GopiChand malineni
-
గోపీచంద్ మలినేనికి 'విలన్' దొరికేశాడు
బాలీవుడ్ టాప్ హీరోలలో సన్నీ డియోల్ ఒకరు అని తెలిసిందే.. ఆయనతో మన తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘జాట్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ బాలీవుడ్ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. సయామీ ఖేర్, రెజీనా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో ఆయన పాత్రను చూపుతూ ఒక గ్లింప్స్‌ను విడుదల చేశారు.జాట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు భారీ బడ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ వేసవిలో ఏప్రిల్ 10న జాట్ సినిమా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీతో గోపీచంద్ మలినేని క్రేజ్ మరింత స్థాయికి పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. 2023లో వీరసింహారెడ్డి చిత్రం తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జాట్' కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
టాలీవుడ్ డైరెక్టర్ యాక్షన్ మూవీ.. సన్నీ డియోల్ యాక్టింగ్ చూశారా?
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటిస్తోన్న తాజా చిత్రం జాట్. ఈ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంలో రెజీనా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మూవీకి టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ పాన్ ఇండియా మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.(ఇది చదవండి: ఓటీటీలో కంగువా.. అనుకున్న తేదీకంటే ముందే స్ట్రీమింగ్)టీజర్ చూస్తే ఈ మూవీని ఫుల్ యాక్షన్ కథాంశంగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, స్వరూప ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా.. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. शैतान नहीं, भगवान नहीं जाट हैं वो 💥💥💥Action Superstar @iamsunnydeol in and as #JAAT 🔥🔥 🔥 #JaatTeaser out now ❤️🔥▶️ https://t.co/3WmWn7VEEhMASS FEAST loading in cinemas April 2025. 🙌 Produced by @MythriOfficial & @peoplemediafcy A @MusicThaman Mass Beat 🔥🔥… pic.twitter.com/77fPDP2mWl— Gopichandh Malineni (@megopichand) December 6, 2024 -
నా పెళ్లికి రండి.. టాలీవుడ్ సెలబ్రిటీలకు వరలక్ష్మి ఆహ్వానం (ఫోటోలు)
-
కోలీవుడ్ స్టార్ హీరో మూవీ.. నిర్మించనున్న టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ!
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన ప్రస్తుత 'విడాయమర్చి' చిత్రంతో నటిస్తున్నారు. ఇటీవలే అజర్బైజాన్లో మూవీ షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. కొద్ది రోజుల క్రితమే అజిత్ ఇండియాకు చేరుకున్నారు. అయితే సీన్స్ కోసం టీమ్ మరోసారి అదే లొకేషన్‌కి వెళ్లినున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం యూఏఈకి చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అజిత్ తన 63వ చిత్రం కోసం మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో పని చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై నిర్మాత గోపీచంద్ మలినేని సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. -
రవితేజ సినిమాకు ఇలాంటి కష్టాలా.. నో ఛాన్స్
డాన్ శీను, బలుపు, క్రాక్ ఈ హిట్ సినిమాలన్నీ రవితేజ - గోపీచంద్ మలినేని కలయికలో వచ్చినవే... ఇంతటి క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఆగుతారా..? అందుకే ఈ కాంబోపై భారీ అంచనాలు పెట్టుకున్నారు రవితేజ ఫ్యాన్స్.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు, నటుడు సెల్వ రాఘవన్‌తోపాటు ఇందుజ రవిచంద్రన్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారని కూడా మేకర్స్ ప్రకటించారు. కె.రాఘవేంద్రరావు ఈ సినిమాకు గౌరవ దర్శకత్వం వహిస్తే... ఆ సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్‌నిచ్చారు. ఇలా ఎంతో క్రేజీగా ప్రారంభం అయిన ఈ ప్రాజెక్ట్‌పై పలు రూమర్స్ వస్తున్నాయి. బడ్జెట్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ బడ్జెట్ భారీగా పెరిగిపోతుందని.. ఈ విషయంలో మేకర్స్ మరోసారి లెక్కలు వేస్తున్నారట. మార్కెట్ లెక్కలకి, సినిమాకి అనుకున్న బడ్జట్‌కు మధ్య చాలా డిఫరెన్స్ ఉండడంతో ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా ఆపేయాలని చూస్తున్నారట. సమాజంలో జరిగిన నిజ జీవితాల సంఘటనలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ అవుతుందని టాక్. దీంతో రిస్క్ చేయడం ఎదుకని చిత్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఈ ప్రచారంలో ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. రవితేజ ఇప్పటికే వరుసగా రెండు చిత్రాలు రూ. 100 కోట్ల కలెక్షన్స్ మార్క్‌ను దాటిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ లాంటి బిగ్ ప్రొడక్షన్ భాగస్వామ్యం కావడం విశేషం. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ సినిమాకు మార్కెట్,బడ్జెట్ కష్టాలు అనేవి ఉండకపోవచ్చు. -
రష్మిక, శ్రీలీల ఔట్.. కృతి, సాక్షి ఇన్
క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అందుకే స్టార్ హీరోల సినిమాలకు ట్రెండింగ్ హీరోయిన్లను సెట్ చేయడానికి దర్శకులు ప్రయత్నిస్తుంటారు. కానీ ఒక్కోసారి అంతా ఫిక్స్ అయి.. సినిమా సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత కూడా.. క్యాస్టింగ్ మార్పులు జరుగుతుంటాయి. దానికి ముఖ్య కారణం డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం. ముఖ్యంగా హీరోయిన్ డేట్స్ లాక్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఆ కష్టాలను యంగ్ డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని, గౌతమ్ తిన్నానూరి పడుతున్నారు. వీర సింహారెడ్డి తర్వాత గోపీచంద్ మలినేని రవితేజతో పవర్ ఫుల్ మూవీ తెరకెక్కిస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. త్వరలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. రవితేజకు జోడిగా రష్మిక పేరును ఆల్ మోస్ట్ ఫైనల్ చేశారు. అయితే షూటింగ్ ప్రారంభం అయ్యే నాటికి డేట్స్ ఇష్యూ వల్ల రష్మిక తప్పుకుంది. ఇప్పుడు రష్మిక స్థానంలో కృతి శెట్టి లేదా ప్రియాంక అరుల్ మోహన్ ఎంపిక చేయాలనుకుంటున్నాడు గోపీచంద్ మలినేని. ఇక జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్నానూరి ఇప్పుడు విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో ముందుగా టాలీవుడ్ హార్ట్ త్రోబ్ శ్రీలీలను అనుకున్నారు. కాని ఖుషి ఫ్లాప్ తో దేవరకొండ తన డేట్స్ మొత్తాన్ని ‘ఫ్యామిలీ స్టార్’ కు డైవర్ట్ చేయడంతో గౌతమ్ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. దాంతో శ్రీలీల ఇప్పుడు డేట్స్ లేవు అనే రీజన్ తో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దర్శకుడు గౌతమ్ ఇప్పుడు శ్రీలీల స్థానంలో ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్యను ఎంపిక చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నాడట. -
#RT4GM: రవితేజ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)
-
కొత్త క్యారెక్టర్‌కి క్లాప్
హీరో రవితేజ కెరీర్లో కొత్త చిత్రం ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి అన్మోల్ శర్మ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ మేకర్స్‌కు స్క్రిప్ట్‌ను అందించారు. ‘‘ఒక పవర్ఫుల్ కథాంశంతో రూపొందించనున్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ చూడని ఒక కొత్త పాత్రలో ప్రేక్షకులు రవితేజను చూస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. సెల్వ రాఘవన్, ఇందూజ రవి చంద్రన్ కీ రోల్స్ చేయనున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జీకే విష్ణు. -
వాస్తవ ఘటనల ఆధారంగా...
‘డాన్ శీను, బలుపు, క్రాక్’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా ఓ పవర్ఫుల్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా ఈ సినిమాలోని కీలక పాత్రల్లో దర్శక–నటుడు సెల్వరాఘవన్, ఇందూజ రవిచంద్రన్ నటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జీకే విష్ణు. -
‘క్రాక్’ కాంబినేషన్ రిపీట్.. నాలుగోసారి మ్యాజిక్ వర్కౌట్ అయ్యేనా?
మాస్ మహారాజా రవితేజ, మాస్ మేకర్ గోపీచంద్ కాంబినేషన్లో ఓ చిత్రం వస్తుందంటే.. కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. దానికి కారణం వీరిద్దరి కాంబోలో వచ్చిన డాన్ శీన్, బలుపు, క్రాక్.. మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. త్వరలోనే వీరిద్దరి కాంబోలో నాలుగో చిత్రం (RT4GM) రాబోతుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. కొన్ని నెలల క్రితం పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా సినిమాని అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ 'బ్లాస్టింగ్ అప్డేట్ల కోసం సిద్ధంగా ఉండండి' అని అనౌన్స్ చేశారు. ఈరోజు, రేపు ఎక్సయిటింగ్ అప్డేట్లు వస్తాయి. ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలియజేశారు మేకర్స్. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఇంటెన్స్ లుక్ లో కనిపించారు సెల్వరాఘవన్. ఈ పాత్ర డిఫరెంట్ అండ్ మెమరబుల్ గా ఉండబోతుందని చిత్రయూనిట్ పేర్కొంది . నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. సెన్సేషనల్ కంపోజర్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. #RT4GM 🤗 My 3rd with @MythriOfficial ❤️ 4th with @megopichand 🔥 It's been a fantastic journey with them and this time looking forward to an absolute blast 💥 pic.twitter.com/4i0xwgXGLz — Ravi Teja (@RaviTeja_offl) October 25, 2023 -
రవితేజ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?
-
సెప్టెంబరులో స్టార్ట్?
‘డాన్‌శీను’, ‘బలుపు’, ‘క్రాక్’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో కొత్త సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను సెప్టెంబరులో స్టార్ట్ చేసేలా చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్స్ పాత్రల కోసం మృణాల్ ఠాకూర్, పూజాహెగ్డే వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్‌గా ఫిక్స్ అవుతారా? లేకుంటే వేరే హీరోయిన్ ఈ ప్రాజెక్టులో యాడ్ అవుతారా? అన్నది తెలియాలి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు రవితేజ ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగిల్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం అక్టోబరు 20న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
వరలక్ష్మి వెంటబడుతున్న తెలుగు డైరెక్టర్
తెలుగు సినీ పరిశ్రమలో పవర్ఫుల్ లేడీ విలన్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు 'రమ్యకృష్ణ'. నరసింహా, నీలాంబరి చిత్రాల్లో హీరోకు సమానంగా ఆమె నటించిన తీరు అందరినీ మెప్పిస్తుంది. ఇప్పుడు జనరేషన్ మారింది. ఇప్పుడా ప్లేస్‌లోకి వరలక్ష్మి శరత్‌కుమార్ వచ్చేసిందని చాలామంది నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తుంటారు. అంతలా ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. వరలక్ష్మికి తెలుగులో స్టార్ ఇమేజ్ అందించిన చిత్రం ‘క్రాక్’ . గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో జయమ్మగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఆ పాత్రలో ఆమె పలికించిన హావభావాలు తెలుగువారిని మెప్పించాయి. ముఖ్యంగా ఆమె బేస్ వాయిస్ ఈ పాత్రకు హైలైట్‌గా నిలిచింది. తరువాత ఇదే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'వీర సింహారెడ్డి' సినిమా తనకు మరింత పేరును తీసకువచ్చింది. ఇదే ఏడాదిలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాతో వరలక్ష్మికి తెలుగులో మరో హిట్ అందుకుంది. ఇందులో ఆమె 'భానుమతి' పాత్రలో బాలయ్యకు సోదరిగా నటించి మరింత స్టార్ ఇమేజ్ను పెంచుకుంది. సీమ యాసలో ఆమె చెప్పే పవర్ఫుల్ డైలాగ్‌లు సినీ ప్రియులను కట్టిపడేశాయి. ఈసినిమా విడుదలయ్యాకనే ఆమె నటన చూసే టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో లేడీ విలన్ వచ్చేసిందంటూ అప్పట్లో వరుస కామెంట్స్ కూడా చేశారు. వరలక్ష్మికి మరో ఛాన్స్ వరసు విజయాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న డైరెక్టర్ గోపీచంద్ మళ్లీ రవితేజతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన క్రాక్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించింది. దీంతో మళ్లీ మరో ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇందులో కూడా తన లక్కీ ఛార్మ్ అయిన వరలక్ష్మి కోసం ప్రత్యేక రోల్‌ను ఆయన క్రియేట్ చేస్తున్నాడట. ఈ సినిమా కోసం హీరోయిన్ ఎంపిక చేయడం కంటే ముందు వరలక్ష్మి ఎంపిక జరిగిపోయిందట. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమెను గోపీచంద్ ఇప్పటికే సంప్రదించాడని టాక్. ఇలా తన సినిమాలో జయమ్మ ఉంటే అది సూపర్ హిట్ ఖాయం అని ఆయన భావిస్తున్నారట. -
ఆ సూపర్ హిట్ కాంబినేషన్ ప్రాజెక్ట్‌లోకి మృణాల్ ఠాకూర్ ఎంట్రీ
‘సీతారామం’తో బ్లాక్‌బస్టర్ హీరోయిన్గా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే నాని హీరోగా నటిస్తున్న ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ బ్యూటీకి మరో ఆఫర్ వచ్చిందట. ‘డాన్ శీను’, ‘బలుపు’, ‘క్రాక్’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్ర కోసం ముందు పూజా హెగ్డే పేరు వినిపించగా, తాజాగా మృణాళ్ ఠాకూర్ పేరు తెరపైకి వచ్చింది. మరి.. రవితేజ సరసన హీరోయిన్గా పూజా హెగ్డే కనిపిస్తారా? లేక రవితేజతో మృణాల్ జోడీ కడతారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. -
కాంబినేషన్ రిపీట్
హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కొత్త సినిమా కోసం మరోసారి చేతులు కలిపారు. వీరిద్దరి కాంబినేషన్ లో ‘డాన్ శీను’ (2010), ‘బలుపు’(2013), ‘క్రాక్’ (2021) చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ, గోపీచంద్ మలినేని కాంబో నాలుగోసారి రిపీట్ అవుతున్నట్లు ఆదివారం ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘వాస్తవ సంఘటనలతో గోపీచంద్ మలినేని ఓ కథను తయారు చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: తమన్. -
'ధమాకా' జోడీ రిపీట్.. ఈసారి మాత్రం!
మాస్ మహారాజ రవితేజ 'ధమాకా' మూవీ పేరు చెప్పగానే అందరికీ హీరోయిన్ శ్రీలీలనే గుర్తొస్తుంది. ఇందులో వేరే లెవల్ ఎనర్జీతో డ్యాన్సులేసింది. సినిమాలో కొన్నిచోట్ల హీరోని డామినేట్ కూడా చేసింది. స్టోరీ పరంగా ఈ సినిమాలో కొత్తగా ఏం లేకపోయినా శ్రీలీల వల్ల ఓ ఫ్రెష్ నెస్ వచ్చి, హిట్ అయిందని కూడా చెప్పొచ్చు. అలాంటిది రవితేజతో శ్రీలీల మరోసారి కలిసి రచ్చ చేసేందుకు సిద్ధమైపోయిందట. తెలుగులో ఈ మధ్య కాలంలో శ్రీలీలకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి రాలేదు. ఎందుకంటే ఈ బ్యూటీ చేతిలో ఏకంగా తొమ్మిది వరకు కొత్త మూవీస్ ఉన్నాయి. గుంటూరు కారం, భగవంత్ కేసరి, ఉస్తాద్ భగత్ సింగ్, ఆదికేశవ.. ఇలా బోలెడన్నీ సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో కొత్త చిత్రం వచ్చినట్లు తెలుస్తోంది. అదే రవితేజ-గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్. 'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్' చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న రవితేజ-గోపీచంద్ మలినేని.. ఇప్పుడు మరో సినిమా కోసం కలిసి పనిచేయబోతున్నారు. 'వీరసింహారెడ్డి' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న గోపీచంద్.. రవితేజకు ఓ కథ చెప్పి ఒప్పించారట. ఇందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అనే చర్చ వచ్చినప్పుడు శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. దాదాపు కన్ఫర్మ్ కూడా అయిపోయిందట. అధికారిక ప్రకటన ఇంకా మిగిలుందట. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!) -
యాక్షన్.. థ్రిల్
సాహస్, దీపికా ముఖ్య తారలుగా నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘7:11’. నూతన నటీనటులతో చైతు మాదాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ– ‘‘మానవుల మనుగడకు సంబంధించిన కీలకమైన సమాధానాల కోసం హంసలదీవి అనే చిన్న ఇండియన్ టౌన్‌కి చేరుకుంటారు ఏలియన్లు. అదే రోజున ఆ టౌన్‌ని నాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. హీరో తన చేతిలోని టైమర్‌ను రాత్రి 7:11 లోపు డీయాక్టివేట్ చేయాలి. గడువు కంటే ముందే అతను మిస్టరీని ఛేదించాలి.. లేదంటే కార్డియాక్ అరెస్ట్‌తో అతని గుండె ఆగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని తెలియజేసింది. ఈ చిత్రానికి సంగీతం: జ్ఞాని, కెమెరా: శివ శంకర్, ఫాబియో కాపోడివెంటో. -
కొత్త కథ విన్నారా?
‘డాన్ శీను(2010)’, ‘బలుపు (2013)’, ‘క్రాక్ (2021)’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల గోపీచంద్ మలినేని చెప్పిన ఓ కథ రవితేజకు నచ్చిందట. దీంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలనుకుంటున్నారట రవితేజ. ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ నిర్మించనుందని భోగట్టా. ఇక ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్‌లో ఉన్నారు రవితేజ. ఆయన నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం అక్టోబరు 20న రిలీజ్‌కు రెడీ అవుతుండగా, మరో చిత్రం ‘ఈగిల్’ (వర్కింగ్ టైటిల్) సెట్స్‌పై ఉంది. -
విజయ్ పాన్ ఇండియా సినిమా రవితేజ చేతుల్లోకి..!
-
ఇది పాన్ ఇండియా స్థాయి సినిమా..
-
'వారీసు' తర్వాత మరో తెలుగు డైరెక్టర్‌తో విజయ్ సినిమా?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కు తెలుగులో మాంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా ఆయనకు సూపర్ క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఇక రీసెంట్గా వారసుడు సినిమాతో తెలుగులో తొలిసారి ఎంట్రీ ఇచ్చారు విజయ్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయనున్నారట విజయ్. బాలకృష్ణతో ‘వీరసింహా రెడ్డి’ మూవీని డైరెక్ట్ చేసిన గోపీచంద్ మలినేనితో ఆయన ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇటీవలె గోపీచంద్ మలినేని కథను వినిపించగా, విజయ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. -
రవితేజ, నానీగార్ల తర్వాత కిరణ్ అబ్బవరమే: గోపిచంద్ మలినేని
‘రవితేజ, నానీగార్ల తర్వాత ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు కిరణ్. అతని ప్రధాన బలం సహజమైన నటన, డైలాగ్ డెలివరీ. ‘మీటర్’తో తనకి మాస్ హిట్ రావాలి’’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. కిరణ్ అబ్బవరం, అతుల్యా రవి జంటగా రమేష్ కడూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘మీటర్’. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘అసలు సిసలైన కమర్షియల్ ఎంటర్టైనర్ ‘మీటర్’. రమేష్‌గారు ఈ సినిమాలో నన్ను వైవిధ్యంగా చూపించారు. ఏప్రిల్ 7న మీటర్లు బ్లాస్ట్ అవుతాయి.. నన్ను నమ్మండి’’ అన్నారు. ‘‘మీటర్’ ప్రీమియర్ చూశాను.. చాలా బావుంది. ఈ వేసవిలో మంచి కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు నవీన్ యెర్నేని. ‘‘ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. ‘‘ఈ సినిమా ఫుల్ మీల్స్‌లా ఉంటుంది’’ అన్నారు రమేష్ కడూరి. -
రవితేజ, నాని లా కిరణ్ అబ్బవరం దూసుకుపోతున్నాడు
-
కథ వెనుక కథ టీజర్ చూశారా?
విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కథ వెనుక కథ’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో అవనీంద్ర కుమార్ నిర్మించారు. ఈ మూవీ టీజర్‌ను డైరెక్టర్ గోపీచంద్ మలినేని రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్ ఆసక్తిగా ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. అవనీంద్ర కుమార్ మాట్లాడుతూ– ‘‘ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించి, కొత్త కాన్సెప్ట్ చిత్రాలను అందించాలనే ఆలోచనతో దండమూడి బాక్సాఫీస్ సంస్థని స్థాపించాను. తొలి చిత్రంగా సస్పెన్స్, థ్రిల్ నేపథ్యంలో ‘కథ వెనుక కథ’ తీశాం. సిటీలో జరుగుతున్న హత్యలకు ఓ వ్యక్తి కారణం కాదు, ఓ గ్యాంగ్ అని పోలీసాఫీసర్ సత్య ఎలా తెలుసుకుంటాడు? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు. -
డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి రజని ఫోన్, ఏమన్నారంటే..!
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరో తెరకెక్కిన చిత్రం ‘వీర సింహారెడ్డి’. సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. రాయలసీమ నేపథ్యంలో యాక్షన్, ఫ్యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం బాలయ్య కెరీర్లో ఘన విజయం సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ వీర సింహారెడ్డి టీంను ప్రశంసించారు. చదవండి: పూజా హెగ్డే ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’ అంతేకాదు డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారట తలైవా. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మురిసిపోయారు గోపిచంద్. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘‘ఇది నాకు అద్భుతమైన క్షణం. తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ సర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ‘వీర సింహారెడ్డి చిత్రాన్ని చూశాను. మూవీ మేకింగ్ నాకు బాగా నచ్చింది’ అని ఆయన నాతో చెప్పారు. చదవండి: కర్ణాటకలో సింగర్ కైలాశ్ ఖేర్‌పై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం మా చిత్రం గురించి ఆయన అన్న మాటలు, ఆయనకు కలిగిన భావోద్వేగం.. ఇంతకంటే నాకు ఈ ప్రపంచంలో విలువైనది ఇంకేదీ లేదనిపిస్తోంది. థ్యాంక్యూ రజని సర్’’ అని గోపించంద్ మలినేని ఆనందం వ్యక్తం చేశాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ మూవీలో బాలయ్య సరసన శృతి హాసన్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్స్‌గా నటించారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. This is a surreal moment for me🤩🤗 Received a call from the Thalaivar, The Superstar @rajinikanth sir. He watched #VeeraSimhaReddy and loved the film. His Words of praise about my film and the emotion he felt are more than anything in this world to me. Thankyou Rajini sir🙏 — Gopichandh Malineni (@megopichand) January 29, 2023 -
'వీర సింహారెడ్డి' విజయోత్సవం..(ఫొటోలు)
-
ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ‘వీరసింహారెడ్డి’ చేశా: గోపీచంద్
‘‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని ఒక అవకాశంగా కంటే ఒక బాధ్యతగా చూశాను. ‘అఖండ’ మూవీ హిట్, అన్ స్టాపబుల్ షోతో అందరికీ కనెక్ట్ అయ్యారు బాలకృష్ణగారు.. ఇప్పుడు అందరి హీరోల ఫ్యాన్స్ బాలయ్య బాబు అభిమానులే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశాను’’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. బాలకృష్ణ, శ్రుతీహాసన్ జంటగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని మాట్లాడుతూ– ‘‘బాలకృష్ణగారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ‘సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు’ చిత్రాల్లో ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. ‘వీరసింహారెడ్డి’లోనూ ఉంది. ఇందులో ఉన్న సిస్టర్ సెంటిమెంట్ కనెక్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ అయ్యాక ఫ్యాన్స్ అందరూ ఇరగదీశారని కాంప్లిమెంట్ ఇచ్చారు. సెకండ్ హాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్ ఇంకా గొప్పగా కనెక్ట్ అయ్యింది.. దాంతో విజయంపై మా నమ్మకం నిజమైంది. ఈ చిత్రాన్ని ఫస్ట్ హాఫ్ బాలయ్యబాబు ఫ్యాన్ బాయ్‌గా, సెకండాఫ్ డైరెక్టర్‌గా చేశాను. రామ్–లక్ష్మణ్‌లు ఫైట్స్‌ని అద్భుతంగా డిజైన్ చేశారు. తమన్ మంచి సంగీతం ఇచ్చాడు. నా కెరీర్లో బెస్ట్ ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్.. వాళ్లతో సినిమాలు చేస్తూనే ఉంటాను’’ అన్నారు. -
బ్లాక్ బస్టర్.. రాసిపెట్టుకోండి
‘‘వీరసింహా రెడ్డి’కి తమన్ అత్యద్భుతమైన పాటలు ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఇందులో అన్ని పాటలు రామజోగయ్య శాస్త్రిగారు రాశారు. ‘మాస్ మొగుడు..’ చివర్లో తీసిన పాట. అప్పుడు మా కెమెరామేన్ రిషి పంజాబీ డిఐ వర్క్‌లో వుండటం వలన నా ‘క్రాక్’ సినిమా కెమెరామేన్ జీకే విష్ణు ఈ పాటని చేశారు. బాలయ్యబాబుని చాలా కలర్ఫుల్గా చూపించారు’’ అన్నారు గోపీచంద్ మలినేని. నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రుతీహాసన్ హీరోయిన్గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. సోమవారం ఈ చిత్రంలోని ‘మాస్ మొగుడు..’ పాట ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తమన్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, మనో, రమ్య బెహరా ఆలపించారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్ మలినేని మాట్లాడుతూ– ‘‘ఇటీవల ఒంగోలులో జరిగిన వేడుకలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమాలో మామూలుగా ఉండదు. ‘వీరసింహా రెడ్డి’ ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్... రాసిపెట్టుకోండి’’ అన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ– ‘‘నేను బాల కృష్ణగారికి అభిమానిని. ఈ చిత్రానికి సింగిల్ కార్డ్ రాసే చాన్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేనికి, మైత్రీ మూవీ మేకర్స్‌కి కృతజ్ఞతలు. అన్ని పాటలూ అద్భుతంగా ఉంటాయి. బాలకృష్ణగారి మార్క్ ఫైర్ బ్రాండ్ సినిమా ఇది’’ అన్నారు. -
అభిప్రాయభేదాలు ఉంటే మంచిదే!
‘‘డైలాగ్ రైటర్‌గా నాకు ప్రతి కొత్త సినిమా ఓ సవాలే. హీరో ప్రాత్ర, సన్నివేశం, హీరో ఇమేజ్ను బ్యాలెన్స్ చేస్తూ డైలాగ్స్ రాయాలి. కేవలం స్టార్ ఇమేజ్ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని డైలాగ్స్ రాయడం అనేది కరెక్ట్ కాదని నా భావన. నేను అలా రాయను’’ అన్నారు రచయిత సాయిమాధవ్ బుర్రా. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్ర సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా చెప్పిన విశేషాలు. ► బాలకృష్ణగారితో నేను చేసిన నాలుగో సినిమా ‘వీరసింహారెడ్డి’. అలాగే ‘క్రాక్’ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో నేను చేసిన రెండో సినిమా కూడా ఇదే. ఈ సినిమా కథా చర్చల సమయం నుంచే నేను ఈ ప్రాజెక్ట్‌తో అసోసియేట్ అయ్యాను. ఈ సినిమాలో ఓ కొత్త ప్రాయింట్ ఉంది. ఒక పక్కా కమర్షియల్ సినిమాకు ఇలాంటి ఓ కొత్త పాయింట్ కలవడం అనేది చాలా అరుదు. ఎమోషన్, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా, బాలకృష్ణగారి నుంచి కోరుకునే అన్ని అంశాలతో ‘వీరసింహారెడ్డి’ రూపొందింది. ► కథా చర్చల్లో భాగంగా అభిప్రాభేదాలు ఉండొచ్చు. అవి ఉన్నప్పుడే పని కరెక్ట్‌గా జరుగుతున్నట్లు అర్థం. అన్నీ కూడా సినిమా అవుట్‌పుట్ బాగా రావడం కోసమే. ఒకసారి కథను ఓకే చేశాక బాలకృష్ణగారు అందులో ఇన్వాల్వ్ అవ్వరు. సందర్భానుసారంగా కొన్ని డైలాగ్స్ ఇంప్రొవైజేషన్స్ ఉండొచ్చు. ఇవన్నీ సినిమా జర్నీలో భాగం. కన్విన్స్ చేయడం, కన్విన్స్ అవ్వడం.. ఈ రెండు లక్షణాలు ఉన్న గొప్ప దర్శకుడు గోపీచంద్ మలినేనిగారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి నిర్మాతల వల్ల ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ► కొంతమంది రచయితలు ఇండస్ట్రీకి దర్శకులు కావాలని వచ్చి, రైటర్స్‌గా మొదలై, ఫైనల్‌గా దర్శకుడిగా గమ్యస్థానాన్ని చేరుకుంటారు. నేను రచయితను కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను. రైటర్‌గా రాణిస్తున్నాను. ప్రస్తుతానికైతే డైరెక్షన్ ఆలోచన లేదు. ► 2017 సంక్రాంతికి చిరంజీవిగారి ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణగారి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలకూ నేను పని చేశాను. రెండూ విజయం సాధించాయి. ఇప్పుడు మళ్లీ చిరంజీవిగారి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణగారి ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’కు నేను చేయక΄ోయినా అదీ నా సినిమాగానే భావిస్తాను. ఎందుకంటే చిరంజీవిగారికి నేనంటే అభిమానం. దర్శకుడు బాబీ నా మిత్రుడు. ఈ రెండు చిత్రాలూ సక్సెస్ అవ్వాలి. ► ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, హీరో రామ్‌చరణ్–దర్శకుడు శంకర్ కాంబినేషన్ సినిమా, అర్జున్ దర్శకత్వంలోని సినిమా, నిర్మాత కేఎస్ రామారావు సినిమాలు చేస్తున్నాను. -
బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
‘మా బావ మనోభావాలు..’సాంగ్ వచ్చేసింది.. బాలయ్య స్టెప్పులు అదుర్స్
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి స్పెషల్ సాంగ్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'మా బావ మనోభావాలు' అంటూ సాగే ఈ పాట..మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించేలా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. థియేటర్స్‌లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఈ పాటను కంపోజ్ చేశాడు. హీరోయిన్లు హానీ రోజ్, చంద్రికా రవిలతో బాలయ్య వేసే స్టెప్పులు అదిరిపోయాయి. ఈ పాటకి రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. సాహితీ చాగంటి, యామిని, రేణు కుమార్ చక్కగా ఆలపించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కాబోతుంది. -
బాలయ్య 'వీరసింహారెడ్డి' నుంచి మరో అప్డేట్
ప్రేయసితో ఆడి పాడారు వీరసింహారెడ్డి. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతీహాసన్ హీరోయిన్. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘సుగుణ సుందరి..’ అనే పాటని ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించి, ఈ పాటలోని ఓ స్టిల్‌ను రిలీజ్ చేసింది. ‘‘ఈ చిత్రంలోని చివరి పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. మరోవైపు ΄పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
ఒక్క పాటతో పూర్తి
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘‘వీరసింహారెడ్డి’ ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తమన్ సంగీతం అందించిన ఫస్ట్ సింగిల్ ‘జై బాలయ్య..’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. 2023 జనవరి 12న సంక్రాంతికి మా సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబీ, సీఈవో: చిరంజీవి (చెర్రీ), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి, లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రమణ్యం కేవీవీ. -
వీరసింహారెడ్డి నుంచి 'జై బాలయ్య' సాంగ్ విడుదల..
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జైబాలయ్య మాస్ ఆంథెమ్ సాంగ్‌ను విడుదల చేశారు. రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు అంటూ మొదలైన పాట బాలయ్య అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా కరీముల్లా పాడారు.ఇక పాటలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా కనిపించారు. వైట్ అండ్ వైట్ అవుట్‌ఫిట్‌లో మెడలో బంగారు చైన్, చేతికి వాచ్ పెట్టుకొని తనదైన స్టైల్లో డ్యాన్స్ చేయడం విశేషం. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో జరిగిన వాస్తవ అంశాల నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈసినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. -
అనంతపురంలో వీరసింహారెడ్డి
అనంతపురంకు షిఫ్ట్ అయ్యారు వీరసింహారెడ్డి. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూ΄÷ందుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ బుధవారం అనంతపురంలో ప్రారంభం కానుంది. అనంతపురంలోని పెన్నా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఉరవకొండ, పెనుగొండ ఫోర్ట్ లొకేషన్స్‌లో చిత్రీకరణను ΄్లాన్ చేశారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ చిత్రా నికి సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: చందు రావిపాటి. -
‘జెట్టి’లోని కొన్ని విజువల్స్ నన్ను ఆశ్చర్య పరిచాయి: గోపిచంద్ మలినేని
మాన్యం కృష్ణ, నందితా శ్వేత జంటగా నటించిన చిత్రం జెట్టి. శివాజీ రాజా, కన్నడ కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వం వహించగా వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వేణు మాధవ్ కే నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని ‘వీరాసింహారెడ్డి’ సెట్స్‌లో లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. జెట్టి ట్రైలర్ లో కొన్ని విజువల్స్ నన్ను ఆశ్చర్య పరిచాయి. చాలా రియలిస్టిక్ అప్రోచ్ తో మత్య్సకారుల జీవితాలను తెరమీదకు తెచ్చిన విధానం బాగుంది. ఈ కథలో మట్టివాసనలు తెలుస్తున్నాయి. వీరి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో పరిచయం అవుతన్న హీరో కృష్ణకు దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుకకు నా అభినందనలు’ అన్నారు. హీరో మాన్యం కృష్ణ మాట్లాడుతూ.. మత్య్స కారుల జీవితాలను ఆవిష్కరించిన ఈ సినిమా లో అందమైన ప్రేమకథతో పాటు తండ్రి కూతుళ్ళ మధ్య బలమైన ఎమోషన్స్ ఉంటాయి. నందిత శ్వేత గారితో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక ఈ కథను మలిచిన తీరు చాలా హృద్యంగా ఉంటుంది’ అన్నారు. ‘తీర ప్రాంతం లో ఒక జీవిన విధానం ఉంటుంది. వారి సమస్యలు కట్టుబాట్లు చాలా పటిష్టంగా ఉంటాయి. అలాంటి నేపథ్యం లో తీసిన జెట్టి కథ తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ని అందింస్తుంది’ అని దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక అన్నారు. -
యాక్షన్ మోడ్‌లో బాలయ్య.. ‘వీరసింహారెడ్డి’లో ఇదే కీలక సన్నివేశం
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రస్తుతం బాలకృష్ణ, విలన్లపై భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కథలో కీలక సమయంలో రానున్న ఈ యాక్షన్ ఎపిసోడ్‌ని ఫైట్ మాస్టర్ వెంకట్ పర్యవేక్షిస్తున్నారు. 2023 సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, చంద్రికా రవి (స్పెషల్ నంబర్) తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: రిషి పంజాబీ, సీఈఓ: చిరంజీవి (చెర్రీ), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి, లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రమణ్యం కేవీవీ. -
బాలయ్య ఎన్బీకే107 మూవీ.. సమరసింహారెడ్డిని మించిపోయేలా టైటిల్
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఏపీలోని కర్నూలు పట్టణంలో ఉన్న చారిత్రక కట్టడం కొండారెడ్డి బురుజు వేదికగా చరిత్రలోనే తొలిసారిగా టైటిల్ లోగోను విడుదల చేశారు. ఈ సినిమాకు సమరసింహారెడ్డి రేంజ్లో 'వీరసింహారెడ్డి' అనే టైటిల్‌తో టైటిల్ లోగో పోస్టర్ రిలీజ్ చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. టైటిల్ లోగో చూస్తే పక్కా మాస్ యాక్షన్ ఖాయంగా కనిపిస్తోంది. పోస్టర్లో నలుపు రంగు షర్ట్ ధరించి.. కిలోమీటర్ రాయిపై ఒంటికాలితో నిలబడిన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. బాలయ్య యంగ్ అండ్ డాషింగ్ కనిపిస్తున్నాడు. హై ఇంటెన్స్ మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు. బాలకృష్ణ కెరీర్లో 107వ చిత్రంగా నిలవనుంది. ఎక్కడా రాజీపడకుండా భారీ బాడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. NATASIMHAM #NandamuriBalakrishna in and as 'VEERA SIMHA REDDY' ❤️🔥 Meet the GOD OF MASSES in theatres this Sankranthi 🔥🤙#VeeraSimhaReddy@megopichand @shrutihaasan @OfficialViji @varusarath5 @RishiPunjabi5 @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/ndAC0dvkhd — Mythri Movie Makers (@MythriOfficial) October 21, 2022 -
నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. దీపావళికి బిగ్ సర్ప్రైజ్..!
నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఎన్బీకే107 నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది మైత్రీ మూవీ మేకర్స్. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈనెల 21 కర్నూలులోని చారిత్రక కట్టడమైన కొండారెడ్డి బురుజుపై ఆవిష్కరించనున్నారు. దీపావళి కానుకగా నందమూరి అభిమానులకు టైటిల్ లోగోను విడుదల చేస్తున్నారు. అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నటసింహం.. మరోసారి 'ఎన్బీకే 107'తో ప్రేక్షకులను అలరించనున్నారు. (చదవండి: NBK107: కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య సందడి!) ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి 12 జనవరి 2023న ఈ సినిమా విడుదలకు చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి బీజీఎం కింగ్ ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. The MASS euphoria intensifies 🔥#NBK107 title launch on the iconic Konda Reddy Buruju, Kurnool on October 21st at 8:15 PM ❤️🔥 NATASIMHAM #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @OfficialViji @varusarath5 @RishiPunjabi5 @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/Qe6zPYrVgp — Mythri Movie Makers (@MythriOfficial) October 19, 2022 -
టైటిల్‌కి వేళాయె!
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి ‘అన్నగారు’, ‘వీరసింహారెడ్డి’, ‘రెడ్డిగారు’, ‘జై బాలయ్య’ అనే టైటిల్స్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ఈ నెల 21న ప్రకటించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. మరి.. తెరపైకి వచ్చిన టైటిల్స్‌లో ఏదైనా ఒకటి ఫిక్స్ అవుతుందా? లేక కొత్త టైటిల్ ఖరారు చేస్తారా? అనే విషయం తెలియాలంటే ఈ నెల 21 వరకు వేచి చూడాలి. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, చంద్రికా రవి(స్పెషల్ నంబరు) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం:తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి. -
NBK107: కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య సందడి!
అఖండ సినిమాతో సంచలన విజయం సాధించిన బాలయ్య తదుపరి చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి టైటిల్ ఖరారు చేయని ఈ మూవీ ఎన్బీకే107(NBK107) అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే టర్కీలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కర్నూల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘‘నేటి నుంచి అక్కడి కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సోమవారం కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్‌గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకుసంగీతం అందిస్తున్నారు. -
అఫీషియల్: బాలకృష్ణ-అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్
బాలకృష్ణ మంచి జోరు మీదున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్న ఆయన తాజాగా 108వ చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడు. శుక్రవారం బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా 108వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ‘‘గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, డబుల్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడిల క్రేజీ కాంబినేషన్లో ఎన్బీకే 108 సినిమా రూపొందనుంది. వినూత్న కథనంతో భారీ ఎత్తున ఈ చిత్రం తెరకెక్కనుంది. మాస్ పల్స్ తెలిసిన అనిల్ రావిపూడి.. మునుపెన్నడూ చూడని పాత్రలో బాలకృష్ణను చూపించేందుకు పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెడీ చేశారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
భయం నా బయోడేటాలోనే లేదురా.. అంటూ గర్జించిన బాలయ్య
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే కదా! శ్రుతి హాసన్ కథానాయికగా కనిపించనున్న ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు. గురువారం ఈ సినిమా నుంచి ఫస్ట్ హంట్ టీజర్ రిలీజ్ చేశారు. 'మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్, భయం నా బయోడేటాలోనే లేదు, నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలీదు నా కొడకల్లారా..' అంటూ పవర్ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టాడు బాలయ్య. నెరిసిన గడ్డం, కొత్త హెయిర్ స్టైల్‌తో అదుర్స్ అనిపించాడు. కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చొని స్టైలిష్‌గా చుట్ట తాగుతూ కనిపించాడు. అఖండ తర్వాత రిలీజవుతున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మాస్ మూవీకి జై బాలయ్య అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. It's just a small token of Love to my Idol,The God of Masses,NATASIMHAM #NandamuriBalakrishna garu 😊❤️ Here’s the MASS & SWAG Loaded #NBK107 First Hunt 🦁https://t.co/qseZY9yF9k#HBDGodOfMassesNBK@shrutihaasan @OfficialViji @varusarath5 @MusicThaman @MythriOfficial pic.twitter.com/DVbE6S7YYG — Gopichandh Malineni (@megopichand) June 9, 2022 చదవండి: పూజా హెగ్డేకు ఘోర అవమానం బిగ్‌బాస్‌లోకి హర్షసాయి? క్లారిటీ ఇచ్చిన యూట్యూబర్! -
NBK107 Mass Poster: కత్తి పట్టిన బాలయ్య.. మాస్ లుక్ అదిరింది!
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. నేడు(మే 28)దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు 100వ జయంతి సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. తెలుపు రంగు దుస్తులు ధరించి, చేతిలో ప్రత్యేకమైన కత్తిని పట్టుకొని బాలయ్య యంగ్ అండ్ డాషింగ్‌గా కనిపిస్తున్నాడు.హై ఇంటెన్స్ మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు. ‘బాలకృష్ణ కెరీర్లో 107వ చిత్రమిది. ఇప్పటి వరకు 40శాతం షూటింగ్ పూర్తయింది. ఎక్కడా రాజీపడకుండా భారీ బాడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సరికొత్త లుక్‌లో బాలకృష్ణ కనిపించబోతున్నాడు. టైటిల్‌ని త్వరలోనే ప్రకటిస్తాం’అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రానికి 'జై బాలయ్య' టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. #NBK107 🔥🔥 pic.twitter.com/lTR9poxqfi — Mythri Movie Makers (@MythriOfficial) May 28, 2022 -
హిట్ కాంబినేషన్, ఆ హీరోయిన్లే కావాలంటున్న డైరెక్టర్స్!
ఓ సినిమా హిట్టయితే.. ఆ హీరో–దర్శకుడిది హిట్ కాంబినేషన్ అంటారు. ఆ కాంబినేషన్లో అభిమానులు మరో సినిమాని ఎదురు చూస్తారు కూడా. ఇప్పుడు కూడా ‘హిట్ కాంబినేషన్’ షురూ అయింది. అయితే ఇది హీరోయిన్–డైరెక్టర్ కాంబినేషన్. ‘రిపీట్టే..’ అంటూ ఒక సినిమా తర్వాత వెంటనే తన మరో సినిమాకి ఆ హీరోయిన్నే ఎంపిక చేశారు కొందరు దర్శకులు. ఆ డైరెక్టర్–హీరోయిన్ కాంబినేషన్ సినిమాల గురించి తెలుసుకుందాం. దర్శకుడు త్రివిక్రమ్ హీరోయిన్ పూజా హెగ్డేకు హ్యాట్రిక్ చాన్స్ ఇచ్చారు. త్రివిక్రమ్‌తో పూజా హెగ్డేకి ‘అరవిందసమేత వీరరాఘవ’ తొలి సినిమా. ఆ సినిమా సూపర్ హిట్. ఆ వెంటనే ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి పూజకు చాన్స్ ఇచ్చారు త్రివిక్రమ్. ఈ సినిమా కూడా సూపర్ హిట్. ఇప్పుడు మహేశ్‌బాబుతో చేయనున్న సినిమాకి కూడా హీరోయిన్గా పూజా హెగ్డేనే తీసుకున్నారు త్రివిక్రమ్. సేమ్ ఒకప్పుడు త్రివిక్రమ్‌తో సమంత ఇలా వరుసగా మూడు సినిమాలు (‘అత్తారింటికి దారేది’ (2013), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015), ‘అ ఆ’ (2016) చేశారు. ఇప్పుడు పూజా హెగ్డేని రిపీట్ చేస్తున్నారు త్రివిక్రమ్. ఇక దర్శకుడు హరీష్ శంకర్ కూడా త్రివిక్రమ్‌లానే పూజా హెగ్డేకు హ్యాట్రిక్ చాన్స్ ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ (2017), ‘గద్దలకొండ గణేష్’ (2019) చిత్రాల్లో హీరోయిన్గా నటించారు పూజా హెగ్డే. హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రం ‘భవదీయుడు భగత్‌సింగ్’లోనూ పూజా హెగ్డేనే హీరోయిన్. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ చిత్రంలో హీరోయిన్గా నటించిన రష్మికా మందన్నా ఈ చిత్రం రెండో భాగం ‘పుష్ప: ది రూల్’లోనూ నటిస్తారు. రెండు భాగాల సినిమా కాబట్టి ఈ కాంబినేషన్ రిపీట్ కావడం సహజం. ఈ చిత్రం షూటింగ్ ఈ వేసవిలో ప్రారంభం కానుంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘ఎఫ్ 2’లో ఓ హీరోయిన్గా నటించిన తమన్నా ఈ చిత్రం సీక్వెల్ ‘ఎఫ్ 3’లోనూ నటిస్తున్నారు. ఏప్రిల్ 27న ‘ఎఫ్ 3’ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు ముందు మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇంకోవైపు ‘క్రాక్’ (2021) సినిమాకి ముందు దాదాపు మూడేళ్లు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు శ్రుతీహాసన్. ఈ గ్యాప్ తర్వాత ‘క్రాక్’ హిట్‌తో టాలీవుడ్లో శ్రుతి సందడి మొదలైంది. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తాజాగా బాలకృష్ణ హీరోగా తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ కథానాయికగా శ్రుతీహాసన్నే తీసుకున్నారు గోపీచంద్ మలినేని. ఇక తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ్ల 2018లో వచ్చిన ‘గూఢచారి’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. ‘గూఢచారి’ తర్వాత శోభితా వెంటనే మరో తెలుగు సినిమా చేయలేదు. హిందీ సినిమాల్లో నటించారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఆమె యాక్ట్ చేసిన తెలుగు చిత్రం ‘మేజర్’. శశికిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. వీరితో పాటు మరికొందరు దర్శకులు తమ సినిమాల్లో హీరోయిన్గా నటించినవారిని రిపీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలిసింది. చదవండి: అనన్య గ్లామరస్‌గానే కనిపించాలి.. ఆమెకు అవసరం: చుంకీ పాండే -
బాలకృష్ణ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న కన్నడ స్టార్
Duniya Vijay’s First Look In debut Telugu Movie: కన్నడ స్టార్ దునియా విజయ్ తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు దునియా విజయ్. ఈ చిత్రంలో ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారాయన. ఈ పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘‘హై ఇంటెన్స్ మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. బాలకృష్ణ కెరీర్లో 107వ చిత్రమిది. హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్లో ప్రధాన తారాగణమంతా పాల్గొంటోంది’’ అని చిత్రబృందం పేర్కొంది.ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: రిషీ పంజాబీ, సీఈఓ: చిరంజీవి (చెర్రీ), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి, లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కేవీవీ. -
‘నీది యాక్టింగ్ కాదురా.. సర్దేస్తున్నావ్.. ’అంటూ రానాకు క్లాస్ పీకిన సూర్య..!
‘‘కరోనా టైమ్‌లో ‘అఖండ’, ‘పుష్ప’, ‘బంగార్రాజు’, ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు హిట్ చేశారు. మిగతా ఇండస్ట్రీలకు సినిమాలను విడుదల చేయాలనే ఆత్మవిశ్వాసం టాలీవుడ్ వల్లే కలిగింది’’ అని సూర్య అన్నారు. సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఈటీ’. ఈ చిత్రం ఈ నెల 10న విడుదలవుతోంది. నారాయణ్‌దాస్ నారంగ్, డి. సురేష్‌బాబు, ‘దిల్’ రాజు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతిథులుగా పాల్గొన్న హీరో రానా, దర్శకుడు బోయపాటి శ్రీను, దర్శకుడు గోపీచంద్ మలినేని ‘ఈటీ’ బిగ్ టికెట్‌ను విడుదల చేశారు. సూర్య మాట్లాడుతూ – ‘‘ఇటీవల నా ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. మంచి సినిమాకు హద్దు లేదని నిరూపించారు. ఆ రెండు చిత్రాల్లా ‘ఈటీ’ కూడా స్పెషల్ ఫిల్మే. ఇక నా అగరం ఫౌండేషన్‌కు స్ఫూర్తి చిరంజీవిగారు. సినిమాల వల్ల మంచి స్థాయికి వెళ్లిన నేను ఏదో ఒకటి చేయాలని ఈ అగరం ఫౌండేషన్‌ని స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరూ మార్పు తీసుకురాగలరు. మనసు ఏం చెప్పిందో దాన్నే ధైర్యంగా చేయండి. కంఫర్ట్ జోన్లో ఉంటే ఎదుగుదల ఉండదు. అందుకే కంఫర్ట్ జోన్లో ఉండకండి’’ అన్నారు. రానా మాట్లాడుతూ – ‘‘నా సినిమా ఒకటి ఎడిటింగ్ రూమ్‌లో చూసిన సూర్యగారు ‘‘నీది యాక్టింగ్ కాదురా.. సర్దేస్తున్నావ్.. (స్టేజ్ పై నవ్వులు)’ అని క్లాస్ పీకారు. ఆ క్లాసే నన్ను భల్లాలదేవుడిని చేసింది. డేనియల్ శేఖర్ని చేసింది (సూర్య మైకు తీసుకుని ఇప్పుడు రానాను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు). ‘ఈటీ’ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘రజనీకాంత్‌గారి తర్వాత సూర్యని ‘మన’ అని తెలుగు ఆడియన్స్ అనుకుంటున్నారు. అలాంటి సూర్యగారు చేసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ‘ ‘సూర్యగారు మాస్ ఫిల్మ్ చేస్తే షేకే. ఓ యునిక్ స్టైల్ ఉన్న డైరెక్టర్ పాండిరాజ్‌గారు’’ అన్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ‘‘హైదరాబాద్‌లో జరిగిన కార్తీ ‘చినబాబు’ సినిమా ఫంక్షన్‌కు వచ్చినప్పుడు సూర్యగారి పేరు ప్రస్తావనకు రాగానే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ రెస్పాన్స్ చూస్తున్నాను. సూర్యగారు స్ట్రయిట్‌గా తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు పాండిరాజ్. ‘‘ప్రేక్షకులు గర్వపడే సినిమాలు చేస్తుంటారు సూర్య. ‘ఈటీ’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత డి. సురేష్‌బాబు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘‘ప్రతి కథను డిఫరెంట్‌గా సెలెక్ట్ చేసుకునే ఇండియన్ హీరోల్లో సూర్య ఒకరు. ఆయన ఏ సినిమా చేసినా అందులో ఓ కొత్తదనం ఉంటుంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో సౌత్ ఇండియా సినిమాల పట్ల, ముఖ్యంగా తెలుగు సినిమాల పట్ల ముంబైలో మరింత గౌరవం పెరిగింది. సూర్యగారు చేసిన ‘ఈటీ’ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు నిర్మాత జ్ఞానవేల్‌రాజా. నిర్మాత రాజశేఖర్ పాండియన్, కెమెరామేన్ రత్నవేలు, నటులు వినయ్ రాయ్, మధుసూదన్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
NBK107: తండ్రికొడుకులుగా కనిపించనున్న బాలయ్య!
Balakrishna-Gopichand Malineni Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మలినేని గోపిచంద్ డైరెక్షన్లో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్న(ఫిబ్రవరి 18) మొదలైంది. 'సిరిసిల్ల' జిల్లాలో మొదటి షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బాలయ్య ద్వీపాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: త్వరలో పెళ్లి పీటలెక్కబోతోన్న మరో బాలీవుడ్ లవ్‌బర్డ్స్! అక్కడి నీటి సమస్య చుట్టూ ఈ కథ తిరుగుతుందని, ఇందులో బాలయ్య తండ్రీకొడుకులుగా కనిపిస్తారని అంటున్నారు. ఈ రెండు పాత్రల మధ్య వేరియేషన్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆమె చేస్తున్న మూడో సినిమా ఇది. కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. ప్రతినాయకుడిగా కన్నడ హీరో దునియా విజయ్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమా కోసం 'వీరసింహా రెడ్డి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. -
బాలకృష్ణ కొత్త అవతారం.. స్టైలిష్‌గా మాస్ లుక్
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మలినేని గోపిచంద్ డైరెక్షన్లో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 'ఎన్బీకే 107' వర్కింగ్ టైటిల్‌తో రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 18న మొదలైంది. అయితే 'అఖండ' చిత్రంతో విశేషంగా ఆకట్టుకున్న బాలయ్య బాబు మరో కొత్త పవర్ఫుల్ అవతారంలో ఆకట్టుకోనున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా సోమవారం ఫిబ్రవరి 21న విడుదల చేసింది. ఈ ఫొటోలో నందమూరి బాలకృష్ణ లుంగీ ధరించి, బ్లాక్ షేడ్స్ పెట్టుకుని స్టైలిష్ లుక్‌లో అదిరిపోయాడు. ఈ మాస్ లుక్ బాలయ్య అభిమానుల్లో పూనకాలు తెప్పించేలా ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా శ్రుతిహాసన్ నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం వేటపాలెంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ మూవీ కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటించిన మఫ్టీ చిత్రానికి రీమెక్ అని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. -
హాట్‌టాపిక్‌గా బాలయ్య కొత్త మూవీ రూమర్, ఇది నిజమా?
Balakrishna-Gopichand Malineni Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మలినేని గోపిచంద్ డైరెక్షన్లో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్న(ఫిబ్రవరి 18) మొదలైంది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘వేటపాలెం’లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను తయారు చేసుకున్నట్టుగా గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: Bheemla Nayak OTT Streaming: కళ్లు చెదిరే డీల్‌కు ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్న 2 సంస్థలు! అంతేకాదు ఈ కథ కోసం ఆయన 'వేటపాలెం' వెళ్లి అక్కడ పాత న్యూస్ పేపర్ల నుంచి కొంత సమాచారాన్ని సేకరించాడని కూడా తెలిసింది. రాయలసీమ నేపథ్యంలోనే ఆయన ఈ కథను నడిపించనున్నట్టు చెప్పుకున్నారు. అయితే ఈ తాజా బజ్ ప్రకారం నిన్న షూటింగు మొదలైన తరువాత, ఇది ఒక కన్నడ సినిమాకి రీమేక్ అని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కన్నడ హీరో శివరాజ్ కుమార్ 'మఫ్టీ' అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేశారు. చదవండి: Manchu Family: ఆ పోస్టులు డిలీట్ చేయకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. దీనికి బాలయ్య సినిమా రీమేక్ అని చెప్పుకుంటున్నారు. దీంతో బాలయ్య రీమేక్ సినిమాలో నటిస్తున్నారంటూ ఈ విషయం నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీంతో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. మరి దర్శకుడు గోపీచంద్ మలినేని దీనిపై ఎలా స్పందిస్తారలో చూడాలి. కాగా రామ్ - లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా శ్రుతి హాసన్ నటిస్తోంది. కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. -
సిరిసిల్లలో ప్రారంభమైన బాలకృష్ణ సినిమా
యాక్షన్‌తో కొత్త సినిమాను ఆరంభించారు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రధారులు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 18 (శుక్రవారం)న ప్రారంభమైంది. తెలంగాణలోని సిరిసిల్ల టౌన్ లొకేషన్స్‌లో చిత్రీకరణ ఆరంభించారు. ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేసిన ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నారు బాలకృష్ణ. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: రిషీ పంజాబీ. -
ఎలన్ మస్క్‌కి టాలీవుడ్ ప్రముఖుల రిక్వెస్ట్
Tollywood Stars Welcome Elon Musk After KTR Tweet: తెలంగాణ పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేసిన ట్వీట్ ఒకటి చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. ప్రపంచ అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్‌పై బీజేపీ నుంచి రాజకీయ విమర్శలు ఎదురవుతుండగా, మరోవైపు ప్రశంసలు సైతం కురుస్తున్నాయి. ప్రముఖ జర్నలిస్టులు, ఎంట్రప్రెన్యూర్లతో పాటు సినీ ప్రముఖులు సైతం కేటీఆర్‌కు మద్ధతు ట్వీట్లు చేస్తూ.. ఎలన్‌మస్క్‌కి ఆహ్వానం పలుకుతున్నారు. .@elonmusk - Come to Hyderabad - India!!! It will be epic to have you 🤍 The Government here in Telangana is terrific too.. — Vijay Deverakonda (@TheDeverakonda) January 15, 2022 Dear @elonmusk we would love to have @Tesla in Telangana ..as we have the best infrastructure and the leading business hub of India @KTRTRS https://t.co/MWa4L2sl2k — Gopichandh Malineni (@megopichand) January 15, 2022 Love this car so so much @elonmusk Feels like hope is around the corner @KTRTRS https://t.co/Ee5qVUz4FW — Genelia Deshmukh (@geneliad) January 15, 2022 Welcome to #Tesla 🚘 @elonmusk sir you have best land& infrastructure in Telangana🙏🏻of course best Minister & Administration @KTRTRS https://t.co/fmJYszN4PP — Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) January 15, 2022 ఈమేరకు టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ, నిఖిల్ సిద్ధార్థతో పాటు దర్శకుడు గోపిచంద్ మలినేని సైతం కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వాల్ని ప్రశంసిస్తూనే.. టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కి స్వాగతం పలుకుతూ ట్వీట్లు చేశారు. What a Person ❤ Lets Get Tesla to Telangana anna ... @KTRTRS @elonmusk @TelanganaCMO https://t.co/E5yc1QYW5e — Nikhil Siddhartha (@actor_Nikhil) January 15, 2022 నటి జెనిలీయాతో పాటు దర్శకుడు మెహర్ రమేష్ కూడా ఇందులో ఉన్నారు. ఇక ప్రముఖ జర్నలిస్టులు పంకజ్ పంచౌరీ, సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ చంద్రా సైతం ఉన్నారు. సంబంధిత వార్త: హేయ్ ఎలన్‌మస్క్ .. వెల్కమ్ టూ తెలంగాణ: కేటీఆర్ -
NBK107 నుంచి క్రేజీ అప్డేట్, బాలయ్యతో ‘జయమ్మ’ ఢీ!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం 'అఖండ' బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో బాలయ్య సినిమాల పరంగా దూసుకుపోతున్నాడు. ఈ నెక్ట్ ప్రాజెక్ట్ ప్రముఖ డైరెక్టర్ గోపిచంద్ మిలినేనితో చేస్తున్న విజయం విధితమే. ఇప్పటికే ఈ మూవీని ప్రకటించిన చిత్ర బృందం ఎన్బీకే 107నే వర్కింగ్ టైటిల్‌తో చిత్రాన్ని ప్రారంభించింది. చదవండి: మహేశ్ బాబు ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన ‘పుష్పరాజ్’, ఫ్యాన్స్ ఫిదా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. గోపిచంద్ మలినేని మాస్ డైరెక్టర్, బాలకృష్ణ మాస్ హీరో. మరీ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ప్రతినాయకుడిగా కన్నడ నటుడు దునియా విజయ్‌ని తీసుకున్నట్లు ఇటీవల మేకర్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఇచ్చిన అప్డేట్ చూస్తుంటే ఈ చిత్రంలో మరో విలన్ పాత్రకు పవర్ ఫుల్ లేడి పాత్ర ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. కాగా బుధవారం చిత్ర బృందం ఎన్బీకే 107 నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది. చదవండి: Sanjjanaa Galrani: విడాకులపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.. ఈ ప్రాజెక్ట్‌లో ప్రముఖ దక్షిణాది లేడి విలన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా బాగస్వాయ్యం అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆమెను సెట్స్‌లోకి ఆహ్వానిస్తూ వరలక్ష్మి శరత్ కుమార్ పోస్టర్ రిలీజ్ చేశారు. తమిళనాట తిరుగులేని విలన్‌గా కొనసాగుతోన్న వరలక్ష్మి శరత్ కుమార్ బాలయ్య చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపించనుందనేది ఆసక్తిగా మారింది. లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మీ కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొవచ్చు. ఇక తెలుగులోను తెలుగులో 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'లోను .. 'క్రాక్' సినిమాలో జయమ్మగాను ఆమె తన విలనిజాన్ని చూపించింది. ఇక బాలయ్యను కూడా ఆమె ఏ రేంజ్లో ఢీ కోట్టనుందో చూడాలి. Team #NBK107 welcomes the most talented & versatile actress @varusarath5 on board 💥💥 NataSimham #NandamuriBalakrishna @shrutihaasan @officialviji @megopichand @MusicThaman pic.twitter.com/0KjcvVtsKZ — Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2022 -
#NBK107తో సరికొత్త విలనిజం చూపెడదాం: మాస్ డైరెక్టర్
Duniay Vijay Plays Vilian Role In Balaksrishna Gopichand Malineni Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ' సినిమాతో బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపేసారు. అలాగే ఆహా ఓటీటీలో వస్తున్న 'అన్‌స్టాపబుల్ షో'కి హోస్ట్‌గా చేస్తూ 'ఘట్టమేదైనా.. పాత్రేదైనా.. నేను రెడీ' అంటూ సూపర్ జోష్‌లో ముందుకు సాగుతున్నారు. క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాను #NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. గోపిచంద్ మలినేని మాస్ డైరెక్టర్, బాలకృష్ణ మాస్ హీరో. మరీ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో విలన్ ఎవరా అనే ఆసక్తి కచ్చితంగా ఉంటుంది. అందుకే ఈ సినిమాలో విలన్ పాత్రకు ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ గోపిచంద్ ప్రకటించారు. 'వేరీ హ్యాపీ టు వెల్కమ్ ది సాండల్‌వుడ్ సెన్సేషన్ దినియా విజయ్. ఈ సినిమాతో విలనిజానికి సరికొత్త నిర్వచనం ఇద్దాం.' అంటూ ట్వీట్ చేశారు. ఇందులో హీరో విలన్ల మధ్య సీన్లు ఏ రేంజ్లో ఉండబోతున్నాయనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ రాయగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించగా ఈ నెల నుంచి సినిమా చిత్రీకరణ జరుపుకోనుంది. Very happy to welcome the Sandalwood Sensation #DuniyaVijay on board to #NBK107 🎉😊 Redefines the Villainism with #NBK107 👍🏻 NataSimham #NandamuriBalakrishna @shrutihaasan @officialviji @MusicThaman @MythriOfficial pic.twitter.com/x6mYe37rzu — Gopichandh Malineni (@megopichand) January 3, 2022 ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఈవెంట్‌కు లక్షల్లో అభిమానులు.. 10 ప్రత్యేక రైళ్లు -
జీవితకాల బాధ్యతగా భావిస్తున్నాను.. బాలయ్యపై గోపిచంద్ ఎమోషనల్ ట్వీట్
నందమూరి బాలకృష్ణ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శనివారం హైదరాబాద్‌లో ఈ మూవీ పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. బాలయ్య కెరీర్లో 107వ చిత్రంగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే గోపిచంద్ మంచి కథను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. గోపీచంద్ బాలయ్యతో కలిసి పని చేయడం కూడా ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ గోపిచంద్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. చిన్నప్పుడు నేను చొక్కాలు చించుకుని ఒక్క సారైనా కలవాలని కలలు కన్న నా హీరో. ఇండస్ట్రీకి వచ్చాక ఎలాగైనా ఆయన్ని డైరెక్ట్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్న నా అభిమాన మాస్ హీరో. నా బాలయ్యతో పని చేసే భాగ్యం కలగడం నా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ కంటే జీవితకాల బాధ్యతగా భావిస్తున్నాను. జై బాలయ్య’అంటూ ట్వీట్ చేశాడు. వాస్తవ సంఘటనలతో రూపొందనున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు. చిన్నప్పుడు నేను చొక్కాలు చించుకుని ఒక్క సారైనా కలవాలని కలలు కన్న నా హీరో. ఇండస్ట్రీకి వచ్చాక ఎలాగైనా ఆయన్ని డైరెక్ట్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్న నా అభిమాన మాస్ హీరో. నా బాలయ్యతో పని చేసే భాగ్యం కలగడం నా life time achievement కంటే lifetime responsibilityగా భావిస్తూ.జై బాలయ్య pic.twitter.com/6NG75pWQbZ — Gopichandh Malineni (@megopichand) November 13, 2021 -
ఘనంగా ప్రారంభమైన బాలకృష్ణ 107వ సినిమా
బాలకృష్ణ నటిస్తున్న 107 సినిమాకి కొబ్బరికాయా కొట్టారు. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతీ హాసన్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహుర్తపు సన్నివేశాలనికి దర్శకుడు బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్ చేయగా.. డైరెక్టర్ వివి వినాయక్ క్లాప్ ఇచ్చారు. దర్శకులు కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు కలిసి స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించారు. వాస్తవ సంఘటనలతో రూపొందనున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు. -
ఘనంగా ప్రారంభమైన బాలకృష్ణ కొత్త చిత్రం ఫోటోలు
-
NBK107: బాలయ్యకు విలన్‌గా కన్నడ హీరో!
