కాకర పువ్వొత్తుల రంగుపూలు | Tollywood Stars Celebrated Diwali | Sakshi
Sakshi News home page

స్టార్స్‌ సందడి

Published Tue, Oct 29 2019 1:16 AM | Last Updated on Tue, Oct 29 2019 9:03 AM

Tollywood Stars Celebrated Diwali - Sakshi

కాకర పువ్వొత్తులు రంగుపూలు పూశాయి. చిచ్చుబుడ్లు మెరుపులు విరజిమ్మాయి. లక్ష్మీ పూజ ఘనంగా జరిగింది. లడ్డూలు ఇష్టంగా లాగించారు. దీపావళిని అందరూ ఘనంగా జరుపుకొని ఉంటారు. సినిమా తారలు కూడా ఘనంగా జరుపుకున్నారు. పూజ విశేషాలను, పండగ సంబరాలను ఎవరెవరు ఎలా జరుపుకున్నారో తెలుసుకుందాం. దీపావళి ముందు రోజు రాత్రి మోహన్‌బాబువాళ్ల ఇంట్లో దీపావళి సంబరాలు జరిగాయని తెలిసింది. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులను మంచు కుటుంబం ఆహ్వానించింది. కృష్ణంరాజు, చిరంజీవి, ప్రభాస్, రచయిత సత్యానంద్, దర్శకుడు రాఘవేంద్రరావు, రచయితలు బీవీఎస్‌ఎన్‌ రవి, గోపీ మోహన్, హీరో రాజ్‌ తరుణ్‌.. ఇలా పలువురు తారలు మంచు ఇంటి విందుకి హాజరయ్యారు. ఆ వేడుక విశేషాలను పక్కన ఫొటోల్లో గమనించవచ్చు. విష్ణు చిన్న కుమార్తె ఐరా విద్యా మంచుని చిరంజీవి ఆప్యాయంగా ఎత్తుకున్న ఫొటోతో పాటు ఈ విందుకి సంబంధించిన పలు ఫొటోలు బయటికొచ్చాయి.


కృష్ణంరాజు, రాఘవేంద్రరావు, సత్యానంద్, చిరంజీవి, మోహన్‌బాబు 

ఇక కొత్తగా రీమోడలింగ్‌ చేయించిన ఇంట్లో దీపావళిని జరుపుకున్నారు చిరంజీవి కుటుంబ సభ్యులు. చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్‌.. ఇలా మొత్తం కుటుంబసభ్యులు పండగ చేసుకున్నారు. దీపావళిని అక్కినేని ఫ్యామిలీ కూడా గ్రాండ్‌గానే చేసుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫ్యామిలీ ఫొటోను సమంత షేర్‌ చేశారు. పెదనాన్న కృష్ణంరాజుతో కలసి దీపావళిని ఎంజాయ్‌ చేశారు ప్రభాస్‌. అలాగే అల్లు అర్జున్‌ ఫ్యామిలీ ఫొటోను పక్కన చూడవచ్చు. ఒక్కసారి బాలీవుడ్‌ సైడ్‌ వెళ్తే బోనీకపూర్‌ ఫ్యామిలీ మొత్తం దీపావళి సాయంత్రాన్ని ఎంజాయ్‌ చేశారు. దీపావళి ఈవెంట్‌ను అమితాబ్‌ బచ్చన్‌ ఫ్యామిలీ నిర్వహించింది. ఆ వేడుకకు పలువురు తారలు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ ధర్మా ప్రొడక్షన్స్‌ ఆఫీస్‌లో ఫెస్టివల్‌ను ఎంజాయ్‌ చేశారు స్టార్స్‌. ఫ్యామిలీతో తాప్సీ దీపావళిని జరుపుకున్నారు. తమన్నా, శ్రుతీహాసన్‌ సెల్ఫీను షేర్‌ చేశారు. రంగోలీతో పూజా హెగ్డే ఫొటో పంచుకున్నారు. ఇలా దీపావళి కాంతిని ఫేస్‌బుక్, ట్వీటర్ల ద్వారా అభిమానులకు కూడా షేర్‌ చేశారు స్టార్స్‌.

రాజారవీంద్ర, చిరంజీవి, ఐరా విద్య, విరానికా, విష్ణు


నాగార్జున, అమల, సమంత, నాగచైతన్య, అఖిల్‌


విష్ణు,విరానికా, ప్రభాస్‌, అక్కాచెల్లెళ్లు, స్నేహితులతో వరుణ్‌తేజ్‌


శ్యామల, కృష్ణంరాజు, ప్రభాస్‌

అల్లు అర్జున్, స్నేహ, రామ్‌చరణ్, ఉపాసన, అర్జున్‌కపూర్, జాన్వీకపుర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement