టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్‌గా పేరుపొందిన సమంత-నాగ చైతన్యల విడాకుల వ్యవహారంపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ఈ జంట విడిపోయి దాదాపు ఐదు నెలలు కావొస్తున్నా వీరి డివోర్స్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గానే ఉంది. ఇక విడాకుల అనంతరం సినిమాల పరంగా ఇద్దరూ ఫుల్ బిజీ అయ్యారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో నాగ చైతన్య దూసుకుపోతుంటే సమంత కూడా బాలీవుడ్ సహా హాలీవుడ్ ప్రాజెక్టులతో అదరగొడుతుంది.
ఇదిలా ఉండగా విడాకుల అనంతరం కుంగిపోయిన సమంత.. చైతూతో గడిపిన జ్ఞాపకాలను చెరిపివేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుంది. ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి నాగ చైతన్య ఫోటోలను డిలీట్ చేసిన సామ్ రీసెంట్‌గా అతన్ని అన్‌ఫాలో కూడా చేసేసింది. అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున,రానా, వెంకటేష్ కుమార్తె ఆశ్రితలను ఇంకా ఫాలో అవుతున్న సామ్ చైతన్యను మాత్రమే అన్‌ఫాలో చేసింది.
మరోవైపు చై మాత్రం సమంతను ఇంకా ఫాలో అవుతున్నాడు. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం సమంతతో ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేయలేదు. కాగా 2017, అక్టోబర్6న హిందూ, క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్న చై-సామ్ గతేడాది అక్టోబర్2న విడిపోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment