టాలీవుడ్‌ డైరెక్టర్‌ యాక్షన్‌ మూవీ.. సన్నీ డియోల్‌ యాక్టింగ్ చూశారా? | Bollywood Hero Sunny Deol Latest Movie Jaat Teaser Out Now | Sakshi
Sakshi News home page

Jaat Teaser: సన్నీ డియోల్ యాక్షన్‌ మూవీ.. టీజర్‌ వచ్చేసింది!

Published Fri, Dec 6 2024 3:54 PM | Last Updated on Fri, Dec 6 2024 4:17 PM

Bollywood Hero Sunny Deol Latest Movie Jaat Teaser Out Now

బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటిస్తోన్న తాజా చిత్రం జాట్. ఈ యాక్షన్‌ ఓరియంటెడ్ చిత్రంలో రెజీనా, సయామీ ఖేర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మూవీకి టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ పాన్‌ ఇండియా మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

(ఇది చదవండి: ఓటీటీలో కంగువా.. అనుకున్న తేదీకంటే ముందే స్ట్రీమింగ్‌)

టీజర్ చూస్తే ఈ మూవీని ఫుల్ యాక్షన్‌ కథాంశంగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగులోనూ రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, స్వరూప ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  వచ్చే ఏడాది ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా.. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు.
 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement