గేమ్ ఛేంజర్‌తో పోటీపడనున్న స్టార్ హీరో మూవీ.. టీజర్ వచ్చేసింది! | Bollywood Actor Sonu Sood Lates Movie Fateh Official Teaser Out Now | Sakshi
Sakshi News home page

Official Teaser: బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్‌తో పోటీ.. టీజర్ వచ్చేసింది!

Published Mon, Dec 9 2024 6:27 PM | Last Updated on Mon, Dec 9 2024 6:50 PM

Bollywood Actor Sonu Sood Lates Movie Fateh Official Teaser Out Now

పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్. టాలీవుడ్‌లో జులాయి, అతడు, అరుంధతి చిత్రాలతో మెప్పించారు. తెలుగు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ప్రతినాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం ఫతే. ఈ మూవీకి తానే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఆ మూవీ టీజర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యాన‍ర్లపై సోనాలి సూద్, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు.

తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే సైబర్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సైబర్ మాఫియా బారిన ఒక అమ్మాయిని హీరో ఏవిధంగా రక్షించాడు? అనే కోణంలో రూపొందించారని అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న బాలీవుడ్‌లో విడుదల కానుంది. దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో ఇప్పటికైతే క్లారిటీ ఇవ్వలేదు. అయితే అదే రోజున రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌ కూడా రిలీజవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement