గోవాలో ఆటా పాటా | Krack team off to Goa to kick start the final schedule | Sakshi
Sakshi News home page

గోవాలో ఆటా పాటా

Dec 4 2020 5:51 AM | Updated on Dec 4 2020 5:51 AM

Krack team off to Goa to kick start the final schedule - Sakshi

‘డాన్‌ శీను, బలుపు’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత హీరో రవితేజ–డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘క్రాక్‌’. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తున్నారు. ఇందులో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, సముద్ర ఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్‌ పూర్తయింది. ఓ పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. నేటి నుంచి గోవాలో జరుగుతున్న చివరి షెడ్యూల్‌లో రవితేజ, శ్రుతీహాసన్‌లపై ఆ పాటను చిత్రీకరిస్తున్నారు.

రాజు సుందరం కొరియోగ్రఫీ సమకూరుస్తున్నారు. ఈ పాట చిత్రీకరణతో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. ‘‘తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. ఒక ఇంటెన్స్‌ స్టోరీతో అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల రవితేజ, అప్సరా రాణిపై చిత్రీకరించి, విడుదల చేసిన ‘భూమ్‌ బద్దల్‌’ అనే ప్రత్యేక పాట బ్లాక్‌బస్టర్‌ హిట్టయింది. సంక్రాంతి కానుకగా ‘క్రాక్‌’ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్, కెమెరా: జి.కె. విష్ణు, సహనిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement