ChaySam Divorce
-
సమంత బోల్డ్ సీన్స్ వల్లే విడాకులా? క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య
అక్కినేని నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కస్టడీ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న నాగచైతన్య తాజాగా మరోసారి సమంత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సమంతది చాలా కష్టపడే మనస్తత్వమని, ఏదైనా అనుకుంటే చేసి తీరుతుందంటూ ప్రశంసలు కురిపించాడు. సమంత హార్డ్ వర్కర్. పరిస్థితులు ఎలా ఉన్నా దృఢ సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తుంది. ఏదైనా అనుకుంటే కచ్చితంగా చేసి తీరుతుంది. ఆమె నటించిన ఓ బేబీ, ది ఫ్యామిలీ మ్యాన్-2 సిరీస్ నాకు చాలా ఇష్టం. రీసెంట్గా యశోద కూడా చూశాను.ఇప్పటికీ సమంత చేసిన అన్ని సినిమాలు చూస్తాను అంటూ చై పేర్కొన్నాడు. కాగా చై-సామ్‌ల విడాకులకు ది ఫ్యామిలీ మ్యాన్ సిరీసే కారణమని, అందులో సామ్ చేసిన బోల్డ్ సన్నివేశాల వల్లే వీరిద్దరికి గొడవలు వచ్చాయంటూ అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కినేని ఇమేజ్‌కు విరుద్దంగా సమంత ఆ సినిమాలో చాలా బోల్డ్‌గా నటించిందని, అదే విడాకులకు దారితీసిందని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా నాగచైతన్య కామెంట్స్‌తో అది కేవలం పుకారు మాత్రమేనని తేలిపోయింది. -
సమంతలో నాకు ఆ క్వాలిటీ నచ్చుతుంది: నాగచైతన్య
సమంత, నాగచైతన్య విడిపోయి రెండేళ్లు అయినా ఇంకా వీరి డివోర్స్ ఇష్యూ హాట్‌టాపిక్‌గానే ఉంది. ఇద్దరూ తమ సినిమాల పరంగా బిజీ అవుతుంటే, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక విధంగా వీరి విడాకుల వ్యవహారం తెరపైకి వస్తుంటుంది. తాజాగా కస్టడీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాగచైతన్యకు మళ్లీ ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. అయితే ఎప్పుడూ పర్సనల్ విషయాలపై మాట్లాడని చై తొలిసారిగా విడాకుల గురించి ఓపెన్అప్ అవడంతో మరోసారి చై-సామ్‌ల డివోర్స్ హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే తాము విడిపోయి రెండేళ్లు అయినా ఇంకా జనాలు అదే పట్టుకొని సాగదీయడం మంచిది కాదంటూ చై మరోసారి తన విడాకుల గురించి మాట్లాడారు. ఇక సమంతలో తనకు కష్టపడే వ్యక్తిత్వం బాగా నచ్చుతుందంటూ చై పేర్కొన్నాడు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో.. మీతో కలిసి నటించిన హీరోయిన్స్‌లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటని చైను ప్రశ్నించగా.. పూజా హెగ్డేలో స్టైల్ అని, సమంతలో హార్డ్ వర్కింగ్ అని, ఇక కస్టడీ బ్యూటీ కృతిశెట్టిలో ఇన్నోసెన్స్ నచ్చుతుంది అంటూ చై తెలిపాడు. -
అవే మనల్ని దూరం చేశాయి.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్
సమంత- నాగచైతన్య విడిపోయి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. అయితే ఇప్పటివరకు తన విడాకులపై మాట్లాడని నాగచైతన్య తొలిసారిగా తాము విడాకులు తీసుకోవడానికి వెనకున్న కారణాలను బయటపెట్టాడు. సమంతతో గడిపిన రోజుల్ని చాలా గౌరవిస్తానని, ఆమె చాలా లవ్లీ పర్సన్ అంటూ మాజీ భార్యపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా సమంత ఎప్పటికీ సంతోషంగా ఉండాలని, అన్ని ఆనందాలకు ఆమె అర్హురాలు అంటూ కామెంట్స్ చేశాడు. చదవండి: అందుకే విడాకులు తీసుకున్నా, సమంత సంతోషంగా ఉండాలి: చై దీంతో నాగచైతన్య వ్యాఖ్యలు క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారాయి. విడిపోయినా వీరికి ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం ఉందని, చై-సామ్‌లు మళ్లీ కలిసుంటే బాగుంటుందంటూ పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మనమంతా ఒక్కటే. కేవలం అహంకారం, భయాలు మనల్ని దూరం చేస్తాయి అంటూ ఓ కొటేషన్‌ను సమంత ఇన్‌స్టాలో షేర్ చేసింది. చై కామెంట్స్ అనంతరం సామ్ ఇలా పోస్ట్ చేయడంతో వీరు ఈగోలకు పోయి విడిపోయారా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నాగచైతన్య కూడా సోషల్ మీడియాలో వచ్చిన పుకార్ల వల్లే తమ మధ్య దూరం పెరిగిందని, ఆ గొడవలు విడిపోయేవరకు వచ్చిందని స్వయంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి -
అందుకే విడాకులు తీసుకున్నా, సమంత సంతోషంగా ఉండాలి: చై
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా పేరొందిన నాగచైతన్య-సమంత విడిపోయి దాదాపు రెండేళ్లవుతుంది. కానీ ఇప్పటికీ వీరి విడాకుల అంశంపై సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట ఎందుకు విడిపోయారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే తొలిసారిగా నాగచైతన్య సమంతతో విడాకులపై స్పందించాడు. అంతేకాకుండా తాము విడిపోవడానికి గల కారణాలను కూడా బయటపెట్టాడు. చదవండి: ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి కస్టడీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత గురించి మాట్లాడుతూ.. ''మేం విడిపోయి రెండేళ్లు అవుతుంది. చట్టపరంగా మాకు విడాకులు వచ్చి ఏడాది అవుతుంది. ఇద్దరం విడిపోయినా ఆమెతో కలిసి ఉన్న రోజులను చాలా గౌరవిస్తాను. నిజానికి సమంత మంచి అమ్మాయి. అన్ని ఆనందాలకు ఆమె అర్హురాలు. సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ వల్లే మా మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి పెద్దవై చివరికి విడిపోవాల్సి వచ్చింది. మొదట్లో నేను కూడా రూమర్స్ గురించి అంతగా పట్టించుకోలేదు..కానీ ఆ తర్వాత పరిస్థితులు మారాయి. మేం విడిపోయినా ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం ఉంది. కానీ మీడియా, వెబ్‌సైట్స్.. మాకు ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు చిత్రీకరించడం నా మనసును బాధపెట్టింది. అంతేకాకుండా నా గతంతో ఏమాత్రం సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగి వాళ్లను అగౌరవపరిచినట్లు వార్తలు రాశారు. అది చాలా చెత్త విషయం. జీవితంలో ప్రతీది ఒక గుణపాఠం లాంటిదే. ప్రతి దశలో ఏదో ఒకటి నేర్చుకుంటాం. ఏం జరిగినా అంతా నా మంచికే అనుకుంటాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను'' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చై. చదవండి: యంగ్ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్ -
చైకి గుర్తుగా టాటూ అలాగే ఉంచేసుకున్న సమంత.. ఫోటో వైరల్
సమంత-నాగచైతన్య.. ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌గా వీరికి పేరుంది. ఏమాయ చేశావే సినిమాతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చై-సామ్‌లు దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకొని 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ మనస్పర్థల కారణంగా 2021లో విడాకులు తీసుకున్నారు. ఇప్పటికీ వీరు కలిసుంటే బావుండు అని కోరుకోని అభిమాని ఉండరు అంటే అతిశయోక్తి కాదు. రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ చై-సామ్‌ల జోడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక విడాకుల తర్వాత ఇద్దరూ సినిమాల పరంగా బిజీబిజీగా గడిపేస్తున్నారు. కస్టడీ సినిమాతో చై ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇప్పటికే సమంత శాకుంతలం సినిమాతో అభిమానులను పలకరించింది. రీసెంట్గా సిటాడెల్ ప్రీమియర్ షో కోసం లండన్ వెళ్లిన సమంత సరికొత్త లుక్‌తో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అంతకు మించి సమంత ఒంటిపై నాగచైతన్యకు సంబంధించిన టాటూలు కూడా వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత చై పేరును టాటూ వేయించుకున్న సమంత ఇప్పటికీ ఆ టాటూను చెరపివేయలేదు. 'కొన్ని ఙ్ఞాపకాలను మర్చిపోలేం, టాటూలు కూడా అంతే'.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా సమంత మెడపై YMC అని రాసి ఉంటుంది. చైతో తొలిసారి నటించిన ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా సామ్ ఆ టాటూ వేయించుకుంది. ఇక మరో టాటూ ఆమె మణికట్టుపై ఉంటుంది. ఈ మూడు టాటూలు చైతూకి సంబంధించినవే కావడం విశేషం. -
చైతో విడిపోయినా అక్కినేని ఫ్యామిలీతో ఇంకా టచ్‌లో ఉన్న సమంత
సమంత-నాగచైతన్య ఒకప్పుడు టాలీవుడ్లో మోస్ట్ క్యూటెస్ట్ కపుల్‌గా వీరికి పేరుంది. 'ఏ మాయ చేశావే' సినిమాతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న వీరు 2017లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్‌లో అయినా వీరి కెమిస్ట్రీ చూస్తే ముచ్చటేసేది. కానీ ఏమైందో ఏమో కానీ వీరి వివాహ బంధం బీటలు వారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే చై-సామ్‌లు 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనికి గల కారణాలు ఏంటన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇదిలా ఉంటే నాగ చైతన్యతో విడిపోయినా అక్కినేని కుటుంబంతో మాత్రం సమంతకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉందన్నది పలుమార్లు రుజువైంది. తాజాగా అక్కినేని అఖిల్, షేర్ చేసిన ఓ పోస్ట్‌కు సైతం సమంత స్పందించింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఏజెంట్. స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.దీనికి సంబంధించి ఓ పవర్ఫుల్ వీడియోను కూడా వదిలారు. తాజాగా ఈ వీడియోను పోస్ట్ చేస్తూ అఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకోగా దీనికి సమంత లైక్ కొట్టడంతో పాటు 'బీస్ట్ మోడ్' అంటూ కామెంట్ చేసింది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కూడా గతేడాది అఖిల్ బర్త్‌డేకు సామ్ విష్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్గా సమంత శాకుంతలం పోస్ట్‌ను హీరో సుశాంత్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే చైతో డివోర్స్ అయినా అక్కినేని కుటుంబంతో సమంతకు మంచి రిలేషనే ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య.. నెట్టింట ఫోటో లీక్
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య గతేడాది సమంతతో విడిపోయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న చై-సామ్‌లు అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. వీళ్లు ఎందుకు విడిపోయారన్నదానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఇక సామ్‌తో విడిపోయినప్పటి నుంచి నాగచైతన్య పర్సనల్ లైఫ్‌పై అనేక రూమర్స్ తెరపైకి వస్తున్నాయి. మేజర్ బ్యూటీ శోభితా ధూళిపాళ్లతో చై డేటింగ్లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై అటు నాగ చైతన్య ఇటు శోభిత ఇద్దరు కూడా స్పందించలేదు. తాజాగా శోభితతో కలసున్న నాగచైతన్య ఫోటో ఒకటి నెట్టింట లీక్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనడానికి ఈ ఫోటోనే కారణమంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో 'లాల్ సింగ్ చడ్డా' మూవీ ప్రమోషన్స్‌లో 'శోభిత ధూళిపాళ్ల పేరు వినగానే ఏం గుర్తొస్తుంది?'అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా నాగ చైతన్య చిన్న స్మైల్ ఇచ్చి సమాధానం దాటవేశారు. అలాగే ప్రెజెంట్ మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అని అడగ్గా హ్యాపీ స్టేటస్ అంటూ బదులిచ్చారు. ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చై- శోభిత ఫోటోలో ఎంతవరకు నిజముంది? ఇది ఇద్దరూ కలిసిన దిగిన ఫోటోనా? లేక ఎడిటింగ్ ఫోటోనా అన్నది తేలాల్సి ఉంది. -
ఏడాది కావొస్తున్న చై-సామ్ విడాకులు, సమంత తండ్రి ఎమోషనల్ పోస్ట్..
టాలీవుడ్ మాజీ కపుల్ సమంత, నాగ చైతన్య విడిపోయి ఏడాది కావోస్తోంది. గతేడాది అక్టోబర్ 2న ఈ జంట విడాకులు ప్రకటించి అందరికి షాకిచ్చింది. అప్పటి నుంచి వీరి విడాకుల వార్తలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట విడిపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ వీరద్దరు మళ్లీ కలిస్తే బాగుంటుందని ఆశించే వారు ఎంతోమంది ఉన్నారు. చదవండి: లలిత్ మోదీకి కూడా సుస్మితా బ్రేకప్ చెప్పిందా? అసలేం జరిగింది! అయితే వీరి విడాకులు వార్తలపై ఇంతకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇటూ అక్కినేని ఫ్యామిలీ కానీ, అటూ సమంత కుటుంబ సభ్యులు కానీ దీనిపై పెద్ద స్పందించలేదు. ఈ క్రమంలో చై-సామ్ విడిపోయి ఏడాది దగ్గరపడుతున్న క్రమంలో సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. దీంతో మరోసారి చై-సామ్ విడాకుల అంశం వార్తల్లో నిలిచింది. తాజాగా సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తన ఫేస్బుక్ ఒక పోస్ట్ షేర్ చేశాడు. అయిదేళ్ల క్రితం షేర్ చేసిన సమంత-నాగ చైతన్య రిసెప్షన్ ఫొటోలను రిపోస్ట్ చేస్తూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: తిరుమల కొండపై నటి అర్చన రచ్చ.. స్పందించిన టీటీడీ ‘చాలా కాలం క్రితం నాటి జ్ఞాపకాలు. ఇప్పుడు అవి లేవు. ఇకపై ఉండవు కూడా. కాబట్టి కొత్త కథ, కొత్త జీవితం మొదలు పెడదాం’ అని అని ఆయన రాసుకొచ్చారు. కాగా చై-సామ్ విడాకుల ప్రకటన అనంతరం ఆయన స్పందిస్తూ ఈ విషయం వినగానే తన మైండ్ బ్లాక్ అయ్యందంటూ భావోద్వేగానికి గురయ్యారు. చై-సామ్ విడాకుల విషయం వినగానే మొదట తనకు ఏం అర్థం కాలేదని, ఒక్కసారిగా కళ్ల ముందు అంతా చీకటి కమ్ముకుందన్నారు. విడాకుల విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమని సమంతకు చెప్పినట్లు ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. -
సమంతను కలిస్తే ఏం చేస్తారు? నాగ చైతన్య షాకింగ్ ఆన్సర్
సమంత-నాగచైతన్య విడిపోయి 10నెలలు కావొస్తున్నా వీరి విడాకులపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది.ఇక లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. అయితే ఇందులో సినిమాకు సంబంధించిన విషయాలే కాకుండా పర్సనల్ లైఫ్‌పై కూడా చై ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇప్పటికే సమంతతో భవిష్యత్తులో నటించే అవకాశం ఉందా అని అడగ్గా అలా జరిగితే క్రేజీగా ఉంటుందని బదులిచ్చిన చై తాజాగా మరోసారి సమంత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: సమంతను గుర్తుచేసే ఆ టాటూని నాగ చైతన్య తొలగిస్తాడా? తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూకు ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో భాగంగా సమంత మీకు ఎదురు పడితే ఏం చేస్తారు అని అడగ్గా.. ఆమెకు హాయ్ చెప్పి హగ్ ఇస్తానంటూ ఆన్సర్ ఇచ్చాడు. దీంతో చై చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో ఇదే ప్రశ్న సమంతకు కూడా ఎదురైన సంగతి తెలిసిందే. అందుకు బదులుగా సమాధానమిస్తూ.. మా ఇద్దరిని ఒకే గదిలో ఉంచితే అక్కడ పదునైన వస్తులేవీ లేకుండా చూసుకోవాలి అంటూ సామ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ చై మాత్రం హాయ్ చెప్పడమే కాకుండా హగ్ ఇస్తానంటూ షాకింగ్ ఆన్సర్ ఇవ్వడంతో వీరిద్దరి ఆలోచనలకు ఎంత తేడా ఉంది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: 'ఇన్‌స్టాలో బ్లాక్ చేసుకున్నాం.. కలిసుండటం ఇక జరగదు' -
సమంతను గుర్తుచేసే ఆ టాటూని నాగ చైతన్య తొలగిస్తాడా?
సమంత-నాగచైతన్య ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా వీరికి పేరుంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తామిద్దరం భార్యభర్తలుగా విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విడాకుల ప్రకటన చేసి పది నెలలు కావొస్తున్నా ఇంకా వీరి బ్రేకప్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గానే ఉంది. ప్రస్తుతం చై-సామ్ తమ సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకుపోతున్నారు. లాల్ సింగ్ చడ్డా సినిమాతో నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆగస్టు 11న ఈ సినిమా రిలీజ్ కానుండటంతో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. తాజాగా చై తన చేతిపై ఉన్న టాటూపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా టాటూని ఫ్యాన్స్ ఎవరూ కాపీ కొట్టకండి. ఎందుకంటే ఇది సమంతతో నా పెళ్లిరోజు తేదీని మోర్స్ కోడ్ రూపంలో టాటూ వేయించుకున్నా. కీలకమైన విషయాలని టాటూగా వేయించుకోవద్దు. ఎందుకంటే భవిష్యత్తులో అవి మారిపోయే అవకాశం ఉంటుంది' అంటూ పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు ఆ టాటూని తొలగించాలని ఎప్పుడైనా అనుకున్నారా అని యాంకర్ ప్రశ్నించగా.. ఎప్పడూ దాని గురించి ఆలోచించలేదు. టాటూ మార్చడానికి ఏమీ లేదు. పర్లేదు అంటూ కూల్‌గా సమాధానం ఇచ్చాడు. -
సమంతపై ఇప్పటికి గౌరవం ఉంది.. కానీ!: నాగ చైతన్య
టాలీవుడ్ మాజీ దంపతులైన నాగ చైతన్య-సమంతల విడాకులు వ్యవహరం ఇప్పటికే హాట్‌టాపిక్‌గానే ఉంది. వీరు విడిపోయిన 10 నెలల గడుస్తున్న చై-సామ్ విడాకులు వార్తలు నెట్టింట చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. విడాకుల ప్రకటన వరకు కూడా ఎంతో అన్యోన్యంగా కనిపించారు. అలాంటి చై-సామ్ విడిపోవడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పటికీ వీరి విడాకుల అంశం ఆసక్తిని సంతరించుకుంటోంది. అయితే మొదట్లో విడాకులపై అసలు నోరు విప్పని చై లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్‌లో ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. సమంతపై తనకు ఇప్పటికీ గౌరవం ఉందని చెప్పుకొచ్చాడు. చదవండి: మీ మాజీ భర్త షాహిద్ అంటూ ప్రశ్న.. కరీనా రియాక్షన్ చూశారా? తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన చైకి సమంత గురించిన ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విడాకుల గురించి కాకుండ కొత్తగా సమంతపై తన అభిప్రాయం ఏంటని అడిగింది యాంకర్. దీనికి చై స్పందిస్తూ.. ‘ సమంత అంటే ఇప్పటికీ నాకు అమితమైన గౌరవం ఉంది. తనపై ఉన్న గౌరవం ఎప్పటికీ పోదు. ఓ అండర్‌స్టాండింగ్‌తోనే మేం విడాకులు ప్రకటన ఇచ్చాం. ఆ సమయంలో కూడా మాకు ఒకరిపై మరోకరికి రెస్పెక్ట్ ఉంది. మా మధ్య ఏం జరిగిందో అదే చెప్పాం. కానీ అంతకుమించింది ఏదో మా మధ్య జరిగిందని చెప్పేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రారంభంలో మాత్రం మాపై వస్తున్న వార్తలు చూసి చాలా విసుగు చెందాను’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: రణ్‌వీర్‌ని ఫాలో అయిన నటి.. టాప్‌లెస్ ఫొటోతో రచ్చ ఆ తర్వాత మరి వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని నిర్వచించడం నేర్చుకున్నారా? అని అడగ్గా... అదే చేస్తున్నాను కాబట్టే ప్రస్తుతం ఇలా ఉన్నానన్నాడు. ‘వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి మధ్య ఒక స్పష్టమైన రేఖను గీయాలి. అప్పుడే ప్రశాంతంగా ఉండగలం. రెండు కలిపి చూడోద్దు. చిత్తశుద్దితో చేసే పని మనల్ని ఎప్పుడు గెలిపిస్తుంది. పుకార్లను పట్టించుకోవద్దు. వార్తలకు వార్తలే సమాధానం ఇస్తాయి. ఇవాళ ఒకటి వస్తే రేపు మరొకటి. కాబట్టి వాటిని పట్టించుకోకుండ మనం ఏం చేయాలనుకుంటున్నామో దానిపై దృష్టి పెట్టి ముందుకు సాగాలి ’ అంటూ వివరించాడు. కాగా సమంత మాత్రం విడాకుల అనంతరం సోషల్ మీడియా తరచూ పోస్ట్స్, కోట్స్ షేర్ చేస్తూ పరోక్షంగా డైవర్స్ గురించి ఏదోకటి చెబుతూ చైని విమర్శించిన సంగతి తెలిసిందే. చదవండి: స్టార్ హీరోకి ఇల్లు అమ్మేసిన జాన్వీ? ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే! -
విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటుగా స్పందించిన చై
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో చై బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రాబోతున్న నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంగ్లిష్ చానల్‌తో ముచ్చటించాడు నాగ చైతన్య. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకున్నాడు. ఇక అలాగే అందరు ఊహించినట్టే చైకి విడాకులపై ప్రశ్న ఎదురవగా ఆసక్తికరంగా స్పందించాడు. చదవండి: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు మృతి ‘నా వ్యక్తిగత జీవితం గురించి అందరు మాట్లాడుకోవడం అసహనం కలిగిస్తోంది. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. సమంతతో విడాకులపై ఇప్పటికే ప్రకటన చేశాం. అయితే దానికి కారణమేంటో ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతం ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వారు జీవిస్తున్నాం. సమంత దారి సమంతదే.. నా దారి నాదే. ఇంతకంటే ఇంకా చెప్పాల్సిందేమి లేదు’ అంటూ ఘాటూగా స్పందించాడు. అనంతరం తనపై వస్తున్న రూమర్స్‌ని తానేప్పుడు పట్టించుకోనని, మొదట్లో ఆలోచించేవాడినని, కానీ ఇప్పుడు ఆ రూమర్స్ గురించి అంతగా ఆలోచించడం లేదని చై అన్నాడు. చదవండి: Hero Suman: షూటింగ్‌లతో బిజీ.. రాజకీయాల్లోకి..? తన బెస్ట్ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ సమంతోనే కుదరిందని గతంలో చై చెప్పిన సమాధానంపై ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ప్రశ్న ఎదరురైంది. భవిష్యత్తులో సమంత నటించే అవకాశం ఉందా? అడగ్గా చై గట్టిగా నవ్వేశాడు. ‘ఒకవేళ అలా జరిగితే చాలా క్రేజీగా ఉంటుందేమో.. కానీ అది జరుగుతుందో లేదో నాకు తెలియదు.. ఈ ప్రపంచానికే తెలియాలి’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక లాల్ సింగ్ చద్దా మూవీ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తన పాత్ర చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందన్నాడు. -
మేమిద్దరం ఒకే గదిలో ఉంటే.. ఇక అంతే: సామ్ షాకింగ్ రియాక్షన్
కాఫీ వీత్ కరణ్ జోహార్ షోలో తాజాగా స్టార్ హీరోయిన్ సమంత సందడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎపీసోడ్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే సమంత-నాగ చైతన్య విడాకులపై నెలకొన్న ఎన్నో సందేహాలు ఈ ఎపోసొడ్తో తీరుతాయని సౌత్ ప్రేక్షకులంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు సమంత ఎపిసోడ్ గత రాత్రి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. అందరు అనుకున్నట్లుగానే ఈ షోలో సామ్‌కు విడాకులు, ట్రోల్స్, భరణంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. చదవండి: Koffee With Karan: నాగ చైతన్యతో విడాకులు, భరణంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు మొదట్లో బాధఫడ్డా.. ప్రస్తుతం దాని నుంచి పూర్తిగా బయటపడ్డానని తెలిపింది. అంతేకాదు మునపటి కంటే ఇప్పుడు మరింత స్ట్రాంగ్ అయ్యానని పేర్కొంది. అలాగే ఈ షో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సామ్ చై గురించి అడిగే క్రమంలో కరణ్ జోహార్ మీ భర్త అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో వెంటనే మధ్యలో సమంత కల్పించుకుని ‘మాజీ భర్త’ అనాలి అంటూ కరెక్ట్ చేసింది. వెంటనే కరణ్ సారీ చెబుతూ.. మీ మాజీ భర్త, మీరు విడిపోయినప్పుడు మీరే కారణమంటూ ఎక్కువగా ట్రోలింగ్ జరిగిందని భావించారా? అని అడగ్గా.. చదవండి: కాఫీ విత్ కరణ్: టాలీవుడ్ నెపోటిజంపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‘అవును, కానీ ప్రస్తుతం నేను దాని గురించి ఎలాంటి ఫిర్యాదు చేయలేను. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండటానికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాను. ఒకవేళ స్పందించాలన్నా ఆ సమయంలో నా దగ్గర సమాధానాలు లేవు’ అని చెప్పుకొచ్చింది. అనంతరం నాగ చైతన్యకు మీకు మధ్య ఏవైన మనస్పర్థలు ఉన్నాయా అని అడగ్గా.. ‘మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే మీరు పదునైన వస్తువులు దాచాల్సి ఉంటుంది’ అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. -
Koffee With Karan: నాగ చైతన్యతో విడాకులు, భరణంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
సమంత-నాగ చైతన్య విడాకులు ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే వీరి విడాకులకు గల కారణాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే ఇందులో ఎక్కువగా సమంత తప్పే ఉందని మొదట్లో అందరు ఆమెను నిందించారు. అంతేకాదు సమంత నాగ చైతన్య నుంచి రూ. 250 కోట్లు భరణం తీసుకుందని కూడా ప్రచారం జరిగింది. ఇందులో నిజం లేదని సామ్ అప్పుడే స్పష్టం చేసింది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. తాజాగా ఓ షోలో సమంతకు ఇదే ప్రశ్న ఎదురైంది. బాలీవుడ్ పాపులర్ షో కాఫీ విత్ కరణ్‌ల హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి సమంత సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలో సమంతకు విడాకులు, రూ. 250 కోట్ల భరణం వంటి విషయాలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. హోస్ట్ కరణ్ జోహార్ తనని వ్యక్తిగతమైన ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టను అంటూనే విడాకులపై ప్రశ్నించాడు. దీనికి సామ్ ‘మా విడాకులు అంత సామరస్యంగా జరగలేదు. డైవర్స్ తీసుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. విడాకులు తీసుకున్న కొత్తలో చాలా బాధపడ్డాను. జీవితం చాలా కఠినంగా అనిపించింది. చదవండి: ‘థ్యాంక్యూ’ మూవీ ట్విటర్ రివ్యూ కానీ ఇప్పుడు దాని నుంచి బయటపడ్డాను. మునుపటి కంటే ఇప్పుడే మరింత బలంగా మారాను. ప్రస్తుతం నా పని నేను చేసుకుంటున్నాను. అయితే విడాకుల తర్వాత ఇద్దరం ఒకరిపై ఒకరం తీవ్ర మనోవేదనకు గురయ్యాం’ అంటూ సమాధానం ఇచ్చింది. అలాగే రూ. 250 కోట్ల భరణం తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. ‘నేను రూ.250 కోట్లు తీసుకున్నట్లు చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. ఈ పుకార్లు వచ్చినప్పుడు నా ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేస్తారేమో అని ఎదురుచూశా’ అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. -
చైతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సమంత.. పోస్ట్ వైరల్
టాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత- నాగ చైతన్య విడిపోయి సుమారు 6నెలలు కావోస్తుంది. అయినప్పటికీ ఈ జంట విడాకుల విషయం ఇండస్ట్రీలో ఇప్పటికీ హాట్‌టాపిక్‌గా హల్చల్ చేస్తుంది. అసలు చై-సామ్ విడాకులకు సంబంధించి కారణాలు ఏంటన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరి గురించి నిత్యం ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇక విడాకుల తర్వాత ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీ అయిపోయారు. సమంత అయితే నాగ చైతన్య ఙ్ఞాపకాలను కూడా చెరిపేస్తూ సోషల్ మీడియాలో అతని ఫోటోలన్నింటిని డిలీట్ చేసేసింది. రీసెంట్గా చైని ఇన్‌స్టాలో అన్‌ఫాలో కూడా చేసేసింది. అయితే తాజాగా సామ్ విడాకుల అనంతరం తొలిసారిగా నాగచైతన్య ఫోటోని షేర్ చేసింది. అయితే ఇది పర్సనల్ లైఫ్‌కి సంబంధించింది మాత్రం కాదు. ఇద్దరూ చివరగా జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్‌స్టోరి మజిలీ 3ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 3ఇయర్స్ ఆఫ్ మజిలీ అంటూ పోస్టర్ని షేర్ చేసుకుంది. డివోర్స్ తర్వాత తొలిసారి సామ్ చై ఉన్న ఫోటో షేర్ చేయడంతో ఈ పోస్ట్ కాసేపటికే నెట్టింట వైరల్‌గా మారింది. -
తన స్టైలిస్ట్ ప్రీతమ్ కోసం సమంత ఏం చేసిందో చూడండి..
-
తన స్టైలిస్ట్ ప్రీతమ్ కోసం సమంత ఏం చేసిందో చూడండి..
సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గానే ఉంది. టాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్‌గా పేరు సంపాదించుకున్న ఈ జంట అనూహ్యంగా గతేడాది అక్టోబర్2న విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు వీరు ఎందుకు విడిపోయారన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. దీనిపై అటు చై కానీ, ఇటు సమంత కానీ ఎప్పుడూ పెదవి విప్పలేదు. కానీ విడాకుల ప్రకటన అనంతరం సమంతను విమర్శిస్తూ ఓ వర్గం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పట్లో సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ పేరు కూడా ప్రధానంగా వినిపించింది. కానీ ప్రీతమ్ సమంతను అక్కా అని పిలుస్తాడని ఆమె సన్నిహితులు చెప్పడంతో రూమర్స్‌కి తెర పడినట్లయ్యింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత తనకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన మల్టీటాలెంట్‌ను బయటపెట్టింది. తన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్కి హెయిర్ కట్ చేసి ఆ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. నేను మల్టీటాలెంట్‌ని. నేను చేసిన పనికి నువ్ ఇంకా నాకు డబ్బులు చెల్లించలేదు అని పేర్కొంది. దీనికి ప్రీతమ్ కూడా చంపెయ్ అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. చదవండి: నాగ చైతన్యను అన్‌ఫాలో చేసిన సమంత.. కానీ చై మాత్రం -
నాగ చైతన్యను అన్‌ఫాలో చేసిన సమంత.. కానీ చై మాత్రం
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్‌గా పేరుపొందిన సమంత-నాగ చైతన్యల విడాకుల వ్యవహారంపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ఈ జంట విడిపోయి దాదాపు ఐదు నెలలు కావొస్తున్నా వీరి డివోర్స్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గానే ఉంది. ఇక విడాకుల అనంతరం సినిమాల పరంగా ఇద్దరూ ఫుల్ బిజీ అయ్యారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో నాగ చైతన్య దూసుకుపోతుంటే సమంత కూడా బాలీవుడ్ సహా హాలీవుడ్ ప్రాజెక్టులతో అదరగొడుతుంది. ఇదిలా ఉండగా విడాకుల అనంతరం కుంగిపోయిన సమంత.. చైతూతో గడిపిన జ్ఞాపకాలను చెరిపివేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుంది. ఇప్పటికే తన ఇన్స్టాగ్రామ్ నుంచి నాగ చైతన్య ఫోటోలను డిలీట్ చేసిన సామ్ రీసెంట్గా అతన్ని అన్‌ఫాలో కూడా చేసేసింది. అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున,రానా, వెంకటేష్ కుమార్తె ఆశ్రితలను ఇంకా ఫాలో అవుతున్న సామ్ చైతన్యను మాత్రమే అన్‌ఫాలో చేసింది. మరోవైపు చై మాత్రం సమంతను ఇంకా ఫాలో అవుతున్నాడు. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం సమంతతో ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేయలేదు. కాగా 2017, అక్టోబర్6న హిందూ, క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్న చై-సామ్ గతేడాది అక్టోబర్2న విడిపోయిన సంగతి తెలిసిందే. -
పెళ్లి చీర విషయంలో సమంత షాకింగ్ నిర్ణయం!
Samantha Shocking Decision: టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత-నాగ చైతన్య విడాకులు ప్రకటించి 5 నెలలు గడిచింది. ఇప్పటికి వారి విడాకుల అంశం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గానే ఉంది. వారు మళ్లీ కలిస్తే బాగుండు అని ఇప్పటికీ వారి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత-చైతన్యలకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. కాగా ‘ఏం మాయ చేసావె’ సినిమాతో మొదలైన వీరి స్నేహం పెళ్లి దాకా వెళ్లింది. చదవండి: ఆ యాక్షన్ సీన్లో ప్రభాస్‌ను విలన్ నిజమైన కర్రతో కొట్టాడట, ఆ తర్వాత.. ఇరు కుటుంబాలను ఒప్పించి మరి 2017, అక్టోబర్6న హిందూ, క్రిస్టియన్ పద్ధతిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా సమంత ధరించిన పెళ్లి చీరపై అప్పట్లో తెగ చర్చ జరిగింది. అంతేకాదు ఈ చీర నాగ చైతన్యకు సెంటిమెంట్ అనే విషయం తెలిసిందే. పెళ్లి మండపంలో సమంత కట్టుకున్న ఆ చీర చైతన్య అమ్మమ్మ, రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరిది. అమ్మమ్మ అంటే చైకి చాలా ఇష్టం. అందుకే ఆమె గుర్తుగా ఆ చీరను సమంత రీమోడలింగ్ చేయించి దాన్ని ధరించింది. చదవండి: సమంతపై దారుణమైన ట్రోల్స్.. చీచీ ఇలా దిగజారిపోతున్నావేంటి? ఇందుకోసం సుమారు రూ. 40 లక్షల వరకు ఖర్చయిందట. అయితే పెళ్లిలో అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న ఈపెళ్లి చీర విషయంలో సమంత షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విడాకుల అనంతరం చై, అక్కినేని కుటుంబానికి సంబంధించిన జ్ఞాపకాలను సామ్ వదిలించుకోవాలనుకుంటుందట. అందుకే ఈ పెళ్లి చీరను తిరిగి నాగ చైతన్యకు ఇచ్చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. -
ప్రణాళికలన్ని శిథిలమయ్యాయి, భయంకరమై పరిస్థితులు: సమంత
-
ప్రణాళికలన్ని శిథిలమయ్యాయి, భయంకర పరిస్థితులు: సమంత
Samantha About Her Horrible Situation: స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత షేర్ చేస్తున్న పోస్టులపై ఫోకస్ మరింత పెరిగింది. భర్తతో విడిపోయిన అనంతరం నుంచి తరచూ తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఎమోషనల్, మోటివేషనల్ పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. అంతేకాదు స్నేహితులతో కలిసి తీర్థయాత్రలు, పర్యాటనలకు వెళ్లిన పోస్టులను నిత్యం షేర్ చేస్తూనే ఉంటుంది సమంత. ఈ క్రమంలో విడాకులు అంశంపై ఆమె వీపరితమైన ట్రోల్స్ కూడా ఎదుర్కొంటోంది. చదవండి: 9 ఏళ్ల వయసులోనే షాకిచ్చాడు: వర్మ సోదరి ఆసక్తికర వ్యాఖ్యలు రీసెంట్గా హాలీవుడ్ హాస్యనటుడు విల్ స్మిత్ పుస్తకం నుంచి వైఫల్యం, నష్టం, అవమానం, విడాకులు వంటి వాటికి సంబంధించిన కోట్‌ను షేర్ చేసింది. ఇక తాజాగా సద్గురు కోట్‌ను షేర్ చేసింది సామ్. ఇందులో ‘మీరు జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ.. ఆ అనుభవాన్ని జీవితంలో ముందుకు వెళ్ళడానికి.. మంచి మనిషిగా జీవించడానికి ఉపయోగించుకోవచ్చు’ అని చెప్పిన మాటలున్నాయి. అలాగే ‘2022 నుండి తనకు జీవితంపై పెద్దగా అంచనాలు లేవు’ అంటూ తన విడాకుల విషయంపై ప్రస్తావించింది. చదవండి: విడాకుల తర్వాత తొలిసారి కలుసుకున్న ధనుష్, ఐశ్వర్య.. ఏం జరిగిందంటే అంతేగాక తాను తరచు ఎదుర్కొనే సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి కూడా మాట్లాడింది. చైతో విడిపోయిన నేపథ్యంలో తాను అనుభవించిన మానసిక బాధను పంచుకుంది. ‘2021లో నా వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనతో నాకు ఎలాంటి అంచనాలు లేవు.. ఎందుకంటే నేను జాగ్రత్తగా రూపొందించిన ప్రణాళికలన్నీ శిథిలమయ్యాయి.. కాబట్టి నాకు ఎలాంటి అంచనాలు లేవు. భవిష్యత్తులో నా కోసం ఏదైతే భద్రంగా ఉంటుందో దానిని స్వీకరిస్తాను.. దానికోసం బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను’ అని సమంత పేర్కొంది. -
ఆ ఇద్దరి వల్లే నేనింకా బతికున్నాను : సమంత
Samantha Shares New Pic And Says Still Alive Because Of These Two : నాగ చైతన్య- సమంత విడాకుల విషయం సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండింగ్ టాపిక్. ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి దాదాపు మూడు నెలలు కావోస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికీ వారిద్దరి గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఇక విడాకుల అనంతరం ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్లపై నెటిజన్ల ఫోకస్ మరింత పెరిగింది. సాధారణంగానే చై సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. దీంతో సమంత ఎప్పుడు ఏ పోస్ట్ షేర్ చేసినా అది విడాకుల అంశానికి ముడిపెడుతూ క్షణాల్లో అది వైరల్ అవుతుంది. తాజాగా స్విట్జర్లాండ్ ట్రిప్‌లో ఉన్న సమంత ఓ ఫోటోను షేర్ చేస్తూ.. వీరిద్దరి వల్లే ఇంకా బతికున్నాను అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీనికి #skiingisbelieving అనే ట్యాగ్‌ను జత చేసింది. ఫోటోలో ఉన్న వీరిద్దరూ సామ్ స్కై ఇన్స్ట్రక్టర్లు అని తెలుస్తుంది. ఇంతకుముందు కూడా అహం(ఈగో)ని మీ ఇంట్లో వదిలి వెళ్లండి అంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. అయితే రీసెంట్గా విడాకుల విషయంపై నాగ చైతన్య కామెంట్స్ అనంతరం సామ్ ఈ విధమైన పోస్టులు చేయడం విశేషం. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
తప్పులుంటే సరిదిద్దుకోవాలి.. అది బాధించింది: నాగ చైతన్య
Naga Chaitanya Reaction On Trolls About His Divorce With Samantha: టాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్ సమంత- నాగచైతన్య విడాకుల వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంది. రీసెంట్గా విడాకులపై స్పందించిన నాగ చైతన్య.. ఇద్దరి మంచి కోసం ఈ డెసిషన్ తీసుకున్నామని, దీనివల్ల ఇద్దరం సంతోషం ఉన్నామని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా చై మరోసారి విడాకులపై స్పందించాడు. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ.. నా గురించి ఏం రాసినా పర్వాలేదు. కానీ నా కుటుంబం రాస్తే నేను బాధపడతాను. నాన్న (నాగార్జున)చెప్పినట్లు..కుటుంబంలో కానీ, వ్యక్తిగత విషయాల్లో కానీ ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవాలి. లేకపోతే పర్వాలేదు(దట్స్ ఓకే).. కానీ నా కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్లు రాయడం నన్ను బాధించింది. అయినా పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అనే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. అందుకే విషయాన్ని మిస్ లీడ్ చేయనంత వరకు నేను స్పందించను అంటూ చెప్పుకొచ్చాడు చై. -
నా ఫ్యామిలీ గురించి అలా అనడం బాధించింది: నాగార్జున
టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి దాదాపు మూడు నెలలు కావోస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికీ వారిద్దరి గురించి చర్చ నడుస్తూనే ఉంది. సోషల్ మీడియాలో సామ్ ఏ పోస్ట్ పెట్టినా సరే.. దాన్ని విడాకుల అంశానికి ముడిపెడుతూ వార్తలు పుట్టుకొస్తున్నాయి. చై-సామ్ విడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవేనంటూ.. యూట్యూబ్‌లో పలు వీడియోలు దర్శనమిస్తున్నాయి. సమంత బోల్డ్ పాత్రలు చేయడం నాగార్జున, నాగచైతన్యలకు నచ్చలేదని, ఆమెకు షరత్తులు విధించడంతో విడిపోవాల్సి వచ్చిందని.. ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ వార్తలపై కింగ్ నాగార్జున స్పందించారు. ఇటీవల ఆయన, నాగచైతన్యతో కలిసి ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చై-సామ్ విడాకుల సమయంలో వచ్చిన వార్తలపై స్పందిస్తూ... ‘కొంతమంది కావాలని అలాంటి చెత్త వార్తలు సృష్టిస్తున్నారు. నాపై అసత్య వార్తలు రాసినా.. పెద్దగా పట్టించుకోలేదు. కానీ, నా ఫ్యామిలీ గురించి నెగటివ్‌గా వార్తలు రాయడం మాత్రం చాలా బాధించింది’అన్నారు. ఇక నాగచైతన్య మాట్లాడూతూ.. అలాంటి చెత్త వార్తను పట్టించుకోనని చెప్పుకొచ్చారు. కాగా, 2017లో ప్రేమవివాహంతో ఒక్కటైన సామ్-చై జంట.. గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల తర్వాత ఇద్దరూ.. కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. -
2021లో విడాకులతో వార్తలో నిలిచిన సినీ ప్రముఖులు వీళ్లే..
List Of Famous Celebrity Couples Divorced In 2021: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఇండస్ట్రీలో డైవోర్స్ కొత్తేం కాదు. ప్రేమను పెళ్లివరకు ఎంత వేగంగా తీసుకెళ్లారో...అంతేవేగంగా విడాకులు తీసుకున్నారు. అప్పటివరకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్న క్యూట్ కపుల్ సైతం తమ దారులు వేరువేరు అని టాటా చెప్పేసుకున్నాయి. ఆఫ్ స్క్రీన్‌లోనూ హిట్ పెయిర్ అనిపించుకున్న జంటలు కలిసి ఉండలేమంటూ తమ వివాహ బంధాన్ని రద్దు చేసుకున్నాయి. అలా ఈ ఏడాది 20201లో విడిపోయిన సినీ ప్రముఖులపై ఓ లుక్కేద్దాం. Samantha-Naga Chaitanya ఈ ఏడాది విడాకులు తీసుకున్న జంటల్లో నాగ చైతన్య- సమంతలు ఉండటం అభిమానులకు ఊహించని షాకిచ్చింది. అప్పటివరకు ఇండస్ట్రీలో క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న వీరు ఇక భార్యభర్తలుగా కలిసి ఉండలేమంటూ విడాకుల ప్రకటన చేశారు. 2017లో ప్రేమ వివాహం చేసుకున్న చై-సామ్.. తమ 4వ వివాహ వార్షికోత్సవానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు అక్టోబర్2న విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. Aamir Khan -Kiran Rao బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ పెళ్లి విషయంలో మాత్రం రెండుసార్లు విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచాడు. 2006లో కిరణ్ రావును ప్రేమ వివాహం చేసుకున్న ఆయన 15 ఏళ్ల అనంతరం 2 ఏడాది జులై3న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ జంట విడిపోవడానికి కారణం హీరోయిన్ ఫాతిమా సనా షేక్ అని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. Nisha Rawal -Karan Mehra హిందీ పాపులర్ సీరియల్ నటుడు కరణ్ మెహ్రపై భార్య నిషా రావల్ గృహహిం ఆరోపణలు చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కరణ్ తనపై దాడికి దిగాడంటూ మీడియా ముందుకొచ్చింది. 2012లో ప్రేమవివాహం చేసుకున్న ఈ కపుల్ తొమ్మిదేళ్ల అనంతరం విడాకులు తీసుకున్నారు. Yo Yo Honey Singh- shalini thalwar ప్రముఖ బాలీవుడ్ సింగర్ హనీ సింగ్‌పై భార్య షాలిని తల్వార్ గృహహింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. 2011లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఈ ఏడాది విడిపోయారు. Nusrat Jahan- Nikhil Jain ప్రముఖ నటి, ఎంపీ నుస్రత్ జమాన్ పెళ్లి, విడాకులు తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. జూన్ 19, 2019లో నుస్రత్, వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ని టర్కీలో వివాహం చేసుకున్న నుస్రత్2021లో జైన్‌తో తన వివాహం చెల్లదని ప్రకటించింది. ఆ సమయంలో ఆ బ్యూటీ బెంగాలీ నటుడు యశ్వంత్ దాస్‌గుప్తా రిలేషన్షిప్లో ఉందని రూమర్స్ వినిపించాయి -
నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే పనులు చేయను: నాగ చైతన్య
Naga Chaitanya Shocking Comments On His Movie Roles Goes Viral: సమంత-నాగచైతన్య విడాకుల వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంది. వీరు విడిపోయి దాదాపు రెండు నెలలు కావొస్తున్నా ఈ జంట విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇప్పటికే విడాకుల గురించి సమంత తన అభిప్రాయాన్ని చెప్పగా, నాగ చైతన్య మాత్రం ఇంతవరకు స్పందించలేదు. సాధారణంగానే సోషల్ మీడియాకు దూరంగా ఉండే చై.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఇందులో ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడరు అనే ప్రశ్నకు నాగ చైతన్య మాట్లాడుతూ.. 'అన్ని రకాల పాత్రలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. కానీ నేను పోషించే పాత్ర, సినిమా మా కుటుంబంపై ఎఫెక్ట్ చూపించకూడదు. మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో చేయను' అంటూ చై పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమంతను ఉద్దేశించే పరోక్షంగా చై ఈ వ్యాఖ్యలు చేశారంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఫ్యామిలీ మెన్-2 వెబ్ సిరీస్‌లో సమంత బోల్డ్ యాక్టింగ్ వీరి విడాకులకు ప్రధాన కారణమనే రూమర్స్‌కి చై వ్యాఖ్యలతో మరింత బలం చేకూరిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక విడాకుల అనంతరం సమంత వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం నాగ చైతన్య థ్యాంక్యూ, బంగార్రాజు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. Nee clarity @chay_akkineni 👌👌 pic.twitter.com/LAXv1T6AMz — RishiQ (@risheek_king) December 10, 2021 -
నా అభిప్రాయం ఏంటో చెప్పేశా.. మళ్లీ రిపీట్ చేయను: సమంత
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలుస్తోంది. ఆమె ఏం మాట్లాడినా.. ఎలాంటి పోస్టులు పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె విడాకులపై స్పందించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా కుంగిపోయానని, ఒక దశలో చనిపోవాలనుకున్నాని చెప్పింది. తన వ్యక్తిగత జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలతో 2021 సంవత్సరం ఎంతో కష్టంగా గడిచిందని తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె విడాకుల అంశంపై మళ్లీ మళ్లీ మాట్లాడడం ఇష్టం లేదని చెప్పింది. తామిద్దరం విడిపోవడంపై చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారని, కానీ తన అభిప్రాయం ఏంటో ఇప్పటికే చెప్పేశానని పేర్కొంది. ఈ ఆంశంపై మళ్లీ మళ్లీ స్పందించాల్సిన అవసరం తనకు లేదని సామ్ చెప్పుకొచ్చింది. కాగా, 2017లో ప్రేమవివాహంతో ఒక్కటైన సామ్-చై జంట.. ఈ ఏడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల తర్వాత సామ్.. కెరీర్ పరంగా మరింత బిజీ అయింది. వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ టాలీవుడ్,బాలీవుడ్లో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆమె గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లిట్ చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. అలాగే ఓ హాలీవుడ్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‌తో అదరగొట్టేసింది. -
ఫ్యాన్స్ కూడా కాటేస్తారు.. సిద్దార్థ్ షాకింగ్ ట్వీట్, కారణం సమంత?
'Stop Paying For Love And Hate' Is Siddharth Tweet About Samantha? నాగచైతన్యతో విడాకుల తర్వాత ప్రతి రోజు ఏదో ఒకరకంగా సమంత వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో అయితే వీరిద్దరి టాపిక్ ఇప్పటి ట్రెండింగ్‌లో ఉంటుంది. వీరి విడిపోయి రెండు నెలలు గడుస్తున్నా.. జనాల్లో మాత్రం ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంది. సోషల్ మీడియాలో సమంత ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్ పెట్టడం.. దానిపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేయడం, తను ఏ పోస్ట్ పెట్టినా.. విడాకులతో లింక్ పెడుతూ.. ట్రోల్ చేయడంతో చై-సామ్‌ల టాపిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారుతుంది. ఇక ఇటీవల సమంత విడాకులపై స్పందిస్తూ.. తన వ్యక్తిగత జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలతో 2021 సంవత్సరం ఎంతో కష్టంగా గడిచిందని తెలిపింది. దీంతో తన భవిష్యత్తుపై తనకు ఆశలు లేవని చెప్పుకొచ్చింది. అలాగే నెటిజన్స్ ట్రోలింగ్‌పై స్పందిస్తూ... ‘ సోషల్ మీడియా అనేది నటీనటులను తమ అభిమానులకు దగ్గరగా చేస్తుంది. దీంతో కొంతమంది నెటిజన్స్ నుంచి ప్రేమాభిమానాలు పొందుతున్నాను. ప్రస్తుతం వారు నా జీవితంలో భాగమయ్యారు. కానీ మరికొంత మంది మాత్రం ట్రోల్ చేస్తున్నారు. అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. వారందరినీ నేను కోరేది ఒక్కటే. నేను చేసే ప్రతిదాన్ని అంగీకరించాలని డిమాండ్ చేయను. కానీ మీకు నా అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని చెప్పడానికి ఒక విధానం ఉంటుంది. అని సామ్ అభ్యర్థిచింది. ఇదిలా ఉంటే.. సమంత కామెంట్‌పై సిద్దార్థ్ పరోక్షంగా కౌంటర్ వేసినట్లు తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తే అర్థమవుతుంది. ‘నేటి విషపూరిత సోషల్ మీడియా ప్రపంచంలో కొందరు స్టార్స్ .. అభిమానుల గ్రూప్స్ నిర్వహించడం కోసం, వారిని ఆయుధాలుగా మార్చడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఏదీ దానంతట అదే జరిగే అవకాశం లేదు. చివరికి తమ అభిమానులు తమనే కాటేస్తారని స్టార్స్ అర్ధం చేసుకోవాలి. ఇకనైనా ప్రేమని, ద్వేషాన్ని కొనుక్కోవడం మానేయండి' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంతను ఉద్దేశించే ఈ ట్వీట్ చేశాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా, గతంలో సమంత, చైతన్య విడిపోతున్నట్లు ప్రకటించినప్పుడు కూడా సిద్దార్థ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.‘మోసం చేసిన వారు ఎప్పటికీ బాగు పడలేరు.. స్కూల్లో టీచర్లు నేర్పిన పాఠం అదే’ అంటూ సిద్దార్థ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. -
విడాకులపై సమంత కామెంట్స్, వైరల్ అవుతోన్న చై-సామ్ ఓల్డ్ ఫోన్ కాల్
Fans Shares Naga Chaitanya And Samantha Old Phone Call Conversation Video: ఇటీవల ఓ ఇంగ్లీస్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తొలిసారి నేరుగా విడాకులపై స్పందించింది. విడాకులను ప్రకటన అనంతరం సోషల్ మీడియాలో తరచూ భావోద్వేగపూరితమైన కోట్స్ షేర్ చేస్తూ ఆవేదనను పంచుకున్న సామ్ డైరెక్ట్‌గా తన విడాకుల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నేను విడాకులు తీసుకున్నప్పుడు కుంగిపోయి చనిపోతానని అనుకున్నాను. నేను చాలా బలహీనమైన వ్యక్తినని నా ఫీలింగ్. కానీ నేను ఎంత బలంగా ఉన్నానో తెలిసి ఇప్పుడు ఆశ్చర్యం వేస్తోంది. నేను ఇంత దృఢంగా ఉంగలనని అనుకోలేదు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: 'విడాకుల తర్వాత చనిపోతా అనుకున్నా'.. సమంత షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం సమంత వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇక సమంత తొలిసారి విడాకులపై స్పందించడం, దానిపై ఆమె కామెంట్స్ విన్న ఫ్యాన్స్ తను ఇంతగా కుంగిపోయిందా అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికి చై-సామ్ ఫ్యాన్స్ కానీ, అటూ అక్కినేని ఫ్యాన్స్ కానీ వారి విడాకుల నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వారిద్దరూ ఇప్పటికీ కలవాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంత తాజాగా విడాకులపై చేసిన కామెంట్స్‌కు అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. దీంతో గతంలో చై-సామ్ ఓ షోలో మాట్లాడుకున్న ఓల్డ్ ఫోన్‌కాల్ కన్వర్జేషన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇంతకి అదేంటంటే. 2017లో యాంకర్ ప్రదీప్ హోస్ట్‌గా వచ్చిన కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా షోకు నాగచైతన్య హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో పాల్గొన్నాడు. ఆ సమయంలో నాగ చైతన్య ‘రారండోయ్ వేడుక చూద్దాం’ రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ రకుల్‌తో కలిసి చై ఈ షోకు హజరయ్యాడు. అప్పటికే చై-సామ్‌ల వివాహం కూడా జరిగింది. ఈ క్రమంలో ప్రదీప్ చైకి ఓ సవాలు విసిరాడు. సమంతకు ఫోన్ చేసి వారి ఫస్ట్ మూవీ డైలాగ్‌ను రియల్ లైఫ్‌లో తన జెస్సీని అడగాలని కోరాడు. దీంతో చైతన్య సమంతకు ఫోన్ చేసి ‘ప్రపంచంలో ఇంత మంది అమ్మాయిలు ఉండగా నేడు సామ్నే ఎందుకు లవ్ చేశాను’ అని అడుగుతాడు. చదవండి: ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా కొనసాగుతున్నా.. అయినా కష్టంగా ఉంది: నటుడు ఆవేదన అందుకు సమాధానంగా ‘నేను మరో ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి’ అని సామ్ చెబుతోంది. ‘నాకు మరో ఆప్షన్ కూడా అక్కర్లేదు’ అని చై అంటాడు. ఆ వెంటనే సామ్, చైయ్‌కి ‘ఐ లవ్ యూ’ చెబుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నాగ చైతన్య-సమంతలు మళ్లీ కలిస్తే బాగుండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘ఏమాయ చేశావే’ సినిమా సెట్లో 2009లో తొలిసారిగా సమంత-నాగ చైతన్యలు కలుసుకున్నారు. 2014లో ఆటోనగర్ సూర్య సినిమా కోసం మళ్లీ కలిసి చేశారు. ఆ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. మూడు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన అనంతరం 2017లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 4 ఏళ్లు కలిసి జీవించిన అనంతరం మనస్పర్థలతో విడిపోవాలని నిర్ణయం తీసుకుని ఈ ఏడాది అక్టోబర్ 2, 2021న విడాకుల ప్రకటన ఇచ్చి అందరికి షాకిచ్చారు. -
బ్రేకప్ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చైతూ..
Naga Chaitanya Quotes About Green Lights For Life Goes Viral: సమంత-నాగచైతన్య విడాకుల అనంతరం ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ మరింత పెరిగింది. సాధారణంగానే సమంతతో పోలిస్తే నాగ చైతన్య సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. తన సినిమాలు, బైకులు, కార్ల గురించి తప్పా సోషల్ మీడియాలో వేరే పోస్టులు షేర్ చేయడు. తాజాగా చైతూ షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. పాపులర్ రైటర్ మాథ్యూ రాసిన 'గ్రీన్ లైట్స్' అనే పుస్తకాన్ని షేర్ చేసిన చైతూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. 'లవ్ లెటర్స్ టూ లైఫ్..మీ జర్నీని షేర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు మాథ్యూ.. ఈ పుస్తకం నాకు నిజంగా గ్రీన్ లైట్(జీవితంలో ముందుకు వెళ్లడం, క్యారీఆన్ అనే అర్థం) అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఎప్పుడూ ప్రేమ, జీవితం లాంటి వాటిపై సోషల్ మీడియాలో పెద్దగా స్పందించని చైతూ..బ్రేకప్ తర్వాత ఇన్‌స్టాలో తొలిసారి చేసిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) సామ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన చై ప్రస్తుతం ఆ ఙ్ఞాపకాల్లోంచి బయటకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమచారం. ఈ నేపథ్యంలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. మరోవైపు సామ్ సైతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్, హాలీవుడ్లో సైతం ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. -
నిన్ను నమ్మినవాళ్లను మోసం చేయొద్దు : వెంకటేశ్
Venkatesh Shares Cryptic Post In Instagram About Relationship: హీరో వెంకటేశ్ ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇది వరకు కేవలం సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే షేర్ చేసే వెంకటేశ్.. ఈ మధ్య లైఫ్ లెసన్స్కు సంబంధించి వరుస పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి నిత్యం రిలేషన్, నమ్మకం, ప్రేమ వంటి విషయాలపై ఏదో ఒక రకంగా నిత్యం కొటేషన్స్‌ను షేర్ చేస్తున్నారు. చదవండి: 'ఆ స్టార్ హీరోను తన్నిన వారికి నగదు బహుమతి'..సంచలన ప్రకటన తాజాగా వెంకటేశ్ షేర్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 'నిన్ను ఇష్టపడిన వాళ్లను ఎప్పుడూ మిస్ యూస్(దుర్వినియోగం) చేయకు. నిన్ను కావాలనుకుంటున్న వాళ్లకు బిజీగా ఉన్నానని చెప్పకు. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతారో వాళ్లను ఎప్పుడూ మోసం చేయవద్దు. నిన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకునే వాళ్లని మర్చిపోవద్దు' అంటూ ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు ఈ కొటేషన్స్ చై-సామ్‌కు పరోక్షంగా హితబోధ చేస్తున్నారా అని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా వీళ్లు విడిపోకుండా ఉండేందుకు వెంకీ మధ్యవర్థిత్వం వహించారని, ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారని సమాచారం. అయినప్పటికీ సఖ్యత కుదరక చై-సామ్ భార్యభర్తలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. చదవండి: శ్రీరామచంద్ర ఇమేజ్ను డామేజ్ చేస్తున్న వాట్సాప్ చాట్ కొత్త ఇంట్లోకి బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ గృహప్రవేశం -
ఆ విషయంలో సామ్‌ను ఫాలో అవుతున్న చై!
Naga Chaitanya: సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి దాదాపు నెల కావొస్తున్నా ఇప్పటికీ వీరికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. విడాకుల అనంతరం బాగా కుంగిపోయిన సామ్..ఆ బాధలోంచి బయటపడేందుకు ఎక్కువగా స్నేహితులతో కలిసి వెకేషన్‌కు వెళ్తున్నట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. చదవండి: చైతూతో కలిసి ఉన్న ఇంట్లోనే ఉండాలని సమంత నిర్ణయం! అంతేకాకుండా అటు సినిమాల పరంగానే బాగా బిజీ అవ్వాలని చూస్తున్న సమంత..విడాకుల అనంతరం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు ప్రకటించింది. మరోవైపు ఇటీవలె లవ్‌స్టోరీ సినిమాతో హిట్టు కొట్టిన నాగ చైతన్య కూడా వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం బంగార్రాజు సినిమా చేస్తున్న చై ఇప్పుడు ఓటీటీలో సైతం ఇంట్రీ ఇస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. హర్రర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ వెబ్‌సిరీస్‌లో చైతూ విలన్ రోల్ చేయనున్నాడట. విక్రమ్‌కుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ సిరీస్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.ఇప్పటికే సమంత ‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి సూపర్‌హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చై సైతం అదే బాటలో వెళ్తున్నట్లు తెలుస్తుంది. చదవండి:అప్పుడే మనిషి నిజస్వరూపం బయటపడుతుంది: సమంత రెమ్యునరేషన్ భారీగా పెంచిన సమంత.. ఒక్కో సినిమాకు ఎంతంటే.. -
దీపావళి సందర్భంగా భావోద్వేగానికి లోనైన సమంత, ఏం చెప్పిందంటే..
దీపావళి పండగ సందర్భంగా సమంత భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పండగను తన స్నేహితురాలి కుటుంబంతో కలిసి సమంత సెలబ్రెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అది చూసి సమంత సంతోషంగా ఉందని అందరూ భావించారు, కానీ కాసేపటికే సమంత ఓ పోస్ట్ షేర్ చేస్తూ తన ఒంటరితనాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఈ ఏడాది దీపావళి కాంతులు లేని ఇల్లు. అక్కడ స్వీట్లలోని కమ్మదనం రుచించనప్పుడు. సంవత్సరం ప్రారంభంలో చవిచూసిన నష్టం.. దీంతో ప్రతి సందర్భం(పండగలు, వేడుకలు) చిన్నవిగా అనిపిస్తున్నాయి. అతి త్వరలోనే సంతోషాలు వస్తాయేమోనని తెలుసు. కానీ మీరు త్వరలోనే మళ్లీ ఆనందం పొందాలని ఆశిస్తున్నా’ అంటూ బరువెక్కిన హృదయంతో ఇన్‌స్టా స్టోరీ షేర్ చేశారు సమంత. చదవండి: ‘జై భీమ్’లో సినతల్లిగా కనిపించిన నటి ఎవరూ, ఆమె అసలు పేరేంటో తెలుసా! కాగా నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత ఏం చెప్పాలన్నా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. బాధను, భావోద్యేగాలు, సంతోషాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ప్రతి పోస్ట్ వార్తల్లో నిలుస్తోంది. ఇక విడాకుల ప్రకటన అనంతరం ఆ బాధ నుంచి బయటపడేందుకు సమంత ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తన క్లోజ్ ఫ్రెండ్, మోడల్ శిల్పారెడ్డి కుటుంబంతోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఇటీవల శిల్పారెడ్డితో కలిసి సామ్ ఛార్‌దామ్ యాత్రకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సమంత మరో సంచలన నిర్ణయం! ఇప్పుడు కూడా దీపావళి పండగను కూడా శిల్పారెడ్డి కుటుంబంతో కలిసి సామ్ సెలబ్రెట్ చేసుకున్నారు. అలాగే వీరిద్దరూ కలిసి మెగా కోడలు ఉపాసనలతో నిర్వహించిన దీపావళి వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అలాగే సమంత కూడా శిల్పా కుటుంబంతో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు. ఈ మేరకు ఎప్పటిలాగే కొన్ని మోటివేషనల్ లైన్స్‌తో ఉన్న ఓ పోస్ట్ కూడా షేర్ చేశారు. ‘ఆనందాన్ని మించిన ధనం లేదు. మనశ్శాంతిని మించిన విజయం లేదు, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. దయా గుణాన్ని మించిన చల్లదనం లేదు’ అని పంచుకున్నారు సమంత. చదవండి: కుటుంబ సభ్యులతో సాయిధరమ్ తేజ్ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
చైతూతో ఉన్న ఇంట్లోనే సమంత.. కొత్త ఫ్లాట్‌లోకి చై!
Did Samantha Decided To Stay In Her Old Home: సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ వారికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సమంత విడాకుల తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తుంది. తాజాగా సమంత తన రెండు కుక్క పిల్లలకు సంబంధించి 'మార్నింగ్ మ్యాడ్నెస్' అంటూ ఇన్‌స్టాలో పోస్టు షేర్ చేసింది.చదవండి: Samantha: 'నేను మనిషిని..నిర్ణయించుకున్నా..ప్రేమిస్తున్నాను'.. రీసెంట్గా కూడా సమంత 'న్యూ బ్రింగింగ్ బ్యాక్' అంటూ తన ఇంటికి సంబంధించి కొన్ని మూమెంట్స్‌ను పంచుకుంది. ఈ ఫోటోను బట్టి చూస్తే.. సమంత ఇంతకుముందు నాగ చైతన్యతో కలిసి ఉన్న ఇంట్లోనే ఉంటుందని తెలుస్తుంది. ఇప్పుడు కూడా అక్కడే ఉండాలని సామ్ నిర్ణయించుకుందట. మరోవైపు నాగ చైతన్య.. గతేడాదే జూబ్లిహిల్స్‌లోని ఓ విలాసవంతమైన ఇళ్లు కొనుగోలు చేశాడు. ప్రస్తుతం దాని రెనోవేషన్ పనులు జరుగుతున్నాయట. అప్పటివరకు చై అక్కడే ఓ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. చదవండి: షారుక్ ఖాన్ బర్త్‌డే.. వెలిగిపోతున్న 'మన్నత్' అప్పుడే మనిషి నిజస్వరూపం బయటపడుతుంది: సమంత -
చైతూతో కలిసి ఉన్న ఇంట్లోనే ఉండాలని సమంత నిర్ణయం!
-
నేను బలవంతురాలిని.. ఎప్పటికీ వదిలిపెట్టను: సమంత
Samantha Says Iam Strong In Note Post After Split With Naga Chaitanya: సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో ఆమె షేర్ చేస్తున్న పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్యతో విడాకులకు కొన్ని రోజుల ముందు నుంచి మై మమ్మా సెయిడ్(మా అమ్మ చెప్పింది)అంటూ వరుస పోస్టులు షేర్ చేసిన సమంత తాజాగా మరో ఫోటోను షేర్ చేసింది.చదవండి: అప్పుడే మనిషి నిజస్వరూపం బయటపడుతుంది: సమంత 'ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితంలో మళ్లీ నిలబడేంత సత్తా ఉంది. నేను బలవంతురాలిని. ఇతరులకు నేను పర్ఫెక్ట్ కాకపోవచ్చు. కానీ నాకు నేను పర్ఫెక్ట్. నేను ప్రేమిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితుల్లోంచి నేను విజయం సాధిస్తాను. నేను మనిషిని. నేను యోధురాలిని మా అమ్మ చెప్పింది' అంటూ సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ రాసుకొచ్చింది. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చైతూ విడాకుల అనంతరం సమంత బాగా కుంగిపోయిందని, ఆమె ఇన్‌స్టా పోస్టుల్లో ఏదో తెలియని బాధ కనిపిస్తుందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి:నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేసిన సమంత కొన్నిసార్లు కలపడం కంటే వదిలేయడమే బెటర్: సామ్ ఆసక్తికర వీడియో -
కొన్నిసార్లు కలపడం కంటే వదిలేయడమే బెటర్: సామ్ ఆసక్తికర వీడియో
నాగ చైతన్యతో విడిపోయినప్పటీ నుంచి సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్నారు. విడాకుల ప్రకటన అనంతరం తను ఏం చెప్పాలనుకున్నా ఇన్స్టాగ్రామ్ ద్వారానే మాట్లాడుతున్నారు. ఇక తన బాధను, భావోద్యేగాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ప్రతి పోస్ట్ చర్చనీయాంశం అవుతుంది. అయితే ఇటీవల సామ్ తన స్నేహితురాలు, మోడల్ శిల్పారెడ్డితో కలిసి ఛార్‌ధామ్ యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. చదవండి: సమంత పోస్ట్‌పై వెంకటేశ్ కూతురు అశ్రిత ఆసక్తికర కామెంట్ యాత్ర నుంచి తిరిగొచ్చిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్, మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్‌లతో కలిసి దుబాయ్ పర్యాటనకు వెళ్లారు. ప్రస్తుతం సామ్ దుబాయ్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలో సమంత ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. ఈ సందర్భంగా సామ్ తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. అలాగే ఎప్పుడైన మూడ్ బాగా లేకపోయినా లేదా డిప్రెషన్‌గా అనిపించినా దాని నుంచి బయట పడేందుకు కబోర్డులోని బట్టలన్నీ తీసి సర్దుకుంటానని చెప్పారు. ఈ సందర్భంగా సామ్ మాట్లాడుతూ.. ‘చిందరవందరగా ఉన్న నా డ్రెస్సింగ్ రూంను ఎంత నీట్‌గా చేశారో చూడండి’ అంటూ ఓ కంపెనీకి ప్రమోషన్ ఇచ్చారు. చదవండి: నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేసిన సమంత అలాగే తన డ్రెస్సింగ్ రూం టూర్ నిర్వహించారు. ఈ వీడియోలో సమంతతో పాటు తన స్టైలిస్ట్ ప్రీతమ్ జూకల్కర్, మరో మహిళ కనిపించారు. బెడ్‌పై కుప్పలు కుప్పలుగా పడి ఉన్న బట్టలన్నీ చూపించి ఇవి ఇప్పుడు సర్దుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియోకు సామ్ ‘కొన్నిసార్లు సర్దడం. కలపడం కంటే వదిలేయడమే మంచిది’ అంటూ ఆసక్తికర క్యాప్షన్‌ను జత చేశారు ఆమె. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక సమంత క్యాప్షన్ చూసి పలువురు ఆలోచనలో పడుతుంటే.. ఈ వీడియోలో ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్‌ను చూసి అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
అప్పుడే మనిషి నిజస్వరూపం బయటపడుతుంది: సమంత
Samantha Instagram Post About Human Nature Goes Viral: నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌పై మరింత ఫోకస్ పెరిగింది. సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామ్..విడాకుల తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె షేర్ చేస్తున్న పోస్టుల్లో మాత్రం ఏదో తెలియని బాధ, ప్రశ్నించే తత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవలె అమ్మాయికి పెళ్లి కంటే చదువు ముఖ్యమని తల్లితండ్రులకు సూచిస్తూ పోస్ట్ చేసిన సమంత తాజాగా మరో ఎమోషనల్ పోస్టును షేర్ చేసింది. మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలే మనమేంటో తెలియజేస్తాయి. తట్టుకోలేని ఒత్తిడికి గురైన సమయంలోనే మనిషి అసలు స్వభావం బయటపడుతుంది అంటూ ప్రముఖ రైటర్ రాబర్ట్ కొటేషన్‌ను ఇన్‌స్టా స్టోరీలో అభిమానులతో పంచుకుంది. తాజాగా సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా ఇటీవలె సామ్ చార్ధామ్ యాత్ర అనంతరం దుబాయ్ ట్రిప్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. విడాకుల నిర్ణయంతో కుంగిపోయిన సామ్..మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్ ట్రిప్స్‌కు వెళ్తుందని సమాచారం. -
సమంత పోస్ట్‌పై వెంకటేశ్ కూతురు అశ్రిత ఆసక్తికర కామెంట్
నాగ చైతన్యతో విడిపోయినప్పటీ నుంచి సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్నారు. విడాకుల ప్రకటన అనంతరం తను ఏం చెప్పాలనుకున్నా ఇన్స్టాగ్రామ్ ద్వారానే మాట్లాడుతున్నారు. ఇక తన బాధను, భావోద్యేగాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. అమ్మ చెప్పింది అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా తన ప్రస్తుత కండిషన్‌ను చెప్పే ప్రయత్నం చేస్తున్నారామే. దీంతో సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ప్రతి పోస్ట్ చర్చనీయాంశం అవుతుంది. అంతేగాక తన నెక్ట్ పోస్ట్ ఏంటీ, ఈ సారి ఆమె ఎలా స్పందించబోతున్నారా? అని ఫ్యాన్స్, ఫాలోవర్స్‌లో కూడా ఆసక్తి నెలకొంది. చదవండి: మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని కంగారు పడకండి: సామ్ ఆసక్తికర పోస్ట్ ఇదిలా ఉంటే ఇటీవల ఆమె తన స్నేహితురాలు, మోడల్ శిల్పారెడ్డితో ఛార్‌ధామ్ యాత్ర అనంతరం సమంత.. కూతుళ్ల పెళ్లి విషయంలో తల్లిదండ్రులు ఎలా ఆలోచించాలనే విషయాన్ని చెబుతూ ఓ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆమె పెయింటింగ్ వేస్తున్న ఫొటోను కూడా పంచుకున్నారు. ఇక తన పోస్ట్‌పై హీరో వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రిత స్పందించడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే చై-సామ్ విడాకుల ప్రకటన అనంతరం దీనిపై నాగార్జున మినహా అక్కినేని కుటుంబ సభ్యులు కానీ ఇటూ దగ్గుబాటి కుటుంబంలో వెంకటేశ్ తప్పా ఎవరూ స్పందించలేదు. అంతేగాక సమంత పెట్టే సోషల్ మీడియా పోస్టులను కూడా చూసి చూడనంటూ వదిలేస్తున్నారు. చదవండి: తమన్నా వల్ల రూ. 5 కోట్లు నష్టపోయాం!: మాస్టర్ చెఫ్ నిర్వాహకులు కానీ అశ్రిత తొలిసారిగా సామ్ పోస్ట్‌పై స్పందించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సమంత షేర్ చేసిన తన పెయింటింగ్ ఫొటోపైనామె ఆసక్తికరంగా కామెంట్ చేశారు. దీంతో ఇది చర్చకు దారి తీసింది. అసలు అశ్రిత ఏమని స్పందించారంటే.. ‘ఇక నువ్వు స్వేచ్ఛగా పెయింటింగ్ వేసుకోవచ్చు’ అంటూ కామెంట్ చేశారు. అశ్రిత కామెంట్ చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆమె కామెంట్లో మరెదో ఆంతర్యం ఉందని, చై-సామ్ విడాకుల విషయంలో అశ్రిత హర్ట్ అయినట్టు కనిపిస్తోందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పోస్టుపై పలువురు సినీ సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు. దీనిపై మంచు లక్ష్మి స్పందిస్తూ.. ‘నిన్ను ఇలా సరదాగా చూడటం సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Infinity Platter (@infinityplatter) -
నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేసిన సమంత
Samantha Deletes Pictures With Naga Chaitanya: టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ సమంత-నాగ చైతన్య విడిపోయినప్పటి నుంచి వాళ్ల సోషల్ అకౌంట్లపై మరింత ఫోకస్ పెరిగింది. సాధారణంగానే సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన చాలా విషయాలను అభిమానులతో షేర్చేస్తుంటుంది. చైతూతో విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల మందు నుంచి మై మమ్మా సెయిడ్(మా అమ్మ చెప్పింది) అంటూ వరుస పోస్టులు చేసిన సమంత ఈ మధ్యకాలంలో మరింత యాక్టివ్‌గా కనిపిస్తుంది.చదవండి: మరోసారి వార్తల్లో నిలిచిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ విడాకుల ప్రకటనతో సామ్ మానసికంగా ఎంతో కుంగిపోయినట్లు ఆమె పోస్టులను బట్టి అర్థం అవుతుంది. తాజాగా చైతూతో గడిపిన పాత జ్ఞాపకాలను చెరిపివేసుకోవడానికి సమంత ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి డిలీ చేసేసింది. అలా ఇప్పటివరకు సుమారు 80కి పైగా ఫోటోలను తన అకౌంట్ నుంచి సామ్ తొలగించింది. కేవలం ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పెట్‌డాగ్‌తో ఉన్న కలసి ఉన్న చైతూ ఫోటోలను మాత్రం అలాగే ఉంచేసింది. చివరగా చైతూ బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి 'లాల్ సింగ్ చద్దా' పోస్టును షేర్ చేసిన సామ్ ఇప్పుడు ఆ పోస్టును డిలిట్ చేసింది. త్వరలోనే నాగ చైతన్యను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయనున్నట్లు తెలుస్తుంది. చదవండి: నా కొడుకులకు అలాంటివి చేయొద్దని చెప్తా : నాగార్జున మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని కంగారు పడకండి: సామ్ ఆసక్తికర పోస్ట్ సమంత కేసు: థంబ్‌నైల్స్ మా బాధ్యత కాదు.. సీఎల్ వెంకట్రావు -
మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని కంగారు పడకండి: సామ్ ఆసక్తికర పోస్ట్
నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత సోషల్ మీడియాలో వరుసగా పోస్ట్స్ షేర్ చేస్తోంది. దీంతో ఆమె పోస్టులు సోషల్ మీడియా చర్చనీయాంశం అవుతున్నాయి. మై మామ్ సెడ్ అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం తను ఎదుర్కొంటోన్న పరిస్థితులను గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారామె. ఈ క్రమంలో తన బెస్ట్ ఫ్రెండ్, మోడల్ శిల్పారెడ్డితో ఇటీవల ఛార్ ధామ్ యాత్రకు వెళ్లోచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ హిమాలయాల సమీపంలోని పవిత్ర దైవ క్షేత్రాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. చదవండి: కూకట్పల్లి కోర్టులో సమంతకు ఊరట ఇక యాత్ర ముగించుకని తిరిగి వచ్చిన సమంత తాజాగా పెయింటింగ్స్ వేస్తున్న ఫోటోలను, వీడియోలను షేర్ చేసుకున్నారు. వీటితో పాటు ఆమె మరో ఆసక్తికర పోస్ట్‌ను పంచుకున్నారు. ‘మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారాని కంగారు పడకుండా తనని సమర్థంగా తీర్చిదిద్దండి. తన పెళ్లి కోసం డబ్బు ఆదా చేసే బదులు తన చదువుకు ఖర్చు పెట్టండి. ఆమెను పెళ్లికి సిద్ధం చేసే ముందు తన కోసం తనని సిద్ధం చేయడం అంతకంటే ముఖ్యం. అలాగే తనని తాను ప్రేమించుకోవడం, ఆత్మవిశ్వాసంతో ఉండటం నేర్పించండి. అలాగే ఇతరులకు అవసరం ఉన్న సమయంలో తను మార్గదర్శకంగా ఉండేలా సిద్దం చేయండి’ అనే పోస్ట్‌ను షేర్ చేశారు. చదవండి: ప్రత్యేక హెలికాప్టర్లో సమంత తీర్థయాత్రలు..ఫోటోలు వైరల్ కాగా ఇటీవల యుట్యూబ్ చానళ్లపై తను వేసిన పరువు నష్టం దావా కేసుపై నిన్న ఆమెకు కోర్టులో ఊరట లభించింది. ఆమె వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయడానికి వీళ్లేదని, యూట్యూబ్ ఛానెల్స్ వెంటనే అలాంటి కంటెంట్‌ని తొలగించాలని ఆదేశించింది. ఆమె వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్స్‌ని కూడా తొలగించాలని కోర్టు పేర్కొంది. అలాగే సమంత కూడా తన వ్యక్తిగత విషయాలను సంబంధించిన పోస్టులను కూడా షేర్ చేయొద్దని స్పష్టం చేసింది. చదవండి: చార్ ధామ్ యాత్ర: ప్రత్యేక పూజలు నిర్వహించిన సామ్ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఈ విషయం అమ్మ చెప్పింది.. సమంత ఆసక్తికర పోస్టు వైరల్
Samantha: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత విడాకుల బాధలో నుంచి బయటపడేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తన స్నేహితురాలు, ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి తీర్థయాత్రలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తోంది. అయితే విడాకులు తీసుకోవడానికి ముందు నుంచీ సమంత 'మై మమ్మా సెడ్(మా అమ్మ చెప్పింది)' అనే హ్యాష్‌ట్యాగ్‌తో కొన్ని పోస్టులు చేయగా అవి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. చాలా రోజుల తర్వాత సామ్.. మరోసారి 'మై మమ్మా సెడ్ అంటూ మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. 'ఇప్పుడు మీరిలా ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండండి, అలాగే రేపు ఏం కావాలని కోరుకుంటున్నారో అందుకోసం నిరంతరం పోరాడుతూ ఉండండి' అని చెప్పుకొచ్చింది. కాగా అక్టోబర్ 2న తన భర్త, టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో విడిపోతున్నట్లు సమంత ఇన్‌స్టాలో అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చై-సామ్ విడాకులు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. చైతన్యతో నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిన తర్వాత సామ్ నైరాశ్యంలో కూరుకుపోయారని వార్తలు వెలువడ్డాయి. ఆ బాధలో నుంచి బయటపడేందుకే ఆమె తీర్థయాత్రలు చేస్తున్నట్లు సమాచారం. ఇక విడాకుల తర్వాత సామ్ రెండు కొత్త చిత్రాలకు ఓకే చెప్పింది. త్వరలోనే వీటికి సంబంధించిన షూటింగ్స్‌లోనూ పాల్గొననుంది. -
విడాకుల అనంతరం సమంత కొత్త సినిమా ప్రకటన
సమంత-నాగ చైతన్య విడిపోయినప్పటి నుంచి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారికి సంబంధించిన ప్రతి విషయం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఇక నాగ చైతన్యతో విడిపోయిన అనంతరం సమంత ఏం చేయనుంది, ఆ తర్వాత తన నిర్ణయం ఏంటని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సామ్ బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిందని, అక్కడ వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకం చేయబోతుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. చదవండి: పెళ్లి సందD ట్విటర్ రివ్యూ అంతేగాక దసరా పండగ రోజున సమంత ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పబోతుందంటూ కొద్ది రోజులుగా వార్తలు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. అదేంటా! అని అందరిలో సెస్పెన్స్ మొదలైంది. ఈ క్రమంలో తాజాగా ఆమె నెక్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. ఇటీవల శాకుంతం మూవీలో నటించిన సామ్ తన తదుపరి చిత్రం డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో చేయబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది. చదవండి: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్విటర్ రివ్యూ కొత్త డైరెక్టర్ శాంతరూబన్ జ్ఞానశేఖరన్ డైరెక్షన్లో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెం.30 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.ఇందులో సమంత విచారంగా కనిపిస్తుండగా, ఓ విభిన్నమైన ప్రేమకథ చిత్రంగా ఈ మూవీ రూపొందనుందని తెలుస్తోంది. ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభులు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ మూవీ తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. ఇక ఈ మూవీలోని హీరోతో పాటు మిగిలిన తారాగణాన్ని కూడా త్వరలోనే ప్రకటించి, వీలైనంత త్వరలోనే మూవీ సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు దర్శక-నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. చదవండి: సమంత..జీవితం చాలా విలువైంది: వనితా విజయ్‌కుమార్ Happy to have @Samanthaprabhu2 onboard for our next Bilingual film!! #Production#30 #Tamil #Telugu @DreamWarriorpic written & directed by @Shantharuban87 pic.twitter.com/x4OwEI9HPL — SR Prabhu (@prabhu_sr) October 15, 2021 -
కొత్త ఫ్లాట్ తీసుకున్న చై, అక్కడే ఒంటరిగా..
పదేళ్ల స్నేహానికి, మూడేళ్ల వివాహిక బంధానికి స్వస్థి చెప్పారు సమంత-నాగ చైతన్య. 2017 ప్రేమ వివాహం చేసుకున్న ఈ స్టార్ కపుల్ మూడేళ్ల పాటు అన్యోన్యంగా జీవించిన ఈ జంట తాము విడిపోతున్నామంటు విడాకుల ప్రకటన చేసి అందరికి షాక్ ఇచ్చారు. దీంతో చై-సామ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారు సైతం షాక్ అయ్యారు. అయితే వారి మధ్య ఎలాంటి కలతలు వచ్చాయో తెలియదు కానీ.. వీరు విడిపోయారన్న విషయాన్ని మాత్రం అక్కినేని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: ప్రస్తుతం సమంత విషాదంలో ఉంది: ప్రీతమ్ జుకల్కర్ అయితే కొంతకాలంగా ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తాయని అప్పటి నుంచి చై-సామ్ విడిగా ఉంటున్నట్లు సమాచారం. కొద్ది రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటున్న చై ఓ ఫ్లాట్ తీసుకుని లవ్‌స్టోరీ మూవీ షూటింగ్‌కు అక్కడి నుంచే పాల్గోన్నట్లు వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే విడాకుల ప్రకటనకు ముందు చై-సామ్ గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లో నివసించేవారని, అది సమంతది అని సమాచారం. ఈ నేపథ్యంలో వారిద్దరు కలిసి ఉండేందుకు చై గతేడాది జూబ్లిహిల్స్‌లోని ఓ విలాసవంతమైన ఇళ్లు కొనుగోలు చేశాడట. చదవండి: ప్రకాశ్ రాజ్ రాజీనామాపై స్పందించిన మంచు విష్ణు ప్రస్తుతం దాని రెనోవేషన్ పనులు జరగుతున్నాయట. ఇది పూర్తవడానికి ఇంకా ఎడాది సమయంలో పడుతుందట. దీంతో చై జూబ్లిహిల్స్‌లోని ఓ అపార్టుమెంటులో కొత్తగా ఫ్లాట్ కొన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే విడాకుల ప్రకటన అనంతరం చై-సామ్ విడిపోయి వేరువేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత గచ్చిబౌలిలో అదే ప్లాట్‌లో ఉంటుండగా.. చైతన్య ఈ అపార్టుమెంటుకు మాకాం మార్చి అక్కడే ఒంటరిగా ఉంటున్నాడట. కనీసం కుటుంబాన్ని కలవడానికి ఇష్టపడటం లేదట. అందుకే బయటకు కూడా రాకుండా అపార్టుమెంటులో ఒంటరిగా ఉంటున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఈ క్రమంలో ఆ ఫ్లాట్‌ను చై కోనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమన్నది స్పష్టత రావాల్సి ఉంది. -
నాగ చైతన్య రియాక్ట్ అవుతాడనుకున్నా : సమంత స్టైలిస్ట్
Samantha's stylist Preetham Jukalker Comments On Affair Rumours With Sam: టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మేము విడిపోతున్నామంటూ అక్టోబర్ 2 ఈ స్టార్ జంట అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వారిద్దరూ విడిపోవడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో సోషల్ మీడియాలో వీరి విడాకుల విషయం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో చై-సామ్ విడిపోవడానికి కారణాలు ఏముంటాయనే దానిపై విశ్లేషిస్తూ పలువురు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. చదవండి: ChaySam Divorce: చై-సామ్ విడిపోవడానికి గల కారణాన్ని ఆమె స్టైలిష్ట్ ఇలా బయట పెట్టాడా? ఈ క్రమంలో చై-సామ్ విడిపోవడానికి సమంత స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ వల్ల వీరిమధ్య మనస్పర్థలు వచ్చాయని, సమంత, ప్రీతమ్ చాలా సన్నిహితంగా ఉండటమే విడాకులకు దారి తీసిందంటూ కొందరూ కామెంట్ చేశారు. దీంతో ప్రీతమ్‌ను నెటిజన్లు దాడి చేయడం ప్రారంభించారు. అంతేగాక ఏకంగా కొందరూ సమంతకు ప్రీతమ్‌తో ఎఫైర్, అబార్షన్ చేసుకుందంటూ ఊహాగాన ఆరోపణలు కూడా చేశారు. దీంతో ఈ కామెంట్స్ కాస్తా వార్తల్లో నిలిచాయి. ఇప్పటికే తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ సమంత స్పందించిన వాటిని ఖండిచింది. తాజాగా దీనిపై ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ కూడా స్పందించాడు. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై, సమంతపై వస్తున్న రూమార్లపై పెదవి విప్పాడు. చదవండి: ChaySam: అఫైర్స్, అబార్షన్ వార్తలపై స్పందించిన సమంత ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘నేను సమంతను అక్క అని పిలుస్తాను. చాలా మందికి అది తెలుసు. అలాంటిది మా మధ్య ఎఫైర్ ఎందుకు ఉంటుంది. ఐ లవ్యూ అని సోషల్ మీడియాలో ఎందుకు కామెంట్ చేశావని చాలా మంది అడుగుతున్నారు. కుటుంబ సభ్యులకు, సోదరిగా భావించే వారికి ఐ లవ్యూ చెప్పడం తప్పెలా అవుతుంది. ఎంతో మంది నన్ను ఆసభ్య పదజాలంతో తిడుతూ మెసేజ్‌లు చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా కెరీర్‌ను నాశనం చేస్తామని హెచ్చరిస్తున్నారు. బతికుండగానే మా అమ్మ చనిపోయిందని కొన్ని వెబ్సైట్లు రాస్తున్నాయి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: సమంత లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్: భావోద్వేగంతో ఇలా.. అంతేగాక ‘నాగచైతన్య నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. సమంతకు, నాకు మధ్య ఉన్న అనుబంధం గురించి ఆయనకు స్పష్టంగా తెలుసు. నాకు, సమంతకు ఎఫైర్ ఉందని వస్తున్న కామెంట్ల గురించి నాగచైతన్య స్పందించకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. ఆయన ఒక్క స్టేట్మెంట్ ఇస్తే పరిస్థితిలో చాలా మార్పు వస్తుంది. ఫ్యాన్స్ పేరుతో కామెంట్లు చేస్తున్న వారిని అదుపులో పెట్టేందుకు నాగచైతన్య కచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుతం సమంత విషాదంలో ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆమెకు కచ్చితంగా మద్దతుగా ఉంటా. ఇలాంటి ట్రోలింగ్‌కు నేను భయపడను’ అంటూ ప్రీతమ్ చెప్పుకొచ్చాడు. -
'ఫ్యామిలీ మ్యాన్' వెబ్‌సిరీస్ తర్వాత సమంత ఆ నిర్ణయం తీసుకుంది
Samantha Was Planning For Pregnancy: సమంత-నాగ చైతన్య విడాకుల ప్రకటన అనంతరం రకరకాల వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. సమంత తన స్టైలిస్ట్‌తో సన్నిహితంగా ఉంటుందని, పిల్లలను వద్దునుకుంది అని, ఇప్పటికే రెండు సార్లు అబార్షన్ కూడా చేయించేసుకుంది అంటూ సమంతను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తాము భార్యాభర్తలుగా విడిపోతున్నాం అంటూ సామ్-చై ప్రకటించినప్పటి నుంచి సమంతనే టార్గెట్ చేస్తూ ఆమెను దూషిస్తున్నారు. చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్ వైరల్ ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అయితే ఆమెపై అసత్య ప్రచారాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. తాజాగా సమంత స్నేహితురాలు (పేరు చెప్పేందుకు ఇష్టపడలేదు)ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ అనంతరం సమంత ఫోన్ నాన్‌స్టాప్‌గా మోగుతూనే ఉంది. ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఆ సమయంలో ఆమె ముంబైకి వెళ్లి తనకు నచ్చిన ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. కానీ సమంత వద్దని చెప్పింది. చదవండి: సమంత ఇన్‌స్టా పోస్ట్.. పర్సనల్ లైఫ్ గురించేనా? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నానని, సో సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇద్దామనుకుంటున్నట్లు నాతో చెప్పింది. తనకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అంతేకాకుండా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో తనకు దేశ వ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. అయినప్పటికీ తను మాత్రం , పిల్లల్ని కనేందుకు ప్లాన్ చేసుకుంది. సినిమాల కంటే అదే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పింది. అలాంటి అమ్మాయిపై ఇప్పుడు వస్తున్న రూమర్స్ చూస్తుంటే గుండె తరుక్కపోతుంది. అసలు సమంత వీటన్నింటిని ఎలా భరిస్తుందో ఊహించడానికి కూడా కష్టంగా ఉంది అంటూ పేర్కొంది. చదవండి: ChaySam Divorce: సామ్ తల్లి కావాలనుకుంది కానీ..: నీలిమ గుణ ChaySam: అఫైర్స్, అబార్షన్ రూమార్స్‌పై స్పందించిన సమంత -
బాధపడితే నాకేం సంబంధం?.. ‘చీటర్స్’ ట్వీట్‌పై సిద్ధార్థ్ స్పందన
నాగ చైతన్య-సమంత విడాకులు ప్రకటించిన రోజు హీరో సిద్దార్థ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2న చై-సామ్ విడాకులు తీసుకోబోతున్నామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన వెంటనే...‘మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు నేను స్కూల్లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే…. మరి మీరేం నేర్చుకున్నారు’అని నెటిజన్లను ప్రశ్నిస్తూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు ఆయన సమంత గురించే అన్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. (చదవండి: సమంత తల్లి కావాలనుకుంది కానీ.. సంచలన నిజాలు వెల్లడించిన నీలిమ) One of the first lessons I learnt from a teacher in school... "Cheaters never prosper." What's yours? — Siddharth (@Actor_Siddharth) October 2, 2021 తాజాగా ఆ ట్వీట్‌పై సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చాడు. తాను ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని.. తనకు ‘మహాసముద్రం’ దర్శకుడు అజయ్ భూపతికి మాటల మధ్యలో వచ్చిన అంశంపై తన చిన్నప్పుడు నేర్చుకున్న లెసన్‌ని జోడిస్తూ ట్వీట్ చేశానని సిద్ధార్థ్ చెప్పాడు. తన జీవితంలో జరిగిందే తాను ఆరోజు ట్వీట్ చేశానని, ఎవరో తన గురించి అనుకుంటే తానేమీ చేయలేనన్నారు. మా ఇంటి దగ్గర కుక్కల సమస్య ఉంటే, నేను దాన్ని ట్వీట్ చేశాను. దానికి ఎవరో బాధపడితే నాకేం సంబంధం అని సిద్ధార్థ్ ప్రశ్నించారు. నా లైఫ్ గురించి నేను మాట్లాడుతానని, వేరే వాళ్లతో సంబంధమే లేదని సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు. -
సమంత తల్లి కావాలనుకుంది కానీ.. సంచలన నిజాలు వెల్లడించిన నీలిమ
నాగచైతన్య, సమంత తమ వైవాహిక జీవితానికి ఫుల్స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమంతపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. సామ్ పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని.. ఇప్పటికే రెండు సార్లు అబార్షన్ చేయించుకుందని..అందుకే చైతన్య విడాకులు ఇచ్చాడనే పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీటిపై సమంత సీరియస్ అయింది. ‘నన్ను కొందరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, నాకు అఫైర్స్ ఉన్నాయని, అబార్షన్స్ చేయించుకున్నానని, నేను అవకాశవాదినని అంటున్నారు. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతో కూడుకున్నది. కొంత స్వాంతన పొందడానికి నన్ను ఒంటరిగా వదిలేయండి’ అని సామ్ విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉంటే.. చై-సామ్ విడాకులపై ‘శాకుంతలం’ నిర్మాత నీలిమ గుణ షాకింగ్ విషయాలను వెల్లడిచింది. సమంత పిల్లల్ని కనేందుకు అంతా సిద్దం చేసుకుందని, కానీ ఆగస్ట్ నెలలోనే ఏదో జరిగి విడాకులు తీసుకున్నారని చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. చై-సామ్ విడాకులపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. (చదవండి: అఫైర్స్, అబార్షన్ వార్తలపై స్పందించిన సమంత) ‘శాకుంతలం సినిమా కోసం మా నాన్న(దర్శకుడు గుణశేఖర్) సమంతను సంప్రదించాడు. అయితే అప్పటికే ఆమె సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయింది. ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నామని, ఇప్పట్లో మూవీ చేయనని చెప్పింది. కానీ, శాకుంతలం కథ నచ్చడంతో కొన్ని కండిషన్స్ పెట్టి ఓకే చెప్పింది. త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చెప్పింది. ఈ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకోవాలని సమంత నిర్ణయం తీసుకుంది. ఆమె తల్లి కావాలని కోరుకుంది. జూలై, ఆగస్ట్‌లోకెల్లా షూటింగ్ పూర్తిచేయాలని సామ్ కోరడంతో.. మేము ఓకే చెప్పి అలానే ప్లాన్ చేసుకున్నాం. ఆమె సినిమాలకు విరామం ఇచ్చి, పిల్లల్ని కనేందుకు ప్లాన్ చేసుకుంది. తన ప్రాధాన్యత అదేనని చెప్పింది. కానీ ఇప్పుడు చై-సామ్‌లు విడిపోవడం షాకింగ్‌గా ఉంది’ అని నీలిమా చెప్పుకొచ్చింది. -
ChaySam: అఫైర్స్, అబార్షన్ వార్తలపై స్పందించిన సమంత
Samantha Ruth Prabhu: టాలీవుడ్ మోస్ట్ రోమాంటిక్ కపుల్‌గా పేరు గాంచిన నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి విడాకుల వ్యవహారంపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ముఖ్యంగా సామ్ పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని.. ఇప్పటికే రెండు సార్లు అబార్షన్ చేయించుకుందని.. పిల్లల్ని కంటే కెరీర్‌కు అడ్డుగా మారుతుందని భావించిందని.. ఈ విషయం చైతన్యకు నచ్చకనే ఇద్దరు విడిపోయారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. పిల్లల విషయంలో నాగ్ కుటుంబం సమంతకు ఎంతో నచ్చచెప్పిందని.. కానీ ఆమె వినలేదనే వార్తలు కూడా వెలువడ్డాయి. (చదవండి: చై-సామ్ కాపురంలో చిచ్చు: 'అక్కా అని పిలిచే వ్యక్తితో'..) ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఈ పుకార్లపై సమంత తొలిసారి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. తాను అబార్షన్ చేయించుకున్నానే వార్తల్ని ఖండించారు. ఈ క్రమంలో సామ్ ఇన్‌స్టాలో ఓ స్టోరీ షేర్ చేశారు. ‘‘ఇలాంటి కఠిన సమయంలో మీరు చూపిన ఆదరణకు ధన్యవాదాలు. నాకు మద్దతుగా నిలిచి.. నాపై వచ్చిన అబద్దపు వార్తలని ఖండించారు. ‘వాళ్లు’ నాకు వేరే వాళ్లతో అఫైర్స్ ఉన్నాయని.. నేను పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని.. అబార్షన్ చేయించుకున్నానని.. నేను అవకాశవాదినని ఇలా రకరకాల వార్తలు ప్రచారం చేశారు’’. (చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్ వైరల్) ‘‘కానీ విడాకులు తీసుకోవడం అనేది అత్యంత బాధాకరమైన అంశం. దీన్నుంచి బయటపడటానికి సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో నాపై వ్యక్తిగతంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం తగదు. అయితే ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను.. ఈ తప్పుడు ప్రచారం నన్ను ఏమాత్రం కుంగదీయలేదు’’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు సమంత. ఈ పోస్ట్ చూసిన సమంత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇలాంటి తప్పుడు వార్తలపై తప్పక స్పందించాలి సామ్.. ఇక ఇన్నాళ్లు నీ మీద రాళ్లు వేసినవారు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: సమంత లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్: భావోద్వేగంతో ఇలా.. సమంత ఇన్‌స్టా పోస్ట్.. పర్సనల్ లైఫ్ గురించేనా? -
ఎన్టీఆర్ షోకి గెస్ట్‌గా సమంత.. విడాకుల తర్వాత తొలిసారి అలా..
ChaySam Divorce: నాగ చైతన్య -సమంతల విడాకుల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీరి గురించే చర్చించుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న చై-సామ్‌లు విడిపోవడాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే నాగ చైతన్య, సమంతలు మాత్రం జరిగిన విషయాన్ని మర్చిపోయి తమ, తమ పనుల్లో నిమగ్నులైనట్లు తెలుస్తోంది. విడాకుల తర్వాత నాగచైతన్య ఇప్పటికే లవ్ స్టోరీ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. అలాగే త్వరలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా కూడా కనిపించబోతున్నాడు. అయితే సమంత మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి కార్యక్రమంలో నేరుగా కనిపించలేదు. తాజాగా ఆమె ఎన్టీఆర్ షోలో కనిపించబోతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. జెమిని టీవీలో ప్రసారమవుతున్న ఈ షో మొదటి ఎపిసోడ్‌కి రామ్ చరణ్ గెస్ట్‌గా వచ్చాడు. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్లు రాజమౌళి-కొరటాల శివ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక ఈ బిగ్ రియాల్టీ షోకి మహేశ్ బాబు కూడా గెస్ట్‌గా విచ్చేశాడు. దానికి సంబంధించి ప్రోమో కూడా విడుదల చేశారు. దసరాకు ఈ ఎపిసోడ్ ప్రసారం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజా ఈ షోకి స్టార్ హీరోయిన్ సమంత గెస్ట్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ ఈ నెల చివరలో కానీ..వచ్చే నెల ప్రారంభంలో కాని ప్రసారం కానుందని సమాచారం. -
సమంత లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్: భావోద్వేగంతో ఇలా..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల అనంతరం తొలిసారిగా ఓ పోస్ట్ షేర్ చేశారు. అక్టోబర్ 8న జరిగే లాక్మీ(Lakme) ఫ్యాషన్ షో ప్రమోషన్లో భాగంగా సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్ షేర్ చేసింది. అయితే ఇది ఫ్యాషన్ షోకు సంబంధించిన పోస్ట్ అయినప్పటీకి ఇందులో సమంత రాసుకొచ్చిన క్యాప్షన్‌లో మరేదో అర్థం ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా ఈ రోజు సమంత-చైతన్య పెళ్లి రోజని తెలిసిందే. అంత బాగుంటే ఈ రోజు వారి 4వ వివాహవ వార్షికోత్సవం జరపుకునే వారు. ఈ సందర్భంగా సమంత వైట్ కలర్ డ్రెస్, వైట్ అండ్ పింక్ కలర్ గులాబి పూలు ధరించి కిందికి చూస్తున్న తన ఫొటోను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు. చదవండి: సమంత: ‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి’.. పోస్ట్ వైరల్ ‘పాత ప్రేమ పాటలు - పర్వతాలు. శిఖరంపై శీతాకాలపు గాలి ధ్వని. కొన్ని పొగొట్టుకున్న పాత చిత్రాల పాటలు దొరికినప్పుడు. లోలోపలి బాధను ప్రతి ధ్వనించే ఆ ప్రేమ పాటలు. పాత బంగ్లాలు, మెట్ల మార్గాలు. సందులలో గాలి శబ్దం’ అంటూ సమంత భావోద్వేగానికి లోనయ్యారు. అయితే రేపు జరిగే ఫ్యాషన్ షో కోసం తను ఎదురు చూస్తున్నట్లు ఈ పోస్ట్ ద్వారా ఆమె పేర్కొన్నప్పటికీ ఇందులో మరెదో లోతైన అర్థం వచ్చేలా ఉన్న తన నోట్ చూసి నెటిజన్లు, అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చదవండి: విడాకుల ఎఫెక్ట్: షూటింగ్లో కన్నీళ్లు పెట్టుకున్న సమంత సామ్ విడాకుల విషయంలో చాలా నిరాశగా ఉన్నారని, ప్రస్తుతం తను గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా అక్టోబర్ 2న తన భర్త, టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో విడిపోతున్నట్లు సమంత ఇన్‌స్టాలో అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చై-సామ్ విడాకులు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో నిన్న తన మూవీ షూటింగ్లో పాల్గొన్న సమంత తన విడాకులు విషయంపై భావోద్యేగానికి లోనైనట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ChaySam Divorce: వెంకీ పోస్ట్ వైరల్..చై-సామ్ విడాకుల గురించేనా?
టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత-నాగ చైతన్యలు విడిపోవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా చై-సామ్‌ల విడాకులపైనే చర్చలు జరుగుతున్నాయి. వాళ్లు ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఎవరు? అంటూ మీడియా, సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. విడాకుల ఇష్యూపై చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. వారిలో కొంతమంది సమంతకు మద్దతు ఇస్తే.. మరికొంతమంది చైతూకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొంత మంది ఇది వారి వ్యక్తిగత విషయమని, దానిపై కామెంట్ చేయబోమని చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో, నాగ చైతన్య మేనమామ విక్టరీ వెంకటేశ్ తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘మనం ఏదైనా విషయంపై పెదవి విప్పే ముందు కాస్త బుర్ర కూడా పెట్టాలి అని ఒక పోస్ట్ చేశాడు. ఆపై మరొక పోస్ట్‌లో ‘మనసు అనేది ఆలోచన పుట్ట.. మన వెళ్లే మార్గాని జాగ్రత్తగా ఎంచుకోవాలి’ అంటూ వెంకీ తన ఇన్‌స్టా స్టోరీలో వరుస పోస్ట్‌లు పెట్టాడు. ఆ కొటేషన్స్ చూస్తుంటే చై-సామ్ విడాకుల ఇష్యూపై పరోక్షంగా కామెంట్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కొటేషన్స్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజా పరిస్థితులకు అనుగుణంగానే ఆయన ఈ పోస్ట్ పెట్టారని అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. చదవండి: ఏం జరిగిందో తెలియదు..చైతన్య చాలా కూల్: రాజీవ్ కనకాల ఇకపై సమంత ఉండేది అక్కడే.. త్వరలోనే ఆ ఫ్లాట్‌కు మకాం! -
ChaySam Divorce: బాధ కలిగించింది.. చైతు చాలా కూల్: రాజీవ్ కనకాల
Rajeev Kanakala About Chaysam Divorce: టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ చూసిన నాగ చైతన్య-సమంతల విడాకుల గురించే టాక్ నడుస్తోంది. నాలుగేళ్ల క్రితం(2017) పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న చై-సామ్.. టాలీవుడ్లో క్యూట్ కపుల్‌గా గుర్తింపు పొందారు. ఎలాంటి వివాదాలు లేకుండా నాలుగేళ్లుగా కలిసి ఉన్న ఈ ప్రేమ.. ఒక్కసారిగా విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించడంతో చై-సామ్‌ల అభిమానులు షాక్‌కు గురయ్యారు. వాళ్లు ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఎవరు? అంటూ మీడియా, సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఇక సినీ ప్రముఖులు కూడా చై-సామ్ విడాకులపై స్పందిస్తున్నారు. కొంతమంది సమంతకు మద్దతుగా మాట్లాడితే.. మరికొంతమంది చైతూకి అండగా నిలుస్తున్నారు. ఇక తాజాగా నాగ చైతన్య- సమంత విడాకులపై నటుడు రాజీవ్ కనకాల కూడా స్పందించారు. (చదవండి: అందుకే సమంత దూరం జరిగింది : మాధవీలత) నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా రూపొందిన 'లవ్ స్టోరీ' మూవీలో రాజీవ్ నెగెటివ్ పాత్రలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ సక్సెస్, ఆ సినిమా షూటింగ్ తాలూకు విశేషాలను ఓ యూట్యూబ్ చానల్‌కు పంచుకున్న రాజీవ్ కనకాల.. చై-సామ్ విడాకులపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. నాగ చైతన్య- సమంత విడాకుల ఇష్యూ అనేది పూర్తిగా వాళ్ల వ్యక్తిగతం అని, దాని గురించి ఏం మాట్లాడలేం అని చెప్పాడు. అయితే వారిద్దరు విడిపోవడం తనను బాధ కలిగించిందని చెప్పాడు. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడడం సరికాదన్నాడు. రియల్ లైఫ్‌లో మాత్రం నాగ చైతన్య చాలా కూల్ పర్సన్ అని, ఆయన ఎక్కడా విసుగు చెందే మనస్తత్వం కాదని తెలిపాడు. సెట్లో అందరితో సరదాగా ఉంటూ తన పని తాను చెసుకొని వెళ్లేవాడని చెప్పుకొచ్చాడు. -
ఇకపై సమంత ఉండేది అక్కడే.. త్వరలోనే ఆ ఫ్లాట్‌కు మకాం!
టాలీవుడ్ క్యూట్ కపుల్ అక్కినేని నాగ చైతన్య- స్టార్ హీరోయిన్ సమంతలు తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. మేము విడిపోతున్నామంటూ అక్టోబర్ 2న ఈ జంట అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి వీరి విడాకులు వ్యవహరం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక సోషల్ మీడియాలో వారు పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా సామ్ ముంబైలో ఇల్లు కొనిందని, త్వరలోనే అక్కడికి మకాం మార్చనున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను కొట్టిపారెస్తూ తాను హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు ఇటీవల సామ్ సోషల్ మీడియా లైవ్ సెషన్లో స్పష్టం చేసింది. చదవండి: సమంత కట్టుకున్న పెళ్లి చీర ఎవరిదో తెలుసా? దీంతో ఆమె అభిమానులు కాస్తా ఊపిరి పిల్చుకున్నారు. ఈ లోగా వారి విడాకులు ప్రకటన మరోసారి ఫ్యాన్స్‌ను బాధించింది. దీంతో సమంత ఇక ముంబైకి వెళ్లడం ఖాయమని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో సామ్ అభిమానులకు ఊరటనిచ్చే ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇకపై కూడా సామ్ హైదరాబాద్‌లోనే ఉండబోతుందట. గచ్చిబౌలిలోని ఓ ప్లాట్‌కు సమంత షిఫ్ట్ కానుందని, ఇకపై అక్కడే ఒంటరిగా నివసించనుందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అయితే గతంలో సామ్ హైదరాబాద్ తనకు ఎన్నో ఇచ్చిందని, ఇదే తన హోమ్ టౌన్.. ఇప్పటికీ, ఎప్పటికీ అని చెప్పింది. కాగా సమంత ఇటీవల ‘శాకుంతలం’ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకోగా.. ‘కాతువాకుల రెండు కాదల్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్లో భాగంగా ప్రస్తుతం సామ్ చెన్నైలో ఉంటున్న విషయం తెలిసిందే. చదవండి: విడాకులపై స్పందించిన సమంత తండ్రి చై-సామ్ విడిపోవడానికి గల కారణాన్ని ప్రీతమ్ ఇలా బయట పెట్టాడా? సమంత స్టైలిస్ట్ ప్రీతమ్‌కు తప్పని మానసిక వేధింపులు! -
చై-సామ్ విడిపోవడానికి గల కారణాన్ని ప్రీతమ్ ఇలా బయట పెట్టాడా?
Naga Chaitanya And Samntha Divorce Reasons: టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించడం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఇలాంటి వార్త ఒకటి వినాల్సి వస్తుందని అక్కినేని అభిమానులు అస్సలు ఊహించి ఉండరు. కొన్ని రోజులుగా వీరి విడాకుల గురించి వార్తలు వస్తున్నా అవి రూమర్స్‌గానే మిగిలిపోతాయని అభిమానులు భావించారు. కానీ చివరకు ఆ వార్తలనే నిజం చేస్తూ తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పారు నాగ చైతన్య-సమంత. చదవండి: నెటిజన్ల ట్రోల్స్: చై-సామ్ విడాకులకు కారణం ఇతడేనా!? ఈ క్రమంలో వారి విడిపోవడానికి కారణాలేంటని అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు. ఇందులో సమంత కొంతకాలం షేర్ చేస్తున్న గ్లామర్ ఫొటోలు, ప్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్, సూపర్ డీలక్స్‌ల సినిమాల్లో ఆమె నటించిన బోల్డ్ సీన్స్ ప్రధాన కారణం అంటున్నారు. జీవితాన్నే ప్రభావం చేసే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనకా ఇంకా ఏదైనా బలమైన కారణాలు బయటకు వస్తాయోమో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ చేసిన పోస్టులు చర్చనీయాంశం మారాయి. వీరి విడాకులు ప్రకటన అనంతరం అతడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు చర్చకు దారి తీశాయి. అంతేగాక వెంటనే వాటిని డిలీట్ చేయడంతో ఇవి కాస్తా వార్తల్లో నిలిచాయి. పేర్లు ప్రస్తావించకపోయినా.. సమంతకు ఏదో అన్యాయం జరిగిందన్నట్లుగా అతడి డిలీటెడ్ పోస్టులు సూచించాయి. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రీతమ్ జుకల్కర్ తొలగించిన ఓ పోస్టు చై-సామ్ విడాకులకు అసలు కారణాన్ని వెల్లడించాడా? అని అందరూ ఇప్పుడు చర్చించుకుంఉటన్నారు. సమంత మానసిక ఒత్తిడి, వేధింపుల కారణంగానే విడాకులకు దారి తీసిందా అనే అనుమానాలు తలెత్తెలా అతవి డిలీటెడ్ పోస్ట్ ఉంది. చదవండి: సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనైన సమంత, పోస్ట్ వైరల్ అలాగే ‘సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్లకు ప్రస్తుతం ట్రోలింగ్ రూపంలో ఎక్కువ మానసిక వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది’ అంటూ పోస్ట్ చేసిన జుకల్కర్.. కొన్ని నిమిషాల్లోనే దానిని డిలీట్ చేసేశారు. మరి ఇవి ఎవరిని ఉద్దేశించి జుకల్కర్ చేశాడో తెలియదు గానీ.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు చై-సామ్ విడిపోవడానికి ఇతడే కారణమంటూ పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అతడిని వేధిస్తుంటే.. సైబర్ క్రైం పోలీసులను ట్యాగ్ చేస్తూ జుకల్కర్ వారి అకౌంట్లకు సంబంధించిన ఫోటోలను తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. #Samantha Stylist #Jukalker Deleted Post... pic.twitter.com/z0hEwWPGDY — telugufunworld (@telugufunworld) October 5, 2021 -
సమంత స్టైలిస్ట్ ప్రీతమ్‌కు తప్పని మానసిక వేధింపులు!
ChaySam Divorce: ఇప్పుడు ఎక్కడ చూసినా టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ సమంత- నాగచైతన్య విడాకుల వ్యవహారమే నడుస్తోంది. చూడచక్కనైన ఈ జంట విడిపోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. అసలు వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి బలమైన కారణాలు ఏమై ఉంటాయా? అని పలువురు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కూడా ఓ కారణమే అంటూ పలువురూ అతడిని నిందిస్తున్నారు. సోషల్ మీడియాలో సమంతతో ఉన్న పాత ఫొటోలను షేర్ చేస్తూ అంతా నువ్వే చేశావంటూ ప్రీతమ్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో తన మీద దాడి చేస్తున్న కొందరికి ఘాటుగా బదులిచ్చినప్పటికీ ప్రీతమ్ మీద ట్రోలింగ్ ఆగడం లేదు. దీంతో వారి బాధ తట్టుకోలేకపోయిన ప్రీతమ్ తనను వేధిస్తున్న పలు అకౌంట్ల వివరాలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నాడు. వీరి వల్ల మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నానని వాపోయాడు. తనను వేధిస్తున్న ఈ అకౌంట్లను రిపోర్టు చేయండని అభిమానులను కోరాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని కోరుతూ సైబరాబాద్ పోలీసులను ట్యాగ్ చేశాడు. -
విడాకులపై స్పందించిన సమంత తండ్రి
Samantha Father Comments On ChaySam Divorce: తన కూతురి విడాకులపై సమంత తండ్రి జోసెఫ్ ప్రభు స్పందించారు. సమంత-నాగ చైతన్య విడాకుల విషయం తెలియగానే తన మైండ్ బ్లాక్ అయ్యందంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. చై-సామ్ విడాకుల విషయం వినగానే మొదట తనకు ఏం అర్థం కాలేదని, కళ్ల ముందు అంతా చీకటి కమ్ముకుందని ఆయన పేర్కొన్నారు. విడాకుల విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమని సమంతకు చెప్పినట్లు తెలిపారు. అయితే తన కూతురు స్పృహ ఉండే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని, త్వరలోనే అన్ని పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నానని సామ్ తండ్రి పేర్కొన్నారు. కాగా చై-సామ్ విడాకులు ప్రకటించిన అనంతరం అక్కినేని హీరో, చైతన్య తండ్రి నాగార్జున కూడా స్పందించిన సంగతి తెలిసిందే. చదవండి: నాగ చైతన్య-సమంతలకు అభిమానుల విజ్ఞప్తి చైతూ-సమంత విడిపోవడం దురదృష్టకరమంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. చైతూ-సమంత విడిపోవటం దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతం. సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు. సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది. ఆమె కుటుంబ సభ్యులు ఎల్లప్పుడు మాకు ఆత్మీయులే. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’అని రాసుకొచ్చాడు. అంతేగాక సమంత ఫ్యామిలీ ఎల్లప్పుడూ తమకు ఆత్మీయులేనని, చైతు-సమంత ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని నాగార్జున పేర్కొన్నారు. కాగా తామిద్దరం విడిపోతున్నామని, ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామంటూ నాగ చైతన్య-సమంత శనివారం(అక్టోబర్ 2) సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. చదవండి: సమంత కట్టుకున్న పెళ్లి చీర ఎవరిదో తెలుసా? -
అందుకే సమంత దూరం జరిగింది : మాధవీలత
Madhavi Latha About Samantha Divorce: టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్‌గా గుర్తింపు పొందిన నాగ చైతన్య, సమంతలు విడిపోవడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏడేళ్లుగా ప్రేమించుకొని, నాలుగేళ్ల క్రితం(2017) పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న చై-సామ్ విడాకులు తీసుకోవడంతో.. అక్కినేని అభిమానులతో పాటు సమంత ఫ్యాన్స్ కూడా షాక్‌కు గురయ్యారు. వాళ్లు ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఎవరు? అంటూ మీడియా, సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఇక సినీ ప్రముఖులు కూడా చై-సామ్ విడాకులపై స్పందిస్తున్నారు. అలాంటి వారిలో సినీనటి మాధవీలత కూడా ఒకరు. తన పుట్టిన రోజు సందర్భంగా తాజాగా ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చిన మాధవీలత.. . చై-సామ్ విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సమంత చాలా మంచి అమ్మాయి అని, కానీ వందలో 99 శాతం మంది సమంత కారణంగానే విడాకులు తీసుకున్నారని.. ఆమెను తప్పుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లైన తర్వాత కూడా గ్లామర్ దుస్తులు ధరిస్తుంది.. అందుకే చైతన్య విడాకులు ఇచ్చాడని కొంతమంది కామెంట్ చేయడం కరెక్ట్ కాదన్నది మాధవిలత. తెరపై ధరించే దుస్తులకి, భార్య భర్తల సంసారానికి సంబంధం ఉండదని ఆమె అన్నారు. సమంత ప్రత్యూష ఫౌండేషన్ సహా ఎన్నో ఎన్జీవోలతో కలిసి చిన్న పిల్లలకు ఎన్నో ఆపరేషన్లు చేసి ప్రాణాలు కాపాడిందని చెప్పుకొచ్చారు. సమంత డబ్బు మనిషి కాదని సినిమాలు చేశాక వాటి ద్వారా వచ్చిన డబ్బు కూడా ఏం చేయాలో ఆమెకు తెలియదని మాధవీ లతా అన్నారు. గతంలో ఒక హీరో సమంతను ట్రాప్ చేసి ఆమె దగ్గర ఉన్న డబ్బు కోసం ఆమెను వాడుకున్నాడని, ఆ విషయం తెలిసి సమంత దూరం జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక పెళ్లయిన తర్వాత సమంతలో చాలా పరివర్తన వచ్చిందన్నారు. ధరించే దుస్తులను బట్టి అమ్మాయిల క్యారెక్టర్‌ను డిసైడ్ చెయ్యొద్దని మాధవీలత విజ్ఞప్తి చేశారు.