Raku Preeth Singh
-
మరో టాక్ షో
బిగ్‌స్క్రీన్ ఎంట్రీ కంటే ముందే టెలివిజన్‌లో హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు లక్ష్మీ మంచు. ‘లక్ష్మీ టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మీ, లక్ ఉంటే లక్ష్మీ...’ వంటి విభిన్న టెలివిజన్ షోలు చేశారు. మంచి హోస్ట్ అని ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేశారు. తాజాగా ‘ఊట్’ సబ్స్క్రిప్షన్ వీడియో అన్ డిమాండ్ సర్వీస్ యాప్‌కు ఓ టాక్ షో చేస్తున్నారు లక్ష్మీ మంచు. ఈ ప్రోగ్రామ్‌లో తొలి గెస్ట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. త్వరలోనే ‘ఊట్’ లో ఈ షో ప్రసారం కానుంది. -
దూకిన తర్వాత భయం వేసింది
‘‘ఈ ప్రేమికుల రోజుకి ప్రత్యేకం అంటూ ఏం లేదు. తొలిసారి మా అమ్మానాన్నలు, ఫ్యామిలీతో కలిసి ప్రేమికుల రోజున (గురువారం) నేను నటించిన ‘దేవ్’ సినిమాను హైదరాబాద్‌లో చూడబోతున్నా. అదే ఈ ప్రేమికుల రోజు ప్రత్యేకం’’ అని రకుల్ ప్రీత్‌సింగ్ అన్నారు. కార్తీ, రకుల్ జంటగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవ్’. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ‘ఠాగూర్’ మధు ఈ నెల 14న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రకుల్ చెప్పిన విశేషాలు. ∙ప్రేమ, స్నేహం చుట్టూ తిరిగే అందమైన కథ ‘దేవ్’. ఇందులో స్త్రీవాద భావాలున్న మేఘన పాత్రలో నటించా. ప్రేమించడానికి టైమ్ లేదంటూ పనే ప్రపంచంగా ఉంటుంది మేఘన. తన తల్లిని ఓ వ్యక్తి ప్రేమించి మోసం చేయడంతో చిన్నప్పటి నుంచి ప్రేమపై మంచి అభిప్రాయం ఉండదు. అలాంటి భావాలున్న మేఘనని దేవ్ ప్రేమిస్తాడు. రెండు వేర్వేరు ఆలోచనలున్న వ్యక్తులు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందన్న సంఘర్షణే ఈ సినిమా. ఇందులో కార్తీ సాహస యాత్రలు చేసే యువకుడిగా కనిపిస్తారు. ∙నిజ జీవితంలో సాహసాలను ఇష్టపడతా. ఇటీవల దుబాయ్‌లో 15వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేశా. విమానంలోనుంచి దూకేశాక ప్యారాచూట్ ఓపెన్ కాకుంటే పరిస్థితి ఏంటి? బతుకుతామా? లేదా? చాలా సినిమాలు ఒప్పుకున్నా అనిపించింది (నవ్వుతూ). స్కై డైవింగ్ విషయం ముందే ఇంట్లో చెబితే అమ్మానాన్నలు భయపడతారని చెప్పలేదు. విషయం చెప్పి, వీడియో పోస్ట్ చేశా. ∙తెలుగులో చేస్తున్న ‘వెంకీమామ’ సినిమా షూటింగ్ ఈ వారం ప్రారంభం కానుంది. ఈ ఏడాది నావి ఐదారు సినిమాలు రిలీజవుతాయి. ప్రేమికుల దినోత్సవం అనేది విదేశీ సంస్కృతి. అందుకే నాకు నమ్మకం లేదు. అయినా ప్రేమకు ఒక్క రోజు కేటాయించడం ఏంటి? బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం ఏంటి? ఇది కమర్షియల్‌గా వర్కౌట్ అవుతుంది. ఒక్కరోజులో ప్రేమ వస్తుందనుకోను. ప్రేమ అన్నది లవర్‌తో, జీవిత భాగస్వామితో మాత్రమే కాదు. తల్లితండ్రులు, సోదరులు, సోదరీమణులు, ఫ్రెండ్స్.. ఇలా అందరిదీ ప్రేమే కదా. -
గెట్ సెట్ గో
ఇక్కడున్న ఫొటోలు చూశారుగా.. కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఎంత శ్రద్ధగా మేకప్ చేసుకుంటున్నారో! రకుల్ మేకప్ ప్రిపరేషన్ ఎందుకో స్పెషల్‌గా చెప్పాలా. సినిమా కోసమే. కార్తీ హీరోగా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదారాబాద్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్ కోసమే రకుల్ ఇలా రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు ‘దేవ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని కోలీవుడ్ కహానీ. -
పొల్లాచ్చిలో ఫైటింగ్!
పండగలాంటి సినిమా ఇవ్వడానికి కృషి చేస్తున్నాం.. పండగ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటున్నారు ‘పండగ చేస్కో’ చిత్రబృందం. రామ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రం ఇది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఇటీవల కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. ప్రస్తుతం రామ్ పాల్గొనగా స్టన్ శివ నేతృత్వంలో ఫైట్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 30 వరకు సాగే ఈ షెడ్యూల్లో ఇంకా టాకీ సీన్స్ కూడా తీస్తాం. రామ్ శారీరక భాషకు తగ్గట్టుగా తన పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. తమన్ మంచి పాటలు స్వరపరిచారు’’ అని చెప్పారు. రకుల్ ప్రీత్‌సింగ్, సోనాల్ చౌహాన్, సాయికుమార్, బ్రహ్మానందం తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: అనిల్ రావిపూడి, కెమెరా: ఆర్థర్ విల్సన్.