ఆ పాట ప్రతి బిర్యానీ సెంటర్‌లో ఉంటుంది | Music Director SS Thaman Talking About KRACK Biryani Song | Sakshi
Sakshi News home page

ఆ పాట ప్రతి బిర్యానీ సెంటర్‌లో ఉంటుంది

Published Mon, Jan 4 2021 12:16 AM | Last Updated on Mon, Jan 4 2021 9:06 AM

Music Director SS Thaman Talking About KRACK Biryani Song - Sakshi

ఎస్‌.ఎస్‌. తమన్‌

‘‘1994లో ‘భైరవద్వీపం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఈ 26 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో మధురానుభూతులుఉన్నాయి. నా కెరీర్‌లో ‘అరవిందసమేత వీరరాఘవ’ వందో చిత్రమని నాకు ముందు తెలీదు. ఆ తర్వాత తెలిసి ఆశ్చర్యపోయా. ఎన్ని సినిమాలు చేశానని వెనక్కి తిరిగి చూసుకుని లెక్కలు వేసుకోను.. వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకుంటూ సినిమాలు చేసుకుంటూ పోతుంటా’’ అని సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. తమన్‌ అన్నారు. రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు తమన్‌ పంచుకున్న విశేషాలు.

► గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ సినిమా పాటలు ఎంత హిట్‌ అయ్యాయో తెలిసిందే. ఆ సినిమా తర్వాత నా చేతిలో ఉన్న ప్రాజెక్టులను ఒత్తిడిగా భావించలేదు. ప్రతి సినిమాకి బాధ్యతగా 100 శాతం కష్టపడతాను. అది చిన్నదా, పెద్దదా అనే తేడా ఎప్పుడూ ఉండదు. కొన్ని సినిమా పాటలు మాత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే ‘క్రాక్‌’ సినిమాలోని పాటలు ‘అల వైకుంఠపురములో’ అంత హిట్‌ అవుతాయనే నమ్మకం వెయ్యి శాతం ఉంది. ‘క్రాక్‌’ సినిమా నుంచి నేడు విడుదల చేయనున్న ‘క్రాక్‌ బిర్యానీ..’ అనే పాట ప్రతి బిర్యానీ సెంటర్‌లో వినిపిస్తుంటుంది.  

► రవితేజగారు, నా కాంబినేషన్‌లో వస్తున్న పదో చిత్రం ‘క్రాక్‌’. ఆయన పూర్తి ఫ్రీడమ్‌ ఇస్తారు. సరదాగా సినిమా పూర్తి చేయొచ్చు. ఆయన బాడీ లాంగ్వేజ్‌కి, కథకి ఎటువంటి సంగీతం ఇవ్వాలో నాకు తెలుసు.. అందుకే నాపై ఆయనకు నమ్మకం.

► గోపీచంద్‌ మలినేనిగారితోనూ నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వం వహించిన 6 సినిమాల్లో వరుసగా 5 చిత్రాలకు నేను సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉంది. ‘క్రాక్‌’ సినిమాతో రవితేజగారు, గోపీచంద్‌గారు హ్యాట్రిక్‌ హిట్‌ సాధిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు.

► లాక్‌డౌన్‌లో రికార్డింగ్‌ పనులు చూసుకుంటూ ఉన్నాను. సంగీతం అనేది నాకు అన్నం పెడుతోంది.. కాబట్టి నా దృష్టంతా పూర్తిగా సంగీతంపైనే.. నటించాలనే ఆలోచన ఒక్క శాతం కూడా లేదు. ప్రస్తుతం తెలుగులో ‘సర్కారువారి పాట, వకీల్‌ సాబ్, టక్‌ జగదీష్‌’ తో పాటు పవన్‌ కల్యాణ్‌గారి 29వ సినిమా సంగీత పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయ్యాకే తెలుగులో కొత్త సినిమాలు అంగీకరిస్తాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement