ఓటీటీలో మూవీ హిట్‌, ఆనందానికి అవధుల్లేవంటున్న హీరో | Chiyaan Vikram About Mahaan Movie Success | Sakshi
Sakshi News home page

Mahaan Movie: ప్రతి సీన్‌ నా మనసులో ఉండిపోయింది: హీరో

Published Sat, Apr 2 2022 10:20 AM | Last Updated on Sat, Apr 2 2022 11:19 AM

Chiyaan Vikram About Mahaan Movie Success - Sakshi

ఇష్టపడి చేసిన సినిమా విజయవంతం అయితే ఆ ఆనందానికి ఆవధులు ఉండవని నటుడు విక్రమ్‌ అన్నారు. విక్రమ్‌ తన కుమారుడు ధృవ్‌ విక్రమ్‌తో కలిసి నటించిన చిత్రం మహాన్‌. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.లలిత్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అయ్యి విశేష ఆదరణ అందుకుంది.

ఈ సందర్భంగా విక్రమ్‌ శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. మహాన్‌ చిత్రాన్ని ఎంతో ఇష్టంగా చేశానని తెలిపారు. ప్రతి సన్నివేశం ఇప్పటికీ తన మనసులో స్వీట్‌ మెమోరీగా ఉండిపోయిందన్నారు. ఈ సినిమా విజయం సాధించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ధృవ్‌ విక్రమ్‌ తన ప్రతిభను నిరూపించుకున్నాడని కొనియాడారు.

చదవండి: తెలుగులో పరిచయం కానున్న పర భాష హీరోయిన్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement