shrutihasan
-
అలా పిలిస్తే సరదాగా తీసుకోలేం
నోరు మూసుకుని వెళ్లు అని స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఈ బ్యూటీకి ఇంతలా కోపం రావడం వెనక ఓ కారణం ఉంది. వీలు కుదిరినప్పుడల్లా సోషల్ మీడియా మాధ్యమాల వేదికగా నెటిజన్లతో చాట్ సెషన్ నిర్వహిస్తుంటారు శ్రుతీహాసన్. తాజాగా శ్రుతి నిర్వహించిన చాట్ సెషన్లో ‘సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పండి’ అని ఓ నెటిజన్ అడిగాడు. ఈ ప్రశ్న శ్రుతికి కోపం తెప్పించింది. ‘‘ఈ రకమైన జాతి వివక్షను నేను అస్సలు సహించను.మమ్మల్ని ఉద్దేశించి మీరు ఇడ్లీ, సాంబార్, దోసె అని పిలిస్తే ఊరుకోం. ఎలా పడితే అలా పిలిస్తే సరదాగా తీసుకోలేం. అలాగే మమ్మల్ని అనుకరించాలని మీరు ప్రయత్నించవద్దు. ఎందుకంటే.. మీరు మాలా చేయలేరు. సరే.. మీరు సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పమని అడిగారు కాబట్టి చెబుతున్నాను. ‘నోరు మూసుకుని వెళ్లు’’ అంటూ ఆ నెటిజన్‌కు రెస్పాండ్ అయ్యారు శ్రుతీహాసన్. ఇక సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ‘డెకాయిట్: ఏ లవ్ స్టోరీ, చెన్నై స్టోరీ’ చిత్రాలతో బిజీగా ఉన్నారు శ్రుతీహాసన్. -
చిరంజీవి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..‘సంక్రాంతి’కి వచ్చేస్తున్నాడు
చిరంజీవి అభిమానులకు శుభవార్త. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఓ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయింది. ఈ సందర్భంగా ‘కలుద్దాం సంక్రాంతికి.. జనవరి 2023’ అంటూ శుక్రవారం పోస్టర్ ద్వారా సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమిది. చిరంజీవిని గతంలో చూడని మాస్ అప్పీలింగ్, పవర్ ప్యాక్ పాత్రలో చూపించబోతున్నారు బాబీ. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ను జూలైలో ప్రారంభిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆర్థర్ ఎ విల్సన్, సహనిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం, సీఈవో: చెర్రీ, లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కేవీవీ. -
సిరిసిల్లలో ప్రారంభమైన బాలకృష్ణ సినిమా
యాక్షన్‌తో కొత్త సినిమాను ఆరంభించారు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రధారులు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 18 (శుక్రవారం)న ప్రారంభమైంది. తెలంగాణలోని సిరిసిల్ల టౌన్ లొకేషన్స్‌లో చిత్రీకరణ ఆరంభించారు. ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేసిన ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నారు బాలకృష్ణ. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: రిషీ పంజాబీ. -
ప్రేమించడానికి రోజుకో కారణం!
‘‘నిన్ను (శంతను హజారిక) ప్రేమించడానికి, గౌరవించడానికి నాకు రోజూ ఓ కొత్త కారణం దొరుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని హీరోయిన్ శ్రుతీహాసన్ అన్నారు. శ్రుతి బాయ్‌ఫ్రెండ్ శంతను చిత్రకారుడు అనే సంగతి తెలిసిందే. తాజాగా శంతను కొన్ని ఆర్ట్స్‌ను డిజైన్ చేశారు. ఈ డిజైన్స్‌ను చూసి తెగ మురిసిపోతూ, శంతను గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు శ్రుతీహాసన్. ‘‘నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ అద్భుత (ఆర్ట్ ఎగ్జిబిషన్) సాయంకాల సమయాల్లో నన్ను భాగస్వామిని చేసినందుకు నా మనసు ఆనందంతో పులకరించిపోతోంది’’ అన్నారు శ్రుతి. ఈ ఎగ్జిబిషన్లో శ్రుతీ తన మ్యూజికల్ టీమ్‌తో కలసి పాడారు. -
అప్పుడు మన లెవల్ తగ్గిపోద్ది!
‘‘నేను రోజూ ఓ కొత్త విషయం నేర్చుకుంటాను. ఈ క్రమంలో ఇంకా నేర్చుకోవడానికి ఎంతో ఉందన్నది నేను నేర్చుకున్న గొప్ప పాఠం’’ అన్నారు శ్రుతీహాసన్. ఇంకా మాట్లాడుతూ – ‘‘నీకు అన్నీ తెలుసు అనుకున్న రోజు వీడియో గేమ్‌లా నీ లెవల్ ఒకటికి వచ్చేస్తుంది. అందుకే అహాన్ని డౌన్ (తగ్గింపు) చేసుకుని, లెవల్ని అప్ (పెంచుకోవడం) చేసుకోవాలి. ఏదో బోధించాలని కాదు.. చెప్పాలనిపించి చెప్పాను’’ అన్నారు శ్రుతి. ఇక సినిమాలకి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’లో నటిస్తున్నారామె. బాలకృష్ణతో ఓ సినిమా సైన్ చేశారు. -
అడగాల్సినవి ఎన్నెన్నో..!
వీలు కుదిరినప్పుడల్లా ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తూ వారిని అలరిస్తుంటారు శ్రుతీహాసన్. తాజాగా మరోసారి తన అభిమానులు, నెటిజన్లతో శ్రుతి చాట్ చేశారు. ఈ చాట్ సెషన్లో భాగంగా ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోనున్నారు’ అన్న ఓ నెటిజన్ ప్రశ్నకు శ్రుతీహాసన్ బదులిస్తూ – ‘‘నిజాయితీగా చెప్పాలంటే ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల (కరోనాను ఉద్దేశిస్తూ) నుంచి బయటపడాలి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అడగాల్సిన ప్రశ్నలూ ఎన్నో ఉన్నాయి’’ అన్నారు. ఇక.. ఈ చాట్ సెషన్లోనే ‘సెక్స్ లేదా ఫుడ్?’ దేనికి ప్రిఫరెన్స్ అంటూ అడిగిన మరో నెటిజన్ ప్రశ్నకు.. ‘ఆహారం లేకపోతే మనం బతకలేం’ అని శ్రుతీహాసన్ బదులు చెప్పారు. ఇంకా తనకు బ్లాక్ కలర్ అంటే ఇష్టమని, పాములంటే భయమని, మ్యూజిక్‌లో ఉన్న మ్యాజిక్ తనకు ఇష్టమని నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రస్తుతం శాంతను అనే చిత్రకారుడితో శ్రుతి ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. -
సలార్‌లో శృతీహాసన్ పాత్ర ఇదే..
ప్రశ్నించడం ఎలానో తెలుసుకున్నారట శ్రుతీహాసన్. ఇప్పుడు ప్రశ్నించే పని మీదే ఉన్నారట. ఇంతకీ ఎవర్ని ప్రశ్నిస్తున్నారంటే ‘సలార్’ సినిమా చూడాల్సిందే. ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. ఇందులో శ్రుతీహాసన్ పొలిటికల్ జర్నలిస్ట్ పాత్ర చేస్తున్నారని సమాచారం. ఈ పాత్రలో ఒదిగిపోవడానికి జర్నలిస్ట్‌లు ఎలా ప్రశ్నిస్తారు? వారి తీరు ఎలా ఉంటుంది? అనే విషయాలను తెలుసుకుని, చిత్రీకరణలో పాల్గొంటున్నారట. తొలిసారిగా ప్రభాస్–శ్రుతి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఇది. చదవండి: మోసం అంటున్న అనుపమ, లేపేస్తా అంటున్న ప్రగ్యా -
డాటర్ ఆఫ్ సన్నీ!
తండ్రితో గొడవపడి ముంబయ్ నుంచి లండన్ వెళ్లిపోవాలనుకుంటున్నారట హీరోయిన్ శ్రుతీహాసన్ . కన్ ఫ్యూజ్ కావొద్దు. ఇది బాలీవుడ్లో శ్రుతీహాసన్ ఒప్పుకున్న కొత్త సినిమా కథ అట. ‘ప్యాడ్‌మ్యాన్’, ‘కీ అండ్ కా’ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన ఆర్. బాల్కీ దర్శకత్వంలో ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ షిప్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా రూపొందనుందనే టాక్ బీ టౌన్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో తండ్రి పాత్రకు సన్నీ డియోల్నూ, కూతురు పాత్రకు శ్రుతీహాసన్నూ అనుకుందట చిత్రయూనిట్. కథ ప్రకారం ముంబయ్‌లో ఉన్న కూతురు తండ్రితో విభేదించి లండన్ వెళ్లిపోతుందట. ఆ తర్వాత తన తండ్రి కష్టం గురించి తెలుసుకుని కూతురు ఎలా కన్విన్స్ అయ్యిందన్నదే బాల్కీ కథలో మెయిన్ పాయింట్ అని సమాచారం. -
సంక్రాంతిని ముందే తెస్తున్నాం
‘‘రవితేజగారితో ఇంతకుముందు ‘డా¯Œ శీను, బలుపు’ వంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశాను. ప్రస్తుతం రియలిస్టిక్ స్టోరీస్‌కి మంచి ఆదరణ లభిస్తుండటంతో మూడో చిత్రంగా ఒక రియలిస్టిక్ అప్రోచ్‌తో సినిమా చేస్తే బాగుంటుందనిపించి ‘క్రాక్’ చేశా’’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. రవితేజ, శ్రుతీహాసన్ జంటగా, సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘క్రాక్’. బి. మధు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని చెప్పిన విశేషాలు. ► రియల్ క్యారెక్టర్స్‌ను కమర్షియల్ సినిమాలోకి పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి తీసిన సినిమా ‘క్రాక్’. నేను చదువుకునే రోజుల్లో ‘ఒంగోలులో రాత్రి కరెంట్ పోతే హత్య జరుగుతుంది’ అని చెప్పుకునే వారు.. మా ఊరి దగ్గరలో కొంతమంది గాడిద రక్తం తాగేవారు. అలా తాగిన తర్వాత ఒళ్లంతా చెమటలు పట్టేలా పరిగెత్తకపోతే రక్తం గడ్డకట్టుకు పోతుందని కొద్దిసేపు వేగంగా పరిగెత్తే వారు. అలా చేస్తే బాడీ స్ట్రాంగ్‌గా తయారవుతుందని వాళ్ల నమ్మకం. అలాంటి కొన్ని అంశాలకు ఒంగోలులో జరిగే మర్డర్స్‌కి లింక్ చేస్తూ థ్రిల్లింగ్‌గా కథ రాసుకున్నాం. ► 2021లో సంక్రాంతికి వస్తోన్న మొదటి చిత్రం మాదే కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాని 2019 మే 8న విడుదల చేద్దామనుకున్నాం. కరోనా ప్రభావం వల్ల వాయిదా వేశాం. అయితే ఒక మంచి సినిమా పండగకి రావాలని రాసిపెట్టిందేమో.. కాకపోతే ఈసారి సంక్రాంతిని కొంచెం ముందుగానే మీ ముందుకు తీసుకువస్తున్నాం. రవితేజగారి కెరీర్లో అత్యధికంగా 1000కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. ► ఒక సీఐ పాత్రని స్ఫూర్తిగా తీసుకుని రవితేజగారి పాత్ర తీర్చిదిద్దాను. కర్నూల్ నేపథ్యం కూడా సినిమాలో ఉంటుంది. కామెడీ, యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. ‘బలుపు’ తర్వాత రవితేజగారు అంత అందంగా, ఎనర్జిటిక్‌గా కనిపించిన చిత్రమిదే. ‘మెర్సల్, బిగిల్’ ఫేమ్ జీకే విష్ణుగారు ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమవుతున్నారు. ► ఈ సినిమాలో హీరో కొడుకు పాత్రలో మా అబ్బాయి సాత్విక్ నటించాడు.. కావాలని తీసుకోలేదు.. ఆ పాత్రకు సరిపోతాడనే తీసుకున్నాం. సముద్రఖని, వరలక్ష్మి పాత్రలు బాగుంటాయి. నేను అసోసియేట్‌గా ఉన్నప్పుడు మణిశర్మగారి దగ్గర పని చేసేవాడు తమన్. అప్పటి నుండి మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది. నా సినిమా అంటే తమన్ కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాడని నేను నమ్ముతాను. ► ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలై బాగా ఆడటం దేశమంతా హాట్ టాపిక్ అయింది. తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాని ఎంత ఇష్టపడతారనేది నిరూపితం అయింది. ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నాను. నా తర్వాతి చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌లో ఉంటుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. -
ఆ పాట ప్రతి బిర్యానీ సెంటర్లో ఉంటుంది
‘‘1994లో ‘భైరవద్వీపం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఈ 26 ఏళ్ల కెరీర్లో ఎన్నో మధురానుభూతులుఉన్నాయి. నా కెరీర్లో ‘అరవిందసమేత వీరరాఘవ’ వందో చిత్రమని నాకు ముందు తెలీదు. ఆ తర్వాత తెలిసి ఆశ్చర్యపోయా. ఎన్ని సినిమాలు చేశానని వెనక్కి తిరిగి చూసుకుని లెక్కలు వేసుకోను.. వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకుంటూ సినిమాలు చేసుకుంటూ పోతుంటా’’ అని సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ అన్నారు. రవితేజ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్’. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు తమన్ పంచుకున్న విశేషాలు. ► గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ సినిమా పాటలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. ఆ సినిమా తర్వాత నా చేతిలో ఉన్న ప్రాజెక్టులను ఒత్తిడిగా భావించలేదు. ప్రతి సినిమాకి బాధ్యతగా 100 శాతం కష్టపడతాను. అది చిన్నదా, పెద్దదా అనే తేడా ఎప్పుడూ ఉండదు. కొన్ని సినిమా పాటలు మాత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే ‘క్రాక్’ సినిమాలోని పాటలు ‘అల వైకుంఠపురములో’ అంత హిట్ అవుతాయనే నమ్మకం వెయ్యి శాతం ఉంది. ‘క్రాక్’ సినిమా నుంచి నేడు విడుదల చేయనున్న ‘క్రాక్ బిర్యానీ..’ అనే పాట ప్రతి బిర్యానీ సెంటర్లో వినిపిస్తుంటుంది. ► రవితేజగారు, నా కాంబినేషన్లో వస్తున్న పదో చిత్రం ‘క్రాక్’. ఆయన పూర్తి ఫ్రీడమ్ ఇస్తారు. సరదాగా సినిమా పూర్తి చేయొచ్చు. ఆయన బాడీ లాంగ్వేజ్‌కి, కథకి ఎటువంటి సంగీతం ఇవ్వాలో నాకు తెలుసు.. అందుకే నాపై ఆయనకు నమ్మకం. ► గోపీచంద్ మలినేనిగారితోనూ నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వం వహించిన 6 సినిమాల్లో వరుసగా 5 చిత్రాలకు నేను సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉంది. ‘క్రాక్’ సినిమాతో రవితేజగారు, గోపీచంద్‌గారు హ్యాట్రిక్ హిట్ సాధిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ► లాక్డౌన్లో రికార్డింగ్ పనులు చూసుకుంటూ ఉన్నాను. సంగీతం అనేది నాకు అన్నం పెడుతోంది.. కాబట్టి నా దృష్టంతా పూర్తిగా సంగీతంపైనే.. నటించాలనే ఆలోచన ఒక్క శాతం కూడా లేదు. ప్రస్తుతం తెలుగులో ‘సర్కారువారి పాట, వకీల్ సాబ్, టక్ జగదీష్’ తో పాటు పవన్ కల్యాణ్‌గారి 29వ సినిమా సంగీత పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయ్యాకే తెలుగులో కొత్త సినిమాలు అంగీకరిస్తాను. -
ఓటీటీకి లాభం రాదు
విజయ్ సేతుపతి, శ్రుతీహాసన్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘లాభం’. సామాజిక అంశాలను చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ముగిసింది. ఈ చిత్రం థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదల కానుందనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కొట్టిపారేసింది చిత్రబృందం. ‘‘లాభం’ సినిమా ఓటీటీలో విడుదల అవ్వదు. ముందు థియేటర్స్‌లోనే విడుదలవుతుంది’’ అన్నారు నటుడు విజయ్ సేతుపతి. రెండేళ్ల విరామం తర్వాత శ్రుతీహాసన్ చేసిన తమిళ చిత్రం ఇది. ఇందులో ఆమె జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తారు. -
జయమ్మకు బైబై
రవితేజ, శ్రుతీహాసన్ జంటగా నటిస్తోన్న మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘క్రాక్’. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై మధు .బి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జయమ్మ అనే కీలక పాత్రలో నటించారు వరలక్ష్మీ శరత్‌కుమార్. మంగళవారం తన క్యారెక్టర్‌కి సంబంధించిన షూటింగ్ ముగియడంతో జయమ్మ పాత్రకు బైబై చెప్పారు వరలక్ష్మీ. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా... ఇలా ఏ పాత్ర అయినా చేయడానికి రెడీ అయిపోతారు వరలక్ష్మీ. ప్రస్తుతం ఆమె చేతిలో 12 సినిమాలు ఉండటం విశేషం. -
ఆటాపాటా
‘డాన్ శీను, బలుపు’ చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘క్రాక్’. సరస్వతి ఫిలిమ్స్ డివిజ¯Œ పతాకంపై బి. మధు నిర్మిస్తున్నారు. శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అప్సరా రాణి ప్రత్యేక పాట చేస్తున్నారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. షూటింగ్ ముగింపు దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన సెట్లో రవితేజ, అప్సరా రాణిపై ఒక ఐటమ్ సాంగ్ చిత్రీకరిస్తున్నాం. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ మాస్ సాంగ్‌ను రామజోగయ్య శాస్త్రి రాశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జి.కె. విష్ణు, సహనిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి. -
ఆ ఒత్తిడి మా మీదా ఉంది
సీనియర్ నటి సుహాసినిలో దర్శకురాలు కూడా ఉన్నారు. గతంలో ‘ఇందిర’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారామె. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు సుహాసిని. అమేజాన్ ప్రైమ్ నిర్మించిన ‘పుత్తమ్ పుదు కాలై’ అనే యాంథాలజీలో ఓ భాగానికి దర్శకత్వం వహించారామె. ‘కాఫీ, ఎనీవన్?’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ భాగంలో అనూహాసన్, శ్రుతీహాసన్ నటించారు. ఈ నెల 16న ఈ యాంథాలజీ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ– ‘‘కాఫీ, ఎనీవన్’ కథలో మా కజిన్ అనూహాసన్, శ్రుతీహాసన్ నటించారు. మా నాన్న చారుహాసన్, బాబాయి కమల్‌హాసన్‌ని కూడా యాక్ట్ చేయించాలనుకున్నాను. తర్వాత వద్దనుకున్నాను. ఈ లాక్డౌన్ సమయంలో సుమారు ఆరు షార్ట్ స్టోరీలు సిద్ధం చేసుకున్నాను’’ అన్నారు. కుటుంబ సభ్యులకే అవకాశాలు, నెపోటిజమ్ అనే టాపిక్ గురించి మాట్లాడుతూ – ‘‘నేను చారుహాసన్, కమల్‌హాసన్ కుటుంబానికి చెందిన వ్యక్తిని అనేది ఎవ్వరం మార్చలేం. ఆ నెపోటిజమ్ ఒత్తిడి మా మీదా ఉంది. మా తర్వాతి తరం అయిన శ్రుతీహాసన్ వంటి వాళ్ల మీద ఇంకా ఉంది. అయితే సౌతిండియాలో నెపోటిజమ్ అనే మహమ్మారి ఇంకా రాలేదనుకుంటున్నాను’’ అన్నారు సుహాసిని. -
షూటింగ్‌కి రెడీ
కరోనా బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్స్‌తో బిజీ కాబోతున్నారు శ్రుతీహాసన్. ఇటీవలే కొన్ని యాడ్స్ చిత్రీకరణల్లో పాల్గొన్నారామె. తాజాగా సినిమా చిత్రీకరణలకు కూడా సిద్ధమయ్యారు. అక్టోబర్ నుంచి ‘వకీల్ సాబ్’ చిత్రీకరణలో పాల్గొంటారట శ్రుతీహాసన్. పవన్ కల్యాణ్, అంజలి, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ ‘పింక్’కి రీమేక్. ఇందులో పవన్ కల్యాణ్ భార్యగా శ్రుతీహాసన్ నటించనున్నారు. అయితే ఇందులో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని సమాచారం. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాతో పాటు రవితేజ ‘క్రాక్’లోనూ నటిస్తున్నారు శ్రుతి. ఆ సినిమా చిత్రీకరణ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. -
పోలీసాఫీసర్ వీరశంకర్
‘డాన్‌శీను, బలుపు’ వంటి హిట్ చిత్రాల తర్వాత హీరో రవితేజ – డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘క్రాక్’. సరస్వతీ ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తున్నారు. శ్రుతీహాసన్ హీరోయిన్గా, వరలక్ష్మీ శరత్‌కుమార్ నెగటివ్ రోల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలోని రవితేజ కొత్త స్టిల్‌ను గురువారం రిలీజ్ చేశారు. ఇందులో ఏపీ పోలీసాఫీసర్ పి. వీరశంకర్‌గా రవితేజ కనిపిస్తారని తెలుస్తోంది. గోపీచంద్ మలినేని, బి.మధు మాట్లాడుతూ– ‘‘ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఘటనలను ఆధారంగా చేసుకొని తయారు చేసిన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. చివరి షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలో బ్యాలెన్స్ షెడ్యూల్‌ను జరపడానికి సన్నాహాలు చేస్తున్నాం. తమన్ స్వరపరచిన పాటల్లో ఓ పాటను త్వరలో విడుదల చేయనున్నాం. థియేటర్లు తెరుచుకోగానే ‘క్రాక్’ను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జి.కె. విష్ణు, సహనిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి. -
జోడీ కుదిరింది
శింబు, శ్రుతీహాసన్ జంటగా ఓ సినిమాలో నటించబోతున్నారా? అంటే, అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం రవితేజ సరసన ‘క్రాక్’, పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలు చేస్తున్నారు శ్రుతీహాసన్. తమిళంలో ‘లాభం’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా శింబు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం శింబు ‘మహా’, ‘మానాడు’ అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత మిస్కిన్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్నారని. ఇందులోనే శింబు సరసన శ్రుతీహాసన్ కథానాయికగా నటించనున్నారట. కరోనా కారణంగా షూటింగ్స్ పెద్దగా జరగడంలేదు. పరిస్థితులు అనుకూలంగా మారాక ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. -
సహాయం కోసం నాన్నకు ఫోన్ చేశా!
ఒక్కో పాత్రలోకి వెళ్లడానికి ఒక్కో విధంగా వర్క్ చేస్తుంటారు నటీనటులు. రీసెర్చ్ చేయడం, సంబంధిత మనుషులతో మాట్లాడటం, డైలీ రొటీన్ మార్చడం వంటి ఎంతో కృషి ఒక పాత్ర వెనక ఉంటుంది. ‘‘సుకన్య పాత్ర కోసం చాలా రీసెర్చ్ చేశాను అంటున్నారు’’ శ్రుతీహాసన్. ఆమె నటించిన హిందీ చిత్రం ‘యారా’ ఓటీటీలో విడుదల కానుంది. విద్యుత్ జమాల్ హీరో. ఈ చిత్ర కథాంశం 1970లోజరుగుతుంది. ‘‘అప్పటి పాత్రలోకి వెళ్లడానికి మా నాన్న(కమల్ హాసన్) ఇచ్చిన సూచనలు ఉపయోగపడ్డాయి’’ అన్నారు శ్రుతి. దాని గురించి మాట్లాడుతూ – ‘‘ఏ పాత్రని అయినా నా స్టయిల్ లో చేయాలనుకుంటాను. నా పాత్రల గురించి నాన్నతో పెద్దగా చర్చించను. కానీ ‘యారా’లో సుకన్య పాత్ర ఎలా చేయాలో అర్థం కాలేదు. అందుకే సహాయం కోసం నాన్నకు ఫోన్ చేశాను. ‘మనకు పెద్దగా పరిచయం లేని పాత్రలు చేస్తున్నప్పుడు ఆ పాత్రను ముందు అర్థం చేసుకోవాలి. కట్టూబొట్టూ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. ఆ పాత్ర గురించి తెలిసినవాళ్లు ఇలా ఉంది ఏంటి అనుకోకుండా చేయాలి అంటూ నాన్న చాలా సూచనలు ఇచ్చారు. అవి చాలా ఉపయోగపడ్డాయి. ఇలాంటి పాత్రలు పోషించినప్పుడు ‘బాగానే చేసింది’ అనేది కూడా పెద్ద ప్రశంసలాగా ఉంటుంది’’ అని శ్రుతీహాసన్ పేర్కొన్నారు. -
కోరికను బయటపెట్టిన హీరోయిన్!
హాట్‌హాట్ పాత్రలతో తమిళనాడులో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నీతూ చంద్ర ఇప్పుడు రాణి కావాలని తహతహలాడుతోంది. రాణిగా కనిపించాలన్న తన కోరికను ఇటీవల ఈ జాణ బయటపెట్టింది. సంఘమిత్రతో సినిమాతో ఆ కోరిక తీర్చుకోవాలనుకుంటోంది. శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించబోతున్న భారీ చారిత్రక కథా చిత్రం సంఘమిత్ర. సుందర్ సీ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో జయంరవి, ఆర్య కథానాయకులుగా నటించనున్నారు. కథానాయికగా ఎంపికైన నటి శ్రుతీహాసన్ ఈ చిత్రం నుంచి అనూహ్యంగా వైదొలగడంతో ఆ అవకాశం కోసం చాలామంది కన్నేశారు. అందులో నటి నీతూచంద్రా ఒకరు. ఆదిభగవాన్ చిత్రంలో నాయికగా యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించిన ఈ అమ్మడు ఇటీవల వైగైఎక్స్‌ప్రెస్ చిత్రంలో మెరిసింది. సంఘమిత్రలో యువరాణిగా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె తాజాగా మీడియాకు చెప్పింది. ఒక రంగస్థల నటిగా, కరాటే క్రీడాకారిణిగా సంఘమిత్ర పాత్రకు జీవం పోయడానికి తాను శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చారిత్రక కథాచిత్రంలో కథానాయిక పాత్రకు అగ్రనటిని తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది. హన్సిక పేరు సంఘమిత్ర కోసం ఎంచుకున్నారని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా నయనతార, అనుష్క వంటి ప్రముఖ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మరి కొద్ది రోజుల్లో సంఘమిత్ర నాయిక ఎవరన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.