![Chiyaan Vikram Severely Injured in Thangalaan Shooting - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/3/Chiyaan-Vikram.jpg01.jpg.webp?itok=P5WYZ8zs)
తమిళ స్టార్ హీరో విక్రమ్ షూటింగ్ సెట్‌లో తీవ్రంగా గాయపడ్డారు. తంగలాన్ సినిమా చిత్రీకరణ సమయంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు విక్రమ్ పక్కటెముక విరిగినట్లు గుర్తించారు. అతడికి ఆపరేషన్ చేయాలని తెలిపారు. ఈ ప్రమాద విషయాన్ని ఆయన మేనేజర్ సూర్యనారాయణ్ ధ్రువీకరించారు. తంగలాన్ షూటింగ్‌కు ముందు రిహార్సల్ చేస్తుండగా విక్రమ్ గాయపడ్డారని తెలిపారు.
కొద్ది రోజులపాటు ఆయన షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వస్తుందన్నారు. అయితే అతి త్వరలోనే కోలుకొని విక్రమ్ మళ్లీ షూటింగ్ కు హాజరవుతారని వెల్లడించారు. మరోవైపు ఇటీవల విడుదలైన పొన్నియన్ సెల్వన్ రెండో భాగం ఘన విజయాన్ని అందుకోవడంతో ఆనందంలో ఉన్న విక్రమ్ అభిమానులు... విక్రమ్ గాయపడ్డారనే విషయం తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
కాగా తంగలాన్ సినిమాకు కబాలి డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాళవిక మోహన్, పార్వతి మీనన్, పశుపతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడికల్ ఫిలింగా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం అతడు ప్రోస్తటిక్ మేకప్ వేసుకుంటున్నాడు. తమిళ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ తంగలాన్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
చదవండి: రష్మికతో డేటింగ్.. స్పందించిన బెల్లంకొండ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment