![Samantha Celebrates 3 Years Of Naga Chaitanya Co Starrer Majili - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/5/Samantha%2022.jpg.webp?itok=roZxIsQx)
టాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత- నాగ చైతన్య విడిపోయి సుమారు 6నెలలు కావోస్తుంది. అయినప్పటికీ ఈ జంట విడాకుల విషయం ఇండస్ట్రీలో ఇప్పటికీ హాట్‌టాపిక్‌గా హల్‌చల్ చేస్తుంది. అసలు చై-సామ్ విడాకులకు సంబంధించి కారణాలు ఏంటన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరి గురించి నిత్యం ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది.
ఇక విడాకుల తర్వాత ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీ అయిపోయారు. సమంత అయితే నాగ చైతన్య ఙ్ఞాపకాలను కూడా చెరిపేస్తూ సోషల్ మీడియాలో అతని ఫోటోలన్నింటిని డిలీట్ చేసేసింది. రీసెంట్‌గా చైని ఇన్‌స్టాలో అన్‌ఫాలో కూడా చేసేసింది. అయితే తాజాగా సామ్ విడాకుల అనంతరం తొలిసారిగా నాగచైతన్య ఫోటోని షేర్ చేసింది.
అయితే ఇది పర్సనల్ లైఫ్‌కి సంబంధించింది మాత్రం కాదు. ఇద్దరూ చివరగా జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్‌స్టోరి మజిలీ 3ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 3ఇయర్స్ ఆఫ్ మజిలీ అంటూ పోస్టర్‌ని షేర్ చేసుకుంది. డివోర్స్ తర్వాత తొలిసారి సామ్ చై ఉన్న ఫోటో షేర్ చేయడంతో ఈ పోస్ట్ కాసేపటికే నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment