పదేళ్లుగా ఆయన్ను ప్రేమిస్తూనే ఉన్నా: సాయి పల్లవి | Sai Pallavi Is In Love With Abhimanyu | Sakshi
Sakshi News home page

పదేళ్లుగా ఆయన్ను ప్రేమిస్తూనే ఉన్నా: సాయి పల్లవి

Published Mon, Sep 2 2024 2:21 PM | Last Updated on Mon, Sep 2 2024 3:22 PM

Sai Pallavi Is In Love With Abhimanyu

చిత్రపరిశ్రమ హీరోయిన్‌లలో ఒక్కొక్కరిది ఒక్కో పాలసీ. కొందరు కేవలం గ్లామర్‌ను మాత్రమే నమ్ముకుని పైకి వచ్చినవారు ఉన్నారు. మరికొందరు నటనా ప్రతిభనే  నమ్ముకుంటారు. వీరు గ్లామర్‌ జోలికి అస్సలు వెళ్లరు. ఇలాంటి కేటగిరీకి చెందిన నటినే సాయిపల్లవి. ఈ అచ్చ తమిళ అమ్మాయి వైద్యవృత్తిలో  పట్టభద్రురాలు. అయినా నటనపై ఆసక్తి. దీంతో డాన్స్‌లో శిక్షణ పొంది మొదట్లో చిన్నచిన్న పాత్రలు పోషిస్తూ టీవీ కార్యక్రమాల్లోనూ పాల్గొనేవారు. అలా అనుకోకుండా మలయాళంలో ప్రేమమ్‌ చిత్రంలో ముగ్గురు కథానాయకిల్లో ఒకరిగా నటించే అవకాశం వరించింది. ఆ చిత్రంలో తన నటనతో మలయాళ చిత్ర పరిశ్రమనే కాకుండా దక్షిణాది సినిమానే ఆకట్టుకున్నారు. 

అలా కథానాయకిగా ప్రారంభమైన సాయిపల్లవి కెరియర్‌ ఇప్పుడు బాలీవుడ్‌ వరకు వెళ్లింది. ముఖ్యంగా తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు చేసిన ఈమె నెక్ట్స్‌ డోర్‌ అమ్మాయిగా ఇమేజ్‌ను తెచ్చుకున్నారు. అందాల ఆరబోతతో కాకుండా అభినయంతోనే రాణిస్తున్న అతికొద్ది మంది నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. నిజం చెప్పాలంటే పెద్దగా మేకప్‌ కూడా వేసుకోరు. అంత సహజత్వంతో కూడిన నటనతో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తమిళంలోకి వడచెన్నై చిత్రంతో తెరంగేట్రం చేసిన సాయిపల్లవి ఆ తరువాత సూర్యకు జంటగా ఎన్‌జీకే చిత్రంలో నటించారు. ఈమె నటించిన గార్గి చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈమె శివకార్తికేయన్‌ సరసన నటించిన అమరన్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదేవిధంగా తెలుగులో నాగచైతన్యకు జంటగా తండేల్‌ చిత్రంలో, హిందీలో రామాయణం చిత్రంలో సీతగాను నటిస్తున్నారు. 

ఇప్పటివరకు తన ప్రేమ గురించిగానీ పెళ్లి గురించిగానీ ఎక్కడ ప్రస్తావించని సాయి పల్లవి తొలిసారిగా ఇటీవల ఒక భేటీలో తన ప్రేమ గురించి వెల్లడించారు. అందులో మహాభారతం ఇతిహాసంపై తనకు ఎంతో గౌరవం అని పేర్కొన్నారు. అందులో అర్జునుడి కుమారుడు అభిమన్యుడు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. గత 17 ఏళ్లుగా అభిమన్యుని గురించి చాలా విషయాలు చదివి తెలుసుకున్నానన్నారు. అలా ఒకటి కాదు రెండు కాదు 10 ఏళ్లుగా ఆయన్ని ప్రేమిస్తున్నానని సాయిపల్లవి పేర్కొన్నారు. దీంతో ఈమె ప్రేమ వ్యవహారం మామూలుగా లేదుగా అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement