గదర్- 2 సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్. ఈ చిత్రంలో అమీషా పటేల్ హీరోయిన్‌గా నటించింది. అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కించారు. అనిల్ శర్మ తనయుడు ఉత్కర్ష్ శర్మ కూడా కీలక పాత్రలో కనిపించారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో సన్నీడియోల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కొత్త తరం నటీనటులను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. పరిశ్రమకు నటులు కావాలని.. బాడీబిల్డర్లు అవసరం లేదని చురలకలంచటించారు.
గదర్ -2 సక్సెస్ కావడంతో సన్నీ నేటి యువ హీరోలకు ఓ సలహా ఇచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యువనటులు బాడీబిల్డింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టకుండా.. నటనపైనా దృష్టి పెడితే బాగుంటుందని సూచించాడు.
సన్నీ మాట్లాడుతూ.. "బాడీబిల్డింగ్, డ్యాన్స్ చేయడం మానేయండి. నటనపైనే దృష్టి పెట్టండి. మీలో ఉన్న ప్రతిభను ముందుకు తీసుకెళ్లండి. ఎందుకంటే మనకు కావల్సింది అదే. మీరేమి బాడీ బిల్డర్లు కాదు. మీరు ఫిట్‌గా, దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. సంగీతం అనేది మన సంస్కృతిలో ఒక భాగం. మీరందరూ నా పాత చిత్రాలను చూశారని తెలుసు. అంతకుముందు చాలా మంది నటీనటులు ఉన్నారు. ఇప్పడున్న చాలా మంది కొత్తవారు గొప్పగానే పని చేస్తున్నారు. మీరు కేవలం కండలు తిరిగిన వ్యక్తుల కంటే.. ప్రేక్షకులు మిమ్మల్ని హీరోలుగానే చూసేలా ఉండండి.' అంటూ సలహా ఇచ్చాడు.
గదర్ -2 గురించి సన్నీ మాట్లాడుతూ.. 'ఇది చాలా పాత చిత్రంలా అనిపిస్తుంది. కానీ మేము ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా తెరకెక్కించాం. ఫిల్మ్ మేకింగ్ ఎలా అభివృద్ధి చెందిందని సన్నీని ప్రశ్నించగా.. సినిమా తీసే విధానం మారలేదు.. సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. అది మరింత వేగంగా విస్తరించింది.అయినప్పటికీ మన సంస్కృతి, విలువలు, చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉంటాయి.' అని అన్నారు. కాగా.. గదర్- 2 అనేది 2001లో విడుదలైన గదర్: ఏక్ ప్రేమ్ కథా చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment