![Actress Samantha Latest News](/styles/webp/s3/article_images/2024/08/20/samantha-news.jpg.webp?itok=YpzZGMrx)
హీరోయిన్ సమంత గత కొన్నాళ్లుగా మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య నిశ్చితార్థం జరిగినప్పుడు సమంత పేరు కూడా ట్రెండింగ్‌లో నిలిచింది. ఇది జరిగిన కొన్నిరోజులకే సమంత కూడా రెండో పెళ్లి చేసుకోబోతుందని రూమర్స్ వచ్చాయి. 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడమోరు పేరు తెరపైకి వచ్చింది. ఇవన్నీ పక్కనబెడితే సమంత.. సర్‌ప్రైజ్ ఇస్తానని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి రీమేక్ సినిమా.. ఎనిమిదేళ్ల తర్వాత తెలుగులో)
సమంత ఇన్ స్టా స్టోరీలో.. 'సమ్‌థింగ్ స్పెషల్ స్పెషల్ టుడే స్టే ట్యూన్‌డ్' అని క్యాప్షన్ పోస్ట్ చేసింది. అయితే ఇది రెండో పెళ్లి కోసమా? లేదంటే తెలుగులో కొత్త సినిమా ఏదైనా ఒప్పుకొని దాని కోసం ప్రకటన అనేది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగులో చివరగా విజయ్ దేవరకొండ 'ఖుషి' సినిమాలో నటించింది. ప్రస్తుతం 'సిటాడెల్ హనీ బనీ' అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఇది నవంబరు 7న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇవి తప్పితే మరేం మూవీస్ లేదా సిరీసులు చేయడం లేదు.
(ఇదీ చదవండి: బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. కొత్త వీడియోతో నటి హేమ)
![](/sites/default/files/inline-images/samantha-.jpg)
Comments
Please login to add a commentAdd a comment