కొన్నిసార్లు కలపడం కంటే వదిలేయడమే బెటర్‌: సామ్‌ ఆసక్తికర వీడియో | Samantha Share Interesting Video About Her Dressing Room Tour | Sakshi
Sakshi News home page

Samantha: డిప్రెషన్‌, మూడాఫ్‌గా అనిపిస్తే ఇలా చేస్తాను: సమంత

Published Mon, Nov 1 2021 8:33 PM | Last Updated on Mon, Nov 1 2021 10:21 PM

Samantha Share Interesting Video About Her Dressing Room Tour - Sakshi

నాగ చైతన్యతో విడిపోయినప్పటీ నుంచి సమంత సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్నారు. విడాకుల ప్రకటన అనంతరం తను ఏం చెప్పాలనుకున్నా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారానే మాట్లాడుతున్నారు. ఇక తన బాధను, భావోద్యేగాలను సోషల్‌ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. దీంతో​ సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ప్రతి పోస్ట్‌ చర్చనీయాంశం అవుతుంది. అయితే ఇటీవల సామ్‌ తన స్నేహితురాలు, మోడల్‌ శిల్పారెడ్డితో కలిసి ఛార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే.

చదవండి: సమంత పోస్ట్‌పై వెంకటేశ్‌ కూతురు అశ్రిత ఆసక్తికర కామెంట్‌

యాత్ర నుంచి తిరిగొచ్చిన సమంత స్టైలిస్ట్‌  ప్రీతమ్‌ జుకల్కర్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌ సాధనా సింగ్‌లతో కలిసి దుబాయ్‌ పర్యాటనకు వెళ్లారు. ప్రస్తుతం సామ్‌ దుబాయ్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలో సమంత ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. ఈ సందర్భంగా సామ్‌ తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. అలాగే ఎప్పుడైన మూడ్‌ బాగా లేకపోయినా లేదా డిప్రెషన్‌గా అనిపించినా దాని నుంచి బయట పడేందుకు కబోర్డులోని బట్టలన్నీ తీసి సర్దుకుంటానని చెప్పారు. ఈ సందర్భంగా సామ్‌ మాట్లాడుతూ.. ‘చిందరవందరగా ఉన్న నా డ్రెస్సింగ్‌ రూంను ఎంత నీట్‌గా చేశారో చూడండి’ అంటూ ఓ కంపెనీకి ప్రమోషన్‌ ఇచ్చారు.

చదవండి: నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్‌ చేసిన సమంత

అలాగే తన డ్రెస్సింగ్‌ రూం టూర్‌ నిర్వహించారు. ఈ వీడియోలో సమంతతో పాటు తన స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జూకల్కర్‌, మరో మహిళ కనిపించారు. బెడ్‌పై కుప్పలు కుప్పలుగా పడి ఉన్న బట్టలన్నీ చూపించి ఇవి ఇప్పుడు సర్దుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియోకు సామ్‌ ‘కొన్నిసార్లు సర్దడం. కలపడం కంటే వదిలేయడమే మంచిది’ అంటూ ఆసక్తికర క్యాప్షన్‌ను జత చేశారు ఆమె. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇక సమంత క్యాప్షన్‌ చూసి పలువురు ఆలోచనలో పడుతుంటే.. ఈ వీడియోలో ఆమె స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ను చూసి అక్కినేని ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement