Vijay Deverakonda Offers Elon Musk & Tesla a Partnership in India - Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ ట్వీట్‌ ఎఫెక్ట్‌: ఎలన్‌ మస్క్‌కి విజయ్‌ దేవరకొండ సహా పలువురు తారల ఆహ్వానం

Published Sun, Jan 16 2022 11:53 AM | Last Updated on Sun, Jan 16 2022 5:33 PM

Cine Celebrities Invites Elon Musk After KTR Tweet - Sakshi

Tollywood Stars Welcome Elon Musk After KTR Tweet: తెలంగాణ పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేసిన ట్వీట్‌ ఒకటి చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. ప్రపంచ అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌కు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందంటూ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. 


ఈ ట్వీట్‌పై బీజేపీ నుంచి రాజకీయ విమర్శలు ఎదురవుతుండగా, మరోవైపు ప్రశంసలు సైతం కురుస్తున్నాయి. ప్రముఖ జర్నలిస్టులు, ఎంట్రప్రెన్యూర్‌లతో పాటు సినీ ప్రముఖులు సైతం కేటీఆర్‌కు మద్ధతు ట్వీట్లు చేస్తూ.. ఎలన్‌మస్క్‌కి ఆహ్వానం పలుకుతున్నారు. 


ఈమేరకు టాలీవుడ్‌ హీరోలు విజయ్‌ దేవరకొండ, నిఖిల్‌ సిద్ధార్థతో పాటు దర్శకుడు గోపిచంద్‌ మలినేని సైతం కేటీఆర్‌, తెలంగాణ ప్రభుత్వాల్ని ప్రశంసిస్తూనే.. టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌కి స్వాగతం పలుకుతూ ట్వీట్లు చేశారు. 


నటి జెనిలీయాతో పాటు దర్శకుడు మెహర్‌ రమేష్‌ కూడా ఇందులో ఉన్నారు. ఇక ప్రముఖ జర్నలిస్టులు పంకజ్‌ పంచౌరీ, సీనియర్‌ జర్నలిస్ట్‌ విక్రమ్‌ చంద్రా సైతం ఉన్నారు.

సంబంధిత వార్త: హేయ్‌ ఎలన్‌మస్క్‌ .. వెల్‌కమ్‌ టూ తెలంగాణ: కేటీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement