Parthiban
-
ఓటీటీలో అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కోలీవుడ్ డైరెక్టర్ R. పార్తిబన్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన నుంచి ఈ ఏడాది విడుదలైన సినిమా 'టీన్స్' (Teenz). కోలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. R. పార్తిబన్ చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'పుదియ పాదై' 1989, 'హౌస్‌ఫుల్' 1999 రెండు సినిమాలు జాతీయ ఉత్తమ చిత్రాలుగా అవార్డ్ సొంతం చేసుకున్నాయి. 2019లో విడుదలైన 'ఒత్త సెరుప్పు సైజు 7' చిత్రం కూడా జాతీయ స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కించుకుంది. నటుడిగానే కాకుండా డైరెక్టర్‌గా అనేక ఛాలెంజింగ్ సినిమాలను అందించాడు.అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఆర్. పార్తిబన్ టీన్స్ సినిమాను తెరకెక్కించారు. అందరూ యువ నటీనటులను ఎంపిక చేసుకుని ఆసక్తిగా కథను తెరపై చూపించాడు. భారతీయుడు-2 సినిమాతో పోటీగా జులై 12న 'టీన్స్' కూడా విడుదలైంది. మొదట థియేటర్స్ పెద్దగా దక్కలేదు. కానీ, సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్లతో పాటు గుర్తింపు తెచ్చుకుంది. అయితే, సెప్టెంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో టీన్స్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్‌తో పాటు తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి డి. ఇమ్మాన్ సంగీతం అందించగా యోగి బాబు అతిధి పాత్రలో కనిపించారు.అడ్వెంచర్‌లా 'టీన్స్' కథ8మంది టీనేజీ అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిల చుట్టూ టీన్స్ కథ తిరుగుతూ ఉంటుంది. ఓ రోజు క్లాస్‌కు వెళ్లకుండా వాళ్లు తీసుకున్న ఒకేఒక నిర్ణయం వారందరినీ ఊహించలేనంత ప్రమాదంలోకి పడేస్తుంది. తామందరం ధైర్యవంతులమని నిరూపించుకోవాలనే కోరికతో సుమారు 500 ఏళ్ల నాటి బావి వద్దకు ఎవరికీ చెప్పకుండా వెళ్తారు. అక్కడ దెయ్యాలు ఉంటాయని ప్రచారం ఉంటుంది. ఇదీ చదవండి: కుమారుడి పుట్టినరోజు.. అజయ్- కాజోల్ స్పెషల్ విషెస్అక్కడికి వెళ్లిన 13 మంది టీనేజ్ పిల్లలు ఎలాంటి ప్రమాదంలో పడ్డారు..? చివరగా ఎంతమంది బయటకు వచ్చారు..? అక్కడ వారందరికీ ఎదురైన ప్రమాదం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. చాలా ఆసక్తిగా టీన్స్ సినిమాను ప్రేక్షకులకు చూపించారు పార్తిబన్.. అందుకే ఈ సినిమాకు 7.9 రేటింగ్ లభించింది. ఈ వీకెండ్లో మిమ్మల్ని మరో ప్రపంచంలోకి టీన్స్ సినిమా తీసుకెళ్తుంది. -
నన్ను క్షమించండి: పార్తిబన్
హీరోయిన్ తమన్నాకు తమిళ నటుడు–దర్శక–నిర్మాత పార్తిబన్ క్షమాపణలు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో తమన్నా డ్యాన్స్ గురించి పార్తిబన్ చేసిన కామెంట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన క్షమాపణలు కోరారు. ఆ ఇంటర్వ్యూలో పార్తిబన్ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలో కథ ఉందా? లేదా అన్నది ప్రేక్షకులు చూడటం లేదు.హీరోయిన్ డ్యాన్స్ కోసమే సినిమాలు చూస్తున్నారు. తమన్నా ఉంటే చాలు.. కథ లేకపోయినా ఫర్వాలేదు.. సినిమా హిట్టవుతుంది’’ అన్నారు. పార్తిబన్ మాటలను పలువురు నెటిజన్స్ తప్పుబట్టారు. దాంతో పార్తిబన్ స్పందిస్తూ– ‘‘సినిమా ఇండస్ట్రీ వారిపై నాకు గౌరవం ఉంది. నటీనటులను తక్కువ చేసే ఉద్దేశం లేదు. నా మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’’ అన్నారు. ఇక తెలుగులో రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘రచ్చ’ సినిమాలో పార్తిబన్ నటించిన విషయం తెలిసిందే. -
రెండురోజులకే వదిలేస్తానంది.. నేనే ఒప్పించా: దర్శకుడు
అళగి చిత్ర యూనిట్ అంతా కూడా 22 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు ఒకే వేదికపై కలవడం సంతోషంగా ఉందని నటి దేవయాని పేర్కొన్నారు. 2012లో విడుదలైన క్లాసికల్ లవ్‌స్టోరీ అళగి (ఇది తెలుగులో లేత మనసులుగా రీమేకైంది). నటుడు పార్తీపన్, దేవయాని, నందితాదాస్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని తంగర్‌బచ్చన్ దర్శకత్వంలో ఉదయగీత ఫిలింస్ పతాకంపై ఉదయకుమార్ నిర్మించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. అదే అళగి చిత్రం 22 ఏళ్ల తరువాత శుక్రవారం (మార్చి 29న) రీరిలీజైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించింది. దర్శకుడు తంగర్ బచ్చన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తుడడం, నటి నందితా దాస్ ముంబైలో ఉన్న కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. నటుడు పార్తీపన్, దేవయాని, నిర్మాత ఉదయకుమార్, ఇతర నటీనటులు పాల్గొన్నారు. దేవయాని మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకున్న తరువాత నటించడానికి అంగీకరించిన మొదటి చిత్రం అళగి అని చెప్పారు. ఈ చిత్రంలో నటించమని దర్శకుడు తంగర్‌బచ్చన్ అడిగారన్నారు. ఎంత ప్రేమ ఉన్నా.. ఒక భార్య తన భర్తను వేరొకరితో పంచుకోవడానికి అంగీకరించని పాత్ర రూపకల్పన తనకు చాలా నచ్చిందన్నారు. అందుకే ఈ చిత్రంలో నటించడానికి వెంటనే అంగీకరించినట్లు చెప్పారు. పార్తీపన్ మాట్లాడుతూ దర్శకుడు తంగర్‌బచ్చన్ మంచి కథారచయిత అని పేర్కొన్నారు. ఆయన కాకుండా వేరే ఎవరున్నా ఈ చిత్రం ఇంత విజయం సాధించి ఉండేది కాదన్నారు. షూటింగ్ ప్రారంభమైన రెండు రోజుల్లోనే ఈ చిత్రం తనకు సెట్ కాదనిపిస్తోందని, తాను వైదొలగుతానని నటి నందితాదాస్ తనతో చెప్పారన్నారు. అయితే తాను చిత్రానికి సంబంధించిన సంభాషణలను వివరించి, ఆమె నటించేలా చేశానన్నారు. కాగా అళగి చిత్రానికి సీక్వెల్ చేయడానికి కథను రెడీ చేశానని, అయితే ఆ టైటిల్‌ను తంగర్‌బచ్చన్ తనకు ఇవ్వనన్నారని చెప్పారు. అందుకే ఆయన రాజకీయాల్లో స్థిరపడిపోతే తనకు అళగి 2 చిత్రం చేయడానికి మార్గం సుగమం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
చెన్నై అతలాకుతలం.. కదిలొచ్చిన స్టార్స్.. సూర్య బ్రదర్స్ ఏకంగా..
మిచాంగ్ తుపాన్ చైన్నె ప్రజల్ని నిలువునా ముంచేసింది. కష్టాల కడగండ్లలోకి నెట్టేసింది. జనజీవనం స్తంభించిపోయింది. పేదలు, ధనికులు ఎవరినీ వదలలేదు.. అందరి నోటా ఆదుకోమన్న ఆర్తనాదాలే. తన తల్లి వైద్యం కోసం స్థానిక కాట్పాడిలో ఉంటున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్, అదే ప్రాంతంలో నివసిస్తున్న హీరో విష్ణు విశాల్, మైలాపూర్ ప్రాంతంలో నివసిస్తున్న నటి నమిత తుపాన్ బాధితులే. రూ.10 లక్షల విరాళం ప్రభుత్వం సత్వరం స్పందించి నివారణ చర్యలకు ఉపక్రమించినా, మరో పక్క విమర్శల దాడి జరుగుతోంది. సినీ తారలు విశాల్, పార్థిబన్, అతిథి బాలన్ వంటి వారు ప్రభుత్వ అలసత్వం గురించి ప్రశ్నించారు. ఇక తుపాన్ బాధితులకు ఆపన్న హస్తం అందించిన వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా నటుడు సూర్య, కార్తీక్ తమ అభిమానులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. చైన్నె, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లోని అభిమానుల కోసం రూ.10 లక్షలు విరాళంగా అందించారు. తారల సాయం.. విజయ్ తన అభిమాన సంఘం నిర్వాహకులను రంగంలోకి దింపి బాధితులను తన వంతుగా ఆదుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేసిన నటుడు విశాల్, పార్థిబన్ కూడా తన వంతు సాయం అందించారు. అదేవిధంగా హాస్యనటుడు బాలా తమ వంతు సాయం అందించారు. అలాగు లేడీ సూపర్‌స్టార్ నయనతార తుపాన్ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావడం విశేషం. ఈమె పిగ్మీ 9 సంస్థ ద్వారా వేలచ్చేరి ప్రాంతంలోని బాధితులకు శానిటరీ, మంచి నీళ్లు, బ్రెడ్, బియ్యం వంటి నిత్యావసర సరుకులు అందించారు. చదవండి: ప్రశాంత్‌కు తన చేతులతో టైటిల్ అప్పగించేసిన అమర్! రైతుబిడ్డ అంటే అంత చులకనా..? -
మరో కొత్త కథతో వస్తున్నా: పార్థిబన్
విభిన్న కథా చిత్రాలకు కేరాఫ్ పార్థిబన్. నటుడిగా, కథకుడిగా, దర్శక, నిర్మాతగా ఈయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో పార్థిబన్ దిట్ట. ఆ మధ్య ఏకపాత్రాభినయం చేసి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఒత్త చెరుప్పు సైజ్ సెవెన్ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆధరణ పొందింది. అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. ఆ తరువాత పార్థిబన్ రూపొందించిన చిత్రం ఇరవిన్ నిళల్. ఇది నాన్ లీనియర్ ఫార్మెట్లో సింగిల్ షాట్లో తెరకెక్కించిన ప్రయోగాత్మక కథా చిత్రం. ఈ చిత్రం ప్రశంసలను అందుకుంది. తాజాగా మరో కొత్త కథతో వస్తున్నానని ట్విట్టర్(ఎక్స్)లో పేర్కొన్నారు. ఈసారి నాన్ లీనియర్ ఫార్మెట్ కాదని, ప్రయోగాత్మకంగా కథా చిత్రం అస్సలు కాదని, అలాగని సాధారణ కథా చిత్రం కాదని చెప్పారు. ఇంతకు ముందు చిత్రాల్లో చేసిన తప్పులను సరి చేసుకుంటూ ఈ చిత్రాన్ని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రూపొందిస్తున్నట్లు తెలిపారు. చిత్రంలో వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంటుందని, గ్రాఫిక్స్ అంటే హాలీవుడ్ చిత్రాలే గుర్తుకొస్తాయని అన్నారు. మనకు బడ్జెట్ సమస్య తలెత్తుతుందని అన్నారు. అయితే చాలాకాలం క్రితమే తమిళంలో చంద్రలేఖ, ఆయిరత్తిల్ ఒరువన్, ఉలగం చుట్రం వాలిబన్ వంటి బ్రహ్మాండ చిత్రాలు వచ్చాయని పేర్కొన్నారు. అలా మంచి కథతో తాను రూపొందిస్తున్న కథా చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసి డబ్బింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం కోసం తాను చాలా ఆసక్తిగా ఉన్నట్లు పార్థిబన్ అన్నారు. త్వరలోనే మంచి కథతో మీ ముందుకు వస్తున్నానని పేర్కొన్నారు. -
కోపంతో నయనతారను రావొద్దని చెప్పా: పార్థిబన్
తమిళ సినిమా: ఎలాంటి తారలు అయినా మొదట్లో అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరగాల్సిందే. అవమానాలను భరించాల్సిందే. అయితే కథానాయికలకు ఆరంభ కష్టాలు అంతంత మాత్రమేని చెప్పాలి. ప్రస్తుతం సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్‌గా వెలిగిపోతున్న నయనతార కూడా అలాంటి గడ్డు పరిస్థితులను దాటి వచ్చిన వారే. పురుషాధిక్యత అధికం అని చెప్పబడే ఈ సినిమా రంగంలో నయనతార ఆరంభ కాలంలో పలు అవమానాలను ఎదుర్కొని మానసిక వేదనలను అనుభవించినవారే. ఇంకా జీవితంలో పలు ఎత్తు పల్లాలను చవి చూశారు. అయ్యా చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మలయాళీ భామ నయనతార. అయితే అంతకు ముందే పార్థిపన్ కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన కొడైకుల్ మళై చిత్రం ద్వారా పరిచయం కావలసి ఉంది. అయితే ఆమెను పార్థిబన్ రావొద్దని చెప్పారట. ఈ సంఘటన గురించి ఆయన ఇటీవల ఒక భేటీలో చెప్పారు. (చదవండి: ఛాతిపై పచ్చబొట్టుగా పవర్‌స్టార్ పేరు..పిక్ వైరల్) నయనతార ఫొటో ఒకటి చూసి తాను దర్శకత్వం వహించనున్న కొడైకుల్ మళై చిత్రంలో ఆమెను కథానాయకిగా నటింపజేయాలని భావించానన్నారు. దీంతో కేరళకు చెందిన నయనతారను ఒక రోజు ఉదయం 8 గంటలకు రమ్మని చెప్పానన్నారు. అయితే ఆమె ఆ రోజు రాకుండా, మరుసటి రోజు ఫోన్ చేసి నిన్న రాలేకపోయానని, ఈ రోజు బస్సు ఎక్కి రేపు ఉదయం కచ్చితంగా వస్తాను అని చెప్పారన్నారు. చాలా కోపానికి గురైన తాను లేదు నువ్వు రావొద్దు అని చెప్పానన్నారు. కాగా, అలా కేరళ నుంచి బస్సులో వస్తున్నా.. అని చెప్పిన నయనతార ఈ రోజు లేడీ సూపర్ స్టార్‌గా ఎదగడం గొప్ప విషమని కొనియాడారు. -
ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే!.. నా భర్త నాకే సొంతం అని ఆశించడం తప్పా?
ప్రేమ వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులైన దర్శక నటుడు పార్తీపన్, నటి సీత మనస్పర్థల కారణంగా 11 ఏళ్ల క్రితం విడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా తాము విడిపోవడానికి సీతనే కారణమని పార్తీపన్, ఆయన చెప్పినదంతా అబద్ధమని సీత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. పాండ్యరాజన్ దర్శకుడిగా, కథానాయకుడిగా పరిచయం అయిన ఆన్‌పావం చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన నటి సీత. తొలి చిత్రంలోనే పక్కింటి అమ్మాయిగా ముద్ర వేసుకున్న ఈమె ఆ తరువాత వరుసగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం తదితర భాషల్లో అవకాశాలు దక్కించుకుని హీరోయిన్గా మంచి స్థాయికి చేరుకున్నారు. దర్శకుడు భాగ్యరాజ్ శిష్యుడు పార్తీపన్ తొలిసారిగా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా పరిచయమైన పుదియపాదై చిత్రంలో సీత నాయకిగా నటించారు. ఆ చిత్రంలో వీరిద్దరి మధ్య ప్రేమ నడచింది. దీంతో 1990లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే మనస్పర్థల కారణంగా 2001లో విడిపోయారు. ఆ తరువాత సీత 43 ఏళ్ల వయసులో బుల్లితెర నటుడు సతీష్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే కొద్ది కాలంలోనే వీరిద్దరూ విడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సీత మొదటి భర్త పార్తీపన్ ఆమె గురించి ఒక కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము విడిపోవడానికి కారణం సీత అత్యాసే కారణమని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సీత స్పందించారు. తాను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నటిని అని, ఒక చిత్రంలో నటి సుహాసిని చెప్పినట్లు నా భర్త నాకే సొంతం అని ఆశించడం తప్పా అని ప్రశ్నించారు. పార్తీపన్ చెప్పినవన్నీ అసత్యాలే అన్నారు. -
సింగిల్ షాట్లో తెరకెక్కిన ‘డ్రామా’
ప్రయోగాత్మక చిత్రాలు చేయాలంటే అనుభవం, ప్రతిభ ఉండాలి. అలాంటి చిత్రాలు చేసి నటుడు పార్తీపన్ గిన్నిస్ రికార్డ్ బుక్‌లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఇటీవల రూపొందించిన ఇరవిన్ నిళల్ చిత్రం తరహాలో తాజాగా సింగిల్ షాట్ రూపొందించిన చిత్రం డ్రామా. వైబ్ 3 ప్రొడక్షన్స్ పతాకంపై ఆంటోని దాస్ నిర్మించిన ఈ చిత్రంలో జైబాల, కావ్య బెల్లు హీరో హీరోయిన్లుగా నటించారు. కిషోర్ ప్రధాన పాత్రలో నటించారు. శినోస్ ఛాయాగ్రహణం, బిజిటల్, జయం కే.దాస్, జెసిన్ జార్జ్ త్రయం సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 23వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. దీని విడుదల హక్కులను శశికళ ప్రొడక్షన్స్ సంస్థ పొందింది. నిర్మాత తెలుపు తూ ఇది ఒక హత్య నేపథ్యంలో సాగే క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్లో 12 మంది అధికారులు ఉండగా కరెంట్ పోయిన రెండు నిమిషాలు సమయంలో ఒక హత్య జరుగుతుందనీ, దాన్ని ఎవరు? ఎందుకు చేశారన్నది చిత్ర ప్రధాన ఇతివృత్తం అని చెప్పారు. ఓ పోలీస్ స్టేషన్లో ఒక రాత్రి జరిగే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. ఓకే షాట్లో రెండున్నర గంటల్లో తెరకెక్కించిన ఈ చిత్రం కోసం 180 రోజులు రిహార్సల్స్ చేసినట్లు చెప్పారు. ఇందులో రెండు పాటలు, ఒక మేకింగ్ వీడియో పాట ఉంటాయని చెప్పారు. ఈ చిత్రాన్ని పార్తీపన్ ఇరవిన్ నిళల్ చిత్రం కంటే ముందే రూపొందించామనీ కరోనా తదితరులు కారణాల వల్ల ఆలస్యం అయ్యింది అని తెలిపారు. -
ఆయన కోసమే నగ్నంగా నటించా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ పార్తిబన్ దర్శకత్వం వహించి నటించిన తమిళ చిత్రం ‘ఇరవిన్ నిళల్’. ఇందులో ఆయన హీరోగా నటించగా ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రంలో యువ నటి బ్రిగిడ సాగా హీరోయిన్గా నటించింది. జూలై 15న విడుదలైన ఈచిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె మూవీ విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో తాను నగ్నం నటించడంపై వివరణ ఇచ్చింది. చదవండి: పనిమనిషి చెప్పేదాకా చైసామ్ విడిపోతున్నారని తెలియదు ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసేందుకు వెళ్లన తనను హీరోయిన్గా సెలక్ట్ చేశారని తెలిపింది. ‘నేను ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ చేయాల్సింది. కానీ నన్నే హీరోయిన్గా సెలక్ట్ చేశారు. అయితే ఇందులో ఓ సన్నివేశంలో హీరోయిన్ నగ్నంగా నటించాల్సి ఉంది. అయితే ఈ చిత్రాన్ని ప్రేమించే వారే ఆ ఈ సీన్ చేయగలరని డైరెక్టర్ అన్నారు. దీంతో డైరెక్టర్ కోసమే నేను ఆ సీన్లో చేయాలని అనుకున్నాను’ అని చెప్పింది. మొదట ఈ సీన్ నటించేముందు తన కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలనుకున్నానని పేర్కొంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. ‘ఈ సీన్ గురించి నా కుటుంబ సభ్యులతో చర్చించాలంటే భయం వేసింది. వారిని ఎలా ఒప్పించాలో తెలియలేదు. చాలా సతమతమయ్యాను. చివరకు డైరెక్టర్ పార్తిబన్ సహాయంతో మా కుటుంబాన్ని ఒప్పించి అనుమతి తీసుకున్నాకే ఈ సీన్లో నటించాను’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇందులో తాను పూర్తి న్యూడ్‌గా నటించలేదని, ఇందుకోసం కొన్ని టెక్సిక్స్ వాడినట్లు ఆమె స్పష్టం చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్, రోబో శంకర్, ప్రియాంకా రుత్, బ్రిగిడ సాగా, ఆనంద కృష్ణన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా సింగిల్ షాట్లో చిత్రీకరించారు. అంతేకాదు మొట్టమొదటి నాన్ లీయర్ సింగిల్ షాట్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. -
అంతర్జాతీయ అవార్డులు కొల్లగొడుతున్న‘ఇరవిన్ నిళల్’
తమిళసినిమా: హీరో పార్తీబన్ చిత్రాలంటేనే వైవిధ్యానికి చిరునామా అనడం అతి శయోక్తి కాదు. ఈయన తన చిత్రాల్లో ప్రయోగాలతో ఆడుకుంటారు. ఇంతకు ముందు ఈయన ఏక పాత్రాభినయం చేసి తెరకెక్కించిన ‘ఒర్త చెరుప్పు – సైజ్ 7’ చిత్రం అందరి ప్రశంసలు అందుకుని విజయం సాధించడంతో పాటు జాతీయ అవార్డును గెలుచుకుంది. అంతే కాకుండా ఆస్కార్ అవార్డు అంచుల వరకూ వెళ్లింది. తాజాగా పార్తీపన్ కధానాయకుడిగా నటించి, కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన చిత్రం ‘ఇరవిన్ నిళల్’ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం కూడా కమర్షియల్ అంశాలతో కూడిన ప్రయోగాత్మక చిత్రం కావడం విశేషం. ఇది సింగిల్ షాట్ చిత్రీకరించిన చిత్రం. ఇప్పటికే గిన్నీస్ రికార్డు, ఏషియన్ బుక్ రికార్డుల్లో నమోదయింది. తాజాగా అంతర్జాతీయ అవార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటికే మూడు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. అందులో అంతర్జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు, ఈ చిత్ర ఛాయాగ్రహకుడు ఆర్ధర్ విల్సన్ రెండు అవార్డులను గెలుచుకున్నారు. మరో రెండు అంతర్జాతీయ అవార్డుల జాబితాలో ఈ చిత్రం చోటు చేసుకున్నట్లు చిత్ర వర్గాలు బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే చిత్ర ప్రివ్యూ చూసిన సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇరవిన్ నిళల్ చిత్రం ఈ నెల 15వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. -
దేవుడినైనా ఏమార్చవచ్చు.. కానీ ఏఆర్ రెహమాన్‌ను ఏమార్చలేం: డైరెక్టర్
చెన్నై సినిమా: సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) కాదంటే ఈ చిత్రం ఉండేది కాదని 'ఇరవిన్ నిళల్' (Iravin Nizhal) చిత్ర దర్శకుడు, కథానాయకుడు పార్తిపన్ (Parthiban) అన్నారు. ఈయన సింగిల్ షాట్లో తెరకెక్కించి గిన్నీస్ రికార్డు కెక్కిన ఈ చిత్రానికి ఏఆర్. రెహ్మాన్ సంగీతం అందించారు. ఈ చిత్ర విడుదల హక్కులను నిర్మాత కలైపులి ఎస్. ధాను పొంది ఈ నెల 24వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్తిపన్ ఆదివారం రాత్రి స్థానిక ఐఐటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పార్క్ ఆవరణలో వైవిధ్యభరితంగా నిర్వహించారు. సంగీత దర్శకుడిగా 30 వసంతాలు పూర్తి చేసుకున్న ఏఆర్ రెహమాన్‌ను ఈ వేదికపై ఘనంగా సత్కరించారు. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరుకావడం విశేషం. పార్తిపన్ మాట్లాడుతూ వైవిధ్యభరిత కథా చిత్రాన్ని చేయాలనుకున్నప్పుడు మంచి సపోర్ట్ అవసరం అయ్యిందని, ఆ సపోర్టే ఏఆర్ రెహమాన్ అని పేర్కొన్నారు. అయితే భగవంతుడినైనా అభిషేకంతో ఏమార్చవచ్చు గానీ మన ఏఆర్ రెహమాన్‌ను ఏమార్చలేమని అభిప్రాయపడ్డారు. చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు దెయ్యాలంటే భయం లేదు.. కానీ ఆరోజు చావును దగ్గర నుంచి చూశా: స్టార్ హీరోయిన్ పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం -
ఓటు వేయకపోవడానికి కారణం ఇదే: పార్థిబన్
సాక్షి, చైన్నై: రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అతి తక్కువ మంది చిన్ని తారలు ఓటు వేయలేకపోయారు. అందులో నటుడు, దర్శకుడు పార్థిబన్ ఒకరు. కాగా పార్థిబన్ ఓటు హక్కును వినియోగించుకోకపోవడానికి గల కారణాన్ని బుధవారం ట్విట్టర్ ద్వారా వివరించారు. అందులో ఆయన పేర్కొంటూ తాను ఇటీవల కోవిడ్ వ్యాక్సిన్‌ను రెండవ సారి వేసుకున్నానన్నారు. అయితే వ్యాక్సిన్ కారణంగా ఎలర్జీ కలిగి ముఖమంతా వాచిపోయిందన్నారు. దీంతో తన ఫొటోలు వైద్యులకు పంపి వైద్య చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ కారణంగానే తాను ఓటు హక్కును వినియోగించుకోలేకపోయానని వివరించారు. అయితే అందరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, అతి కొద్ది మందికి మాత్రమే వ్యాక్సిన్ కారణంగా ఎలర్జీ కలుగుతుందని, తనకు ఇంతకు ముందే ఎలర్జీ సమస్య ఉండడంతో ఇలా జరిగిందని పార్థిపన్ తెలిపారు. చదవండి: అలా అనుకున్నాను కాబట్టే ఇంత దూరం వచ్చా! -
హీరో సూర్య నిర్ణయం: దర్శకుడి ప్రశంసలు
సాక్షి, చెన్నై : హీరో సూర్యను దర్శక, నటుడు పార్తీబన్ ప్రశంసించారు. సూర్య తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆయన భార్య జ్యోతికను ప్రధాన పాత్రలో నటింపజేస్తూ నిర్మించిన చిత్రం పొన్మగల్ వందాల్. ఇందులో దర్శకుడు కె.భాగ్యరాజ్, పార్తీబన్, పాండ్యరాజన్ త్యాగరాజన్ ముఖ్య పాత్రలను పోషించారు. నవ దర్శకుడు పెట్రిక్ తెరకెక్కించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కాగా, లాక్డౌన్ కారణంగా చిత్రాల విడుదల నిలిచిపోవడంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు సూర్య ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. పొన్ మగల్ వందాల్ చిత్రాని ఓటీటీలో ప్రసారం చేయడానికి నిర్ణయించుకున్నారు. దీంతో ఆయనపై థియేటర్ల యాజమాన్య తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది. ( జ్యోతిక వ్యాఖ్యలను సమర్థించిన సూర్య.. ) అయినా కానీ, సూర్య చిత్రాన్ని ఈ నెల 29వ తేదిన అమెజాన్ ప్రైమ్ టైమ్‌లో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా పార్తీబన్, సూర్యను ప్రశంసిస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ధైర్యం పురుష లక్షణమని, ఒక ధైర్య లక్ష్మి.. భర్త తన సహధర్మచారిణి ప్రేమను, ఆమె గౌరవాన్ని కాపాడటానికి వేసిన అడుగును వెనక్కు తీసుకోలేదన్నారు. అలా, తన వీరత్వాన్ని ప్రదర్శిస్తూ పొన్మగళ్ వందాల్ చిత్రాన్ని ఓటీటీ ద్వారా ప్రసారం చేయడాన్ని ప్రశంసించారు. ఆ చిత్ర దర్శకుడు పెట్రిక్, యూనిట్ సభ్యులకు పార్తీబన్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
కోలీవుడ్ టు బాలీవుడ్
ప్రాంతీయ భాషల్లో హిట్ అయిన సినిమాలు హిందీలో రీమేక్ అవడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా అదే జాబితాలో తమిళ చిత్రం ‘ఒత్తా సెరుప్పు సైజ్ 7’ కూడా చేరనుంది. ఈ సినిమా త్వరలో హిందీలో రీమేక్ కానుంది. కేవలం ఒకే ఒక్క పాత్రతో రూపొందిన ‘ఒత్తా సెరుప్పు సైజ్ 7’లో నటించడమే కాకుండా, స్వీయ దర్శకత్వంలో నిర్మించారు తమిళ దర్శకుడు పార్తిబన్. హిందీ రీమేక్‌లో ఆ పాత్రను నవాజుద్దీన్ సిద్ధిఖీ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
తుగ్లక్ దర్బార్‌లోకి ఎంట్రీ
రాజకీయ నాయకుడిగా మారనున్నారు విజయ్ సేతుపతి. ఆయనకు తోడుగా అదితీ రావ్ హైదరీ కూడా జాయిన్ అయ్యారని తెలిసింది. మరి రాజకీయాల్లో వీళ్ల లక్ష్యం ఏంటో స్క్రీన్‌పైనే చూడాలి. విజయ్ సేతుపతి హీరోగా నూతన దర్శకుడు ఢిల్లీ ప్రసాద్ దీనదయాళ్ తెరకెక్కించనున్న తమిళ చిత్రం ‘తుగ్లక్ దర్బార్’. పొలిటికల్ ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అదితీ రావ్ హీరోయిన్గా నటించనున్నారని చిత్రబృందం ప్రకటించింది. పార్తిబన్ విలన్‌గా నటించనున్నారు. ఇదివరకు మణిరత్నం తీసిన ‘నవాబ్’లో విజయ్ సేతుపతి, అదితీ రావ్ నటించారు. జోడీగా నటించడం మాత్రం ఇదే తొలిసారి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. -
సెన్సార్‌ను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోను
తాను సెన్సార్‌ను దృష్టిలో పెట్టుకుని కథలను తయారు చేసుకోనని అన్నారు నటుడు, దర్శకుడు ఆర్.పార్తీపన్. జయాపజయాలను పక్కన పెడితే పార్తీపన్ చిత్రాలకంటూ ప్రేక్షకులు ప్రత్యేకంగా ఉంటారు. ఈయన చిత్రాలు ప్రయోగాత్మకంగానూ, ప్రయోజనాత్మకంగానూ ఉంటాయని చెప్పవచ్చు. అలా చిన్న గ్యాప్ తరువాత పార్తీపన్ చేసిన మరో ప్రయోగం ఒత్త చెరుప్పు సైజ్ 7. సినిమా పేరే వైవిధ్యంగా ఉంది కదూ. కథా, కథనాలు కొత్తగా ఉంటాయి. ఎందుకంటే ఈ చిత్రం అంతా ఒక్క పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అవును ఆ పాత్రని పోషించింది పార్తీపనే. ఒకే పాత్రతో ఇంతకుముందు కొన్ని చిత్రాలు వచ్చినా, పార్తీపన్ స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ ఒత్త చెరుప్పు సైజ్ 7 వాటికి పూర్తిగా భిన్నంగా ఉంటుందంటున్నారీయన. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, రసూల్ పోకుట్టి సౌండ్ ఎఫెక్ట్స్ అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకోవంతో పాటు సెన్సార్‌ను జరుపుకుంది. చిత్రానికి సెన్సార్‌బోర్డు యూ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. ఈ సందర్భంగా ఈ చిత్ర సృష్టికర్త పార్తీపన్ మాట్లాడుతూ తాను సెన్సార్‌ను దృష్టిలో పెట్టుకుని కథలను రాసుకోనని అన్నారు. అలా చేస్తే కథ బలాన్ని కోల్పోతుందన్నది తన అభిప్రాయం అన్నారు. ఒత్త చెరుప్పు సైజ్ 7 చిత్రానికి యూ సర్టిఫికెట్ ఇవ్వడం సంతోషం అన్నారు. అయితే తన దృష్టిలో చిత్రానికి రెండు సెన్సార్ సర్టిఫికెట్లు ఉంటాయని అన్నారు. అందులో ఒకటి సెన్సార్ సభ్యులిచ్చిన సర్టిఫికేట్ అయితే రెండోది ప్రేక్షకులు ఇచ్చే సర్టిఫికెట్ అని అన్నారు. ఆ రెండో సిర్టిఫికేట్ కోసమే తానిప్పుడు ఎదురు చూస్తున్నానని అన్నారు. ఇది ఒక్క పాత్రతో రూపొందిన చిత్రం అయినా, హీరోలు మాత్రం చాలా మంది ఉన్నారని అన్నారు.ఈ చిత్రానికి పనిచేసిన సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, సౌండ్ ఇంజినీర్ రసూల్ పోకుట్టి ఇలా చాలా మంది హీరోలేనని పార్తీపన్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని వెల్లడిస్తానని పార్తీపన్ చెప్పారు. -
ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా కాపీనా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా టెంపర్. ఎన్టీఆర్‌ను సరికొత్తగా ప్రజెంట్ చేసిన ఈ సినిమా ఘనవిజయం సాధించటమే కాదు తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్ అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చాయి. టెంపర్ తమిళ రీమేక్‌లో విలన్‌గా నటించిన పార్తీబన్, టెంపర్ తన సినిమాకు కాపీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 1993లో తాను తెరకెక్కించిన ఉల్లే వెలియే సినిమా ఆధారంగానే టెంపర్ కథను తయారు చేసుకున్నారని ఆరోపించారు. అయితే ప్రస్తుతం తాను కాపీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు పార్తీబన్. పూరి దర్శకత్వంలో రూపొందించిన టెంపర్ సినిమాకు వక్కంతం వంశీ కథ అందించాడు. మరి ఈ కాపీ ఆరోపణలపై వంశీ ఎలా స్పందిస్తాడో చూడాలి. తమిళ నటుడు, దర్శకుడు, నిర్మాత పార్తీబన్ -
ఘనంగా అభినయ వివాహం
చెన్నై: నటుడు పార్థిబన్, నటి సీతల పెద్ద కూతురు అభినయ పెళ్లి ఆదివారం ఉదయం చెన్నైలో ఘనంగా జరిగింది. అభినయకు నటుడు ఎంఆర్.రాధ కొడుకు ఎంఆర్ఆర్.వాసు కూతురు సత్య జయచిత్ర కొడుకు నరేష్ కార్తీక్‌తో నిన్న (ఆదివారం) ఉదయం స్థానిక అడయారులోని లీలా ప్యాలెస్‌లో వేదమత్రాల మధ్య సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల బంధువులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి నవ వధూవరులను ఆశీర్వదించారు. పార్థిబన్, సీతల రెండవ కూతురు కీర్తన పెళ్లి ఇంతకు ముందే జరిగిన విషయం విదితమే. ఈ వేడుకకు ఎంఆర్.రాధ కటుంబానికి చెందిన నటుడు రాధారవి, లతా రజనీకాంత్, నిర్మాత ఆర్బీ.చౌదరి, దర్శకుడు ఏఎస్ఏ.చంద్రశేఖర్, శోభ దంపతులు,కే.భాగ్యరాజ్, పూర్ణిమా భాగ్యరాజ్ దంపతులు, శాంతను, కీర్తి దంపతులు, దర్శకుడు కేఎస్.రవికుమార్, పాండియరాజన్, ఎళిల్, విక్రమన్, తంగర్‌బచ్చన్, నటుడు శివకుమార్, కార్తీ, సూరి, పృథ్వీరాజన్, మయిల్సామి, మోహన్, చిత్రాలక్ష్మణన్, నిర్మాత ఐçక్. హరి, లేనా తమిళ్‌వానన్, చిత్రకారుడు ఏపీ.శ్రీధర్, మాణిక్య నారాయణన్, నటి ఈశ్వరిరావు, డీటీఆర్.రాజా, రాధిక శరత్‌కుమార్, నిరోషా, ప్రముఖ నటీమణులు శారద, రాజశ్రీ, సచ్చు, వెన్నిరాడై నిర్మల భానుప్రియ, జేఎస్కే.సతీశ్, వ్యాపారవేత్త నల్లికుప్పస్వామి శెట్టియార్, అడ్వకేట్ రాజశేఖర్, నిర్మాత సత్యజ్యోతి త్యాగరాజన్, ఛాయాగ్రాహకుడు సుకుమార్ విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైభవంగా హీరో కూతురి వివాహం
సాక్షి, పేరంబూరు: నటుడు, దర్శకుడు పార్థిబన్, సీత కూతురు కీర్తన వివాహ వేడుక అక్షయ్‌తో గురువారం ఉదయం స్థానిక రాజా అన్నామలైపురంలోని ఒక నక్షత్ర హోటల్లో ఘనంగా జరిగింది. కీర్తన మణిరత్నం దర్శకత్వం వహించిన కన్నత్తిల్ ముత్తమిట్లాల్ చిత్రంలో బాల నటిగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మణిరత్నం వద్ద సహాయ దర్శకురాలిగా పని చేస్తున్న కీర్తన త్వరలో మెగాఫోన్ పట్టనున్నారు. అక్షయ్, కీర్తన ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు పచ్చజెండా ఊపడంతో ఇటీవలే వివాహ నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. గురువారం అక్షయ్, కీర్తనల పెళ్లికి ఈ శుభం కార్డు పడింది. వీరి వివాహ వేడుకను పార్థిబన్, సీత కలిసి ఘనంగా నిర్వహించారు. పార్థిబన్, సీత మనస్పర్థల కారణంగా చాలా కాలం క్రితమే విడిపోయిన విషయం తెలిసిందే. అయితే కూతురి పెళ్లి పార్థిబన్, సీతల సమక్షంలో ఒక వేడుకలా జరగడం విశేషం. అక్షయ్, కీర్తన వివాహవేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, దయానిధిమారన్, ఎండీఎంకే నేత వైగోలతో పాటు మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ వంటి పలువురు రాజకీయనేతలతో పాటు నటుడు రజనీకాంత్, లతారజనీకాంత్, శివకుమార్, సూర్య, విశాల్, అరుణ్‌విజయ్, విజయ్‌కుమార్, నటి జ్యోతిక, మీనా, శ్రీప్రియ, లక్ష్మి, కుష్బూ, సందర్.సీ సత్యరాజ్, జయంరవి, ప్రభుదేవా, జీవీ.ప్రకాశ్‌కుమార్, విజయ్‌సేతుపతి, ఉదయనిధిస్టాలిన్, దర్శకుడు మణిరత్నం, నటి సుహాసిని మణిరత్నం, రోహిణి, రాధిక శరత్‌కుమార్, నిర్మాత ఆర్బీ.చౌదరి. ఇళయరాజా, ఏఆర్.రెహ్మాన్, గాయకుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం, సంగీతదర్శకుడు హరీష్‌జయరాజ్, కే.భాగ్యరాజ్,శంకర్, సినీ ప్రముఖులు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆయన నాకు చాలా నేర్పించారు: నివేద
చెన్నై: నటి నివేదా పేతురాజ్ ఇప్పుడు ఒక రకమైన ఎగ్జైట్మెంట్, టెన్షన్‌తో ఉంది. దానికి కారణం కోలీవుడ్‌లో తను నటించిన రెండో చిత్రం పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఉదయనిధి స్టాలిన్ సరసన కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో నటుడు పార్తీపన్ ప్రధాన పాత్రను పోషించారు. తేనాండాళ్ ఫిలింస్ లిమిటెడ్ పతాకంపై ఎన్.రామస్వామి నిర్మించిన ఈ చిత్రానికి దళపతి ప్రభు దర్శకుడు. ఒరునాళ్‌కూత్తు చిత్రం తరువాత నటి నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించిన రెండో తమిళ చిత్రం పొదువాగ ఎన్ మనసు తంగం. ఇందులో తన అనుభవం గురించి చెపుతూ, ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటించడం మంచి అనుభవం అని పేర్కొంది. అయితే ఇందులో నటుడు పార్తీపన్‌కు కూతురుగా నటించినట్లు చెప్పింది. ఆయన నటన గురించి నాకు చాలా నేర్పించారనీ తెలిపింది. పార్తిపన్ తనకు తండ్రిగా నటిస్తున్నారని దర్శకుడు చెప్పగానే సంతోషం కలిగినా, కాస్త భయం అనిపించిందని అంది. కారణం ఆయన చాలా సీనియర్ దర్శకుడు కావడమేనంది. ఈ చిత్రం తుది ఘట్ట సన్నివేశాల్లో నటించడానికి తటపటాయిస్తున్నప్పుడు పార్తీపన్ ఎలా నటించాలో చెప్పి ధైర్యాన్ని నింపారని చెప్పింది. పొదువాగ ఎన్ మనసు తంగం చిత్రంలో తాను ఏ మాత్రం బాగా చేశానని అభినందనలు లభిస్తే ఆ క్రెడిక్ట్ అంతా పార్తీపన్కే దక్కుతుందని నివేదా పేర్కొంది. కాగా ఈ బ్యూటీ తాజాగా నటుడు జయంరవికి జంటగా టిక్ టిక్ టిక్ చిత్రంలో నటిస్తోంది. -
రేస్ నుంచి వైదొలగిన విజయ్‌సేతుపతి
పొంగల్ రేస్ నుంచి నటుడు విజయ్‌సేతుపతి తప్పుకున్నారు. ఈ సారి పొంగల్ బరిలో నాలుగైదు చిత్రాలు పోటీ పడడానికి సిద్ధమయ్యాయి. అలాంటిది రెండు చిత్రాలే చివరికి ఢీ కొంటున్నాయి. పొంగల్ రేసు నుంచి జీవీ.ప్రకాశ్‌కుమార్ నటించిన బ్రూస్లీ చిత్రం వారం క్రితమే తప్పుకుంది.అలాగే మరో రెండు చిత్రాలు వెనక్కి వెళ్లాయి. దీంతో విజయ్ నటించిన భైరవా, విజయ్‌సేతుపతి నటించిన పురియాద పుధీర్, పార్తిబన్ చిత్రం కోడిట్ట ఇడంగళ్ నిరప్పుగా మొదలగు మూడు చిత్రాలు పోటీకి సిద్ధమయ్యాయి. అలాంటిది ఇప్పుడు నిక్కా మూమెంట్లో విజయ్‌సేతుపతి చిత్రం పురియాదపుధీర్ పోటీ నుంచి తప్పుకుంది. ఇక విజయ్ భైరవా, పార్తిబన్ కోడిట్ట ఇడంగళ్ నిరప్పుగా చిత్రాలే బరిలో తలపడుతున్నాయి. భైరవా గరువారం భారీ స్థాయిలో తెరపైకి వచ్చింది. ఇక శనివారం పార్తిబన్ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. విజయ్‌సేతుపతి చిత్రం విడుదల వాయిదా గురించి ఆ చిత్ర నిర్మాత దీపక్ భూపతి తెలుపుతూ విజయ్‌సేతుపతి, గాయత్రి జంటగా నటించిన తమ తొలి నిర్మాణం పురియాదపుధీర్ చిత్రం పొంగల్ రేసుకు సిద్ధమవుతుందని చాలా సంతోషించామన్నారు.ఇప్పటికే చిత్రంపై మంచి అంచనాలు నెలకొనడం చాలా ఉత్సాహాన్ని కలిగించిందన్నారు.అయితే తన తదుపరి చిత్రానికి ఏర్పడ్డ చిన్న సమస్య కారణంగా పురియాదపుధీర్ చిత్ర విడుదల వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.తదిపరి విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు. -
కొత్త శాంతను..
కోడిట్ట ఇడంగళై నిరంప్పుగా చిత్రంలో కొత్త శాంతనును చూస్తారని అంటున్నారు ఆ చిత్ర కథానాయకుడు. ఈయన తన తండ్రి భాగ్యరాజ్ శిషు్యడు పార్తిబన్ దర్శకత్వంలో నటించిన చిత్రం కోడిట్ట ఇండగళై నిరప్పుగా. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్లు ఇటీవల విడుదలై ప్రేక్షకుల మధ్య మంచి స్పందన పొందినట్లు, ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో శాంతను నటించిన డవుక్కిడిలాన డిముక్కిడిలాన అనే పాటను నటుడు ధనుష్ నుంచి పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించినట్లు చిత్ర వర్గాలు తెలిపారు.ఈ చిత్రం పొంగల్ పండగ సందర్భంగా 14న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు శాంతను మాట్లాడుతూ ఒక రోజు పార్తిబన్ తనను పిలిపించి తాను కోడిట్ట ఇడంగళై నిరప్పుగా అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు, అందులో నువ్వే కథానాయకుడివి, రేపే షూటింగ్ అని అన్నారన్నారు.దీంతో సంతోషం కలిగినా, మరో పక్క ఆశ్చర్యం కలిగిందన్నారు. అయినా పార్తిబన్ పై అభిమానం, నమ్మకంతో కథ కూడా అడగకుండా ఓకే చెప్పి షూటింగ్‌కు రెడీ అయ్యానన్నారు.అయితే పార్తిబన్ తనను చాలా రోజులు రహస్యంగా గమనిస్తూ వచ్చినట్లు ఆ తరవాత తెలిసిందన్నారు. మామూలు చిత్రాలకు భిన్నంగా చిత్రాలను రూపొందించే పార్తిబన్ దర్శకత్వం లో నటించడం చాలా ఆనందం గా ఉందన్నారు.కోడిట్ట ఇడంగళై నిరప్పుగా చిత్రంలో కొత్త శాంతనును ప్రేక్షకులు చూస్తారని ఆయన అన్నారు. -
పార్తిబన్ కు సెన్సార్ షాక్!
నటుడు, దర్శకుడు పార్తిబన్ కు సెన్సార్‌బోర్డు షాక్ ఇచ్చింది. ఇప్పుడు సెన్సార్ అనేది చాలా మందికి తలనొప్పిగా మారింది. అందుకు కారణం వినోదపు పన్ను రాయితీలే. సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ అందించిన చిత్రాలకు వినోదపు పన్ను రాయితీలు వర్తించవు. యూ సర్టిఫికెట్లు కోసం చిత్ర దర్శక నిర్మాతలు ఆశించేది అందుకే. ఇటీవల సూర్య నటించిన ఎస్–3 చిత్రానికీ యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఆ చిత్ర నిర్మాత రివైజింగ్ కమిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్తిబన్ తాజాగా స్వీయ దర్శకత్వంలో ముఖ్య పాత్ర పోషించిన చిత్రం కోడిట్ట ఇడంగళై నిరప్పుగా. నటుడు శాంతను భాగ్యరాజ్, నటి పార్వతినాయర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 23నే విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని ఈ నెల 30కి వాయిదా వేసినట్లు సమాచారం. కోడిట్ట ఇడంగళై నిరప్పుగా చిత్రానికి సెన్సార్ యూ/ ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో పార్తిబన్ తో సహా చిత్ర యూనిట్ షాక్‌కు గురైంది. అయితే ఈ విషయంలో రివైజింగ్ కమిటీకి వెళ్లాలని భావించినా, అలాంటి నిర్ణయంతో చిత్ర విడుదల మరింత ఆలస్యం అవుతుందన్న భావనతో చిత్రానికి యూ/ ఏ సర్టిఫికెట్‌తోనే విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
పార్తిబన్ గురునమస్కారం!
నానాటికీ విలువలు పడిపోతున్న ఈ రోజుల్లో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్న పదాలకు అర్థాలు మారిపోతున్న ఈ తరంలో దర్శక నటుడు పార్తిబన్ ఒక బృహత్తర కార్యాన్ని ఆదివారం నిర్వహించారు. గురు నమస్కారం పేరుతో తనకు దర్శకత్వంలో ఓనమాలు నేర్పించిన గురువు దర్శకుడు కే. భాగ్యరాజ్‌కు ఘన సత్కారాన్ని నిర్వహించారు.ఆయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కోడిట్ట ఇడంగళై నిరప్పుగా. ఇందులో తన గురువు భాగ్యరాజ్ కొడుకు శాంతనను ీహ రోగా ఎంపిక చేసుకున్నారు. కే.సత్య సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం స్థానిక అడయారులోని ఇమేజ్ ఆడిటోరియంలో నిర్వహించారు. అందులో భాగంగా తన గురువు కే.భాగ్యరాజ్‌కు గరునమస్కారం పేరుతో ఘన సన్మానం చేశారు. ఇదే వేదికపై దర్శకుడు పాండియరాజన్ సహా కే.భాగ్యరాజ్ శిష్యులందరూ కలిసి మరుప్పేనా(మరచిపోగలనా) పేరుతో జ్ఞాపికను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా కోడిట్ట ఇడంగళ్ నిరప్పుగా చిత్ర దర్శకుడు పార్తిబన్ మాట్లాడుతూ తన గురువుకు ఆ సత్కారంతో పాటు మరో కానుక కూడా ఉందన్నారు. తాను నిర్మించనున్న చిత్రానికి తన గురువు కే.భాగ్యరాజ్ దర్శకత్వం వహించనుండడమే ఆ కానుక అని పేర్కొన్నారు. చెప్పడమే కాదు అందుకు అడ్వాన్‌సను కూడా అందించారు. ఆ చిత్రంలో కథానాయకుడుగా ఈయన వారసుడు శాంతనునే నటిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగ్యరాజ్ గురువు భారతీతాజా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎస్పీ.ముత్తురామన్, కేఎస్.రవికుమార్, శంకర్, గాయకుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం, నటుడు శివకుమార్, ప్రభు, ఎం.విశాల్, కార్తీ, నటి సుహాసిని, రోహిణి, సుకన్య, లిజీ, ఏవీఎం.శరవణన్, కలైపులి ఎస్.థాను, ఎస్వీ.శేఖర్, లింగుస్వామి అతిథులుగా పాల్గొన్నారు. -
వారి చిత్రాల విడుదలే ఓ పండుగ!
పండుగ రోజుల్లో పెద్ద హీరోల చిత్రాల విడుదల అవసరం లేదని ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు పార్తిబన్ వ్యాఖ్యానించారు. కథై తిరైకథై వచనం ఇయక్కం వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఈయన కీలక పాత్రలో నటిస్తూ దర్శక నిర్మాణ బాధ్యతలు, నిర్వహిస్తున్న చిత్రం కోడిట్ట ఇడంగళై నిరప్పుగ. పది మంది ఫండింగ్ నిర్మాతలతో కలిసి రీల్ ఎస్టేట్ కంపెనీ ఎల్ఎల్పీ, బైయోస్కోప్ ఫిలిం ఫ్రేమ్స్ సంస్థలపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు బుధవారం సాయంత్రం ఆయన చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దర్శక నటుడు కే.భాగ్యరాజ్ వారసుడు, యువ నటుడు శాంతను కథానాయకుడిగా పార్వతీనాయర్ నాయకిగా నటించిన ఈ చిత్రంలో తంబిరామయ్య, సింగంపులి, ఆనవి ముఖ్య పాత్రలు పోషించారు. పార్తిబన్ కీలక పాత్రలోనూ, నటి సిమ్రాన్, అరుణ్‌విజయ్ అతిథి పాత్రల్లోనూ నటించిన ఈ చిత్రానికి అర్జున్ జెనా ఛాయాగ్రహణం, సత్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను పార్తిబన్ తెలియజేస్తూ కథై తిరైకథై వచనం ఇయక్కం చిత్రాన్ని చూసిన కొందరు కాస్త కన్ఫ్యూజన్గా ఉందని అన్నారన్నారు.అరుుతే ప్రేక్షకులు చాలా తెలివిగా ఉన్నారని, వారు ఆ చిత్రాన్ని విజయవంతం చేశారని పేర్కొన్నారు. ఈ చిత్రం ఇచ్చిన ధైర్యంతోనే ఈ కోడిట్ట ఇడంగళై నిరంపుగ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ఏ ఫిలిం విత్ మిస్టెక్స్ అనే టాగ్‌ను పెట్టినట్లు తెలిపారు. చిత్రంలో ముద్దు సన్నివేశాలు ఉన్నట్లున్నాయన్న ప్రశ్నకు ముద్దు సన్నివేశాలే కాదు మొత్తం రొమాన్స సన్నివేశాలతో చిత్రం యమ కిక్ ఇస్తుందని బదులిచ్చారు. ఒక శిష్యుడిగా తన గురువు కే.భాగ్యరాజ్‌కు ఏదైనా చేయాలనుకున్నానని, అందులో భాగంగా ఆయన వారసుడు శాంతనును ఈ చిత్రంలో హీరోగా తీసుకున్నానని తెలిపారు. ఇది తనకు మంచి టేకాఫ్ ఆరుుతే తనకంటే సంతోషించేవారెవరూ ఉండరని పేర్కొన్నారు. ఈ చిత్ర ఆడియోను డిసెంబర్ నాలుగవ తేదీన, చిత్రాన్ని అదే నెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మండలికి ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానన్నారు. పండగల సందర్భాల్లో పెద్ద హీరోల చిత్రాలు విడుదలవ్వాల్సిన అవసరం లేదన్నారు.వారి చిత్రాల విడుదలే పండగ అని, అందువల్ల ఆ సందర్భాల్లో చిన్న చిత్రాల విడుదలకు అవకాశం ఇస్తే చిన్న నిర్మాతలు నాలుగు డబ్బులు సంపాదించుకుంటారని పార్తిబన్ అన్నారు.