Tollywood Stars
-
సంవత్సరమంతా జంట స్వరంగా...
కలసి పాడుదాం బతుకు పాట... కలసి సాగుదాం వెలుగు బాట... అన్నట్టు ప్రతి దంపతులు ఒకరికి ఒకరై ముందుకు సాగితే ఏ కాలమైనా మంచికాలంగానే ఉంటుంది. భార్య భర్త జీవననౌకకు ఉమ్మడి చుక్కానిగా మారాలి. కలతలు చిన్నవయ్యి ఆనందాలు పెద్దవవ్వాలి. కుటుంబం బాగుంటే సమాజం, దేశం బాగుంటాయి. మనకు తెలిసిన ఈ సెలబ్రిటీ జంటలు ఆ మాటే చెబుతున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు.మనవాళ్లెవ్వరో తెలిసింది→ ప్రభాకర్: మాకు పెళ్లై 25 ఏళ్లయింది. ఎవరి ఫ్యామిలీ లైఫ్ అయినా బాగుండాలంటే భార్య సహకారం, తను అర్థం చేసుకునే విధానం మీదనే ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆ విషయంలో మా ఆవిడకి సహనం, ఓపిక చాలా ఎక్కువ. మమ్మల్ని చాలా బాగా కేర్ చేస్తుంది. జనరల్‌గా మగవాళ్లకి చాలా ప్రపంచాలుంటాయి. ప్రొఫెషన్, మదర్స్ ఫ్యామిలీ, బిజినెస్, కెరీర్... ఇలా. కానీ భార్యకు మాత్రం ఎప్పుడూ ఒకే ఒక ఆలోచన మా ఆయన తిన్నారా? నా పిల్లలు టైమ్‌కి తిన్నారా? అందర్నీ ఆరోగ్యంగా చూసుకుంటున్నానా? అని! ఆ విషయంలో మేము రియల్లీ బ్లెస్డ్. 2025కి నావి రెండు ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ రెండు సీరియల్స్‌తో నేను బిజీగా ఉన్నాను. ఒకటి ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ అనే సూపర్ సీరియల్ ఇప్పటికే లీడ్‌లో ఉంది. అలాగే ‘చామంతి’ అనే మరో సీరియల్లో చేస్తున్నాను. మా మలయజ కూడా 2024లో వెబ్ సిరీస్‌తో పాటు రెండు సినిమాల్లో నటించింది.మా అబ్బాయి చంద్రహాస్ ‘రామ్‌నగర్ బన్నీ’ కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టి బాగా నటించాడు. అది మేం కళ్లారా చూశాం కాబట్టే మా స్థాయికి మించి ఆ సినిమా కోసం పెట్టుబడి పెట్టాం. మా అబ్బాయి సంతోషం కోసం ఆలస్యం చేయకుండా త్వరగా రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆప్రాసెస్లో డబ్బుల గురించి ఎక్కడా ఆలోచించలేదు. ‘రామ్‌నగర్ బన్నీ’తో చంద్రహాస్ తనని తాను నిరూపించుకున్నాడు. మా అమ్మాయి దివిజ ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. లండన్ వెళ్లి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలని, ఒక వ్యాపారవేత్తగా ఉండాలన్నది తన కల. తను ఇప్పటికే బాల నటిగా నంది అవార్డు అందుకుంది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. ఈ రెండూ పూర్తయ్యాక తను ఎలా సెటిల్ అవ్వాలనుంటే అలా మేం సంతోషంగా సపోర్ట్ చేస్తాం. → మలయజ: 2024లో నేను నిర్మాతగా షూటింగ్ లొకేషన్‌కి రావటం, మా అబ్బాయి చంద్రహాస్ మూవీ (రామ్‌నగర్ బన్నీ) కోసం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ చూసుకోవడం ఒక కొత్త అనుభవం అని చెప్పగలను. కానీ, ఈ ఏడాది చాలా నేర్చుకున్నాను మా అబ్బాయి మూవీ ‘రామ్‌నగర్ బన్నీ’ పోస్ట్ ప్రొడక్షన్ అవుతున్న సమయంలో డబ్బులు అయిపోయి, మేం ఎదుర్కొన్న సవాళ్లలో ఎవరు మనవాళ్లో, ఎవరు కాదో అనేది తెలుసుకున్నాం. మనకేదైనా అవసరం వస్తే మనకంటూ తోడుగా వీళ్లందరూ ఉన్నారని అని కొంతమంది గురించి ఒక తప్పుడు అంచనాలతో ఉంటాం. కానీ, అది నిజం కాదు. ఈ సంవత్సరం మేం నేర్చుకున్న గుణపాఠం ఇది. అయితే అదే సమయంలో మేం ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొత్తవాళ్లు కొంతమంది సమయానికి సహాయం చేశారు. మా అబ్బాయి నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ అనే సినిమా 2025లో రిలీజ్ అవుతుంది. అలాగే ఇంకో సినిమా షూటింగ్ చేస్తున్నాడు. అలాగే మా అమ్మాయి దివిజ కూడా రెండు సినిమాలు సైన్ చేసింది. చాలా మంచిప్రాజెక్ట్స్ అవి. వాటి షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. అందులో ఒకటి బ్రహ్మానందంగారి సినిమాలో ఆయన కూతురుగా, హీరో చెల్లెలిగా మంచి పాత్ర వచ్చింది. అలాగే ఇంకో సినిమాలో హీరోయిన్గా చేస్తోంది. అలా మా అమ్మాయి కెరీర్ పరంగా కూడా బీజం పడింది 2024లోనే. ‘మనుషులను’సంపాదించుకున్నాం→ రాకేష్: 2024 విషయానికి వస్తే ఈ సంవత్సరం మా ఇద్దరికీ చాలా బ్యూటిఫుల్ ఇయర్. మేం సొంతంగా సినిమా (‘కేసీఆర్’లో రాకేశ్ నటించి, నిర్మించారు) ఆరంభించాం. ఎన్నో సంవత్సరాలుగా నా డ్రీమ్ అది. 2023లోనే మేం ‘కేసిఆర్’ సినిమా అనుకొని షూటింగ్ స్టార్ట్ చేశాం. మేం తీసుకున్న మూవీ టైటిల్ కన్ఫర్మేషన్, కొన్ని కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఇంత కష్టపడి,ప్రాణం పెట్టి చేసిన సినిమా ఎందుకు ఇలా ఆగిపోయిందో అని చాలా నిరుత్సాహంలో ఉన్న సంవత్సరం అది. కానీ 2024, ఆగస్ట్ 1న నా బంగారు తల్లి పుట్టింది. నిజంగానే మా అన్ని టెన్షన్లకీ, కష్టాలకీ ఫుల్స్టాప్ పడ్డట్లు, ప్రత్యక్షంగా లక్ష్మీదేవి మా జీవితాల్లో అడుగు పెట్టినట్లు అయింది. సినిమా రిలీజైంది. ‘దైవం మానుష రూపేణ’ అని నేను నమ్ముతాను. నా చుట్టూ ఉన్న మనుషులు నా కోసమే అనే భావనతో మనుషుల్ని సంపాదించుకుంటూ, వాళ్లని కాపాడుకునేందుకై కష్టపడుతున్నాను. దీపా ఆర్ట్స్ శ్రీనివాస్‌గారు ఈ సంవత్సరం ఆహాలో మా మూవీని రిలీజ్ చేసి ఈ సంవత్సరానికి మమ్మల్ని ఇంకో మెట్టు పైకి ఎక్కించి, ఈ ఇయర్ ఎండ్ గిఫ్ట్‌గా ఇచ్చారు.→ అంతా బాగుండి మనం నడుస్తున్నప్పుడు మన వెనక చాలామంది వస్తారు. ఒకసారి కిందపడితేనే తెలుస్తుంది మనకి చెయ్యి అందించి పైకి లేపేది ఎవరు, మనల్ని చూసి ఎగతాళిగా నవ్వేది ఎవరు అనేది క్లియర్‌గా తెలుసుకున్నాం. అన్నీ సక్రమంగా బ్యాలెన్స్ చేసుకుంటూ మూవీ రిలీజ్ అయ్యి, సక్సెస్ అయ్యి మంచి గుర్తింపుతో చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక సమయంలో హెక్టిక్ అయిపోయి తట్టుకోలేక ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో మా సుజాత నన్ను బిడ్డలాగా తోడు నీడగా ఉండి చాలా స్ట్రెంత్‌ను ఇచ్చింది. 2025లో ఇంకో న్యూప్రాజెక్ట్తో రాబోతున్నాం. మా సుజాతది కూడా 2025లో ‘సేవ్ ది టైగర్–3’ వెబ్ సిరీస్ రాబోతోంది. వర్క్‌లో,ప్రొఫెషన్లో ఇంకా ఇంకా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాం.→ సుజాత: నాకు 2023 డిసెంబర్లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. 2024 జనవరి నుంచిప్రొఫెషన్ పరంగా ఎన్నో టెన్షన్స్‌తో ఉన్నా రాకేష్గారు నన్ను చాలా కేర్ తీసుకుంటూ, హాస్పిటల్‌కి తీసుకెళ్లి రెగ్యులర్ చెకప్‌లు చేయిస్తూ, చివరికి నా డెలివరీ రూమ్‌లో బేబీని తన చేతులలో బయటికి తీసి బొడ్డు కోసే వరకు, స్పెసిమెన్ శాంపిల్స్ కలెక్ట్ చేసే వరకు కూడా అన్నీ ఆయన చేతుల్లోనే జరిగాయి.మేము ముగ్గురం అక్కా, చెల్లెళ్ల్లం కాబట్టి నాకు బాబు పుడితే బాగుండు అని ఉంది. కానీ మా ఆయన మాత్రం ఎవరైనా ఒకటే అనేవారు. ఫైనల్‌గా మా పాపాయి ఇంట్లోకి అడుగు పెట్టింది. అప్పటివరకు ఆగిపోయిన సినిమాకు ఉన్న అడ్డంకులు అన్నీ వాటంతట అవే క్లీయర్ అయిపోయి, మూవీ రిలీజ్ అయిపోయింది. మా పాప పుట్టుకతో మా ఆయన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినట్లు మేము ఫీలవుతున్నాం. అందుకే మా పాప పేరు కూడా ‘ఖ్యాతిక’ అని పెట్టుకున్నాం. ఆ పేరు కూడా బాగా కలిసొచ్చింది. మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది. మా రాకేష్ చాలా కష్టపడుతున్నాడు, మనవాడి కోసం మనం కూడా ఏదైనా చేయాలని స్వచ్ఛందంగా వచ్చి సినిమాలో పని చేసిన వాళ్లు ఎందరో ఉన్నారు. అందుకే మేం డబ్బు కంటే కూడా మనుషులను ఎక్కువగా సంపాదించుకున్నాం అనే తృప్తి 2024లో మాకు చాలా ఉంది.కామెంట్లు చేసినా కామ్‌గా ఎదిగాంఇంద్ర నీల్: ‘కాలచక్రం’ అనే సీరియల్లో మేఘన, నేను కలిసి నటించాం. మా ఫ్రెండ్షిప్తో కలిపి మా రిలేషన్‌షిప్‌కు 25 ఏళ్లు. మా పెళ్లి జరిగి 19 ఏళ్లవుతోంది. మా ఇద్దరి లైఫ్‌లో జరిగిన బెస్ట్ థింగ్ ఏంటి? అని చె΄్పాలంటే మా మ్యారేజ్ అనే చె΄్తాను. 2005 మే 26న ‘చక్రవాకం’ సీరియల్ చేస్తున్నప్పుడు నాకు అత్త రోల్ చేశారు మేఘన. ఆ సీరియల్లో అత్తను ప్రేమించే క్యారెక్టర్ నాది..సో... రియల్ లైఫ్‌లో కూడా తనని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాను. చాలా కష్టపడి, పెద్దల్ని ఒప్పించి, పెళ్లికి వచ్చేలా చేసుకుని, మా ఇద్దరి డబ్బుల్తోనే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్లో పెళ్లి చేసుకున్నాం. అది మాకు ఎప్పటికీ తీయని గుర్తు. → నాకైతే 2024 గురించి చిన్న పశ్చాత్తాపం ఉంది. మా నాన్నకు మరీ మరీ జాగ్రత్తలు చెప్పి షోల కోసం అమెరికా వెళ్లాను. నేను వర్క్ చేయడానికి ఎక్కడికైనా వెళ్లి, కష్టపడుతుంటే నాన్నకు కూడా చాలా ఇష్టం. నేనున్నాను కదా... నువ్వు వెళ్లు అని ధైర్యం చెప్పి పంపారు. కానీ నేను ఇండియాకి తిరిగి వచ్చేసరికి, నా ధైర్యం అయిన ఆయనే మాకు దూరం అయిపోయారు. ఆ విషయంలో చాలా బాధపడుతున్నాను. ఈ రోజు ఆయన మాతో భౌతికంగా లేకపోవడం మాకు చాలా పెద్ద లాస్. ∙2025 పై మాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మా ఇద్దరికీ ఒక మంచి ΄్లాన్ కూడా ఉంది. మంచి బిజినెస్ ΄్లాన్స్తో పాటుగా కొన్ని సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు రివీల్ చేస్తే సర్ప్రైజ్ అంతా పోతుందని చెప్పడంలేదు.ట్రిప్స్ అయితే చాలానే ΄్లాన్ చేస్తున్నాం. మేం ఇద్దరం ఎక్కువగా రోడ్ ట్రిప్స్‌కి వెళ్లడానికే ఇష్టపడతాం. అయితే అన్నీ అన్΄్లాన్డ్ ట్రిప్సే ఉంటాయి. అప్పటికప్పుడు అనుకోవడం... వెళ్లిపోవడం. మేఘన రామి: జీవితంలో ఓ మంచి పార్టనర్ దొరకడం అనేది చాలా ముఖ్యం. అప్పుడున్న ఆ ఏజ్‌లో అది కరెక్టో, కాదో అనేది పక్కన పెడితే... ఇప్పుడు మా 19 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత అనిపిస్తోంది.... అప్పుడు మేం తీసుకున్నది చాలా మంచి నిర్ణయమని. ‘ఏంటి, వాళ్లు ఇలా పెళ్లి చేసుకున్నారు?’ అని వ్యతిరేకంగా మాట్లాడుకున్నవాళ్లూ కూడా ఉన్నారు. కానీ మేం తీసుకున్న ఈ మంచి నిర్ణయం వల్ల మా లైఫ్ అప్పట్నుంచి చేంజ్ కావడం ఆరంభమైంది. ఇక నా ఫుడ్ బిజినెస్‌లో నీల్ సపోర్ట్ చాలా చాలా ఉంది. లేదంటే... ఈ రోజు ఈ బిజినెస్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఇంత దూరం రానే రాదు. వైఫ్‌తో పచ్చళ్లు అమ్మిస్తున్నాడనీ, ఇండస్ట్రీలో వర్క్ లేక పచ్చళ్లు అమ్ముకుంటున్నారనీ, బతుకుతెరువు కోసం ఇలా చేస్తున్నారనీ చాలామంది నెగటివ్ కామెంట్స్ చేశారు. కానీ మేం ఇద్దరం చాలా చాలా మెమొరీస్‌ని బిల్డ్ చేసుకోగలిగాం. మంచి లైఫ్‌ని లీడ్ చేస్తూ, ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా 2025లో మా రిలేషన్‌షిప్‌కి సంబంధించి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇక 2025 రిజల్యూషన్స్ అంటే... ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, చాలా ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గించుకోవాలని ఫిక్స్ అయ్యాను. అందుకే న్యూ ఇయర్ రావడానికి రెండు వారాల ముందే యోగా సభ్యత్వం తీసుకున్నాను. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంటర్వ్యూలు: శిరీష చల్లపల్లి -
మెగాస్టార్ తో యాక్షన్ మూవీ ప్లాన్ చేసిన శ్రీకాంత్ ఓదెల
-
ఫ్యాన్స్ కోసం వీళ్ళు పడే కష్టం.. నెక్స్ట్ లెవల్
-
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
-
Family Star Trailer HD Stills: విజయ్ చెంప చెళ్లుమనిపించిన మృణాల్.. ట్రైలర్ అదిరిపోయింది (ఫోటోలు)
-
నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం అయ్యింది. ఈ క్రమంలో అరెస్టైన నటి లావణ్య కస్టడీ కోరుతూ సైబరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఐదు రోజులపాటు ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్‌పల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఈ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయి. విజయవాడ నుంచి ఉన్నత చదవుల కోసం లావణ్య హైదరాబాద్‌కు వచ్చినట్లు తేలింది. కోకాపేటలో మ్యూజిక్ టీచర్‌గా పనిచేస్తూ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ప్రయత్నించినట్లు వెల్లడైంది. షార్ట్ ఫిలిం, పలు చిన్న సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె.. జల్సాలకు అలవాటు పడినట్లు తెలిసింది. కస్టడీ పిటిషన్లో పేర్కొన్న అంశాలు నార్సింగి డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్ యువతి , ఉనీత్ రెడ్డి లను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుండి 4 గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం యువతి హ్యాండ్ బ్యాగ్ లభ్యమైన డ్రగ్ సంగీతం టీచర్ పని చేస్తున్న లావణ్య టాలీవుడ్ హీరోకు ప్రేయసిగా ఉన్న యువతి ఉనీత్ రెడ్డి తనకు డ్రగ్ ప్యాకెట్లు ఇచ్చినట్లు పోలీసులకు తెలిపిన లావణ్య కొద్దీ రోజుల క్రితం ఉనీత్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసిన లావణ్య పక్క సమాచారం తో లావణ్య ను తనిఖీ చేసి SOT పోలీసులు NDPS 22బీ, రెడ్ విత్ 8సి కింద కేసులు నమోదు చేసిన నార్సింగి పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కి నిందితులు ఓ టాలీవుడ్ హీరోకు పరిచయమైన లావణ్య.. అతనికి ప్రియురాలిగా మారినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. మూడు నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులోఅనుమానితురాలిగా ఉంది. ఉనీత్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా గోవా నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నట్లు తెలిసింది. దీంతో ఉనిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్ర పరిశ్రమలో పలువురికి లావణ్య డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమేరకు లావణ్య సోషల్ మీడియా అకౌంట్లతో పాటు వ్యక్తిగత చాట్ పరిశీలిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో చాలామంది వీఐపీలతో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో A3గా ఉన్న ఇందూ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చదవండి: సారీ, నేను ఓడిపోయాను..! అసలేం జరిగిందంటే.. కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న యువతి వద్ద డ్రగ్స్ ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు నార్సింగి పోలీసులు సోదాలు నిర్వహించి ఆమె నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. నార్సింగి నుంచి కోకాపేటకు వెళ్లే దారిలో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఉంటున్న లావణ్య అనే యువతి వద్ద ఆదివారం తనిఖీలు చేయగా 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.50 వేల వరకు ఉండగా వాటితో పాటు ఓ సెల్‌ఫోన్, రెండు ట్యాబ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ఉనిత్ర ఎడ్డి అనే వ్యక్తి ద్వారా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు యువతి తెలిపింది. యువతిని అరెస్టు చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి 14 రోజులపాటు రిమాండ్‌కు పంపారు. -
వైభవంగా స్టార్ హీరో కుమార్తె రిసెప్షన్, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
ట్రాన్స్‌జెండర్‌గా సీజన్-7 బిగ్‌బాస్ కంటెస్టెంట్.. ఎవరో గుర్తుపట్టారా?
ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్-7 అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ సీజన్ విన్నర్‌గా రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే ఈ సీజన్లో టాప్-3లో ప్రశాంత్, అమర్దీప్, శివాజీ నిలవగా.. యావర్, ప్రియాంక, అర్జున్ టాప్-6లో చోటు దక్కించుకున్నారు. అయితే ఈ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్స్ గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొందరు ఫేమస్ కావడంతో పాటు సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టినవాళ్లు ఉన్నారు. అయితే బిగ్‌బాస్ కంటే ముందే ఓ సినిమాలో లీడ్ రోల్ పోషించిన నటుడు టాప్-6 కంటెస్టెంట్స్‌లో ఉన్నారు. ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ద్వారా షో మధ్యలో ఐదుగురు ఎంట్రీ ఇచ్చారు. వారిలో నలుగురు ఎమిలినేట్ అవ్వగా.. కేవలం అర్జున్ అంబటి మాత్రమే టాప్-6లో నిలిచారు. అయితే అర్జున్ హౌస్‌లోకి రాకముందే పలు సినిమాల్లో నటించారు. చూడటానికి సాఫ్ట్‌గా కనిపించే అర్జున్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. విజయవాడలో పుట్టి పెరిగిన ఇతడు ఐటీలో రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పని చేశాడు. (ఇది చదవండి: బిగ్ బాస్ అర్జున్‌కు సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..!) ఆ తర్వాత మోడల్‌గా మొదలైన తన ప్రయాణం కాస్తా నటనవైపు పరుగులు తీసింది. అర్ధనారి, గీతోపదేశం, సుందరి వంటి పలు చిత్రాల్లో అతడు నటించాడు. గోపీచంద్ హీరోగా వచ్చిన సౌఖ్యంలో విలన్‌గా నటించారు. అగ్ని సాక్షి, దేవత వంటి సీరియల్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. నటనపై మక్కువతోనే మళ్లీ మంచి కంబ్యాక్ ఇవ్వడానికి బిగ్‌బాస్ షోను ఎంచుకున్నారు. అర్ధనారిలో ట్రాన్స్‌జెండర్‌గా.. అర్ధనారి సినిమాలో అర్జున్ ట్రాన్స్‌జెండర్ పాత్రలో మెప్పించారు. చాలా అరుదైన పాత్రలో కనిపించిన అర్జున్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భానుశంకర్ చౌదరి దర్శకత్వంలో ఎమ్.రవికుమార్ 2016లో నిర్మించిన చిత్రమే అర్ధనారి. ఈ చిత్రంలో అర్జున్ యజత్, మౌర్యాని జంటగా నటించారు. చాలా అరుదైన పాత్రలో నటించి మెప్పించిన అర్జున్ అంబటి ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్లో కనిపించి మరింత ఫేమస్ అయ్యారు. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి టాప్-6లో నిలిచారు. అంతేకాకుండా బుచ్చిబాబు సనా తెరకెక్కించే రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. ఉప్పెనతో తొలి ప్రయత్నంలోనే బుచ్చిబాబు. ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
Mahesh Babu: మాస్ లుక్ అయిన క్లాస్ లుక్ అయిన మహేష్ బాబే..
-
పెద్ద హీరోలపై కోట శ్రీనివాస్ ఫన్నీ సెటైర్లు
-
ఆమె కోసం స్టార్ హీరోలే వెయిట్ చేసేవారు.. కానీ నిజ జీవితంలో మాత్రం!
Jaya Prada: సీనియర్ హీరోయిన్ జయప్రద పరిచయం అక్కర్లేని పేరు. ఏపీలోని రాజమండ్రిలో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది. టాలీవుడ్‌తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించారు. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. జయప్రద అసలు పేరు లలితా రాణి. భూమి కోసం' సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించిన జయప్రద ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటి ప్రముఖ తమిళ దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన అంతులేని కథ చిత్రం ద్వారా ఆమె పేరు జయప్రదగా మారిపోయింది. అప్పట్లో జయప్రదకు తెలుగులో కంటే హిందీ చిత్రాల్లోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. తెలుగు , హిందీ భాషల్లో రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా రాణించింది. తెలుగు నేలపై పుట్టి బాలీవుడ్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. జితేంద్ర, రిషీ కుమార్ వంటి అగ్ర హీరోలే అప్పట్లో ఆమె డేట్స్ కోసం వేయిట్ చేసే వారంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి దిగ్గజాల సరసన నటించింది. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా దిగ్విజయంగా విజయ యాత్రను కొనసాగించింది. దాదాపు అప్పటి స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న జయప్రద.. తన వైవాహిక జీవితంలో కష్టాలను అనుభవించింది. (ఇది చదవండి: సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!) నిర్మాత శ్రీకాంత్ నహతాతో ప్రేమ పెళ్లి జయప్రద ఫేమ్‌లో ఉన్నప్పుడే అప్పట్లో ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ నహతాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 22 ఫిబ్రవరి 1986న ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వీరి పెళ్లి జరిగింది. అయితే శ్రీకాంత్‌కు అప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో వీరి వివాహం వివాదానికి దారి తీసింది. జయప్రదను పెళ్లాడిన తర్వాత కూడా శ్రీకాంత్ తన మొదటి భార్యతోనే ఉంటున్నాడు. అంతే కాదు శ్రీకాంత్ రెండో పెళ్లి తర్వాత మొదటి భార్య మూడో బిడ్డకు జన్మనిచ్చింది. ఆత్మహత్యాయత్నం 1990లో జయప్రద విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమె బెంగళూరులో నివాసముండేవారు. విషం తాగిన జయప్రదను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పట్లో జయప్రదపై ఆత్మహత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. శ్రీకాంత్‌తో వివాహమైన తర్వాత మొదటి భార్య చంద్ర తన భర్తను వదిలేయాలని జయప్రదపై ఒత్తిడి తెచ్చింది. అందుకే జయప్రద విషం మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందన్న వార్త అప్పట్లో వైరలైంది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నా జయప్రద తన భర్తతో సంతోషంగా జీవితాన్ని గడపలేకపోయింది. కొన్నిసార్లు కలిసినప్పటికీ మొదటి భార్యకు, కుటుంబానికి వారిద్దరూ భయపడేవారట. దీనికి తోడు జయప్రద, శ్రీకాంత్‌లకు సంతానం కలగలేదు. ఆ బాధతో పాటు జయప్రద సంతానం లేదని చాలా బాధపడేది. అందువల్లే తన సోదరి కొడుకు సిద్ధార్థ్‌ను ఆమె దత్తత తీసుకున్నారు. జీవితమంతా వివాదాలే.. అయితే ప్రస్తుతం జయప్రదకు సినిమాల కంటే రాజకీయాల్లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. గతంలో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా జయప్రద ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. ఆత్మహత్యాయత్నం జరిగిన కొన్నేళ్ల తర్వాత జయప్రదకు సంబంధించిన మార్ఫింగ్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అప్పుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు జయప్రద ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పారు. అంతే కాకుండా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అమర్‌సింగ్‌తో జయప్రదకు రిలేషన్ ఉందంటూ రూమర్స్ కూడా వచ్చాయి. (ఇది చదవండి: పెళ్లికి ముందే పూజలు తెగ చేస్తున్న ఆ హీరోయిన్) 6 నెలల జైలు శిక్ష 2019లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఇటీవలే జయప్రదకు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు జయప్రదకు 6 నెలల జైలు శిక్ష విధించింది. జయప్రద తన సినిమా థియేటర్ల కార్మికుల జీతాల నుంచి ఈఎస్ఐ సొమ్మును ఇప్పటికీ చెల్లించలేదని కార్మికులు రాష్ట్ర కార్మిక బీమా శాఖకు ఫిర్యాదు చేశారు. జయప్రద సినీ జీవితంలో సక్సెస్ అయినప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఫెయిల్యూర్ అవడం పట్ల ఆమె అభిమానులు బాధపడుతూనే ఉన్నారు. -
హాలీడే టూర్స్‌లో స్టార్స్ బిజీ బిజీ
స్టోరీ సిట్టింగ్స్, సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్... ఇలా ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంటారు సినిమా స్టార్స్. అందుకే అప్పుడప్పుడూ కాస్త రిలాక్స్ అవ్వాలనుకుంటారు. విహారం.. వినోదం కోసం కొంత టైమ్ కేటాయిస్తారు. ప్రస్తుతం అలా వెకేషన్ మోడ్‌లో ఏ స్టార్స్ ఎక్కడున్నారో తెలుసుకుందాం. మాల్దీవుల్లో మస్తీ వెకేషన్ స్పాట్ కోసం మాల్దీవులను ఎంచుకున్నారు రజనీకాంత్. వారం రోజుల క్రితం ఆయన మాల్దీవులకు వెళ్లిన సంగతి గుర్తుండే ఉంటుంది. అక్కడి బీచ్‌లో రజనీ నడుస్తున్న ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక వెకేషన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలోని సినిమా, లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లోని సినిమాలతో రజనీకాంత్ బిజీ అవుతారు. విదేశాల్లో బర్త్ డే ఇటీవలి కాలంలో సినిమా షెడ్యూల్స్‌కి కాస్త గ్యాప్ రావడంతో మహేశ్‌బాబు హాలిడే మోడ్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్లో ఉన్నారు మహేశ్‌బాబు. రెండు వారాలకు పైగానే ఈ వెకేషన్‌ను ΄్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 9న మహేశ్ బర్త్ డే. ఈ పుట్టినరోజుని విదేశాల్లోనే ఫ్యామిలీతో కలిసి జరుపుకుంటారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. వెకేషన్ కంటిన్యూ ఈ ఏడాది సంక్రాంతి సమయంలో విడుదలైన అజిత్ తమిళ చిత్రం ‘తునివు’ (తెలుగులో ‘తెగింపు’). ఆ సినిమా తర్వాత దాదాపు హాలిడే మూడ్‌లోనే ఉన్నారు అజిత్. తనకు ఇష్టమైన బైక్స్‌పై విదేశాల్లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌ను సందర్శించారు. కాగా అజిత్ తర్వాతి చిత్రం ‘విడా ముయర్చి’ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి మరికొంత సమయం ఉందట. దీంతో మరోసారి అజిత్ విదేశాలకు ప్రయాణమయ్యారని టాక్. షార్ట్ గ్యాప్ విజయ్ హీరోగా నటించిన ‘లియో’ చిత్రం ఈ దసరాకు విడుదల కానుంది. అలాగే విజయ్ నెక్ట్స్ ఫిల్మ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఉంటుంది. ఈ చిత్రం ఆరంభం కావడానికి కాస్త టైమ్ ఉందట. ఈ షార్ట్ గ్యాప్‌లో విజయ్ విదేశాలకు వెళ్లారని కోలీవుడ్ సమాచారం. బాలీలో జాలీగా.. ఆరోగ్య, వ్యక్తిగత కారణాల దృష్ట్యా సినిమా చిత్రీకరణలకు కాస్త దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమంత వెకేషన్ కోసం బాలీ వెళ్లారు. అక్కడ ఐస్ బాత్ చేశారు సమంత (మెరుగైన ఆరోగ్యం కోసం ఓ ప్రక్రియ). మైనస్ 4 డిగ్రీల చలిలో ఆరు నిమిషాల ΄అటు ఐస్ బాత్ చేసినట్లుగా సోషల్ మీడియాలో షేర్ చేశారీ బ్యూటీ. ఇక సమంత హీరోయిన్గా నటించిన ‘ఖుషీ’ చిత్రం సెప్టెంబరు 1న విడుదల కానుంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరో. అలాగే వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో నటించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. దుబాయిలో హాయి హాయి.. గత నెల మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్ చాలా జోష్‌గా గడి΄ారు. ఈ హాలిడేని ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. తాజాగా ఫ్యామిలీతో కలిసి దుబాయ్ రిసార్ట్స్‌లో ఫుల్ జోష్‌లో ఉన్నారు రకుల్. తన తల్లి బర్త్ డేను దుబాయ్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారామె. ఇందుకోసమే రకుల్ అండ్ ఫ్యామిలీ దుబాయ్ వెళ్లారు. ‘భోళా శంకర్’ షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత వెకేషన్‌కు వెళ్లొచ్చారు చిరంజీవి. ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చిన చిరంజీవి ఆగస్టు 11న విడుదల కానున్న ‘భోళా శంకర్’ ప్రమోషన్స్‌తో బిజీ అవుతారని తెలుస్తోంది. ఇక ఇటీవలే ఆస్ట్రియా వెళ్లొచ్చారు వెంకటేశ్. అక్కడ కొంత క్వాలిటీ హాలి డే టైమ్‌ను స్పెండ్ చేసొచ్చారు. ప్రస్తుతం ‘సైంధవ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు వెంకటేశ్. ఈ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. మరోవైపు యాభై రోజులు యూఎస్‌లో స్పెండ్ చేసిన ప్రభాస్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘సలార్’, మారుతి దర్శకత్వంలోని ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న ఓ టైటిల్) చిత్రాలతో ప్రభాస్ బిజీ అవుతారని తెలుస్తోంది. ఇటు దర్శకుల విషయానికి వస్తే... రాజమౌళి తమిళనాడులోని ఆధ్యాత్మిక లొకేషన్స్‌లో ఎక్కవ టైమ్ స్పెండ్ చేశారు. ఇలా వెకేషన్‌కి వెళ్లొచ్చిన హీరో హీరోయిన్లు, దర్శకులు మరికొందరు ఉన్నారు. -
సింగర్ సునీత.. బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయిందిగా!
సింగర్ సునీత టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మధురమైన స్వరంతో సినీ ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్లో స్టార్ సింగర్‌గా పేరు సంపాదించుకున్నారు. పలు చిత్రాలకు పాటలు పాడిన సునీత తెలుగు వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. సునీత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: హీరోగా సింగర్ సునీత కొడుకు.. ఫస్ట్ లుక్ రిలీజ్) ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పేసింది. స్టార్ యాంకర్ సుమతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తన బెస్ట్ ఫ్రెండ్ యాంకర్ సుమ అంటూ ఆమెతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. సింగర్ సునీత కూమారుడు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. 'సర్కారు నౌకరి' పేరుతో తీస్తున్న ఈ సినిమాతో ఆకాశ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. భావన అనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. (ఇది చదవండి: లైవ్‌లో సిగరెట్ తాగిన స్టార్ హీరో.. మండిపడుతున్న నెటిజన్స్!) -
ఇద్దరు ఇద్దరే.. అదిరిపోయే ప్లానింగ్ తో దూసుకుపోతున్న రామ్, తారక్
-
చరణ్,తారక్‌ల స్నేహానికి ఏమైంది? దూరంగా ఉండటానికి కారణం అదేనా?
-
ఇది అన్యాయం.. అప్పుడు చరణ్ తో, ఇప్పుడు హృతిక్ తో
-
ఊర మాస్ సినిమాలతో బాలీవుడ్ ఎంట్రీ..
-
70 డైలాగ్స్ రాసి ఇచ్చా.. సినిమాలు నీకేందుకయ్యా అన్నారు: పోసాని
టాలీవుడ్ విలక్షణ నటుల్లో పోసాని కృష్ణమురళిది ముందువరుసలో ఉంటారు. అభిమానుల గుండెల్లో అంతలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కమెడియన్‌గా, నటుడిగా, దర్శకనిర్మాతగా, రచయితగా సత్తా చాటిన ఆయన తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా వివరించారు. ఆయనకు రైటర్‌గా తొలి అవకాశమిచ్చింది పరుచూరి బ్రదర్స్ అని వెల్లడించారు. పోసాని మాట్లాడుతూ..' నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్లు. ఇప్పటివరకు నా కెరీర్లో ఏ ఒక్క మిస్టేక్ చేయలేదు. ఎవరి దగ్గరైనా చిన్న తప్పు కూడా లేదు. నేను నిర్మాతగా చేసినప్పుడు ఇండస్ట్రీలో పెట్టినంతా మంచి భోజనం ఎవరు పెట్టలే. భోజనానికి మహా అయితే రూ.5 లక్షలవుతుంది. కానీ నేను రూ.30 లక్షలు ఖర్చు పెట్టా. నా కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ఫస్ట్ సత్యానంద్ దగ్గరికి వెళ్లా. నాలుగేళ్ల తర్వాత రమ్మన్నారు. ఆ తర్వాత మద్రాస్‌లోనే పరుచూరి బ్రదర్స్ దగ్గరికి వెళ్లా. మా దగ్గర ఖాళీ లేవు పోమ్మన్నారు. ఆ తర్వాత నేను గేటు దగ్గర నిలబడి ఉండగా గోపాలకృష్ణ అంబాసిడర్ కారు వచ్చింది. ఏం వోయ్ రేపు మార్నింగ్ 5.30 కి రా అని అన్నారు. అయితే 5.30కి ముందే వెళ్లా.' అని అన్నారు. ఆ తర్వాత మాట్లాడుతూ..' వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ ఇద్దరు వచ్చారు. బాగా చదువుకున్నట్లున్నావ్ ఏదైనా జాబ్ చేసుకోవచ్చుగా అన్నారు వెంకటేశ్వరరావు. అప్పుడు బీఎన్ ప్రసాద్ నిర్మాత. వెంకటేశ్వరరావు నాకు కొన్ని డైలాగ్స్ రాయమని చెప్పారు. అది పేకాట పిచ్చోడు అనే పాత్రకు. ఆయన వచ్చేలోగా 70 డైలాగ్స్ రాశా. అవీ చూసి 50 డైలాగ్స్‌కి టిక్ పెట్టారు. అందులో దాదాపు 35 వరకు సినిమాలో వాడుకున్నారు. డైలాగ్స్ బాగా రాశావ్ అన్నారు వెంకటేశ్వరరావు. ఆ తర్వాత ఎంఫిల్ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. పీహెచ్డీ కూడా చేశా. ఫస్ట్ నాకు సినిమాల మీద ప్రేమ లేదు. రైటర్‌గా ఫస్ట్ ఫిల్మ్ వచ్చేదాకా నాకు నమ్మకం లేదు.'అని అన్నారు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య
టాలీవుడ్ యాంకర్ లాస్య మరోసారి తల్లి కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. హోలీ సందర్భంగా బిడ్డ పుట్టడంతో లాస్య కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. చేతులకు రంగులు అద్దుకుని సెలబ్రేట్ చేసుకున్న ఓ వీడియోను షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఇది చూసిన అభిమానులు లాస్యకు కంగ్రాట్స్ చెబుతున్నారు. గతంలో సోషల్ మీడియాలో పలుసార్లు ఫోటోలు, వీడియోలు పంచుకున్నారు. ఇటివలే ఆమెకు కుటుంబ సభ్యులు సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఒక రోజు ముందే బిడ్డ ఆమెను గందరగోళానికి గురి చేస్తున్నాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను కూడా షేర్ చేసింది. కాగా.. చీమ ఏనుగు జోక్స్‌తో బాగా పాపులర్ అయిన లాస్య పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. పెళ్లి తర్వాత కెరీర్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన లాస్య సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తుంటుంది. View this post on Instagram A post shared by Lasya Chillale (@lasyamanjunath) -
ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. తాజాగా ఆయన హైదరాబాద్‌లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ద్వారా ఫేమ్ సంపాదించారు. అందువల్లే అతని పేరుతోనే ఆట సందీప్‌గా అభిమానుల్లో ముద్ర వేసుకున్నారు. ఇటీవలే ఇంటి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్లు సందీప్ తెలిపారు. అయితే కొవిడ్ తర్వాత చాలా ఇబ్బందులు పడినట్లు వారు తెలిపారు. ఇది తమ ఐదేళ్ల కష్టానికి దక్కిన ఫలితమని సంతోషం వ్యక్తం చేశారు. కరోనా టైంలో పడిన కష్టాలను వివరిస్తూ తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఆట సందీప్, జ్యోతిరాజ్. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' మొదటి సీజన్లోనే విన్నర్‌గా నిలిచారు సందీప్. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
కొత్త సంవత్సరం.. కొత్త సినిమాలు
కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త సినిమా అప్డేట్స్ కోసం సినీ లవర్స్ ఎదురు చూస్తుంటారు. అలాగే తమ అభిమాన స్టార్ ఏయే సినిమాలు చేస్తున్నారో తెలుసుకోవాలని ఫ్యాన్స్‌కు ఉంటుంది. ఆ విశేషాలు ‘స్టార్ క్యాలెండర్’లో తెలుసుకుందాం. చిరంజీవి: ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా జనవరి 13న రానున్నారు హీరో చిరంజీవి. ఇక చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బోళా శంకర్’ ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. మరోవైపు చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందనే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. బాలకృష్ణ: ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా జనవరి 12న రానున్నారు బాలకృష్ణ. ఇక అనిల్æ రావిపూడి దర్శకత్వంలోని సినిమాతో బిజీగా ఉంటారు. వెంకటేశ్: కొన్ని కథలు విన్నప్పటికీ ఏప్రాజెక్ట్ ఫైనలైజ్ చేయలేదు. కానీ హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘కీసీ కా బాయ్.. కీసీ కా జాన్’లో వెంకీ కీ రోల్ చేశారు. ఈ మూవీ రంజాన్‌కి రిలీజ్ కానుంది. నాగార్జున: కొన్ని కథలు విన్నప్పటికీ ఇంకా ఏప్రాజెక్ట్కీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మోహన్‌బాబు: కుమార్తె మంచు లక్ష్మీతో కలిసి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో మోహన్‌బాబు ‘అగ్నినక్షత్రం’ సినిమాలో నటిస్తున్నారు. సమంత టైటిల్ రోల్ చేసిన ‘శాకుంతలం’లో మోహన్‌బాబు కీ రోల్ చేశారు. రవితేజ: ఈ ఏడాది రవితేజ ఫుల్ బిజీ. ఇప్పటికే రవితేజ హీరోగా ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. అలాగే ‘ఈగిల్’ అనే కొత్త సినిమా కమిట్ అయినట్లు వార్తలు ఉన్నాయి. సుధీర్‌వర్మ దర్శకత్వంలోని ‘రావణాసుర’ ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. ఇక ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ కీ రోల్ చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్: క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో హీరోగా టైటిల్ రోల్ చేస్తున్నారు పవన్ కల్యాణ్. అలాగే ‘గబ్బర్‌సింగ్’ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్’ అనే సినిమా చేస్తున్నారు పవన్. యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కించే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. గోపీచంద్: దర్శకుడు శ్రీవాస్‌తో ఓ మూవీ చేస్తున్నారు గోపీచంద్. దీనికి ‘లక్ష్యం 2’, ‘రామబాణం’ టైటిల్స్ తెరపైకి వచ్చాయి. రాజశేఖర్: పవన్ సాధినేని దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ ‘మాన్స్టర్’ చేస్తున్నారు రాజశేఖర్. ప్రభాస్: ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్తోప్రాజెక్ట్ కె, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ‘సలార్’, మారుతితో ‘రాజా డీలక్స్’ (అధికారికంగా ప్రకటించాల్సి ఉంది) చిత్రాలు చేస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఇక ప్రభాస్ టైటిల్ రోల్లో నటించిన ‘ఆదిపురుష్’ పూర్తయింది. ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం జూన్ 16న రిలీజ్ కానుంది. ‘సలార్’ సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. మహేశ్‌బాబు: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందు తోంది. ఇది పూర్తి కాగానే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఇంటర్నేషనల్ లెవల్ ఫిల్మ్‌లో హీరోగా నటిస్తారు మహేశ్. ఎన్టీఆర్: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపుదిద్దుకోనున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. ఈ చిత్రం తర్వాత ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. రామ్‌చరణ్: శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేస్తారు చరణ్. అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా ప్రకటన వచ్చింది. అల్లు అర్జున్: ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది. కాగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమా అల్లు అర్జున్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. నాని: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ చిత్రం చేస్తున్నారు నాని. మార్చి 30న రిలీజ్ కానుంది. అలాగే తన కొత్త చిత్రాన్ని నాని ఈ రోజు ప్రకటిస్తారు. రామ్: ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తు న్నారు రామ్. నాగచైతన్య: వెంకట్ ప్రభు డైరెక్షన్లో ‘కస్టడీ’ చిత్రం చేస్తున్నారు నాగచైతన్య. ఈ సినిమా మేలో రిలీజ్ కానుంది. ఇక పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా ప్రకటన వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. విజయ్ దేవరకొండ: ప్రస్తుతం ‘ఖుషి’ సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకుడు. కాగా విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ‘జేజీఎమ్æ’ (జన గణ మన) షూటింగ్ ఆరంభమైంది. ఈ సినిమాపై మరో అప్డేట్ రావాల్సి ఉంది. నందమూరి కల్యాణ్‌రామ్: ప్రస్తుతం ‘అమిగోస్’, ‘డెవిల్’ చిత్రాలు చేస్తున్నారు కల్యాణ్‌రామ్. ఫిబ్రవరిలో విడుదల కానున్న ‘అమిగోస్’ చిత్రానికి రాజేంద్రరెడ్డి దర్శకుడు. ‘డెవిల్’ సినిమాకు నవీన్ మేడారం డైరెక్టర్. అలాగే కేవీ గుహన్‌తో ఓ సినిమా కమిట్ అయ్యారు. శర్వానంద్: కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా కమిటయ్యారు శర్వానంద్. రానా దగ్గుబాటి: దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించనున్న మైథలాజికల్ ఫిల్మ్ ‘హిరణ్యకశ్యప’లో రానా టైటిల్ రోల్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అలాగే మిలింద్ రావ్ దర్శకత్వంలో రానా హీరోగా ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. అల్లరి నరేశ్: ‘నాంది’ సినిమాతో తనకు మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్షన్లో అల్లరి నరేశ్ ‘ఉగ్రం’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ‘సభకు నమస్కారం’ అనే సినిమా కూడా కమిట్ అయ్యారు నరేశ్. ఈ చిత్రానికి సతీష్ దర్శకుడు. నితిన్: వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ఫిల్మ్ షూటింగ్లో నితిన్ పాల్గొంటున్నారు. వరుణ్ తేజ్: దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ఓ యాక్షన్ ఫిల్మ్, కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్‌సింగ్‌తో ఎయిర్‌ఫోర్స్ యాక్షన్ బేస్డ్ ఫిల్మ్ చేస్తున్నారు వరుణ్ తేజ్. శక్తి ప్రతాప్‌తో చేస్తున్నది వరుణ్‌కి హిందీలో తొలి సినిమా. అఖిల్: సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఏజెంట్’తో బిజీగా ఉన్నారు అఖిల్. సుధీర్‌బాబు: ‘హంట్’, ‘మామా మశ్చీంద్ర’ సినిమాలు చేస్తున్నారు సుధీర్‌బాబు. జనవరి 26న విడుదల కానున్న ‘హంట్’ మూవీకి మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించగా, ‘మామా మశ్చీంద్ర’ సినిమాకు హర్షవర్థన్ దర్శకుడు. అలాగే జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ‘హరోం హర’ అనే సినిమా చేస్తున్నారు సుధీర్‌బాబు. నిఖిల్: ఎడిటర్ గ్యారీ బీహెచ్ మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న ‘స్పై’ చిత్రంలో నటిస్తారు నిఖిల్. అలాగే దర్శకుడు సుధీర్ వర్మతోనూ నిఖిల్ ఓ సినిమా చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్: సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం ‘విరూపాక్ష’. కార్తిక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. అదే విధంగా జయంత్ అనే కొత్త దర్శకుడితో కూడా ఓ సినిమా చేస్తున్నారు సాయిధరమ్ తేజ్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్: ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ షూటింగ్‌ను దాదాపు పూర్తి చేశారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. హిందీలో సాయి శ్రీనివాస్‌కు ఇది తొలి చిత్రం కాగా, ఈ చిత్రదర్శకుడు వీవీ వినాయక్‌కు కూడా అక్కడ దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. వైష్ణవ్ తేజ్: కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్. రెడ్డి తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీలో హీరోగా నటిస్తున్నారు వైష్ణవ్ తేజ్. అడివి శేష్: తన కెరీర్లో వన్నాది బెస్ట్ హిట్స్‌గా నిలిచిన ‘గూఢచారి’ సినిమా సీక్వెల్ ‘గూఢచారి 2’లో నటిస్తున్నారు అడివి శేష్. ఈ సినిమాకు వినయ్ కుమార్ దర్శకుడు. నాగశౌర్య: అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా చేసిన ‘ఫలానా అబ్బాయి... ఫలానా అమ్మాయి’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. అలాగే ‘΄ోలీసువారి హెచ్చరిక’తో పాటు మరో సినిమా చేస్తున్నారు నాగశౌర్య. సందీప్ కిషన్: రంజిత్ జయకొడి దర్శకత్వంలో ‘మైఖేల్’, వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘ఊరిపేరు భైరవకోన’ సినిమాలు చేస్తున్నారు సందీప్ కిషన్. అలాగే ధనుష్ హీరోగా చేస్తున్న ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంలో ఓ కీ రోల్ చేస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ: హిట్ ఫిల్మ్ ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘డీజే టిల్లు’ స్క్వైర్‌లో నటిస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. నవీన్ పొలిశెట్టి: అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో పి. మహేశ్‌బాబు ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. అలాగే నవీన్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘అనగనగా ఒక రాజు’ను కల్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ గణేష్: రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ చేసిన ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. వీరితోపాటు మరికొందరు హీరోలు ఆన్ సెట్స్‌లో బిజీగా ఉంటారు. -
ఆ రోజు రాత్రి నేను చూశాను.. ఆసక్తిగా ట్రైలర్
Matarani Mounamidi Movie Trailer Released: రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ రూపొందిస్తున్న సినిమా "మాటరాని మౌనమిది". మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో మల్టీ జోనర్ గా రూపొందింది ఈ సినిమా. తుది హంగులు అద్దుకుంటున్న "మాటరాని మౌనమిది" సినిమా ఆగస్టు 19న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ ఫేస్ మాస్క్‌లతో ఉన్న వ్యక్తులు ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. దీంతో ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ హీరోల ఆశీర్వాదం ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. "మాటరాని మౌనమిది" మూవీ ట్రైలర్ చూస్తే లవ్, మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. స్నేహితుడిలా ఉండే బావ ఇంటికి వెళ్తాడు హీరో. అక్కడ అతనికి మాటలు రాని క్లాసికల్ డాన్సర్ పరిచయం అవుతుంది. ఆ అమ్మాయితో రిలేషన్ ఏర్పడుతుంది. ఒకరోజు హీరో బావ ఇంట్లో అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు ఏంటి, అంతు చిక్కని అదృశ్య శక్తి ఏం చేసింది అనేది ట్రైలర్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, లిరికల్ పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమా కొత్తగా ఉంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచెలా ఉంది. -
తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్న పర భాష డైరెక్టర్లు వీళ్లే..
ఇప్పుడు తెలుగు సినిమా తెలుగు సినిమా కాదు. మరి ఏంటీ అంటే.. ‘పాన్ ఇండియా సినిమా’ అయిపోయింది. ‘బాహుబలి’తో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాలు ఎక్కువయ్యాయి. ఇతర భాషల దర్శకుల చూపు కూడా మన హీరోలపై పడింది. తమిళం, కన్నడ, హిందీ భాషల దర్శకులు తెలుగు హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. వణక్కమ్, నమస్కార, నమస్కార్ అంటూ మన హీరోలకు వాళ్ల భాషల్లో ‘నమస్కారం’ చెబుతున్నారు. ఇక ఆ డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్. ఆ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా రేంజ్ కావడం విశేషం. హిందీ దర్శకులు ప్రభాస్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపగా దర్శకుడు ఓం రౌత్‌కి ముందుగా అవకాశం ఇచ్చారు. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అలాగే హిందీ చిత్రం ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కన్నడ దర్శకుడు, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ ‘సలార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’తో పర భాషల్లో కూడా స్టార్‌డమ్‌ను పెంచుకున్న ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో సినిమా చేయడానికి ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కాకముందే ఇతర ఇండస్ట్రీ దర్శకులు ఆసక్తి చూపారు. ఆల్రెడీ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా కన్ఫార్మ్ అయింది. దర్శకుడు కొరటాల శివతో చేయనున్న సినిమాను పూర్తి చేశాక ప్రశాంత్ నీల్ కథలోకి వెళ్తారు ఎన్టీఆర్. సేమ్ ఎన్టీఆర్లానే రామ్‌చరణ్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కాక ముందే తమిళ దర్శకుడు శంకర్‌తో ఓ సినిమా కమిటయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రశాంత్ నీల్‌తో కూడా రామ్‌చరణ్ కథా చర్చలు జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఓ ప్రముఖ ముంబై నిర్మాణ సంస్థ రామ్‌చరణ్‌తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇటు నాగచైతన్య, రామ్ తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య కోలీవుడ్‌లో ‘మానాడు’తో హిట్ సాధించిన దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించనున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తారు. ఇక ‘పందెంకోడి’తో హిట్ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల్లో పేరు సంపాదించిన లింగుసామి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా సినిమా చేస్తున్నారు. ‘ది వారియర్’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ హీరో. ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఇంకా దర్శకుడు శ్రీ కార్తీక్‌తో హీరో శర్వానంద్ చేసిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ఒకే ఒక జీవితం’ రిలీజ్‌కు రెడీగా ఉంది. తమిళ దర్శకుడు రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘మైఖేల్’ చేస్తున్నారు. మరికొందరు పరభాషా దర్శకులు తెలుగు హీరోల డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. సో.. మరికొన్ని కాంబినేషన్స్ సెట్ కావొచ్చు. కుదిరితే... వార్తల్లో ఉన్న ప్రకారం మరికొందరు తెలుగు హీరోలు కూడా వేరే భాషల దర్శక-నిర్మాతలతో సినిమాలు చేసే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే ఆ చిత్రాలు కూడా పట్టాలెక్కుతాయి. నటుడు, దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కించనున్న సినిమాలో పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్‌లు నటిస్తారని, హీరో గోపీచంద్, తమిళ దర్శకుడు హరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ‘తగ్గేదే లే’ అంటూ.. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో బాలీవుడ్ మార్కెట్లోనూ సత్తా చాటిన అల్లు అర్జున్ ఇటీవల హిందీ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీని కలిశారు. బాలీవుడ్లో బన్నీ చేయనున్న స్ట్రయిట్ సినిమా కోసమే ఈ మీటింగ్ అనే టాక్ వినిపిస్తోంది. అలాగే యంగ్ హీరోలు అఖిల్, విజయ్ దేవరకొండతో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేశారట. కీలక పాత్రల్లో... తెలుగు హీరోలను కీలక పాత్రలకు కూడా తీసుకుంటున్నారు బాలీవుడ్ దర్శకులు. రణ్‌బీర్ కపూర్ హీరోగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తీసిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నాగార్జున ఓ లీడ్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందనున్న ఓ చిత్రంలో వెంకటేశ్ ఓ లీడ్ రోల్ చేయనున్నారు. ఈ సినిమాకు ఫర్హాద్ సామ్జీ దర్శకుడు అని టాక్. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్‌సింగ్ చద్దా’లో నాగచైతన్య ఓ కీలక పాత్ర చేశారు. అలాగే అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ‘రామసేతు’లో సత్యదేవ్ ఓ ముఖ్య పాత్ర చేశారు. -
డ్రగ్స్ కేసు నిందితుడు లక్ష్మీపతి కోసం గాలింపు ముమ్మరం
-
పబ్‌లతో తారల బంధం!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు పబ్‌లతో టాలీవుడ్ తారలకు దశాబ్దంన్నర కిందటే బంధం ఏర్పడింది. ఓ టాలీవుడ్ అగ్రహీరో బంజారాహిల్స్‌లో టచ్ పబ్‌ని స్నేహితుడితో కలిసి ఏర్పాటు చేయగ అది సినీతారలతోపాటు ఇతర రంగాల సెలబ్రిటీల నైట్ లైఫ్‌కు చిరునామాగా వర్ధిల్లింది. అయితే ఇతరుల రాక వల్ల గోప్యతకు ఇబ్బందనే భావనతో దాని కవర్ చార్జీలు కూడా షాక్ కొట్టే రీతిలో నిర్ణయించారు. కానీ అర్ధరాత్రి దాటినా డ్యాన్సులంటూ ఆరోపణలు రావడం, పలుమార్లు పోలీసు దాడులు జరగడంతో ఆ స్టార్ హీరో పబ్ వ్యాపారం నుంచి తప్పుకున్నప్పటికీ.. అప్పటికే సెలబ్రిటీల కోసం ప్రత్యేకమైన పార్టీ ప్లేస్ ఒక అవసరంగా మారిపోయంది. ఆ తర్వాత అదే యువ తారలకు ఆకర్షణీయ వ్యాపార మార్గమైంది. ‘టచ్’కన్నా ముందే బేగంపేట్‌లోని బాటిల్స్ అండ్ చిమ్నీస్ ఓ సినీనటి ఆధ్వర్యంలో నడిచేది. టాలీవుడ్లో మంచి సంబంధాలు నడుపుతాడని పేరున్న ఓ యువ నటుడు నగర శివార్లలో బీపీఎం పేరిట ఓ పార్టీ ప్లేస్‌ని నిర్వహించాడు. అది కూడా టాలీవుడ్ తారలకు, ఇతర రంగాల సెలబ్రిటీలకు మాత్రమే ప్రత్యేకించిందిగా పేరొందింది. అక్కడి రహస్య కార్యకలాపాలపట్ల ఎక్సైజ్‌శాఖ పోలీసులు కన్నెర్ర చేయడంతో అది మూతపడింది. అదే తరహాలో మరో యువ నటుడు నగర శివార్లలో నెలకొల్పిన ఎఫ్ క్లబ్ కూడా కొంతకాలం సీక్రెట్ పార్టీలకు కేరాఫ్‌గా నడిచి మూతపడింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ ఉదంతం, కెల్విన్ అనే డ్రగ్ డీలర్ దందాకు ఈ క్లబ్ వేదికైంది. జూబ్లీహిల్స్‌లో ఓ యువ హీరోకి వాటాలున్న హైలైఫ్ పబ్ కూడా అంతే. దానిపైనా లెక్కలేనన్నిసార్లు దాడులు జరిగాయి. విలన్ పాత్రలకు పేరొందిన ఓ టాప్ టాలీవుడ్ నటుడికి కూడా జూబ్లీహిల్స్‌లో ఓ పబ్ ఉంది.