
మణిరత్నం సినిమాలో నటించే ఛాన్స్ చేజారడంతో రెండు నెలలు ఏడ్చానంటున్నాడు హీరో చియాన్ విక్రమ్. బొంబాయి సినిమాలో నటించే ఛాన్స్ ఫస్ట్ తనకే వచ్చిందని, కానీ మిస్సయిందని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ మాట్లాడుతూ.. నాకు బొంబాయి సినిమా ఆఫర్ వచ్చింది. ఆడిషన్‌కు కూడా వెళ్లాను.
ప్రతి ఒక్కరి కల
కాకపోతే అక్కడ ఒక వీడియో కెమెరాకు బదులు స్టిల్ కెమెరా ముందు పెట్టి నటించమన్నాడు. నీ ముందు ఒక అమ్మాయి పరిగెడుతుంది. తనను చూస్తూ ఉండిపోవాలన్నాడు. నాకేం అర్థం కాలేదు. అక్కడ వీడియో కెమెరానే లేనప్పుడు నేనెందుకు నటించాలన్నట్లు ఊరికనే నిలబడ్డాను. దీంతో ఆ మూవీలో నన్ను సెలక్ట్ చేయలేదు. మణిరత్నంతో సినిమా చేయాలన్నది ప్రతి ఒక్క నటుడి కల.
ఇంకేం వద్దనుకున్నా..
ఆయనతో ఒక్క సినిమా చేసి రిటైర్ అయిపోయినా చాలనుకున్నాను. అంతకంటే ఎక్కువ ఏదీ ఆశించలేదు. ఉదయం మనీషా కొయిరాలా ఫోటోషూట్, సాయంత్రం నాది. కానీ ఇంతలోనే అంతా బెడిసికొట్టింది. రెండునెలలపాటు ఏడుస్తూనే ఉన్నాను. అయ్యో, మణిరత్నం సినిమా చేజారిపోయిందేనని బాధపడుతూనే ఉన్నాను.
ప్రతీకారం తీర్చుకున్నా
తర్వాత బొంబాయి మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో హిట్టయింది. అయితే తర్వాత మాత్రం ఆయనతో రెండు సినిమాలు తీసి ప్రతీకారం తీర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా విక్రమ్ తర్వాత మణిరత్నం డైరెక్షన్‌లో రావన్, పొన్నియన్ సెల్వన్ సినిమాలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment