
వంటిల్లు చెప్పే కథ!
వంటింటి నేపథ్యంలో సాగే కథతో ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో రాజ్‌కిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘పాకశాల’.
వంటింటి నేపథ్యంలో సాగే కథతో ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో రాజ్‌కిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘పాకశాల’. ‘‘ప్రచార చిత్రాలు చూస్తుంటే, మంచి థ్రిల్లర్ మూవీ అనిపిస్తోంది’’ అని దర్శకుడు గోపీచంద్ మలినేని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో ఓ వంట గది కథ చెబుతుంది. వినూత్న తరహాలో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి వైజాగ్ వెళ్లినప్పుడు హుద్‌హుద్ తుపాను మొదలైంది. అది తట్టుకొని చిత్రీకరించాం’’ అన్నారు.
విశ్వ, శ్రీనివాస్, హరీశ్ చక్ర సతీశ్, జగదీష్‌రెడ్డి, అర్పిత, కార్తీ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి సహనిర్మాత: ఆర్.పి. రావు.