సెలబ్రిటీ స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ పేరు ఆ మధ్య మార్మోగిపోయింది. సెలబ్రిటీలకు డిజైనర్ డ్రెస్సులు రెడీ చేసినందుకు మాత్రమే కాదు సమంతతో క్లోజ్‌గా ఓ ఫోటో దిగినందుకు కూడా! ఇతడి వల్లే సమంత- నాగచైతన్యల పచ్చటి సంసారం చెల్లాచెదురైందని, అసలు సామ్‌తో ఇతగాడికున్న సంబంధం ఏంటంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. అతడు సామ్‌కు మంచి స్నేహితుడు మాత్రమేనని అభిమానులు మొత్తుకున్నా నెటిజన్లు మాత్రం ప్రీతమ్‌ను వదిలిపెట్టలేదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా అతడిని ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు.
సమంత ప్రోత్సాహం వల్లే..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చే విమర్శలపై స్పందించాడు ప్రీతమ్. ఆయన మాట్లాడుతూ.. 'సమంత నన్ను నమ్మింది. నా ప్రతిభను ప్రోత్సహించింది. తన ప్రోత్సాహం వల్లే ముందడుగు వేశాను. తనకు స్టైలింగ్ చేశాను. అయితే చాలామంది నన్ను, సామ్‌ను విమర్శించారు. ఇతడు అవసరమా? పాత స్టైలిష్ట్ దగ్గరికే వెళ్లొచ్చుగా.. ఈ బొంబాయి వాళ్లను ఎందుకు నమ్ముతున్నావు? అతడొక గే అన్నారు.
నేనేమీ చెడ్డవాడిని కాదు
ఆ మాటలు విని చాలా బాధేసింది. ఎటువంటి పరిచయాలు లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. నేనేమీ చెడ్డవాడిని కాదు. సృజనాత్మకత ఉన్న వ్యక్తిని, ఒక కళాకారుడిని.. హీరోయిన్స్‌కే ఎందుకు డిజైనర్స్‌గా ఉంటామంటే హీరోలు ప్రయోగాలు ఒప్పుకోరు. విభిన్నంగా కాస్ట్యూమ్‌లు వేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేయరు. ఇకపోతే సమంత ఓసారి నాపై కాళ్లు పెట్టుకుని ఉన్న ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి డిలీట్ చేసింది. అదో పెద్ద సంచలనమైంది.
ఒకటి కొడితే పది దెబ్బలు కొడ్తా
ఆ ఫోటో చూసి ఏవేవో ఊహించుకున్నారు. మాది అన్నాచెల్లెళ్ల బంధం అనుకోవచ్చుగా.. మేము మంచి స్నేహితులం మాత్రమే.. మా మధ్య అంతకుమించి మరేం లేదు. చైసామ్ విడిపోయినప్పుడు నామీద చాలా ద్వేషం చూపించారు. నన్ను నానా మాటలు అన్నారు, భరించాను, కానీ నా కుటుంబాన్ని కూడా లాగారు. అది నేను సహించలేకపోయాను. నేనేమీ గాంధీజీలా ఒక దెబ్బ కొడితే మరో చెంప చూపించే రకం కాదు. ఒకటి కొడితే పది దెబ్బలు కొట్టాలన్నంత కోపంగా ఉన్నాను.
చై మంచివాడు
నాగచైతన్య విషయానికి వస్తే అతడు చాలా మంచివాడు. నేను కలిసిన మంచి వ్యక్తుల్లో అతడు ఒకరు. ఇకపోతే నా కెరీర్‌లో నేను ఎన్నో ఇబ్బందులు, విమర్శలు ఎదుర్కొన్నాను. నా స్థానంలో వేరొకరు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు. దయచేసి నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరినీ టార్గెట్ చేయొద్దని కోరుతున్నాను' అన్నాడు ప్రీతమ్ జుకల్కర్.
చదవండి: హనుమంతుడి నోట మాస్ డైలాగ్స్.. విన్నదే రాశానన్న రైటర్
Comments
Please login to add a commentAdd a comment