Shantanu
-
రతన్ టాటా ఫ్రెండ్.. శంతను నాయుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?
రతన్ టాటా చివరి రోజుల్లో నీడగా.. ఎప్పుడూ వెన్నంటే ఉన్న శంతను నాయుడు తన కొత్త ప్యాషన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. నాయుడు స్థాపించిన రీడింగ్ కమ్యూనిటీ 'బుకీలు'.. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు నిశ్శబ్దంగా చదవడానికి ప్రజలను ఒకచోట చేర్చింది. మొదటి ముంబైలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్.. తరువాత పూణే, బెంగళూరులకు విస్తరించింది. ఇప్పుడు జైపూర్‌లో ప్రారంభించనున్నట్లు సమాచారం.డిసెంబర్ 8న శంతను నాయుడు జైపూర్ బుకీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం జరగబోయే ఈవెంట్లో చేరమని పాఠకులను ఆహ్వానిస్తున్నట్లు ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జైపూర్‌లో ప్రారంభించిన తరువాత.. ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్, సూరత్‌తో సహా ఇతర భారతీయ నగరాలకు బుకీలను విస్తరించాలని నాయుడు యోచిస్తున్నారు. గత నెలలో అతను బెంగళూరులో విజయవంతమైన రీడింగ్ సెషన్‌ను నిర్వహించారు. పఠనాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా బుకీలను ప్రారంభించారు. మనిషికి చదువు లేదా చదవడం చాలా ప్రధానమైనదని.. బుకీస్ ఈవెంట్లో శంతను నాయుడు పేర్కొన్నారు.రతన్ టాటా & శంతను నాయుడు స్నేహంరతన్ టాటా తన వీలునామాలో శంతను నాయుడుని చేర్చారు. దూరదృష్టి గల నాయకుడితో 30-ఏళ్ల ప్రత్యేక బంధాన్ని నొక్కి చెప్పారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. నాయుడు వెంచర్ గుడ్‌ఫెలోస్‌లో టాటా తన వాటాను వదులుకున్నారని, అతని విద్యా రుణాలను మాఫీ చేశారని సమాచారం. రతన్ టాటా మరణించిన తరువాత తన బాధను వ్యక్తం చేస్తూ.. వీడ్కోలు, నా ప్రియమైన లైట్‌హౌస్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Mumbai Bookies (@mumbaibookies) -
రతన్ టాటా శునకం ‘గోవా’పై అసత్య ప్రచారం
ఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త, స్వర్గీయ టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86)మరణం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. కొద్ది రోజుల కిందట అనారోగ్యం వార్తలపై స్పందించిన ఆయన.. బాగున్నానంటూ పోస్టు పెట్టారు. అయితే, గత బుధవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికీ రతన్ టాటా మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.ఈ నేపథ్యంలో ‘రతన్ టాటా మరణాన్ని తట్టుకోలేక ఆయన పెంపుడు శునకం ‘గోవా’ చనిపోయింది. అందుకే మనుషుల కంటే మూగు జీవాలే నయం అంటూ’ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ముంబై యానిమల్ హీరోగా ప్రశంసలందుకుంటున్న సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుడాల్కర్ అప్రమత్తమయ్యారు. శునకం గోవా మరణంపై వాట్సప్‌లో జరుగుతున్న ప్రచారంపై టాటాకు అత్యంత విశ్వాసపాత్రుడైన అసిస్టెంట్‌గా వ్యవహరించిన శంతను నాయుడుతో సంప్రదింపులు జరిపారు. శంతను సైతం శునం గోవా క్షేమంగా ఉందని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారని ఎస్సై సుధీర్ కుడాల్కర్ తెలిపారు. శునకం గోవాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపారు. ముంబై యానిమల్ హీరో ఎస్సై సుధీర్ కుడాల్కర్బోరివలిలోని ఎంహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై సుధీర్ కుడాల్కర్ జంతు ప్రేమికుడు. ఓ వైపు పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ .. మరోవైపు స్టేషన్‌తో పాటు ఇతర పరిసర ప్రాంతాల్లో శునకాలు, పిల్లులకు క్రమం తప్పకుండా ఆహారంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. జంతువుల పట్ల ఆయనకున్న పట్ల ప్రేమ, కరుణపై జంతు హక్కుల ఉద్యమ సంస్థ ‘పెటా’ గుర్తింపు తెచ్చి పెట్టింది.👉చదవండి : ఒక టాటా.. ఒక గోవా! -
చరిత్ర మరువదు.. మీ ఘనత
ముంబై: ‘‘ఈ స్నేహంలో అగాధం ఇప్పుడు నాతో ఉండిపోయింది. నా మిగిలిన జీవిత కాలంలో దీన్ని పూరించేందుకు కృషి చేస్తాను’’అంటూ శంతను నాయుడు తన స్పందనను వ్యక్తం చేశారు. 31ఏళ్ల ఈ యువకుడు రతన్‌టాటాకు అత్యంత విశ్వసనీయ సహచరుడు. వృద్ధాప్యంలో ఆయన బాగోగులు చూసుకున్న ఆప్త మిత్రుడు. రతన్‌టాటా అంతిమయాత్ర వాహనం ముందు యెజ్డీ మోటారుసైకిల్ నడుపుతున్న శంతనునాయుడిని చూసే ఉంటారు. ‘‘దుఃఖం అనేది ప్రేమకు చెల్లించాల్సిన మూల్యం. గుడ్‌బై, నా ప్రియమైన దీపస్తంభం’’అంటూ చిన్న పోస్ట్ పెట్టాడు. టాటా గ్రూప్‌లో ఐదవ తరం ఉద్యోగి శంతనునాయుడు. 2014లో రతన్‌టాటా, శంతను కలుసుకున్నారు. వీధి శునకాల పట్ల ప్రేమ వీరిద్దరినీ కలిపిందని చెప్పుకోవాలి. వీధి శునకాలు రాత్రి వేళల్లో వాహన ప్రమాదాలకు గురి కాకుండా, వాటి కోసం మెరిసే కాలర్లను శంతను డిజైన్ చేశాడు. కుక్కల మెడలో ఈ కాలర్‌ను ఉంచితే, రాత్రివేళ వాహన వెలుగులకు మెరవడంతో డ్రైవర్లు వాటిని గుర్తిస్తారన్నది అతడి యోచన. ఇందుకు నిధుల సాయం కావాలంటూ రతన్‌టాటాకు లేఖ రాశాడు. ముంబైలోని తన కార్యాలయానికి రావాలని, తనతో కలసి పనిచేయాలంటూ రతన్ టాటా నుంచి శంతనుకు పిలుపు వచి్చంది. రతన్‌టాటా సహకారంతో మోటోపాస్ అనే కంపెనీని శంతను స్థాపించాడు. వృద్ధులకు తోడుగా యువ సహచరులను కలిపే స్టార్టప్ ‘గుడ్ ఫెలోస్’ను సైతం స్థాపించాడు. ఆ తర్వాత ఎంబీఏ కోసం యూఎస్ వెళుతూ. తిరిగి వచి్చన తర్వాత కలసి పనిచేస్తానని రతన్‌టాటాకు శంతను హామీఇచ్చాడు. తిరిగొచి్చన తర్వాత రతన్‌టాటా అసిస్టెంట్‌గా, టాటా ట్రస్ట్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. రతన్‌టాటా తుదిశ్వాస విడిచే వరకు ఆయన వెన్నంటి ఉన్నాడు. -
శ్రుతి హాసన్‌తో బ్రేకప్.. సారీ అంటూ క్లారిటీ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తన బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తన బాయ్‌ఫ్రెండ్ శాంతాను హజారికా రియాక్ట్ అయ్యాడు. గత కొద్దిరోజులుగా జంట డేటింగ్లో ఉన్నారు. కానీ, శృతి, శాంతాను ఇద్దరూ తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో ఒకరినొకరు ఫాలో అవడం మానేశారు. దీంతో వీళ్ల బ్రేకప్ వార్తలు బయటకొచ్చాయి.ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ 'శాంతాను హజారికా'తో శ్రుతి హాసన్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని ఆమె కొంత కాలం క్రితం క్లారిటీ ఇచ్చింది. అయితే బ్రేకప్ వార్తలు వైరల్ అయిన తర్వాత శ్రుతి హాసన్ నుంచి ఎలాంటి రియాక్షన్ అయితే రాలేదు.కానీ, శాంతాను హజారికా తాజాగా తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. "నన్ను క్షమించండి, నేను దానిపై వ్యాఖ్యానించదలచుకోలేదు" అని శాంతను బాంబే టైమ్స్‌తో అన్నాడు. వారిద్దరూ స్నేహపూర్వకంగానే విడిపోయారని ఖచ్చితమైన సమాచారం ఉందంటూ కథనాలు వస్తున్నాయి. "వ్యక్తిగత విభేదాలు ఉన్నందున, వారు స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు" అని అంతర్గత వ్యక్తి పేర్కొన్నట్లు ఆ పత్రిక తెలిపింది.శ్రుతి విడిపోవడం గురించి రియాక్ట్ కాలేదు. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో "ఇది ఒక క్రేజీ రైడ్.., నా గురించే కాకుండా ఇతర వ్యక్తుల గురించి చాలా నేర్చుకున్నాను" అని షేర్ చేసింది. ఆపై బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న పోటోలు, పోస్ట్‌లను కూడా ఆమె తొలగించింది. శాంతనుకు ముందు లండన్ బేస్డ్ మైకేల్ కోర్సల్‌తో ప్రేమలో పడింది శృతి.. అతడి కొంతకాలం డేటింగ్ అనంతరం సడన్‌గా బ్రేకప్ అంటూ ట్విస్ట్ ఇచ్చింది. మళ్లీ ఈ లవ్ స్టోరీకి కూడా ఫుల్స్టాప్ పడినట్లు అయింది. -
మళ్లీ పౌరసత్వ రగడ!
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అంశం మరోసారి దుమారం రేపుతోంది. సీఏఏను వారం రోజుల్లో దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ ప్రకటించడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇది లోక్‌సభ ఎన్నికల లబ్ధి కోసం చేసిన ఉత్తుత్తి ప్రకటన అంటూ తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపారేసింది. 2019లోనే మోదీ సర్కారు సీఏఏ చట్టం చేసినా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలతో దాని అమలు వాయిదా పడుతూ వస్తోంది. కానీ సీఏఏ అమలుపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు పట్టుదలగా ఉందని ఇటీవలి వరుస పరిణామాలు చెబుతున్నాయి. ఎవరేమనుకున్నా దేశమంతటా దాని అమలు తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా గత నెలలోనే స్పష్టం చేశారు. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కలి్పంచడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచి్చన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కలి్పస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. ఎందుకు వ్యతిరేకత... ఈశాన్య రాష్ట్రాలు, పశి్చమబెంగాల్తో పాటు దేశ రాజధాని ప్రాంతంలోనూ పాక్, బంగ్లా, అఫ్గాన్ల నుంచి వలస వచి్చన ముస్లిమేతర మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా బెంగాల్లో మతువా సామాజిక వర్గంలో అత్యధికులు బంగ్లాదేశ్‌లో తమపై ముస్లింల అణచివేత, తీవ్ర హింసాకాండను తట్టుకోలేక 1950ల నుంచీ వలస వచి్చన వారే. వీరంతా 1990ల నాటికే బెంగాల్లో ప్రబలమైన ఓటు బ్యాంకుగా స్థిరపడ్డారు. దాంతో వీరి మద్దతు కోసం పార్టీలన్నీ ప్రయతి్నంచడం పరిపాటిగా మారింది. నిజానికి సీఏఏ అమలుతో అత్యధికంగా లబ్ధి పొందేది మతువాలేనంటారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది అక్రమంగా ప్రవేశించారు. సీఏఏ అమల్లోకి వస్తే వీరంతా ఎలాంటి ధ్రువీకరణలతోనూ నిమిత్తం లేకుండా నేరుగా భారత పౌరసత్వం పొందుతారు. అలా చేస్తే వీరంతా మెజారిటీ పౌరులుగా మారతారని స్థానికులంటున్నారు. దాంతో హక్కులు, సంస్కృతీ సంప్రదాయాలకు భంగం కలగడమే గాక ఉపాధి అవకాశాలకూ దెబ్బ పడుతుందన్నది వారి వాదన. పైగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి మరింత భారీగా వలసలకు ఇది బాటలు వేస్తుందని వారంటున్నారు. దాంతో 2019లో సీఏఏ బిల్లుకు చట్టబద్ధత రాగానే దాని అమలును వ్యతిరేకిస్తూ ఆయా రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. అసోం తదితర రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చెలరేగుతున్నాయి. ముస్లింలలోనూ ఆందోళన... ముస్లింల నుంచి కూడా సీఏఏపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ప్రధానంగా తమనే లక్ష్యం చేసుకుని తెచి్చన చట్టమన్నది వారి అభ్యంతరం. ‘‘ఏ ధ్రువీకరణ పత్రాలూ లేని ముస్లింలపై అక్రమ వలసదారులుగా సీఏఏ సాయంతో ముద్ర వేస్తారు. ఈ కారణంగానే ఇతర దేశాల నుంచి వలస వచి్చన ముస్లిం మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయడం లేదు’’ అన్నది వారి వాదన. పాకిస్తాన్లో షియా తదితర ముస్లింలు కూడా తీవ్రమైన అణచివేతకు గురై భారత్ వలస వచ్చారని, సీఏఏ అమలుతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని వారంటున్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ పలు ముస్లిం వర్సిటీల్లో కూడా విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. వాటిని అణచివేసే క్రమంలో జరిగిన ఘర్షణలు ప్రాణ నష్టానికీ దారి తీశాయి. కేంద్రం మాత్రం పాక్, బంగ్లా, అఫ్గాన్ వంటి దేశాల్లో ముస్లింలపై అకృత్యాల వాదనను తోసిపుచ్చుతోంది. మరోవైపు టిబెట్, మయన్మార్, శ్రీలంకల నుంచి వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయకపోవడం అన్యాయమన్న విమర్శలూ ఉన్నాయి. సుప్రీంలో వివాదం: ఈ నేపథ్యంలో మొత్తంగా సీఏఏ చట్టం రాజ్యాంగబద్ధతనే సవాలు చేస్తూ తృణమూల్‌తో పాటు కాంగ్రెస్, ఆర్జేడీ, మజ్లిస్ తదితర పక్షాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. జమాయిత్ ఉలేమా ఇ హింద్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇంప్లీడయ్యాయి. వీటిపై విచారణ తుది దశకు చేరుతోంది. ఎన్ఆర్సీ రగడ... సీఏఏలో భాగంగా తెరపైకి వచి్చన జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) కూడా వివాదానికి మరింతగా ఆజ్యం పోసింది. అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు పంపడం దీని ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా వలసదారుల నివాస తదితర ధ్రువీకరణ పత్రాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా పౌరసత్వానికి చట్టపరంగా అర్హులైన జాబితాను రూపొందిస్తారు. సరైన పత్రాలు లేనివారిని అక్రమ వలసదారులుగా నిర్ధారిస్తారు. 2020లో అసోంలో మాత్రమే అమలు చేసిన ఎన్ఆర్సీని దేశవ్యాప్తం చేస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. దీనిపైనా రగడ కొనసాగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్రేకప్.. 8 ఏళ్లు దూరంగా ఉన్నాం: గుంటూరు కారం నటుడు
శాంతను భాగ్యరాజ్.. తండ్రి భాగ్యరాజ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఇతడు తర్వాతి కాలంలో హీరోగా మారాడు. సక్కరకత్తి సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే రావణ కొట్టంతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం అతడు బ్లూ స్టార్ సినిమా చేస్తున్నాడు. అలాగే తెలుగులో మహేశ్‌బాబు గుంటూరు కారం సినిమాలోనూ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా అతడు తన భార్య కికి విజయ్‌తో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముందుగా శాంతను మాట్లాడుతూ.. 'మేము ప్రేమించుకుంది, బ్రేకప్ చెప్పుకుంది రెండూ వాస్తవమే! ఎనిమిదేళ్లు దూరంగా ఉన్నాం. ఆ తర్వాత ఓ సందర్భంలో మరోసారి లవ్‌లో పడ్డాం. అప్పట్లో చిన్నచిన్న విషయాలను కూడా బాగా గొడవపడేవాళ్లం' అని ఆనాటి క్షణాలను గుర్తు చేసుకున్నాడు. కికి మాట్లాడుతూ.. 'శాంతనుతో లవ్‌లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది.. నాకిప్పటికీ బాగా గుర్తుంది. నా స్నేహితురాలు ఒకరు ఫోన్ చేసి శాంతను వేరే అమ్మాయితో కాఫీ షాప్‌లో ఉన్నాడని చెప్పింది. నేను వెంటనే శాంతనుకు కాల్ చేసి నువ్వెక్కడ ఉన్నావ్? అని ఆరా తీశాను. అతడు తన తండ్రితో ఉన్నానని అబద్ధం చెప్పాడు. ఇలా మా మధ్య చిన్న చిన్నవే పెద్ద గొడవలుగా మారాయి. మేము బ్రేకప్ చెప్పుకున్నాం. 8 ఏళ్లు విడివిడిగానే జీవించాం. కానీ ఓ షోలో ఇద్దరం కలిసి డ్యాన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మళ్లీ కలిసిపోయాం' అని చెప్పుకొచ్చింది. వీరిద్దరూ 2015లో పెళ్లి చేసుకున్నారు. చదవండి: అన్న సమాధి దగ్గర భార్య సీమంతం.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో భార్య -
అతనిలో నాకు నచ్చింది అదే.. లవర్‌పై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్!
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న భామ శృతిహాసన్. బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన భామ పలు చిత్రాల్లో నటించారు. అయితే ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలోనే టచ్‌లో ఉంటోంది కోలీవుడ్ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటోంది. తన ప్రియుడు శాంతను హజారికాతో కలిసి రొమాంటిక్ వీడియోస్ సైతం అభిమానులతో పంచుకుంటోంది. (ఇది చదవండి: సురేఖవాణి కూతురు బర్త్‌డే.. పబ్‌లో డ్యాన్స్ చేస్తూ! ) అయితే తాజాగా శ్రుతి హాసన్ తన ప్రియుడి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం ప్రియుడితో కలిసి ముంబైలో ఉంటున్న ముద్దుగుమ్మ.. షూటింగ్‌లు లేకపోతే వెంటనే ఫ్లాట్‌కు వెళ్లి శంతనుతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ జంట నెట్టింట్లో చేసే హంగామా అంతా ఇంతా కాదు. చాలా గ్యాప్ తరువాత యాక్షన్ సీక్వెన్స్, బాక్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది శృతి. తాజాగా శంతనుతో కలిసి ఫన్నీ క్విజ్‌ను నిర్వహించగా.. వీరికి ఫ్యాన్స్ రకరకాల ప్రశ్నలు సంధించారు. ఎవరు బాగా వండుతారు? అనే ప్రశ్నకు నేనే బాగా వండుతా ఉంటూ ఆన్సరిచ్చింది. ఆ తర్వాత ఎవరు బాగా తింటారు? అనే దానికి శంతను అంటూ చెప్పుకొచ్చింది. మీ లవర్‌లో నచ్చే లక్షణాలు ఏంటి? అనే ప్రశ్నకు శృతి హాసన్ ఆసక్తికర సమాధానం చెప్పింది. అదేంటో తెలుసుకుందాం. తన లవర్ గురించి శృతి మాట్లాడుతూ..'శంతను ఎంతో టాలెంట్ ఉన్నవాడు. నన్ను బాగా నవ్విస్తాడు. అయితే కాస్త వింతగా కూడా ప్రవర్తిస్తాడు. నన్ను ఎక్కువగా ఇష్టపడతాడు. అతని కళ్లు అంటే చాలా ఇష్టం. ' అంటూ తన ప్రేమను వెల్లడించింది. ఎవరు ఎక్కువగా సారీ చెబుతుంటారని నెటిజన్స్ ప్రశ్నించగా.. ఎప్పుడైనా సరే తాను సారీ చెప్పాల్సిందేనని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ ఏడాదిలో శృతిహాసన్ నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ముద్దులతో రెచ్చిపోయిన శృతిహాసన్.. మండిపడుతున్న నెటిజన్స్..!) -
ఈసారి బర్త్‌డేకి అలా కోరుకున్నా!
‘నిన్ను నిన్నుగా నువ్వు ప్రేమించుకోవడాన్ని మర్చి΄ోకు’’ అంటున్నారు శ్రుతీహాసన్. శనివారం (జనవరి 28) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు శ్రుతి. ‘‘నా జీవితం ఎంత గొప్పగా సాగుతోందో, మాటల్లో వర్ణించలేని ప్రేమను ఎంతగా ΄÷ందగలుగుతున్నానో (కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్, ఫ్రెండ్స్‌ని ఉద్దేశించి) అనే ఆనందమైన ఆలోచనలతో నిద్ర లేచాను. ప్రతి ఏడాదీ నా బర్త్ డే కేక్‌పై ఉన్న కొవ్వొత్తులను ఆర్పిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. కానీ ఈ ఏడాది మాత్రం నా కోసమే కాదు.. అందరి కోసం కోరుకున్నాను. అందరూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపాలని, వారు కోరుకున్నది వారికి దక్కేలా పరిస్థితులు అనుకూలించాలని కోరుకుంటున్నాను. నిజం చె΄్పాలంటే... ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతూనే ఉంటుంది. ప్రతి బర్త్ డేకి వయసు సంఖ్య పెరగడం సహజం. ఆ అనుభవం రీత్యా కాస్త తెలివైనవాళ్ళం కూడా అవుతుంటాము (సరదాగా..). అలాగే ఈ ప్రపంచమనే యుద్ధంలో ప్రతిసారీ ఒంటరి సైనికుడిలా నెగ్గుకు రాలేమని కూడా అర్థం అవుతోంది. అయితే నా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతో తెలివైనవారు, సానుకూల దృక్పథంతో ఉన్నవారు ఉన్నందుకు నేనే వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ ప్రపంచంలో నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. సో.. నీ ప్రత్యేకతను నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి’’ అని రాసుకొచ్చారు శ్రుతీహాసన్. కాగా ఈ బర్త్ డేని శ్రుతీహాసన్ చాలా సందడిగా జరుపుకున్నట్లుగా ఫొటోలు చెబుతున్నాయి. ఈ వేడుకల్లో శ్రుతీ తల్లి సారిక, చెల్లి అక్షరాహాసన్లతో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్ శంతను హజారికా, బాలీవుడ్ నటి కాజోల్ కూడా పాల్గొన్నారు. ఇక సినిమాల విషయాని వస్తే.. ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’లో హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే ‘ది ఐ’ అనే ఇంగ్లిష్ ఫిల్మ్‌లో శ్రుతి ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. -
నీకన్నా బాగా చూసుకునే వ్యక్తి ఈ ప్రపంచంలోనే లేరు: శృతిహాసన్
తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్రనాయికల్లో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో నటించింది తమిళ భామ. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. కాగా.. ఈ కోలీవుడ్ భామ శాంతను హజారికాతో రిలేషన్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రుతి హాసన్, తన ప్రియుడు శాంతను హజారికాతో ఫోటోను తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. తన ప్రేమను వెల్లడిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా చేసింది. తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో రాస్తూ..' ఈ ప్రపంచంలో నీకంటే సంతోషంగా నన్ను ఎవరూ చూసుకోలేరు' అంటూ ఫన్నీ ఎమోజీలు జతచేసింది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇటీవల వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శృతి హాసన్ హాజరు కాకపోవడంతో ట్రోల్స్‌కు గురైంది. దీంతో తాను అనారోగ్య కారణాలతోనే హాజరు కాలేదని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాగా.. ఆమె ప్రశాంత్ నీల్ రాబోయే యాక్షన్ చిత్రం సలార్‌లో ప్రభాస్‌కు జోడీగా కనిపించనుంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, మధు గురుస్వామి, ఈశ్వరీరావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
శాంతనుకు శ్రుతి బ్రేకప్ చెప్పిందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
హీరోయిన్ శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాలతోనే కాదు వ్యక్తిగత విషయాల ద్వారా కూడా శ్రుతి తరచూ వార్తల్లో నిలుస్తోంది. తన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటు ఉంటుంది. ఇక పర్సనల్ లైఫ్, రిలేషన్ షిప్ విషయానికి వస్తే శ్రుతి కొంతకాలంగా శాంతను హజారిక అనే చిత్రకళాకారుడితో ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్గా శ్రుతి షేర్ చేసిన పోస్ట్ ఆమె బ్రేకప్ రూమర్లకు తెరలేపాయి. ‘నాతో నేను ఉంటేనే సంతోషం.. నా విలువైన సమయాన్ని, ఒంటరితనాన్ని ప్రేమిస్తున్నాను’ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో శ్రుతి మరోసారి ప్రేమలో విఫలం అయ్యిందని, శాంతనుతో తెగదెంపుల చేసుకుంది? అంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తన బ్రేకప్ రూమర్లకు తాజాగా శ్రుతి క్లారిటీ ఇచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో శాంతనుతో దిగిన ఫొటోను షేర్ చేసింది. దీనికి ‘ఎప్పుడు నేను కోరుకునేది ఇదే’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఒక్క ఫొటోతో శ్రుతి వీరి బ్రేకప్ వార్తలకు చెక్ పెట్టింది. చదవండి: చాలా గ్యాప్ తర్వాత మూవీ ప్రమోషన్లో నయన్, హాలీవుడ్ నటిలా లేడీ సూపర్ స్టార్ అయినప్పటికీ ఇద్దరి మధ్య ఏమైన మనస్పర్థలు వచ్చి ఉంటాయని, అవి సద్దుమనగడంతో కలిసిపోయారంటూ ఆమె ఫాలోవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా శ్రుతి శాంతనుకు ముందు లండన్ బేస్డ్ మైకేల్ కోర్సల్‌తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. అతడి కొంతకాలం డేటింగ్ అనంతరం సడన్‌గా బ్రేకప్ అంటూ ట్విస్ట్ ఇచ్చింది. అయితే తన బ్రేకప్ కారణం చెప్పలేదు. ఆ తర్వాత కొంతకాలనికి శాంతనుతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? ఆమెతోనే ఏడడుగులు! View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
మరోసారి హాట్ టాపిగ్గా మారిన శాంతను నాయుడు!
ముంబై: గుడ్‌ఫెలోస్ స్టార్టప్‌లో రతన్ టాటా ఇన్వెస్ట్ చేశారు. ఎంత మొత్తం ఆయన పెట్టుబడిగా పెట్టారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. వృద్ధులకు సాంగత్య సేవలను గుడ్‌ఫెలోస్ అందిస్తోంది. Ratan Tata Invests In Assistant Shantanu Naidu's Startup Goodfellows https://t.co/aWlu46L0gx #digitalhealth #socialmedia #digitalmarketing #IoT #healthtech #industry40 #AI #mhealth pic.twitter.com/8aEw5QLzid — Dr Timos Papagatsias (@_timos_) August 16, 2022 సీనియర్ సిటిజన్ క్లయింట్స్‌గా నియమితులైన యువత వృద్ధులతో కలిసి క్యారమ్, చెస్ ఆడడం, స్నేహితుల మాదిరిగా వారి బాగోగులు చూసుకోవాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. గుడ్‌ఫెలోస్‌ను కార్నెల్ వర్సిటీలో విద్యనభ్యసించిన 25 ఏళ్ల యువకుడు శాంతను నాయుడు స్థాపించారు. చదవండి👉 శంతన్‌నాయుడు.. రతన్‌టాటా.. ఓ ఆసక్తికర కథ ! -
బాయ్‌ఫ్రెండ్‌తో శ్రుతి మిర్రర్ సెల్ఫీ, ఫొటో వైరల్
హీరోయిన్ శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల ద్వారానే కాకుండా వ్యక్తిగత విషయాల ద్వారా కూడా శ్రుతి పాపులర్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం శాంతను హజారిక అనే చిత్రకారుడితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఆమె తరుచూ అతడితో కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తు ఉంటుంది. ఈ నేపథ్యంలో అతడిపై ప్రేమను వ్యక్తం చేస్తుంది. అలాగే శాంతను కూడా వీలు చిక్కినప్పుడల్లా ప్రియురాలు శ్రుతి గురించి పోస్ట్ పెడుతుంటాడు. చదవండి: ‘సలార్’ స్పీడ్ పెంచిన ప్రశాంత్ నీల్, షూటింగ్ పూర్తి చేయడంపై దృష్టి ఇదిలా ఉంటే తాజాగా ప్రియుడితో కలిసి దిగిన ఫొటోను శ్రుతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. శాంతానుతో కలిసి మీర్రర్ సెల్ఫీ తీసుకున్న ఫొటోను బుధవారం ఆమె పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో శ్రుతి పూర్తిగా నలుపు రంగు దుస్తులలో కూల్‌గా కనిపిస్తుండగా.. శాంతను గ్రే కార్గో ప్యాంట్‌తో జత చేసిన ఆకుపచ్చ టీ-షర్ట్‌లో డాపర్ లుక్‌లో కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జంటను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా శ్రుతి, శాంతను 2020లో తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ నుంచి వీరిద్దరు కలిసి ఒకే ఇంట్లో నివస్తిస్తున్నారు. చదవండి: సంచలన తీర్పు.. బోరున ఏడ్చేసిన హీరోయిన్ ఈ క్రమంలో ఇటీవల శాంతాను బర్త్‌డే సెలబ్రెట్ చేసిన శృతి ఆ ఫొటోలను షేర్ చేస్తూ స్పెషల్ నోట్ రాసింది. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు మై లవ్ శాంతను. ఈ ప్రపంచం మీ అద్భుతమైన శక్తిని ఎదుర్కొన్నందుకు ఆశీర్వదించబడింది. ఇక ప్రతి రోజు నిన్ను తెలుసుకుంటున్నందుకు నేను కృతజ్ఞతరాలుని’ అంటూ రాసుకొచ్చింది. కాగా గతంలో ఆమె ఓ ఫొటోగ్రాఫర్‌ను ప్రేమించిన విషయం తెలిసిందే. ఆయనతో పీకల్లోతు ప్రేమలో మునిగిన ఆమె ప్రియుడి కోసం సినిమాలను కూడా పక్కన పెట్టేసింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ సడన్‌గా వారి ప్రేమాయణానికి ఫుల్స్టాప్ పడింది. ఆ తర్వాత శాంతనుతో ప్రేమలో పడింది. ఇక శ్రుతి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో కలిసి సలార్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
ప్రేమించడానికి రోజుకో కారణం!
‘‘నిన్ను (శంతను హజారిక) ప్రేమించడానికి, గౌరవించడానికి నాకు రోజూ ఓ కొత్త కారణం దొరుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని హీరోయిన్ శ్రుతీహాసన్ అన్నారు. శ్రుతి బాయ్‌ఫ్రెండ్ శంతను చిత్రకారుడు అనే సంగతి తెలిసిందే. తాజాగా శంతను కొన్ని ఆర్ట్స్‌ను డిజైన్ చేశారు. ఈ డిజైన్స్‌ను చూసి తెగ మురిసిపోతూ, శంతను గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు శ్రుతీహాసన్. ‘‘నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ అద్భుత (ఆర్ట్ ఎగ్జిబిషన్) సాయంకాల సమయాల్లో నన్ను భాగస్వామిని చేసినందుకు నా మనసు ఆనందంతో పులకరించిపోతోంది’’ అన్నారు శ్రుతి. ఈ ఎగ్జిబిషన్లో శ్రుతీ తన మ్యూజికల్ టీమ్‌తో కలసి పాడారు. -
Shantanu Naidu: వానప్రస్థంలో రతన్ టాటాకీ అన్నీ ఈ నాయుడే
రతన్‌టాటా దేశంలో పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రియలిస్టుగా గొప్ప తెచ్చుకోవడమే కాదు మానవతావాదిగా దేశప్రజల గుండెల్లో చోటు సంపాదించిన ఘనత ఆయన సొంతం. 84 ఏళ్ల రతన్‌టాటాకి సహాయకుడిగా అన్ని సమయాల్లో తోడుండే వ్యక్తి శంతన్ నాయుడు. టాటా కుటుంబంతో ఎటువంటి సంబంధం లేని శంతన్, రతన్ టాటాకి ఎలా చేరువయ్యాడు ? ఇటీవల రతన్‌టాటా తన 84వ జన్మదిన వేడుకులను అత్యంత సాధారణంగా జరుపుకున్న వీడియో దేశవ్యాప్తంగా చాలా మంది దృష్టిని ఆకర్షించింది. వేల కోట్ల రూపాయల ఆస్తులు, సంపద ఉన్నా కేవలం ఒక కప్ కేక్‌తో తన బర్త్‌డే జరుపుకున్నారు రతన్‌టాటా. అయితే ఈ బర్త్‌డే వీడియోలో రతన్ టాటాకి కేక్ తినిపిస్తూ ఓ టీనేజ్ కుర్రాడు కనిపించాడు కదా ! అతనే శంతన్ నాయుడు. అతను టీనేజీ కుర్రాడేమీ కాదు. పూనే యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా తీసుకున్నాడు. ప్రస్తుతం టాటా గ్రూపులో డీజీఎం హోదాలో ఉన్నాడు. మలి వయసులో రతన్‌టాటాకి చేదోడు వాదోడుగా ఉంటున్నాడీ యువ ఇంజనీర్. పూనేలో పుట్టి పేరు చూసి శంతన్ నాయుడు తెలుగు వాడు అనుకునే అవకాశం ఉంది. కానీ అతని స్వస్థలం మహారాష్ట్ర. శంతన్ నాయుడు పూర్వికులు మహారాష్ట్రకి వెళ్లి స్థిరపడ్డారు. 1993లో పూనేలో జన్మించాడు శంతన్ నాయుడు. పూనే యూనివర్సిటీ నుంచి 2014లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు, ఆ తర్వాత టాటా గ్రూపులో డిజైన్ ఇంజనీరుగా జాయిన్ అయ్యాడు. ఓ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుంటే రోడ్డు మధ్యలో ఓ వీధి కుక్క చనిపోయి కనిపించింది. వాహనాలు ఆ కుక్క శవం మీదుగానే పోతున్నాయి. ఈ దృశ్యం చూసి శంతను చలించిపోయాడు. వీధి కుక్కల కోసం తన స్నేహితులతో కలిసి వీధి కుక్కల కోసం రేడియం స్టిక్కర్లతో తయారు చేసిన కాలర్స్‌ని తయారు చేశాడు. తను ఆఫీసుకు వెళ్లే దారిలో కనిపించిన కుక్కలకు వాటిని అమర్చాడు. ఆ పనికి మరుసటి రోజే స్థానికుల మంచి రెస్పాన్స్ వచ్చింది. టాటా ఇంటర్నల్ మ్యాగజైన్లో సైతం దీనిపై స్టోరీ రాశారు. ఈ క్రమంలో ముంబైలో ఉన్న వీధి కుక్కలన్నింటీ ఈ కాలర్ అమర్చాలంటూ చాలా మంది సూచించారు. అయితే నిధుల సమస్య ఎదురైంది. తండ్రితో ఈ విషయం చెబితే ‘ వీధి కుక్కలను కాపాడేందుకు సాయం చేయాల్సిందిగా రతన్ టాటాని అడుగు. ఆయనకి కుక్కలంటే ఇష్టం’ అంటూ ఐడియా ఇచ్చాడు తండ్రి. రతన్‌టాటాతో పరిచయం చివరకు వీధి కుక్కలను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడేందుకు మోటోపా పేరుతో స్టార్టప్ ఏర్పాటు చేశానని, దానికి సాయం చేయాల్సిందిగా కోరుతూ వివరాలతో కూడిన ఈ మెయిల్‌ని ఏకంగా రతన్‌టాటాకే పంపాడు. రోజులు గడిచిపోయినా అటు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో రెగ్యులర్ పనిలో పడిపోయాడు శంతన్. చివరకు రెండు నెలల తర్వాత నేరుగా తనని కలవాలంటూ రతన్‌టాటా నుంచి ఆహ్వానం అందింది. అదే రతన్‌టాటాతో శంతన్ నాయుడికి తొలి పరిచయం. వ్యక్తిగతంగా రతన్ టాటాను కలిసి తన ప్రాజెక్టు గురించి వివరించాడు శంతన్. వీధి కుక్కల పట్ల అతను చూపిన ప్రేమకు రతన్‌టాటా ఫిదా అయ్యారు. వెంటనే సాయం చేసేందుకు అంగీకరించారు రతన్‌టాటా. అటా మోటోపా స్టార్టప్ మొదలైంది. This is how @RNTata2000 celebrated his birthday. Seen along with him is his buddy Shantanu Naidu 🙂👍🎂#RatanTata pic.twitter.com/5pufpgSzpq — Adarsh Hegde (@adarshahgd) December 29, 2021 అసిస్టెంట్‌గా ఉంటావా? మరి కొన్నాళ్లకే కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు రావడంతో శంతన్ అమెరికా బయల్దేరాడు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత టాటా గ్రూపులోనే పని చేయాలంటూ శంతన్ని కోరారు రతన్‌టాటా. ఏంబీఏ పూర్తైన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత టాటా ట్రస్టులో డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో జాయిన్ అయ్యారు. అయితే కొద్ది కాలానికే శంతన్‌ను పిలిపించుకున్న రతన్ టాటా.. పని ఒత్తిడి ఎక్కువగా ఉందని.. తనకు వ్యక్తిగత సహాయకుడిగా ఉండమంటూ కోరాడు. అలా 2018 నుంచి ఇప్పటి వరకు రతన్‌టాటాకి నీడలా వెన్నంటి ఉంటున్నాడు శంతన్. ఇద్దరు మిత్రులు సాటి జీవుల పట్ల శంతన్ నాయుడికి ఉన్న ప్రేమ. మూగ జీవాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన కారుణ్యం, కార్యదక్షత రతన్‌టాటాని ఆకట్టుకున్నాయి. అంతేకాదు శంతన్నాయుడిలోని సింప్లిసిటీ, ఆలోచణ సరళి కూడా టాటాని ఆకర్షించాయి. అందుకే టాటా గ్రూపుకి చైర్మన్‌గా పదవీ విరమణ చేసి.. వానప్రస్థ జీవితం గడుపుతూ.. సహాయకుడిగా శంతన్‌ను ఎంచుకున్నారు రతన్ టాటా. ఇప్పుడీ 28 ఏళ్ల యువకుడు 84 ఏళ్ల కురు వృద్ధుడిల మధ్య యజమాని- ఉద్యోగి అనే కంటే స్నేహమే ఎక్కువగా ఉంది. రతన్ టాటా భుజంపై చెయ్యి వేసి నిల్చునే చనువు.. వెన్నుతట్టి ముద్ద తినిపించే సాన్నిహిత్యం శంతన్నాయుడి సొంతమయ్యాయి. వినూత్న ఆలోచన రతన్‌టాటా సహాయకుడిగా ఉన్ననప్పుడు గమనించిన అంశాలతో ఇప్పటికే రెండు పుస్తకాలు రచించాడు శంతన్. కాగా ఇప్పుడు మరో స్టార్టప్ మొదలు పెట్టే సన్నాహకాల్లో ఉన్నాడు. మలి వయసులో ఉన్న వృద్ధుల్లో ఒంటరితనం పోగొట్టేందుకు వీలుగా ఓ యాప్‌ని ప్రారంభించే యోచనలో ఉన్నాడు. అంటే అద్దెకు మనవళ్లు/మనవరాళ్లు అన్న మాట! - సాక్షివెబ్, ప్రత్యేకం చదవండి: Ratan Tata Love Story: ఆ యుద్ధం.. వీళ్ల ప్రేమకు శాపంగా మారింది -
అందుకే మేం విడిపోయాం: నటి
ప్రియుడు శంతను మహేశ్వరితో తన ప్రేమబంధం ముగిసిపోయిందని నటి నిత్యామీ శ్రికే తెలిపారు. ప్రేమికులుగా విడిపోయినప్పటికీ స్నేహితులుగా ఎల్లప్పుడూ కలిసే ఉంటామని స్పష్టం చేశారు. కాగా పలు టీవీ షోల్లో మెరిసిన నిత్యామీ.. నటుడు శంతనుతో కలిసి మెడికల్లీ యువర్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ క్రమంలో వారి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమకు దారి తీసింది. ఇక డాన్స్ రియాలిటీ షో నచ్ బలియే 9లో జంటగా పాల్గొన్న వీరిద్దరు అదే స్టేజ్‌పై తాము ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఏడాది తిరగకుండానే తమ మధ్య బంధం ముగిసినట్లు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ విషయం గురించి నిత్యామీ మాట్లాడుతూ.. ‘‘ఏప్రిల్ 2019లో ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో శంతనును కలిశాను. అందులో మేమిద్దరం జంటగా నటించాం. ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. (మా కుటుంబంలోకి స్వాగతం రానా: సోనం కపూర్) ఇక నచ్ బలియే షో కారణంగా దాదాపు ఐదు నెలల పాటు ఒకేచోట ఉండాల్సి వచ్చింది. అలా మా బంధం మొదలైంది. ఇప్పుడు కూడా మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అయితే మేం స్నేహితులుగా మాత్రమే కలసి ఉండగలమనే అభిప్రాయానికి వచ్చాం. అందుకే ఫిబ్రవరిలో బ్రేకప్ చెప్పుకొన్నాం. ఏదేమైనా మంచి స్నేహితుడిగా శంతనుకు నా జీవితంలో ఎల్లప్పుడూ స్థానం ఉంటుంది’’అని చెప్పుకొచ్చారు. కాగా ప్రేమలో విఫలమైన నిత్యామీ తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు మెల్బోర్న్ వెళ్లిపోయారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక శంతను నటుడిగానే కాకుండా కొరియోగ్రాఫర్, హోస్ట్‌గా అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. (తన పెళ్లి వార్తలపై స్పందించిన సాయి పల్లవి) -
అడల్ట్ సినిమాలో సాయి పల్లవి?
సాక్షి, సినిమా : మళయాళంలో ఒక్క సినిమా(ప్రేమమ్)తో సెన్సేషన్‌గా మారిపోయిన సాయి పల్లవి.. తెలుగులోనూ ఫిదాతో అదే స్థాయి ఇమేజ్ను సొంతం చేసుకుంది. తర్వాత ఎంసీఏతో కూడా ఫర్వాలేదనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం చేతిలో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. బైలింగువల్ కణం(కరు) రిలీజ్‌కు రెడీగా ఉండగా.. తెలుగులో శర్వానంద్‌తో ఓ సినిమా, తమిళ్లో సూర్య ఎన్జీకే, ధనుష్ మారి-2 సినిమాల షూటింగ్లలో పాల్గొంటోంది. ఇవిగాక ఇప్పుడు కొత్తగా ఆమె చేతికి ఓ ప్రాజెక్టు వెళ్లినట్లు తెలుస్తోంది. విలక్షణ చిత్రాలను అందించే కోలీవుడ్ దర్శకుడు మిస్కీన్ త్వరలో ఓ రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్‌ను తెరకెక్కించబోతున్నాడు. దర్శక నటుడు భాగ్యరాజ్ తనయుడు శాంతను హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇందులో నిత్యా మీనన్‌తోపాటు సాయి పల్లవి కూడా నటించబోతోందన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. నిత్యా ఇప్పటికే ఒకే చెప్పిందని.. పల్లవితో ఇంకా చర్చలు సాగుతున్నాయన్నది దాని సారాంశం. అయితే ఈ చిత్రంలో హర్రర్‌తోపాటు బోల్డ్ సన్నివేశాలు ఓ రేంజ్‌లోనే ఉంటాయని దర్శకుడు మిస్కీన్ మొన్నీమధ్యే మీడియాకు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో హోమ్లీ గర్ల్ ఇమేజ్ ఉన్న సాయి పల్లవి ఈ సినిమాకు ఓకే చెబుతుందా? అన్నది కాస్త అనుమానంగానే మారింది. -
కొత్త శాంతను..
కోడిట్ట ఇడంగళై నిరంప్పుగా చిత్రంలో కొత్త శాంతనును చూస్తారని అంటున్నారు ఆ చిత్ర కథానాయకుడు. ఈయన తన తండ్రి భాగ్యరాజ్ శిషు్యడు పార్తిబన్ దర్శకత్వంలో నటించిన చిత్రం కోడిట్ట ఇండగళై నిరప్పుగా. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్లు ఇటీవల విడుదలై ప్రేక్షకుల మధ్య మంచి స్పందన పొందినట్లు, ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో శాంతను నటించిన డవుక్కిడిలాన డిముక్కిడిలాన అనే పాటను నటుడు ధనుష్ నుంచి పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించినట్లు చిత్ర వర్గాలు తెలిపారు.ఈ చిత్రం పొంగల్ పండగ సందర్భంగా 14న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు శాంతను మాట్లాడుతూ ఒక రోజు పార్తిబన్ తనను పిలిపించి తాను కోడిట్ట ఇడంగళై నిరప్పుగా అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు, అందులో నువ్వే కథానాయకుడివి, రేపే షూటింగ్ అని అన్నారన్నారు.దీంతో సంతోషం కలిగినా, మరో పక్క ఆశ్చర్యం కలిగిందన్నారు. అయినా పార్తిబన్ పై అభిమానం, నమ్మకంతో కథ కూడా అడగకుండా ఓకే చెప్పి షూటింగ్‌కు రెడీ అయ్యానన్నారు.అయితే పార్తిబన్ తనను చాలా రోజులు రహస్యంగా గమనిస్తూ వచ్చినట్లు ఆ తరవాత తెలిసిందన్నారు. మామూలు చిత్రాలకు భిన్నంగా చిత్రాలను రూపొందించే పార్తిబన్ దర్శకత్వం లో నటించడం చాలా ఆనందం గా ఉందన్నారు.కోడిట్ట ఇడంగళై నిరప్పుగా చిత్రంలో కొత్త శాంతనును ప్రేక్షకులు చూస్తారని ఆయన అన్నారు.