కోబ్రాతో నటుడు విక్రమ్‌కు సంబంధం ఉంటుందంటున్నారు దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు. పాత్రలకు జీవం పోయడానికి ఎంతవరకైనా వెళ్లే నటుడు చియాన్ విక్రమ్. ఇంతకు ముందు గడికారం కొండాన్ చిత్రం కోసం సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌కు మారిన ఈయన తాజాగా బుసలు కొట్టే కోబ్రానే మెడలో వేసుకుంటున్నా రు. అవును విక్రమ్ నటిస్తున్న 58వ చిత్రానికి అజయ్‌జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈయన ఇంతకు ముందు డిమాంటీ కాలనీ, నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఇమైకా నొడిగళ్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా విక్రమ్ కథా నాయకుడిగా భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆయన పలు గెటప్‌లలో కనిపించనున్నారనే ప్రచారం ఇప్పటికే వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో విక్రమ్‌కు జంటగా నటి శ్రీనిధిశెట్టి నటిస్తోంది. దర్శకుడు కేఎస్.రవికుమార్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని సెవన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్‌కుమార్ నిర్మిస్తున్నారు. దీనికి కోబ్రా అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ సగం వరకు పూర్తయింది. ఈ సందర్భంగా విక్రమ్ చిత్రానికి కోబ్రా అనే టైటిల్‌ను నిర్ణయించడం గురించి దర్శకుడు వివరిస్తూ ఇందులోని విక్రమ్ పాత్రకు కోబ్రా అనే పాముకు మధ్య చాలా సంబంధం ఉంటుందన్నారు. ఈ విషయం చిత్రం చూసిన తరువాత ప్రేక్షకులు గ్రహిస్తారని అన్నారు. అందుకే చిత్రానికి కోబ్రా అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిపారు.
తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ రూపొందిస్తున్నట్లు చెప్పారు. అన్ని భాషలకు టైటిల్ కామన్‌గా ఉంటుందని కోబ్రాను నిర్ణయించినట్లు తెలిపారు. 50 శాతం చిత్ర పని పూర్తి అయిందని, తదుపరి షూటింగ్‌ను జనవరి చివరి నుంచి రష్యా, ఐరోపా దేశాల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. చిత్ర షస్ట్‌లుక్ పోస్టర్‌ను జనవరి 28న విడుదల చేయనున్నట్లు తెలిపారు. పాటలను ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే చిత్రంలోని మూడు పాటలు పూర్తయ్యాయని, మరో రెండు పాటల రికార్డింగ్ జరగాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment