Shruti Haasan Shares a Mirror Selfie With Boyfriend Santanu Hazarika, Photos Viral On Social Media - Sakshi
Sakshi News home page

Shruti Haasan: బాయ్‌ఫ్రెండ్‌తో శ్రుతి మిర్రర్‌ సెల్ఫీ, ఫొటో వైరల్‌

Published Thu, Jun 2 2022 12:42 PM | Last Updated on Thu, Jun 2 2022 1:18 PM

Shruti Haasan Shares a Mirror Selfie With Boyfriend Santanu Hazarika - Sakshi

హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల ద్వారానే కాకుండా వ్యక్తిగత విషయాల ద్వారా కూడా శ్రుతి పాపులర్‌ అవుతూ వచ్చింది. ప్రస్తుతం శాంతను హజారిక అనే చిత్రకారుడితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఆమె తరుచూ అతడితో కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తు ఉంటుంది. ఈ నేపథ్యంలో అతడిపై ప్రేమను వ్యక్తం చేస్తుంది. అలాగే శాంతను కూడా వీలు చిక్కినప్పుడల్లా ప్రియురాలు శ్రుతి గురించి పోస్ట్‌ పెడుతుంటాడు.

చదవండి: ‘సలార్‌’ స్పీడ్‌ పెంచిన ప్రశాంత్‌ నీల్‌, షూటింగ్‌ పూర్తి చేయడంపై దృష్టి

ఇదిలా ఉంటే తాజాగా ప్రియుడితో కలిసి దిగిన ఫొటోను శ్రుతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. శాంతానుతో కలిసి మీర్రర్‌ సెల్ఫీ తీసుకున్న ఫొటోను బుధవారం ఆమె పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో శ్రుతి పూర్తిగా నలుపు రంగు దుస్తులలో కూల్‌గా కనిపిస్తుండగా.. శాంతను గ్రే కార్గో ప్యాంట్‌తో జత చేసిన ఆకుపచ్చ టీ-షర్ట్‌లో డాపర్‌ లుక్‌లో కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జంటను చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతూ తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా శ్రుతి, శాంతను 2020లో తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ నుంచి వీరిద్దరు కలిసి ఒకే ఇంట్లో నివస్తిస్తున్నారు.

చదవండి: సంచలన తీర్పు.. బోరున ఏడ్చేసిన హీరోయిన్‌

ఈ క్రమంలో ఇటీవల శాంతాను బర్త్‌డే సెలబ్రెట్‌ చేసిన శృతి ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ స్పెషల్‌ నోట్‌ రాసింది. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు మై లవ్‌ శాంతను. ఈ ప్రపంచం మీ అద్భుతమైన శక్తిని ఎదుర్కొన్నందుకు ఆశీర్వదించబడింది. ఇక ప్రతి రోజు నిన్ను తెలుసుకుంటున్నందుకు నేను కృతజ్ఞతరాలుని’ అంటూ రాసుకొచ్చింది. కాగా గతంలో ఆమె ఓ ఫొటోగ్రాఫర్‌ను ప్రేమించిన విషయం తెలిసిందే. ఆయనతో పీకల్లోతు ప్రేమలో మునిగిన ఆమె ప్రియుడి కోసం సినిమాలను కూడా పక్కన పెట్టేసింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ సడన్‌గా వారి ప్రేమాయణానికి ఫుల్‌స్టాప్‌ పడింది. ఆ తర్వాత శాంతనుతో ప్రేమలో పడింది. ఇక శ్రుతి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో కలిసి సలార్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement