రతన్ టాటా చివరి రోజుల్లో నీడగా.. ఎప్పుడూ వెన్నంటే ఉన్న శంతను నాయుడు తన కొత్త ప్యాషన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. నాయుడు స్థాపించిన రీడింగ్ కమ్యూనిటీ 'బుకీలు'.. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు నిశ్శబ్దంగా చదవడానికి ప్రజలను ఒకచోట చేర్చింది. మొదటి ముంబైలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్.. తరువాత పూణే, బెంగళూరులకు విస్తరించింది. ఇప్పుడు జైపూర్‌లో ప్రారంభించనున్నట్లు సమాచారం.
డిసెంబర్ 8న శంతను నాయుడు జైపూర్ బుకీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం జరగబోయే ఈవెంట్‌లో చేరమని పాఠకులను ఆహ్వానిస్తున్నట్లు ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జైపూర్‌లో ప్రారంభించిన తరువాత.. ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్, సూరత్‌తో సహా ఇతర భారతీయ నగరాలకు బుకీలను విస్తరించాలని నాయుడు యోచిస్తున్నారు. గత నెలలో అతను బెంగళూరులో విజయవంతమైన రీడింగ్ సెషన్‌ను నిర్వహించారు. పఠనాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా బుకీలను ప్రారంభించారు. మనిషికి చదువు లేదా చదవడం చాలా ప్రధానమైనదని.. బుకీస్ ఈవెంట్‌లో శంతను నాయుడు పేర్కొన్నారు.
రతన్ టాటా & శంతను నాయుడు స్నేహం
రతన్ టాటా తన వీలునామాలో శంతను నాయుడుని చేర్చారు. దూరదృష్టి గల నాయకుడితో 30-ఏళ్ల ప్రత్యేక బంధాన్ని నొక్కి చెప్పారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. నాయుడు వెంచర్ గుడ్‌ఫెలోస్‌లో టాటా తన వాటాను వదులుకున్నారని, అతని విద్యా రుణాలను మాఫీ చేశారని సమాచారం. రతన్ టాటా మరణించిన తరువాత తన బాధను వ్యక్తం చేస్తూ.. వీడ్కోలు, నా ప్రియమైన లైట్‌హౌస్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment