Shruti Haasan: Proud Of Boy Friend Santanu Deets Inside - Sakshi
Sakshi News home page

ప్రేమించడానికి రోజుకో కారణం!

Published Sat, Feb 12 2022 5:03 AM | Last Updated on Sat, Feb 12 2022 9:53 AM

Shruti Haasan is proud of Boy Friend Santanu - Sakshi

‘‘నిన్ను (శంతను హజారిక) ప్రేమించడానికి, గౌరవించడానికి నాకు రోజూ ఓ కొత్త కారణం  దొరుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ అన్నారు. శ్రుతి బాయ్‌ఫ్రెండ్‌ శంతను చిత్రకారుడు అనే సంగతి తెలిసిందే. తాజాగా శంతను కొన్ని ఆర్ట్స్‌ను డిజైన్‌ చేశారు.

ఈ డిజైన్స్‌ను చూసి తెగ మురిసిపోతూ, శంతను గురించి సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ షేర్‌ చేశారు శ్రుతీహాసన్‌. ‘‘నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ అద్భుత (ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌) సాయంకాల సమయాల్లో నన్ను భాగస్వామిని చేసినందుకు నా మనసు ఆనందంతో పులకరించిపోతోంది’’ అన్నారు శ్రుతి. ఈ ఎగ్జిబిషన్‌లో శ్రుతీ తన మ్యూజికల్‌ టీమ్‌తో కలసి పాడారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement