ఓటీటీలో కంగువా విడుదల ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాదిలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రంలో కోలీవుడ్ టాప్ హీరో సూర్య నటించారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆపై నిర్మాతలకు కూడా ఎక్కువ నష్టాలనే మిగిల్చిన చిత్రంగా కోలీవుడ్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే, తాజాగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది.
కంగువ సినిమా ఓటీటీ విడుదల విషయంలో ఇప్పటకే చాలా తేదీలు వైరల్ అయ్యాయి. అయితే, అవన్నీ తప్పు అంటూ ఆ తేదీలకంటే ముందే కంగువ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈమేరకు ప్రకటన కూడా వచ్చేసింది. డిసెంబర్ 8న ఓటీటీలో కంగువ విడుదల కానుందని అమెజాన్ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్,మలయాళం,కన్నడలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
కథేంటి అంటే?
కంగువ కథ 1070 - 2024 మధ్య నడుస్తుంది. 2024లో ఒక ప్రయోగశాల నుంచి జీటా అనే బాలుడు తప్పించుకుని గోవా వెళ్తాడు. మరోవైపు గోవాలో ఫ్రాన్సిస్ (సూర్య), కోల్ట్ (యోగిబాబు) బౌంటీ హంటర్స్‌గా ఉంటారు. పోలీసులు కూడా పట్టుకోలేని క్రిమినల్స్‌ను వారు పట్టుకుంటూ ఉంటారు. గోవాకు చేరుకున్న జీటాని ఫ్రాన్సిస్ అదుపులోకి తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒక నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఒకరిని హత్య చేస్తాడు. ఈ హత్యను జీటా చూస్తాడు. అంతేకాదు ఫ్రాన్సిస్‌ను చూడగానే ఏదో తెలిసిన వ్యక్తిలా జీటా ఫీల్ అవుతాడు. ఫ్రాన్సిస్ కూడా జీటాతో ఏదో కనెక్షన్ ఉండేవాడిలా ఫీల్ అవుతాడు. హత్య విషయాన్ని బయట చెప్పకుండా ఉండేందుకు జీటాను తన ఇంటికి తెచ్చుకుంటాడు.
ఇదే క్రమంలో జీటాను పట్టుకునేందుకు ల్యాబ్ నుంచి కొంతమంది వస్తారు. వారినుంచి జీటానీ కాపాడేందుకు ఫ్రాన్సిస్ ప్రయత్నిస్తుండగా కథ 1070లోకి వెళ్తుతుంది. అసలు జీటా ఎవరు..? అతనిపై చేసిన ప్రయోగం ఏంటి..? ఫ్రాన్సిస్, జీటా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? 1070కి చెందిన కంగువా(సూర్య) ఎవరు..? కపాల కోన నాయకుడు రుధిర ( బాబీ డియోల్)తో కంగువకి ఉన్న వైరం ఏంటి..? పులోమ ఎవరు? కంగువపై అతనికి ఎందుకు కోపం? భారత దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు రోమానియా సైన్యం వేసిన ప్లాన్ ఏంటి..? ప్రణవాది కోన ప్రజలను కాపాడుకోవడం కోసం కంగువ చేసిన పోరాటం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment