కొత్త శాంతను..
కోడిట్ట ఇడంగళై నిరంప్పుగా చిత్రంలో కొత్త శాంతనును చూస్తారని అంటున్నారు ఆ చిత్ర కథానాయకుడు. ఈయన తన తండ్రి భాగ్యరాజ్ శిషు్యడు పార్తిబన్ దర్శకత్వంలో నటించిన చిత్రం కోడిట్ట ఇండగళై నిరప్పుగా. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌లు ఇటీవల విడుదలై ప్రేక్షకుల మధ్య మంచి స్పందన పొందినట్లు, ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో శాంతను నటించిన డవుక్కిడిలాన డిముక్కిడిలాన అనే పాటను నటుడు ధనుష్ నుంచి పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించినట్లు చిత్ర వర్గాలు తెలిపారు.ఈ చిత్రం పొంగల్ పండగ సందర్భంగా 14న విడుదలకు ముస్తాబవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు శాంతను మాట్లాడుతూ ఒక రోజు పార్తిబన్ తనను పిలిపించి తాను కోడిట్ట ఇడంగళై నిరప్పుగా అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు, అందులో నువ్వే కథానాయకుడివి, రేపే షూటింగ్ అని అన్నారన్నారు.దీంతో సంతోషం కలిగినా, మరో పక్క ఆశ్చర్యం కలిగిందన్నారు. అయినా పార్తిబన్ పై అభిమానం, నమ్మకంతో కథ కూడా అడగకుండా ఓకే చెప్పి షూటింగ్‌కు రెడీ అయ్యానన్నారు.అయితే పార్తిబన్ తనను చాలా రోజులు రహస్యంగా గమనిస్తూ వచ్చినట్లు ఆ తరవాత తెలిసిందన్నారు. మామూలు చిత్రాలకు భిన్నంగా చిత్రాలను రూపొందించే పార్తిబన్ దర్శకత్వం లో నటించడం చాలా ఆనందం గా ఉందన్నారు.కోడిట్ట ఇడంగళై నిరప్పుగా చిత్రంలో కొత్త శాంతనును ప్రేక్షకులు చూస్తారని ఆయన అన్నారు.