పొల్లాచ్చిలో ఫైటింగ్!
పండగలాంటి సినిమా ఇవ్వడానికి కృషి చేస్తున్నాం.. పండగ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటున్నారు ‘పండగ చేస్కో’ చిత్రబృందం. రామ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రం ఇది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఇటీవల కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. ప్రస్తుతం రామ్ పాల్గొనగా స్టన్ శివ నేతృత్వంలో ఫైట్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 30 వరకు సాగే ఈ షెడ్యూల్‌లో ఇంకా టాకీ సీన్స్ కూడా తీస్తాం. రామ్ శారీరక భాషకు తగ్గట్టుగా తన పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. తమన్ మంచి పాటలు స్వరపరిచారు’’ అని చెప్పారు. రకుల్ ప్రీత్‌సింగ్, సోనాల్ చౌహాన్, సాయికుమార్, బ్రహ్మానందం తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: అనిల్ రావిపూడి, కెమెరా: ఆర్థర్ విల్సన్.