Diwali celebrations
-
దీపావళి సంబరాల్లో ‘మాంసం, మద్యం’... స్టార్మర్ కార్యాలయం క్షమాపణలు
లండన్: దీపావళి సంబరాల్లో మాంసం, మద్యం చోటు చేసుకున్న ఉదంతంపై బ్రిటన్ ప్రధాని కార్యాలయం శుక్రవారం క్షమాపణలు తెలిపింది. దాన్ని అనుకోకుండా దొర్లిన తప్పిదంగా అభివర్ణించింది. ‘‘దీనిపై బ్రిటిష్ హిందూ సమాజం ఆందోళనలను అర్థం చేసుకోగలం. ఇకపై జరిగే సంబరాల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాం’’ అని హామీ ఇచ్చింది. ప్రధాని అధికారిక నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో అక్టోబర్ 29న దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాటిలో ప్రధాని ప్రధాని కియర్ స్టార్మర్ పాల్గొనడమే గాక దీపాలు వెలిగించారు. అయితే ఆ వేడుకల్లో మాంసం, మద్యం చోటుచేసుకోవడంపై హిందూ సమాజం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. డౌనింగ్ స్ట్రీట్ దీపావళి సంబరాలు హిందూ సమాజం విశ్వాసాలకు అనుగుణంగా జరగలేదంటూ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన బ్రిటిష్ ఇండియన్ ఎంపీ శివానీ రాజా గురువారం స్టార్మర్‌కు లేఖ కూడా రాశారు. ఇకముందు వాటినెలా జరపాలో వివరించేందుకు సంసిద్ధత వెలిబుచ్చారు. -
న్యూజెర్సీలో దీపావళి వేడుకలు 2024
-
గాటా దీపావళి వేడుకలు.. పోతిరెడ్డి నాగార్జున రెడ్డికి సన్మానం
-
మోత మోగిన కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా ఈ ఏడాది వాయు కాలుష్యంకంటే శబ్దకాలుష్యం అధికంగా నమోదైంది. ప్రధానంగా హైదరాబాద్ మహానగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, మరికొన్ని చోట్ల శబ్ద స్థాయిలు గతం కంటే అధికంగా నమోదయ్యాయి. దీపావళి రోజు నమోదైన వాయు, శబ్ద నాణ్యతలపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) నివేదిక విడుదల చేసింది. గత ఏడాది దీపావళి పండుగ రోజుతో పోల్చితే ఈ ఏడాది శబ్ద కాలుష్య స్థాయిలు ఎక్కువ రికార్డయ్యాయి.ముఖ్యంగా హైదరాబాద్‌లో పండుగ రోజు రాత్రి పగలు అనే తేడా లేకుండా పటాకులు కాల్చటంతో కమర్షియల్, నివాస, సెన్సిటివ్ (ఆసుపత్రులు, స్కూళ్లు, జూ పార్కు ఇతర సున్నిత ప్రాంతాలు) ప్రదేశాల్లో శబ్ద స్థాయిలు (డెసిబుల్స్) అధికంగా నమోదయ్యాయి. ఐతే పారిశ్రామిక ప్రాంతాల్లో మాత్రమే ప్రామాణిక స్థాయిల కంటే తక్కువగా శబ్ద స్థాయిలు నమోదయ్యాయి. మిగతా మూడు కేటగిరీల్లో మాత్రం శబ్ద కాలుష్యం అధికంగా రికార్డ్ కావడం గమనార్హం.వాయునాణ్యత కాస్త మెరుగు..గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది దీపావళి రోజు వాయు నాణ్యత కాస్త మెరుగ్గా నమోదైంది. ముఖ్యంగా పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 (పీఎం 2.5–అతి సూక్ష్మ ధూళి కణాలు) ఈ ఏడాది తగ్గింది. ఇది గత ఏడాది దీపావళి రోజు 119 పాయింట్లు నమోదుకాగా, ఈ ఏడాది 84 పాయింట్లు రికార్డయ్యింది. పీఎం 10 (సూక్ష్మ ధూళికణాలు) గత ఏడాది 188 పాయింట్లు ఉండగా, ఈ ఏడాది 184 పాయింట్లుగా రికార్డయింది. పీఎం 2.5 వాయు కాలుష్య స్థాయిలు గత ఏడాది మామూలు రోజుల్లో 35 పాయింట్లుగా ఉండగా, ఈ ఏడాది 44 పాయింట్లుగా ఉంది. సాథారణ రోజుల్లో గత ఏడాది 85 పాయింట్లుగా ఉన్న పీఎం 10 సాంద్రత, ఈ ఏడాది 111 పాయింట్లుగా నమోదైంది. ఇతర కాలుష్యాలూ ఎక్కువే..ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ వంటి వాయు కాలుష్య కారకం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అధికంగా రికార్డయింది. సల్ఫర్ డై ఆక్సైడ్ కాలుష్యకారకం కూడా గత ఏడాది కంటే ఈ ఏడాది కొంత ఎక్కువగానే నమోదైంది. గత ఏడాది దీపావళి సందర్భంగా నైట్రోజన్ ఆక్సైడ్ 30.6 పాయింట్లు నమోదుకాగా.. ఈ ఏడాది 40 పాయింట్లుగా నమోదైంది. గత ఏడాది దీపావళి సమయంలో 12 పాయింట్లు ఉన్న సల్ఫర్ డై ఆక్సైడ్, ఈ ఏడాది 14 పాయింట్లుగా రికార్డయింది. 2023లో మామూలు రోజుల్లో 6.2 పాయింట్లుగా ఉన్న సల్ఫర్ డై ఆక్సైడ్, ఈ ఏడాది సాధారణ రోజుల్లో 12 పాయింట్లుగా అంటే రెండింతలుగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.అదేవిధంగా నైట్రోజన్ ఆక్సైడ్ గత ఏడాది మామూలు రోజుల్లో 23.4 పాయింట్లు ఉండగా, ఈ ఏడాది 32.6 పాయింట్లుగా నమోదైంది. దీనిని బట్టి దీపావళి నాడే కాకుండా మామూలు రోజుల్లో కూడా వాయు కాలుష్యం పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రదేశాల్లో ధూళి కణాలు, కలుషిత వాయువులు, శబ్ద స్థాయిలను టీపీసీబీ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోంది. దీపావళి సందర్భంగా పర్యావరణ పరిస్థితి పర్యవేక్షణ అక్టోబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 7 దాకా కొనసాగిస్తున్నారు. -
బాంబుల బామ్మ
-
సమంత దీపావళి సెలబ్రేషన్స్.. (ఫోటోలు)
-
దీపావళి వేడుకల్లో టీమిండియా స్టార్ క్రికెటర్లు (ఫోటోలు)
-
దీపావళి వేడుకల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు... రష్మిక, విజయ్ దేవరకొండ సహా! (ఫొటోలు)
-
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. కచ్ బోర్డర్లో జవాన్లతో కలిసి ప్రధాని మోదీ వేడుకలు
-
దీపావళి వేడుకల్లో గాయాలు.. సరోజినీదేవి ఆసుపత్రికి బాధితులు క్యూ..
సాక్షి, హైదరాబాద్: దీపావళి వేడుకల్లో పలు చోట్ల అపశృతులు చోటుచేసుకున్నాయి. బాణసంచా కాలుస్తూ పలువురు గాయపడ్డారు. దీంతో బాధితులంతా సరోజినీదేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు. ఇప్పటివరకు 40 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి వచ్చారు. కాగా, గాయాలపాలైన వారికి చికిత్స కోసం సరోజినీదేవి కంటి ఆసుపత్రి ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. వంద బెడ్లు వైద్యాధికారులు ఏర్పాటు చేశారు. 9 మందికి తీవ్ర గాయాలయినట్లు వైద్యులు తెలిపారు. ఈసారి ప్రజల్లో అవగాహన పెరిగిందని.. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేసులు తగ్గుతాయని ఆశిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు అన్నారు.తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. టపాసుల దుకాణాలతో మార్కెట్లు, కిటకిటలాడాయి. చిన్నాపెద్దా పెద్ద బాణసంచా పేలుస్తూ ఆనందంగా గడిపారు. కాగా, దీపావళి సందర్భంగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా పేల్చడానికి అనుమతినిస్తూ సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు.అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు. -
స్టార్మర్ దీపావళి వేడుకలు
లండన్: బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి తన అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ ముందు ఆయన స్వంగా దీపాలు వెలిగించారు. అనంతరం నుదుట కుంకుమ దిద్దుకుని హిందూ సంప్రదాయ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అరుణిమా కుమార్ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాన్ని ఆస్వాదించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని చాలారకాల చీకట్లు కమ్ముకున్నాయని ఈ సందర్భంగా స్టార్మర్ ఆవేదన వెలిబుచ్చారు. వాటన్నింటినీ పారదోలేలా ఈ వెలుగుల పండుగ మనందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. దీపావళి భిన్న వర్గాల వారిని ఒక్కటి చేసే పండుగ అన్నారు. భారతీయులపై ప్రశంసల జల్లుబ్రిటిష్ ఇండియన్ సమాజం కష్టించి పని చేస్తుందని, తమ విలువలు, సేవా భావంతో సమాజంలో ఎనలేని గౌరవం సంపాదించుకుందని స్టార్మర్ కొనియాడారు. వారి భాగస్వామ్యం బ్రిటిష్ సమాజాన్ని సుసంపన్నం చేసిందన్నారు. ‘‘ప్రభుత్వ పనితీరులో వారెంతో కీలకం. నా అధికార నివాసం తలుపులు వారికోసం ఎప్పటికీ తెరిచే ఉంటాయి’’ అన్నారు. ఉప ప్రదాని ఏంజెలా రేయ్నర్, మంత్రులు సీమా మల్హోత్రా తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. -
Video: బాలీవుడ్ పాటకు యూఎస్ దౌత్యవేత్త హుషారైన స్టెప్పులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో దీపావళి వేడుకలు బధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి మరోసారి తన నృత్య ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. వేడుకల్లో భాగంగా గార్సెట్టి స్టేజ్‌పై బాలీవుడ్ హిట్ పాటకు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. సంప్రదాయ దుస్తులైన కుర్తా పైజామా ధరించి విక్కీ కౌశల్ నటించిన బ్యాడ్ న్యూస్ సినిమాలోని ‘తౌబా తౌబా’ పాటకు కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గార్సెట్టి ఇలా తన డ్యాన్స్ స్కిల్స్‌తో ఆకట్టుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా ఆయన చాలా సందర్భాల్లో తన నృత్య ప్రదర్శనతో అందరిని మంత్రముగ్దులను చేశారు. #WATCH | US Ambassador to India, Eric Garcetti dances to the tune of the popular Hindi song 'Tauba, Tauba' during Diwali celebrations at the embassy in Delhi(Video source: US Embassy) pic.twitter.com/MLdLd8IDrH— ANI (@ANI) October 30, 2024 -
గతం మర్చిపోయిన రాజేష్
-
ఘనంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
సంప్రదాయ స్వీట్స్ తో ప్రీ దీపావళి వేడుకలు నిర్వహించిన ఓ విద్యాసంస్థ
-
దీపావళి షాపింగ్ చేద్దాం పదండి! (ఫొటోలు)
-
జంటనగరాల్లో మొదలైన దీపావళి సందడి (ఫోటోలు)
-
వంట నూనె ధరలకు రెక్కలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు మొదలవుతున్న వేళ వంటనూనెల ధరలు చుక్కలనంటుతున్నాయి. గడిచిన నెల రోజులుగా క్రమంగా పెరుగుతూ సామాన్యులకు అందనంతగా పెరిగిపోతున్నాయి. నెల రోజుల్లోనే వంట నూనెల ధరలు 23 నుంచి 37 శాతం వరకు పెరగడంతో పండగ వేళ సామాన్యులకు ఇక్కట్లు తప్పేలా లేవు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే గత నెలలో రూ.100 ఉన్న పామాయిల్ ధర రూ.137 (37 శాతం) పెరగ్గా, సోయాబీన్ నూనె రూ.120 నుంచి రూ.148 (23 శాతం), సన్‌ఫ్లవర్ రూ.120 నుంచి రూ.149 (23.5 శాతం), ఆవ నూనె రూ.140 నుంచి రూ.181 (29శాతం), వేరుశనగ నూనె రూ.180 నుంచి రూ.187 (4 శాతం) మేర పెరిగాయి. దేశీయంగా నూనెగింజల సాగు పెద్దగా లేకపోవడంతో దేశం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యా, అర్జెంటీనా నుంచి సన్‌ఫ్లవర్ నూనెను దిగుమతి చేసుకుంటోంది. మొత్తంగా 58 శాతం ఇతర దేశాల నుంచే భారత్‌కు వస్తోంది. నూనెల వినియోగంలో భారత్ రెండో అతిపెద్ద వినియోగదారుగా ఉంది. దేశీయంగా నూనె పంటల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గత నెలలో ముడి సోయాబీన్, పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెల దిగుమతి సుంకాలను 5.5 శాతం నుంచి 27.5 శాతానికి పెంచింది. శుధ్ది చేయబడిన ఆవ నూనెల దిగుమతి సుంకాన్ని 13.7 శాతం నుంచి 35.7 శాతానికి పెంచింది. సెపె్టంబర్ 14 నుంచి పెరిగిన సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హోల్‌సేల్ వ్యాపారులు ధరలు పెంచి అమ్మకాలు చేపట్టారు. దీనితో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు నూనెగింజల సాగులో ముందున్న మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పంట ఉత్పత్తి తగ్గింది. ఈ ప్రభావం సైతం ధరల పెరుగుదలకు కారణమైంది. పెరిగిన ధరల ప్రభావం రెస్టారెంట్లు, హోటళ్లతో పాటు దీపావళి సందర్భంగా చేసుకునే తీపి పదార్థలపై గణనీయంగా పడుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో స్వీట్ల ధరలను పెంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. కొత్త పంట మార్కెట్లోకి వచ్చే వరకు ధరలు దిగిరావని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. -
మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
కెనడా తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబరాలు
కెనడా టొరంటో డుర్హం తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. ఈ వేడుకల్లో చిన్నా,పెద్దా అందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆడిపాడారు. విత్బ్య్ నగర ఎంపీపీ లాన్ కాయ్ ,డిప్యూటీ మేయర్ మలీహా షాహిద్ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించిన డీటీసీ కార్య సభ్యులను, వాలంటీర్లను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంటర్ ప్రూనేర్ అఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన అవంత్ సోలుషన్స్ అధినేత శ్రీనివాస్ వర్మ అట్లూరిని సత్కరించారు. డుర్హం తెలుగు కెనడా క్లబ్ ప్రెసిడెంట్ నర్సింహా రెడ్డి మాట్లాడుతూ..ఖండాంతరాలు దాటినా మన తెలుగు సంస్కృతిని ఇనుమడింప చేసేలా దీపావలి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగు కుటుంబాలకు ప్రత్యక అభినందనలు తెలిపారు. -
హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో దీపావళి-2023 వేడుకలను ఘనంగా జరిగాయి. స్థానిక ఇండియా క్లబ్లో నిర్వహించిన ఈ వేడుకల్లో సమాఖ్యలో సభ్యులుగా ఉన్న కుటుంబాలన్నీ పాల్గొన్నాయి. అందర్నీ ఆహ్వానిస్తూ వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రవాసులంతా కలిసి వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రవాసులంతా ఒక్కచోట చేరడం వల్ల ఒకరికొకరు తోడు ఉన్నారన్న భావన కలుగుతుందన్నారు. పిల్లలు, పెద్దలు ఒక కళా వేదిక కల్పించామని, అందుకు అందరూ సమిష్టిగా కృష్టి చేశారని తెలిపారు. తమ కార్యవర్గసభ్యులు రాజశేఖర్ మన్నె, రమాదేవి సారంగ, మాధురి అరవపల్లి, హరీన్ తుమ్మల, రమేశ్ రేనిగుంట్ల తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం సంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు. చిన్న ఆదిత్య సార్ల శ్లోక పద్యాలతో వినాయకుడిని స్తుతిస్తూ కార్యక్రమం మొదలు పెట్టారు. ఆ తరువాత ప్రేక్షకులని పరవశింప చేసిన అద్వైత ఈయుణ్ణి తబలా ప్రదర్శన, మన కళళ ప్రాముఖ్యతను చాటి చెప్పాయి.చిన్నారులు గుణ ఘట్టి మరియు భేవిన్ ఘట్టి మదురమైన లలితా సంగీతం వినిపించారు. అందరినీ ఆహ్లాద పరిచిన చిట్టి పొట్టి అడుగుల బుజ్జాయిలు జాహ్నవి బెల్లంకొండ, ధన్య సత్తినేని, అమృత ధర్మపురి, ముద్దోచ్చేలా తమ నృత్యాలతో అందరిని ఆశ్చర్యచకితుల్ని చేసారు. ఆ తరువాత, హాంకాంగ్ తెలుగు భామల హుషారైన డాన్స్ స్టెప్పులతో దీపావళి పటాసుల వలె ప్రదర్శనలిచ్చారు. అందరూ సరదాగా ఖబుర్లు చెబుకుంటూ, ముచ్చట్లు వేసుకుంటూ నోరు ఊరించే భోజనం చేసిన తరువాత, నృత్య - గాన ప్రద్శనలతో అందరినీ ఆనంద పరిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగంది. సాంస్కృతిక కార్యక్రమాని చక్కటి చిక్కటి అచ్చ తెలుగు లో భామలు రాధిక సంబతూర్ మరియు రాధిక నూతలపాటి చక్కగా నిర్వహించి అందరి మన్ననలు పొందారు. హాంగ్ కాంగ్ లో మూడు దశాబ్దాలకు పైగా నివసించిన వైద్య నిపుణులు డాక్టర్ మోహన్ భాస్కరభట్ల గారు, సతీమణి సూర్య గారు ఆకస్మిక సందర్శన అందరిని ఆశ్చర్యపరుస్తూ ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ తరువాత అందరూ ఎంతో ఆనందంగా కలిసి గ్రూప్ ఫోటోలు,సెల్ఫీలు తీసుకొని వచ్చిన ప్రతి కుటుంబం తమ బహుమతులు ఉత్సాహంగా అందుకున్నారు. చివరిగా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించిన - పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అందరు మన దేశ జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ముగించారు. -
న్యూజెర్సీ, సాయిదత్త పీఠంలో దీపావళి వేడుకలు
-
న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఘనంగా దీపావళి వేడుకలు
భారతీయ సంస్కృతిని అమెరికాలో కూడా పరిఢవిల్లేలా నిరంతరం కృషి చేస్తున్న శ్రీ శివ విష్ణు సాయిదత్త పీఠం.. దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించింది. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నిర్వహించిన దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఆలయ అర్చకులు అత్యంత వైడుకగా, సంప్రదాయబద్ధంగా దీపావళి వేడుకలను నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.దీపావళి సందర్భంగా బాబాకు ప్రత్యేక హారతులను నివేదించారు. ధనలక్ష్మీ అమ్మవారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయంలో దీపాలు, విద్యుత్ కాంతులు, రంగోలీలతో సుందరంగా అలంకరించారు. అనంతరం చిన్నా పెద్ద తేడాలేకుండా అందరూ కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రఘుశర్మ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా సాయి దత్త పీఠంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ వేడుకలకు చక్కటి స్పందన లభించిందని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయం చేసిన భక్తులకు, వాలంటీర్లకు, కమిటీ సభ్యులకు, దాతలకు అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ఇక ఈ వేడుకలకు గ్రాండ్‌గా జరగటం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. -
Anchor Suma Diwali Celebrations: యాంకర్ సుమ ఇంట్లో దీపావళి వేడుక (ఫొటోలు)
-
VarunLav Diwali Bash: పెళ్లయ్యాక వచ్చిన తొలి దీపావళి.. జంటగా సెలబ్రేట్ చేసుకున్న వరుణ్-లావణ్య (ఫోటోలు)
-
Namrata Shirodkar Photos: మహేశ్‌బాబు భార్య నమ్రత దీపావళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇంట దీపావళి వేడుకలు (ఫోటోలు)
-
Anasuya Bharadwaj: అనసూయ దీపావళి సంబరాలు (ఫోటోలు)
-
దీపావళి పండుగ కారణంగా ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం
-
టపాసుల కాలుస్తుండగా పలువురికి తీవ్రగాయాలు
-
దీపావళి వేడుకల్లో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
-
తానేటి వనిత ఇంట్లో దీపావళి సంబరాలు
-
మంత్రి రోజా ఇంట్లో దీపావళి సంబరాలు
-
దీపావళి కాంతుల వేడుకల్లో సినీ తారలు (ఫొటోలు)
-
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. హిమాచల్ సైనికులతో ప్రధాని దీపావళి వేడుకలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Viral Video: టీమిండియా దీపావళి సంబురాలు అదుర్స్
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో (8) దూసుకుపోతున్న టీమిండియా.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు దీపావళి సంబురాల్లో పాల్గొంది. బెంగళూరులోని విలాసవంతమైన ఐటీసీ గార్డెనియా హోటల్లో జరిగిన ఈ వేడుకల్లో భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ పాల్గొన్నారు. ఆహ్లాదభరితమైన వాతావరణంలో సాగిన ఈ వేడుకల్లో టీమిండియా ఆటగాళ్లు కుటుంబ సభ్యుల్లా మమేకమై ఎంజాయ్ చేశారు. We are #TeamIndia 🇮🇳 and we wish you and your loved ones a very Happy Diwali 🪔 pic.twitter.com/5oreVRDLAX — BCCI (@BCCI) November 12, 2023 ఈ వేడుకల్లో విరాట్-అనుష్క దంపతులు స్పెషల్ అట్రక్షన్‌గా నిలిచారు. రోహిత్, కేల్ రాహుల్, జడేజా, శార్దూల్, సూర్యకుమార్ సతీసమేతంగా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ చిన్న పిల్లాలలా సందడి చేశారు. టీమిండియా దీపావళి సంబురాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియోలో టీమిండియా ఆటగాళ్లను చూసేందుకు రెండు కళ్లు చాలవని నెటిజన్లు అంటున్నారు. ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. -
Diwali 2023: వెలుగుల ఉషస్సు
‘‘సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం!’’ మన ఇంట్లో వెలిగించింది ఒక్క దీపమైనా ముల్లోకాల చీకట్లను పోగొట్టాలన్నది భారతీయుల ఆశంస. ప్రపంచంలోని అన్ని దేశాలవారు, అన్ని జాతుల వారు ఏదో ఒక సందర్భంలో దీపాల పండగ చేసుకుంటారు. చీకటి అంటే ఎవరికీ ఇష్టం ఉండదు కదా! ఎవరు ఏ కారణంగా జరుపుకున్నా మనస్సులలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరచటానికి సంకేతంగా దీపాలను వెలిగిస్తారు. లోపల ఉన్న ఆనందమనే వెలుగుని బహిర్గతం చేసి, పరిసరాలని వెలిగేలా చేయటం దీపం వెలిగించటంలోని ఉద్దేశం. చీకటి, వెలుగు అనే మాటలని కాంతి అనే సందర్భంలోనే కాక ఎన్నింటికో ఉపయోగిస్తుంటాము. లోకంలో కావలసిన వాటిని కోరుకోదగిన వాటిని వెలుగుగాను, పనికి రానివాటిని, హాని కలిగించే వాటిని చీకటిగాను చెప్పు తుంటాము. అవిద్య, అజ్ఞానం, అనారోగ్యం, దుఖం, బాధ, చికాకు, దరిద్రం, అపకీర్తి, అవమానం, పాపం మొదలైన మనిషి నాశనానికి, నిరాశా నిస్పృహలకి హేతువులైనవన్నీ చీకటిగాను, జ్ఞానం, ఆరోగ్యం, సంతోషం, ఆనందం, ఆహ్లాదం, కీర్తి, పుణ్యం మొదలైన మానవునికి కోరుకోదగిన, ఉపయోగపడే వన్ని వెలుగుగాను సంకేతించటం జరిగింది. అందువలననే అన్నివిధాలైన చీకట్లను పోగొట్టే వెలుగు అంటే ఇష్టపడే జాతి భారతజాతి. కనుకనే దీపాన్ని ఆరాధిస్తాము. పూజిస్తాము. ‘‘దీపం జ్యోతి పరమ్ బ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే!’’ అని దీపాన్ని ్రపార్థిస్తాము. ఇది నిత్యకృత్యం. వరుసలుగా వందలాది, వేలాది దీపాలు వెలిగించటానికి ఎంతటి సంతోషం ఉ΄÷్పంగి ఉండాలో కదా! అటువంటి సందర్భం ద్వాపరయుగం చివర లో వచ్చింది. దానికి బీజం కృతయుగంలోనే పడి త్రేతాయుగంలో మొలకెత్తింది. యజ్ఞవరాహమూర్తిగా తనను ఉద్ధరించిన మహావిష్ణువుని చూసి వలచింది భూదేవి. తనకు కుమారుని ప్రసాదించమని కోరింది. ఆ సమయంలో గర్భధారణ జరిగితే అసుర లక్షణాలతో... లోకకంటకుడు అయిన కుమారుడు జన్మిస్తాడని అన్నాడు విష్ణువు. భూదేవి తమకంతో బలవంతం చేసింది. తప్పలేదు. లోకకంటకుడు భూదేవి గర్భంలో ఉన్నాడని తెలిసిన దేవతలు ఆ బాలుడు గర్భంలో నుండి బయటకు రాకుండా చూశారు. భూదేవి విష్ణువుని వేడుకుంది. త్రేతాయుగం చివరలో కుమారుడు ఉదయిస్తాడని అభయం ఇచ్చాడు. ఆ బాలుడే నరకుడు. అతడికి పదహారు సంవత్సరాలు వచ్చిన తరువాత బ్రహ్మపుత్రానది పరీవాహక ్రపాంతంలో ్రపాగ్జ్యోతిషం రాజధానిగా కామరూపదేశానికి రాజుని చేస్తూ, ధర్మం తప్పవద్దని, గోబ్రాహ్మణులకు హాని తలపెట్టవద్దని, అలా చేస్తే కీడు వాటిల్లుతుందని హెచ్చరించాడు. ఆ మాట ననుసరించి చాలా కాలం భుజబలంతో తనకెవ్వరు ఎదురు లేని విధంగా ధర్మబద్ధంగానే పరిపాలించాడు. కాని, ద్వాపరయుగం చివరలో అతడిలోని అసురలక్షణాలు బహిర్గత మయ్యాయి. వేదధర్మానికి దూరమై, తాంత్రికసాధన సత్వర ఫలవంతమని అనుసరించటం మొదలుపెట్టాడు. దానికోసం కామాఖ్యాదేవికి బలి ఇవ్వటానికి ఎంతోమంది రాజకుమారులను, పదునారు వేలమంది రాజకుమార్తెలను చెరపట్టి ఉంచాడు. అదితి కుండలాలను, వరుణుని ఛత్రాన్ని హరించాడు. దేవతలకు నిలువ నీడ లేకుండా చేశాడు. మరెన్నో దురంతాలు చేయ సాగాడు. ఇంద్రుడి అభ్యర్థన మేరకు శ్రీ కృష్ణుడు నరకునిపై యుద్ధానికి వెడుతుంటే భూదేవి అవతారమైన సత్యభామ తానూ వెంట వస్తానని ముచ్చట పడింది. అక్కడ కృష్ణుడు మూర్ఛపోతే అతడికి సేదతీర్చుతూనే యుద్ధంలో నరకుని నిలువరించింది. సత్యభామ ఉపచారాలతో తేరుకున్న కృష్ణుడు చక్రంతో నరకుని తెగటార్చాడు. అది ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి. సత్యభామ కోరిక మేరకు ఆ రోజుని నరకుడి పేరుతో నరక చతుర్దశి అని పిలవటం జరిగింది. ఆ మరునాడు, అంటే, అమావాస్య నాడు ప్రజలందరు దీపాలు వెలిగించుకొని సంబరాలు చేసుకున్నారు. ఏదైనా శుభసంఘటన జరిగినప్పుడు కాని, ఎవరైనా మహానుభావులు పుట్టినప్పుడు కాని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. కాని, ఈ సందర్భంలో ఒకరు చనిపోతే అతడి పేరు మీద చేసుకోవటం జరుగుతోంది. అతడి చావు ఎందు కంతగా సంతోష ప్రదమయింది? నరకుడు భూదేవి పుత్రుడు. భూమి వసుంధర. అన్ని రకాలైన ఓషధులు, ఖనిజాలు ఇచ్చేది భూదేవియే. భూపుత్రుడైన నరకునికి వాటన్నిటి మీద వారసత్వపు అధికారం ఉంది. కాని అతడు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. సంపదలతో పాటు వెలుగుని కూడా ఎవరికీ అందకుండా తానే స్వంతం చేసుకున్నాడు. ్రపాగ్జ్యోతిషమంటే ముందుగా వెలుగు ప్రసరించే ్రపాంతం. భారతదేశంలో మొదటి సూర్యకిరణం భూమిని సోకేది అక్కడే కదా! ముందుగా తనకి అందిన వెలుగుని ఇతరులకి చేరకుండా అడ్డుపడేవాడట! నరకుని భయానికి పగటిపూట బయటకు రావటానికి భయం. వద్దామన్నా వెలుగు లేదు. రాత్రిపూట దీపం వెలిగిస్తే తమ ఉనికి తెలుస్తుందనే భయం. మొత్తానికి చీకట్లో, భయమనే చీకట్లో మగ్గారు. భయ కారణం పోగానే ఇన్నాళ్ళ దీపాలు, కరువుతీరా వెలిగించుకొని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకున్నారు. ఆ శుభ సంఘటనని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ కృష్ణ అమావాస్యనాడు దీపాలు వెలిగించటం సంప్రదాయం అయింది. ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఆవిర్భవించి, విష్ణువుని వివాహ మాడింది. దానితో దేవతలకు పోయిన స్వర్గలక్ష్మి లభించింది. కనుక దేవతలు కూడా దీపావళిని ఆనందంగా జరుపుకుంటారు. మనలోనూ, కుటుంబంలోనూ, సమాజంలోనూ, దేశంలోనూ, భూమండలం అంతా కప్పిన అన్నివిధాలైన అంధకారాలు పటాపంచాలు అయ్యే విధంగా దీపాలని వెలిగించి దీపావళిని దివ్య దీపావళిగా ఆనందోత్సాలతో జరుపుకుందాం. వెలుగులని పంచుదాం. నరకుని సంహరించినదెవరు? స్వంత కొడుకునైనా దుష్టుడైతే సంహరించటానికి అంగీకరించే, సహకరించే ఉత్తమ మాతృ హృదయానికి సంకేతం సత్యభామ. సౌందర్యానికి, స్వాభిమానానికి, మితిమీరిన కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమకి, పరాక్రమానికి పరాకాష్ఠగా మాత్రమే సత్యభామ ప్రసిద్ధం. కాని, మూర్తీభవించిన మాతృత్వం కూడా. ఒక్క దుష్టుడైన కుమారుడు లేకపోతే కోటానుకోట్ల బిడ్డలకి మేలు కలుగుతుంది అంటే అతడిని శిక్షించటానికి అంగీకరించేది విశ్వమాతృ హృదయం. ఆ శిక్ష అతడు మరిన్ని దుష్కృత్యాలు చేసి, మరింత పాపం మూట కట్టుకోకుండా కాపాడుతుంది. ఇది బిడ్డపై ఉన్న ప్రేమ కాదా! బిడ్డ సంహారాన్ని ప్రత్యక్షంగా చూడటమే కాదు, ్రపోత్సహించి, సహాయం చేసిన కారణంగా కాబోలు, నరకాసురుణ్ణి సత్యభామయే సంహరించింది అనే అపోహ ఉన్నది. లక్ష్మీపూజ ఎందుకు? దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించటం సంప్రదాయం. ఆనాడు లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఆవిర్భవించి, నారాయణుణ్ణి చేపట్టింది. వ్యాపారస్తులు లక్ష్మీదేవిని పూజించి ఈ రోజే కొత్త లెక్కల పుస్తకాలు మొదలుపెడతారు. లక్ష్మీదేవి ఆ నాడు సంధ్యాసమయం తరువాత తన వాహనమైన గుడ్లగూబని అధిరోహించి విహారానికి బయలుదేరి, తన స్వరూపాలైన దీపాలు ఉన్న ఇంట ప్రవేశిస్తుంది. కనుక లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఎన్నో దీపాలు వెలిగిస్తారు. తరువాత బాణసంచా పేలుస్తారు. దీపాలు వరుసగా వెలిగిస్తారు కనుక ఈ పండగను దీపావళి అంటారు. జ్ఞాన జ్యోతులు అన్ని సంప్రదాయాల వారు దీపావళి జరుపుకోవటానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. ఎవరు ఏ కారణంగా జరుపుకున్నా మనస్సులలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరచటానికి సంకేతంగా దీపాలను వెలిగిస్తారు. లోపల ఉన్న ఆనందమనే వెలుగుని బహిర్గతం చేసి, పరిసరాలని అంతా వెలిగేట్టు చేయటం దీపం వెలిగించటంలోని ప్రధాన ఉద్దేశం. ముందురోజు నరకచతుర్దశి నాడు తెల్లవారుజామున చంద్రుడు ఉండగా నువ్వులనూనెతో అభ్యంగన స్నానం చేస్తారు. పెద్దలు యముడికి తర్పణాలు ఇస్తారు. పిండివంటలు, కొత్తబట్టలతో ఆనందంగా గడుపుతారు. మరునాడు దీపావళి. అమావాస్య పితృతిథి. పైగా దక్షిణాయనం. కనుక మధ్యాహ్న సమయంలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. – డా. ఎన్.అనంతలక్ష్మి -
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా?బీపీ నుంచి హార్ట్ఎటాక్ వరకు..
ఇవాళ ధనత్రయోదశి. దీనినే ధన్ తేరస్ అని కూడా అంటారు. ఈ పర్వదినాన సాధారణంగా అందరికీ బంగారం, వెండి, గృహోపకరణాలు, వస్తు వాహనాల వంటి వాటి మీదికే దృష్టి మళ్లుతుంది. ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి జయంతి కూడా ఇదే రోజు అని గుర్తు రాదు. అయితే ఆరోగ్యం కూడా ధనమే కాబట్టి ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు ఏం చేయాలో తెలుసుకుని అందుకు తగినట్లు నడుచుకుంటే ఆరోగ్య ధనం, ఆరోగ్య మహాభాగ్యం సమకూరుతుంది. ధన త్రయోదశి సందర్భంగా ఆరోగ్య సంపదను ఏవిధంగా పెంపొందించుకోవాలో చూద్దాం... సంపూర్ణ ఆరోగ్యానికి ఆహార విహారాలు ఎంత అవసరమో, నిత్యం నడక, వ్యాయామం, యోగా కూడా అంతే అవసరం. ప్రధానంగా ఇవి అనేక రుగ్మతలకు దివ్య ఔషధాలు. అజీర్తి నుంచి ఆర్థరైటిస్ వరకు.. బీపీ నుంచి హార్ట్ ఎటాక్ వరకు, మధుమేహం నుంచి మానసిక సమస్య వరకు ఏదైనా నయం కావాలంటే రోజూ వ్యాయామం, యోగా చేస్తుండాలి. సమయానికి తగు... మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో ఆ ఆహారాన్ని తగిన సమయానికి తీసుకోవడం కూడా అంతే అవసరం. వేళ తప్పి భోజనం చేస్తే అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సరైన సమయాలకు భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి రోజూ ఉదయాన్నే టిఫిన్ చేయడం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. కొందరికి అలా బ్రేక్ ఫాస్ట్ చేయడం అలవాటు ఉండదు. అలాంటి వారు అల్పాహారంగా నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష, వాల్నట్స్, మొలకెత్తిన గింజలు, అవిసెలు, తాజాపండ్లు, కూరగాయల ముక్కలు లాంటివి అయినా తప్పనిసరిగా తీసుకోవాలి. లంచ్‌గా ఇవి... మధ్యాహ్నపు భోజనంగా సగం కంచంలో తాజా కూరగాయలు, మిగతా సగంలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. రక్తంలో చక్కెర నిల్వల్ని అదుపులో ఉంచుకోవడానికి, లో గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు లాంటి చిరు ధాన్యాన్ని ప్రయత్నించవచ్చు. ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత మేరకు తగ్గించాలి. ఎందుకంటే, మనం వాడే ప్లాస్టిక్ వస్తువుల నుండి, రోజుకి కొన్ని లక్షల సూక్ష్మరేణువులు విడుదలవుతాయి. వాటిలో ఉండే రసాయనం హార్మోన్ల సమతౌల్యాన్ని దెబ్బ తీస్తుంది. మానసిక దృఢత్వం మానసిక ఆరోగ్యం బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు. ఇందుకోసం నిత్యం నడక, వ్యాయామం, యోగా తప్పనిసరి. ప్రధానంగా ఇవి అనేక రుగ్మతలకు దివ్య ఔషధాలు. కంటినిండా నిద్ర కడుపు నిండా తిని కంటినిండా నిద్రపోతే ఏ జబ్బూ ఉండదని పెద్దవాళ్లనేవారు. వేళకు తగినంత రాత్రి నిద్ర ఉంటే పొద్దున లేవగానే ఉత్సాహంగా ఉంటుంది. లేదంటే నిస్సత్తువగా... ఏదో పోగొట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. నిద్ర లేమి వల్ల రకరకాల ఇతర జబ్బులు వస్తాయి. అందువల్ల వీలయినంత వరకు వయసును బట్టి, చేసే శారీరక శ్రమను అనుసరించి తగినంత నిద్ర పోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ఈ ధన త్రయోదశి నాడు అందరూ ఆరోగ్య ధనాన్ని పెంపొందించుకునే దిశగా అడుగులు వేస్తారని, వేయారనీ ఆశిద్దాం. -
దీపావళికి మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి ఇలా..
దీపావళి అంటే దీపాల పండుగే కాదు, ఇళ్లువాకిళ్లను శుభ్రం చేసి, ఇంటిని చక్కగా సర్దుకోవడం కూడా. ఇంటిని సర్దే క్రమంలో అందంగా అలంకరించుకోవడం కూడా ఈ పండగ సమయంలో చేసే ముఖ్యమైన పని. ఎంత అనుకున్నా ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఇంటిని డెకరేట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా ఏం పర్లేదు.. చిన్నచిన్న ఐడియాలు, చిట్కాలతో మీ ఇంటిని క్షణాల్లో అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో చూడండి. ►గాజు, రాగి, ఇత్తడి వెడల్పాటి పాత్రలో నీళ్లుపోసి తాజాపువ్వులతో నింపేయాలి. పూలమధ్యలో దీపాలను వెలిగించాలి. ఈ పాత్రను గుమ్మానికి ఎదురుగా, డోర్ పక్కన పెడితే చాలా అందంగా ఉంటుంది. ► ఇంటి గుమ్మం పెద్దగా ఉన్నట్లయితే సంప్రదాయబద్ధంగా అలంకరించాలి. గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులను పూలతో అలకరించి మధ్యలో దీపాలు పెట్టాలి. ఈ రంగవల్లుల పైన వేలాడే ల్యాంప్స్‌ను వెలిగిస్తే ఇంటి గుమ్మం కళకళలాడిపోతుంది. ► వివిధ రంగులతో మెరిసిపోయే చీరలు చున్నీలను గ్లాస్ విండో, డోర్లకు కర్టెన్స్లా పెట్టాలి. ఈ చీరలపైన సన్నని లైటింగ్ దండలను వేలాడదీయాలి. గది మధ్యలో సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిస్తే ఇల్లు మరింత కాంతిమంతంగా మారుతుంది. ► గుమ్మం ముందు, హాల్లో వేసే ముగ్గుని రెండు మూడు రకాల పువ్వులతో వేయాలి. ఈ ముగ్గు మధ్యలో మట్టిప్రమిదలు, సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ పెట్టి వెలిగించాలి. ► ఇంటిముందు పెద్దగా స్థలం లేనప్పుడు డోర్ పక్కనే ఉన్న గోడ మూలనుంచి దీపాలు పెట్టాలి. వీటిచుట్టూ పూలతో ఆలంకరించాలి. ఇవి ఇంటిని మరింత అందంగా చూపిస్తాయి. ► మార్కెట్లో దొరికే వివిధ రకాల వేలాడే దీపాలను వెలిగిస్తే చీకట్లో సైతం ఇల్లు కాంతులీని, పండుగ వాతావరణం కనిపిస్తుంది. ► గోడలకు వేలాడదీసే రంగురంగుల డెకరేషన్ వస్తువులు మార్కెట్లో చాలా కనిపిస్తాయి. కలర్‌ఫుల్ పూసలు, దారాలు, రంగురంగుల మెరిసే క్లాత్‌తో చేసిన, గంటలతో వచ్చే అలంకరణ వస్తువులను గోడకు వేలాడదీసి, కింద మట్టి దీపాలతో అలంకరిస్తే ఇల్లు కళకళలాడిపోతుంది. ► వీటిలో ఏదీ చేసే సమయం లేకపోతే మార్కెట్లో దొరికే చెక్క, యాక్రాలిక్ ల్యాంప్స్ కొనుక్కోని... కిటికీలు, గ్యాలరీలోవేలాడదీస్తే మీ ఇంటి దీపావళికి కళ వస్తుంది. ఇంకెందుకాలస్యం మీ ఇంటికి నప్పే విధంగా సింపుల్ డెకరేషన్ ప్రయత్నాలు మొదలుపెట్టండి. -
బంతిపూలకు మాత్రమే ఆ ప్రత్యేకత.. అందుకే పూజల్లో వాడుతారు
వేడుక వచ్చిందంటే చాలు బంతిపూల తోరణాలతో ఇళ్లూ వాకిళ్లు కళకళలాడుతూ ఉంటాయి. బంతిపూలకు మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే బంతిని మనకు ప్రకృతి ఇచ్చిన బహుమతిగా చెప్పచ్చు. తెల్లవారుజామున సూర్యుడు ఉదయించగానే భూమిలోని చీకట్లు తొలగి వెలుగు రేకలు అంతటా వ్యాపిస్తాయి. అదేవిధంగా, బంతిపువ్వును చూడగానే, మన మనస్సు తన బాధలను మరచిపోయి సంతోషిస్తుంది. ఈ సారూప్యత వల్ల బంతిపువ్వును సూర్యభగవానుడికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. గణేష్ చతుర్థి, నవరాత్రుల నుండి దీపావళి వరకు ఈ పూలకు చాలా డిమాండ్ ఉంది. మ్యారిగోల్డ్ శాస్త్రీయ నామం టాగెట్స్. భారతదేశానికి 350 సంవత్సరాల క్రితం పోర్చుగీసు వారి రాకతో మెక్సికో నుండి చేరుకుంది బంతి. చాలా అందంగా కనిపించే పసుపు, కుంకుమ రంగులో ఉండే ఈ పువ్వులను అందరూ ఇష్టపడతారు. విస్తారంగా సాగు.. మన దేశంలో బంతిపూల సాగు పెద్ద ఎత్తున చేస్తుంటారు రైతులు. ఇది మతపరమైన ఆచారాలతో పాటు, అనేక ఉత్పత్తుల తయారీలలో కూడా ఉపయోగపడుతుంది. సీజన్‌ను బట్టి బంతి పువ్వులను సాగు చేస్తారు. ఇది ఏప్రిల్, మే నెలల్లో సాగును ప్రారంభిస్తే ఆగస్టు–సెప్టెంబర్లలో చలికాలం ప్రారంభమవడానికి ముందు పంట చేతికొస్తుంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా 50 రకాల బంతి పువ్వులు ఉన్నాయి, వాటిలో మూడు జాతులు వాణిజ్య, వ్యవసాయం కోసం పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల పొలాలు బంతి పువ్వులతో వెలిగిపోతుంటాయి. త్యాగానికి పేరు బంతి పువ్వు బృహస్పతికి ఇష్టమైనదిగా జ్యోతిష్యులు చెబుతుంటారు. దేవతల గురువు బృహస్పతిని బంతి పువ్వులతో పూజిస్తే జ్ఞానం పెంపొందుతుందని నమ్మకం. పసుపు–కుంకుమపువ్వును కలిపినట్టుగా ఉండే ఈ రంగు త్యాగానికి ప్రసిద్ధి చెందింది, మరోవైపు ఇది అగ్ని వంటి ఉగ్రమైన వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ప్రజల మొదటి ఎంపిక ప్రజలు తమ ఇళ్లను బంతి పువ్వులతో అలంకరిస్తారు. కోల్‌కతా నుంచి వచ్చే బంతిపూలలో ఒకటి ఎరుపు, మరొకటి పసుపు. ఈ రంగు పువ్వులను బసంతి మేరిగోల్డ్ అంటారు. ఇదే అన్ని చోట్ల జనం మొదటి ఎంపికగా ఎంచుకుంటున్నారు. బంతిపూలతో అందంగా మెరిసిపోవచ్చు బొబ్బలు, కాలిన గాయాలు, దురదలు, చర్మవ్యాధుల నివారణలో బంతి పువ్వులను ఉపయోగిస్తారని ఆయుర్వేదంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రక్తకణాలను ఉత్పత్తి చేసి చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా మార్చగలవు. బంతి పువ్వులు వాపునే కాదు అలసటను తగ్గించడానికి కషాయంలా కూడా ఉపయోగిస్తారు. బంతి పువ్వు పొడి ముడతలు పడిన చర్మాన్ని మృదువుగా చేయడంలో కూడా సహాయపడుతుంది. బంతి పువ్వులు సహజ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కాలుష్యం నుండి చర్మాన్ని కాపాడతాయి. అందమైన ప్రయోజనాలు బంతిపూలు యాంటీ బయొటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. మేరిగోల్డ్ ఫేస్ ప్యాక్ ముఖ చర్మాన్ని బిగుతుగా చేయడంతో పాటు చర్మకాంతిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మొటిమలు, ముఖంపై మచ్చలు ఉన్నవారు బంతి పువ్వు ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించవచ్చు. అందుకే, సౌందర్య ఉత్పత్తులు, మసాజ్ నూనెలు, లోషన్లు, సబ్బులు.. మొదలైన ఉత్పత్తులలో బంతిపువ్వులను ఉపయోగిస్తారు. దీని ఉపయోగం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. దీన్ని నొప్పి, వాపును తగ్గించడానికి, పేగు, కడుపు రుగ్మతల నుండి ఉపశమనానికి, అల్సర్లను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. -
అనాథ చిన్నారులతో మంత్రి గుడివాడ అమర్నాథ్ దీపావళి వేడుకలు
-
Shriya Saran : ఫ్యామిలీతో శ్రియా శరణ్ దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
టాంటెక్స్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
-
రిషి సునాక్ ఇంట దీపావళి వేడుక
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులు 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని తమ అధికార నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. బుధవారం జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రవాస భారతీయులు, పార్లమెంటేరియన్లు, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొ న్నారు. ప్రధానిగా సునాక్ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నివాసాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు. ప్రధాని రిషి సునాక్, అక్షతామూర్తి దంపతులు కలిసి దీపాలు వెలిగిస్తున్న దృశ్యాలను ప్రధాని కార్యాలయం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ప్రధాని రిషి సునాక్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కమలా హ్యారిస్ నివాసంలోనూ.. వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మంగళవారం వాషింగ్టన్‌లోని తన అధికార నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు భారతీయ అమెరికన్లు సహా 300 మంది వరకు పాల్గొన్నారు. దీపాలు వెలిగించిన అనంతరం చట్టసభల ప్రతినిధులైన రో ఖన్నా, శ్రీ థానెదార్, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ తదితరులతో ఆమె మాట్లాడారు. ఈసందర్భంగా ఆమె ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరును ప్రస్తావించారు. పాలస్తీనియన్లకు సాయం అందించేందుకు అమెరికా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. -
Diwali 2023: ఈసారి దీపావళి పండుగ 12,13.. ఎప్పుడు జరుపుకోవాలి?
హిందువులు జరుపుకునే ప్రధాన పండగల్లో దీపావళి కూడా ఒకటి. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడవదిలిన ఆనందంలో ప్రజలు దీపావళిచేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. కుల, మత భేదం లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెబుతారు. అయితే ఈసారి దీపావళి వేడుకలు ఎప్పుడు జరుపుకోవాలన్నదానిపై ఆయోమయం నెలకొంది. మరి అసలు దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి? ధనత్రయోదశి ఎప్పుడు నిర్వహించాలి? అన్న విషయాలపై పండితులు ఏమంటున్నారంటే.. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా కార్తీక మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తేదీన దీపావళి పండగను జరుపుకుంటారు.అయితే అధికమాసం కారణంగా దాదాపుగా అన్ని పండుగలు రెండు రోజులు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే దీపావళి కూడా రెండు రోజులు రావడంతో ఏరోజు పండగను జరుపుకోవాలి అన్న సందిగ్ధత నెలకొంది. ఈ సంవత్సరం కార్తీక మాస అమావాస్య నవంబర్ 12, 2023న మధ్యాహ్నం 2:44 గంటలకు ప్రారంభమై 13 నవంబర్ 2023న మధ్యాహ్నం 2:56 గంటలకు ముగుస్తుంది. దీపావళి అంటే సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తాం. కాబట్టి అమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. అందుకే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నవంబరు 12నే దీపావళి పండగను జరుపుకోవాలని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదంటున్నారు పండితులు. అయితే సోమవారం(నవంబర్13)న మధ్యాహ్నం వరకు అమావాస్య ఉంటుంది కాబట్టి ఆరోజు వైధిక క్రతువులు నిర్వహించుకోవచ్చని తెలిపారు. దీపదానాలు, యమ తర్పణాలు ఇతరత్ర దీనం చేయడానికి సోమవారం వీలుంటుందని, ఆరోజు వైధిక దీపావళిగా పండగను జరుపుకోవచ్చని పేర్కొన్నారు. -
న్యూయార్క్‌లో ఘనంగా దీపావళి వేడుకలు
తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్( TLCA) దీపావళి వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించింది. న్యూయార్క్‌లోని క్రాన్సాఫ్ థియేటర్ వేదికగా తెలుగుదనం ఉట్టిపడేలా దీపావళి వేడుకలు కన్నుల పండగ్గా జరిగాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ పరిసర ప్రాంతాల నుంచి తెలుగు వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ- సినీ పాటలు, నృత్యాలు, ఫ్యాషన్ షో వంటి వైవిధ్య భరితమైన వినూత్న కార్యక్రమాలతో దీపావళి సంబరాలు అంబరాన్నాంటాయి. రకరకాల అంగడులు, కమ్మటి ఫలహారాలు, పిల్లల సందడులుతో ప్రాంగణం కళకళ లాడింది. వినోదం విజ్ఞానం మేళవించిన కార్యక్రమం అని పలువురు కొనియాడారు. TLCA సభ్యులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందజేశారు. TLCA చేస్తున్న పలు కార్యక్రమాలకు అండగా ఉంటూ సహాయసహాకారాలు అందిస్తున్న పలువురిని ఘనంగా సన్మానించారు. గత 10 ఏళ్లుగా మీడియా రంగంలో అందిస్తున్న సేవలను కొనియాడుతూ.. సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహబలుడు హనుమంతుడుని ఘనంగా సన్మానించి.. మెమొంటొలతో సత్కరించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన మెలోడీ బ్రహ్మ మణి శర్మ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ప్రేక్షకులని ఉర్రుతలూగించింది. మణిశర్మ తన ట్రూప్ తో కలిసి మ్యూజిక్‌తో అందరినీ ఎంటర్టైన్ చేశారు. సింగర్స్ వైష్ణవి, శృతిక, స్వరాగ్, పవన్ తదితరులు సూపర్ హిట్ పాటలు పాడి ఆడియన్స్‌లో జోష్ నింపారు. నటి స్పందన పల్లి ఫ్యాషన్ వాక్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. షాపింగ్ స్టాల్స్, Raffles బహుమతులు, మెహందీ, విందు భోజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దీపావళి వేడుకలు అసాంతం ఉత్సాహంగా సాగాయి. -
దీపావళి వేడుకలు.. అమెరికాలో స్కూళ్లకు సెలవు
అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కోసం అమెరికాలోని భారతీయులు భారీ వేడుకలను ప్లాన్ చేశారు. అమెరికా ప్రభుత్వం దీపావళిని పండుగగా గుర్తించి పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలోని ఎడిసన్‌లో దీపావళి ఫెస్టివల్ గ్రాండ్‌గా జరిగింది. పాపాయిని పార్క్‌లో ఎడిసన్ మేయర్ సామ్ జోషి ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి ఈ వేడకల్లో పాల్గొన్నారు. తెలుగు వైభవాన్ని ఘనంగా చాటుతూ ఈ వేడుకలు నిర్వహించారు. తెలుగు పాట,ఆట కనువిందు చేశాయి. తెలుగు సంస్క్రృతి, సంప్రదాయాలకు ఈ వేడుకలు అద్దం పట్టాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి తీసుకువచ్చారు. ఇక వేదికపై బతుకమ్మలను పెట్టి ఆడపడుచులు ఆడి పాడారు. పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఇక పలువురు కళాకారులు భారతీయ సంస్కృతిని చాటిచెప్పేలా ప్రదర్శనలు నిర్వహించారు. జే సీన్ స్ఫెషల్ మ్యూజికల్ ఫెర్మామెన్స్.. అహుతులను అలరించింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇక దీపావళి వేడుకల్లో ఇండియన్ ఫుడ్ స్టాల్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. షాపింగ్ స్టాల్స్, ఫుడ్ అండ్ రిటైల్ వెండర్స్ స్టాల్స్, కిడ్స్ జోన్, ఫైర్ వర్క్, Raffles బహుమతులు, విందు భోజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ఈ వేడుకల్లో పాల్గొనటం ఒక అద్భుతమైన అనుభవం అంటూ ప్రవాసులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న ఎడిసన్ మేయర్ సామ్ జోషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
హూస్టన్ మహానగరంలో ఘనంగా దిపావళి వేడుకలు
-
లండన్ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో దీపావళి వేడుకలు
లండన్: యూకేలో దీపావళి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ప్రముఖ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో లండన్ మేయర్ సాధిక్ ఖాన్ దీపావళి వేడుకలను నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకొనే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. యూకేలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ వేడకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. భారతీయ సాంప్రదాయ నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇక దీపావళి వేడుకల్లో ఇండియన్ ఫుడ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ వేడుకలకు హాజరైన పలువురు మాట్లాడుతూ.. మొదటిసారి దీపావళి వేడుకల్లో పాల్గొన్నామని, ఇదొ ఒక అద్భుతమైన అనుభవం అంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. That Mayor has a name, Sadiq Khan. https://t.co/U7jSV9PtG6 — Sushant Singh (@SushantSin) October 29, 2023 -
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఘనంగా దీపావళి వేడుకలు
కాన్సాస్: అమెరికా లోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (టీఏజీకేసీ) ఆధ్వర్యంలో స్థానిక బ్లూ వ్యాలీ నార్త్ హై స్కూలులో ఇటీవల దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 700 మంది తెలుగువారు పాల్గొన్నారు. ప్రార్థనా గీతంతో కార్యక్రమానికి విశేషు రేపల్లె, శ్రావణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మన తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించే కూచిపూడి, భరత నాట్యంతో పాటు జానపద నృత్యాలు అలరించాయి. కొత్త సినిమా పాటలకు చిన్నారుల నృత్యాలు, అభిగ్న పాటలు ప్రేక్షకులను ఉత్సాహపర్చాయి. టీఏజీకేసీకి సేవలు అందించిన శ్రీధర్ కొడాలి, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, శరత్ టేకులపల్లి, శ్రీధర్ అమిరెడ్డిలను టీఏజీకేసీ ఈ వేడుకలో ఘనంగా సత్కరించింది. టీఏజీకేసీ అధ్యక్షుడు వంశీ సువ్వారి, Trust chair దుర్గా తెల్ల గార్లను మెమొంటొలతో సత్కరించారు. Rafflesలో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. 30 మందితో నిర్వహించిన ఫ్యాషన్ షో, ‘కాన్సాస్ కిష్కింద కాండ’ హాస్య నాటిక హైలైట్‌గా నిలిచాయి. టీఏజీకేసీకి ఉపాధ్యక్షులు నరేంద్ర దుదెళ్ళ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చివరగా చక్కని తెలుగు విందు భోజనాన్ని ఆరగించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు స్పార్సర్స్తో పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ బోర్డు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. -
జాన్వీకపూర్ బాయ్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఫోటో వైరల్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ధడక్, గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ వంటి సినిమాలతో మెప్పించినా కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ స్టార్ హీరోయిన్ లిస్టులోకి ఇంకా వెళ్లలేదు జాన్వీ. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దివాళీ సెలబ్రేట్ చేసుకున్న జాన్వీ ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసింది. ఇందులో తన చిన్ననాటి స్నేహితుడు, బాయ్‌ఫ్రెండ్ అక్షత్ రాజన్‌తో జాన్వీ క్లోజ్‌గా దిగిన ఓ ఫోటో కూడా ఉంది. కొంతకాలం క్రితమే వీళ్లిదరు బ్రేకప్ చెప్పేసుకున్నారంటూ బీటౌన్‌లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీరిద్దరూ మళ్లీ కలిసి కనిపించడంతో ఈ ఫోటో నెట్టింట తెగ షికార్లు కొడుతుంది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే.. జాన్వీ త్వరలోనే 'మిలి' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. -
దీపాల వెలుగులు.. బాంబుల మోతలు (ఫోటోలు)
-
వాయు నాణ్యత వెరీ పూర్.. హైదరాబాద్‌ను కమ్మేసిన కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: దీపావళి బాణసంచా మోత ఆగింది. వాయు కాలుష్యంపై ప్రజల్లో బెంబేలు మొదలయ్యింది. పలు స్థాయిల్లో కాలుష్య స్థాయిలు పెరిగిపోవడమే ఇందుకు కారణం. రెండేళ్లుగా కోవి డ్ మహమ్మారి పరిస్థితుల కారణంగా అంతంతగానే టపాకాయలు కాల్చిన నగర ప్రజలు, కరోనా తగ్గుముఖంతో ఈ ఏడాది ఫుల్ జోష్‌తో పండుగ చేసుకున్నారు. సోమవారం సాయంత్రం మొదలుపెట్టి మంగళవారం తెల్లవారుజాము దాకా పటాకులు పేలాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ని పలు జిల్లాల్లో భారీయెత్తున బాంబులు, ఇతర టపాసుల్ని ప్రజలు కాల్చారు. దీని ప్రభావం వాతావరణంపై పడింది. హైదరాబాద్‌లోని 14 వాయు నాణ్యత పరీక్షా కేంద్రాల్లో చాలాచోట్ల కాలుష్య స్థాయిలు పెరిగినట్టు స్పష్టమౌతోంది. ముఖ్యంగా అత్యంత సూక్ష్మ స్థాయిల్లోని (2.5 మైక్రాన్ల కంటే తక్కువగా ఉంటే ధూళి, కాలుష్య కణాలు–పీఎం 2.5) కాలుష్యాలను బట్టి వాయు నాణ్యత సూచీని (ఏక్యూఐ–ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) లెక్కిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వర్గీకరణ ప్రకారం.. ఏక్యూఐ 400 పాయింట్లపైన ఉంటే వాయునాణ్యత తీవ్రమైన స్థాయిలో తగ్గినట్టుగా భావిస్తారు. ఇది ఆరోగ్యవంతులపై సైతం ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అన్నిచోట్లా అధికంగానే.. 24 గంటల సమయంలో పీఎం 2.5 కాలుష్యాలు 60 పాయింట్ల లోపు ఉండాల్సి ఉండగా మంగళవారం మధ్యాహ్నం 12కి సోమాజిగూడలో 105, హెచ్‌సీయూ, న్యూమలక్‌పేటలలో 99, హైదరాబా ద్ యూఎస్ కాన్సులేట్ వద్ద 92, జూపార్క్ వద్ద 91, కేపీహెచ్‌బీ ఫేజ్–2 వద్ద 84, కోకాపేట వద్ద 81 పాయింట్లు నమోదయ్యాయి. దీపావళి టపాసులతో వాయు నాణ్యతలో క్షీణత ఏ మేరకు జరిగిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక సోమవా రం రాత్రి 10 గంటల సమయంలో అయితే సనత్‌నగర్ స్టేషన్లో ఏక్యూఐ అత్యధికంగా 759కు చేరుకు ని క్రమంగా మంగళవారం ఉదయం 4 గంటలకు 298కు చేరుకుంది. అమీర్‌పేట, సోమాజిగూడ, గచ్చిబౌలి, జూబ్లీíహిల్స్, బంజారాహిల్స్, రామచంద్రాపురం ప్రాంతాల్లో సోమవారం రాత్రి 500 పాయింట్ల దాకా టచ్కాగా, రాత్రి 11 గంటల ప్రాంతంలో నాచారం స్టేషన్లో 446 పాయింట్లు రికార్డయింది. మంగళవారం సాయంత్రానికి చాలాచోట్ల మోస్తరు నుంచి తక్కువస్థాయిలో వాయునాణ్యత రికార్డయింది. కాగా, ఈ ఏడాది దీపావళి సందర్భంగా వాయు, శబ్ద కాలుష్యంపై పీసీబీ అధికారికంగా గణాంకాలు వెల్లడించాల్సి ఉంది. దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం పొగ, మంచు, ఇతర రూపాల్లోని కాలుష్యాలు పెరిగి వాయు నాణ్యత స్థాయి తగ్గడం గుండె, శ్వాసకోశ, మూత్రపిండాలు, కాలేయం, ఇతర దీర్ఘకాలిక జబ్బులు, సమస్యలున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పుటికీ వానాకాలం కొనసాగడం, చలి పెరగడం, దీపావళి కాలుష్యం తదితరాలతో గతంలోని అలర్జీలు తిరగబెట్టి తీవ్రమైన జబ్బులుగా మారుతున్నాయి. అప్పర్ రెస్పిరేటరీ సమస్యలు, ముక్కులు కారడం, తుమ్ములు, గొంతు పొడిబారడం, గొంతు నొప్పి, ఖఫం పడడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్లు పెరిగి అలర్జిటిక్ బ్రాంకైటిస్, స్వైన్‌ఫ్లూ వంటివి వస్తున్నాయి. అస్తమా ఉన్న వారు, పొగతాగే అలవాటు ఉన్న వారు, టీబీ వచ్చి తగ్గినవారిలో ఆరోగ్య సమస్యలు పెరిగి ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. – డా. వీవీ రమణప్రసాద్, కన్సల్టింగ్ పల్మనాలజిస్ట్, కిమ్స్ -
కెనడాలో ఘనంగా దివాలీ సంబరాలు
కెనడా టొరంటోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. పిల్లా పెద్దా అంతా ఆటపాటలు, టపాసులతో ఆనందోత్సాహాల మధ్య వేడుకను నిర్వహించుకున్నారు. ♦కెనడా టొరంటో నగరం లో 120 మంది వాలంటీర్లతో ,170 స్టేజ్ పర్ఫామెన్స్ తో 1500 మంది అతిథులతో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి పండుగను ఘనంగా జరిపారు. ♦ 14 రకాల ఐటమ్స్ తో అతిథులందరికీ అచ్చ తెలుగు విందు భోజనాలను ఆరగించారు. సుమారు ఏడు గంటల పాటు శాస్త్రీయ నృత్యాలు, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఒడియా భాష లో పాటలు డాన్సులు ఆహుతులకు కనువిందు చేశాయి. తర్వాత పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో బాణాసంచా కాల్చారు. ♦ టొరంటో సిటీ కౌన్సెలర్ గేరి క్రాఫోర్డ్ మరియు సతీమణి చీఫ్ గెస్ట్ గా పాల్గొని హాజరైన మెంబెర్స్ కి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇండియా కెనడా బంధం మరింత ముడి వేయించుకోవాలని ఆకాంక్షించారు. ♦ ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించిన బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ కార్యనిర్వాహక సభ్యులు జగపతి రాయల,సూర్య కొండేటి, ప్రతాప్ బొల్లవరం, విష్ణు వంగల, రమేష్ తుంపర, శ్రీకాంత్ బండ్లమూడి, రాజశేఖర్ రెడ్డి, మూర్తి వారణాసి, నరసింహారెడ్డి, సర్దార్ ఖాన్, రామ సుబ్బారెడ్డి. ఈకార్యక్రమానికి విజయవంతానికి మిషన్ అఫ్ మదర్ (Mission Of Mothers ( MOM) చాలా సహకరించారు. ♦ ఆర్గనైజర్ జగపతి రాయల మాట్లాడుతూ కెనడా చరిత్రలో ఇది అతిపెద్ద దీపావళి ఈవెంట్ ,ఇలాంటి మరిన్ని మనదైన పండుగలను జరుపుతూ కెనడాలోని తెలుగువారికి సంస్కృతి సంప్రదాయాలను కాపాడతామని చెప్పారు. దీనా రెడ్డి ముత్తుకూరు, రామ్ జిన్నల, శ్రీకాంత్ లింగమనేని, ఫణీన్ద్ర కుమార్ కొడాలి, భరత్ కుమార్ రెడ్డి, మినర్వా రెస్టారెంట్, హార్టుఫుల్ రిలాక్సేషన్ సౌజన్యం తో ఈ వేడుక ఘనంగా ముగిసినది. ఈ వేడుకను విజయంతంం చేసిన 120 మంది వాలంటీర్లు మరో ఆర్గనైజర్ సూర్య కొండేటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
పిల్లాడు ఏడుస్తుంటే ఫోటో పిచ్చేంటి.. బాలీవుడ్ జంటపై ఫ్యాన్స్ ఫైర్
బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ దీపావళి సందర్భంగా అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ ఈ బాలీవుడ్ జంట సంప్రదాయ దుస్తులు ధరించి ఫోటోకు ఫోజులిచ్చారు. అంతా బాగానే ఉన్నా ఆ ఫోటో దిగిన సందర్భాన్ని కొందరు ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. ఎందుకంటే అందులో వారిద్దరి కుమారుల్లో ఒకరు కిందపడి ఏడుస్తూ కనిపించారు. అయినప్పటికీ ఈ జంట అవేం పట్టించుకోకుండానే నవ్వుతూ ఫోటోకు ఫోజులిచ్చారు. దీంతో వీరిద్దరి వ్యవహారంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఏది ఏమైనా సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఆ విధంగా చేయకూడదన్నది కొందరి అభిమానుల వాదన. మరి కొందరేమో పండగ వేళ సంతోషంలో అలా చేసి ఉంటారని సమర్థిస్తున్నారు. మరీ చిన్న పిల్లాడు ఏడుస్తుంటే అంత ఫోటో పిచ్చి ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా చిన్నపిల్లలను అలా వదిలేసి మనం ఆనందంలో మునిగిపోవడం ఎంతవరకు సమంజసం అని సగటు అభిమాని మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by kareena kapoor 💕💖❤❤❤ (@kareena_kapoor_khan_fanpage) -
తారల దీపావళి తళుకులు.. నెట్టంట ఫొటోల సందడి
-
దీపావళి వేడుకల్లో అపశ్రుతి
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా దీపావళి వేడుకలు
-
నయన్ దంపతుల దీపావళి సర్ప్రైజ్.. కవల పిల్లలతో కలిసి..!
ఇటీవలే ఎక్కువగా వార్తల్లో నిలిచిన జంట ఎవరంటే ఠక్కున గుర్తిచ్చేది నయన్-విఘ్నేశ్ శివన్. ఎందుకంటే ఈ దంపతులకు ఇటీవలే కవలలు జన్మించడంతో హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనిపై తమిళనాడు ప్రభుత్వానికి వివరాలు సమర్పించడంతో వివాదం సద్దుమణిగింది. ట్విన్స్ జన్మించిన ఆనందంలో ఉన్న ఈ జంట తాజాగా దీపావళికి కవల పిల్లలతో కలిసి శుభాకాంక్షలు తెలిపింది. పిల్లలను ఎత్తుకుని ఉన్న ఓ వీడియోను విఘ్నేశ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అయితే పిల్లల ముఖాలను ఎక్కడా చూపించలేదు. సంప్రదాయ దుస్తులు ధరించిన నయన్ దంపతులు అందరికీ దివాళి విషెస్ తెలుపుతూ చాలా సంతోషంగా కనిపించారు. మొదటిసారి తల్లిదండ్రులైన సందర్భంగా ఎంతో ఆనందంగా ఫ్యాన్స్‌కు దివాళీ విషెస్ తెలిపారు. విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చాడు. 'మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అన్ని సందర్భాల్లోనూ మీరంతా సంతోషంగా ఉండాలి. మీ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిపై పోరాడండి. ప్రేమ మాత్రమే ఈ జీవితాన్ని ఆనందంగా మారుస్తుంది. ప్రేమలో విశ్వాసం, మంచితనం ఎల్లప్పుడూ ఉండాలి.' అంటూ పోస్ట్ చేశారు. చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఈ జంట జూన్ 9, 2022న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
టాలీవుడ్ ప్రిన్స్ దీపావళి సర్ప్రైజ్.. సితార అదిరిపోయే ఫర్మామెన్స్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు తన గారాల పట్టి సితార అంటే పిచ్చి ప్రేమ. తండ్రితో కలిసి సితార ఎప్పుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఎక్కడికెళ్లినా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్లు ఇస్తుంటారు. తాజాగా ఇవాళ దీపావళిని పురస్కరించుకుని చేసిన షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పటిలా కాకుండా కాస్త భిన్నంగా అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. దీపావళి సందర్భంగా సితార క్లాసికల్ డ్యాన్స్‌తో అదరగొట్టింది. దీనికి సంబంధిత ఆ వీడియోను పోస్ట్ చేస్తూ అభిమానులందరికీ విషెస్ తెలిపింది. తన గురువు మహతీ భిక్షుతో కలిసి నృత్యం చేయటం చాలా సంతోషంగా ఉందని సితార తెలిపింది. ఆ వీడియో చూసిన పలువురు నెటిజన్లు సితార డ్యాన్స్‌ను మెచ్చుకుంటున్నారు. తన కూతురు సితార డ్యాన్స్ చేసిన వీడియోను మహేశ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. (చదవండి: ఆ సినిమా బాహుబలి కంటే హిట్ అయ్యేది.. ఆర్జీవీ ట్వీట్ వైరల్) మహేశ్ బాబు తన ఇన్‌స్టాలో రాస్తూ..'నన్ను గర్వపడేలా చేయటంలో నువ్వు ఎప్పుడూ ఫెయిల్ కావు. ఈ ప్రదర్శన ఇలాగే కొనసాగించు చిట్టి తల్లి. నీకు నేర్పిన గురువులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ' అంటూ కితాబిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సితారకు ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
Diwali 2022: అరవిరిసిన కాంతులు.. పండుగ వేళ ఇంటిని ఇలా అలంకరించండి!
దీపపు కాంతులతో కూడిన పూల పరిమళాలు దీపావళి అందాన్ని పెంచి ఆనందం మిన్నంటేలా చేస్తాయి. పండుగరోజు ఇంటి అలంకరణలు చేయడం సాధారణమే కాని దానికి కొంచెం కళాత్మకత జోడిస్తే దీపావళి రోజు ఇల్లు గ్రాండ్ లుక్‌తో అదిరిపోతుంది. ఈ సరికొత్త అలంకరణ ఐడియాలపై ఒక లుక్... 1. దీపావళి అంటే తీపి లేకుండా జరగదు కదా! కుటుంబ సభ్యులందరూ కలసి తీపిని పంచుకునే డైనింగ్ టేబుల్ అలంకరణ ఇలా ఉంటే... 2. ఈ అలంకరణకు సమయం ఎక్కువే పట్టొచ్చు కాని మీ ఇంటి దీపావళిని ప్రత్యేకంగా మారుస్తుందనడంలో సందేహం లేదు. 3. చూడటానికి హాయిగా ఎంత బావుందో కదా! శ్రద్ధ తీసుకుని చేసే ఈమాత్రం చిన్న అలంకరణ చాలు ఇంటికి అద్భుతమైన అందం చేకూరడానికి! 4. వివిధ ఆకారాల్లో ఉండే వేలాడే దీపాలంకరణకు పూల సొబగులు అద్దితే కనులకు భలే విందు! 5. చూడటానికి ఎటువంటి హడావిడి లేకున్నా ప్రశాంతమైన భావనను కలిగించాలంటే అరటాకులలో దీపాలు పరిచి ఆహ్లాద దీపావళిని ఆహ్వానించండి. 6. కాదేదీ అలంకరణకు అనర్హం. ఇంట్లో పడున్న వాటితోనూ అందం తేవొచ్చు. గోడ మీద బొమ్మను చిత్రించి చిన్న వెదురు తట్టల్లో దీపాలు పెట్టి ఇంట్లో ఉన్న నిచ్చెనకి పూల అలంకరణలు చేస్తే చాలు.. -
ఆ సినిమా బాహుబలి కంటే హిట్ అయ్యేది.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా అందరి కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. ఏ కామెంట్ చేసినా ఎవరూ ఊహించని విధంగా కొత్తదనం కనిపిస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆర్జీవీ చేసిన ఓ ట్వీట్ తెగ వైరలవుతోంది. నిన్న ప్రభాస్ జన్మదినం సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ చేసి రచ్చపై స్పందించారు. బిల్లా రీ రిలీజ్ సందర్భంగా థియేటర్లోనే అభిమానులు బాణాసంచా కాల్చడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్జీవీ ఆ విషయంపై స్పందిస్తూ ప్రభాస్ అభిమానుల పిచ్చి అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: అది దీపావళి కాదు.. ప్రభాస్ అభిమానుల పిచ్చి.. ఆర్జీవీ ట్వీట్ వైరల్) తాజాగా ఇవాళ దీపావళి సందర్భంగా చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ ఇప్పడు రీ రిలీజ్ చేసి ఉంటే బాహుబలి కంటే పెద్ద హిట్ అయ్యేదంటూ పోస్ట్ చేశారు. ఏది ఏమైనా ఆర్జీవీ పోస్ట్ చేశాడంటే అది వైరల్ కావడం ఖాయం. దీపావళిని పురస్కరించుకుని అందరూ బాగుండాలని తనదైన శైలిలో వరుస ట్వీట్లు చేశారు. Hey #Prabhas May GOD re release Radhe Shyam and this time it becomes a bigger hit than BAHUBALI #HappyDiwali — Ram Gopal Varma (@RGVzoomin) October 24, 2022 -
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఘోస్ట్ పోస్టర్ విడుదల
కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీని దర్శకత్వం వహిస్తుండగా సందేశ్ నాగరాజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఘోస్ట్ చిత్ర బృందం కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. గాల్లోకి ఎగురుతున్న బుల్లెట్ల మధ్య గన్ పట్టుకున్న శివరాజ్ కుమార్, వెనక ఫైర్, స్మోక్ ఎఫెక్ట్ బ్యాక్ డ్రాప్ లో పోస్టర్ ఆకట్టుకుంటోంది. భారీ వేడుకతో ప్రారంభమైన ఘోస్ట్ ప్రస్తుతం రూ 6 కోట్ల వ్యయంతో భారీగా వేసిన జైల్ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. -
దీపావళి దగదగలు.. బాలీవుడ్ భామల మెరుపులు
దీపావళి వెలుగుల్లో తారలు మరింత వెలిగిపోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్ ఇచ్చిన దీపావళి పార్టీ వేడుకలో పలువురు బీ టౌన్ తారలు తళుక్కుమన్నారు. తన భార్య పత్రలేఖతో కలిసి పార్టీకి హాజరయ్యారు రాజ్‌కుమార్‌రావు. అలాగే తనకు కాబోయే భర్త జాకీ భగ్నానీతో కలిసి పార్టీలో సందడి చేశారు హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్. ఇంకా రేఖాకపూర్, దర్శకుడు అమర్ కౌశిక్, సుహానా ఖాన్, కరణ్ డియోల్, అనన్యా పాండే, శిల్పాశెట్టి, ఆర్యన్ ఖాన్ ఈ దీపావళి వేడుకలో సందడి చేశారు. అలాగే నిర్మాత ఏక్తా కపూర్ దీపావళిని సెలబ్రేట్ చేశారు. ఈ పార్టీకి కూడా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై పాపులర్ సాంగ్స్‌కు డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేశారు. కథానాయికలు హన్సిక, ఆదితీరావు హైదరీల దీపావళి సెలబ్రేషన్స్ కూడా షురూ అయ్యాయి. మరికొంత మంది తారలు దీపావళిని కుటుంబంతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేశారు. -
ఇక వాణిజ్యప్రయోగాలే
సూళ్లూరుపేట: ఎల్వీఎం3–ఎం2 ప్రయోగం విజయంతో ఇస్రోకు ఒక రోజు ముందుగానే దీపావళి పండగ వచ్చిందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. ప్రయోగానంతరం ఆదివారం తెల్లవారుజామున ఆయన మీడియాతో మాట్లాడారు. న్యూ స్పేస్ ఇండియా, వన్‌వెబ్ సహకారంతో ఆదివారం ఎల్వీఎం3–ఎం2 ద్వారా ప్రయోగించిన 36 యూకేకి చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగామని తెలిపారు. క్రయోజనిక్ దశలో 36 ఉపగ్రహాలను ఒకేసారి కాకుండా నాలుగు దిశల్లో నాలుగేసి ఉపగ్రహాలు చొప్పున కక్ష్యలోకి విడిపోయేలా ఈ ప్రయోగంలో కొన్ని కీలకమైన సైంటిఫిక్ పరికరాలతో రూపొందించామని చెప్పారు. ఈ ప్రయోగంలో ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరడం కీలకం కావడంతో 36 ఉపగ్రహాలు విడిపోవడానికి 1.30 గంటల సమయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రయోగంతో ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది కస్టమర్లు రావడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. వన్‌వెబ్ కంపెనీతో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఒప్పందం మేరకు మరో 36 ఉపగ్రహాలను, మళ్లీ ఇంకో 36 ఉపగ్రహాలను ఇదే తరహాలోనే ప్రయోగిస్తామని తెలిపారు. ఇస్రో విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. వాణిజ్య ప్రయోగాలే లక్ష్యం ఇకపై వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడమే లక్ష్యమని న్యూ స్పేస్ ఇండియా సీఎండీ రాధాకృష్ణన్ అన్నారు. దీన్ని చరిత్రాత్మక ప్రయోగంగా వన్‌వెబ్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అభివర్ణించారు. ఇప్పటికే 648 ఉపగ్రహాలను వివి«ధ దేశాల నుంచి ప్రయోగించామని గుర్తు చేశారు. ఇది కొత్త అధ్యాయానికి శ్రీకారమని పవన్ గోయెంకా (వన్‌వెబ్ కంపెనీ) చెప్పారు. ‘‘36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా పంపడం కూడా అద్భుతం. వాణిజ్యపరంగా ఇస్రో మరో అడుగు ముందుకేయడం శుభ పరిణామం’’ అని ఆయన చెప్పారు. -
‘ఏం భయం లేదు మేమున్నాం.. దీపావళి సంతోషంగా జరుపుకోండి’
శ్రీనగర్: యావత్ భారత దేశం దీపావళి వేడుకలకు సిద్ధమైంది. ధంతేరాస్‌లో భాగంగా శనివారం నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ జవాన్లు దీపాలు వెలిగించి, బాణసంచా పేల్చుతూ వేడుకలు నిర్వహించారు. దేశ ప్రజలకు దివాళీ శుభాకాంక్షలు తెలిపారు. నియంత్రణ రేఖ సహా సరిహద్దు ప్రాంతాల్లో దీపావళి జరుపుకొన్నారు. అంతా మంచే జరుగుతుందని ప్రజల్లో ధైర్యం నింపారు. సరిహద్దుల వద్ద తాము అప్రమత్తంగా ఉన్నామని, ఎలాంటి చింత లేకుండా కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు. ‘దేశ ప్రజలు ఎలాంటి చితలేకుండా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకోవాలని చెప్పాలనుకుంటున్నా. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు, సరిహద్దుల్లో మన జవాన్లు అప్రమత్తంగా, నిరంతరం నిఘా వేస్తూ ఉన్నారని భరోసా ఇస్తున్నాం.’ అని కలెనల్ ఇక్బాల్ సింగ్ తెలిపారు. ధంతేరాస్ సందర్భంగా లక్ష్మి పూజ నిర్వహించి.. లక్ష్మీగణపతి హారతి పాటలు పాడారు సైనికులు. సైనికులతో మోదీ దీపావళి వేడుకలు.. ఈ దీపావళి వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత ఆర్మీ సైనికులతో కలిసి జరుపుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే జవాన్లతో దీపావళి వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఏ ప్రాంతానికి వెళ్తారనేది గోప్యంగా ఉంచారు. గత ఏడాది జమ్ముకశ్మీర్‌లోని నౌషేరాలో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. Jammu and Kashmir | Indian Army soldiers posted along the Line of Control (LoC) in the Akhnoor sector burst crackers & lit earthen lamps as #Diwali festivities began with Dhanteras yesterday pic.twitter.com/ekmaKMJiJr — ANI (@ANI) October 22, 2022 ఇదీ చదవండి: Dhanteras 2022: చీపురు సహా, వీటిని కొనుగోలు చేస్తే..లక్ష్మీ కటాక్షం! -
రాజ్‌భవన్‌లో దీపావళి సంబురాలు రేపు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పర్వదినం సందర్భంగా ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్ దర్బార్ హాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సామాన్య ప్రజానీకంతో పాటు వివిధ రంగాల ప్రముఖులను కలుసుకుని దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ఇదీ చదవండి: మునుగోడులో పోస్టర్ వార్ -
అయోధ్యలో 18 లక్షల ప్రమిదలతో దీపోత్సవం
అయోధ్య: అయోధ్యలో ఆదివారం జరిగే దీపోత్సవ్‌లో 18 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించనున్నారు. దీపావళి ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. సరయు నది ఒడ్డున రామ్ కి పైడి వద్ద 22 వేల మంది వలంటీర్లు 15 లక్షలకు పైగా ప్రమిదలను వెలిగిస్తారని అయోధ్య డివిజనల్ కమిషనర్ నవ్‌దీప్ రిన్వా చెప్పారు. మిగతా ప్రమిదలను ప్రముఖ కూడళ్లు, ప్రాంతాల్లో వెలిగిస్తారన్నారు. లేజర్ షో, త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో ఉంటాయన్నారు. బాణాసంచా కాలుస్తారని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన కళాకారులు రామ్‌లీలా ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఆదివారం అయోధ్యను సందర్శించనున్న ప్రధాని మోదీ రామాలయంలో పూజలు చేస్తారని ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. శ్రీరామునికి లాంఛనప్రాయ పట్టాభిషేకం చేస్తారని పేర్కొంది. సరయు తీరంలో హారతిలో పాల్గొంటారని, దీపోత్సవ్ను ప్రారంభిస్తారని పీఎంవో వెల్లడించింది. చదవండి: గుంతల రోడ్డు.. బురద నీటిలో స్నానం చేసి గ్రామస్థుల నిరసన -
మహారాష్ట్రలో మరో ‘మహా’కూటమి?.. ఉద్ధవ్‌కు చెక్ పెట్టేందుకు పావులు
సాక్షి ముంబై: శివాజీపార్క్ సాక్షిగా మరో మహాకూటమి అవిర్భవించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) దీపావళిని పురస్కరించుకుని శివాజీపార్క్‌లో శుక్రవారం రాత్రి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు హాజరయ్యారు. దీంతో రాబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతోపాటు ఇతర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శిందే వర్గం, బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల మహాకూటమి ఏర్పడే అవకాశాలున్నాయన్న రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గణేశ్ ఉత్సవాల సందర్భంగా రాజ్ ఠాక్రే కూడా వారి ఇంటికి వెళ్లి గణేశుడిని దర్శించుకోవడం ఆ సందర్భంగా బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను బట్టి.. రాబోయే రాష్ట్రంలో కొత్తగా మహాకూటమికి శివాజీపార్క్‌లో బీజం పడిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏక్నాథ్ శిందేతోపాటు 40 మంది శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు అనంతరం ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయాలు తారుమారైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేయగా మరోవైపు బీజేపీ మద్దతులో ఏక్నాథ్ శిందే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ రాజకీయ పరిణామాల అనంతరం రాష్ట్ర రాజకీయాలలో ఒకరకమైన ఉత్పాతం సంభవించదని చెప్పొచ్చు. అనంతరం ఎన్నికల కమిషన్ శివసేన పార్టీ, చిహ్నాన్ని రెండింటినీ తాత్కాలికంగా సీజ్ చేయడం ఆ తర్వాత ఉద్దవ్‌ఠాక్రేకు శివసేన ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే పారీ్టగా, ఏక్నాథ్ శిందే వర్గానికి బాలాసాహెబాంచి శివసేన పార్టీగా ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఉద్దవ్ ఠాక్రే వర్గానికి మండుతున్న కాగడా (మశాల్), శిందే వర్గానికి కత్తులు డాలు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. దీనిపైనే పోటీ పడనున్నాయి. అయితే రాబోయే బీఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ, శిందే వర్గం నేతలు రాజ్ ఠాక్రేతో పొత్తు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. చదవండి: బెంగాల్‌ను విడదీసేందుకు బీజేపీ కుట్రలు.. టీఎంసీ ఎంపీ ఫైర్ ఈ విషయంపై పలుమార్లు బీజేపీ నాయకులు కూడా పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో రాజ్ ఠాక్రే ఆహా్వనం మేరకు ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్‌లు ఎమ్మెన్నెస్ దీపోత్సవానికి హాజరుకావడంతో పలు రకాల చర్చలకు ఊతం వచ్చేలా చేసింది. ముఖ్యంగా శివాజీపార్క్‌లో జరిగిన ఎమ్మెన్నెస్ దీపోత్సవ కార్యక్రమంలో శిందే, బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల మహాకూటమికి బీజం పడిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మాత్రం అధికారికంగా ఎవరూ వెల్లడించడం లేదు. ఎప్పట్నుంచో కలవాలనుకున్నాను:సీఎం ఏక్నాథ్ శిందే ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఎప్పట్నుంచో కలవాలని ఉన్నప్పటికీ రాజకీయాల్లో తీరికలేని పరిస్థితుల దృష్ట్యా ఇప్పటివరకు కలవలేకపోయానని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే పేర్కొన్నారు. ముఖ్యంగా గత పదేళ్లుగా ఎమ్మెన్నెస్ దీపోత్సవాలను నిర్వహిస్తోంది. గత రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా అనేక నిర్బంధాలున్నాయి. అయితే ఈసారి మాత్రం మహమ్మారి తగ్గిపోవడంతో గణేశ్ ఉత్సవాలు, దసరా నవరాత్రోత్సవాలతోపాటు దీపావళి ఉత్సవాలను కూడా ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. గతంలో మనసులో కలవాలన్న కోరిక ఉన్నప్పటికీ కలువలేకపోయాను. కానీ ఇప్పుడు దీపోత్సవం సందర్భంగా ఇలా కలిసేందుకు అవకాశం లభించిందన్నారు. -
Diwali 2022: టపాసులు కాల్చే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సాక్షి,హైదరాబాద్: దీపావళి అంటేనే వెలుగుల పండుగ.. అమావాస్య చీకట్లను చీల్చుతూ ఎటుచూసినా దీపాల సొబగులే.. అంబరాన్నంటే సంబరాలే.. బంధువుల రాకపోకలు... అతిథి మర్యాదలు... టపాసుల మోతలు ఇలా దీపావళి పండుగ అంతా సందడిగానే ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగ ఇది. అలాంటి దీపావళి పండుగలో ఆనందం ఎంత ఉంటుందో ప్రమాదం కూడా అంతే ఉంటుందని ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. లక్ష్మీదేవి ఆరాధన.. దీపావళి రోజు ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి పూజను నిర్వహిస్తారు. ఇంట్లో ఉన్న బంగారం, నగదును అమ్మవారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. చీకట్లను పారద్రోలే విధంగా దీపాలను వెలిగించి పూజ చేస్తారు. దీపారాధన అనేది ఈ పండుగలో ప్రత్యేకమైనది. ఇంట్లో దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని అందరి నమ్మకం. లక్ష్మీదేవి దీప జ్యోతిగా సంపద దైవంగా భావిస్తుండటంతో అందరు దీపావళి రోజు దీపాలను వెలిగిస్తారు. మార్కెట్లో రకరకాల డిజైన్లు.. మార్కెట్లో వివిధ రకాల డిజైన్లతో కూడిన ప్రమిదలు లభిస్తున్నాయి. స్టీల్, ప్లాస్టిక్, మట్టికి సంబంధించి దీపాలు, ప్రమిదలు వివిధ డిజైన్లలో మార్కెట్లో దండిగా లభిస్తున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలకు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి. అదేవిధంగా ఈ పండుగకు కావాల్సిన వస్తువులు ఆన్లైన్లో తక్కువ రేటు ఉండటంతో చాలామంది ఆన్లైన్ ద్వారా తెíప్పించుకుంటున్నారు. మరికొందరు దుకాణాలకు నేరుగా వెళ్లి తెచ్చుకుంటున్నారు. దీంతో మార్కెట్లు సందడిగా మారాయి. జాగ్రత్తలు తప్పనిసరి.. దీపావళి పండుగలో ఆనందం ఎంత ఉంటుందో ప్రమాదం కూడా అంటే ఉంటుంది. బాణా సంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపకశాఖ, పోలీసులు, వైధ్యాధికారులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చు. ► టపాసులను ఆరుబయటనే కాల్చాలి. ఇంట్లో కాల్చొద్దు. ► ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు ఉన్న ప్రాంతాల్లో టపాసులు పేల్చొద్దు. ► టపాసులు కాల్చే ముందు విధిగా పాదరక్షలు ధరించాలి, అందుబాటులో నీళ్లు ఉంచుకోవాలి. గాయాలు అయితే వెంటనే సమీపంలో ఉన్న వైద్యులను సంప్రదించాలి. ► టపాసులు కాల్చేటప్పుడు చిన్నారులను ఒంటరిగా వదిలిపెటొద్దు. పెద్దల సమక్షంలోనే పిల్లలు టపాసులు కాల్చాలి. సరిగ్గా కాలని బాణసంచాపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ► టీషర్టులు, జీన్స్లాంటి దుస్తులు కాకుండా వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి, కళ్లకు హాని కలగకుండా అద్దాలు వాడాలి. ► అగ్నిమాపక శాఖ వద్ద లైసెన్సులు పొందిన దుకాణాల్లోనే బాణసంచా కొనుగోలు చేయాలి. ► పర్యావరణ హితమైన పదార్థాలతో తయారు చేసిన గ్రీన్ కాకర్స్ ఉపయోగిస్తే మంచిది. అప్రమత్తంగా ఉండాలి టపాసుల కాల్చేటప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలో బాణా సంచా కాల్చాలి. టపాసులు విక్రయించే వారు విధిగా అనుమతులు తీసుకోవాలి. దుకాణాల వద్ద ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలి. – రమేష్‌గౌడ్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, షాద్‌నగర్ అగ్నిమాపక కేంద్రం -
లైగర్ బ్యూటీ ప్రేమలో పడిందా.. ఆ స్టార్ హీరోతోనేనా?
బాలీవుడ్ నటి, లైగర్ బ్యూటీ అనన్య పాండేపై గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఆమె మరో నటుడితో డేటింగ్లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ నటుడితో ఆమె ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ పార్టీలో అతనితో కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. 'ఆషికీ-2’తో యువతకు చేరువైన నటుడు ఆదిత్య రాయ్ కపూర్. ఈ సినిమా తర్వాత ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆయన గత కొంతకాలంగా నటి అనన్య పాండేతో ఎక్కువగా కనిపిస్తున్నారు. గతంలో కృతిసనన్ ఏర్పాటు చేసిన దీపావళి పార్టీలో వీరిద్దరు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అప్పటి నుంచి అభిమానులు దృష్టంతా వీరిద్దరిపైనే పడింది. గత రాత్రి బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దీపావళి బాష్‌ను గ్రాండ్‌గా నిర్వహించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్ చేయగా.. వారిద్దరు మాట్లాడుకుంటూ కనిపించారు. దీంతో అభిమానులు అనన్య - ఆదిత్య ప్రేమలో ఉన్నారా?’ అని మరోసారి చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న అనన్య.. ఆదిత్య అంటే తనకు ఇష్టమని చెప్పింది ఈ బాలీవుడ్ భామ. దీనిపై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. -
'దీపావళికి మాస్ మహారాజా సర్ప్రైజ్.. ధమాకా టీజర్ రిలీజ్
మాస్ మహరాజా రవితేజ లేటేస్ట్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న 'ధమాకా' టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. దీపావళి కానుకగా రవితేజ్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ విడుదలైన టీజర్‌ను చూస్తే రవితేజ మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్‌ను చూస్తే..' నేను మీలో విలన్ని చూస్తే.. మీరు నాలో హీరోని చూస్తారు' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. చివర్లో రవితేజ డైలాగ్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. 'అటు నుంచి ఒక బుల్లెట్ వస్తే.. ఇటు నుంచి దీపావళే' వార్నింగ్ ఇవ్వడం రవితేజ మాస్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. జయరాం, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, రావు రమేశ్, ఆలీ ఈ చిత్రంలో లకపాత్రలు పోషించారు. -
కుటుంబ సమేతంగా చూడాల్సిన అత్యుత్తమ టాప్ బాలీవుడ్ చిత్రాలివే..!
దీపావళికి మీరు ఏ సినిమాకు వెళ్లాలనుకుంటున్నారు? మీ కుటుంబంతో ఈ దివాళీని ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు? మీకు ఏ సినిమాకెళ్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? సినిమా ఎంపిక కోసం తర్జనభర్జనకు గురవుతున్నారా? అలాంటి ఆలోచనలకు ఇక చెక్ పెట్టండి. మీకోసం ఈ దీపావళికి చూడాల్సిన 34 ఉత్తమ బాలీవుడ్ సినిమాల పేర్లను అందిస్తున్నాం. అందులో మీకు నచ్చిన మూవీకి కుటుంబసమేతంగా వెళ్లి ఈ పండుగను ఆనందంగా ఆస్వాదించండి. బాలీవుడ్లో ఎవర్గ్రీన్ సినిమాలేంటో ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ జాబితాలో కామెడీ, ఫ్యామిలీ, డ్రామా లాంటి అన్ని చిత్రాలను అందిస్తున్నాం. మరేందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి. అత్యుత్తమ బాలీవుడ్ సినిమాల జాబితా: 1.కభీ ఖుషీ కభీ ఘమ్ (2001) నటీనటులు: షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, జయా బచ్చన్, కాజోల్ లాంటి అగ్రతారలు నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. కుటుంబసమేతంగా చూడాల్సిన సినిమా ఇది. 2. త్రీ ఇడియట్స్ (2009) శర్మన్ జోషి, అమీర్ ఖాన్, బోమన్ ఇరానీ, ఆర్.మాధవన్, కరీనా కపూర్, ఓమి వైద్య, మోనా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓటీటీ ఫ్లామ్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ఓ కళాశాల విద్యార్థి పోరాటాలు, జీవితంలో సరైన వృత్తిని ఎంచుకోవడానికి ప్రయత్నాలను చక్కగా చిత్రీకరించారు. 3. భేజా ఫ్రై (2007) సారిక, వినయ్ పాఠక్, మిలింద్ సోమన్, రజత్ కపూర్, రణవీర్ షోరే నటించిన ఈ చిత్రం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. ఈ దీపావళికి మీరు మీ కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకోవాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. ఈ చిత్రానికి సాగర్ బళ్లారి దర్శకత్వం వహించారు. 4. మొహబ్బతీన్ (2000) షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఉదయ్ చోప్రా నటించిన ఈ మూవీ బాలీవుడ్లో ఆల్ టైమ్ ఫ్యామిలీ మూవీస్‌లో ఒకటి. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకు ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించారు. ముగ్గుర విద్యార్థుల ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెకించారు. 5. పా (2009) పా మూవీ ఉత్తమ కుటుంబ చిత్రాలలో ఒకటి. విద్యాబాలన్, అమితాబ్ బచ్చన్, అరుంధతి నాగ్, అభిషేక్ బచ్చన్, పరేష్ రావల్ లాంటి అగ్రతారలు ఈ సినిమాలో నటించారు. కుటుంబసమేతంగా చూడాల్సిన చిత్రాల్లో ఇది ఒకటి. ఈ సినిమాకు ఆర్.బాల్కీ దర్శకత్వం వహించారు. 6.హమ్ ఆప్కే హై కౌన్..! (1994) 1994 లో వచ్చిన క్లాసిక్ మూవీ నదియా కే పార్ (1982)కి రీమేక్ ఈ చిత్రం. దేశంలో 1 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన మొదటి సినిమా ఇదే. ఇది అత్యంత భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ఒకటి. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. అలోక్ నాథ్, మాధురీ దీక్షిత్, మోహ్నీష్ బహ్ల్, రేణుకా షహానే, సల్మాన్ ఖాన్, అనుపమ్ ఖేర్, రీమా లాగూ, దిలీప్ జోషి, సతీష్ షా ప్రధాన పాత్రల్లో నటించారు. సూరజ్ బర్జాత్యా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ అందుబాటులో ఉంది. 7. చుప్కే చుప్కే (1975) 1970ల్లో వచ్చిన బాలీవుడ్ చిత్రాల్లో కచ్చితంగా చూడాల్సిన సినిమా. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం మిమ్మల్ని బాగా నవ్విస్తుంది. షర్మిలా ఠాగూర్, ధర్మేంద్ర, అస్రానీ, అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ఉషా కిరణ్, ఓం ప్రకాష్, డేవిడ్ అబ్రహం చెల్కర్, లిల్లీ చక్రవర్తి ఈ సినిమాలో నటించారు. హృషికేష్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. 8. రంగీలా (1995) ప్రముఖ బాలీవుడ్ నటి కావాలని కలలు కనే అమ్మాయి నేపథ్యంలో తెరకెక్కింది ఈ చిత్రం. ఈ సినిమా మ్యూజిక్ ట్రాక్ చాలా బాగుంటుంది. ఎ.ఆర్. రెహమాన్ ఒరిజినల్ స్కోర్‌తో పాటు సౌండ్‌ట్రాక్‌తో వచ్చిన తొలి హిందీ సినిమా. అమీర్ ఖాన్, ఊర్మిళ మటోండ్కర్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. 9. ఖయామత్ సే ఖయామత్ తక్ (1988) అమీర్ ఖాన్, జూహీ చావ్లా, దలీప్ తాహిల్, అలోక్ నాథ్ నటించిన ఆల్ టైమ్ అత్యుత్తమ బాలీవుడ్ రొమాంటిక్ చిత్రాల్లో ఇదీ ఒకటి. ఈ సినిమాకు ఆనంద్-మిలింద్ స్వరాలు సమకూర్చారు. 1980ల్లో అత్యధికంగా అమ్ముడైన బాలీవుడ్ సౌండ్‌ట్రాక్ ఆల్బమ్‌లలో ఒకటిగా నిలిచింది ఈ చిత్రం. మన్సూర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. 10. ఆనంద్ (1971) 1971లో విడుదలైన ఈ చిత్రంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పటివరకు తీసిన ఉత్తమ బాలీవుడ్ కుటుంబ చిత్రాలలో ఒకటి. అమితాబ్ బచ్చన్, రమేష్ డియో, రాజేష్ ఖన్నా, సుమితా సన్యాల్ నటించిన ఈ సినిమాకు హృషికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. 11. మైన్ మేరీ పత్నీ... ఔర్ వో! (2005) మైన్ మేరీ పత్నీ...ఔర్ వో! చిత్రంలో ఓ మధురమైన ప్రేమకథను చూపించారు. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలను చక్కగా తెరకెక్కించారు. ప్రతి సీన్లో భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఈ పండుగ సీజన్లో కచ్చితంగా చూడాల్సిన సినిమాల్లో ఒకటి. వరుణ్ బడోలా, రాజ్‌పాల్ యాదవ్, రితుపర్ణ సేన్‌గుప్తా, కే కే మీనన్ నటించిన ఈ చిత్రానికి చందన్ అరోరా దర్శకత్వం వహించారు. 12. రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్ (2009) మీకు కామెడీ, డ్రామా కావాలనుకుంటే రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్ చూడాల్సిందే. రణ్‌బీర్ కపూర్, ప్రేమ్ చోప్రా, గౌహర్ ఖాన్, మనీష్ చౌదరి, షాజాన్ పదమ్సీ, డి.సంతోష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి షిమిత్ అమీన్ దర్శకత్వం వహించారు. 13. చలో ఢిల్లీ (2011) ప్రముఖ ఇన్వెస్టర్ ఢిల్లీ ఫ్లైట్ మిస్ కావడంతో ఆమె జీవితం ఎలా మారిపోయిందో ఈ చిత్రంలో చూపించారు. ఇది ఉత్తమ బాలీవుడ్ కుటుంబ కథాచిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అక్షయ్ కుమార్, లారా దత్తా, మహికా శర్మ, వినయ్ పాఠక్ ప్రధాన పాత్రల్లో నటించారు. 14. దిల్ తో పాగల్ హై (1997) షారుఖ్ ఖాన్, కరిష్మా కపూర్, మాధురి దీక్షిత్ నటించిన ఈ చిత్రం అలనాటి బాలీవుడ్ ఉత్తమ కుటుంబ చిత్రాల్లో ఒకటి. ట్రై యాంగిల్ లవ్‌స్టోరీని ఈ సినిమాలో చూడొచ్చు. షారుఖ్ ఖాన్, కరిష్మా కపూర్, మాధురీ దీక్షిత్, అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రాన్ని యష్ చోప్రా తెరకెక్కించారు. 15. తేరే బిన్ లాడెన్ (2010) ఉత్తమ వ్యంగ్య హాస్య చిత్రాల్లో ఇది ఒకటి. అమెరికాకు వెళ్లాలనుకున్న ఓ రిపోర్టర్ కథే తేరే బిన్ లాడెన్. ఈ సినిమా కుటుంబ సభ్యులతో కలిసి చూడొచ్చు. సుగంధ గార్గ్, ప్రధుమాన్ సింగ్, అలీ జాఫర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకత్వం వహించారు. 16. బంటీ ఔర్ బబ్లీ (2005) ఇద్దరు వ్యక్తులు వారి కలను సాకారం చేసుకోవడానికి చాలా కష్టాలను ఎదుర్కొంటారు. దానికోసం వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నారో చక్కగా చూపించారు. కామెడీ జోనర్లోని ఉత్తమ బాలీవుడ్ ఫ్యామిలీ సినిమాల్లో ఇది ఒకటి. అమితాబ్ బచ్చన్, రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్ నటించిన మూవీని షాద్ అలీ తెరకెక్కించారు. 17. దృశ్యం (2015) ఈ చిత్రం ఆద్యంతం చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది. సస్పెన్స్, ట్విస్ట్‌లతో కథను చక్కగా తెరకెక్కించారు. ఒక నేరం నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి అతను తీసుకునే నిర్ణయాల ఆధారంగా కథాంశమే ఈ చిత్రం. శ్రియా శరణ్, మృణాల్ జాదవ్, అజయ్ దేవగన్, రజత్ కపూర్, టబు, ఇషితా దత్తా, రిషబ్ చద్దా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. 18. దంగల్ (2016) రెజ్లింగ్ క్రీడ చుట్టూ తిరిగే కదే దంగల్. రెజ్లింగ్ క్రీడాకారుడైన మహావీర్ సింగ్ ఫోగట్ తన కుమార్తెలకు శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు తీలుకొచ్చేలా కృషి చేస్తారు. ఉత్తమ భారతీయ క్రీడా చిత్రాలలో ఒకటి. అమీర్ ఖాన్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, సాక్షి తన్వర్, జైరా వాసిం నటించిన ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూసేయొచ్చు. నితేష్ తివారీ ఈ సినిమాను తెరకెక్కించారు. 19. జానే భీ దో యారో (1983) 1983లో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి గాను కుందన్ షాకు 1984లో ఉత్తమ తొలి దర్శకుడిగా ఇందిరా గాంధీ అవార్డు లభించింది. భక్తి బార్వే, నసీరుద్దీన్ షా, ఓం పురి, రవి బస్వానీ, నీనా గుప్తా, సతీష్ షా, సతీష్ కౌశిక్, పంకజ్ కపూర్, అశోక్ బంతియా ప్రధాన పాత్రల్లో నటించగా.. కుందన్ షా దర్శకత్వం వహించారు. 20. ది లంచ్‌బాక్స్ (2013) ఇర్ఫాన్ ఖాన్ ఉత్తమ రచనల్లో ఇది ఒకటి. ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భారతీ అచ్రేకర్, ఇర్ఫాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, నిమ్రత్ కౌర్, నకుల్ వైద్ నటించిన ఈ సినిమాకు రితేష్ బత్రా తెరకెక్కించారు. 21. స్టాన్లీ కా డబ్బా (2011) కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మీ హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. ఈ సినిమాలో నటనకు పార్థో గుప్తేకు 2012లో జాతీయ అవార్డును వరించింది. దివ్య జగ్దాలే, దివ్య దత్తా, అమోల్ గుప్తే, పార్థో గుప్తే, రాజ్ జుత్షి ప్రధాన పాత్రల్లో నటించగా.. అమోల్ గుప్తా దర్శకత్వం వహించారు. హులులో ఈ చిత్రం అందుబాటులో ఉంది. 22. దో దూని చార్ (2010) ఈ ఫ్యామిలీ కామెడీ సినిమాలో కొత్త కారు కొనడానికి మధ్యతరగతి కుటుంబం పడుతున్న కష్టాలను అద్భుతంగా చూపించారు. రిషి కపూర్, నీతూ సింగ్ నటించిన ఈ చిత్రం ఆల్ టైమ్ అత్యుత్తమ బాలీవుడ్ సినిమాల్లో ఒకటి. ఈ చిత్రానికి 'హిందీలో ఉత్తమ చలనచిత్రం' విభాగంలో జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. హబీబ్ ఫైసల్ తెరకెక్కించిన ఈ మూవీ.. నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 23. అంఖోన్ దేఖి (2014) 2014లో వచ్చిన ఈ చిత్రం ఫిలింఫేర్ అవార్డ్స్, స్క్రీన్ అవార్డులను అంఖోన్ దేఖి గెలుచుకుంది. రజత్ కపూర్, సంజయ్ మిశ్రా, బ్రిజేంద్ర కాలా, సీమా పహ్వా నటించిన ఈ సినిమాకు.. రజత్ కపూర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. 24. బావర్చి (1972) 1970ల్లో వచ్చిన సినిమా ఉత్తమ బాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచింది. ఒకరితో ఒకరు చాలా గొడవలు చేసుకునే మధ్యతరగతి కుటుంబ సభ్యుల కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి రాజేష్ ఖన్నా 1973లో బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అవార్డులో ఉత్తమ నటుడి (హిందీ) అవార్డు. కన్వర్జిత్ పెంటల్ 1973లో 'ఉత్తమ హాస్య నటుడు' విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. రాజేష్ ఖన్నా, జయ బచ్చన్, అమితాబ్ బచ్చన్, ఉషా కిరణ్, కన్వర్జిత్ పెంటల్, అస్రానీ నటించిన ఈ సినిమాను హృషికేష్ ముఖర్ తెరకెక్కించారు. 25. జానే తు... యా జానే నా (2008) రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకులకు కూడా బాగా నచ్చింది. ప్రతీక్ బబ్బర్, ఇమ్రాన్ ఖాన్, పరేష్ రావల్, జెనీలియా డిసౌజా, రత్న పాఠక్ షా, మంజరీ ఫడ్నిస్, నీరవ్ మెహతా, అయాజ్ ఖాన్, సుగంధ గార్గ్, సోహైల్ ఖాన్, నసీరుద్దీన్ షా, అలీష్కా వార్దే, కరణ్ మఖిజా, అర్బాజ్ ఖాన్ భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు. అబ్బాస్ టైరేవాలా డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 26. జో జీతా వోహి సికందర్ (1992) 1992లో విడుదలైన ఈ చిత్రం రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఇది బాలీవుడ్లో వస్తున్న అత్యుత్తమ స్పోర్ట్స్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దీపక్ తిజోరి, అమీర్ ఖాన్, కులభూషణ్ ఖర్బండా, అయేషా జుల్కా, పూజా బేడి, మామిక్ సింగ్ నటించిన ఈ సినిమాకు మన్సూర్ ఖాన్ దర్శకత్వం వహించారు. 27. కోయి... మిల్ గయా (2003) కోయి..మిల్ గయా ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ సైన్స్ ఫిక్షన్ బాలీవుడ్ సినిమాల్లో ఒకటి. ఈ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, పీపుల్స్ ఛాయిస్ అవార్డ్స్, స్క్రీన్ అవార్డ్స్‌తో పాటు పలువురి ప్రశంసలను అందుకుంది. రేఖ, హృతిక్ రోషన్, ప్రీతి జింటా, హన్సిక మోత్వాని, రజత్ బేడీ, ప్రేమ్ చోప్రా, ముఖేష్ రిషి తారాగణంతో తరకెక్కిన ఈ చిత్రానికి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. 28. జిందగీ నా మిలేగీ దోబారా (2011) ముగ్గురు స్నేహితుల కథ ఆధారంగా రూపొందించిన చిత్రం జిందగీ నా మిలేగీ దొబారా. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్, కత్రినా కైఫ్, అభయ్ డియోల్, కల్కి కోచ్లిన్ నటించారు. ఈ చిత్రం 35 అవార్డులను కైవసం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. 29. గుప్త్: ది హిడెన్ ట్రూత్ (1997) ఈ అద్భుతమైన మర్డర్ మిస్టరీని ఈ చిత్రంలో చూపించారు. బాబీ డియోల్, కాజోల్, పరేష్ రావల్, మనీషా కొయిరాలా, ఓం పురి నటించిన ఈ సినిమా బాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఒకటి. రాజీవ్ రాయ్ రూపొందించిన ఈ చిత్రాన్ని జీ5లో చూసి ఎంజాయ్ చేయండి. 30. చమేలీ కి షాదీ (1986) 1980ల నాటి ఉత్తమ కుటుంబ చిత్రాలలో చమేలీ కి షాదీ ఒకటి. అనిల్ కపూర్, అమ్జద్ ఖాన్, అమృతా సింగ్, ఓం ప్రకాష్, అన్నూ కపూర్, పంకజ్ కపూర్ నటించిన ఈ చిత్రానికి బసు ఛటర్జీ తెరకెక్కించారు. 31. స్పెషల్ 26 (2013) ఆదాయపు పన్ను అధికారులుగా నటిస్తూ రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలను దోచుకునే ముఠా చుట్టూ తిరిగే కథే ఈ చిత్రం. ఈ సినిమా ఉత్తమ బాలీవుడ్ కుటుంబ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, మనోజ్ బాజ్‌పేయి, జిమ్మీ షీర్గిల్ నటించిన ఈ చిత్రానికి నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. 32. సత్తె పె సత్తా (1982) తప్పక చూడావలసిన బాలీవుడ్ కుటుంబ కథా చిత్రాలలో ఒకటి. ఫామ్‌హౌస్‌లో జంతువుల మధ్య నివసించే ఏడుగురు సోదరుల కథాంశమే ఈ చిత్రం. అమ్జాద్ ఖాన్, అమితాబ్ బచ్చన్, సుధీర్ లూత్రియా, హేమ మాలిని, కన్వర్జిత్ పైంటల్, రంజీతా కౌర్, కన్వల్జిత్ సింగ్, విక్రమ్ సాహు, సచిన్ పిల్గావ్కర్, శక్తి కపూర్ నటించిన ఈ చిత్రాన్ని రాజ్ ఎన్. సిప్పీ రూపొందించారు. 33. అక్టోబర్ (2018) అక్టోబర్ వరుణ్ ధావన్ ఉత్తమ చిత్రాలలో ఒకటి. ఈ చిత్రానికి గానూ జాగ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2018, లయన్స్ గోల్డ్ అవార్డ్స్ 2019లో ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు. గీతాంజలి రావు, వరుణ్ ధావన్, బనితా సంధు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి షూజిత్ సిర్కార్ దర్శకత్వం వహించారు. 34. హిచ్కీ (2018) ఈ స్ఫూర్తిదాయకమైన కథ బ్రాడ్ కోహెన్ రాసిన ఫ్రంట్ ఆఫ్ ది క్లాస్ ఆధారంగా రూపొందించబడింది. బాలీవుడ్లో ఇప్పటివరకు రూపొందించిన అత్యుత్తమ హాస్య-నాటకం చిత్రాలలో ఒకటి . రాణి ముఖర్జీ, హర్ష్ మాయర్, ఆసిఫ్ బస్రా, నీరజ్ కబీ నటించారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆమెజాన్ ప్రైమ్‌వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ దీపావళికి అత్యుత్తమ బాలీవుడ్ చిత్రాల్లో మీకు నచ్చిన వాటిని కుటుంబంతో కలిసి ఆస్వాదించండి. -
దీపాల వెలుగులు.. బాలీవుడ్ తారల మెరుపులు
ఈ ఏడాది దీపావళి సంబరాలు మొదలయ్యాయి. అక్టోబర్ 24న దీపావళి వేడుకకు భారత దేశమంత సిద్ధమవుతుంది. ఇక పండగ అంటే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒక్కచోట చేరి ఆనందంగా గడపడం. అన్ని పండుగల్లో ప్రత్యేకత సంతరించుకునేది దీపావళి. ఈ పండగకు మాత్రమే ఒకరి ఇంటికి మరోకరు వెళ్లడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం చేస్తుంటారు. అంతేకాదు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులంత ఒక్కచోట చేరి టపాసులు కాల్చి ఆనందంగా గడుపుతారు. అయితే ఈ సాంప్రదాయం ఎక్కువగా ఉత్తరాదిలో కనిపిస్తుంది. ఇక నార్త్ అనగానే వెంటనే గుర్తొచ్చేది బాలీవుడ్. ప్రతి దీపావళికి బాలీవుడ్ సెలబ్రెటీలంత ఒక కుటుంబంగా మారిపోతారు. ఈ సందర్భంగా తమ విలావంత భవనంలో గ్రాండ్ పార్టీని నిర్వహించి బి-టౌన్ తారలకు ఆతిథ్యం ఇస్తుంటారు. అందులో అమితాబ్, షారుక్, కుటుంబం ముందుంటుంది. అయితే కరోనా కారణంగా రెండేళ్లు ఈ వేడుకను చాలా సింపుల్ జరుపుకుంది బి-టౌన్. అందుకే గత రెండేళ్లు దీపావళి సందడి పెద్దగా కనిపించలేదు. మరి ఈ ఏడాది బాలీవుడ్ తారలు దీపావళి పూర్వపు వైభవాన్ని తీసుకువస్తారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే గతంలో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, కాజోల్, కపూర్ కుటుంబం వంటి తారలు దీపావళిని ఎలా సెలబ్రెట్ చేసుకున్నారో ఓ సారి చూద్దాం. అమితాబ్ బచ్చన్ ‘జల్సా’ సందడి ప్రతి ఏడాది బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తన ఇంటిలో దీపావళి పార్టీని ఘనంగా నిర్వహిస్తారు. ఈ పార్టీలో బాలీవుడ్ తారలందరిక ఆహ్వానం అందుతుంది. ఆ రోజు సాయంత్రం ముంబైలోని ఆయన బంగ్లా జల్సాలో బాలీవుడ్ తారలంత మెరుస్తారు. 2019లో ఆయన ఆయన హోస్ట్ చేసిన దీపావళి పార్టీలో షారూఖ్ ఖాన్, కాజోల్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, సారా అలీ ఖాన్, దీపికా పదుకొనే వరకు అందరూ బిగ్ బి దీపావళి పార్టీలో సందడి చేశారు. ఈ పార్టీ షారుక్ తన భార్య గౌరీ ఖాన్‌తో రాగా సోనమ్ కపూర్ తన భర్త ఆనంద్ అహుజాతో వచ్చింది. సెలబ్రెటీ కపుల్ అయిన అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ హాజరయ్యారు. షారుక్ ఖాన్ ‘మన్నత్’ వెలుగులు ఇక బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన భార్య గౌర్ ఖాన్, కూతురు, కొడుకలతో దీపావళికి చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులంత ఒకే రంగు దుస్తులు ధరించి దీపావళికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తారు. తమ విలాసవంతమైన బంగ్లా మన్నత్‌ను దీపాలతో కలకలలాడుతుంది. ప్రతి ఏడాది సెలబ్రెటీల అత్యత్తుమ దీపావళి సెలబ్రెషన్స్‌లో ఈ షారుక్ దంపతులు మొదటి స్థానంలో నిలుస్తారు. అంతేకాదు వీరి ఫొటోలు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆకట్టుకుంటాయి. కపూర్ ఫ్యామిలీ దీపావళి తళుకులు బాలీవుడ్లో కపూర్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. అన్నదమ్ములైన బోని కపూర్, అనిల్ కపూర్, సంజయ్ కపూర్ల కుటుంబాలు ప్రతి స్పెషల్ డేస్‌కు ఒక్కచోట చేరిపోతారు. ప్రతి దీపావళికి అనిల్ కపూర్, ఆయన భార్య సునీతా కపూర్ తమ నివాసం జూహులో గ్రాండ్ పార్టీని నిర్వహిస్తారు. ఈ పార్టీకి చాలామంది బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతుంటారు. ఇక 2021లో కరోనా కారణంగా దీపావళిని కేవలం తమ కుటుంబ సభ్యులు మాత్రమే జరుపుకున్నారు. ఈ వేడుకలో బోని కపూర్ ఆయన కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్, అర్జున్ కపూర్, అతడి ప్రియురాలు మలైకా అరోరా,అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ఆమె భర్త ఆనంత్ ఆహుజా, షానయా కపూర్, అన్షులా కపూర్, రియా కపూర్, మహీప్ కపూర్ తదితరులు భారతీయ వస్త్రధారణలో మెరిశారు. కరణ్ జోహార్ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ సినీ సెలబ్రెటీల కోసం ఆయన తరచూ పార్టీలు నిర్వహిస్తుంటారు. ఇక అందులో దీపావళి అంటే ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. 2019లో, కరణ్ జోహార్ తన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌లో పనిచేసే నటీనటులతో పాటు సిబ్బంది కోసం దీపావళిని గ్రాండ్‌గా హోస్ట్ చేశారు. ఈ వేడుకలో సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, విక్కీ కౌశల్, అనిల్ కపూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, భూమి పెడ్నేకర్, నేహా ధూపియా ఇతర నటీనటులు సందడి చేశారు. -
‘ఓరి దేవుడా’ దివాలీ దావత్, సందడి చేసిన యంగ్ హీరోలు
యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ఓరి దేవుడా. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్టరి వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం రాత్రి ‘దివాలీ దావత్’ పేరుతో వేడుకను నిర్వహించారు. ఈ పార్టీకి పలువుకు టాలీవుడ్ యంగ్ హీరోలు హాజరై సందడి చేశారు. అల్లరి నరేశ్, టీజే టిల్లు ఫేం సద్ది జొన్నలగడ్డ, సందీప్ కిషన్, ఆది సాయి కుమార్, ఆకాశ్ పూరి, విశ్వక్ సేన్, హీరో కార్తికేయతో పాటు తదితరులు, చిత్ర బృందం పాల్గొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బాలీవుడ్ తారల దీపావళి సెలబ్రేషన్స్..కొత్త దుస్తుల్లో మెరిసిన స్టార్స్
దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాలు మొదలయ్యాయి. ప్రజలు తమ ఇళ్లను అలంకరించుకోవడం ప్రారంభించారు. దీపాల పండుగ పర్వదినాన్ని తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులలో అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు బాలీవుడ్ తారలు కూడా మినహాయింపు కాదు. బీటౌన్‌కి చెందిన పలువురు హీరోహీరోయిన్లు అప్పుడే దీపావళి సంబరాలను ప్రారంభించారు. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, ఆయన భార్య తాహిరా కశ్యప్‌లు ముంబైలోని తమ నివాసంలో దీపావళి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బాలీవుడ్ సెలబ్రిటీలు కార్తిక్ ఆర్యన్, కరణ్ జోహార్, కృతి సనన్, అనన్య పాండే, తాప్పీ పన్ను హాజరై సందడి చేశారు. బాలీవుడ్ బ్యూటీ, ‘ఆదిపురుష్’ సీత కృతి సనన్.. తన ఇంట దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీంతో ఆమె ఇంటికి బాలీవుడ్ నటీనటులు తరలి వచ్చారు. వరుణ్ ధావన్, అతని భార్య నటాషా దలాల్ బంగారు రంగు దుస్తుల్లో దీపాలతో పోటీగా వెలిగారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే లెహంగా ధరించి అందరినీ మెప్పించింది. దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ బ్లాక్ కుర్తాను ధరించి మెరిశారు. శిల్పాశెట్టి బ్రౌన్ మెరూన్ కలర్ చీరతో అలరించింది. నోరా ఫతేహి తన మెరిసే లెహంగాలో అద్భుతంగా ఉంది. తాప్సీ పన్ను మెరిసే గులాబీ రంగు చీరను ధరించింది. -
ఒకేరోజు 75వేల మందికి ఉద్యోగాలు.. ప్రధాని మోదీ దీపావళి గిఫ్ట్
న్యూఢిల్లీ: ఈ ఏడాది దీపావళికి దేశవ్యాప్తంగా 75వేల మంది యువతకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దివాళీకి రెండు రోజుల ముందు శనివారం వారితో వర్చువల్‌గా సమావేశమై వివిధ అంశాలపై మాట్లాడనున్నారు. 75వేల మంది యువతకు ప్రభుత్వ విభాగాలు, వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు. అదే రోజు వారికి ఉద్యోగ నియామక పత్రాలు(అపాయింట్మెంట్ లెటర్స్) అందించనున్నారు ప్రధాని మోదీ. ప్రధాని స్పెషల్ గిఫ్ట్ అందుకునే యువత.. రక్షణ, రైల్వే, హోం, కార్మిక, ఉపాధి శాఖలు, తపాలా విభాగం, సీఐఎస్ఎఫ్, సీబీఐ, కస్టమ్స్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో వారికి పోస్టింగ్ ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి కేంద్ర మంత్రులు సైతం ఈ వర్చువల్ సమావేశానికి హాజరుకానున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ ఒడిశా నుంచి, ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా గుజరాత్ నుంచి, సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చండీగఢ్ నుంచి, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మహారాష్ట్ర నుంచి హాజరుకానున్నారు. అలాగే.. ఎంపీలందరూ వారి వారి పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి హాజరుకానున్నారు. ఇదీ చదవండి: ముందస్తు దీపావళి కాంతులు: ఐటీ ఉద్యోగులకు తీపి కబురు -
బాణసంచా కొన్నా, కాల్చినా 6 నెలల జైలు!
న్యూఢిల్లీ: దీపావళి పండుగ అంటేనే బాణసంచా ఉండాల్సిందే. అయితే, పండుగకు ముందు ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ కాలుష్యం దృష్ట్యా బాణసంచా క్రయవిక్రయాలు, ఉపయోగించటంపై నిషేధం విధించింది. ఫైర్‌క్రాకర్స్ కొనుగోలు చేసినా, కాల్చినా రూ.200 జరిమానా విధించటంతో పాటు.. 6 నెలల వరకు జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మీడియా సమావేశంలో ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటన చేశారు. బాణసంచా తయారీ, నిలువ, విక్రయాలు జరపటం నేరమని తెలిపారు. అందుకు రూ.5000 వరకు జరిమానా, పేలుడు పదార్థాల సెక్షన్ 9బీ ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. అక్టోబర్ 21న ‘ దీపాలు వెలిగించండి.. పటాకలు కాదు’ అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు రాయ్. వచ్చే శుక్రవారం సెంట్రల్ పార్క్ వద్ద 51వేల దీపాలు వెలిగిస్తున్నామని చెప్పారు. ‘ఫైర్‌క్రాకర్స్ కొనుగోలు చేయటం, కాల్చటం చేస్తే రూ.200 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తాం. ’ అని స్పష్టం చేశారు. నిషేధాన్ని అమలు చేసేందుకు 408 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఫైర్‌క్రాకర్స్ తయారు చేయటం, విక్రయించటం సహా అన్నింటిపై జనవరి 1 వరకు నిషేధం విధించింది ఢిల్లీ ప్రభుత్వం. అందులో దీపావళికి సైతం ఎలాంటి మినహాయింపునివ్వలేదు. గత రెండేళ్లుగా ఇదే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. Hon’ble Environment Minister Sh. @AapKaGopalRai Addressing an Important Press Conference | LIVE https://t.co/MgY2RNnCzv — AAP (@AamAadmiParty) October 19, 2022 ఇదీ చదవండి: మోడ్రన్ కృష్ణుడు.. తన మ్యూజిక్‌తో గోవులను ఆకర్షించేస్తున్నాడు.. వీడియో వైరల్ -
దీపావళి వేడకలో స్టెప్పులేసిన పీవీ సింధు.. వీడియో వైరల్
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సింధు ఎంతో సంతోషంగా పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఉత్సాహంగా డ్యాన్స్ కూడా చేశారు. నిత్యం ఆటలతో బిజీగా ఉండే సింధు ఇలా డ్యాన్స్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘లవ్ న్వాంటిటి’ పాటకు నృత్యం చేసిన హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్.. గ్రీన్ లెహంగాలో తనదైన స్టెప్పులతో అదరగొట్టారు. ఈ వీడియోను సింధు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఒకే రోజులో మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. చదవండి: పద్మభూషణ్ అవార్డు అందుకున్న పీవి సింధు.. కాగా సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పీవీ సింధు 2020 సంవత్సరానికి గాను పద్మభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధు.. అంతకు ముందు 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ పతకం గెలుచుకుంది. ఇక 2019లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఈ స్టార్ అంతకుముందు వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీల్లో రెండు కాంస్యాలు, రెండు రజతాలు సాధించింది. ఈ క్రమంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఎక్కువ పతకాలు సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 2015లో సింధుకు పద్మశ్రీ అవార్డు దక్కింది. View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) -
ఫాంహౌస్‌లో బన్నీ దీపావళి సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
Allu Arjun And Sneha Reddys Diwali Celebrations: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలె దీపావళి వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఫాంహౌస్‌లో జరిగిన ఈ దీపావళి వేడుకల్లో రామ్‌చరణ్, ఉపాసనలతో పాటు మిగతా మెగా కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. తాజాగా దీపావళి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను బన్నీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తూ.. 'ఫాంహౌస్‌లో మా దీపావళి పార్టీ. డెకరేషన్ అంతా స్వయంగా స్నేహ దగ్గరుండి చేయించింది..దీపావళి వైబ్స్' అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో అల్లుఅర్జున్, స్నేహరెడ్డి స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌లో సందడి చేశారు. ముఖ్యంగా స్నేహ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గని సౌందర్యం అంటూ పొడగ్తలతో ముంచెత్తుతున్నారు. చదవండి: ఎయిర్‌పోర్టులో దాడి: అసలేం జరిగిందో వివరించిన సేతుపతి చదవండి: ప్రియుడితో సీక్రెట్ 'రోకా' ఫంక్షన్ చేసుకున్న కత్రినా! View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)