కోలీవుడ్ డైరెక్టర్ R. పార్తిబన్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన నుంచి ఈ ఏడాది విడుదలైన సినిమా 'టీన్స్' (Teenz). కోలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. R. పార్తిబన్ చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'పుదియ పాదై' 1989, 'హౌస్‌ఫుల్' 1999 రెండు సినిమాలు జాతీయ ఉత్తమ చిత్రాలుగా అవార్డ్ సొంతం చేసుకున్నాయి. 2019లో విడుదలైన 'ఒత్త సెరుప్పు సైజు 7' చిత్రం కూడా జాతీయ స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కించుకుంది. నటుడిగానే కాకుండా డైరెక్టర్‌గా అనేక ఛాలెంజింగ్ సినిమాలను అందించాడు.
అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఆర్. పార్తిబన్ టీన్స్ సినిమాను తెరకెక్కించారు. అందరూ యువ నటీనటులను ఎంపిక చేసుకుని ఆసక్తిగా కథను తెరపై చూపించాడు. భారతీయుడు-2 సినిమాతో పోటీగా జులై 12న 'టీన్స్' కూడా విడుదలైంది. మొదట థియేటర్స్ పెద్దగా దక్కలేదు. కానీ, సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్లతో పాటు గుర్తింపు తెచ్చుకుంది. అయితే, సెప్టెంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో టీన్స్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్‌తో పాటు తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి డి. ఇమ్మాన్ సంగీతం అందించగా యోగి బాబు అతిధి పాత్రలో కనిపించారు.
అడ్వెంచర్‌లా 'టీన్స్' కథ
8మంది టీనేజీ అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిల చుట్టూ టీన్స్ కథ తిరుగుతూ ఉంటుంది. ఓ రోజు క్లాస్‌కు వెళ్లకుండా వాళ్లు తీసుకున్న ఒకేఒక నిర్ణయం వారందరినీ ఊహించలేనంత ప్రమాదంలోకి పడేస్తుంది. తామందరం ధైర్యవంతులమని నిరూపించుకోవాలనే కోరికతో సుమారు 500 ఏళ్ల నాటి బావి వద్దకు ఎవరికీ చెప్పకుండా వెళ్తారు. అక్కడ దెయ్యాలు ఉంటాయని ప్రచారం ఉంటుంది.
ఇదీ చదవండి: కుమారుడి పుట్టినరోజు.. అజయ్- కాజోల్ స్పెషల్ విషెస్
అక్కడికి వెళ్లిన 13 మంది టీనేజ్ పిల్లలు ఎలాంటి ప్రమాదంలో పడ్డారు..? చివరగా ఎంతమంది బయటకు వచ్చారు..? అక్కడ వారందరికీ ఎదురైన ప్రమాదం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. చాలా ఆసక్తిగా టీన్స్ సినిమాను ప్రేక్షకులకు చూపించారు పార్తిబన్.. అందుకే ఈ సినిమాకు 7.9 రేటింగ్ లభించింది. ఈ వీకెండ్‌లో మిమ్మల్ని మరో ప్రపంచంలోకి టీన్స్ సినిమా తీసుకెళ్తుంది.
Comments
Please login to add a commentAdd a comment