Samantha: Shares Emotional Post On Instagram Over Diwali Celebrations - Sakshi
Sakshi News home page

Samantha: ‘దీపావళి కాంతులు లేని ఇల్లు, ఈ ఏడాది చవిచూసిన నష్టం..’

Nov 6 2021 9:13 AM | Updated on Nov 6 2021 11:02 AM

Samantha Shares Emotional Post On Instagram Over Diwali Celebrations - Sakshi

దీపావళి పండగ సందర్భంగా సమంత భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పండగను తన స్నేహితురాలి కుటుంబంతో కలిసి సమంత సెలబ్రెట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. అది చూసి సమంత సంతోషంగా ఉందని అందరూ భావించారు, కానీ కాసేపటికే సమంత ఓ పోస్ట్‌ షేర్‌ చేస్తూ తన ఒంటరితనాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఈ ఏడాది దీపావళి కాంతులు లేని ఇల్లు. అక్కడ స్వీట్లలోని కమ్మదనం రుచించనప్పుడు. సంవత్సరం ప్రారంభంలో చవిచూసిన నష్టం.. దీంతో ప్రతి సందర్భం(పండగలు, వేడుకలు) చిన్నవిగా అనిపిస్తున్నాయి. అతి త్వరలోనే సంతోషాలు వస్తాయేమోనని తెలుసు. కానీ మీరు త్వరలోనే మళ్లీ ఆనందం పొందాలని ఆశిస్తున్నా’ అంటూ బరువెక్కిన హృదయంతో ఇన్‌స్టా స్టోరీ షేర్‌ చేశారు సమంత.

చదవండి:  ‘జై భీమ్‌’లో సినతల్లిగా కనిపించిన నటి ఎవరూ, ఆమె అసలు పేరేంటో తెలుసా!

కాగా నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత ఏం చెప్పాలన్నా సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. బాధను, భావోద్యేగాలు, సంతోషాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. దీంతో​ సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ప్రతి పోస్ట్‌ వార్తల్లో నిలుస్తోంది. ఇక విడాకుల ప్రకటన అనంతరం ఆ బాధ నుంచి బయటపడేందుకు సమంత ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తన క్లోజ్‌ ఫ్రెండ్‌, మోడల్‌ శిల్పారెడ్డి కుటుంబంతోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఇటీవల శిల్పారెడ్డితో కలిసి సామ్‌ ఛార్‌దామ్‌ యాత్రకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. 

చదవండి: సమంత మరో సంచలన నిర్ణయం!

ఇ‍ప్పుడు కూడా దీపావళి పండగను కూడా శిల్పారెడ్డి కుటుంబంతో కలిసి సామ్‌ సెలబ్రెట్‌ చేసుకున్నారు. అలాగే వీరిద్దరూ కలిసి మెగా కోడలు ఉపాసనలతో నిర్వహించిన దీపావళి వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అలాగే సమంత కూడా శిల్పా కుటుంబంతో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు. ఈ మేరకు ఎప్పటిలాగే కొన్ని మోటివేషనల్ లైన్స్‌తో ఉన్న ఓ పోస్ట్‌ కూడా షేర్‌ చేశారు. ‘ఆనందాన్ని మించిన ధనం లేదు. మనశ్శాంతిని మించిన విజయం లేదు, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. దయా గుణాన్ని మించిన చల్లదనం లేదు’ అని పంచుకున్నారు సమంత.  

చదవండి: కుటుంబ సభ్యులతో సాయిధరమ్‌ తేజ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement