విక్రమ్‌ను తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే కాంబో సెట్ అయితే చిత్రం స్థాయి మరింత పెరిగిపోతుందని చెప్పనక్కర్లేదు. చదవండి: ముద్దు కావాలంటూ గోల చేసిన తేజ.. మొత్తానికి సాధించాడు -
నటి సౌందర్య గురించి చియాన్ విక్రమ్..!
-
త్రిష హ్యాపీగా ఉంటే చాలు నాకు : చియాన్ విక్రమ్
-
రష్మిక లక్ మాములుగా లేదుగా.. ఖాతాలోకి మరో క్రేజీ ప్రాజెక్ట్
కన్నడ భామ రష్మికమందన్న మళ్లీ దక్షిణాదిలో అవకాశాలతో పుంజుకుంటోంది. తెలుగులో క్రేజీ నటిగా రాణించిన ఈమె ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ వరుసగా అవకాశాలను దక్కించుకుని నటిస్తోంది. అయితే హిందీలో ఈమె నటించిన రెండు చిత్రాలు బోల్తా కొట్టాయి. తాజాగా నటిస్తున్న యానిమల్ చిత్రంపై రష్మిక చాలా ఆశలు పెట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం తెలుగులో పుష్ప–2, చిత్రంతోపాటు రెయిన్బో చిత్రంలో నటిస్తోంది. ఇక తమిళంలో సుల్తాన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సరైన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత విజయ్‌కు జంటగా వారీసు చిత్రంలో నటించింది. ఆ చిత్రం సక్సెస్ అయినా, రష్మిక అందాలారబోత మినహా చేసిందేమీ లేదని విమర్శలను మూటకట్టుకుంది. అలాంటిది ఈ అమ్మడికి ఇప్పుడు మళ్లీ పాన్ ఇండియా చిత్రాలు నటించే అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్పటికే ధనుష్ కథానాయకుడుగా నటించే ద్విభాషా ( తమిళం, తెలుగు)చిత్రంలో రష్మిక నాయకిగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా నటుడు విక్రమ్ హీరోగా నటించే పాన్ ఇండియా చిత్రంలో నటించే అవకాశం ఈ అమ్మడిని వరించినట్లు తాజా సమాచారం. ఇటీవల 2018 అనే సంచలన విజయాన్ని సాధించిన మలయాళ చిత్రం దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ తర్వాత పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇందులో నటుడు విక్రమ్ కథానాయకుడిగా నటించనున్నట్లు ఆయనకు జంటగా రష్మికమందన్నను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇందులో నటుడు విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా నటించనున్నట్లు, ఈ భారీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ధ్రువ నక్షత్రం చిత్రంలో ఐశ్వర్య రాజేష్ సీన్స్ కట్?
ధ్రువ నక్షత్రం చిత్రంలో నటి ఐశ్వర్య రాజేష్ నటించిన సన్నివేశాలను తొలగించారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. విక్రమ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ధ్రువ నక్షత్రం. ఇందులో నటి రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, నటుడు పార్టీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం 2017లో ప్రారంభమైంది. షూటింగ్ కూడా పూర్తి చేసుకుని రెండేళ్ల క్రితం విడుదల కావాల్సింది. అయితే అనివార్య కారణాల వల్ల చిత్రం విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అలా అటకెక్కిన ఈ చిత్రాన్ని దాదాపు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు బూజు దులుపుతున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని మనం అనే పాటను విడుదల చేశారు. తాజాగా హిజ్ నేమ్ ఈజ్ జాన్ అనే మరో పాటను విడుదల చేశారు. అసలు విషయం ఏమిటంటే ఈ చిత్ర కథను దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే చిత్రీకరించిన నటి ఐశ్వర్య రాజేష్‌కు సంబంధించిన సన్నివేశాలు అన్నింటిని తొలగించినట్లు, ఆమె లేకుండా మళ్లీ కొంత భాగాన్ని చిత్రీకరించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడ లేదు. కాగా పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించిన నటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారన్న విషయం తెలిసిందే. -
తంగలాన్ సినిమా షూటింగ్ పూర్తి, విక్రమ్ పోస్ట్ వైరల్
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన చిత్రం తంగలాన్. ఈ సినిమాలో చియాన్ విక్రమ్ నట విశ్వరూపం చూపించారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పార్వతీ, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్న ఇందులో నటుడు పశుపతి, ముత్తుకుమార్, హరికృష్ణన్, ప్రీతి, అర్జున్ ప్రభాకరన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకుడు. ఈయన చిత్రాలు చాలా భిన్నంగా సామాజిక పరమైన అంశాలతో ముడిపడి ఉంటాయి. పా.రంజిత్, విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇది. జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్, పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని, కిశోర్‌కుమార్ చాయాగ్రహణం అందిస్తున్నారు. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆది నుంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఇందులో నటుడు విక్రమ్ గెటప్ సినిమాపై హైప్‌ను పెంచుతోంది. ఇంతకు ముందెప్పుడూ చూడనటువంటి ఆయన నటనను తంగలాన్ చిత్రంలో చూస్తారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. విక్రమ్ గెటప్ చూస్తేనే తంగలాన్ చిత్రం కచ్చితంగా కొత్తగా ఉంటుందని అనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ విషయాన్ని విక్రమ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. 'తంగలాన్ చిత్రీకరణ పూర్తైంది. ఇది అద్భుతమైన ప్రయాణం. ఈ జర్నీలో మంచి వ్యక్తులతో కలిసి పని చేశాను. నటుడిగా నాకు మంచి అనుభవాలు కూడబెట్టుకున్నాను. మొదటి ఫోటో షూటింగ్ ప్రారంభానికి ముందు తీసినది కాగా మరొకటి 118 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్నాక తీసిన ఫోటో. ఈ సినిమాలో నన్ను భాగం చేసిన దర్శకుడు రంజిత్‌కు కృతజ్ఞతలు' అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by 🕺 Mic Srav 🧑🎤 (@sravan_entertainer) And it’s a wrap!! What a journey!! Worked with some of the most amazing people & had some of the most evocative experiences as an actor. Was it just 118 working days between the first pic & the last. Thank you Ranjit for making us live this dream. Every single day. #thangalaan pic.twitter.com/LijMehsZeF — Vikram (@chiyaan) July 4, 2023 చదవండి: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ -
ఐశ్వర్యారాయ్ గురించి అడగగానే విక్రమ్ రియాక్షన్
-
తంగలాన్ షూటింగ్లో విక్రమ్, మాళవిక..
ప్రస్తుతం నిర్మాణంలో వున్న క్రేజీ తమిళ చిత్రాల్లో తంగలాన్ ఒకటి. హీరో విక్రమ్, దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్లో రూపొందుతున్న వినూత్న కథా చిత్రమిది. హీరోయిన్ మాళవికా మోహన్, పార్వతి, పశుపతి, డేనియల్ కాల్టకిరోన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న తరుణంలో అనూహ్యంగా విక్రమ్ ప్రమాదానికి గురికావడంతో షూటింగ్‌కు అంతరాయం కలిగింది. అయితే తంగలాల్ చిత్ర షూటింగ్‌ను మరో 12 రోజులు నిర్వహిస్తే పూర్తవుతుందని దర్శకుడు పా.రంజిత్ వెల్లడించారు. జూన్ 15 తరువాత మళ్లీ షూటింగ్ మొదలు పెడతామని చెప్పారు. దీంతో వైద్య చికిత్స, విశ్రాంతి అనంతరం విక్రమ్ మళ్లీ ఫుల్ ఎనర్జీతో షూటింగ్‌కు సిద్ధమయ్యారు. తంగలాన్ చిత్ర షూటింగ్ శనివారం నుంచి చైన్నెలో జరుగుతోంది. ఈ విషయాన్ని మాళవికమోహన్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొంది. అందులో తాను ఇప్పుడు చైన్నెలో ఉన్నానని విక్రమ్‌తో కలిసి తంగలాన్ చిత్ర షూటింగ్లో పాల్గొన్నానని తెలిపింది. మరో 20 రోజులు ఇక్కడే ఉంటానని కూడా తెలిపారు. ఇది కోలార్ గోల్డ్ తవ్వకాల్లోని కార్మికులు తమ అధికారం కోసం పోరాడే నేపథ్యంలో సాగే కథా చిత్రం అన్నది తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి తెరపైకి రానున్నట్లు సమాచారం. చదవండి: ఎక్కడ సమాధి చేయాలో ముందే కోరిన రాకేశ్ మాస్టర్ -
చాలాకాలం తర్వాత రిలీజ్‌కు రెడీ అవుతున్న విక్రమ్ సినిమా
తను నటించే పాత్రలకు 100 శాతం న్యాయం చేయడానికి తపించే నటుడు చియాన్ విక్రమ్. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో చోళరాజు కరికాలన్‌గా అద్భుతమైన నటనను ప్రదర్శించి అందరి గుండెల్లో నిలిచిపోయిన విక్రమ్ తాజాగా తంగలాన్ చిత్రంలో గిరిజన వాసి పాత్రకు జీవం పోస్తున్నారు. ఈయన చాలాకాలం క్రితం కథానాయకుడిగా నటించిన చిత్రం ధ్రువనక్షత్రం. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి ఐశ్వర్య రాజేష్, రీతు వర్మ, హీరోయిన్లుగా నటించగా నటి సిమ్రాన్, పార్తీపన్, వినాయకన్, దివ్యదర్శిని, అర్జున్‌దాస్, వంశీకృష్ణ, రాధిక శాస్త్రకుమార్, మాయా ఎస్.కృష్ణన్, అభిరామి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల చాలా కాలంగా నిర్మాణ దశలోనే ఉండిపోయింది. అయితే దీని విడుదలకు ఇప్పుడు టైమ్ వచ్చినట్లు సమాచారం. ఇటీవలే దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రం ప్యాచ్ వర్క్ షూటింగ్‌ను కంప్లీట్ చేసినట్లు, నటుడు విక్రమ్ డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్లు తెలిసింది. మరో విశేషమేమిటంటే ఈ చిత్ర విడుదల హక్కులను రెడ్‌జెయింట్ మూవీస్ సంస్థ పొందినట్లు సమాచారం. చిత్రాన్ని జులై 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో కూడా నటుడు విక్రమ్ డిఫరెంట్ గెటప్‌లలో కనిపించనున్నట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
హీరో విక్రమ్ ‘తంగలాన్’ ప్రయాణాన్ని ఊహించుకోలేను: మాళవిక మోహన్.
తమిళ సినిమా: ముంబైలో చదివి,పెరిగిన మలయాళీ నటి మాళవిక మోహన్. తొలుత మాతృభాషలో నటిగా పరిచయమై ఆ తర్వాత కన్నడం, హిందీ, తమిళం అంటూ పాన్ ఇండియా నటిగా మారిపోయింది. ముఖ్యంగా తమిళంలో రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన పేట చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అందులో నటుడు శశి కుమార్‌కు భార్యగా విలక్షణ పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మాస్టర్ చిత్రంలో విజయ్తోను, ధనుష్‌కు జంటగా మారన్ చిత్రంలోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బోల్డ్ అండ్ బ్యూటీ ప్రస్తుతం విక్రమ్ సరసన తంగలాన్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం చాలా కసరత్తులే చేసింది ముఖ్యంగా కర్రసాము విలువ విద్యలో శిక్షణ పొందింది. ఆ ఫొటోలను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయగా అవి ట్రెండింగ్ అయ్యాయి. (చదవండి: తెలుగులో నటించడానికి రెడీ: దుషారా విజయన్) పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న తంగలాన్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంది. అయితే ఇటీవల షూటింగ్లో విక్రమ్ గాయాలపాలు కావడంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో షూటింగ్ నిలిచిపోయింది. విక్రమ్ పూర్తిగా కోలుకున్న తర్వాత తంగలాన్ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని చిత్రవర్గాలు పేర్కొన్నారు. (చదవండి: కమల్ హాసన్ ఖాతాలో మరో అరుదైన అవార్డు ) కాగా ఈ చిత్రంలో విక్రం సరసన నటించిన అనుభవం గురించి నటి మాళవిక మోహన్ చెబుతూ.. తంగలాన్ చిత్రంకు సంబంధించినంత వరకు విక్రమ్ లేకపోతే తను ఈ ప్రయణాన్ని ఊహించుకోలేనని పేర్కొంది. ప్రతి సన్నివేశంలోనూ ఆయన తనకు ఎంతగానో సహకరించేవారు అని చెప్పింది. ఆయన తనే కాకుండా తన చుట్టూ ఉన్న వారంతా బాగా నటించాలని కోరుకునే నటుడు అని చెప్పింది. అలా తమలోని నటనను బయటికి తీసి ఉత్సాహపరిచే వారిని పేర్కొంది. విక్రమ్ సెట్లో ఎప్పుడు చాలా జాలీగా ఉంటూ కామెడీ చేస్తూ వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తారని నటి మాళవిక మోహన్ చెప్పింది. -
ఎన్టీఆర్ v/s చియాన్ విక్రమ్...సత్తా చాటేదెవరు?
-
స్టార్ హీరో విక్రమ్‌కు తీవ్ర గాయాలు
తమిళ స్టార్ హీరో విక్రమ్ షూటింగ్ సెట్లో తీవ్రంగా గాయపడ్డారు. తంగలాన్ సినిమా చిత్రీకరణ సమయంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు విక్రమ్ పక్కటెముక విరిగినట్లు గుర్తించారు. అతడికి ఆపరేషన్ చేయాలని తెలిపారు. ఈ ప్రమాద విషయాన్ని ఆయన మేనేజర్ సూర్యనారాయణ్ ధ్రువీకరించారు. తంగలాన్ షూటింగ్‌కు ముందు రిహార్సల్ చేస్తుండగా విక్రమ్ గాయపడ్డారని తెలిపారు. కొద్ది రోజులపాటు ఆయన షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వస్తుందన్నారు. అయితే అతి త్వరలోనే కోలుకొని విక్రమ్ మళ్లీ షూటింగ్ కు హాజరవుతారని వెల్లడించారు. మరోవైపు ఇటీవల విడుదలైన పొన్నియన్ సెల్వన్ రెండో భాగం ఘన విజయాన్ని అందుకోవడంతో ఆనందంలో ఉన్న విక్రమ్ అభిమానులు... విక్రమ్ గాయపడ్డారనే విషయం తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా తంగలాన్ సినిమాకు కబాలి డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాళవిక మోహన్, పార్వతి మీనన్, పశుపతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడికల్ ఫిలింగా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం అతడు ప్రోస్తటిక్ మేకప్ వేసుకుంటున్నాడు. తమిళ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ తంగలాన్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: రష్మికతో డేటింగ్.. స్పందించిన బెల్లంకొండ శ్రీనివాస్ -
PS2 Movie Review: ‘పొన్నియన్ సెల్వన్-2’ మూవీ రివ్యూ
టైటిల్: పొన్నియన్ సెల్వన్-2 నటీనటులు: చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం తదితరులు నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ దర్శకత్వం : మణిరత్నం సంగీతం: ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ విడుదల తేది: ఏప్రిల్28, 2022 ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. ఈ సినిమా మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో రెండో భాగం పొన్నియన్ సెల్వన్ 2 పై ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుగు చూస్తున్నారు. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది?రివ్యూలో చూద్దాం. కథేంటంటే... చోళ సామ్రాజ్యపు అధినేత సుందర చోళుడు(ప్రకాశ్ రాజ్) చిన్న కుమారుడు అరుళ్‌మోళి అలియాస్ పొన్నియన్ సెల్వన్(జయం రవి) నౌకలో తన రాజ్యానికి తిరిగివెళ్తుండగా శత్రువుడు దాడి చేయడం.. పోరాటం చేస్తూ ఆయన సముద్రంలో పడిపోవడం.. ఒక ముసలావిడ సముద్రంలో దూకి అతన్ని కాపాడటం. ఆ ముసలావిడకు పళవూరు రాణి నందిని (ఐశ్వర్యరాయ్) పోలికలు ఉన్నట్లు చూపించి మొదటి భాగాన్ని ముగించాడు దర్శకుడు మణిరత్నం. (చదవండి: 'ఏజెంట్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?) అసలు ఆ ముసలావిడ ఎవరు? నందినికి ఆ ముసలావిడకి ఎలాంటి సంబంధం ఉంది? అరుళ్మోళికి ఆపద వచ్చినప్పుడల్లా ఆ ముసలావిడ ఎందుకు కాపాడుతుంది? చోళరాజ్యాన్ని నాశనం చేయాలని ప్రతీజ్ఞ పూనిన పాండ్యుల లక్ష్యం నెరవేరిందా? ఆదిత్య కరికాలుడు(చియాన్ విక్రమ్)పై పగ పెంచుకున్న నందిని.. అతన్ని అంతం చేసేందుకు పన్నిన కుట్రలు ఫలించాయా? నందిని విషయంలో తప్పు చేశానని బాధపడుతున్న ఆదిత్య కరికాలుడు చివరకు ఏం చేశాడు? అసలు మందాకిని ఎవరు? ఆమెకు సుందర చోళుడుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు చోళ సామ్రాజ్యానికి రాజు ఎవరయ్యారు? అనేది తెలియాలంటే పొన్నియన్ సెల్వన్ 2 చూడాల్సిందే. ఎలా ఉందంటే.. తొలి భాగంలో చోళ రాజ్య వ్యవస్థను.. సింహాసనం కోసం సొంతమనుషులే అంతర్గత కుట్రలు చేయడం.. చోళ రాజ్యాన్ని పతనం చేసేందుకు శత్రురాజ్యాలు వేచి చూడడం చూపించారు. ఇక రెండో భాగంలో ఆ కుట్రల వెనుక ఉన్న కారణాలు తెలుపుతూ.. కథను మరింత లోతుగా చూపించాడు. ఆదిత్య కరికాలుడు, నందినిల ప్రేమ సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. నందినిని పెళ్లి చేసుకోకుండా ఎవరు అడ్డుపడ్డారనేది మొదట్లోనే చూపించారు. (చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర, ఎక్కడంటే?) ఆ తర్వాత అరుళ్‌మోళి ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు? అతను చనిపోయాడని భావించిన శుత్రువులు.. కరికాలుడిని, సుందర చోళుడిని చంపడానికి వేసిన కుట్రలు.. బౌద్దుల సమక్షంలో జరిగే నాటకీయ పరిణామాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెండాఫ్లో మందాకిని నేపథ్యం గురించి తెలిపే సన్నివేశాలు.. ఆదిత్య కరికాలుడు, నందిని మధ్య జరిగే సంఘర్షణలు ఆకట్టుకుంటాయి. నందిని పాత్రకి సంబంధించిన ట్విస్టులు బాగుంటాయి. రాజ్యాధికారం కోసం సొంతవాళ్లే చేసే కుట్రలు.. ప్రేమ, స్నేహం కోసం చేసే త్యాగాలు ఇందులో చూపించారు. అయితే ‘పొన్నియన్ సెల్వన్’ అనేది చోళ రాజులకు సంబంధించిన చరిత్ర. అది ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి. లేనిపోని మార్పులు చేస్తే చరిత్రకారులు విమర్శిస్తారు. అలా అని ఆసక్తికరంగా చూపించపోతే ప్రేక్షకులు మెచ్చరు. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ మణిరత్నం పీఎస్ 2ని తెరకెక్కించాడు. అయితే ఈ కథలో ఎక్కువ పాత్రలు ఉండడం.. అందులో ఒక్కో పాత్రకి రెండు,మూడు పేర్లు ఉండడం.. పైగా చరిత్రపై అందరికి పట్టుఉండకపోవడం ఈ సినిమాకు మైనస్. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు చోళుల చరిత్రపై అంతగా అవగాహన ఉండకపోవచ్చు. అందుకే పీఎస్1 టాలీవుడ్లో పెద్దగా ఆడలేదు. పీఎస్ 2 విషయంలో ప్లస్ పాయింట్ ఏంటంటే.. పీఎస్ 1 చూసిన ప్రేక్షకులకు చోళ రాజ్య వ్యవస్థపై కాస్త అవగాహన వస్తుంది కాబట్టి.. రెండో భాగం నచ్చే అవకాశం ఉంది. అయితే మొదటి భాగం చూసి వెళ్తేనే రెండో భాగం అర్థమవుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరు తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు. మొదటి భాగంతో పోలిస్తే.. రెండో భాగంలో ఐశ్వర్యరాయ్ పాత్రకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంది. నందినిగా ఆమె నటన అందరిని ఆకట్టుకుంటుంది. విక్రమ్ పాత్రకు నిడివి తక్కువే అయినా.. అతను కనిపించే సన్నివేశాలన్నీ అందరికి గుర్తిండిపోతాయి. పొన్నియన్ సెల్వన్‌గా జయం రవి చక్కగా నటించాడు. కుందవైగా త్రిష తెరపై అందంగా కనిపించింది. కానీ ఆమె నిడివి కూడా చాలా తక్కువే. మొదటి భాగంలో కార్తి పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఇందులో అంత నిడివి ఉండదు కానీ..ఒకటి రెండు బలమైన సన్నివేశాలు ఉన్నాయి. పళవేట్టురాయర్‌గా శరత్‌కుమార్ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. సుందర చోళుడు పాత్రను ప్రకాశ్ రాజ్ అద్భుతంగా పోషించాడు. తంజావూరు కోటసేనాధిపతి చిన పళవేట్టురాయన్గా ఆర్.పార్తిబన్, పడవ నడిపే మహిళ పూంగుళలిగా ఐశ్యర్య లక్ష్మీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ అంత బాగాలేదు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
హీరోకు 23 సర్జరీలు.. కాలు తీసేయాలన్న వైద్యులు!
చియాన్ విక్రమ్.. కథ, కాన్సెప్టే కాదు అందుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తన లుక్ కూడా వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్తపడతాడీ హీరో. అందుకే ఈ స్టార్ హీరోకు తమిళంలోనే కాదు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం అతడు పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో విక్రమ్ చిన్నతనంలో ఎదుర్కొన్న కష్టానికి సంబంధించిన వార్త ఒకటి వైరల్‌గా మారింది. విక్రమ్‌కు చిన్నప్పటినుంచే నటుడవ్వాలని కోరికగా ఉండేది. కాలేజీలో నాటకాలు వేయగా అతడికి ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి తన సత్తా నిరూపించుకున్న సంగతి తెలిసిందే! అయితే 12 ఏళ్ల వయసులో విక్రమ్ తన స్నేహితుడితో కలిసి సరదాగా బైక్‌పై వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన విక్రమ్ కొంతకాలం పాటు బెడ్‌కే పరిమితమయ్యాడు. రోజులు గడుస్తున్నా గాయం నుంచి కోలుకోకపోవడంతో వైద్యులు అతడి కుడి కాలును తీసేయాలని హీరో తల్లికి సూచించారు. కానీ విక్రమ్ అందుకు ఒప్పుకోలేదు. ఒక్క కుడికాలికే కాదు, అతడి శరీరంపై ఎన్నో చోట్ల గాయాలయ్యాయి. పలుచోట్ల ఎముకలు విరిగాయి. డాక్టర్లు అతడికి 23 సర్జరీలు చేశారు. అయినా విక్రమ్ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. మూడేళ్లపాటు వీల్‌చైర్‌కే పరిమితమైన అతడు నెమ్మదిగా గాయం నుంచి కోలుకుని బయటపడ్డాడు. నటుడిని కావాలనుకున్న బలమైన కోరికే తనను ముందుకు నడిపించిందని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నాడు విక్రమ్. ఇప్పుడు సక్సెస్ఫుల్ హీరోగా ముందుకు సాగుతున్నాడు. చదవండి: ఇండస్ట్రీకి రాకముందు సిరి ఏం చేసేదో తెలుసా? విజయ్ సినిమాలో ఐటం సాంగ్.. స్పందించిన సిమ్రాన్ -
‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హీరో విక్రమ్ ఇలా మారిపోయాడేంటి? లేటెస్ట్ ఫోటోలు వైరల్
హీరో చియాన్ విక్రమ్.. పాత్రల్లో వైవిద్యం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆయన ఎంచుకునే సినిమాలే కాదు, దానికి తగ్గ లుక్స్ కోసం ప్రత్యక శ్రద్ద పెడుతుంటారు. సినిమా ఫ్లాప్ అయినా, హిట్ అయినా విక్రమ్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. పాత్రలకు జీవం పోయడానికి ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు. సినిమాలో గెటప్ కోసమే ఎంతో సమయాన్ని కేటాయిస్తాడు. ప్రస్తుతం ఆయన పా. రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ పాత్ర కోసం ఆయన ప్రోస్థటిక్ మేకప్ వేసుకుంటున్నారట. దీనికి సుమారు 4గంటల సమయం కేటాయిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా విక్రమ్ తన లేటేస్ట్ లుక్స్ ఫోటోలని షేర్ చేశాడు. ఇందులో విక్రమ్ రగ్గుడ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. Back to the future. #Thangalaan pic.twitter.com/wKUBlWZd0c — Vikram (@chiyaan) February 17, 2023 -
ఐదేళ్ల క్రితం ఆగిపోయిన విక్రమ్ సినిమాకు మోక్షం..
విక్రమ్ 'పొన్నియిన్ సెల్వన్' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ జోష్‌తో ఇప్పుడు వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఈయన తాజాగా పా.రంజిత్ దర్శకత్వంలో నటిస్తున్న తంగలాన్ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా విక్రమ్ ఐదేళ్ల క్రితం నటించిన చిత్రం ధృవనక్షత్రం. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలు సమస్యల కారణంగా ఆగిపోయింది. దాన్ని ఇప్పుడు పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం గౌతమ్‌మీనన్ ధృవనక్షత్రం చిత్రానికి సంబంధించిన ప్యాచ్‌వర్క్ షూటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పుటికే కంప్లీట్ అయిన షూటింగ్‌కు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కావచ్చినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం చిత్రీకరిస్తున్న సన్నివేశాలకు నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలో చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతోందని సమాచారం. కాగా ఇందులో విక్రమ్‌తో పాటు నటి రీతూవర్మ, ఐశ్వర్యరాజేశ్, సిమ్రాన్, పార్తీపన్, వినాయగం, రాధికాశరత్‌కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చదవండి: ఆదిపురుష్ హీరోయిన్‌తో ప్రభాస్ పెళ్లి? వాస్తవమిదే! -
రోలెక్స్ కథలోకి విక్రమ్.. కమల్, సూర్యలతో స్క్రీన్ షేరింగ్!
గతేడాది కోలీవుడ్ నుంచి విడుదలైన సినిమాలల్లో విక్రమ్ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెల్సిందే. ఈ ఒక్క సినిమాతో కమల్ మళ్లీ స్టార్ డమ్ అందుకున్నాడు.ఇదే సినిమాతో సూర్య కూడా రోలెక్స్‌గా ఫుల్లుగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఒక్క సినిమా ఇంత మంది స్టార్స్ లైఫ్స్ మార్చేస్తుందని ఎవరూ ఊహించలేదు.అందుకే ఇప్పుడు విక్రమ్ వరల్డ్ లోకి నిజంగానే విక్రమ్ అడుగు పెడుతున్నాడు. వాస్తవానికి ఈ రోలెక్స్ క్యారెక్టర్ కోసం ముందుగా విక్రమ్‌ని సంప్రదించారట దర్శకుడు లోకేశ్. అయితే క్యారెక్టర్ చిన్నగా ఉందని విక్రమ్ రిజెక్ట్ చేసాడట. దాంతో సేమ్ క్యారెక్టర్ కోసం సూర్య దగ్గరికి వెళ్లగా,ఆయన కమల్ మీద అభిమానంతో రోలెక్స్ క్యారెక్టర్ చేశాడు. క్లైమాక్స్ లో ఈ క్యారెక్టర్ పెద్ద సెన్సేషన్ సృష్టించింది. అందుకే ఫ్యూచర్ లో రోలెక్స్ క్యారెక్టర్ తోనే పూర్తిస్థాయి సినిమా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.ఇదంతా గతం.ఇప్పుడు లేటెస్ట్ స్టోరీ ఏంటంటే విక్రమ్ లో హీరో విక్రమ్ ఛాన్స్ మిస్ అయ్యాడు. అందుకే అతడిని కమల్ హీరోగా తెరకెక్కే విక్రమ్ -2లో నటింపజేస్తున్నాడట లోకేశ్. ఒకే సినిమాలో కమల్, విక్రమ్, సూర్య కలసి నటిస్తే ఆ సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ ఏ లెవల్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. -
మరో విభిన్నమైన పాత్రలో విక్రమ్.. మేకప్‌కే 4 గంటలు!
ఎంచుకునే పాత్రల్లో వైవిధ్యం చూపించ డానికి హీరో విక్రమ్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. సరికొత్త పాత్రలను చాలెంజ్‌గా తీసుకుని ఎంతో కష్టపడుతుంటారు. ‘శివపుత్రుడు’, ‘ఐ’, ‘కోబ్రా’ వంటి సినిమాల్లో విక్రమ్ చేసిన పాత్రలే ఇందుకు ఉదాహరణ. కాగా ప్రేక్షకులను మరోసారి అబ్బురపరిచేందుకు విక్రమ్ మరో సవాల్‌లాంటి ΄ాత్ర చేస్తున్నారు. విక్రమ్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో ‘తంగలాన్’ అనే సినిమా తెరకెక్కుతోంది. పీరియాడికల్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పాత్ర కోసం విక్రమ ప్రోస్థటిక్ మేకప్ వేసుకుంటున్నారు. ఈ మేకప్‌కి నాలుగు గంటలు పడుతోందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. తదుపరి షెడ్యూ ల్ను కర్ణాటకలో ప్లాన్ చేశారు. పార్వతీ మీనన్, మాళవికా మోహనన్, పశుపతి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. -
కేజీయఫ్ కార్మికులతో హీరో విక్రమ్
పాత్రలకు జీవం పోయడానికి ఎంతటి రిస్క్ అయినా చేసే అతి కొద్దిమంది నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. చిత్రం సక్సెస్ అయినా, ప్లాప్ అయినా నటుడిగా విక్రమ్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఇటీవల ఆయన నటించిన కోబ్రానే తీసుకుంటే ఆ చిత్రం ఆశించిన విధంగా ఆడలేదన్నది నిజం. అయితే ఆ చిత్రానికి విక్రమ్ పెట్టిన ఎఫర్ట్‌కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. చిత్రంలో గెటప్‌ల కోసమే ఎంతో సమయాన్ని కేటాయించారు. ప్రస్తుతం నటిస్తున్న తంగలాన్ చిత్రం విషయానికి వస్తే మరోసారి విక్రమ్ తన మార్కు చూపనున్నారని ఆయన గెటప్ చూస్తేనే తెలిసిపోతోంది. దీనికి పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన చిత్రాలు కచ్చితంగా ఇతర చిత్రాలకు భిన్నంగా ఉంటాయన్నది తెలిసిందే. ‘తంగలాన్’ చిత్రానికి ఆయన 18వ శతాబ్దం కాలపు నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకోవడం విశేషం. దీంతో ఆ కథకు తగ్గట్టుగా విక్రమ్ మారిపోయారు. నటి పార్వతి, మాళవికా మోహన్ నాయికలుగా నటిస్తున్న ఇందులో నటుడు పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటివలె సెట్స్‌పైకి వచ్చి శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇది కర్ణాటకలోని కేజీఎఫ్ గనుల్లో బానిసలుగా పని చేస్తున్న కార్మికులకుల ప్రధానాంశంతో తెరకెక్కిస్తున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించారు. కాగా ప్రస్తుతం కేజీఎఫ్ గనుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా షూటింగ్ అనంతరం విక్రమ్ కేజీఎఫ్ గనుల్లో పనిచేసే తమిళ కార్మికులను కలిసి వారితో ముచ్చటించారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Vikram (@the_real_chiyaan) -
విక్రమ్‌కు అరుదైన గౌరవం, పూర్ణ భర్త చేతుల మీదుగా ‘చియాన్’కు గోల్డెన్ వీసా
స్టార్ హీరో చియాన్ విక్రమ్ అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్ ప్రభుత్వం తాజాగా ఆయన గోల్డెన్ వీసా ఇచ్చింది. ఈ విషయాన్ని నటి పూర్ణ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్తతో కలిసి పూర్ణ విక్రమ్ దుబాయ్ గోల్డెన్ వీసా అందిస్తున్న ఫొటోను ఈ సందర్భంగా ఆమె షేర్ చేసింది. కాగా గతంలో కూడా పలువురు భారతీయ నటీనటులకు దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసా ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: అప్పటి వరకు అల్లు శిరీష్ ఎవరో కూడా తెలియదు: అను ఇమ్మాన్యుయేల్ మోహన్ లాల్, మమ్ముట్టి, కమల్ హాసన్, షారుక్ ఖాన్, నటి త్రిష, కాజల్ అగర్వాల్‌తో పాటు తదితర స్టార్ నటులకు ఈ వీసా అందింది. తాజాగా ఈ జాబితాలో విక్రమ్ కూడా చేరటం విశేషం. ఇదిలా ఉంటే నటి పూర్ణ అలియాస్ షమ్మా ఖాసీమ్ ఆమె భర్త షానిద్ ఆసీఫ్ చేతుల మీదుగా విక్రమ్కుగోల్డెన్ వీసా ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. దీంతో దీనిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్ణ భర్త చొరవతోనే విక్రమ్‌కు గోల్డెన్ వీసా వచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: అలా లెక్కలేసుకుని నేను ఇండస్ట్రీకి రాలేదు: అనుష్క శెట్టి పూర్ణ భర్త షానిద్ ఆసీఫ్ అలీ యూఏఈలో బడా వ్యాపారస్తుల్లో ఒకరనే విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఆయన పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. అయితే షానీద్ తన కంపెనీ ద్వారా విక్రమ్‌కి గోల్డెన్ వీసా వచ్చేలా చేశాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా సినీ, సాహిత్యం, విద్య, కల్చర్ ఇతర రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు అందిస్తుంది. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆరబ్ దేశాల్లో ఎలాంటి పరిమితులు లేకుండా నివసించవొచ్చు. 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తూ వస్తుంది. View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
అఫీషియల్: ఓటీటీలోకి వచ్చేసిన పొన్నియన్ సెల్వన్, కాకపోతే..
స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన చిత్రం పొన్నియన్ సెల్వన్: మొదటి భాగం. చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తీ, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజైన ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజై దాదాపు నెల రోజులు అవుతుండటంతో ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1 ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే! తాజాగా ఈ సినిమా నవంబర్ 4 నుంచి అందుబాటులోకి రానుందని ప్రకటించింది అమెజాన్ ప్రైమ్. ఒకవేళ ఇప్పుడే చూడాలనుకుంటే మాత్రం దానికి డబ్బులు చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మాత్రమే స్ట్రీమ్ కానున్నట్లు తెలపడంతో కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే హిందీ వర్షన్ రిలీజ్ చేయరా? అని మండిపడుతున్నారు. presenting the much awaited, larger than life, historical action-drama #PS1onPrime, rent to watch now! Coming to Prime on Nov 4#ManiRatnam @arrahman @MadrasTalkies_ @LycaProductions@tipsofficial pic.twitter.com/Cq34q7zdD7 — prime video IN (@PrimeVideoIN) October 28, 2022 చదవండి: పెళ్లి వార్తలపై స్పందించిన యంగ్ హీరోయిన్ తొక్కలో పంచాయితీ.. ఎంత చెప్పినా గీతూ వినదే -
సెల్వరాజ్ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్
తమిళసినిమా: విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా పరిచయమైన చిత్రం ఆదిత్య వర్మ. ఇది తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్‌రెడ్డికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే తమిళంలో ఈ త్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే నటుడిగా ధృవ్ విక్రమ్‌కు మంచి వర్కులు పడ్డాయి. తన తండ్రి విక్రమ్‌తో కలిసి మహాన్ చిత్రంలో నటించారు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మంచి ప్రశంసలను అందుకుంది. ఆ తరువాత ధృవ్ విక్రమ్ మంచి కథా చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. పరియేరుమ్ పెరుమాళ్, కర్నన్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ కర్నన్ చిత్రం తరువాత ధృవ్ విక్రమ్ హీరోగా కబడ్డీ క్రీడ నేపథ్యంలో చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించారు. అలాంటిది సడన్‌గా ఉదయనిధి స్టాలిన్ హీరోగా వమన్నన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రవలు జరుపుకుంటోంది. దీంతో ధృవ్ విక్రమ్ హీరోగా చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
విక్రమ్ సినీ ప్రస్థానానికి 32 ఏళ్లు.. ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ ఎమోషనల్ ట్వీట్
విక్రమ్ నటుడిగా 32 వసంతాలను పూర్తి చేసుకున్నారు. నిరంతర శ్రమ, కృషి, పట్టుదలే ఈయన ఆయుధాలు. పాత్రకు జీవం పోయడం కోసం ఎంతవరకైనా వెళ్తారనే పేరు సంపాదించుకున్నారు. స్వశక్తితో నటుడుగా ఎదిగారు. అయితే ఆరంభంలో విజయాలు ఈయనకి అందని ద్రాక్షగా మారాయి. అయినా నిరాశ పడకుండా 1990లో నట పయనాన్ని ప్రారంభించారు. ఎన్ కాదల్ కమ్మని ఈయన తొలి చిత్రం. ఆ తర్వాత పలు చిత్రాలు చేశారు. చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్.. అందులో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ చిత్రాలు ఉన్నాయి. కాగా విక్రమ్ విజయం సాధించిన తొలి చిత్రం సేతు. అందులో ఈయన నటనకు సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత విక్రమ్‌కు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. ప్రముఖ దర్శక నిర్మాతలు ఆయనపై దృష్టి పెట్టారు. అలా నటుడిగా 32 వసంతాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఈ పయనంలో ఆయన ఎన్నో మజిలీలు, విజయాలు చవి చూశారు. చదవండి: సుకుమార్-దేవిశ్రీ మధ్య రెమ్యునరేషన్ చిచ్చు! అసలేం జరిగింది? దీని గురించి ఆయన ట్విట్టర్లో అభిమానులను ఉద్దేశించి పేర్కొంటూ.. “ఈ 32 సంవత్సరాలు.. పలు కలలు, ప్రయత్నాల ఉత్సవంగా చెప్పవచ్చు. మీరు లేకపోతే ఇవన్నీ ఉత్త ప్రయత్నాలు, కలలుగానే మిగిలేవి. ఈ 32 ఏళ్లకు కృతజ్ఞతలు’’ అంటూ తమిళంలో ట్వీట్ చేశారు. ఇక ఇప్పటి వరకు విక్రమ్ 60 చిత్రాలు చేశారు. కాగా విక్రమ్ 32 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేయడంతో ఆయన అభిమానులు ఖుషి అవుతున్నారు. దాన్ని “32 ఇయర్స్ ఆఫ్ విక్రమ్’’ అనే పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కాగా విక్రమ్ తాజాగా తన 61వ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. இத்தனை வருடங்கள். அத்தனை கனவுகள். முயற்சி திருவினை ஆக்கும் என்பார்கள். நீங்கள் இல்லையெனில் அது வெரும் முயற்சி மட்டுமே. 💛 இந்த 32 வருடத்துக்கு நன்றி. & Abhinandan KK. Thank you for your lovely edit. pic.twitter.com/fv2Pz56IUL — Aditha Karikalan (@chiyaan) October 17, 2022 -
రష్మిక కాదు.. ఆమె ప్లేస్‌లో ఛాన్స్ కొట్టేసిన మాళవిక
తమిళ సినిమా: ఒకరు జారవిడుచుకుంటే మరొకరు దాన్ని అందిపుచ్చుకుంటారు. నటి మాళవిక విషయంలో ఇదే జరిగింది. ఈ మలయాళీ బ్యూటీ మాతృభాషతో పాటు, తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఇండియన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. రజనీకాంత్ నటించిన పేట చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహన్ ఆ తర్వాత విజయ్ జంటగా మాస్టర్, ధనుష్ సరసన మారన్ చిత్రాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో ముద్ర అనే చిత్రంలో నటిస్తోంది. కాగా తాజాగా కోలీవుడ్‌లో మరో లక్కీ ఛాన్స్ ఈమెను వరించింది. పొన్నియిన్ సెల్వన్ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న చియాన్ విక్రమ్ తాజాగా తన 61వ చిత్రానికి సిద్ధమైపోయారు. దీనికి పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియోస్ గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా నటి రష్మిక మందన్నా నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రంలో ఆమె నటించడం లేదని తెలిసింది. ఆమెకు బదులుగా నటి మాళవిక మోహన్‌ను ఎంపిక చేసినట్టు చిత్ర వర్గాలు చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. ఆమె ఇందులో నటించడం ఖాయమని తెలుస్తోంది. రష్మికకు దక్కాల్సిన అవకాశం మాళవిక మోహన్‌ను వరింంది. కాగా ఇంతకుముందు ఈమె తమిళంలో నటింన పేట చిత్రంలో మం మార్కులు తెచ్చుకుంది. మాస్టర్ చిత్రం హిట్ అయినా అందులో మాళవిక మోహన్ పాత్ర పరిమితమే. ఇక ధనుష్‌తో జతకట్టిన మారన్ చిత్రం ఓటీటీలో విడుదలతో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే దర్శకుడు పా.రంజిత్ చిత్రాల్లో కథానాయక పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. మరి విక్రమ్‌తో నటిస్తున్న ఈ చిత్రంతో మాళవిక మోహన్‌కు క్రేజ్ వస్తుందేమో చూడాలి. -
రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘పొన్నియన్ సెల్వన్’.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. చియాన్ విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచన సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన లభించగా, తమిళనాట మాత్రం హిట్ టాక్ వచ్చింది. దీంతో అక్కడ ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ రూ.100 కోట్ల క్లబ్లో చేరేందుకు పరుగులు పెడుతోంది. విడుదలైన రెండు రోజులకే ఒక్క తమిళనాడులోనే రూ.47 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం రూ.9 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కేరళలో రూ.6 కోట్లు, ఓవర్సీస్లో దాదాపు 60 కోట్ల పైగా వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో ఈ చిత్రం దాదాపు రూ.147 కోట్ల గ్రాస్, రూ.75 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది. తమిళనాడుతో పాటు ఓవర్సీస్లో కూడా మంచి టాక్ సంపాదించుకోవడంతో ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
Ponniyin Selvan Review: పొన్నియన్ సెల్వన్ మూవీ రివ్యూ
టైటిల్: పొన్నియన్ సెల్వన్-1 నటీనటులు: చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం తదితరులు నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ దర్శకత్వం : మణిరత్నం సంగీతం: ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ విడుదల తేది: సెప్టెంబర్ 30, 2022 లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణ మూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. అందులో మొదటి భాగం PS-1 నేడు(సెప్టెంబర్ 30) విడుదలైంది. నాలుగేళ్ల విరామం తర్వాత మణిరత్నం చేసిన సినిమా... అందులోను ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో పొన్నియన్ సెల్వన్ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. పొన్నియన్ సెల్వన్ కథేంటంటే? పొన్నియన్ సెల్వన్ కథంతా పదో శతాబ్దంలో జరుగుతుంది. వేయి సంవత్సరాల క్రితం పరిపాలన సాగించిన చోళ రాజుల గొప్పదనం గురించి చెబుతూ కథ మొదలవుతుంది. చోళ సామ్రాజ్యపు అధినేత సుందర చోళుడు(ప్రకాశ్ రాజ్)కి ఇద్దరు కుమారులు, ఓ కూతురు. పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు(చియాన్ విక్రమ్) తంజావూరుకు దూరంగా ఉంటూ.. కనిపించిన రాజ్యానల్లా ఆక్రమిస్తూ వెళ్తుంటాడు. చిన్న కుమారుడు అరుళ్ మోళి అలియాస్ పొన్నియన్ సెల్వన్(జయం రవి) చోళ రాజ్యానికి రక్షకుడిగా ఉంటాడు. తండ్రి ఆజ్ఞతో శ్రీలంకలో ఉంటాడు. తన తర్వాత వారసుడిగా పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు (విక్రమ్)ను యువరాజుగా సుందర చోళుడు ప్రకటిస్తాడు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా సామాంత రాజులను ఏకం చేస్తాడు కోశాధికారి పళవేట్టురాయర్(శరత్ కుమార్). సుందర చోళుడు అన్నయ్య కుమారుడు మధురాంతకుడు (రహమాన్) ను రాజును చేయాలనేది అతని కోరిక. రాజ్య ఆక్రమణ కోసం తెలిసినవాళ్లే కుట్ర చేస్తున్నారని గ్రహించి.. ఆ కుట్రను చేధించడానికి తన మిత్రుడు వల్లవరాయన్(కార్తి)ని తంజావురుకు పంపిస్తాడు ఆదిత్య కరికాలన్. కుట్ర విషయాన్ని వల్లవరాయన్ ఎలా కనిపెట్టాడు? శ్రీలంకలో ఉన్న అరుళ్‌మోళిని వల్లవరాయన్ ఎలా రక్షించాడు? సొంతవాళ్లు పన్నిన కుట్రకు యువరాణి కుందవై(త్రిష) ఎలా చెక్ పెట్టింది? పళవేట్టురాయల్ భార్య నందిని(ఐశ్యర్య రాయ్) ఉన్నంత వరకు తంజావూరుకు రానని ఆదిత్య కరికాలుడు ఎందుకు చెబుతున్నాడు? అసలు నందిని, ఆదిత్యకు మధ్య ఏం జరిగింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. రాజ్యాలు.. యుద్దం.. కుట్రలు అనగానే అందరికి గుర్తుకొచ్చే సినిమా ‘బాహుబలి’. రాజుల పాలన ఎలా ఉంటుంది? అధికారం కోసం ఎలాంటి కుట్రలు చేస్తారు? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు రాజమౌళి. అయితే అది కల్పిత కథ కాబట్టి అందరికి అర్థమయ్యేలా, కావాల్సిన కమర్షియల్ అంశాలను జోడించి ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ చారిత్రాత్మక కథలకు ఆ వెసులుబాటు ఉండదు. కథలో మార్పులు చేస్తే చరిత్రకారులు విమర్శిస్తారు. అలా అని ఆసక్తికరంగా చూపించపోతే ప్రేక్షకులు మెచ్చరు. పొన్నియన్ సెల్వన్ విషయంలో అదే జరిగింది. మణిరత్నం చరిత్రకారులను మెప్పించాడు కానీ.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. కథలో విషయం ఉంది కానీ కన్ఫ్యూజన్స్ లేకుండా తెరపై చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. స్లోనెరేషన్ సినిమాకు పెద్ద మైనస్. కథ జరిగే ప్రాంతాలు మారుతాయి కానీ.. కథనం మాత్ర కదినట్లే అనిపించదు. చాలా పాత్రలు.. పెద్ద పెద్ద నటులు కనిపిస్తారు కానీ.. ఏ ఒక్క పాత్ర కూడా గుర్తుండిపోయేలా తీర్చిదిద్దలేదు. యాక్షన్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోవు. ఏ పాత్ర కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ కావు. నవల ఆధారంగా ఈ స్క్రిప్ట్‌ను రాసుకోవడం వల్ల..ట్విస్టులు, వావ్ ఎలిమెంట్స్ ఏవి ఉండవు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. క్లైమాక్స్‌లో మాత్రం ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చి పార్ట్-2పై ఆసక్తి పెంచారు. మొత్తంగా ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు ,అది కూడా చరిత్రపై అవగాహన ఉన్నవారికి ఎంతో కొంతో నచ్చుతుంది. కానీ తెలుగు ప్రేక్షకులను మెప్పించడం కాస్త కష్టమే. ఎవరెలా నటించారంటే... ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాకు మెయిన్ పిల్లర్ లాంటి పాత్ర వల్లవరాయన్. ఈ పాత్రలో కార్తి ఒదిగిపోయాడు. వల్లవరాయన్ సమయస్ఫూర్తి కలవాడు, చమత్కారి కూడా. సినిమాలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ కార్తికే దక్కింది. ఆదిత్య కరికాలుడు పాత్రలో చియాన్ విక్రమ్ మెప్పించాడు. అయితే ఇతని పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. సినిమా ప్రారంభంలో ఒకసారి, మధ్యలో మరోసారి, ఇక క్లైమాక్స్‌లో ఇంకోసారి కనిపిస్తాడు. అరుళ్‌మొళి వర్మన్ అలియాస్ పొన్నియన్ సెల్వన్ పాత్రలో జయం రవి ఒదిగిపోయాడు.. నందిని పాత్రకు వందశాతం న్యాయం చేసింది ఐశ్యర్యరాయ్. తన అందం, అభినయంతో ఎలాంటి మగవాడినైనా తన వశం చేసుకోగల పాత్ర తనది. అందుకు తగ్గట్టే తెరపై చాలా అందంగా కనిపించింది. రాజకుమారి కుందవైగా త్రిష తనదైన నటనతో ఆకట్టుకుంది. పళవేట్టురాయర్‌గా శరత్‌కుమార్ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. సుందర చోళుడు పాత్రను ప్రకాశ్ రాజ్ అద్భుతంగా పోషించాడు. తంజావూరు కోటసేనాధిపతి చిన పళవేట్టురాయన్గా ఆర్.పార్తిబన్, పడవ నడిపే మహిళ పూంగుళలిగా ఐశ్యర్య లక్ష్మీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. వీఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతం అని చెప్పలేం కానీ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
పొన్నియన్ సెల్వన్: ఐశ్వర్యరాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1’. పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపొందింది. ‘చియాన్’ విక్రమ్, ఐశ్వర్య రాయ్, ‘జయం’ రవి, త్రిష, కార్తి వంటి అగ్ర నటులతో తెరకెక్కిన ఈ సినిమా నేడు (సెప్టెంబర్ 30న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మణిరత్నం దర్శకత్వం, భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. చదవండి: పొన్నియన్ సెల్వన్’పై ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ, మండిపడ్డ సుహాసిని భారీ అంచల మధ్య నేడు విడుదలైన మూవీ తొలి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలోని ప్రధాన పాత్రల పారితోషికం హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో దాదాపు అందరు అగ్ర నటీనటులే ఉన్నారు. దీంతో ఎవరి పారితోషికం ఎంతనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పలు తమిళ వెబ్సైట్లు పొన్నియన్ సెల్వన్ నటీనటుల పారితోషికాలకు సంబంధించిన కథనాలు వెలువరించింది. వాటి ప్రకారం ఈ సినిమా కోసం చియాన్ విక్రమ్ రూ. 12 కోట్లు తీసుకున్నాడట. చదవండి: వెండి తెరపై నారీ ముద్ర.. సత్తా చాటుతున్న లేడీ డైరెక్టర్స్ అలాగే ఐశ్వర్య రాయ్ రూ. 10 కోట్లు, జయం రవి రూ. 8 కోట్లు, కార్తి రూ. 5 కోట్లు తీసుకోగా త్రిష రూ. 2.5 కోట్లు అందుకుందని సమాచారం. జయం రవి కంటే కార్తికి ఎక్కువ క్రేజ్ ఉన్నప్పటికీ. ఈ సినిమాలో జయం రవికి దక్కిన పాత్ర కారణంగా ఆయనకి ఎక్కువ మొత్తం ఇచ్చారని అంటున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్‌పై సుభాస్కరన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహామాన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. -
PS-1 Twitter Review: ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ ట్విటర్ రివ్యూ
‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ (PS–1’). మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ నిర్మించాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం ‘PS–1’ నేడు(సెప్టెంబర్ 30) విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం నాలుగేళ్ల విరామం తర్వాత చేసిన సినిమా... అందులోను ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో పొన్నియన్ సెల్వన్ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘పొన్నియన్ సెల్వన్’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. Such grand and stunning visuals 🔥😲 Can't imagine how #ManiRatnam sir completed both parts in just 155 days ! May his lifelong dream & efforts get great result 👍🏻#PonniyinSelvan #PonniyanSelvan1#PS1 #PonniyinSelvanFDFS#PonniyinSelvanFDFS pic.twitter.com/6nGSZsmTUd — vamsi Krishna (@vamsi2131) September 30, 2022 విజువల్స్ ఎఫెక్ట్స్ , మ్యూజిక్ చాలా బాగున్నాయని చెబుతున్నారు. ‘అద్భుతమైన విజువల్స్ ఉన్న ఇలాంటి సినిమాను మణిరత్నం కేవలం 155 రోజుల్లో రెండు భాగాలను ఎలా తెరకెక్కించారో ఊహించుకోవడం కష్టమే. అతని డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది సాధ్యమై ఉండొచ్చు. మణిరత్నం కష్టానికి ఫలితం దక్కిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #PonniyinSelvan #PS1 1st Half Good 2nd Half Flat / Average 2.5-2.75/5 Top Highlights #Vikram #Karthi #Trisha BGM — RR (@rrking99) September 30, 2022 ఫస్టాఫ్ బాగుందని, సెకండాప్ యావరేజ్‌గా ఉందని చెబుతూ 2.5-2.75 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్. విక్రమ్, కార్తి, త్రిషల యాక్టింగ్‌తో పాటు ఏఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతం బాగుందని చెబుతున్నారు. Better 2nd half Overall one time watch 2.25/5#PS1 #PonniyinSelvan — Albitthar Appanna (@ulfha_reddy) September 30, 2022 #PonniyinSelvanFDFS #PS1 #PonniyinSelvanReview Comparison Between Bahubali and Ponniyin Selvan Bahubali - Mass PS1 - Class That's the tweet. Mani rathnam take a bow. You have satisfied fully. Waiting for part 2. — Santhosh (@Santhos43177339) September 30, 2022 #PS1 1st Half : A Classic of Epic proportions is unfolding in front of your eyes.. Dir #Maniratnam magic.. What a story and screen play.. @Karthi_Offl is brilliant and fun and occupies most screen time.. @chiyaan lives his character.. His acting in pre-interval.. 🔥 — Ramesh Bala (@rameshlaus) September 30, 2022 #PS1 #PonniyinSelvan spectacular movie 5/5 #Maniratnam visualization amazing #ARR rocks #AdhityaKarikalan terror #Vanthiyathevan so sweat #ArunmozhiVarman Majestic #Nadhini no words #kundavai real chola queen — ilangovan chandran (@ilangovanchand2) September 30, 2022 PS is political drama with complex characterisation. This was been said from the start. There won't be any air bending fight sequences and commerical elements. It's pure story based & characters driven movie.#Ponniyinselvan #PS1 — Renu🌠 (@crazy4musics) September 30, 2022 #PS1 Overall A Period Action Film that had potential but ends up as an underwhelming watch! Interesting storyline with good music and visuals but is wasted by flat narration with absolutely no highs/emotional connect needed for this genre Rating: 2.25-2.5/5 #PonniyinSelvan — Venky Reviews (@venkyreviews) September 30, 2022 -
ఓటీటీలో విక్రమ్ కోబ్రా మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం 'కోబ్రా'. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్గా నటించింది. అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్31న విడుదలై మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో ఈనెల 28 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా వెల్లడైంది. దీంతో థియేటర్స్‌లో మిస్ అయినవారు ఓటీటీలో హ్యాపీగా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసేయండి. -
విక్రమ్ ‘కోబ్రా’ ఓటీటీ పార్ట్నర్ ఇదే! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కోబ్రా’. కేజీయఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించించింది. మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రల్లో కనిపించారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 31న థియేటర్లో విడుదలైంది. విక్రమ్ విభిన్న పాత్రల్లో అలరించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఎప్పటిలాగే విక్రమ్ నటన మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయినప్పటికీ ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా! ఇదిలా ఉంటే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్‌పై తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కోబ్రా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ తాజా బజ్ ప్రకారం తమిళం, తెలుగులో సెప్టెంబర్ 23 లేదా 30న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. సెవెన్ స్క్రీన్ స్టూడీయో పతాకంపై ఎస్.ఎస్ లలిత్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూర్చారు. చదవండి: పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ -
ఉత్కంఠభరితంగా ‘పొన్నియన్ సెల్వన్’ ట్రైలర్
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. పదో శతాబ్ధంలో చోళ రాజ్యంలోని స్వర్ణయుగాన్ని మణిరత్నం తెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇక రెండు భాగాలుగా తెరకెక్కితున్న ఈ మూవీ తొలి భాగం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. కాగా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ వారి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రిలీజ్ అయిన రెండు పాటలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. చదవండి: పుష్ప 2పై అప్డేట్ ఇచ్చిన రష్మిక, ‘అప్పుడే సెట్లో అడుగుపెడతా’ ‘వెయ్యి సంవత్సరాల క్రితం చోళ నాట స్వర్ణశకం ఉదయించక మునుపు ఒక తొక చుక్క ఆకాశంలో ఆవిర్భవించింది. చోళ రాజ కులంలో ఒకరిని ఆ తోకచుక్క బలిగోరుతుందంటున్నారు జ్యోతిష్యులు. దేశాన్ని పగలు, ప్రతికారాలు చుట్టుముట్టాయి. సముంద్రాలు ఉప్పొంగుతున్నాయి..’ రానా వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ట్రైలర్ చూపించిన యుద్ధపు సన్నివేశాలు. పోరాటలు సినిమా అంచనాలను పెంచేస్తోంది. కాగా కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక మంగళవారం జరిగిన ఈ ట్రైలర్ ఈవెంట్లో ‘లోకనాయకుడు’ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథులు హజరయ్యారు. చదవండి: హాట్‌టాపిక్‌గా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్!, ఎవరెవరికి ఎంతంటే.. -
ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన ‘కోబ్రా’ డైరెక్టర్
చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ చిత్రం కోబ్రా. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 31న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి హిట్‌టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. సినిమా నిడివి ఎక్కువ ఉందని, స్క్రీన్ ప్లే గందరగోళంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అయితే తాజాగా వీటిపై డైరెక్టర్ స్పందిస్తూ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్‌చాట్‌లో నెటిజన్లతో ముచ్చటించాడు డైరెక్టర్ జ్ఞానముత్తు. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్? ఈ సందర్భంగా ఓ నెటిజన్ కథ, కథనం బాగున్నప్పటికీ క్లైమాక్స్ నిరాశ పరిచిందన్నాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘పోలీసుల నుంచి హీరో తప్పించుని విదేశాల్లో స్వేచ్చగా బతుకున్నట్లు క్లైమాక్స్ రాయొచ్చు. కానీ, అలాంటి నేరస్థుడికి ఎలాంటి శిక్ష పడకపోవడం న్యాయం కాదు కదా!’ అని వివరించాడు. కోబ్రా సినిమా నిడివిపై మరో నెటిజన్ ప్రశ్నించగా.. ఈ చిత్రంలోని ప్రతి కీలక విషయాన్ని ప్రేక్షకుడికి చూపించాలనుకున్నామన్నారు. అందుకే నిడివి గురించి ఆలోచించలేదని చెప్పిన జ్ఞానముత్తు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మేరకు సినిమా నిడివిని 20 నిమిషాలు తగ్గించామని చెప్పాడు. చదవండి: వైరల్‌గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్, మండిపడుతున్న నెటిజన్లు! ఇక స్క్రీన్‌ప్లే గందరగోళంగా ఉందని మరో నెటిజన్ అనగా.. ‘మిమ్మల్ని గందరగోళానికి గురి చేసినందుకు క్షమించండి. ప్రతిక్షణం ఉత్కంఠకు గురిచేసే సినిమా చూసేందుకు ఓ ప్రేక్షకుడిగా నేను ఇష్టపడతాను. అందుకే కోబ్రాను తెరకెక్కించాను. సాధ్యమైతే మరోసారి మా సినిమాను చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చాడు. కాగా 7 స్క్రీన్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఇందులో విక్రమ్ సరసన ‘కేజీయఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి సందడి చేసింది. -
Cobra Review: ‘కోబ్రా’మూవీ రివ్యూ
టైటిల్ : కోబ్రా నటీనటులు : చియాన్ విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మీనాక్షి , మృణాళిని తదితరులు నిర్మాణ సంస్థ: సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్ దర్శకత్వం: అజయ్ జ్ఞానముత్తు సంగీతం : ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ:హరీష్ కణ్ణన్ విడుదల తేది: ఆగస్ట్ 31, 2022 ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ఎప్పుడు ముందుంటాడు తమిళస్టార్ చియాన్ విక్రమ్. ఫలితాన్ని పట్టించుకోకుండా వైవిధ్యమైన పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. అయితే విక్రమ్ ప్రయోగానికి ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి కానీ..సాలిడ్ హిట్ మాత్రం దక్కడం లేదు. అందుకే ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో విక్రమ్ పది పాత్రలు పోషించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘కోబ్రా’పై హైప్ క్రియేట్ అయింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(ఆగస్ట్ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాలిడ్ హిట్ కోసం 17 ఏళ్లు ఎదురుచూస్తున్న విక్రమ్‌కు ‘కోబ్రా’తో ఆ కొరత తీరిందా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. స్కాట్లాండ్ ప్రిన్స్ బహిరంగ హత్యకు గురవుతారు. ఈ కేసును విచారిస్తున్న ఇంటర్‌పోల్ ఆఫీసర్ అస్లామ్(ఇర్ఫాన్ ఫఠాన్).. ఒడిశా ముఖ్యమంత్రి, రష్యా మంత్రి కూడా అదే రీతిలో హత్యకు గురయ్యారని గుర్తిస్తాడు. ఈ హత్యలకు కోల్‌కతాలో ఉన్న లెక్కల మాస్టర్ మది(చియాన్ విక్రమ్)కి సంబంధం ఉందని అనుమానిస్తాడు. అలాగే వేరు వేరు దేశాల్లో జరిగిన ఈ హత్యలతో యువ వ్యాపారవేత్త రిషి(రోషన్ మాథ్యూ)కి కూడా సంబంధం ఉంటుంది. మరి వీరిలో ఎవరు ఆ హత్యలు చేశారు? ఈ కేసు విచారణలో అస్లామ్‌కు ఓ లెక్కల స్టూడెంట్ జూడీ(మీనాక్షీ గోవింద్ రాజన్) ఏ రకమైన సహాయం చేసింది? సాధారణ లెక్కల మాస్టర్‌కు ఈ హత్యలకు ఎలాంటి లింక్ ఉంది? కధీర్కు మదికి ఉన్న సంబంధం ఏంటి? పోలీసుల విచారణలో ఏం తేలింది? అనేదే కోబ్రా కథ. ఎలా ఉందంటే.. సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘కోబ్రా’. ఇందులో విక్రమ్ పది రకాల పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఒక్కో పాత్ర కోసం ఐదారు గంటల పాటు మేకప్‌కే సమయం కేటాయించేవాడని మూవీ ప్రమోషన్స్‌లో మేకర్స్ తెలిపారు. అతని కష్టం తెరపై కనిపించింది కానీ..అజయ్ జ్ణానముత్తు కథనే కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. గతంలో డిమాంటీ కాలనీ, అంజలి సీబీఐ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన అజయ్.. విక్రమ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది. విక్రమ్‌కు సెట్ అయ్యే కాన్సెప్ట్నే ఎంచుకున్నాడు కానీ తెరపై చూపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేకపోయాడు. వరుస హత్యలతో కథ చాలా ఇంట్రెస్టింగ్గా ప్రారంభమవుతుంది. మాథ్యమెటిక్స్లో ఉన్న అనుభవంతో ఆ హత్యలను ఎలా చేశారో వివరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అదే సమయంలో కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఆ తర్వాత మాత్ర కథ పూర్తిగా తేలిపోతుంది. సుదీర్ఘంగా సాగే మది, కధీర్ల ప్లాష్‌బ్యాక్ స్టోరీ సినిమాకు పెద్ద మైనస్. సెకండాఫ్ మొత్తం ప్రేక్షకుడి ఊహకందేలా సాగడమే కాకుండా.. నిడివి మరింత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సినిమా చివరి భాగంలో కొన్ని యాక్షన్ సీన్లు మెప్పిస్తాయి. ఎవరెలా చేశారంటే.. గెటప్పుల స్పెషలిస్ట్ విక్రమ్ నటనకు వంక పెట్టలేం. ఏ పాత్రలోనైనా నటించడం కంటే జీవించడం ఆయనకు అలావాటు. మది, కధీర్ పాత్రల్లో విక్రమ్ ఒదిగిపోయాడు. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో 10 రకాల పాత్రల్లో విక్రమ్ కనిపిస్తాడు. అందుకోసం ఈ విలక్షణ నటుడు పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. యాక్షన్స్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. ఇక మదిని ప్రాణంగా ప్రేమించే టీచరమ్మ భావన పాత్రలో శ్రీనిధి శెట్టి జీవించేసింది. జెన్నిఫర్‌గా మృణాళిని మెప్పించింది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పాత్ర ఆమెది. ఇక లెక్కల స్టూడెంట్‌గా జూడీ మీనాక్షీ గోవింద్ రాజన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇంటర్‌పోల్ ఆఫీసర్ అస్లామ్‌గా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పర్వాలేదనిపించాడు. అతనికిది తొలి సినిమా. డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. రోషన్ మాథ్యూ విలనిజం బాగుంది. కానీ అతని క్యారెక్టర్‌కు ఓ గోల్ అనేది లేకుండా ఉంటుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా పనిచెప్పాల్సింది. సినిమాలో అనవసరపు సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
కోబ్రాపై భారీ అంచనాలు.. కాలేజీ యాజమాన్యానికి సెలవు కోసం విద్యార్థుల లేఖ
విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కోబ్రా. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని అజయ్ జ్ఞానమూర్తి దర్శకత్వంలో 7 స్క్రీన్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ భారీ ఎత్తున నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని భారీ అంచనాల మధ్య వినాయక చవితి రోజు బుధవారం తెరపైకి వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఇప్పటికే విశేష ఆదరణ పొందాయి. సస్పెన్ థ్రిల్లర్ యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో విక్రమ్ ఏడు విభిన్న రూపాల్లో కనిపించడం విశేషం. ఆయన నటించిన చిత్రం థియేటర్లో విడుదలై మూడేళ్లు అయ్యింది. వెరసి కోబ్రా చిత్రంపై ఇటు చిత్ర పరిశ్రమతో పాటు అభిమానుల్లోనూ చాలా ఆసక్తి నెలకొంది. దీంతో ఆ అంచనాలను పూర్తి చేయడానికి చిత్ర బృందంతో సిద్ధమయ్యారు. అందులో భాగంగా తమిళనాడులోని చెన్నై, మదురై, తిరుచ్చి, కోవై వంటి ప్రధాన నగరాల్లో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. సినీ ప్రేక్షకులు ఆయన బృందానికి బ్రహ్మరథం పట్టారనే చెప్పవచ్చు. తమిళనాడులోనే కాకుండా ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ విడుదలైంది. విక్రం హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు నగరాల్లోనూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఇంతకుముందు ఎప్పుడూ విక్రమ్ ఈ విధంగా తన చిత్రాల కోసం శ్రమించిన దాఖలాలు లేవు. మొత్తం మీద కోబ్రా చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశారు. ఎంతగా అంటే కోబ్రా చిత్రాన్ని చూడడానికి కళాశాల విద్యార్థులు కళాశాల యాజమాన్యాన్ని సెలవు అడిగేంతగా. తిరుచ్చిలోని సెయింట్ జోసెఫ్ కళాశాల విద్యార్థులు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఒక లేఖను రాశారు. అందులో కోబ్రా చిత్రాన్ని విడుదల అయిన తొలి రోజు చూడటానికి టిక్కెట్లు లభించలేదని, దీంతో ఒకటో తేదీ సినిమా చూసేందుకు సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు. ఆ రోజు తాము కళాశాలకు రాకపోతే తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయరాదని విజ్ఞప్తి చేశారు. -
విక్రమ్ 'కోబ్రా’ మూవీ స్టిల్స్
-
‘కోబ్రా’మూవీ ట్విటర్ రివ్యూ
తమిళస్టార్ చియాన్ విక్రమ్ హీరోగా, వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా’. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, మీనాక్షి , మృణాళిని హీరోయిన్లుగా నటించారు.సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా నేడు(ఆగస్ట్ 31) విడుదలైంది. దాదాపు మూడేళ్ల తర్వాత థియేటర్స్‌లో విడుదలవుతున్న విక్రమ్ సినిమా ఇది. ఇందులో పది రకాల పాత్రల్లో కనిపించబోతున్నాడు విక్రమ్. ఒక్కో పాత్ర కోసం ఐదారు గంటల పాటు మేకప్‌కే సమయం కేటాయించే వాడట. నటించడం మాత్రమే కాదు, డబ్బింగ్లోనూ ఆరు రకాల వేరియేషన్స్ చూపించాడట.సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘కోబ్రా’పై హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది.దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కోబ్రా’ కథేంటి? పది రకాల పాత్రల్లో కనిపించిన విక్రమ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు?తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. #CobraFDFS : 1st half Vera level 👏🏻👏🏻 Gripping engaging @chiyaan Is Back 🤞🏻🥁😉#ARRahman bgm 🎶😳 Hollywood level 🤩@SrinidhiShetty7 Gorgeous ❤️@mirnaliniravi@AjayGnanamuthu Master of screenplay 🔥🔥You killed it 👍🏻#cobrareview #ChiyaanVikram #CobraFromAugust31 #Cobra pic.twitter.com/izuoxF9onN — 🎞️ Kollywood ⭐️ (@KollywoodStar_) August 31, 2022 ‘కోబ్రా’ ఫస్టాఫ్ అదిరిపోయిందని, విక్రమ్‌కు కమ్‌బ్యాక్ మూవీ అని కామెంట్ పెడుతున్నారు. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. అజయ్ జ్ఞానముత్తు స్క్రీప్ప్లై బాగుందని పోస్ట్‌లు పెడుతున్నారు. కచ్చితంగా థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా అని కామెంట్ చేస్తున్నారు. #cobrareview : #Cobra 1st Half well written script by Ajay very tight screenplay unpredictable #ChiyaanVikram Performance Next Level 2022 Best Actor Awards Parcel to #Vikram 🙏🙏🙏🙏🙏 — Cobra 🐍 (@24amSherlock) August 31, 2022 అజయ్ స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని, విక్రమ్ తనదైన నటనతో అదరగొట్టేశాడని అంటున్నారు. 2022లో ఉత్తమ నటుడు అవార్డు విక్రమ్‌కే దక్కుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #COBRA Interval Marana Masss Thakali Soru #ChiyaanVikram Vera Level 🔥🔥🔥🔥🔥#Cobra Daaa Dual King Cobra#Vikram #CobraFDFS #CobraFromAugust31 #cobrareview — Cobra 🐍 (@24amSherlock) August 31, 2022 #ChiyaanVikram#cobrareview First Half 🔥🔥 With some lags... Waiting for Second half.. As usual @chiyaan sir Peaked 🔥🔥. — John Wick (@JohnWickTN82) August 31, 2022 #Cobra : 1st Half LA Irukura Questions elam 2nd Half LA Poga Poga theriya Varudhu 💥👌@Chiyaan #ChiyaanVikram #CobraReview — ᴅᴀᴠɪᴅ ᴀᴅᴀᴍ ᴄᵒᵇʳᵃ ғʳᵒᵐ ᴀᵘᵍᵘˢᵗ31 (@David_AdamCVF) August 31, 2022 #Cobra - first half Romba naal kachichi shankar Padam patha feel Super intelligient screenplay Interval twist verithanam Avoid spoilers to enjoy the thrill — Pravin (@pravin8984) August 31, 2022 #Cobra Interval 🔥🔥🔥🔥🔥 Wathaaa fireyyyyy 👌👌#ChiyanVikram is back 👌👌 Acting tharumaaru 👌@arrahman music 👌👌 So far best 👌 4/5#CobraFDFS #CobraReview pic.twitter.com/I1M7I4KyfR — Prof. H A B I L E (@almuyhi2) August 31, 2022 After long we came for movie for mind relax with a good feel... But no good feel expected at theatre..... Whether first day need more sound or second day !!! #Cobra @AjayGnanamuthu @chiyaan @7screenstudio @arrahman — Pradeep Kumar🔥NGK 🔥 (@_pradeep_91_) August 31, 2022 #COBRA Review FIRST HALF: Good 👌#ChiyaanVikram Shines & His Different Looks Are Good 👍#ARRahman's BGM & Song Elevates The Film 😇 Casting 👌 Screenplay is decent 👍 Some Lags 🙂 But, Interval Raises Expectations 🔥 Second Half Waiting 😁#CobraReview #CobraFDFS pic.twitter.com/yVMPoLK7W7 — Kumar Swayam (@KumarSwayam3) August 31, 2022 -
‘కోబ్రా’ కోసం విక్రమ్ అన్ని కోట్లు తీసుకున్నాడా?
ప్రయోగాత్మకమైన చిత్రాలకు పెట్టింది పేరు విక్రమ్ చియాన్. ప్రతి చిత్రంలోనూ విభిన్నమైన పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అబ్బురపరుస్తుంటాడు. అందుకే తమిళ హీరో అయినప్పటికీ.. తెలుగులోనూ ఆయనకు మంచి డిమాండ్ ఉంది. విక్రమ్ తాజాగా నటించిన చిత్రం ‘కోబ్రా’. దాదాపు మూడేళ్ల తర్వాత థియేటర్స్‌లో విడుదలవుతున్న విక్రమ్ సినిమా ఇది. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్ 31న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘కోబ్రా’లో నటించడానికి విక్రమ్ భారీ మొత్తంలో పారితోషికాన్ని పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం కోబ్రా సినిమాకు విక్రమ్ దాదాపు 25కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను తీసుకున్నాడట. ఈ రెమ్యూనరేషన్ సినిమా బడ్జెట్లో దాదాపుగా 22 శాతమట. (చదవండి: రూ.9 కోట్ల భారీ ఆఫర్.. అయినా ఆ యాడ్‌కు నో చెప్పిన హీరో) ఈ చిత్రంలో విక్రమ్ 10 గెటప్స్‌లో కనిపించబోతున్నాడు. అందుకోసం విక్రమ్ చలా శ్రమించాల్సి వచ్చిందట. అందుకే నిర్మాత అంతమొత్తంలో చెల్లించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక కోబ్రా సినిమా విషయానికొస్తే.. యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు.సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది. -
పైరసీలో సినిమాలు చూస్తున్నారా? ఇకపై ఆ సైట్లు పనిచేయవు!
తమిళ సినిమా: చట్ట విరోధంగా పైరసీకి పాల్పడుతున్న వెబ్సైట్లపై చెన్నై హైకోర్టు కొరడా ఝుళిపించింది. వివరాలకు వెళ్తే నటుడు విక్రమ్ కథానాయకుడుగా నటించిన కోబ్రా చిత్రం వినాయక చవితి సందర్భంగా సందర్భంగా బుధవారం విడుదల కానుంది. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నాయకిగా నటించిన ఈచిత్రంలో ఇండియన్ క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ ప్రతినాయకుడిగా నటించారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో సెవెన్ స్క్రీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. కాగా పైరసీ అరాచకం రాజ్యమేలుతున్న పరిస్థితిలో కోబ్రా చిత్ర నిర్మాత తన చిత్రం పైరసీని వ్యతిరేకిస్తూ 1788 వెబ్ సైట్లపై నిషేధం విధించాలని కోరుతూ ప్రభుత్వం, సామాజిక మాధ్యమం సేవా సంస్థల తరఫున చెన్నై హైకోర్టులో దాఖలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తి చంద్రకుమార్ రామ్మూర్తి సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది. దీంతో పిటిషనర్ తరుఫున న్యాయవాది విజయన్ సుబ్రహ్మణియన్ హాజరై వాదించారు. పలు నెలలు శ్రమించి, కోట్లలో ఖర్చు చేసి, ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిర్మాతలు చిత్రాలను విడుదల చేస్తుంటే కొన్ని వెబ్సైట్లు అక్రమంగా పైరసీకి పాల్పడుతున్నాయని, ఫలితంగా భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సినీ కార్మికుల జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. కోబ్రా చిత్రం పైరసీకి గురి కాకుండా వెబ్ సైట్లపై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి కోబ్రా చిత్రాన్ని చట్ట విరుద్ధంగా వెబ్సైట్లలో విడుదల చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. మితిమీరి ప్రచారం చేసే వెబ్సైట్లపై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. -
నా ఫొటోకి పూల దండ వేసి నేను లేనట్టు ప్రచారం చేశారు: విక్రమ్
‘‘నా ‘శివపుత్రుడు, అపరిచితుడు’ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరించారు. నేను నటనకు ఆస్కారం ఉండే పాత్రలు చేసిన ప్రతిసారీ గొప్పగా ఆదరిస్తున్నారు. అలా తెలుగువారితో నాకు గొప్ప అనుబంధం ఉంది. ‘కోబ్రా’ చిత్రంలోనూ అద్భుతమైన నటన ఉంటుంది’’ అని హీరో విక్రమ్ అన్నారు. ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్, శ్రీనిధీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘కోబ్రా’. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. కాగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కోబ్రా’ ప్రెస్మీట్లో విక్రమ్ మాట్లాడుతూ.. ‘‘మా నాన్న హెడ్మాస్టర్. ఆయన నటుడు కావాలని చెన్నై వచ్చారు. నేను మూడేళ్లకే ఓ సినిమాలో పాపగా యాక్ట్ చేశా. నాకు నటన అంటే పిచ్చి. ‘కోబ్రా’ కథ వినగానే వెంటనే సినిమా చేసేయాలనిపించింది. కోవిడ్ వల్ల సినిమా బాగా ఆలస్యం అయింది. రష్యాలో మైనస్ 40 డిగ్రీల చలిలో ఎంతో కష్టపడి షూటింగ్ చేశాం. ఈ చిత్రంలో దాదాపు పది పాత్రలు చేశాను. ఒక్కో పాత్ర మేకప్‌కి సుమారు ఐదు గంటలు పట్టేది. ‘కోబ్రా’ సైకాలాజికల్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, ఎమోషనల్ డ్రామా. ఈ సినిమా చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. నాకు తెలిసింది నటనే. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్త అనుభూతిని పంచాలని భిన్నంగా చేయడానికే ప్రయత్నిస్తా. ఇప్పటికీ తమిళ్లో టాప్ హీరోల్లో నేనూ ఒకణ్ణి. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తుండటం గర్వంగా ఉంది. యూనివర్సల్ సబ్జెక్ట్‌తో రూపొందిన ‘కోబ్రా’ ని తిరుపతి ప్రసాద్‌గారు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. ఎన్వీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కమల్ హాసన్‌గారి తర్వాత నట విశ్వరూపం చూపించే నటుడు విక్రమ్. ఆయన సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ‘కోబ్రా’ చిత్రాన్ని కూడా బాగా ఆదరించాలి’’ అన్నారు. ‘‘నా మొదటి తమిళ చిత్రం ‘కోబ్రా’. తొలి సినిమాకే విక్రమ్‌గారితో నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా’’ అన్నారు శ్రీనిధీ శెట్టి. ‘‘కోబ్రా’ లో ఇంటెన్స్, ఎమోషనల్ రోల్లో కనిపిస్తాను’’ అన్నారు నటి మృణాళినీ రవి. ‘‘కోబ్రా’ సినిమా నాకు చాలా స్పెషల్’’ అన్నారు నటి మీనాక్షి. ‘ఇటీవల నా ఆరోగ్యంపై రకరకాల పుకార్లు వచ్చాయి. మరికొందరు నా ఫొటోకి పూల దండ వేసిన ఫ్రేమ్స్ పెట్టి నేను లేనంటూ ప్రచారం చేశారు. ఆ వార్తలు చూసిన తర్వాత బాధపడి ఐదు రోజులు ఐసీయూలో ఉన్నాను’ అన్నారు విక్రమ్. -
'కోబ్రా' ప్రెస్‌మీట్ (ఫోటోలు)
-
విక్రమ్, యశ్లలో ఉన్న సేమ్ క్వాలిటీ అదే: శ్రీనిధి
చియాన్ విక్రమ్ కథానాయకుడిగా ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా'. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 31 విడుదల కానుంది. తాజాగా 'కోబ్రా' చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విక్రమ్, శ్రీ నిధి, మీనాక్షి, మృణాళిని రవి, నిర్మాత ఎన్వీ ప్రసాద్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. హీరో విక్రమ్ మాట్లాడుతూ.. సినిమా మొదలుపెట్టిన తర్వాత కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. అవన్నీ దాటుకుంటూ సినిమాను ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించాం. రష్యాలో మైనస్ డిగ్రీలలో చిత్రీకరించినప్పుడు సహాయ దర్శకులకు రక్తం కూడా వచ్చింది. చాలా కష్టపడి చేశాం. ఇర్ఫాన్ పఠాన్ మొదటి సినిమా ఇది. ఆయన సెట్స్‌కు వచ్చినపుడు నటన గురించి పెద్దగా తెలీదు. కానీ దర్శకుడు అజయ్ ట్రైన్ చేసి ఒక ప్రొఫెషనల్ నటుడిగా తీర్చిదిద్దారు. ఇంత మంచి సినిమాని తెలుగులో తిరుపతి ప్రసాద్ గారు విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. కోబ్రాని తెలుగు ప్రేక్షకులతో పాటు థియేటర్లో కలసి చూస్తా'' అన్నారు. అనంతరం మీడియా ప్రతినిధిలు అడిగిన ప్రశ్నలకు కోబ్రా చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చింది . కోబ్రా అని టైటిల్ పెట్టారు.. ఇంతకీ కథానాయకుడు విలనా ? హీరోనా? విక్రమ్: కోబ్రా ఎప్పుడు కాటేస్తుందో తెలీదు, అలాగే కోబ్రా తన చర్మాన్ని మార్చుకోగలదు. ఇందులో నా పాత్ర అలానే వుంటుంది. ప్రతి పాత్రలో విభిన్నమైన ఫెర్ఫార్మెన్స్ వుంటుంది. డబ్బింగ్ లో కూడా చాలా వేరియేషన్స్ వున్నాయి. నా కెరీర్లో చాలా సవాల్‌గా అనిపించిన సినిమా కోబ్రా. అపరిచితుడులో గొప్ప సందేశం వుంటుంది. కోబ్రాలో అలాంటి సందేశం ఏమైనా ఇస్తున్నారా? విక్రమ్: కోబ్రాలో సందేశం వుండదు కానీ లవ్, ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషనల్ డ్రామా వుంటుంది. దానికి ప్రేక్షకులు చాలా గొప్పగా కనెక్ట్ అవుతారు. ఇంత కష్టమైన పాత్రలు చేయడానికి స్ఫూర్తి ఎక్కడి నుండి వస్తుంది? విక్రమ్: నాకు నటన అంటే పిచ్చి. ఏదైనా భిన్నంగా చేయడానికే ప్రయత్నిస్తా. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్త అనుభూతిని పంచాలనేదే నా ప్రయత్నం. విక్రమ్, యశ్లలో మీరు గమనించిన గొప్ప క్యాలిటీ? శ్రీనిధి: ఇద్దరూ నటన పట్ల అంకిత భావంతో వుంటారు. విక్రమ్ ఇన్నేళ్ళుగా పని చేస్తున్నా. సెట్స్ లో చాలా హంబుల్ గా వుంటారు. విక్రమ్ సెట్స్ లో ఎలా వుంటారు ? శ్రీనిధి : చాలా సరదాగా వుంటారు. చాలా ప్రాంక్‌లు చేస్తారు. మృణాళిని: విక్రమ్ గారితో షూటింగ్ అంటే సెట్లో చాలా సీరియస్‌గా ఉంటారని అనుకున్నాను. కానీ ఆయన మాత్రం గేమ్స్ ఆడుకుంటూ ప్రాంక్స్ చేస్తూ సరదాగా కనిపించారు. నా భయం అంతా పోయింది. మీనాక్షి : విక్రమ్ గారు గ్రేట్ యాక్టర్. ఆయన సెట్స్ లో వుంటే గొప్ప ఎనర్జీ వుంటుంది. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయలేం. చదవండి: తనను నానామాటలు అన్న థియేటర్ యజమానిని నేరుగా కలిసిన రౌడీ హీరో బాయ్‌కాట్ బాలీవుడ్ వివాదంపై ఫన్నీగా స్పందించిన హీరో విక్రమ్ -
బాయ్‌కాట్ బాలీవుడ్ వివాదంపై ఫన్నీగా స్పందించిన హీరో విక్రమ్
బాలీవుడ్లో బాయ్‌కాట్ ట్రెండింగ్ నడుస్తోంది.బాలీవుడ్ స్టార్స్ ని, బాలీవుడ్ సినిమాలని వరుసపెట్టి బాయ్‌కాట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇటీవల ఆమిర్ ఖాన్ ‘లాల్‌సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’, తాప్సీ ‘దొబారా’చిత్రాలకు ఈ బాయ్‌కాట్ సెగ తగిలింది. గత గురువారం(ఆగస్ట్ 25) విడుదలైన ‘లైగర్’ని బహిష్కరించాలంటూ #BoycottLigerఅనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్వీటర్లో ట్రెండ్ చేశారు. ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద చిత్రాలన్నింటికీ ఏదో ఒక రకంగా బాయ్‌కాట్ సెగ తగిలింది. ఈ బాయ్ కాట్ వివాదంపై ఇప్పటికే పలువురు హీరోలు స్పందించారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఈ బాయ్‌కాట్ వివాదంపై కాస్త వ్యంగంగా స్పందించారు. విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం కోబ్రా చిత్రం ఆగస్ట్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో విక్రమ్ మీడియాతో ముచ్చటించారు. (చదవండి: కోబ్రా సినిమా.. చాలా ఎమోషనల్ క్యారెక్టర్ నాది: విక్రమ్) ఈ మధ్య కాలంలో బాయ్‌కాట్ మూవీస్ అంటూ పలు బాలీవుడ్ చిత్రాలను బహిష్కరించాలని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. విక్రమ్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ‘అసల్ బాయ్‌కాట్ అంటే ఏంటి? బాయ్ అంటే తెలుసు..గర్ల్ బాగా అంటే తెలుసు.. చివరకు కాట్ అంటే కూడా నాకు తెలుసు కానీ.. బాయ్‌కాట్ అనే పదమే నాకు తెలియదు’అని విక్రమ్ చెప్పుకొచ్చాడు. ఇక కోబ్రా సినిమా విషయానికొస్తే.. యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు.సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది. -
కోబ్రా సినిమా.. చాలా ఎమోషనల్ క్యారెక్టర్ నాది: విక్రమ్
చియాన్ విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోబ్రా. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈనెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో చియాన్ విక్రమ్ మాట్లాడుతూ.. 'తెలుగు ఆడియన్స్‌కి నా ఫెర్ఫర్మెన్స్ తో ఒక బంధం ఉంది.చాలా ఎమోషనల్ క్యారెక్టర్ నాది. కొవిడ్ తో షూట్ లేట్ అయ్యింది. ఒక్కొక్క మేనరిజమ్స్ చాలా ఇష్టపడి చేశాను.టెక్నికల్ సైడ్ వెరీ గుడ్ ఫిలిం.శ్రీనిధికి నాకు ఇందులో మంచి రిలేషన్ వుంటుంది. ఇది ఇంగ్లీష్ సినిమాలాగా ఉంటూ లోపల ఒక ఎమోషనల్ డ్రామాగా వుంటుంది. ట్రైలర్ చూసి ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇది యూనివర్సల్ సినిమా ..అన్ని అంశాలు ఈ సినిమాలో వున్నాయి' అని తెలిపారు. ఇక హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ..విక్రమ్‌తో సినిమా చేసే ఛాన్స్ దక్కడం అదృష్టమని, మూడేళ్ల కష్టమే ఈ సినిమా అని చెప్పింది. థియేటర్స్‌లోనే సినిమాను చూడాలని కోరింది. -
నా సినిమా థియేటర్స్‌లో విడుదలై మూడేళ్లు అయ్యింది : విక్రమ్
తమిళసినిమా: పాత్రలకు జీవం పోయడానికి ఎంతవరకైనా వెళ్లే నటుడు విక్రమ్. వైవిధ్యభరిత కథా చిత్రాల కోసం తపించే ఈయన తాజాగా నటించిన చిత్రం కోబ్రా. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో 7 స్క్రీన్ పతాకంపై ఎస్ఎస్ లలిత్‌కుమార్ నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలోని వీఆర్ మాల్లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు విక్రమ్ వారసుడు, నటుడు ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ.. తన తండ్రి విక్రమ్ నుంచి చాలా విషయాలు గ్రహించినట్లు చెప్పారు. కోబ్రా చిత్రం పెద్ద హిట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం విక్రమ్ మాట్లాడుతూ.. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఇంతకు ముందు డిమాంటీ కాలనీ, ఇమైకా నొడిగళ్ చిత్రాలను ఒక్కో జానర్లో తెరకెక్కించారన్నారు. ఈ కోబ్రా చిత్రాన్ని తనదైన శైలిలో వైవిధ్యంగా తెరపై ఆవిష్కరించారని తెలిపారు. చిత్ర పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతుండటంతో ఆయన కార్యక్రమంలో పాల్గొనలేకపోయారన్నారు. ఈయన కల్పన కథకు తామంతా సహకరించామని పేర్కొన్నారు. తాను నటించిన చిత్రాలు థియేటర్లలో విడుదలై మూడేళ్లు అయ్యిందన్నారు. సినిమా ప్రమోషన్ కోసం ఇటీవల తిరుచ్చి, మదురై, కోయంబత్తూర్ తిరిగొచ్చామని తెలిపారు. అభిమానులు తనపై చూపుతున్న అభిమానం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి తూత్తుక్కుడి, తిరునెల్వెల్లి ప్రాంతాల్లో చిత్ర ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోబ్రా చిత్రం కోసం చాలా శ్రమించామని, ఈ నెల 31వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని విక్రమ్ కోరారు. -
విక్రమ్ కోబ్రా ట్రైలర్ వచ్చేసింది.. అదిరిపోయిందంతే!
చియాన్ విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోబ్రా. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈనెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. గణిత శాస్త్రవేత్తగా విక్రమ్ కనిపించనున్నారు. ట్రైలర్‌ను బట్టి మొత్తం ఐదు ఢిపరెంట్ క్యారెక్టర్స్‌లో విక్రమ్ కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్ ,మృణాలిని రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెమమాన్ ఈ సినిమాను సంగీతం అందించారు. -
కాలాన్ని వెనక్కి తీసుకెళుతున్న హీరోలు..
కొందరు తమిళ హీరోలకు కాలం ముందుకు వెళ్లడంలేదు.. వెనక్కి వెళుతోంది. టైమ్ మిషన్ ఎక్కలేదు. మరి.. ఎలా వెనక్కి వెళ్లారంటే చారిత్రాత్మక చిత్రాలు చేస్తున్నారు. వెండితెరపై పాతకాలంలోకి వెళ్తున్నారు. ఈ పీరియాడికల్ ఫిల్మ్స్ కోసం గడియారాన్ని వెనక్కి తిప్పుతున్నారు. ఇక ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ప్రముఖ దర్శకుడు మణిరత్నం పదో శతాబ్దం నేపథ్యంలో సాగే ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా తీశారు. కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. పదో శతాబ్దంలో చోళుల పాలన, రాజనీతి, యుద్ధనీతి వంటి అంశాల ఆధారంగా ‘పొన్నియిన్ సెల్వన్’ సాగుతుంది. ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలు పోషించారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాది సెప్టెంబరు 30న విడుదల కానుంది. కాగా ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంతో పాటు మరో పీరియాడికల్ ఫిల్మ్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విక్రమ్. పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ ఓ సినిమా చేయనున్నారు. 18వ శతాబ్దపు కథతో సాగనుందని కోలీవుడ్ టాక్. ఇక హీరో సూర్య కూడా పీరియాడికల్ ఫిల్మ్స్‌లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్’ సినిమాలో నటిస్తున్నారు. జల్లికట్టు నేపథ్యంలో సాగే ఈ చిత్రం 18వ శతాబ్దపు నేపథ్యంలో ఉంటుంది. కాగా హీరో సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్లో వచ్చిన ‘సూరరై పోట్రు’ హిట్ సాధించిన విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్లో మరో సినిమా రానుంది. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. అయితే ప్రస్తుతం బాల దర్శకత్వంలో ‘అచలుడు’, శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు సూర్య. ఈ రెండు చిత్రాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే సూర్య చేయాల్సిన పీరియాడికల్ ఫిల్మ్ప్ పూర్తి స్థాయిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు ‘కెప్టెన్ మిల్లర్’ అనే పీరియాడికల్ ఫిల్మ్ చేస్తున్నారు ధనుష్. 1930–1940ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ధనుష్ హీరోగా నటించాల్సిన మరో చిత్రం ‘అయిరత్తిల్ ఒరువన్ 2’. చోళ సామ్రాజ్యానికి సంబంధించిన అంశాల పరిశోధనల నేపథ్యంలో 2010లో వచ్చిన ‘అయిరత్తిల్ ఒరువన్’ (తెలుగులో ‘యుగానికి ఒక్కడు’) చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందనుంది. అయితే తొలి భాగంలో కార్తీ హీరోగా నటించగా, మలి భాగంలో ధనుష్ హీరోగా నటిస్తారు. సీక్వెల్లో కార్తీ పాత్ర కూడా ఉంటుందనే వార్తలు వచ్చాయి. ఇక తొలి భాగానికి దర్శకత్వం వహించిన సెల్వ రాఘవన్‌నే సీక్వెల్‌నూ తెరకెక్కించనున్నారు. కాగా తమిళ, తెలుగు భాషల్లో ధనుష్ ‘సార్’ (తమిళంలో ‘వాత్తి’) సినిమా చేస్తున్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా కథ 2000 నేపథ్యంలో సాగతుందట. ఇంకోవైపు తమిళ హీరో శివ కార్తికేయన్ ‘మహావీరన్’ (తెలుగులో ‘మహావీరుడు’) అనే సినిమా చేస్తున్నారు. టైటిల్‌ని బట్టి ఇది కూడా పీరియాడికల్ ఫిల్మ్ అయ్యుండొచ్చు. మరి కొందరు తమిళ హీరోలు కూడా పీరియాడికల్ ఫిల్మ్స్ కోసం కొత్త కథలు వింటున్నారు. -
విభిన్న పాత్రల్లో విక్రమ్.. ఆసక్తిగా ‘కోబ్రా’ టీజర్
చియాన్ విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన చిత్రం ‘కోబ్రా’. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 31న థియేటర్లోకి రాబోతోంది. ఇక ప్రమోషన్స్ పోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను రిలీజ్ చేసంది. ఇందులో ‘కోబ్రా.. లెక్కలతో నేరాలను చాలా తేలికగా చేస్తున్నాడు’ అనే డైలాగ్ ఆసక్తిగా ఉంది. ఈ ఇందులో చియాన్ విభిన్న పాత్రల్లో కనిపించి మరోసారి ఫ్యాన్స్ ఫిదా చేయబోతున్నాడు. చదవండి: పెళ్లిపై ఆసక్తి లేదు.. కానీ బాయ్‌ఫ్రెండ్ కావాలి: సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్ ఇక ఇందులో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పలు కీలక సన్నివేశాల్లో కనిపించాడు. ఇక టీజర్ చూస్తుంటే లెక్కల మాస్టర్‌గా కోబ్రా అన్యాయాన్ని ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ కథ అని అర్థమవుతోంది. 7 స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని, రవి, కేఎస్ రవికుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ముఖ్యపాత్రలో సందడి చేయనున్నారు. ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. చదవండి: లైగర్ మూవీ ఫ్లాప్ అయితే? విలెకరి ప్రశ్నకు విజయ్ షాకింగ్ రియాక్షన్ -
Cobra Movie: కోబ్రా వచ్చేది అప్పుడే
ఈ నెలాఖర్లో థియేటర్స్‌కు వస్తున్నాడు ‘కోబ్రా’. విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన చిత్రం ‘కోబ్రా’. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించారు. మంగళవారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలియజేసింది. తెలుగులో ‘కోబ్రా’ చిత్రం హక్కులను నిర్మాత ఎన్వీ ప్రసాద్ దక్కించుకున్నారు. ‘‘ఈ చిత్రంలో గణిత మేథావి పాత్రలో విక్రమ్ కనిపిస్తారు. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ కీలక పాత్ర పోషించారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్. -
పొన్నియన్ సెల్వన్ నుంచి ఫస్ట్‌సాంగ్ అవుట్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్
ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1’. పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 30న ఈ మూవీ ఐదు(తెలుగు,తమిళం, మలయాళం, హిందీ, కన్నడ) భాషల్లో విడుదల కానుంది. మూవీ ప్రమోషన్లను వేగవంత చేసిన చిత్ర బృందం ఇప్పటికే ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేయగా.. వీటికి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. చదవండి: సినిమా రిలీజ్ కాదన్నారు.. వారం క్రితం ఏడ్చేశాను: నిఖిల్ ‘పొంగే నది పాడినది’ అంటూ సాగే ఈ పాట సింగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను ఏఆర్ రెహమాన్, ఏఆర్ రైహానా, బాంబా బక్యా ఆలపించారు. కాగా ఈ సినిమాకు ఏఆర్ రహామాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. కాగా మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్‌పై సుభాస్కరన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కేజీయఫ్ 3లో ‘రాఖీభాయ్ ’కాకుండా మరో హీరో!
కేజీయఫ్ అనగానే కళ్లముందుకు రాఖీభాయ్ వచ్చేస్తాడు. సలాం రాఖీభాయ్ అనే కటౌట్ కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో హై వోల్డేజ్ ఎలివేషన్స్ కనిపిస్తాయి. ఇప్పటికీ రెండు భాగాలు వస్తే.. రెండింటినీ సూపర్ డూపర్ హిట్ చేశారు ప్రేక్షకులు. కేజీయఫ్2 అయితే ఊహించని స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇదే జోష్‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్, కన్నడ హీరో యశ్ మూడో భాగాన్ని తీసుకొస్తారని కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు కేజీయఫ్ ఫ్యాన్స్. ఈసారి రాఖీ భాయ్ మరింత రెచ్చిపోతాడని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. కేజీయఫ్3 లో రాఖీభాయ్ కాకుండా మరో హీరో నటించబోతున్నాడు. పార్ట్ 3లోకి చియాన్ విక్రమ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రీసెంట్ గా తమిళ దర్శకుడు పా. రంజిత్ తో కొత్త సినిమాను ప్రారభించాడు విక్రమ్. త్రీడీ ఫార్మాట్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. 1800 సంవత్సరంలో దళితులపై జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కుతోంది. అది సరే, ఈ సినిమాకు, కేజీయఫ్ కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా... ఇండిపెన్డెన్స్కు ముందు నరాచిలో జరిగిన ఆచారకాలపైనే పా.రంజిత్ దృష్టిపెడుతున్నాడని సమాచారం. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేజీయఫ్ లో ఏం జరిగింది అనేది ప్రశాంత్ నీల్ చూపించాడు. ఇప్పుడు స్వాతంత్య్రం రాకముందు కేజీయఫ్ లో ఏం జరిగింది అనేది పా.రంజిత్ చూపించబోతున్నాడట. (చదవండి: పుష్ప-2లో పాపులర్ బాలీవుడ్ నటుడు) మరోవైపు కేజీయఫ్ 3 పై ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. త్వరలోనే పార్ట్ 3తో తిరిగొస్తామని అభిమానులకు మాట ఇచ్చాడు. అయితే అందుకు కొంత సమయం పడుతుంది. ముందు ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సలార్ పూర్తి కావాల్సి ఉంది. ఆ తర్వాత టైగర్ తో ప్లాన్ చేస్తోన్న మూవీ కంప్లీట్ కావాలి. ఆ తర్వాతే కేజీయఫ్ 3 తీసుకొస్తానంటున్నాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ లోపే విక్రమ్ కేజీయఫ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. -
‘నేషనల్ క్రష్’ రష్మిక హావా.. కోలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్!
కన్నడ బ్యూటీ రష్మిక హవా తగ్గేదేలే అన్నట్లుగా సాగుతోంది. టాలీవుడ్ ఈ అమ్మడికి స్టార్ డమ్‌ను తీసుకొస్తే దాన్ని కోలీవుడ్, బాలీవుడ్‌లు క్యాష్ చేసుకునే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. పుష్ప చిత్రంతో తెలుగుతో పాటు, తమిళం, హిందీ ప్రేక్షకుల గుండెల్లోనూ చోటు సంపాదించుకున్న రష్మిక క్రేజ్ పెరిగిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో విజయ్ నటిస్తున్న వారీసు చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో పుష్ప- 2లోనూ నటించనుంది. ఇక హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రష్మికకు తాజాగా కోలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ తలుపు తట్టిందనే ప్రచారం జరుగుతోంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. నటుడు విక్రమ్‌తో జతకట్టించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. దీన్ని స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్ రాజా నీలం ప్రొడక్షన్‌తో కలిసి నిర్మిస్తున్నారు. జయ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ భారీ చిత్రంలో కథానాయకగా నటి రష్మికను సంప్రదించి చర్చలు జరిపినట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి రష్మిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికి. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని చిత్రవర్గాల నుంచి సమాచారం. చదవండి: మహేశ్ సినిమాలో ఆ పాత్రను అయిష్టంగానే చేశా: ప్రకాశ్ రాజ్ -
వివాదంలో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’, కోర్టు నోటీసులు
ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1’. పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 30న ఈ మూవీ ఐదు(తెలుగు,తమిళం, మలయాళం, హిందీ, కన్నడ) భాషల్లో విడుదల కానుంది. నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఫస్ట్‌లుక్, టీజర్లను వరుసగా రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇక రీసెంట్గా విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చదవండి: Nayanthara: నయనతార షాకింగ్ రెమ్యూనరేషన్.. ఒకేసారి అన్ని కోట్లా..? ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం వివాదంలో నిలిచినట్లు తెలుస్తోంది. ఈ టీజర్‌లోని పలు సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మణిరత్నం, హీరో విక్రమ్‌కు కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ చిత్రంలో చోళులను, చోళ రాజవంశం గురించి తప్పుగా చూపించారని సెల్వం అనే న్యాయవాది ఆరోపిస్తు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీజర్లో ఆదిత్య కరికాలన్(విక్రమ్ పోషించిన పాత్ర) నుదిటిపై తిలకం లేదని ఎత్తి చూపారు. కానీ, విక్రమ్‌కు సంబంధించిన పోస్టర్లో మాత్రం తిలకం ఉన్నట్లుగా చూపించారు. ఈ సినిమాలో చోళులను తప్పుగా చూపించారని ఆయన ఆరోపించారు. Welcome the Chola Crown Prince! The Fierce Warrior. The Wild Tiger. Aditya Karikalan! #PS1 🗡@madrastalkies_ #ManiRatnam pic.twitter.com/UGXEuT21D0 — Lyca Productions (@LycaProductions) July 4, 2022 చారిత్రక వాస్తవాలను చూపించడంలో దర్శక-నిర్మాతలు విఫలయ్యారేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక దీనిపై స్పష్టత రావాలంటే సినిమాను విడుదలకు ముందే ప్రత్యేకంగా ప్రదర్శించాలని లాయన్ సెల్వం తన పటిషన్లో డిమాండ్ చేశారు. ఈ కోర్టు నోటీసులపై దర్శకుడు మరణిరత్నం కానీ, విక్రమ్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా పొన్నియన్ సెల్వెన్‌ను రూపొందింది. ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, ప్రభు, శోభితా ధూలిపాల, ఐశ్వర్య లక్ష్మిలు కీ రోల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
ఒక్క పాట కోసం 300 మంది డ్యాన్సర్లు.. 25 రోజులు చిత్రీకరణ
Ponniyin Selvan: 25 Days Shoot With 300 Dancers: ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. ఈ చిత్రం పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా రూపొందింది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో విక్రమ్, కార్తీ ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఇదివరకు సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర అప్డేట్ తెలిసింది. భారీ చారిత్రక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక పాటను సుమారు 300 మంది డ్యాన్సర్స్‌తో చిత్రీకరించారు. ఈ 300 మంది డ్యాన్సర్స్‌తో సుమారు 25 రోజులపాటు షూటింగ్ చేశారని సమాచారం. ఈ డ్యాన్సర్స్‌లో 100 మందిని ప్రత్యేకంగా ముంబై నుంచి రప్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 30న వరల్డ్‌వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో -
కోబ్రా ఆడియో లాంచ్‌లో విక్రమ్ సందడి, పుకార్లపై ఫన్నీ రియాక్షన్
తమిళ హీరో చియాన్ విక్రమ్ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గత శుక్రవారం ఆయనకు ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో చికిత్స నిమిత్తం ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. అక్కడ రెండు రోజుల పాటు ఐసీయూలో చికిత్స తీసుకున్న ఆయన శనివారం డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడ ఉంది. అయితే మొదట ఆయనకు గుండెపోటు వచ్చిందంటూ తమిళ మీడియా, వెబ్సైట్లలో కథనాలు వచ్చాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గరయ్యారు. చదవండి: సమంత యశోద మూవీ షూటింగ్ పూర్తి, రిలీజ్ డేట్ ఖరారు ఇక ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను కావేరి ఆస్పత్రి వైద్యులు, ఆయన తనయుడు ధృవ్ కొట్టిపారేశారు. ఆయనకు గుండెపోటు రాలేదని, చాతి భాగంలో స్వల్స అస్వస్థత కారణంగా ఆస్పత్రికి వచ్చినట్లు వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పిల్చుకున్నారు. ఇదిలా ఉంటే నిన్న(జూలై 11న) జరిగిన కోబ్రా మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్లో విక్రమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ఆరోగ్యంపై వచ్చిన పుకార్లపై స్పందించాడు. స్టేజ్‌పై మాట్లాడుతుండగా విక్రమ్ తన చాతిపై చేయి వేసుకున్నాడు. దీంతో ‘నాకు తెలియకుండానే చాతిపై చేయి వేసుకున్నాను. దీన్ని కూడా గుండెపోటు అంటారేమో’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. చదవండి: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది: సాయి పల్లవి అనంతరం రీసెంట్గా తన ఆరోగ్యంపై వచ్చిన వార్తలన్ని పుకార్లేనన్నారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. తనకు వచ్చింది గుండెపోటు కాదని స్పష్టం చేసేందుకే కోబ్రా ఆడియో లాంచ్‌కు వచ్చానని విక్రమ్ చెప్పారు. అంతేకాక కాస్తా అస్వస్థతగా అనిపించడంతో హాస్పిటల్‌కు వెళ్లానన్నారు. ఇక తనపై చూపించిన ప్రేమకు ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపాడు విక్రమ్. కాగా విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు యాక్షన్ ఎంటర్టైనర్గా కోబ్రాను తెరకెక్కించారు. ఈ మూవీ ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కాగా ఇందులో ‘కేజీయఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా.. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్‌గా కనిపించనున్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #ChiyaanVikram about the rumours about him..😅#CobraAudioLaunch #Cobrapic.twitter.com/7GQ08WD5Ry — Laxmi Kanth (@iammoviebuff007) July 11, 2022 -
ఆస్పత్రి నుంచి హీరో విక్రమ్ డిశ్చార్జి.. పాత వీడియో వైరల్ చేస్తున్న ఫ్యాన్స్
విలక్షణ నటుడు, తమిళ హీరో చియాన్ విక్రమ్ ఇటీవల ఆస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం ఆయనకు ఛాతిలో నొప్పిగా అనిపించడంతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. అక్కడ రెండు రోజుల పాటు ఐసీయూలో చికిత్స తీసుకున్న ఆయన డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే మొదట ఆయనకు గుండెపోటు వచ్చిందంటూ తమిళ మీడియా, వెబ్సైట్లలో కథనాలు వచ్చాయి. దీంతో విక్రమ్ ఆరోగ్యంపై ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కోలుకుని పూర్తి ఆరోగ్యం తిరిగి రావాలని ప్రార్థించారు. చదవండి: ది వారియర్ షూటింగ్లో దర్శకుడితో కాస్త ఇబ్బంది పడ్డా: కృతిశెట్టి అయితే ఈ వార్తలను కావెరీ ఆస్పత్రి వైద్యులు, ఆయన తనయుడు ధృవ్ కొట్టిపారేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఛాతిలో కాస్తా ఇబ్బందిగా అనిపించడంతో ఆయన ఆస్పత్రికి వచ్చారని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే శనివారం డిశ్చార్జయిన ఆయన.. ఇంటి నుంచి ఓ వీడియో రిలీజ్ చేశారని, ఇందులో ఆయన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అది తాజా వీడియో కాదని తెలుస్తోంది. విక్రమ్ తన బర్త్ సందర్భంగా 2017లో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇది. తనకు శుభాకాంక్షలు తెలిపిన ఫ్యాన్స్‌కు విక్రమ్ ధన్యవాదాలు చెప్పిన వీడియోను కొందరు ఫ్యాన్స్, నెటిజన్లు రిపోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. చదవండి: లక్కీ చాన్స్ చేజార్చుకున్న కీర్తి సురేశ్? ట్రోల్ చేస్తున్న నెటిజన్లు! ఈ వీడియోతో విక్రమ్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు అభిమానులు చెక్ పెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆయన కోలుకున్నారని, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియోలు విక్రమ్ ‘హాయ్ పీపుల్.. ఓ మై గాడ్ ఎంత ప్రేమ, ఎంత అభిమానం. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు నేను ఫిదా అయ్యాను. థ్యాంక్యూ ఎవ్రీవన్’ అని చెప్పుకొచ్చారు. ఏదేమైన ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడ ఉన్నట్లు కావేరి ఆస్పత్రి వైద్యులు తెలిపిన సంగతి తెలిసిందే. శనివారం సాయంత్రం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. -
‘పొన్నియన్ సెల్వన్’.. మణిరత్నం కోసం రంగంలోకి కమల్
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 1955లో కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30న తెలుగు, హిందీ తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. చదవండి: ‘విక్రమ్’ మేకింగ్ వీడియో చూశారా?.. డైరెక్టర్ ఫోకస్‌కు నెటిజన్లు ఫిదా! ఇక మూవీ ప్రమోషన్లో భాగంగా ఇందులోని ప్రధాన పాత్రలకు సంబంధించిన లుక్‌ను ఒక్కొక్కొటిగా విడుదల చేస్తూ మూవీపై అంచనాలను పెంచుతోంది చిత్ర బృందం. అయితే ఈ సినిమా ప్రధాన పాత్రలకు సంబంధించిన పలు సన్నివేశాలను అక్కడక్కడా కలుపుతూ వాయిస్ ఓవర్ ఉంటుందట. అయితే తమిళంలో ఈ స్పెషల్ సీన్స్‌కు కమల్‌తో వాయిస్ ఓవర్ ఇప్పిస్తున్నాడు మణిరత్నం. అంతేకాదు ఇతర భాషల్లో కూడా ఆయా స్టార్‌ను ఎంచుకుని వాయిస్ ఓవర్ చెప్పించేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళంలో కమల్ చెబితే బాగుటుందని మూవీ టీం భావిస్తోందట. -
విడుదలకు సిద్ధమైన విక్రమ్ ‘కోబ్రా’.. ఆ రోజే రిలీజ్
నటుడు విక్రమ్ కోబ్రాగా బుసలు కొట్టడానికి సిద్ధం అవుతున్నారు. పాత్ర కోసం ఎంతకైనా సిద్ధమయ్యే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్.. పితామగన్, ఐ, అపరిచితుడు, మహాన్ వంటి చిత్రాల్లో తన పాత్ర కోసం ఎంతో శ్రమించారు. తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం ఈయన నైజం. అలా మరోసారి కోబ్రా చిత్రంలో కొత్త గెటప్‌లతో తనదైన నటనతో అబ్బురపరచడానికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. చదవండి: Priya Anand: 'నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా' అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ఎంఎస్ లలిత్ కుమార్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ఇది. కేజీయఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నాయకిగా నటించిన ఇందులో ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ ముఖ్యపాత్రలో నటించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ తమిళనాడులో విడుదల చేయనుంది. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న కోబ్రా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
అంతా ఆమెను మర్చిపోడానికే అంటున్న విక్రమ్.. ఆసక్తిగా టీజర్
Ponniyin Selvan Part 1 Teaser Released: స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. ఈ చిత్రం పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా రూపొందింది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1' తెలుగు టీజర్ సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేయగా, హిందీలో అమితాబ్ బచ్చన్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో సూర్య, కన్నడలో రక్షిత్ శెట్టి రిలీజ్ చేశారు. టీజర్లో పోరాట ఘట్టాలు, నటీనటుల నటన ఆకట్టుకుంది. 'ఈ కల్లు, పాట, రక్తం, యుద్ధం అంతా దాన్ని మర్చిపోడానికే. ఆమెను మర్చిపోడానికి, నన్ను నేను మర్చిపోడానికి' అంటూ విక్రమ్ చెప్పే డైలాగ్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్. రెహమాన్ సంగీతం అందించనున్నారు. 'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1' మూవీ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. From one of my favourite directors... #ManiRatnam sir! Thrilled to launch the Telugu teaser of #PonniyinSelvan1. Really looking forward to the film!https://t.co/Vepx93uY1z — Mahesh Babu (@urstrulyMahesh) July 8, 2022 -
విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల..
Chiyaan Vikram Health Bulletin Released: స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఆసుపత్రి పాలయ్యారు. శుక్రవారం (జులై 8) మధ్యాహ్నం విక్రమ్ అస్వస్థతకు గురికాడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఛాతీలో నొప్పి కారణంగానే విక్రమ్ ఆస్పత్రికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. నిపుణలైన వైద్యులతో చికిత్స అందించినట్లు ఆస్పత్రి యాజామాన్యం పేర్కొంది. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, రోజంతా వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, శనివారం ఉదయం డిశ్చార్జ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే విక్రమ్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై విక్రమ్ తనయుడు ధృవ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. దీనికి సంబంధించిన పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. విక్రమ్‌కు గుండెపోటు వచ్చిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపాడు. ఈ పోస్ట్‌లో 'ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులరా, నాన్నకు ఛాతీలో కొద్దిపాటి నొప్పికారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు రాలేదు. ఈ పుకార్లు విని మేము చాలా బాధపడ్డాం. ఈ సమయంలో మా కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం. మా చియాన్ ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు' అని పేర్కొన్నాడు. మరోవైపు విక్రమ్ ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా నేడు (జులై 8) సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన 'పొన్నియిన్ సెల్వన్' టీజర్ లాంచ్‌కి విక్రమ్ హాజరు కావాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు విక్రమ్ కోబ్రా సినిమాలో కూడా నటిస్తున్నాడు. -
Ponniyin Selvan: యుద్ధవీరుడు కరికాలన్ గా విక్రమ్.. ఫస్ట్‌లుక్ వైరల్
పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా రూపొందిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి ప్రధాన తారలుగా నటించారు. ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్ నటిస్తున్నట్లుగా చిత్రబృందం ప్రకటించింది. అలాగే ‘చోళ కీరట రాజు. భయంకరమైన యుద్ధవీరుడు, ది వైల్డ్ టైగర్’ అంటూ విక్రమ్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇక ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలోని తొలి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. శరత్‌కుమార్, ప్రభు, పార్తిబన్, ప్రకాశ్‌రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
పొన్నియిన్ సెల్వన్: చోళులు వచ్చేస్తున్నారు
మణిరత్నం సినిమా వస్తుందంటే చాలు సినీప్రియుల అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. వారి అంచనాలకు తగ్గట్టుగానే సినిమాలు తెరకెక్కిస్తుంటాడీ డైరెక్టర్. ప్రస్తుతం ఆయన పొన్నియిన్ సెల్వన్ సినిమా చేస్తున్నాడు. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ రెండు విభాగాలుగా తెరకెక్కనుంది. తాజాగా శనివారం నాడు ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజైంది. చోళులు వస్తున్నారు అంటూ ఈ వీడియోలో రాసుకొచ్చారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం నిర్మించిన ఈ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30న విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. Look out! Brace yourself. Get ready for an adventure filled week! The Cholas are coming! #PS1 🗡 @LycaProductions #ManiRatnam pic.twitter.com/9Ovj3I8GXW — Madras Talkies (@MadrasTalkies_) July 2, 2022 చదవండి: అందుకే పెళ్లి చేసుకోలేదు.. నా పిల్లలు కారణం కాదు: స్టార్ హీరోయిన్ జనవరి టు జూన్.. ఫస్టాఫ్‌లో అదరగొట్టిన, అట్టర్ ఫ్లాప్ అయిన చిత్రాలివే!