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోయే ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనుందని టాక్. అయితే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి చేసిన గోపీచంద్ నటీనటులను సెలెక్ట్ చేసే పనులతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బాలయ్య సరసన శృతి హాసన్‌ను ఖరారైంది. ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. చదవండి: బాలయ్యతో జతకట్టనున్న శ్రుతీ ఇక ఈ సినిమాలో బాలకృష్ణకు విలన్‌గా కన్నడ నటుడిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు దునియా విజయ్. కన్నడలో రౌడీ రోల్స్ ఎక్కువగా చేసిన విజయ్ .. 'దునియా' సినిమాతో హీరోగా మారాడు. అప్పటి నుంచి ఆ సినిమా పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో బాలయ్య కోసం ఆయనను విలన్‌గా దర్శకుడు ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాలి. గతంలో కన్నడ నుంచి వచ్చిన ప్రభాకర్ .. దేవరాజ్ ఇక్కడ విలన్స్‌గా రాణించిన సంగతి తెలిసిందే. చదవండి: Unstoppable Talk Show: చిరంజీవిపై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు -
బాలయ్యతో జతకట్టనున్న శ్రుతీ
హీరో బాలకృష్ణ సరసన శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించనున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణకి జోడీగా శ్రుతీహాసన్‌ను ఎంపిక చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. ‘‘ఫుల్ మాస్ మసాలా చిత్రమిది. వాస్తవ ఘటనలతో గోపీచంద్ ఈ కథ రాశారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
`ఛలో ప్రేమిద్దాం` ఫస్ట్ లుక్ చూశారా?
సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఛలో ప్రేమిద్దాం. సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వం వహిస్తుండగా ఉదయ్ కిరణ్ నిర్మిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను ఆదివారం రిలీజ్ చేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ...``ఓ రోజు డైరక్టర్ సురేష్ వచ్చి మోషన్ పోస్టర్ చూపించారు. మోషన్ పోస్టర్ నచ్చడంతో లాంచింగ్ కి వచ్చాను. అందరూ ప్రొడ్యూసర్ గురించి గొప్పగా చెబుతుంటే నాకు, నా తొలి సినిమా నిర్మాత వెంకట్ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయన కూడా ఒక కొత్త డైరక్టర్ కి ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేశారు. అలా ఛలో ప్రేమిద్దాం నిర్మాత ఉదయ్ కిరణ్ గారు ఇచ్చిన మాట కోసం సురేష్‌కి సినిమా ఇచ్చారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఉదయ్ కిరణ్ కచ్చితంగా గొప్ప నిర్మాతగా ఎదుగుతారు. ఇక ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చూశాక విజువల్ ట్రీట్ లా సినిమా ఉండబోతుందని అర్థమవుతోంది`` అన్నారు. ఈ సినిమాను నవంబర్ నెలాఖరులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో శశాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, బాహుబలి ప్రభాకర్, హేమ, రఘు కారుమంచి, సూర్య, తాగుబోతు రమేష్, అనంత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో ; పాటలుః సురేష్ గంగుల, దేవ్, ఎడిటింగ్ః ఉపేంద్ర జక్క, సినిమాటోగ్రఫీః అజిత్ వి.రెడ్డి, జయపాల్ రెడ్డి -
బాలకృష్ణ 107 టైటిల్ గురించి మేకర్స్ ఏమన్నారంటే?
టాలీవుడ్లో ఎంతో పాపులారిటీ ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను డెరెక్షన్‌లో ‘అఖండ’ చేస్తున్నాడు. ఆయన హీరోగా 107వ సినిమాని గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి ‘రౌడీయిజం’ అనే టైటిల్ పెట్టారంటూ టీటౌన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఎన్బీకే 107 మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో.. ‘ఎన్బీకే 107 మూవీ టైటిల్ ఇదేనంటూ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలు నిజం కాదు. ఆ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయితే ఇలాంటివి చూస్తే ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలుస్తోంది. ఆ మూవీకి సరిపోయే టైటిల్‌ని, ఇతర విషయాలను త్వరలోనే ప్రకటిస్తాం’ అని టీం తెలిపింది. కాగా బాలనటుడిగా 1974లో తెరంగేట్రం చేసిన ఆయన ఇప్పటి వరకూ అవిశ్రాంతంగా నటిస్తూనే ఉన్నాడు. హీరోగా 105 సినిమాలు పూర్తి చేసి త్వరలో 106 సినిమాగా ‘అఖండ’తో పలకరించనున్నాడు. ఇక జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రాత్మక వంటి అన్ని జానర్లలో బాలయ్య చిత్రాలు చేశాడు. -
బాలయ్య సినిమాకు నో చెప్పిన విలక్షణ నటుడు
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎన్బీకే107 అనే వర్కింగ్ టైటిల్‌తో బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. అప్పటికి నుంచి ఈ మూవీలోని హీరోయిన్, విలన్లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొదట బాలయ్య సరసన హీరోయిన్గా శృతీ హాసన్, త్రిష పేర్లు వినిపించగా ఆ తర్వాత మెహ్రీన్ కౌర్ పర్జాదా పేరు తెరపైకి వచ్చింది. చదవండి: బాలయ్యతో తలపడనున్న తమిళ విలక్షణ నటుడు ఆ తర్వాత విలన్ పాత్ర కోసం తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ తాజా బచ్ ప్రకారం ఈ మూవీలో విలన్‌గా నటించేందుకు విజయ్ సేతుపతి నో చెప్పినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య సినిమాకు విజయ్ నో చెప్పడం ఏంటని అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. దీనితో పాటు మరో వార్త కూడా బయటకు వచ్చింది. అయితే మొదట దర్శకుడు గోపిచంద్ హీరోయిన్గా శ్రుతి హాసన్‌ను సంప్రదించగా ఆమె సున్నితంగా ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే బాలయ్య మీద ఉన్న అభిమానం, డైరెక్టర్ సెంటిమెంట్‌ను కాదనలేక శ్రుతి అతిథి పాత్ర ఏమైనా ఉంటే చేస్తాని ఆఫర్ ఇచ్చిందట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ శ్రుతి నటించడం లేదని స్పష్టత వచ్చేసింది. బాలయ్యతో సందడి చేయనుంది మెహ్రీన్ హా లేక త్రిష అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మొత్తానికి ఎన్బీకే 107 మూవీని స్టార్ నటీనటులతో చేయాలని ప్లాన్ చేసుకున్న గోపిచంద్‌కు ఇలా చేదు అనుభవం ఎదురైందంటూ సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. చదవండి: బిగ్‌బాస్ 5: కంటెస్టెంట్స్ కొత్త జాబితా, ఈసారి వీళ్లే నో డౌట్! -
బాలయ్యతో తలపడనున్న తమిళ విలక్షణ నటుడు
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఎన్బీకే107 అనే వర్కింగ్ టైటిల్‌తో బాలకృష్ణ పుట్టిన రోజు అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో ఇప్పటికే బాలయ్య సరసన మెహ్రీన్‌ను ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీలో మెయిన్ విలన్ పాత్ర కూడా బయటకు వచ్చింది. యాక్షన్, ఎమోషనల్‌తో కూడిన పవర్ఫుల్ సబ్జెక్ట్‌తో వస్తున్న చిత్రమిది. అందుకే ఇందులో బాలయ్యతో తలపడేందుకు పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్‌ను రూపొందించాడు డైరెక్టర్. ఇందుకోసం గోపీచంద్ మలినేని తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతికి విలక్షణ నటుడిగా మంచి క్రేజ్ ఉంది. ఇక ఇటీవల కాలంలో తెలుగులోను ఆయన బాగా పాప్యులర్ అయ్యాడు. 'ఉప్పెన' సినిమాలో ఆయన విలనిజం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో విజయ్ సేతుపతికి ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయ్‌కు ఉన్న విలనిజం క్రేజ్ దృష్ట్యా దర్శకుడు ఈ మూవీలో ఆయనను విలన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఎస్ఎస్ తమన్ స్వరాలు సమకుర్చనున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. -
Aakasha Veedhullo:‘ ట్రైలర్ చాలా ఇంటెన్సింగ్‌గా అనిపించింది’
గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. మనోజ్ డి జె, డా. మణికంఠ నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. కొత్త దర్శకుడైనా గౌతమ్ కృష్ణ ఈ మూవీని అద్భుతంగా తీశాడని కొనియాడాడు. దర్శకత్వమే కాదు, హీరోగా కూడా చాలా ఇంటెన్స్‌తో నటించారని మెచ్చుకున్నారు. ట్రైలర్ చూసాకా చాలా ఇంటెన్సింగ్ గా అనిపించిందన్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత మనోజ్ మాట్లాడుతూ .. ‘ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన ఓ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా నాలుగు సాంగ్స్ ఉన్నాయి .. అందులో రాహుల్ సిప్లిగంజ్ పాడిన సాంగ్ థియటర్స్ లో దద్దరిల్లి పోతుంది. అలాగే రాహుల్ రామకృష్ణ, చిన్మయి లాంటి వాళ్ళు పాడిన పాటలు కూడా అదిరిపోతాయి. తప్పకుండా మా సినిమా అందరికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. హీరో , దర్శకుడు గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. సాధారణంగా హీరో, దర్శకుడు ఒక్కరే అయితే ఆ ఎదో డబ్బులున్నాయి కాబట్టి చేసుకుంటున్నారు అని అందరు అంటారు. కానీ అది కాదు .. ఈ సినిమాకు నేనే దర్శకుడు అవ్వడానికి కారణం .. ఒక కథను తెరపైకి ఎక్కించే క్రమంలో దర్శకుడు అన్ని విధాలుగా రెస్పాన్స్ తీసుకోవాలి, పైగా చెప్పే కథలో ఎక్కడ ఇంటెన్షన్ తగ్గకూడదని నేనే దర్శకత్వం వహిస్తున్నాను. ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాం. దాదాపు 160 పేజీల స్క్రిప్ట్ నేనొక్కణ్ణే రాసుకున్నాను. తప్పకుండా మీ అందరికి ఈ సినిమా నచ్చుతుంది’ అన్నారు. -
పెళ్లి వాయిదా అనంతరం క్రేజీ ఆఫర్ కొట్టేసిన మెహ్రీన్!
తెలుగు చిత్ర పరిశ్రమకు ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎఫ్ 2లో హనీ పాపగా అలరించిన హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లికి రెడీ అయ్యింది. గత నెలలలో భవ్య బిష్ణోయ్‌తో ఆమె వివాహం జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. పరిస్థితులన్ని చక్కబడగానే అందరి సమక్షంలో ఘనంగా వీరి వివాహ వేడుకను జరుపుకావాలని నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లి అనంతరం మెహ్రీన్ సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంది. ఇక ఆమెపెళ్లి వాయిదా పడటంతో దర్శక-నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్లికి ఇంకా సమయంలో ఉండటంతో తమ సినిమా షూటింగ్స్ భాగం చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేగాక మెహ్రీన్ కూడా పెళ్లికి ముందే వీలైనన్ని ప్రాజెక్ట్స్ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో డైరెక్టర్ గోపిచంద్ మలినేని-నందమూరి బాలకృష్ణ కాంబోలో రాబోతున్న ఓ భారీ యాక్షన్ మూవీ కోసం మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ మాస్ పోలీస్ ఆఫీసర్‌గా, ఫ్యాక్షనిస్ట్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రంలో హీరోయిన్గా శృతి హాసన్, త్రిష నటిస్తున్నారంటూ గతంలో జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మెహ్రీన్‌కు ఆ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బాలయ్య సరసన నటించే అవకాశం రావడంతో ఆమె కూడా ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చేప్పినట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె పాత్రకు రెమ్మ్యూనరేషన్ కూడా బాగానే ఆఫర్ చేశారని ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజ జీవిత సంఘటనలతో మాస్ ఆడియన్స్‌కి పిచ్చెక్కిపోయే సన్నివేశాలతో ఈ సినిమా రూపొందించాలని గోపీచంద్ ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మెహ్రీన్ స్పందించే వరకు వేచి చూడాలి. కాగా ఇప్పటికే ఆమె ‘ఎఫ్ 3’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి వాయిదా పడిన వెంటనే మారుతి-సంతోష్ శోభన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
Balakrishna: ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది
నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు బర్త్‌డే సర్ప్రైజ్ వచ్చేసింది. బాలయ్య బర్త్‌డే(జూన్ 10)సందర్భంగా ఆయన నటించబోయే 107వ సినిమా పై అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ బ్యానర్‌పై నిర్మించనుంది. ఇందుకు సంబంధించి పోస్టర్‌తో పాటు ఇంట్రడ్యూసింగ్ వీడియోను దర్శకుడు గోపిచంద్ మలినేని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసుకున్నారు.‘క్రాక్’ విజయం తర్వాత బాలకృష్ణ కోసం గోపీచంద్ మలినేని ఓ మాస్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే . ఈ మేరకు 107వ చిత్రంలో బాలయ్య మాస్ లుక్‌లో సందడి చేసే అవకాశాలున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’చేస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘అఖండ’పూర్తయిన తర్వాత గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. చదవండి: బాబాయ్‌కి అబ్బాయిలు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ బర్త్‌డే విషెస్ Akhanda: బాలయ్య బర్త్‌డే సర్ప్రైజ్.. నవ్వుతూ నటసింహం అలా.. -
బాలకృష్ణ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శ్రుతిహాసన్?
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పూర్తయిన వెంటనే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించనున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా ఉండనున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీలో కథానాయుకగా శ్రుతిహాసన్ ఫైనల్ అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే గోపిచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన 'బలుపు', 'క్రాక్' సినిమాల్లో శ్రుతినే హీరోయిన్గా చేసింది. ఆ రెండు సినిమాలు హిట్ కావడంతో ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో మరోసారి శ్రుతిని సంప్రదించారని, ఆమె కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో మరోసారి శ్రుతితో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారట గోపిచంద్ మలినేని. బాలకృష్ణ చేస్తున్న అఖండ షూటింగ్ జులైలో పూర్తి కానుందట. ఈ మూవీ పూర్తయిన వెంటనే గోపిచంద్‌తో సినిమా చేయనున్నారు బాలయ్య. అటు శ్రుతి హాసన్ కూడా ప్రభాస్ సరసన సలార్ అనే పాన్ఇండియా మూవీలో నటిస్తుంది. చదవండి : బాలయ్యను చూసి ఆశ్చర్యపోయా: ప్రగ్యా జైస్వాల్ కరోనా కష్టకాలంలో నెటిజన్‌కు నవీన్ పొలిశెట్టి సర్ప్రైజ్ -
ఠాగూర్ మధుపై ‘క్రాక్’ డైరెక్టర్ ఫిర్యాదు
ఈ ఏడాది క్రాక్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. చాలా రోజుల తరువాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. క్రాక్ బాగుందని హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్, దర్శకులు త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడితో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అయితే సినిమా హిట్ సాధించినప్పటికీ ‘క్రాక్’ నిర్మాత ఠాగూర్ మధుకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్థిక వ్యవహారాల కారణంగా క్రాక్ విడుదల రోజు మార్నింగ్, మ్యాట్నీ షోలు నిలిచిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా నిర్మాత ఠాగూర్ మధు మరో వివాదంలో చిక్కుకున్నారు. క్రాక్ సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ రెమ్యూనరేషన్‌ను ఠాగూర్ మధు ఇవ్వలేదంటూ క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేశాడు. దీనిపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన పెండింగ్ రెమ్యూనరేషన్ ఇప్పించేలా చేయాలని కోరాడు. గోపీచంద్ మలినేని ఫిర్యాదు అందుకున్న డైరెక్టర్స్ అసోసియేషన్.. దీనిపై చర్యలు చేపడుతోంది. కాగా సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ బ్లాక్ బస్టర్ విజయం సాధించి తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సంపాదించుకుంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో అడుగు పెట్టి ఇప్పటికీ వసూళ్లు కురిపిస్తూనే ఉంది. అంతేకాకుండా నేటి నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: ‘క్రాక్’ విడుదలకు ఎన్నో ఆటంకాలు.. చదవండి: పిట్టకథలు ట్రైలర్: ఎంతమంది మొగుళ్లే నీకు.. -
ఓటీటీ: భారీ రేటు పలికిన క్రాక్!
డాన్ శీను, బలుపు చిత్రాల తర్వాత ముచ్చటగా మూడోసారి కలిశారు గోపీచచంద్ మలినేని, రవితేజ. వీరి కలయికలో వచ్చిన తాజా చిత్రం క్రాక్ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకుంది. సినిమా బాగుందని హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్, దర్శకులు త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడితో పాటు పలువురు ప్రముఖులు మెచ్చుకున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా జనవరి 9న రిలీజైంది. 50 కోట్ల క్లబ్లో అడుగు పెట్టిన ఈ చిత్రం ఇప్పటికీ వసూళ్లు కురిపిస్తూనే ఉంది. మరోవైపు దీని డిజిటల్ రైట్స్ నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. (చదవండి: బాలీవుడ్‌లోకి క్రాక్.. హీరోగా సోనూసూద్!) ఇందుకోసం ఆయన ఏకంగా రూ.8 కోట్లకు పైనే చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది. పైగా ఈ సినిమాను ఆహాలో రిలీజ్ చేసేందుకు జనవరి 29 డేట్‌ను ఫిక్స్ చేశారట. అయితే కంటెంట్ ఉన్న సినిమా, అందులోనూ కలెక్షన్లు కురిపిస్తుండటంతో ఇప్పుడప్పుడే ఓటీటీ వద్దనుకుంటుందట చిత్రయూనిట్. పదిరోజులు ఓటీటీ రిలీజ్‌ను వాయిదా వేయాలని భావిస్తోందట. దీంతో ఇప్పుడే కాకుండా ఫిబ్రవరి 9న క్రాక్‌ను ఓటీటీలో రిలీజ్ చేయమని అల్లు అరవింద్‌ను కోరుతున్నారట. మరి ఈ విన్నపాలకు ఆయన ఏమని స్పందిస్తారో చూడాలి. కాగా ఈ మాస్ ఎంటర్టైనింగ్ సినిమాలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, మౌర్యానీ కీలక పాత్రలు పోషించారు. (చదవండి: ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు: క్రాక్ దర్శకుడు) -
‘క్రాక్’ విడుదలకు ఎన్నో ఆటంకాలు.. చివరకు
సాక్షి, హైదరాబాద్: ‘‘క్రాక్’ సినిమా చాలా బాగుందని హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్, దర్శకులు త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడితో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసించారు. సినిమా చూశాక చిరంజీవిగారు ఫోన్ చేసి, ఒంగోలులో నేను విన్నవి గుర్తొచ్చాయని అనడం మరచిపోలేను. మంగళవారం ఆయన్ని కలిశాను’’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. రవితేజ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్’. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా జనవరి 9న విడుదలైంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ‘కరోనా లాక్డౌన్లో దాదాపు 8 నెలలు విరామం వచ్చింది. ‘క్రాక్’ని ఓటీటీలో రిలీజ్ చేయమని ఒత్తిళ్లు వచ్చాయి. కానీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం తీసిన సినిమా అని బలంగా నమ్మి, థియేటర్స్‌లో రిలీజ్ కోసమే పట్టుదలగా ఎదురు చూశాను. సంక్రాంతికి విడుదలైన మా సినిమా పెద్ద విజయం సాధించడం ఆనందంగా ఉంది. మా సినిమా విడుదలకు ముందు రోజు కోర్టు నుంచి స్టే రావడంతో రాత్రంతా నిద్రపట్టలేదు. మూడు షోలు రద్దు కావడంతో బాధపడ్డాను. ఇలాంటి ఇబ్బందులు ఏ దర్శకుడికి రాకూడదు’ అంటూ చెప్పుకొచ్చారు. అంతేగాక ఆ సమయంలో నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, దామోదర్ ప్రసాద్, నాగవంశీలతో పాటు ఇండస్ట్రీ తమకు అండగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా వారిందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక హీరోలు మంచు మనోజ్, సాయితేజ్ సహా పలువురు ఫోన్ చేసి ధైర్యాన్నిచ్చారని చెప్పారు. ఇక ఎన్నో అవాంతరాలు దాటుకుని ‘క్రాక్’ సినిమా విజయం సాధించడంతో మా బాధలన్నీ మరచిపోయామని ఆనందం వ్యక్తం చేశారు. కేవలం 50 శాతం సీటింగ్ కెపాసిటీ అయినా కూడా రవితేజ కెరీర్లోనే బిగ్ హిట్‌గా ‘క్రాక్’ నిలిచిందని, ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉందన్నారు. అలాగే హిందీలో రీమేక్ చేసేందుకు కొందరు అడుగుతున్నారని, ఈ రీమేక్ అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని ఆయన పేర్కొన్నారు. -
రివ్యూ టైమ్: మాస్ మసాలా వయొలెంట్ క్రాక్
చిత్రం: క్రాక్; తారాగణం: రవితేజ, శ్రుతీహాసన్; నిర్మాత: బి. మధు; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని; రిలీజ్: జనవరి 9. ఎట్టకేలకు సంక్రాంతి సినిమా సీజన్ మొదలైంది. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీతోనే కరోనా కాలంలోనూ సందడి షురూ అయింది. ఈ సంక్రాంతికి తొలి భారీ కానుకగా రవితేజ ‘క్రాక్’ థియేటర్లలో పలకరించింది. ఆర్థిక వివాదాలతో తొలి రోజు సెకండ్ షో నుంచి కానీ ఆటలు పడలేదు. ఆట పడుతుందని పొద్దుటి నుంచి పదే పదే హాళ్ళకు వచ్చి, తిరిగెళ్ళిన జనాన్ని బట్టి చూస్తే, అనుకున్నట్టు రిలీజై ఉంటే, రవితేజ కెరీర్లో ‘క్రాక్’ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అయ్యుండేదని ట్రేడ్ టాక్. పోలీస్ యాక్షన్ చిత్రాలు వెండితెరకు కొత్త కాదు కానీ, హాళ్ళు లేక, సినిమాలు లేక జనం ముఖం వాచిపోయిన ఈ రోజుల్లో ఇలాంటి పక్కా ఊర మాస్ కథ కచ్చితంగా కలిసొచ్చే అంశమే. ఒకింత హింస పాలు ఎక్కువే అయినా, రీలు రీలుకీ ఫైట్లు, మాస్ మెచ్చే పాటలతో ఓ కథ తెరపైకి రావడం పండగ వేళ బాక్సాఫీస్‌కు బలం చేకూర్చే విషయం. కథేమిటంటే..: కర్నూలుకొచ్చిన తీవ్రవాది సలీమ్ భత్కల్కీ, ఒంగోలు జనాన్ని గడగడలాడించే కఠారి కృష్ణ (సముద్రఖని)కీ, కడపలోని గూండా కొండారెడ్డి (పి. రవిశంకర్)కీ ఒకడే శత్రువు – బదిలీల మీద ఊళ్ళు తిరిగిన పోలీస్ సి.ఐ. శంకర్ (రవితేజ). యాభై రూపాయల నోటు, మామిడి కాయ, మేకు – ఈ మూడింటికీ, ఆ ముగ్గురు విలన్ల కథలకూ ఓ లింక్ ఉంటుంది. ఆ లింకేమిటి, వారితో హీరో ఎలా డీల్ చేశాడన్నది ఈ పక్కా మాస్ యాక్షన్ ఫిల్మ్. ఎలా చేశారంటే..: ఈ సినిమాలో రవితేజ ఎప్పటిలానే హుషారైన యాక్షన్, డ్యాన్సులతో కనిపిస్తారు. ఆయన పోషించిన పోలీస్ ఇన్స్పెక్టర్ పోతరాజు వీరశంకర్ మాస్ పాత్ర చూడగానే, అనివార్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళతాం. దశాబ్దం పై చిలుకు క్రితం రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’ చిత్రం ఛాయలు ఈ పాత్రలో, పాత్రపోషణలో వద్దనుకున్నా కనిపిస్తాయి. కఠారి కృష్ణగా సముద్ర ఖని, అతని నెచ్చెలి జయమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్ బాగున్నారు. చాలాకాలం తరువాత తెలుగులో కనిపించిన హీరోయిన్ శ్రుతీహాసన్‌ది పరిమితమైన పాత్ర. దానికి తగ్గట్టే నటన. ఎలా తీశారంటే..: మాస్ యాక్షన్ ఎనర్జీతో వెండితెరను వెలిగించే రవితేజకు ‘రాజా ది గ్రేట్’ (2017) తరువాత సరైన బాక్సాఫీస్ హిట్ లేదు. ఆ కొరత క్రాక్ తీర్చే ఛాన్స్ పుష్కలం. ‘డాన్ శీను’, ‘బలుపు’ తరువాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో రవితేజ చేసిన మూడో సినిమా ఇది. ఒంగోలు ప్రాంతానికి చెందిన దర్శకుడు గోపీచంద్ మలినేని అక్కడ చిన్నప్పుడు కథలు కథలుగా విన్న సంఘటనల్ని ఏర్చికూర్చి, సినిమాటిక్‌గా అల్లుకున్నారు. విజయ్ సేతుపతి తమిళ చిత్రం ‘సేతుపతి’ స్ఫూర్తీ కనిపిస్తుంది. హీరో వెంకటేశ్ వాయిస్ ఓవర్‌తో మొదలయ్యే కథ మధ్యలో అక్కడక్కడే తిరుగుతూ, సెకండాఫ్‌కు వచ్చేసరికి సాగదీత అనిపిస్తుంది. కత్తెరకు కొంత పదును పెట్టలేదనీ కనిపించేస్తుంది. అయినా సరే, ఆడియన్స్‌ను కదలకుండా కూర్చోబెట్టడం దర్శకుడి కథన విశేషం. రామజోగయ్య శాస్త్రి రాసిన ‘భల్లేగా తగిలావే బంగారం...’ పాట (గానం – అనిరుధ్ రవిచంద్ర), అలాగే జానీ మాస్టర్ సారథ్యంలోని ఐటమ్ సాంగ్ ‘భూమ్ బద్దలు నా ముద్దుల సౌండు...’ (గానం – మంగ్లీ, సింహా, శ్రీకృష్ణ) కథలో భాగంగా, మాస్‌ను ఆకట్టుకుంటాయి. బుర్రా సాయిమాధవ్ రాసిన డైలాగులూ ఆ కోవలోనే మెరుస్తాయి. తమన్ నేపథ్య సంగీతం అడపాదడపా పరిమితి దాటినా, మొత్తం మీద మూడ్‌ను క్యారీ చేస్తుంది. రామ్ – లక్ష్మణ్ ఫైట్లు మరో ప్లస్ పాయింట్. జి.కె. విష్ణు కెమేరా పనితనంలో నైట్ ఎఫెక్ట్‌లో బస్ స్టాండ్ లో జరిగే ఫైటు, అలాగే బీచ్‌లో ఫైటు థ్రిల్ చేస్తాయి. కథాకాలమేదో స్పష్టంగా చెప్పని ఈ సినిమాలో – గాడిద రక్తం తాగి, హత్యలకు దిగే వేటపాలెం బ్యాచ్, వారి ప్రవర్తన – ఒకప్పటి వాస్తవమే అయినా, ఇప్పుడు బీభత్సంగా కనిపిస్తుంది. తెరపై యథేచ్ఛగా హింస కనిపించే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్లో ‘ఎ’ బదులు, ‘యు/ ఎ’ అని పడిందేమో అనిపిస్తుంది. దర్శక, రచయితలు సహజంగానే హీరో ఎలివేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. సినిమాలో ఒకటికి మూడు కథలున్నాయి. అన్ని కథలనూ చెప్పే క్రమంలో కఠారి కృష్ణ పాత్రకే తప్ప మిగతా ఇద్దరు ప్రత్యర్థి పాత్రలూ సమగ్రమైన ఫీలింగ్ రాదు. ఆసక్తిగా మొదలైన మూడు కథల కాన్సెప్ట్ పెరిగిన నిడివితో, ఆఖరులో ఆశించిన తృప్తినివ్వకుండా ముగిసిందనిపిస్తుంది. అయితేనేం, పండగకు వినోదం కోసం వెతుకులాటలో ఉన్నవారిని అవన్నీ మరిచిపోయేలా చేస్తుంది. కొసమెరుపు: ఒకే టికెట్ పై ముగ్గురు విలన్ల ఊర మాస్ జాతర బలాలు: ⇔ ఊపిరి సలపనివ్వని మాస్ కథ, కథనం ⇔ రవితేజ హుషారైన యాక్షన్, డ్యాన్సులు ⇔ వినూత్నమైన ఫైట్లు, రీరికార్డింగ్ మెరుపులు బలహీనతలు: ⇔మితిమీరిన హింస ⇔ సాగదీతకు గురైన కథ, క్లైమాక్స్ ⇔ హీరోయిన్ ట్రాక్ పక్కాగా సెట్ కాకపోవడం -
‘క్రాక్’ మూవీ రివ్యూ
టైటిల్ : క్రాక్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : రవితేజ, శ్రుతీహాసన్, వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని, సుధాకర్ కోమాకుల, వంశీ, రవి శంకర్, సప్తగిరి తదితరులు నిర్మాణ సంస్థ : సరస్వతి ఫిలిం డివిజన్ నిర్మాత : ‘ఠాగూర్’మధు దర్శకత్వం : గోపీచంద్ మలినేని సంగీతం : తమన్ ఎస్ సినిమాటోగ్రఫీ : జీకే విష్ణు ఎడిటర్ : నవీన్ నూలి విడుదల తేది : జనవరి 9, 2021 మాస్ మహరాజా రవితేజ సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా ఆడలేదు. 'రాజా ది గ్రేట్' తర్వాత ఆయన ఖాతాలో బిగ్ హిట్ మూవీ పడిందే లేదు. గత ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన 'డిస్కో రాజా' ప్రయోగం కూడా విఫలమైంది. ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు రవితేజ. ఇందులో భాగంగానే తనకు గతంలో 'డాన్ శ్రీను', 'బలుపు' లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో జత కట్టి 'క్రాక్' అనే మూవీ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా నేడు ‘క్రాక్’ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా రవితేజను హిట్ ట్రాక్ ఎక్కించిందా?, గోపిచంద్ మలినేని, రవితేజ కాంబో హ్యాట్రిక్ విజయం సాధించిందా?, నిజ జీవిత కథలను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? అనేది రివ్యూలో చూద్దాం. కథ పోత రాజు వీర శంకర్ (రవితేజ) ఒక క్రేజీ పోలీసు. బ్యాగ్రౌండ్ అని ఎవడైనా విర్రవీగితే చాలు వాళ్ల బరతం పడతాడు. ఇలా వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేరస్థులతో తనదైనశైలీలో సీఐ వీర శంకర్ వైరం పెట్టుకుంటాడు. వారిలో ఒంగోలుకు చెందిన కటారి (సముద్రఖని ) అత్యంత శక్తివంతమైనవాడు. అతను అంటే చుట్టుపక్కల 20 ఊర్లకు భయం. అలాంటి వ్యక్తిపై వీరశంకర్ తిరుగుబాటు చేస్తాడు. తన సహోద్యోగి కొడుకు చావుకు కారణాలు తెలుసుకునే క్రమంలో కటారితో వైరం మరింత పెరుగుతుంది. ఈ క్రమంలో వీరశంకర్‌ని చంపడానికి కటారి రకరకలా ప్లాన్ వేస్తాడు. మరి కటారి, వీర శంకర్ ల మధ్య అసలు ఏమి జరిగింది ?, చివరకు వీరశంకర్ ఏమి చేశాడు ? అనేది మిగిలిన కథ. నటీనటులు మాస్ అనే పదానికి పర్యాయపదంలా కనిపిస్తాడు రవితేజ. ఆయన సినిమాలో కథ మొత్తం అతని చుట్టే తిరుగుతుంటుంది. ఇక ఈ సినిమాలో కూడా ఆయన వన్ మ్యాన్ షో నడిచింది. మాస్ మహారాజాలోని ఫైర్‌ను మరోసారి మనం తెరపై చూడొచ్చు. రవితేజ అభిమానులకు అయితే కన్నులపండువలా ఉంటుంది. ఎనర్జీతో పాటు స్టైలిష్‌గా కూడా కనిపించారు. సీఐ పోత రాజు వీర శంకర్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర రవితేజ ఒదిగిపోయాడు. సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై నడిపించారు. అలాగే జయమ్మ అనే నెగెటివ్ పాత్రలో వరలక్ష్మీ శరత్‌కుమార్ మెప్పించారు. రవితేజ తరవాత సినిమాలో బాగా పండిన పాత్ర సముద్రఖనిది. ’కఠారి‘ అనే విలన్ పాత్రకు ఆయన జీవం పోశాడు. తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. శృతీహాసన్, సుధాకర్,రవి శంకర్, తమ పాత్రల పరిధి మేర నటించారు. విశ్లేషణ రియల్ క్యారెక్టర్స్‌ను కమర్షియల్ సినిమాలోకి పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి తీసిన సినిమా ‘క్రాక్’. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. మాస్ ఆడియన్స్‌కి నచ్చే సినిమా తీయాలనేది దర్శకుడి మెయిన్ టార్గెట్ అనేది సినిమా మొదలైన కొద్ది నిమిషాలకే అర్థమవుతంది. మావిడికాయలో మేకు గుచ్చి, ఒక యాభై రూపాయల నోటుపై దానిని పెట్టి... కథ మొదలు పెట్టినపుడు ఇదంతా కాస్త సిల్లీగా అనిపిస్తుంది. కానీ సినిమా కథ మొత్తం అదే అని చెబుతూ.. తెరపై చూపించిన విధానం కాస్త కొత్తగా అనిపిస్తుంది. మొత్తానికి దర్శకుడు ఎదో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. కథ నేపథ్యాన్ని హీరో వెంకటేశ్‌తో చెప్పించడం, వేటపాలెం బ్యాచ్ ఒకటి బీచ్‌లో ఇసుకలోంచి బయటకు వచ్చి... గాడిద రక్తం తాగేసి అరగడం కోసం అటు ఇటు పరుగెత్తడం ప్రేక్షకులను కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే కొన్ని సీన్లు మాత్రం కాస్త సిల్లీగా అనిపిస్తుంది. ఇస్త్రీ బట్టలు తీసుకెళుతున్న మహిళ చేతిలోంచి జారి పడ్డ బట్టల్లో బురఖా జారి పడడం చూసి హీరో వెళ్లి ఒక టెర్రరిస్టుని పట్టుకోవడం, అలాగే మెయిన్ విలన్ కేసుకు సంబంధించి పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ వెతుకుతుండగా, అది గోడ మీద నుంచి జారిపడడం అంత కన్వీనియంట్‌గా అనిపించదు. అలాగే సినిమా కథ కూడా కాస్త రొటీన్‌గా సాగుతుంది. నెక్ట్ ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఈజీగా గెస్ చెయ్యగలడు. కానీ రోటీన్ కథని దర్శకుడు తెరపై చూపించే విధానం చాలా బాగుంది. ఇక హీరో, హీరోయిన్స్ రొమాంటిక్ ట్రాక్ సైతం పండలేదు. శ్రుతి హాసన్ మంచి సినిమాతోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది, కానీ పాపం, ఆమె మాత్రం పాటలకు మరియు కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం అయిపొయింది. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం సంగీతం. తమన్ తన పాటలతో పాటు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు. తనదైన బిబీఎంతో యాక్షన్ సీన్లకు ప్రాణం పోశాడు. ఇక రామ్‌లక్ష్మణ్ పోరాట ఘట్టాలు సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. ఫైట్స్ చాలా కొత్తగా ఉన్నాయి. సినిమాలో రవితేజ విలన్స్ కి మధ్య జరిగే పోరాటాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. యాక్షన్ సీన్లు అన్ని మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే సంక్రాంతి సందర్భంగా రవితేజ తన ఫ్యాన్స్‌కి మాస్ మసాలా బిర్యానీని అందించాడు. ప్లస్ పాయింట్స్ : రవితేజ నటన, వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని పాత్రలు తమన్ మ్యూజిక్ విలన్లకు, హీరోకి మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలు మైనస్ పాయింట్స్ రొటీన్ కథ ఫస్టాఫ్ ఫ్యామిలీ సీన్స్ అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్; థియేటర్లలో క్రాక్
పక్కా కమర్షియల్ మాస్ ఫిల్మ్ 'క్రాక్' సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలిగిపోయాయి. సినిమా ఉంటుందో, ఉండదో అన్న అనుమానంలో కొట్టుమిట్టాడుతూ, థియేటర్ల ఎదుటే పడిగాపులు కాస్తున్న అభిమానులకు దర్శకుడు గోపీచంద్ మలినేని శుభవార్త చెప్పారు. అన్ని సమస్యలు తొలిగాయని, దగ్గర్లోని థియేటర్‌కు వెళ్లి నేటి సాయంత్రమే ఫస్ట్ షో చూసేయండని పిలుపునిచ్చారు. దీంతో మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫలితం దక్కినట్లైంది. కొంచెం లేటయ్యిందేమో కానీ కలెక్షన్ల వర్షం పక్కా అంటూ థియటర్ల ముందు బారులు తీరుతున్నారు. పొద్దున టికెట్ క్యాన్సల్ అయినవాళ్లు కూడా ఈ మాస్ చిత్రాన్ని చూసేయాల్సిందేనంటూ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు 'లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తాడు. అన్నా కుమ్మేయ్.. కిక్కు వెయిటింగ్‌లోనే ఉంటుంది' అని హీరో మంచు మనోజ్ క్రాక్ సినిమాకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. పలువురు దర్శకనిర్మాతలు కూడా కొత్త సంవత్సరంలో రిలీజవుతున్న తొలి భారీ చిత్రాన్ని చూసేయండని పిలుపునిస్తున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించాడు. (చదవండి: క్రాక్’ వాయిదా.. నిర్మాతపై రవితేజ సీరియస్!) All problems solved for #Krack release. 🔥🔥👍👍 Let's get Krackified from today's first shows. 💥 Watch it now in your nearest theaters!! pic.twitter.com/50y8HzFLqR — Gopichandh Malineni (@megopichand) January 9, 2021 -
సంక్రాంతిని ముందే తెస్తున్నాం
‘‘రవితేజగారితో ఇంతకుముందు ‘డా¯Œ శీను, బలుపు’ వంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశాను. ప్రస్తుతం రియలిస్టిక్ స్టోరీస్‌కి మంచి ఆదరణ లభిస్తుండటంతో మూడో చిత్రంగా ఒక రియలిస్టిక్ అప్రోచ్‌తో సినిమా చేస్తే బాగుంటుందనిపించి ‘క్రాక్’ చేశా’’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. రవితేజ, శ్రుతీహాసన్ జంటగా, సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘క్రాక్’. బి. మధు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని చెప్పిన విశేషాలు. ► రియల్ క్యారెక్టర్స్‌ను కమర్షియల్ సినిమాలోకి పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి తీసిన సినిమా ‘క్రాక్’. నేను చదువుకునే రోజుల్లో ‘ఒంగోలులో రాత్రి కరెంట్ పోతే హత్య జరుగుతుంది’ అని చెప్పుకునే వారు.. మా ఊరి దగ్గరలో కొంతమంది గాడిద రక్తం తాగేవారు. అలా తాగిన తర్వాత ఒళ్లంతా చెమటలు పట్టేలా పరిగెత్తకపోతే రక్తం గడ్డకట్టుకు పోతుందని కొద్దిసేపు వేగంగా పరిగెత్తే వారు. అలా చేస్తే బాడీ స్ట్రాంగ్‌గా తయారవుతుందని వాళ్ల నమ్మకం. అలాంటి కొన్ని అంశాలకు ఒంగోలులో జరిగే మర్డర్స్‌కి లింక్ చేస్తూ థ్రిల్లింగ్‌గా కథ రాసుకున్నాం. ► 2021లో సంక్రాంతికి వస్తోన్న మొదటి చిత్రం మాదే కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాని 2019 మే 8న విడుదల చేద్దామనుకున్నాం. కరోనా ప్రభావం వల్ల వాయిదా వేశాం. అయితే ఒక మంచి సినిమా పండగకి రావాలని రాసిపెట్టిందేమో.. కాకపోతే ఈసారి సంక్రాంతిని కొంచెం ముందుగానే మీ ముందుకు తీసుకువస్తున్నాం. రవితేజగారి కెరీర్లో అత్యధికంగా 1000కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. ► ఒక సీఐ పాత్రని స్ఫూర్తిగా తీసుకుని రవితేజగారి పాత్ర తీర్చిదిద్దాను. కర్నూల్ నేపథ్యం కూడా సినిమాలో ఉంటుంది. కామెడీ, యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. ‘బలుపు’ తర్వాత రవితేజగారు అంత అందంగా, ఎనర్జిటిక్‌గా కనిపించిన చిత్రమిదే. ‘మెర్సల్, బిగిల్’ ఫేమ్ జీకే విష్ణుగారు ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమవుతున్నారు. ► ఈ సినిమాలో హీరో కొడుకు పాత్రలో మా అబ్బాయి సాత్విక్ నటించాడు.. కావాలని తీసుకోలేదు.. ఆ పాత్రకు సరిపోతాడనే తీసుకున్నాం. సముద్రఖని, వరలక్ష్మి పాత్రలు బాగుంటాయి. నేను అసోసియేట్‌గా ఉన్నప్పుడు మణిశర్మగారి దగ్గర పని చేసేవాడు తమన్. అప్పటి నుండి మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది. నా సినిమా అంటే తమన్ కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాడని నేను నమ్ముతాను. ► ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలై బాగా ఆడటం దేశమంతా హాట్ టాపిక్ అయింది. తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాని ఎంత ఇష్టపడతారనేది నిరూపితం అయింది. ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నాను. నా తర్వాతి చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌లో ఉంటుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. -
వారికి బాగా డబ్బులు రావాలి : రవితేజ
‘‘డాన్ శీను, బలుపు’ చిత్రాల తర్వాత గోపీచంద్, నా కాంబినేషన్లో వస్తున్న ‘క్రాక్’ హ్యాట్రిక్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మధు, అమ్మిరాజులకు ఈ చిత్రం పెద్ద హిట్ అయి బాగా డబ్బులు రావాలి. మళ్లీ ‘క్రాక్’ సక్సెస్‌మీట్‌లో కలుద్దాం’’ అన్నారు రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ, శ్రుతీహాసన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘క్రాక్’. సరస్వతి ఫిలింస్ డివిజన్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా రేపు (శనివారం) రిలీజవుతోంది. ఈ సందర్భంగా ‘క్రాక్’ ప్రీ రిలీజ్ వేడుకలో గోపీచంద్ మలినేని మాట్లాడుతూ – ‘‘సంక్రాంతి పండక్కి ముందే మాకు పెద్ద పండగ రానుంది. నాకు సినీ జీవితాన్నిచ్చిన రవితేజగారికి కృతజ్ఞతలు. మా ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ‘క్రాక్’ కచ్చితంగా హ్యాట్రిక్ అవుతుంది’’ అన్నారు. ‘‘సంక్రాంతి కానుకగా ఈ నెల 9న మా ‘క్రాక్’ భారీగా విడుదలవుతోంది. ఈ అవకాశం ఇచ్చిన మధు, రవితేజ, గోపీచంద్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అమ్మిరాజు. ‘క్రాక్’ మొదటి, రెండో టికెట్‌ను దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి కొనుగోలు చేశారు. -
ఆ పాట ప్రతి బిర్యానీ సెంటర్లో ఉంటుంది
‘‘1994లో ‘భైరవద్వీపం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఈ 26 ఏళ్ల కెరీర్లో ఎన్నో మధురానుభూతులుఉన్నాయి. నా కెరీర్లో ‘అరవిందసమేత వీరరాఘవ’ వందో చిత్రమని నాకు ముందు తెలీదు. ఆ తర్వాత తెలిసి ఆశ్చర్యపోయా. ఎన్ని సినిమాలు చేశానని వెనక్కి తిరిగి చూసుకుని లెక్కలు వేసుకోను.. వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకుంటూ సినిమాలు చేసుకుంటూ పోతుంటా’’ అని సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ అన్నారు. రవితేజ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్’. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు తమన్ పంచుకున్న విశేషాలు. ► గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ సినిమా పాటలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. ఆ సినిమా తర్వాత నా చేతిలో ఉన్న ప్రాజెక్టులను ఒత్తిడిగా భావించలేదు. ప్రతి సినిమాకి బాధ్యతగా 100 శాతం కష్టపడతాను. అది చిన్నదా, పెద్దదా అనే తేడా ఎప్పుడూ ఉండదు. కొన్ని సినిమా పాటలు మాత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే ‘క్రాక్’ సినిమాలోని పాటలు ‘అల వైకుంఠపురములో’ అంత హిట్ అవుతాయనే నమ్మకం వెయ్యి శాతం ఉంది. ‘క్రాక్’ సినిమా నుంచి నేడు విడుదల చేయనున్న ‘క్రాక్ బిర్యానీ..’ అనే పాట ప్రతి బిర్యానీ సెంటర్లో వినిపిస్తుంటుంది. ► రవితేజగారు, నా కాంబినేషన్లో వస్తున్న పదో చిత్రం ‘క్రాక్’. ఆయన పూర్తి ఫ్రీడమ్ ఇస్తారు. సరదాగా సినిమా పూర్తి చేయొచ్చు. ఆయన బాడీ లాంగ్వేజ్‌కి, కథకి ఎటువంటి సంగీతం ఇవ్వాలో నాకు తెలుసు.. అందుకే నాపై ఆయనకు నమ్మకం. ► గోపీచంద్ మలినేనిగారితోనూ నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వం వహించిన 6 సినిమాల్లో వరుసగా 5 చిత్రాలకు నేను సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉంది. ‘క్రాక్’ సినిమాతో రవితేజగారు, గోపీచంద్‌గారు హ్యాట్రిక్ హిట్ సాధిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ► లాక్డౌన్లో రికార్డింగ్ పనులు చూసుకుంటూ ఉన్నాను. సంగీతం అనేది నాకు అన్నం పెడుతోంది.. కాబట్టి నా దృష్టంతా పూర్తిగా సంగీతంపైనే.. నటించాలనే ఆలోచన ఒక్క శాతం కూడా లేదు. ప్రస్తుతం తెలుగులో ‘సర్కారువారి పాట, వకీల్ సాబ్, టక్ జగదీష్’ తో పాటు పవన్ కల్యాణ్‌గారి 29వ సినిమా సంగీత పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయ్యాకే తెలుగులో కొత్త సినిమాలు అంగీకరిస్తాను. -
క్రాక్ పెద్ద హిట్ కావాలి
‘‘థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘క్రాక్’ సినిమాలోని అందరూ నాకు బాగా కావాల్సిన వారే.. రవితేజ, గోపి అన్న, మధుగార్లకు ఈ సినిమా గుర్తుండిపోయేంత పెద్ద హిట్ కావాలి’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. రవితేజ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్’. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించారు. జనవరి 9న విడుదలకానున్న ఈ సినిమా ట్రైలర్‌ని అనిల్ రావిపూడి విడుదల చేశారు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ–‘‘మేం అడగ్గానే వాయిస్ ఓవర్ ఇచ్చిన వెంకటేష్‌గారికి థ్యాంక్స్. ఒక మంచి కథకి మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మంచి ప్రొడ్యూసర్.. అన్నీ కుదిరిన సినిమా ‘క్రాక్’. రవితేజ అభిమానులకు, ప్రేక్షకులకు ఈసారి సంక్రాంతి కొంచెం ముందుగానే వస్తోంది’’ అన్నారు. చిత్ర నిర్మాత బి.మధు, నిర్మాత సునీల్ నారంగ్, సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు, రచయిత వివేక్ పాల్గొన్నారు. -
‘క్రాక్’ ట్రైలర్: ష్యూర్ షాట్.. నో డౌట్.. పుచ్చె పేలిపోద్ది
మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘క్రాక్’. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నూతన సంవత్సరం పురస్కరించుకొని ‘క్రాక్’ ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ రవితేజ స్టైల్లో ఆకట్టుకునే విధంగా ఉంది. ‘శంకర్... పోతరాజు వీరశంకర్, ఒంగోలు నడి సెంటర్లో నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో సీసం పోస్తా నా కొడకా.., శంకర్.. ష్యూర్ షాట్.. నో డౌట్.. పుచ్చె పేలిపోద్ది అంటూ రవితేజ చెప్పిన మాస్ డైలాగ్స్ ఆడియన్స్‌ని ఈలలు వేయించేలా ఉన్నాయి. మరోవైపు ‘చూశారా.. జేబులో ఉండాల్సిన నోటు.. చెట్టుకు ఉండాల్సిన కాయ.. గోడకు ఉండాల్సిన మేకు.. ఈ మూడు ముగ్గురు తోపుల్ని తొక్కి తాట తీశాయ్.. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే.. ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే ఒక పోలీసోడూ..’ అంటూ ట్రైలర్ ఆరంభంలో విక్టరీ వెంకటేశ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ అదిరిపోయింది. ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించింది. వరలక్ష్మీ శరత్‌కుమార్ విలన్ పాత్రలో కనిపించనుంది. తమన్ సంగీతం అందించాడు. ‘క్రాక్’కి వాయిస్ ఓవర్ ఇచ్చారు విక్టరీ వెంకటేశ్. ఇలా వేరే హీరోల సినిమాలకు ఆయన మాట ఇవ్వడం ఇది మొదటిసారేం కాదు. నితిన్ ‘శ్రీనివాస కల్యాణం’కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే ఇంగ్లిష్ సినిమా ‘అల్లావుద్దీన్’ తెలుగు వెర్షన్లో జీనీ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. తాజా ‘క్రాక్’కి కూడా చెప్పారు. ఇక సినిమాను జనవరి 14న విడుదల చేస్తామని ప్రకటించిన చిత్రబృందం.. తాజాగా విడుదల తేదిని మార్చింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని వెల్లడించారు. -
కోరమీసం పోలీసోడా..
హీరో రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన మూడో చిత్రం ‘క్రాక్’. శ్రుతీహాసన్ కథానాయికగా నటించారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి.మధు నిర్మించారు. ఎస్.తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘కోరమీసం పోలీసోడా..’ అంటూ సాగే మూడో లిరికల్ వీడియో సాంగ్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కోరమీసం పోలీసోడా..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ మెలోడీకి రామజోగయ్య శాస్త్రి అర్థవంతమైన సాహిత్యం అందించారు. రమ్యా బెహరా తన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు. పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న రవితేజను టీజ్ చేస్తూ శ్రుతీహాసన్ ఈ పాట పాడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకొనే అంశాలున్నాయి. మా సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి. -
డేట్ ఫిక్స్
చాలారోజులుగా మిస్ అయిన జోష్‌ను మళ్లీ థియేటర్స్‌కి తీసుకురావడానికి రెడీ అంటోంది ‘క్రాక్’ టీమ్. ఇందుకోసం డేట్‌ని కూడా ఫిక్స్ చేసింది. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్’. ‘డాన్ శీను, బలుపు’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. ‘ఠాగూర్’ మధు నిర్మించిన ఈ సినిమాలో శ్రుతీహాసన్ కథానాయిక. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఇందులో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు రవితేజ. ఈ సినిమాను జనవరి 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు సంగీత దర్శకుడు తమన్. -
గోవాలో ఆటా పాటా
‘డాన్ శీను, బలుపు’ వంటి హిట్ చిత్రాల తర్వాత హీరో రవితేజ–డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘క్రాక్’. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తున్నారు. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, సముద్ర ఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్ఫుల్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయింది. ఓ పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. నేటి నుంచి గోవాలో జరుగుతున్న చివరి షెడ్యూల్లో రవితేజ, శ్రుతీహాసన్‌లపై ఆ పాటను చిత్రీకరిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రఫీ సమకూరుస్తున్నారు. ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘‘తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. ఒక ఇంటెన్స్ స్టోరీతో అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల రవితేజ, అప్సరా రాణిపై చిత్రీకరించి, విడుదల చేసిన ‘భూమ్ బద్దల్’ అనే ప్రత్యేక పాట బ్లాక్‌బస్టర్ హిట్టయింది. సంక్రాంతి కానుకగా ‘క్రాక్’ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: జి.కె. విష్ణు, సహనిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి. -
డైరెక్టర్‌తో స్టెప్పులేయించిన శ్రుతీ హాసన్
నటి శ్రుతీ హాసన్... స్టార్ హీరో కూతురిగా కంటే సొంత టాలెంట్‌తోనే చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. హీరోయిన్గా మాత్రమే కాకుండా గాయనిగా, డ్యాన్సర్‌గా సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా విభిన్న కోణాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతీహాసన్. తెలుగులో చివరగా పవన్ కల్యాణ్‌తో కలిసి కాటమ రాయుడు సినియాలో నటించిన శ్రుతి.. మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తుండగా వరలక్ష్మీ శరత్‌కుమార్ నెగటివ్ రోల్లో కనిపించనున్నారు. చదవండి: వకీల్ సాబ్ సెట్లో అడుగుపెట్టనున్న శృతి ఇక ఈ సినిమా షూటింగ్ కొంత వరకు మినహా మొత్తం పూర్తయ్యింది. మిగిలిన పాటల భాగాన్ని షూట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలో తన క్రాక్ సినిమా డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో కలిసి శ్రుతీ హాసన్ స్టెప్పులు వేశారు. మిర్రర్ ముందు మ్యూజిక్ పెట్టి సెల్ఫీ వీడియో తీస్తున్న శ్రుతి హాసన్ కాలు కదిపి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. దీన్ని చూసిన గోపిచంద్ ముందుగా డ్యాన్స్ చేసేందుకు బిడియంగా ఫీల్ అయ్యారు. అయినప్పటికీ మెల్లమెల్లగా డైరెక్టర్‌తో కూడా శ్రుతీ డ్యాన్స్ చేయించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఎప్పుడూ రోల్.. కెమెరా..యాక్షన్ అంటూ బిజీగా ఉండే డైరెక్టర్ ఇలా డ్యాన్స్ చేయడం నెటిజన్లను ఒకింతా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మానసిక ఆందోళనతో బాధపడ్డా: శ్రుతీహాసన్ -
ఆటాపాటా
‘డాన్ శీను, బలుపు’ చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘క్రాక్’. సరస్వతి ఫిలిమ్స్ డివిజ¯Œ పతాకంపై బి. మధు నిర్మిస్తున్నారు. శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అప్సరా రాణి ప్రత్యేక పాట చేస్తున్నారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. షూటింగ్ ముగింపు దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన సెట్లో రవితేజ, అప్సరా రాణిపై ఒక ఐటమ్ సాంగ్ చిత్రీకరిస్తున్నాం. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ మాస్ సాంగ్‌ను రామజోగయ్య శాస్త్రి రాశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జి.కె. విష్ణు, సహనిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి. -
పాటలే బ్యాలెన్స్
‘క్రాక్’ షూటింగ్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ‘డాన్ శీను’ (2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘క్రాక్’. ‘ఠాగూర్’ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమ్మిరాజు కానుమిల్లి ఈ సినిమాకు సహ నిర్మాత. ఇందులో సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయిందని చిత్రబృందం పేర్కొంది. అలాగే ఓ వారం రోజులు ప్యాచ్‌వర్క్ ఉంటుందట. షూటింగ్స్ చేయడానికి అనుమతి వచ్చిన వెంటనే ఈ రెండు పాటలను పూర్తి చేసి, వెంటనే రిలీజ్ కార్యక్రమాలు మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉంది ‘క్రాక్’ చిత్రబృందం. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. -
డబుల్ ధమాకా
రవితేజ హీరోగా రమేష్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తారు. ఇందులో రవితేజ తన అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారట. ఎన్ఆర్ఐ బిజినెస్‌మేన్‌గా, చార్టెడ్ అకౌంటెంట్‌గా రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని టాక్. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ‘క్రాక్’ చిత్రంలో నటిస్తున్నారు రవితేజ. కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. అలాగే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారిన రైటర్ వక్కంతం వంశీ డైరెక్షన్లో రవితేజ హీరోగా ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. -
‘కరెంట్ పోయిందంటే కచ్చితంగా మర్డరే’
మాస్ మహారాజ రవితేజ, బ్యూటీ శృతిహాసన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్’. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బి. మధు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకోబోతుంది. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ ఫోస్టర్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మూవీ టీజర్‌ను చిత్ర బృందం విడుదలచేసింది. ‘ఒంగోలులో రాత్రి 8గంటలకు కరెంట్ పోయిందంటే కచ్చితంగా మర్డరే’అంటూ మొదలైన టీజర్ ఆద్యంతం యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకుంది. అంతేకాకుండా మధ్యలో శృతిహాసన్‌తో రవితేజ లవ్ సీన్లు హైలైట్‌గా నిలిచాయి. ‘ఒరేయ్ అప్పిగా సుప్పిగా నువ్వెడైతేనాకేంట్రా నా డొప్పిగా’అంటూ రవితేజ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. పోలీస్ గెటప్‌లో రవితేజ ‘విక్రమార్కుడు’ను గుర్తుచేస్తున్నాడు. అన్ని వర్గాలను ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను ఈ టీజర్ తెగ ఆకట్టుకుంటోంది. దీంతో ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే రెండు మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకొని యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ‘డాన్ శీను, బలుపు’ తర్వాత వస్తున్న మూడో చిత్రం ‘క్రాక్’ భారీ అంచనాలే ఉన్న విషయం తెలిసిందే. సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. మే8న ఈ చిత్రం విడుదల కానుంది. -
‘సినిమా మే 8న.. టీజర్ కమింగ్ సూన్’
మాస్ మహారాజ రవితేజ హీరోగా, గ్లామరస్ హీరోయిన్ శృతిహాసన్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘క్రాక్’. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ మాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్తో పాటు మరో పోస్టర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ఈ పోస్టర్లో రవితేజ డార్క్ షాడోగా పరిగెత్తుకుంటూ వస్తున్న ఈ పోస్టర్ ఓ యాక్షన్ సీన్‌కు సంబంధించిందిగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ చిత్ర టీజర్ త్వరలోనే విడుదల చేయబోతున్నామని, అదేవిధంగా చిత్రాన్ని వేసవి కానుకగా మే8న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ‘డాన్‌శీను, బలుపు’ వంటి హిట్ చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ‘క్రాక్’ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన డాన్ శీను నిరాశపరచగా.. బలుపు సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇక బలుపు తర్వాత రవితేజతో శృతిహాసన్ జతకడుతోంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘డిస్కో రాజా’ బాక్సాపీస్ వద్ద ఘోరంగా బోల్తాపడింది. దీంతో రవితేజ ‘క్రాక్’ చిత్రంపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరి రవితేజకు గోపిచంద్ మలినేని ఈ చిత్రంతో విజయాన్ని అందిస్తాడో లేదో చూడాలి. వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని, దేవీ ప్రసాద్, పూజిత పొన్నాడ, చిరాగ్ జాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. చదవండి: ‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ దర్శకురాలిగా ‘లక్ష్మీ సౌజన్య’ -
రొమాంటిక్ పోలీస్!
బీచ్‌లో ప్రేయసితో ప్రేమరాగం తీస్తున్నారట రవితేజ. ‘డాన్ శీను’(2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బి. మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చీరాలలోని ఓ బీచ్‌లో జరుగుతోందట. అక్కడ ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరించే పనిలో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ పాట చిత్రీకరణకు ముందు ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు రవితేజ. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే8న విడుదల కానుంది. -
సమ్మర్లో క్రాక్
రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ‘డాన్ శీను, బలుపు’ తర్వాత వస్తున్న మూడో చిత్రం ‘క్రాక్’. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు రవితేజ. బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ కథానాయిక. మే 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, సహ నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి. -
రవితేజ టీంకు మురుగదాస్ విషెస్
సందేశంతో కూడిన కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దిట్ట. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘దర్బార్’. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. చాలా కాలం తర్వాత రజనీ పోలీస్ గెటప్‌లో అభిమానులను కనువిందు చేయనున్నాడు. ఇక చిత్ర ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రజనీ, దర్బార్ టీంతో పాటు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అయితే ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లోనే ఉన్న డైరెక్టర్ ఏఆర్ మురగదాస్.. రవితేజ తాజా చిత్రం ’క్రాక్’ సెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన విషయాలను తెలుసుకున్న మురుగదాస్ అనంతరం డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి చిత్ర సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఏఆర్ మురుగదాస్ క్రాక్ సెట్‌ను సందర్శించిన ఫోటోను గోపిచంద్ మలినేని తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. కాగా, డాన్ శీను, బలుపు వంటి చిత్రాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా పేరొందిన గోపీచంద్ మలినేని తాజాగా రవితేజతో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో టెంపర్ పోలీసాపీసర్‌గా రవితేజ కనిపించునున్నాడు. ఇప్పటికే న్యూఇయర్ కానుకగా విడుదలై ‘క్రాక్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. సమ్మర్లో విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తుండగా సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘డిస్కో రాజా’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఇంటెన్స్ లుక్‌తో అదరగొడుతున్న రవితేజ
సాక్షి, హైదరాబాద్: గట్టి సూపర్‌హిట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజా రవితేజ కొత్త సంవత్సరంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. ఇప్పటికే రవితేజ సైన్స్-ఫిక్షన్ డ్రామా ‘డిస్కోరాజా’ సినిమా ఈ నెల 24న విడుదలయ్యేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు ‘క్రాక్’ సినిమా కూడా శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా.. ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ బుధవారం విడుదల చేశారు. సోడా బాటిల్ పట్టుకొని పోలీసు ఆఫీసర్‌గా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న రవితేజ ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ పోస్టర్లో రవితేజ బ్యాక్‌సైడ్ ఖైదీలు నిలబడి ఉండటాన్ని చూడొచ్చు. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఇంతకుముందు డాన్‌శీను, బలుపు చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం క్రాక్. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తయ్యాయి. ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌పాత్రల్లో నటిస్తున్నారు. నటీనటులు: రవితేజ, శృతిహాసన్, సుమద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్, దేవీ ప్రసాద్, పూజిత పొన్నాడ, చిరాగ్ జాని, మౌర్యాని, హ్యాపీడేస్ సుధాకర్, వంశీ చాగంటి తదితరులు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని, నిర్మాత: బి.మధు, బ్యానర్: సరస్వతి ఫిలింస్ డివిజన్, సినిమాటోగ్రఫీ: జి.కె. విష్ణు, డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పాటలు: రామజోగయ్య శాస్త్రి -
పాత బస్తీలో డిష్యుం డిష్యుం
పాతబస్తీలో రౌడీమూకలను ర ఫ్ఫాడిస్తున్నారు ఆఫీసర్ రవితేజ. మరి ఆ రౌడీలు తప్పు తెలుసుకున్నారా? అనే విషయం తెలుసుకోవడానికి ఇంకా సమయం ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్’. ‘డాన్ శీను, బలుపు’ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. శ్రుతీహాసన్ కథానాయిక. వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని కీలకపాత్రలు చేస్తున్నారు. ‘ఠాగూర్’ మధు నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో ఓ పెద్ద ఫైట్‌ని చిత్రీకరించారు. నైట్ ఎఫెక్ట్‌లో సాగే ఈ ఫైట్‌ను రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ చక్కగా డిజైన్ చేశారట. ఈ సినిమా షూటింగ్ సుమారు 25 శాతం పూర్తయిందని తెలిసింది. వేసవికి విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
జాతరలో క్రాక్
రికార్డింగ్ డ్యాన్స్‌లు, పాటలతో ఆ ప్రాంతం అంతా సందడిగా ఉంది. ఓ గుడికి సంబంధించిన జాతరతో అక్కడి వాతావరణం కోలాహలంగా ఉంది. అప్పుడు అక్కడికి పోలీస్ డ్రెస్‌లో రవితేజ ఎంట్రీ ఇచ్చారు. నెక్ట్స్ సీన్‌ను వెండితెరపై చూడాల్సిందే. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బి. మధు నిర్మిస్తున్న చిత్రం ‘క్రాక్’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రధారి. ఇందులో పోలీసాఫీర్‌గా నటిస్తున్నారు రవితేజ. ఈ నెల 21న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభమైంది. ప్రస్తుతం జాతరకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రవితేజ, వరలక్ష్మీ శరత్‌కుమార్ ఈ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అమ్మిరాజు కానుమిల్లి సహ – నిర్మాత. ‘క్రాక్’ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
రవితేజ క్రాక్
‘డాన్‌శీను, బలుపు’ వంటి హిట్ చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి హైదరాబాద్‌లో గురువారం కొబ్బరికాయ కొట్టారు. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘క్రాక్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘బలుపు’ చిత్రం తర్వాత రవితేజ సరసన మరోసారి ‘క్రాక్’లో హీరోయిన్గా నటిస్తున్నారు శృతీహాసన్. ముహూర్తపు సన్నివేశాకి రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత ‘దిల్’ రాజు, డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందించారు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ– ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథ ఇది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘క్రాక్’ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు’’ అన్నారు ‘ఠాగూర్’ మధు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్మాతలు డి.సురేష్‌బాబు, ఎన్.వి.ప్రసాద్, సుధాకర్ రెడ్డి, నవీన్ ఎర్నేని, బీవీఎస్ఎన్ ప్రసాద్, రామ్ తాళ్లూరి, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దాము తదితరులు పాల్గొన్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని, దేవీ ప్రసాద్, పూజిత పొన్నాడ, చిరాగ్ జాని తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: జి.కె.విష్ణు, సహ నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి. -
అప్పుడు దర్శకుడు.. ఇప్పుడు నటుడు
తెలుగులో ‘శంభో శివ శంభో, జెండాపై కపిరాజు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు సముద్రఖని. తమిళంతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ఆ తర్వాత నటుడిగా మారారు. వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సముద్రఖని తాజాగా రవితేజ–గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందనున్న సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఊపారు. ‘డాన్ శీను, బలుపు’ చిత్రాల తర్వాత రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ‘ఠాగూర్’ మధు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘బలుపు’ తర్వాత ఈ చిత్రంలో రవితేజతో జోడీ కట్టారు శ్రుతీహాసన్. ఇదిలా ఉంటే సముద్రఖని దర్శకత్వంలో రవితేజ, ‘అల్లరి’ నరేశ్, శివబాలాజీ, ప్రియమణి తదితరుల కాంబినేషన్లో వచ్చిన ‘శంభో శివ శంభో’ చిత్రం మంచి విజయం సాధించిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు దర్శకుడిగా రవితేజ సినిమా చేస్తే ఇప్పుడు నటుడిగా రవితేజ సినిమాలో నటించనున్నారు సముద్రఖని. -
శృతి కలుస్తుందా!
ప్రస్తుతం డిస్కోరాజా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మాస్ మహారాజ్ రవితేజ ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. గతంలో రవితేజ హీరోగా బలుపు లాంటి హిట్ సినిమాను అందించిన గోపిచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన శృతిహాసన్ సడన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. దీంతో శృతి రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా రీ ఎంట్రీకి రెడీ అవుతున్న శృతి రవితేజ, గోపిచంద్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈసినిమా సెప్టెంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. -
ప్లాఫ్ ఇచ్చిన డైరెక్టర్‌తో మళ్లీ మెగాహీరో
ఈ మధ్య మెగా హీరోల్లో అసలు టైమ్ కలిసిరానిది సాయిధరమ్తేజ్కే. రామ్ చరణ్, వరుణ్ తేజ్ విజయాలతో దూసుకెళ్తుంటే.. ఈ హీరో మాత్రం విజయాన్ని చూసి చాలా కాలమైంది. సుప్రీం సినిమా తర్వాత సరైన హిట్ పడలేదు ఈ హీరో ఖాతాలో. రీసెంట్గా వచ్చిన ఇంటెలిజెంట్ దారుణంగా బెడిసికొట్టింది. మాస్ మంత్రం జపిస్తూ... ఒకే ధోరణిలో సినిమా చేస్తున్న ఈ సుప్రీం హీరో ప్రస్తుతం ట్రాక్ మార్చినట్టు కనిపిస్తోంది. కరుణాకరన్‌తో తేజ్ ఐలవ్యూ, కిషోర్తిరుమలతో మరో లవ్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. విన్నర్ లాంటి డిజాస్టర్‌ను ఇచ్చిన గోపిచంద్ మలినేనితో మరో ప్రాజెక్టును చేయబోతున్నట్లు ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కామెడీ, మాస్ అంటూ సినిమాలు చేసే ఈ డైరెక్టర్ మరి ఈ సారి ఈ హీరోను ఎలా చూపిస్తారో..వేచి చూడాలి. జె.భగవాన్– జె.పుల్లారావు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. -
జూలై నుంచి షురూ
సాయిధరమ్ తేజ్ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘విన్నర్’ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. అదే కాంబినేషన్ మరోసారి చేతులు కలిపింది. ఇది వరకూ నిరాశపరిచినప్పటికి ఈ సారి మాత్రం టార్గెట్ మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయింది. అందుకే ఈసారి ఇంకా స్ట్రాంగ్ స్క్రిప్ట్‌తో ముందుకొస్తుందట. ఈ చిత్రాన్ని బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె. పుల్లారావు నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై మొదటి వారం నుంచి స్టార్ట్ కానుందని సమాచారం. ఇక సాయిధరమ్ తేజ్ హీరోగా కరుణాకరణ్ దర్శకత్వంలో రూపొం దిన ‘తేజ్: ఐ లవ్ యు’ చిత్రం జూన్ 29న విడుదల కానుంది. -
విన్నర్ కాంబినేషన్ రిపీట్
హీరో సాయిధరమ్ తేజ్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే నుంచి స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు జె.భగవాన్– జె.పుల్లారావు మాట్లాడుతూ ‘‘సాయి ధరమ్ తేజ్, గోపీచంద్ కాంబినేషన్లో సినిమా నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. ఒక కొత్త జోనర్లో ఈ సినిమా ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌ను ధరమ్ తేజ్ ఇదివరకు చేయలేదు. ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. -
మే నుంచి సాయి ధరమ్, గోపిచంద్ కొత్త సినిమా
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమాను మే లో మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. మెగా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయిన సాయి ధరమ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సాధించుకునేందుకు కష్టపడుతున్నాడు. ఇటీవల ఇంటిలిజెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరో త్వరలో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. డిఫరెంట్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రీ బాలజీ సినీ మీడియా బ్యానర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావులు నిర్మించనున్నారు. గతంలో సాయి ధరమ్, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన విన్నర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే మరోసారి గోపిచంద్ సినిమా చేసేందుకు అంగీకరించాడు సుప్రీం హీరో. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా నటీనటులు ఎంపిక జరుగుతోంది. ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న ఓ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు సంగీతమందించనున్నట్టుగా తెలిపారు చిత్ర నిర్మాతలు. -
మెగా హీరో స్పీడు పెంచాడు..!
మెగా వారసుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలు అందుకున్న సాయి తరువాత తడబడ్డాడు. తిక్క, విన్నర్, నక్షత్రం సినిమాలు ఫ్లాప్ అవ్వటంతో ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతం రచయిత బీవీఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్, మాస్ సినిమాల స్పెషలిస్ట్ వినాయక్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు. ఈ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న ప్రచారం జరుగుతోంది. తనకు విన్నర్ లాంటి ఫ్లాప్ ఇచ్చిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడట. ఈ సినిమాను భగవాన్, పుల్లారావులు భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్ధమవుతున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
మేకింగ్ ఆఫ్ మూవీ - విన్నర్
-
ప్రతి సినిమా భయంతో చేస్తా!
‘‘ప్రతి సినిమాను తొలి చిత్రంలానే భావించి, వంద శాతం కష్టపడి పని చేస్తా. జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. నమ్ముకున్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదనే భయంతో సినిమా తీస్తా. మినిమమ్ గ్యారంటీ సినిమా అనిపిస్తేనే చేస్తా’’ అని గోపీచంద్ మలినేని అన్నారు. సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా ఆయన దర్శకత్వంలో బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మించిన ‘విన్నర్’ నేడు రిలీజవుతోంది. దర్శకుడు చెప్పిన విశేషాలు. ⇔ నల్లమలుపు బుజ్జి బ్యానర్లో ‘లక్ష్యం’, ‘ఠాగూర్’ మధు బ్యానర్లో ‘స్టాలిన్’ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా చేశా. వారిద్దరూ కలిసి నిర్మించిన ‘విన్నర్’ చిత్రానికి నేను డైరెక్టర్ అవడం హ్యాపీగా ఉంది. సాయిధరమ్ తేజ్‌తో సినిమా చేద్దామని నిర్మాతలు చెప్పారు. వెలిగొండ శ్రీనివాస్ చెప్పిన కథ నిర్మాతలకు, నాకు, తేజుకు కొత్తగా అనిపించడంతో ముందుకెళ్లాం. ⇔ ఇది కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ ఉంటాయి. సాయిధరమ్ తేజ్, జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు మనసును హత్తుకునేలా ఉంటాయి. ఇందులో తేజు లుక్స్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్, ఫైట్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. ⇔ గుర్రాలు, రేసులు, తన తండ్రి అంటే ఇష్టపడని హీరో.. హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. ప్రేయసి ఛాలెంజ్ కోసం తండ్రిని ఇష్టపడి, గుర్రాల రేసులో ఎలా గెలిచాడు? అన్నదే ‘విన్నర్’ కథ. ఈ పాత్ర కోసం వారం పాటు తేజు హార్స్ రైడింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. ⇔ క్లయిమాక్స్‌లో భాగంగా టర్కీలో హార్స్ రైడింగ్ చిత్రీకరించాం. ఇందుకోసం హాలీవుడ్ ఫైట్‌మాస్టర్ కలయన్ను బల్గేరియన్ నుంచి పిలిపించాం. తేజు స్వారీ చేసిన గుర్రానికి నటించే విషయంలో ఇరవై ఏళ్ల అనుభవం ఉంది. యాక్షన్ అనగానే పరిగెడుతుంది. కట్ చెప్పగానే ఆగిపోతుంది. అది భలే ఎక్స్పీరియన్స్. ⇔ అనసూయ తో ఐటమ్ సాంగ్ చేయిస్తే బాగుంటుందనిపించింది. ముందు తను ఒప్పుకోలేదు. సుమతో పాడించాలనే ఆలోచన తమన్‌దే. అనసూయ ఆట, సుమ పాట అలరిస్తాయి. -
మెగా హీరోకు భారీ టార్గెట్
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో విన్నర్‌గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు సాయి. ఇప్పటి వరకు మీడియం బడ్జెట్ సినిమాలతో మంచి కమర్షియల్ హిట్స్ అందుకున్న సాయి ఈ సారి మాత్రం రిస్క్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. విన్నర్ సినిమాను సాయి ధరమ్ గత సినిమాలతో పోలిస్తే భారీ బడ్జెట్‌తో రూపొందించారు. హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్, విలన్‌గా జగపతిబాబు లాంటి టాప్ స్టార్స్‌తో పాటు భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆర్టిస్ట్‌ల రెమ్యూనరేషన్‌కే 11 కోట్ల వరకు అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఫారిన్ షూట్లు, హార్స్ రేసింగ్ సీన్లతో కలిపి బడ్జెట్ 24 కోట్లకు చేరింది. సాయి ధరమ్ రికార్డ్, గోపిచంద్ మలినేని మీద ఉన్న అంచనాల నేపథ్యంలో సినిమా బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఈ సినిమా ఓవర్సీస్తో కలిపి దాదాపు 30 కోట్ల వరకు బిజినెస్ అయిపోయింది. అంటే విన్నర్ 30 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తేనే విన్నర్ హిట్ లిస్ట్‌లోకి చేరుతోంది. ఇప్పటి వరకు 25 కోట్ల క్లబ్ లోనే ఆగిపోయిన సాయి, విన్నర్‌తో కొత్త రికార్డ్ సృష్టిస్తాడేమో చూడాలి. -
గడ్డిపోచని కాదు గడ్డపారని : విన్నర్
సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా విన్నర్. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మాస్ యాక్షన్‌తో పాటు కామెడీ పంచ్‌లతో కట్ చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. సాయిధరమ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సింగం 3 ఫేం థాకూర్ అనూప్ సింగ్ విలన్‌గా నటిస్తున్నాడు. జగపతిబాబు, ముఖేష్ రుషి, 30 ఇయర్స్ పృథ్వీ ఇలా భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 24న రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
గడ్డిపోచని కాదు గడ్డపారని : విన్నర్
-
మావయ్య విజేత.. మేనల్లుడు విన్నర్!
‘విజేత’.. 30 ఏళ్ల క్రితం చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా. ఇప్పుడిదే పేరుతో చిరు మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నారు. అప్పటి ‘విజేత’ను ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు ‘విన్నర్’ని చేశారు. సాయిధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న చిత్రం ‘విన్నర్’. శనివారం సాయిధరమ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘‘కన్నతండ్రితో పాటు ప్రేమించిన అమ్మాయి మనసు గెలవడం కోసం ఓ యువకుడు చేసిన పోరాటమే ఈ చిత్రకథ’’ అన్నారు గోపీచంద్ మలినేని. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘హీరో పాజిటివ్ క్యారెక్టర్‌కి తగ్గట్టే మంచి టైటిల్ కుదిరింది. ఉక్రెయిన్‌లో పాటల్ని, ఇస్తాంబుల్‌లో క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తాం. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా, జగపతిబాబు, ముఖేశ్ రుషి, అలీ, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, రచన: అబ్బూరి రవి, శ్రీధర్ సీపాన, ఫైట్స్: రవివర్మ, కెమేరా: చోటా కె.నాయుడు, సంగీతం: తమన్, సమర్పణ: బేబీ భవ్య. -
విన్నర్‌గా మెగా హీరో
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నెక్ట్స్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. శనివారం సాయిధరమ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. స్టైలిష్‌గా డిజైన్ చేసిన ఈ పోస్టర్లో సినిమా టైటిల్‌ను కూడా రివీల్ చేశారు. చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగానే విన్నర్ అనే టైటిల్‌నే ఫిక్స్ చేశారు. కమర్షియల్ చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి గత చిత్రం తిక్క ఆకట్టుకోలేకపోవటంతో ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. టైటిల్ డిజైన్ చూస్తే సినిమా హార్స్ రైడింగ్ బ్యాక్ డ్రాప్లో సాగుతుందనిపిస్తోంది. అయితే ఈ సినిమాలో సాయి ధమర్ తేజ్ ఫ్యాషన్ డిజైనర్‌గా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ రెండింటిలో ఏది నిజం అన్న విషయం తెలియాలంటే టీజర్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. -
'నా సినిమా ఆగిపోలేదు'
పండగ చేస్కో సినిమా తరువాత ఒక్క సినిమాకూడా అంగకీరించని గోపిచంద్ మలినేని, ఇటీవల మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో ఓ సినిమాను ప్రారంభించాడు. అయితే సాయి ప్రస్తుతం సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తిక్క సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో గోపిచంద్ సినిమా ఇంకా సెట్స్ మీదకు రాలేదు. అయితే అదే సమయంలో సాయిధరమ్ తేజ్ ఇతర దర్శకులతో సినిమాలు అంగీకరించాడన్న వార్తలు వినిపించాయి. దీంతో తిక్క తరువాత సాయిధరమ్ తేజ్ చేయబోయే సినిమాపై అనుమానాలు ఏర్పాడ్డాయి. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ప్రారంభమైన సినిమాను పక్కన పెట్టి, సాయి మరో దర్శకుడితో సినిమా ప్రారంభిస్తున్నాడన్న టాక్ వినిపించింది. ఇలాంటి రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెడుతూ త్వరలోనే తమ సినిమా స్టార్ అవుతుందన్న సంకేతాలిచ్చాడు దర్శకుడు గోపిచంద్. తన సినిమా స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్తో అలరిస్తానని ట్విట్టర్లో కామెంట్ చేశాడు. Don't trust any false news abt my film..script is in final stage ...it's a pakka commercial entertainer — Gopichand Malineni (@megopichand) 2 June 2016 -
చక్రి దర్శకత్వంలో...
నూతన దర్శకులతో సినిమాలు చేయడానికి రవితేజ ఎప్పుడూ వెనకాడలేదు. కెరీర్ ఆరంభంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘నీ కోసం’ చేశారు. స్టార్ హీరో అయ్యాక కూడా నూతన దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘భద్ర’, హరీశ్ శంకర్‌తో ‘షాక్’, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘డాన్ శీను’, బాబీతో ‘పవర్’ చిత్రాలు చేశారు. తాజాగా చక్రి అనే నూతన దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారు. రవితేజ నటించిన ‘బలుపు’, ‘పవర్’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేశారు చక్రి. అతను చెప్పిన కథ నచ్చడంతో రవితేజ అవకాశం ఇచ్చారు. -
జోడీ కుదిరింది!
వరుణ్ తేజ్ మంచి దూకుడు మీద ఉన్నాడు. ఒక సినిమా చేస్తున్నప్పుడే ఇంకో సినిమా ఫైనలైజ్ చేసేస్తున్నాడు. ‘కంచె’తో పాటే ‘లోఫర్’ కమిట్ అయ్యాడు. ‘లోఫర్’ డిసెంబర్ 18న విడుదలకు సిద్ధంగా ఉంది. మరి.. వరుణ్ తదుపరి ఏ సినిమా చేయబోతున్నాడు? ఆ విషయానికే వద్దాం. ‘పండగ చేస్కో’తో హిట్ సాధించిన గోపీచంద్ మలినేనికి వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో వరుణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించనుందని సమాచారం. వరుణ్ నటించిన తొలి చిత్రం ‘ముకుంద’లో అప్‌కమింగ్ హీరోయిన్ పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ‘కంచె’లో నటించిన ప్రగ్యా జైస్వాల్ కూడా అప్‌కమింగ్ హీరోయినే. మూడో సినిమా ‘లోఫర్’లో దిషా పటాని కూడా అంతే. సో.. నాలుగో సినిమాలో వరుణ్ స్టార్ హీరోయిన్‌తో జతకట్టనున్నాడన్న మాట. వరుణ్, రకుల్ సరి జోడీ అనొచ్చు. ఎందుకంటే, వరుణ్ మంచి ఎత్తు. రకుల్ కూడా మంచి హైట్. చూడచక్కగా ఉండే ఈ జంట మధ్య కెమిస్ట్రీ బాగుంటుందని ఊహించవచ్చు. సంక్రాంతి తర్వాత ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలిసింది. -
మరో ప్రయోగానికి రెడీ
మెగా ఫ్యామిలీ హీరో అంటే రెడీమేడ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో మాస్ హీరోగా ఎంట్రీ ఇస్తారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ సాఫ్ట్ లవ్ స్టోరీతో పరిచయం అయ్యాడు వరుణ్ తేజ్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'ముకుంద' సినిమాతో తెరంగేట్రం చేసిన వరుణ్, తొలి సినిమాతో కమర్షియల్ స్టార్ అనిపించుకోలేకపోయినా నటుడిగా మంచి మార్కులే సాధించాడు. అదే జోష్‌లో 'కంచె' సినిమాతో మరోసారి సమ్‌థింగ్ స్పెషల్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. 'కంచె' సినిమాతో కమర్షియల్‌గా కూడా సక్సెస్ అయిన వరుణ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'మా అమ్మ సీతామాలక్ష్మీ' (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే నెక్ట్స్ సినిమాను కూడా రెడీ చేస్తున్నాడు. పూరితో చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ కావటంతో, నెక్ట్స్ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించాలని ప్లాన్ చేస్తున్నాడు వరుణ్. డాన్ శీను, బలుపు, పండగచేస్కో సినిమాలతో కమర్షియల్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న గోపిచంద్ మలినేని, తొలిసారిగా ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించనున్నాడు. ఇప్పటికే కథ కూడా ఫైనల్ కావటంతో పూరి సినిమా పూర్తి కాగానే వరుణ్, గోపిచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
కోలీవుడ్ కు జూనియర్ ఎన్టీఆర్
తమిళసినిమా: టాలీవుడ్ చిత్రాల స్టామినా పెరి గిం ది. తెలుగు సిని మాల కోసం ఇప్పుడు ప్రపంచ సినిమా ఎదురు చూస్తోంది. ఇది టాలీవుడ్ స్టార్ హీ రోలను కొత్త పుం తలు తొక్కిస్తోంది. కసిని పెంచుతోం ది. దర్శకుల మెదడుకు పదును పెట్టేలా చేస్తోంది. ఇందుకు చిన్న ఉదాహరణ ఇటీవల విడుదలయిన బాహుబలి చిత్రమే. ఈ చిత్రం అంచనాలను అధిగమించి ఖండాంతరాలను దాటి తెలుగు చిత్రం ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిందని చెప్పవచ్చు. ఆ తరువాత తెరపైకొచ్చిన శ్రీమంతుడు అదే బాట పట్టడంతో ఆ చిత్రాల కథానాయకుల సమకాలీన నటుల మైండ్‌సెట్ మారుతోంది. తమ పరిధిని విస్తరించుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారనడానికి ఉదాహరణ తెలుగులో స్టార్ హీరోగా వెలుగొందుతున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తె లుగుతో పాటు తమిళ చిత్ర పరిశ్రమపై కూడా దృష్టి సారించడం. ఆయన సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న భారీ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో విడుదల చే యడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు తదుపరి ద్విభాషా చిత్రంలో న టించడానికి రంగం సిద్ధం చేసుకున్నటు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగుదాస్ కథ, కథనాలతో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న భారీ చిత్రంలో జూని యర్ ఎన్టీఆర్ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు, ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నట్లు కోలీవుడ్ టాక్. -
వంటిల్లు చెప్పే కథ!
వంటింటి నేపథ్యంలో సాగే కథతో ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో రాజ్‌కిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘పాకశాల’. ‘‘ప్రచార చిత్రాలు చూస్తుంటే, మంచి థ్రిల్లర్ మూవీ అనిపిస్తోంది’’ అని దర్శకుడు గోపీచంద్ మలినేని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో ఓ వంట గది కథ చెబుతుంది. వినూత్న తరహాలో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి వైజాగ్ వెళ్లినప్పుడు హుద్‌హుద్ తుపాను మొదలైంది. అది తట్టుకొని చిత్రీకరించాం’’ అన్నారు. విశ్వ, శ్రీనివాస్, హరీశ్ చక్ర సతీశ్, జగదీష్‌రెడ్డి, అర్పిత, కార్తీ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి సహనిర్మాత: ఆర్.పి. రావు. -
మూడు చిత్రాలతో బిజీ!
ఇప్పుడు రామ్‌కు క్షణం తీరిక లేదు. వరుసగా షూటింగ్‌ల మీద షూటింగులు. విశ్రాంతి గురించి కూడా ఆలోచించకుండా డేట్స్ కేటాయించేశారు. ఒకవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘పండగ చేస్కో’ సినిమా చేస్తూనే, మరోవైపు రెండు చిత్రాలకు పచ్చజెండా ఊపేశారు. జస్ట్ అంగీకరించడం మాత్రమే కాదు.. జెట్ వేగంతో ఓ చిత్రం మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసేశారు. శ్రీస్రవంతి మూవీస్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. దీనికి ‘శివమ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ బుధవారంతో పూర్తయింది. శుక్రవారం రాత్రి ‘పండగ చేస్కో’ కోసం పోర్చుగల్, స్పెయిన్ ప్రయాణం అవుతున్నారు రామ్. వచ్చే నెల 23 వరకు అక్కడ ఉంటారు రామ్. ఇక్కడకు రాగానే, ‘శివమ్’ రెండో షెడ్యూల్ ఆరంభం అవుతుంది. ఆ వెంటనే శ్రీ స్రవంతి మూవీస్‌లోనే మరో చిత్రం షూటింగ్లో పాల్గొంటారు. తిరుమల కిశోర్ దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. కథ కూడా సిద్ధమైంది. ఏప్రిల్‌లో చిత్రీకరణ మొదలవుతుంది. ప్రస్తుతం కథానాయిక ఎంపిక జరుగుతోంది. అంటే... ఈ ఏడాది రామ్ మూడు సినిమాలతో అభిమానులను అలరించనున్నారన్నమాట. -
స్టయిలిష్ లుక్...
తొలి సినిమా ‘దేవదాస్’ నుంచి మొన్నటి ‘మసాలా’ వరకూ సినిమా సినిమాకీ తనలోని ఎనర్జీ లెవల్స్‌ని పెంచుకుంటూ వెళ్తున్నారు హీరో రామ్. ప్రస్తుతం ‘పండగచేస్కో’ షూటింగ్లో బిజీగా ఉన్నారాయన. కుర్రకారు పండగ చేసుకునేలా ఈ సినిమా కథ, కథనాలుంటాయని చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని అంటున్నారు. ఈ చిత్రంలో రామ్ చాలా స్టయిలిష్ లుక్‌తో కనిపిస్తారని ఆయన పేర్కొన్నారు. పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ సందర్భంగా పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ- ‘‘నటునిగా రామ్ సత్తా ఏంటో తెలిపే సినిమా ఇది. ఆయన ఇమేజ్‌కి తగ్గట్టుగా పాత్ర చిత్రణ ఉంటుంది. గత నెలలో 15 రోజుల పాటు పొల్లాచ్చిలో స్టన్ శివ నేతృత్వంలో పోరాట సన్నివేశాలు చిత్రీకరించాం. ఈ నెల 15 నుంచి నెలాఖరు వరకూ హైదరాబాద్‌లో కొంత టాకీతో పాటు పోరాట సన్నివేశాలు తీస్తాం. అక్టోబర్ 20 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ ఉంటుంది’’ అని తెలిపారు. రకుల్ ప్రీత్‌సింగ్, సోనాలి చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, కెమెరా: ఆర్థర్ వెల్సన్, సంగీతం: తమన్. -
పొల్లాచ్చిలో ఫైటింగ్!
పండగలాంటి సినిమా ఇవ్వడానికి కృషి చేస్తున్నాం.. పండగ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటున్నారు ‘పండగ చేస్కో’ చిత్రబృందం. రామ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రం ఇది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఇటీవల కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. ప్రస్తుతం రామ్ పాల్గొనగా స్టన్ శివ నేతృత్వంలో ఫైట్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 30 వరకు సాగే ఈ షెడ్యూల్లో ఇంకా టాకీ సీన్స్ కూడా తీస్తాం. రామ్ శారీరక భాషకు తగ్గట్టుగా తన పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. తమన్ మంచి పాటలు స్వరపరిచారు’’ అని చెప్పారు. రకుల్ ప్రీత్‌సింగ్, సోనాల్ చౌహాన్, సాయికుమార్, బ్రహ్మానందం తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: అనిల్ రావిపూడి, కెమెరా: ఆర్థర్ విల్సన్. -
పేరుకు తగ్గట్టే పండగ..!
‘‘పేరుకు తగ్గట్టే ‘పండగచేస్కో’ సినిమా ఉంటుంది’’ అంటున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. రామ్ కథానాయకునిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పండగచేస్కో. పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్, సోనాలి చౌహాన్ కథానాయికలు. ఈ చిత్రం షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇందులో రామ్ ఆహార్యం, అభినయం కొత్తగా ఉంటాయి. రామ్ శారీరక భాషకు తగ్గట్టుగా ఎనర్జిటిక్‌గా ఆయన పాత్రను మలచడం జరిగింది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాం. సెప్టెంబర్‌లో అమెరికా షెడ్యూల్ ఉంటుంది. నవంబర్ 15 వరకూ జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. యువతరాన్ని ఉర్రూతలూగించేలా సినిమా ఉంటుంది. తమన్ సంగీతం ఈ సినిమాకు హైలైట్’’ అని తెలిపారు. సాయికుమార్, బ్రహ్మానందం, జయప్రకాశ్‌రెడ్డి, రావురమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, కెమెరా: ఆర్థర్ వెల్సన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాణం: యునెటైడ్ మూవీస్. -
ఎన్నారైగా హంగామా
డాలర్లలో పుట్టి పెరిగిన కుర్రాడు అతను. పిజ్జాలూ బర్గర్లూ, ఫ్యాషన్లూ, హైఫై, వైఫై... ఇదే అతని ప్రపంచం. అలాంటివాడు విదేశం వదిలి స్వదేశంలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. ఇక్కడకు ఎందుకొచ్చాడు? ఇక్కడేం చేశాడు? రామ్ తాజా సినిమా ‘పండగ చేస్కో’ కథా కమామీషు ఇది. ఎన్నారై కుర్రాడిగా ఫుల్ జోష్‌తో రామ్ ఇందులో కనిపిస్తారని దర్శకుడు గోపీచంద్ మలినేని చెబుతున్నారు. రవితేజతో ‘బలుపు’ వంటి హిట్ సినిమా చేసిన గోపి ఈ చిత్రాన్ని రామ్ శారీరక భాషకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ‘సింహా’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన నిర్మాత పరుచూరి ప్రసాద్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన పాత్రలో రకరకాల డైమన్షన్లు ఉండడంలో రామ్ ఈ సినిమా విషయంలో ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. రామ్ శైలికి తగిన వినోదం, యాక్షన్ ఇందులో ఉంటాయట. ఈ చిత్రంలో రామ్‌కి జోడీగా రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తున్నారు. సోమవారం నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. త్వరలో విదేశాల్లో భారీ షెడ్యూలు చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
పది రోజుల్లో పండగ మొదలు
ప్రేక్షకులు పండగ చేసుకునే స్థాయిలో మా ‘పండగ చేస్కో’ ఉంటుందని నిర్మాత పరుచూరి కిరీటి అంటున్నారు. రామ్ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 12న మొదలుకానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇందులోని హీరో పాత్ర చిత్రణ రామ్ శారీరకభాషకు తగ్గట్టుగా ఉంటుంది. రామ్ అత్యంత శక్తిమంతమైన పాత్రను పోషించనున్నారు. పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుంది’’ అని చెప్పారు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోనవెంకట్, కెమెరా: ఆర్థర్ ఎ.విల్సన్, సంగీతం: తమన్, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: పరుచూరి ప్రసాద్. -
పండగలా ఉండే సినిమా : రామ్
‘‘దాదాపు ఏడాది విరామం తర్వాత చేస్తున్న సినిమా ఇది. ‘మసాలా’ సినిమాకు ముందే రచయిత వెలిగొండ శ్రీనివాస్ నాకీ కథ చెప్పాడు. చాలా నచ్చింది. అతనితో పాటు మంచి రచయితల బృందం కుదిరింది. అలాగే, ఇతర శాఖలకు కూడా ప్రతిభావంతులు కుదరడం ఆనందంగా ఉంది. ఎంత అన్యమన స్కంగా థియేటర్‌కి వెళ్లినా ఈ సినిమా బాగుందనే అంటారు’’ అని చెప్పారు రామ్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రామ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా యునెటైడ్ మూవీస్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ‘పండగ చేస్కో’ శనివారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ముహూర్తపు దృశ్యానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ -‘‘రామ్ ఎనర్జీ అంటే నాకిష్టం. ఆ ఎనర్జీ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తుంది. ‘బలుపు’ తర్వాత కొంత సమయం తీసుకున్నా మంచి కథ కుదిరింది. చక్కని కథ, మంచి నిర్మాతతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. నాయకా నాయికల పాత్రలు ఎనర్జిటిక్‌గా ఉంటాయి. జగపతిబాబుది ఇందులో ముఖ్యమైన పాత్ర’’ అని చెప్పారు. గోపీచంద్, రామ్‌లతో ముచ్చటగా తనకిది మూడో సినిమా అని, హ్యాట్రిక్ సాధించడం ఖాయం అని సంగీత దర్శకుడు తమన్ అన్నారు. రామ్ కోసమే రాసిన కథ ఇదనీ, ఓ కోటీశ్వరుడు భారతదేశం వచ్చి ఏం చేశాడు? అనేదే ఈ చిత్రకథ అని చెప్పారు వెలిగొండ శ్రీనివాస్. నిర్మాత పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ, ‘‘రామ్తోగత నాలుగేళ్లుగా సినిమా చేయాలనుకుంటున్నా. అయితే ఎన్టీఆర్, బన్నీ స్థాయికి తగ్గ కథ ఉంటేనే రామ్‌తో చేయాలనుకున్నా. ఎందుకంటే అతను అంత ఎనర్జిటిక్. వినోద ప్రధానంగా సాగే సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడి చూస్తున్నారు. పండగలా ఉండే ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ఈ సినిమాలో నటించడం పట్ల రకుల్ తన ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: అనిల్ రావిపూడి. -
వరుసగా రెండు సినిమాలు!
జయాపజయాలకు అతీతంగా యువతలో క్రేజ్‌ని సొంతం చేసుకున్న యువ కథానాయకుడు రామ్. వెంకటేశ్‌తో కలిసి ఆయన నటించిన మల్టీస్టారర్ ‘మసాలా’ వచ్చి అయిదు నెలలు కావస్తోంది. ఇప్పటివరకూ రామ్ సినిమా ఏదీ మొదలు కాలేదు. ఎనర్జీకి పర్యాయ పదమైన రామ్ సినిమా కోసం యువతరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ విజయాన్ని సాధించాలనే కసితో రామ్ ఉన్నారని, ఈ విరామానికి కారణం అదేనని ఆయన ఆంతరంగికుల సమాచారం. కథల విషయంలో చాలా అప్రమత్తంగా రామ్ ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్గా రామ్ ఓ కథను ‘ఓకే’ చేశారు. వేణు అనే నూతన దర్శకుడు చెప్పిన ఈ కథ రామ్‌కి విపరీతంగా నచ్చడంతో... వెంటనే పచ్చజెండా ఊపేశారట. ఓ నూతన నిర్మాణ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించనుంది. రామ్ సరసన సమంత కథానాయికగా నటించడం ఈ సినిమాకు మరో విశేషం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రామ్ నటించే ‘పండగచేస్కో’ చిత్రం ఈ నెలలోనే సెట్స్‌కి వెళ్లనుంది. మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందనుంది. హన్సిక కథానాయికగా నటించే ఈ సినిమా తర్వాత... కొత్త దర్శకుడు వేణు సినిమా చేస్తారు రామ్. ఇప్పటివరకూ సినిమాల విషయంలో నిదానమే ప్రధానం అంటూ ముందుకెళ్లిన రామ్... ఇక నుంచి వేగం పెంచాలనుకుంటున్నారట. ఆయన అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. -
ఏప్రిల్ నుంచి పండగే...
సినిమా సినిమాకూ జోరు పెంచుకుంటూ పోతున్నారు రామ్. తన గత చిత్రం ‘మసాలా’ ఫలితం ఎలా ఉన్నా, నటుడిగా రామ్‌కి మాత్రం ఆ సినిమా మంచి గుర్తింపునే తెచ్చింది. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటించనున్నారు. పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మించనున్న ఈ చిత్రానికి ‘పండగ చేస్కో’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘కందిరీగ’ తర్వాత రామ్, హన్సిక కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా కోసం అమెరికాలో భారీ సెట్ నిర్మించనుండటం మరో విశేషం. ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి గోపిచంద్ మలినేని మాట్లాడుతూ -‘‘‘బలుపు’ తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. రామ్ శారీరక భాషకు తగ్గట్టుగా పాత్ర చిత్రణ ఉంటుంది. ఈ పూర్తి స్థాయి మాస్ చిత్రానికి ‘పండగ చేస్కో’ అనే టైటిల్ సరిగ్గా యాప్ట్. ‘సింహా’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన యునెటైడ్ మూవీస్ బేనర్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది’’అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో...
రామ్ అంటే ఎనర్జీ. ఎనర్జీ అంటే రామ్. సరైన ఎనర్జిటిక్ పాత్రలు దొరికితే రామ్ ఏ స్థాయిలో విజృంభిస్తాడనడానికి ‘రెడీ’ లాంటి సినిమాలే ఉదాహరణ. ఇటీవలే వెంకటేశ్‌తో కలిసి ‘మసాలా’ చేసిన రామ్, తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్‌కి పచ్చజెండా ఊపారు. గత ఏడాది రవితేజతో ‘బలుపు’ వంటి హిట్ సినిమా చేసిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేయబోతున్నారు. ‘సింహా’లాంటి సినిమా తీసిన యునెటైడ్ మూవీస్ పతాకంపై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. రామ్ ఎనర్జీకి తగిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని, కథ సిద్ధమైందని దర్శకుడు చెప్పారు. ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తామని, మిగతా తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. -
మలినేని గోపీచంద్ దర్శకత్వంలో?
అల్లు అర్జున్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి పచ్చజెండా ఊపేశారట. డాన్‌శీను, బలుపు చిత్రాలతో మాస్‌ని అలరించిన దర్శకుడు మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఆయన నటించనున్నారని ఫిలిమ్‌నగర్ సమాచారమ్. గోపీచంద్ చెప్పిన కథ బన్నీకి విపరీతంగా నచ్చేయడంతో ఈ సినిమాలో నటించడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ప్రస్తుతం బన్నీ.. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘రేసుగుర్రం’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఆ సినిమాతో పాటు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కూడా సెట్స్‌కి వెళుతుందని తెలుస్తోంది. బన్నీతో ‘పరుగు’ లాంటి విజయవంతమైన చిత్రం తీసిన ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని వినికిడి. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది. -
పండగచేస్కో..!
బన్నీ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్లో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు కలిసి నిర్మిస్తున్న ‘రేసుగుర్రం’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో... ఆ సినిమా తర్వాత బన్నీ నటించే సినిమా విషయంలో అప్పుడే ఫిలింనగర్లో చర్చలు మొదలయ్యాయి. డాన్ శీను, బలుపు చిత్రాలతో దర్శకునిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బన్నీ నటిస్తారని సమాచారం. అల్లు అర్జున్‌తో దేశముదురు, జులాయి లాంటి హిట్ చిత్రాలు నిర్మించిన డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తారని వినికిడి. ‘పండగ చేస్కో’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే... ఈ సినిమాతో పాటు బన్నీ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘గబ్బర్‌సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ని ప్రేక్షకులకు అందించిన హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. ‘దిల్’రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలిసింది. -
నా ప్రేమకథ అలా మరుగున పడిపోయింది - గోపీచంద్ మలినేని
ఆరోజు ‘స్టాలిన్’ సినిమా షూటింగ్లో దర్శకులు మురుగదాస్‌గారు చాలా మూడీగా కనిపించారు. నేనా సినిమాకి అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశాను. విషయం తెలుసుకుందామని ఆయన దగ్గరకు వెళితే, ఏడుస్తూ కనిపించారు. సీన్ అనుకున్న విధంగా రావడంలేదన్నారు. ఆ రోజు నేనో నిర్ణయం తీసుకున్నా. ఇంత సిన్సియర్‌గా ఉంటేనే మంచి సినిమా వస్తుందని ఫిక్స్ అయిపోయాను. అందుకే చాలా సిన్సియర్‌గా వర్క్ చేస్తాను. సినిమాతో ఎమోషనల్ ఎటాచ్మెంట్ పెంచుకున్నాను కాబట్టే.. ఎప్పుడైనా సీన్ సరిగ్గా లేకపోతే, పక్కకెళ్లి కన్నీళ్లు పెట్టేసుకుంటాను’’ అన్నారు గోపీచంద్ మలినేని. ఈవీవీ సత్యనారాయణ, వీవీ వినాయక్, శ్రీను వైట్ల తదితరుల దగ్గర దర్శకత్వ శాఖలో చేసి, ‘డాన్ శీను’ ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు గోపీచంద్. తొలి సినిమాతోనే తనలో మంచి మాస్ డెరైక్టర్ ఉన్న విషయాన్ని నిరూపించుకున్నారు. ఆ తర్వాత బాడీగార్డ్, తాజాగా బలుపుతో సక్సెస్ఫుల్ డెరైక్టర్ల జాబితాలోకి చేరిపోయారాయన. ప్రస్తుతం గోపీచంద్ మోస్ట్ వాంటెడ్ డెరైక్టర్. ‘దిల్’ రాజు బేనర్లో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా, పరుచూరి ప్రసాద్ బేనర్లో ఓ అగ్రహీరోతో మరో సినిమా చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం గోపీచంద్ పాత్రికేయులతో మాట్లాడుతూ - ‘‘‘డాన్ శీను’ తర్వాత రవితేజతో చేసిన రెండో సినిమా ‘బలుపు’. అందరికీ ఓ మంచి విజయం అవసరం. పైగా నాకు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన నా తొలి హీరో రవితేజకు మరో హిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. టీమ్ వర్క్‌తో ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీయగలిగాను. రవితేజ కెరీర్లో ‘బలుపు’ పెద్ద హిట్ నిలిచినందుకు ఆనందంగా ఉంది. వరుసగా మూడు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, ప్రేక్షకులు నా నుంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్‌ని ఎదురుచూస్తారు. అందుకే గత మూడు చిత్రాలకన్నా తదుపరి చిత్రాలకు ఇంకా ఎక్కువ కష్టపడాలనుకుంటున్నా’’ అన్నారు. హిందీలో అవకాశాలు వచ్చినప్పటికీ తెలుగులో నిరూపించుకున్న తర్వాతే అని చెబుతూ - ‘‘‘డాన్ శీను’ని హిందీలో సైఫ్ అలీఖాన్, అక్షయ్‌కుమార్‌లతో తీయమని, టిప్స్ అధినేత ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత ‘తను వెడ్స్ మను’ నిర్మాతలు షాహిద్‌కపూర్ హీరోగా ఓ హిందీ సినిమాకి ఆఫర్ ఇచ్చారు. కానీ ప్రస్తుతానికి నా ఫోకస్ తెలుగు సినిమాల పైనే ఉంది’’ అన్నారు గోపీచంద్. మురుగదాస్ కథ, స్క్రీన్‌ప్లే అందించే చిత్రానికి దర్శకత్వం వహిస్తానని, ప్రేక్షకులకు నచ్చే మాస్ కమర్షియల్ మూవీస్‌కే ప్రాధాన్యం ఇస్తానని గోపీచంద్ తెలిపారు. ప్రేమకథా చిత్రాలకు దర్శకత్వం వహించే ఆలోచన ఉందా? అనడిగితే - ‘‘వాస్తవానికి ఓ మంచి లవ్‌స్టోరీ ద్వారా దర్శకుణ్ణి కావాల్సింది. అయితే ‘ఏ మాయ చేశావె’ రావడంతో నా కథను పక్కన పెట్టేశాను. ఎందుకంటే నేను రాసుకున్న కథకి ఆ సినిమా దగ్గరగా ఉంది. గౌతమ్ మీనన్‌గారికి కూడా నాలానే ఆలోచనలు వచ్చాయేమో అలాంటి కథను రెడీ చేసుకున్నారు. ఏదైతేనేం.. నా ప్రేమకథ మరుగునపడిపోయింది’’ అని చెప్పారు గోపీచంద్.